అన్నిటివెనుకా ఒకే లక్ష్యం, ఒకే అంతస్సూత్రం ఉన్నప్పుడు ఆ చర్యలూ, సంఘటనలూ, ప్రచారాలు వాటంతటవే జరుగుతాయా? అవన్నీ ఓ పద్ధతిప్రకారం నడిపించబడటం ఉన్నప్పుడు ఓ పద్దతి ప్రకారం నడిపించే వాళ్ళెవరో ఉండాలి కదా! అదీ – ఓ విదేశీ [సి.ఐ.ఏ.లాంటిది] వ్యవస్థే కానివ్వండి, ఓ వంశస్థుల వ్యవస్థే కానివ్వండి, ఉండి తీరాలి కదా!

ఇకపోతే …….

1672 AD లో రాజ్యాని కొచ్చిన తానీషా 1687 లో ఔరంగజేబు చేతిలో ఓడిపోయాడు. అప్పుటికి 31 ఏళ్ళుగా గోల్కొండ మీద, 18 సార్లు దాడులు చేసినా గెలవని ఔరంగజేబు స్థానికుల సాయంతో 1687 లో గెలిచాడు. ఎప్పుడైనా స్థానికులు సహకరిస్తేనే ఏ కుట్ర అయినా, ఏ దాడి అయినా జయిస్తుంది. ఇప్పుడూ అంతే కదా! తెలిసీ కావాలనో, తెలియక అమాయకంగా అది నిజమనుకొనో ఎందరో భారతీయులు సహకరించబట్టే నిరాటంకంగా మనదేశం, మన సంస్కృతి పతనమవుతున్నాయి.

1724 AD లో అసఫ్ షాహీ నిజాములు గోల్కొండ గద్దెనెక్కారు. 1687 AD నుండి 1724 AD వరకూ మధ్యలో గల 37 ఏళ్ళల్లో ‘ఏ వారసులు లేదా వంశాలు’ గోల్కొండ సింహాసనం కోసం ఎన్నిప్రయత్నాలు చేశాయో మనకి తెలియదు.

మరోప్రక్క 1498 AD లో ఇండియాలో అడుగుపెట్టిన యూరపు వ్వాపార గుంపులు, ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా, 1768 AD వరకూ తమలో తాము కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. అప్పుడు [1768 AD లో] ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారు జిల్లాలపై హక్కుని నిజాం నుండి పొందింది. 1800 AD లో రాయలసీమ జిల్లాలని దత్తతగా పొందింది. 1802 AD లో పర్మినెంట్ సెటిల్ మెంటు జరిగింది. ఇది పర్యవసానం. ఈ పర్యవసానానికి కారణం ఏమిటంటే – నిజాం రాజు ప్రజల నుండి పన్నుల సరిగా వసూలు చేసుకోలేక పోయాడు. తమ సైనికుల చేతిలోని బల్లెం, కత్తులూ, ఈటెలు లాంటి ఆయుధాల కన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతుల్లోని తుపాకులకు ప్రజలు భయపడి పన్నులు చెల్లిస్తారని నమ్మాడు. ఆ తుపాకుల్ని కొందామని గానీ, తమ సైనికులకి తుపాకీ వాడకంలో శిక్షణ నిచ్చి వాడుకొందామని అనుకోలేదో, అనుకున్నా ఈస్ట్ ఇండియా కంపెనీ అలాంటి కాంట్రాక్టుకు ఒప్పుకోలేదో గానీ పన్నులు వసూలు చేసి పెట్టే కాంట్రాక్టు కుదిరింది.

అయితే కొన్ని సంవత్సరాలు తిరిగే సరికి మరి ’కంపెనీ’ వసూలు చేసిపెట్టిన పన్నులు సొమ్ము ఏమయ్యిందో గాని నిజామే కంపెనీ వారికి బకాయి పడ్డాడు. ఇప్పుడు పేదవాళ్ళు గనుక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు అప్పు తీసుకొంటారు. వాయిదాలు కడుతూనే ఉంటారు, కడూతూనే ఉంటారు. ఎప్పటికీ అప్పు తీరదు చూడండీ. అలాంటి ఆర్ధిక తంత్రం ఇది. దెబ్బతో నిజాం రాజు భూమిని కంపెనీకి ధారాదత్తం చేశాడు.

అప్పటికి – 1498 AD నుండి 1768 AD వరకూ దాదాపు 270+ ఏళ్ళుగా వ్వాపారం కోసమే నానా అగచాట్లు పడుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1800 AD నుండి 1857 AD వరకూ అంటే 57 ఏళ్ళు లోపు యావద్భారత దేశాన్ని హస్తగతం చేసుకోగలిగింది. దీనికి కారణం నిశ్చయంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సామర్ధ్యం కాదు. ఈ విషయం ఇంతకు ముందు టపా డిసెంబరు 5 ‘మన పైన జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 1 [కణిక నీతి]’ & 6 వ తేదీ ‘మన మీదజరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 2 [ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు] ’ లలో విపులంగా చర్చించాను. ఎందుకంటే తుపాకీ మందు కనిపెట్టినా, బ్రిటిషు వ్యాపార గుంపులు ఇతర యూరపు దేశాల్ని, వ్యాపార పోటీని గ్రిప్ చేయలేకపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఇప్పుడూ, బ్రిటీషు దేశం ప్రపంచాన్ని గ్రిప్ చేయలేక పోతుంది. దాని పాత్ర పరిమితమై పోయింది.

ఎందుకంటే 1687 AD లో తానీషాకి ఏ మేధస్సు ’కల’ వ్యూహం చెప్పిందో, ఆ వ్యూహం లో గూఢచర్యం మిళితమై ఉంది. సాంకేతిక సామర్ధ్యం, నైపుణ్యం కూడా గూఢచర్య నైపుణ్యం తోడయితేనే రాణిస్తాయి. ఆ మేధస్సు బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి తోడ్పడింది. తరతరాలుగా అనువంశికమైన ఆ ఙ్ఞానం, నెట్ వర్క్, కంపెనీ తర్వాత జగజ్జేతగా బ్రిటీషు రాజకుటుంబాన్ని నిలిపింది. దాని ఉత్ధాన పతనాలు తర్వాత వరుసగా రష్యా, అమెరికాల ఉత్థాన పతనాలు జరిగాయి, జరుగుతున్నాయి. తొలిసారిగా బ్రిటీషు ప్రభుత్వం ప్రపంచాన్ని భూగోళంగా [Globalize] చేసింది. అంతర్జాలం కంటే ముందుగానే ఇది జరిగింది.

ఈ గూఢచార మేధో వంశాన్నే నేను ’నకిలీ కణికుడు’ గా సౌలభ్యం కోసం సంభోదించాను. ఎందుకంటే భారతంలోని కణిక నీతిని [Divide and Rule Policy] వీరు మరోసారి క్రొత్తగా కనుగొన్నారు కదా!?

ఈ నకిలీ కణికుడు ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. ఒక తరం కాదు, తరతరాలుగా నిరంతరం నిగూఢంగా పనిచేస్తున్నవాడు. ఒక చోట నుండి కాదు, పలు ప్రదేశాల నుండి, ఇతడి మనుషులు పనిచేస్తునారు. పైకి సి.ఐ.ఏ. ఏజంట్లుగానూ, మోసాద్ లేదా ఐ.ఎస్.ఐ. లేదా బ్రిటీషు ఏజంట్లు గానో కనబడతారు. ఇంకా చెప్పాలంటే వేరు వేరు వృత్తుల్లో కనబడతారు. తరతరాల వ్యాపార కుటుంబాలని [లేమాన్ బ్రదర్స్ 125 ఏళ్ళుగా, రతన్ టాటాల వంశం 150 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్నాయి] తరతరాలుగా కళాకారుల కుటుంబాలని ఒప్పుకుంటాం గానీ, ఇలా రహస్యంగా గూఢచర్యం జరిపే కుటుంబాలుంటాయని నమ్మం అనేవారికి ఎవరు చెప్పగలిగిందీ ఏమీ లేదు.

ఈ నకిలీ కణిక వంశం దగ్గర గూఢచర్య ఙ్ఞానం, కౌశలం ఉంది. దీనితో తానీషాకి ’కల’ వ్యూహాన్ని రచించి పెట్టింది. అది పాక్షిక జయప్రదంగా అమలు జరపబడినది. పూర్తి జయప్రదం చేసుకొనే వ్యవధి తానీషాకి లేకపోయింది. ఔరంగజేబు దాడి అతడికి పులి మీద పుట్ర వంటిది.

ఆనాటి నకిలీ కణికుడుకి ఔరంగజేబుతో ’దోస్తీ’ ఉపయోగపడేట్లు కనబడింది. ఎందుకంటే ఆ మొగలాయిల దగ్గర తరతరాలుగా సామ్రాజ్యాన్ని నడిపిన అనుభవమూ, అవగాహనా ఉంది. ఈ లోపాయి కారీ దోస్తీ, అప్పటి ప్రజల్లో తానీషా మీద ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకొని, గోల్కొండ కోట ద్వారాలు తెరిపించి ఔరంగజేబుకి గోల్కొండ మీద విజయం తెచ్చిపెట్టింది. తర్వాత 37 సంవత్సరాల గోల్కొండ రాజకీయాల్లో ఏం జరిగిందో గానీ అసఫ్ షాహీ ’నిజాం’లు గద్దెనెక్కారు.

తదుపరి, ఆనాటి నకిలీ కణికుడికి ఈస్ట్ ఇండియా కంపెనీతో ’దోస్తీ’ ఉపయుక్తంగా అన్పించింది. ఎందుకంటే వారి దగ్గర సముద్రయానం, తుపాకీ మందు లాంటి సాంకేతిక ఙ్ఞానం, ఖండాంతరాల గురించిన అవగాహన ఉంది. ఆ ఙ్ఞానం, అవగాహనా తాము ఔపోసన పట్టేదాకా ఈస్ట్ ఇండియా కంపెనీకి ’సీన్’ ఇవ్వబడింది. తదుపరి సీన్ లోకి బ్రిటీషు రాజకుటుంబం వచ్చింది. ఇలా నకిలీ కణీకులు [ ఏ తరం వారైనా సరే, వారి ఫార్ములా ఇదే!] ఎవరితో తమకి అవసరం ఉంటుందో, వారికి – ఎంతకాలం అవసరం ఉంటారో అంతకాలం సీన్ ఇస్తారు. అప్పటిదాకా ఓడ మల్లయ్య అంటారు. తర్వాత బోడి మల్లయ్య అంటారు. ఆ కారణంగానే బ్రిటీషు వారి ఉత్ధాన పతనాలూ, తర్వాత రష్యా, ఇప్పుడు అమెరికా ...... ఇలా! మనదేశంలో ఎన్.టి. ఆర్. మొదలుకొనీ నిన్నటి రామలింగరాజు దాకా, ఇదే ఓడ మల్లయ్య, బోడి మల్లయ్య స్ట్రాటజీని చూస్తూనే ఉన్నాము కదా!

గమనించి చూడండి……..

ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిస్థితులు – ఒక దేశానికి ఇంకో దేశం పాస్ట్ ఫార్వర్డ్ లేదా బ్యాక్ వ్యార్డ్. అంతే! అన్ని సంఘటనలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఏ దేశంలోనైనా [ముస్లిం దేశాలు మినహా] వేరే దేశపు సంస్కృతిని పొగుడుతూ, ఆ దేశపు సంస్కృతిని హీన పరుస్తారు. ఏ దేశపు రాజకీయ నాయకులయినా, మీడియా అయినా, వ్యాపార సంస్థలయినా ఆ దేశప్రజలని దోచుకుంటూనే ఉంటాయి. ఇక్కడ ఒకే సారూప్యత ఉంటుంది. ఇంతకు ముందు ప్రపంచాన్ని ఆడిస్తుంది బ్రిటీష్ సామ్రాజ్యం అన్నారు. తర్వాత రష్యా కె.జి.బి., అమెరికా సి.ఐ.ఏ. అన్నారు. ఇప్పుడు లాడెన్, ముస్లిం పెట్రో డాలర్లు తెర పైకి వస్తూన్నాయి.

నిజానికి ఈ నకిలీ కణికుడు ’ఉపయోగించుకొనేందుకు’ ముస్లిం అనుకూలుడు. ఆ ముస్లింల పట్ల నిబద్దత అనుమానస్పదమే. ఈతడు నిజాంలకీ అనుకూలుడు కాదు. అయితే అతడికి ఇండియాలోని హైదరాబాదు మాత్రం ప్రాణం! 1947 AD లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మధ్యపాకిస్థాన్ [హైదరాబాద్ సంస్థానం] ఏర్పరచాలని శతవిధాలా ప్రయత్నించాడు. ఒకవేళ సర్ధార్ పటేల్ గనుక పోలీసు చర్య చేపట్టక పోయిఉంటే, నెహ్రు మెతక వైఖరి కాశ్మీరు పైన లాగా హైదరాబాద్ సంస్థానం పైనా కొనసాగి ఉంటే ఇప్పుడు ఇస్లామాబాద్ స్థానంలో హైదరాబాద్ ఉండేది. అన్ని అగ్రదేశాలూ కలిసి ఇస్లామాబాద్ ని బుజ్జగించి గారాబం చేసినట్లుగా, హైదరాబాద్ ని బుజ్జగించి గారాబం చేసేవి. ఇప్పటికీ పైకారణం [over leaf reason] గా ఇస్లామాబాద్ ఉందే గానీ, ఇస్లామాబాద్ నిర్వహించే అన్నీ తీవ్రవాద కార్యకలాపాలకు, కుట్రలకూ మూలాలు హైదరాబాద్ లోనే కదా తేలుతుంది?

ఏతావాతా 1687 AD నుండి 2009 వరకూ ౩ శతాబ్ధాల పైచిలుకుగా ఏ వంశమైనా ప్రపంచాధిపత్యం కోసం నిగూఢంగా పనిచేస్తూ, సాధ్యాసాధ్యాలని బ్రిటీషు, రష్యా, అమెరికా, నేడు లాడెన్ ల రూపంలో ప్రయోగాత్మకంగా పరీక్షించుకుంటూ ప్రపంచాన్ని గూఢచర్యంతో నడిపిస్తూ ఉంటే ...... అసాధ్యమా?

ఆంత్రోపాలజీలో, ఆది మానవుని ఉనికి తాలుకూ పరిశోధనల్లో కృత్రిమంగా తయారు చేసిన మానవ కంకాళాన్ని లక్షల సంవత్సరాల క్రితపు నాటిదని 4 దశాబ్ధాలు ప్రపంచాన్ని నమ్మించడం [ఫిల్ట్ రాక్ హోల్స్ – ఉదంతం. పూర్తి వివరాలకు నండూరి రామ్మోహన రావు గారు వ్రాసిన నరావతారం చూడగలరు], అంగారకుడు లాంటి ఇతర గ్రహాల్లో కాలువల లాంటి నిర్మాణాలున్నాయనీ, అక్కడ గ్రహాంతర వాసులున్నారనీ ప్రపంచాన్ని నమ్మించడం, [వివరాలకు నండూరి రామ్మోహన రావు గారే వ్రాసిన మరో గ్రంధం ’విశ్వరూపం’ చదవగలరు] మనకు తెలిసిన సంఘటనలే. అలా ఒక ’విషయాన్ని’ [అది నిజం కానివ్వండి అబద్ధం కానివ్వండి] ప్రపంచం మొత్తం చేత కొన్ని దశాబ్ధాలు [అంటే దీర్ఘకాలం] నమ్మించడం సాధ్యమేననడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.

ఇక్కడ గమనించాల్సిన మరోవిషయం ఏమిటంటే – గూఢచర్య సాంకేతిక ఙ్ఞానం మన భారత రామాయణాలలో విపులంగా చర్చించబడింది. నారద నీతి, మార్కండేయ మహర్షి, వ్యాస మహర్షి ఇతరుల చర్చల్లో, విదుర నీతిలో, రామభరత సంవాదంలో ……. ఇలా లెక్కకు మిక్కిలి. సరిగ్గా వాటిల్లో ఏవి చేయమన్నారో వాటికి విలోమ పద్దతులు అవలంభించడం, ఏవి చేయరాదన్నారో అవే చేయటం ద్వారా కుట్రదారులు మన సమాజాన్ని ఇంత జయప్రదంగా భ్రష్ఠుపట్టించగలిగారు. గత ప్రభుత్వాల్ని ఒత్తిడి చేయగలిగారు. ప్రస్తుత ప్రభుత్వాలకు ఆ అవసరం లేదు లెండి. ఇవి స్వచ్ఛందంగానే కుట్రకు మద్ధతుదారులు. ఈ గూఢచర్య ఙ్ఞానం భారత రామాయణాది ఇతిహాసాల్లోనే కాదు భట్టి విక్రమార్క లాంటి జానపద కథల్లోనూ విస్తృతంగా ఉంది. అందుచేతనే కుట్రదారులు ముందుగా భారత రామాయణాలని సమాజం నుండి మాయం చేసారు. ఇక జానపద కథలు ఎంత వక్రీకరించబడ్డయో, జానపద సినిమాల రూపంలో ఎంతగా పలుచన చేయబడ్డాయో చెప్పనలవి కాదు. వాటిలోని లాజికల్ సెన్స్, గూఢచార ఙ్ఞానము, ‘అసలు కథలు’ తెలిస్తే గదా, అర్ధం చేసుకోగలం?

ప్రజలకి ఇవన్నీ తెలిస్తే, అంటే భారత రామాయణాల్లోని, భట్టి విక్రమార్క కథల్లాంటి జానపద కథల్లోని గూఢచార ఙ్ఞానం తెలిస్తే తాముపన్నుతున్న కుట్రలు పసిగట్టగలుగుతారు. అందుకే సినిమాలతో అన్ని కళలనీ నాశనం చేసి, సినిమా అన్న దాన్ని ఏకైక సాధనం చేసి, ఆ సినిమాల సాయంతోనే, ఇతిహాసాలని, జానపద కళలనీ, జానపద కళారూపాలని నిర్వీర్యం చేసారు, నిరాదరణ పాలు చేశారు, క్రమంగా రూపుమాపారు. ఇది – కుట్రలోని ఓ ప్రధాన పార్శ్వం.

ఒక ఉదాహరణ పరిశీలించండి.

కాలినడక మాత్రమే రవాణా సాధనంగా తెలిసిన వ్యక్తికి, విమానాల్లాంటి సాంకేతిక ఙ్ఞానం ఉందని వూహించనైనా లేని వ్యక్తికి, హైదరాబాద్ నుండి ఢిల్లీకి గంటలో చేరగలమంటే చచ్చినా నమ్మడు. చెప్పిన వారికి ‘పిచ్చేమో’ అనగలడు.

మరో ఉదాహరణ పరిశీలించండి.

డోపింగ్ ప్రక్రియ తెలియక ముందు మనందరమూ విదేశీ క్రీడాకారుల అద్భుతవిజయాల్ని అబ్బురపడుతూ చూచి ప్రశంసించాము గదా! డోప్ మందుల సాంకేతిక ఙ్ఞానం, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి మర్మము తెలిసాక కదా ’ఓహో! ఇలాగూ విజయాలు సాధించవచ్చన్న మాట’ అనుకుంటున్నాం?

అలాగే మనందరం ఏ గణాంక వివరాలనైనా, [ఓటర్ల జాబితా దగ్గర నుండీ ఓ ప్రదేశంలోని లక్షలాది వ్యక్తుల వృత్తి, ఆదాయం వివరాల దాకా] కంప్యూటర్ తెలియని చోట, టన్నుల కొద్దీ రికార్డులలో వ్రాసుకోక తప్పదు. ఆ కట్టల కొద్దీ రికార్డుల్లోంచి ప్రత్యేకంగా ఒక వ్యక్తి వివరాలు కావాలంటే కనీసం కొన్ని రోజులు, ఎక్కువమంది కలిసి వెతికితే కొన్ని గంటలు పడుతుంది. అలాంటిది కొన్ని సెకన్లలో ఆ వివరాలు చెప్పవచ్చు. అని ఎవరైనా అంటే నమ్మగలమా? అదే కంప్యూటర్, దాని పనితీరు తెలిస్తే…..? మన కళ్ళముందే, ఒక్క ’నొక్కు’ [క్లిక్] దూరంలో, కొన్ని సెకనులలో వివరాలు తెలుసుకోవటం చూసాక నమ్ముతాం కదా!

ఈ కుట్ర కూడా అలాంటిదే.

ఎంతటి సాంకేతిక పరిఙ్ఞానమైనా గూఢచర్య ఙ్ఞానం ఉంటేనే గిరాకీగా చెల్లుబాటు అవుతుంది. కావాలంటే ఈ ఉదాహరణ పరిశీలించండి. గల్ఫ్ ముస్లిం దేశాలు, తమ ముడి చమురు [మొత్తం ప్రపంచపు అవసరంలో వీరి ఉత్పత్తి 40% కంటే కూడా తక్కువే.] ను పరమ గిరాకీగా అమ్ముకోగలరు. మొత్తం ఇంధన ప్రపంచాన్నీ శాసించగలరు. ప్రపంచ ఆర్ధిక స్థితి మొత్తం ఈ ఒపెక్ దేశాల నిర్ణయాలపై ఆధారపడేంత ’గిరాకీ’గా అమ్ముకోగలరు. అమెరికాతో సహా [ఈ దేశంలోనూ ముడి చమురు నిల్వలున్నాయి] ఎవ్వరూ ఈ ముస్లిం దేశాలకు కళ్ళెం వేయ లేకుండా ఉన్నారు.

ఎన్నో దేశాలకి ఎంతో కొంత స్వంత చమురు వనరులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ’బైక్ మోడల్ క్రేజ్’ల్లాంటి వ్యూహాలతో పాటు ’పెట్రో ఉత్పత్తులకి’ గిరాకీ ఉండేటట్లుగా చూడటమే ’ఒపెక్’ దేశాలకు గూఢచర్యం అందిస్తున్న అండాదండా!

అదే మరి దక్షిణాఫ్రికా వారైతే తమ వజ్రాల గనుల్లోని, బంగారు గనుల్లోని ఉత్పత్తిని [వజ్రాలు, బంగారం అయినా సరే] గిరాకీగా అమ్ముకొని ఒపెక్ దేశాల మాదిరిగా ధనిక దేశం కాగలిగరా?

అంతెందుకు! మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే పరిటాల [కృష్ణా జిల్లా] లాంటి గ్రామాల దగ్గర నుండి, నేటికీ రాయల సీమలోని ఎన్నో ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమౌతునే ఉన్నాయి. మనం గానీ, మన ప్రభుత్వం గానీ వాటిని ’గిరాకీ’గా అమ్ముకోగలగే పరిస్థితి ఉందా? అలాగే తిండి పెట్టే వ్యవసాయ భూములను పంటలకు కాకుండా సెజ్ ల పేరు మీద అప్పచెబుతూ, డిమాండ్ ఉన్న బియ్యం కూడా రేపు దిగుమతి చేసుకున్నా ఆశ్చర్యం లేదు.

కాబట్టే 1450 AD లోనే తుపాకీ మందు లాంటి సాంకేతిక పరిఙ్ఞానం తెలిసినా, 1800 AD ల తర్వాత గానీ బ్రిటీషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో, అధికారపు పట్టు బిగించలేకపోయింది. 1857 AD లో అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటీషు రాజ కుటుంబానికి సంక్రమించింది.

అలా భారతదేశాన్ని గెలుచుకున్నాకే బ్రిటీషు రాచకుటుంబ రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్నీ స్థాపించగలిగింది. ఎప్పుడైతే ఇండియాని వదులు కుందో, ఆపైన చుట్టుకు పోయిన చాప లాగా ప్రపంచం మొత్తం నుండి వారి సామ్రాజ్యం జారిపోయి ఇంగ్లాండుకు పరిమితమైపోయింది.

అదీ గూఢచర్య బలం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu