గత టపాలు కొన్నింటిలో భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్రని కొంత వివరించాను. మిగిలింది తదుపరి టపాల్లో ప్రచురిస్తాను. భారతీయ ఇతిహాసాల్లో పాలకులు[రాజులు] ఎలా ఉండాలో, వారి బాధ్యతలేమిటో, ధర్మాలేమిటో, ప్రభుత్వ యంత్రాగం ఏ అవధులకి, ఏ నీతి నియామాలకి లోబడి ఉండాలో కొన్ని ప్రామాణికాలు వివరించబడ్డాయి. భారతంలోని విదురనీతి, నారదుడు ధర్మరాజుకి బోధించిన విషయాలు, రామాయణంలో భరతునికి శ్రీరాముడు అదేశించిన రాజనీతి మొదలైన అంశాలు ఈ విషయమై స్పష్టమైన, నిర్ధిష్టమైన వివరణ ఇచ్చాయి. పురాణ కాలం నుండి నేటి ఆధునిక కాలానికి ’కాలం’ మారిపోయి ఉండవచ్చు. కానీ మనుష్యుల భావాలు, భావోద్రేకాలు, ప్రేమానురాగాలు, అనుభూతి, అనుభవాలు మాత్రం మారలేదు కదా!

కాబట్టి ఇతిహాసాల్లో చెప్పబడిన ప్రభుత్వ యంత్రాంగపు తీరు, పాలకుల ధర్మం, మానవీయ విలువలు ఈనాటికే ఆచరణీయమే. ఇక్కడ నేను మనుస్మృతినో, బహు భార్యత్వం, సతీసహగమనం’ లాంటి కాలమాన పరిస్థితులకి లోబడిన ఆచార వ్యవహారాలనో సమర్థించడం లేదు. రామాయణ భారతాల్లో వివరించబడిన మానవీయ విలువలు గురించి, అవి ప్రతిపాదించిన రాజు మరియు ప్రభుత్వ బాధ్యతల గురించి వివరిస్తున్నాను.

అయితే ఇక్కడ ఈ నకిలీ కణికుడు, కుట్రదారులు, వారి మద్దతుదారులు ఆచరించింది ఏమిటంటే – సరిగ్గా ఏవి చేయవచ్చు అని ఇతిహాసాల్లో చెప్పారో అవి చేయకపోవటం, ఏవి చేయ కూడదన్నారో అవి చేయటం. ఫలితం ఎప్పుడూ దుష్టపరిణామమే. దాంతో జయప్రదంగా కుట్రదారులు భయంకర దోపిడి స్థితిని సృష్టించగలిగారు. ఆ స్థితిలో ప్రజల రక్తం పిండి, సిరిసంపదలుగా మార్చుకోవటం కుట్రదారులకీ, వారి మద్దతుదారులు, అనుచరులూ అయిన కార్బోరేట్ సంస్థలకీ సులభమైపోయింది. భారతీయ ఇతిహాసాలు మంచిరాజు [పాలకులు] ప్రభుత్వం ఎలా ఉండాలో చెప్పాయి. కుట్రదారులు [అంటే నకిలీకణికుడు వంశీయులైన రామోజీరావు, అతడి ఇతర అనుచరులూ] ఇతిహాసాల్లో చెప్పిన ప్రామాణికాలని పైన చెప్పినట్లుగా శీర్షాసనం వేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ కుట్రలను డిజైన్ చేసుకోవడానికి కూడా, వాళ్ళు మళ్ళీ మన ఇతిహాసాలా మీదే ఆధారపడ్డారు. ఇతిహాసాల్లో ఏది చేయమన్నారో వాటికి వ్యతిరేకంగా చేయటం అందులో భాగమే. ఈ విషయం మనం గుర్తించకుండా ఉండేందుకే భారతీయ సమాజం లోనుండి ఇతిహాసాలని అదృశ్యం చేసేందుకు ఎడతెగకుండా ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు.

పెద్దలంటారు – కొంతమంది వ్యక్తుల్ని చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చని, అలాగే మరికొంతమంది వ్యక్తుల్ని చూసి ఎలా ప్రవర్తించకూడదో నేర్చుకోవచ్చని.

అదేవిధంగా చరిత్రలో కొందరు భారతీయ రాజులు ఇతిహాసాలని, ధర్మశాస్త్రాలనీ అనుసరిస్తూ ప్రజలకి మంచి చేయడానికీ, మంచి ప్రభుత్వాలు నెలకొల్పడానికీ, నీతి నియామాల్ని పరిరక్షించడానికే ప్రయత్నించారు. ధర్మాచరణలో ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణ దేవరాయలు, భోజుడూ, గుప్తులూ, పాండ్యులూ, చోళులలో ఎందరో రాజులు ఇందుకు నిదర్శనాలు. అదే ఇతిహాసాలని, నీతి ధర్మ శాస్త్రాలని విపర్యయంగా ప్రయోగించి ఈ కుట్రదారులు, వారి మద్దతుదారులూ ప్రజాదోపిడి చేయడానికి, దోపిడి ప్రభుత్వాలు నెలకొల్పడానికీ ఉపయోగించుకొన్నారు.

నాశక్తి మేరకు భారత రాజకీయ రంగం మీద, ప్రభుత్వాల మీద ప్రయోగించిన, ప్రయోగిస్తున్న కుట్ర స్వరూప స్వభావాల గురించి విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

భారత దేశానికి పురాతనమైన, సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ప్రపంచంలోని అధికభాగం ఇంకా చీకటిలో ఉండగానే భారత దేశానికి గణితంలో దశాంశమానం తెలుసు. అణు సిద్దాంతమూలాలు తెలుసు. ఖగోళ సిద్దాంతపు పునాదులు తెలుసు. అవన్నీ ఇప్పుడున్నంత advanced గా లేకపోవచ్చు. కానీ ఈనాటి ఈ సిద్దాంతాలకు పునాదుల్లాంటి, ప్రేరణాత్మకమైన భావనలు [ Thought provoking ] ఆనాటి భారతీయ మేధావులకి తెలుసు.

’అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అని నేను అనడం లేదు. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తే వేదవాఙ్ఞ్మయంలో కొంత, భగవద్గీతలో కొండంత, సంవాద సంస్కృత సాహిత్యంలో పర్వతమంత ఙ్ఞానం ఉంది అంటున్నాను. [సతీ సావిత్రి కథ మనకి పతివత్ర కథగానే తెలుసు. సావిత్రీ యమధర్మరాజుల సంవాద రూపంలో ఆత్మ శరీర ధర్మాల గురించి, జన్మల గురించి ఎన్ని సిద్దాంతాలు అక్కడ ప్రతిపాదింపబడి, చర్చించబడ్డాయో మనలో చాలా తక్కువమందికి తెలుసు.]

ఇవన్నీ గాక, వేల సంవత్సరాల నుండి భారతీయులకి తరగని ఆధ్యాత్మిక ఆలోచనా సరళి, పరిపక్వమైన సంయమనంతో కూడిన ఆలోచనా సరళి, తాత్త్విక ఆలోచనాధోరణి ఉంది. అది తిరుగులేని, తరగని వారసత్త్వ సంపద.

పురాణాలు వదిలేసి చరిత్రలోకి అవలోకించినా.......

క్రీ.పూ. 600 నాటికే భారతదేశంలో మహావీర జనుడు జన్మించాడు. యువరాజు జీవితాన్ని – ప్రజలకు శాంతిసౌఖ్యలకి అన్వేషించేందుకు, ఙ్ఞానాన్ని తెలుసుకునేందుకు పరిత్వజించాడు. ఇక గౌతమ బుద్దుడి చరిత్ర అయితే ప్రపంచ ప్రసిద్ది పొందింది. దాదాపు అందరికీ తెలిసిన కథ ఇది. ఇప్పటికీ ఒక్క అయిదు నిముషాలు మనస్సు పూర్తిగా లయింపజేసి

’బుద్దం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి’ అంటూ ధ్యానం చేస్తే చాలు ఎంతో శాంతిని, స్ఫూర్తిని మనలో నింపగల మహాశక్తి ఆ మహానుభావుడిది. అది సజీవ శక్తి. కాలదోషం లేని శక్తి.

బుద్దుని కథ మనందరికి తెలిసిందే అయినా మరోసారి స్మరించుకొంటే తప్పేం లేదనీ, ఆ కథ మనలో నింపే స్ఫూర్తికి కొదవా లేదని నేను అనుకుంటున్నాను. మీరూ అంగీకరిస్తారని ఆశిస్తాను.

అది - క్రీ.పూ. 600 సం. స్థలం కపిలవస్తు నగరం. ఆ దేశానికి ప్రభువు శుద్దోధనుడు. ఈయనకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య, రాణి మాయావతీ దేవి గర్భవతిగా ఉంది. ఆమె ఓ చిత్రమైన కల కన్నది. ఆ కలలో తెల్లని ఏనుగు అంటే ఇంద్రుని ఐరావతం తన గర్భంలో ప్రవేశిస్తున్నట్లు ఆమె చూచింది.

మర్నాటి ఉదయమే రాజదంపతులు జ్యోతిష పండితుల్ని కలని విశ్లేషించవలసిందని అడిగాడు. పండితులు “మహారాజా! పరిణామాలని బట్టి చూస్తే మహారాణి కడుపున ఓ గొప్ప పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పవచ్చు. అయితే ఆ బాలుడు గొప్ప చక్రవర్తి కావచ్చు. లేకపోతే ఓ గొప్ప పరిత్యాగి కావచ్చు. దేనికైనా అవకాశం ఉంది” అన్నారు.

ఇందుకు మహారాజు శుద్దోధనుడు ఎంతో సంతోషించాడు. తనకు గొప్పవాడు కాగల పుత్రుడు కలగడం కంటే ఒక తండ్రికి సంతోషకర వార్త మరేముంటుంది? అయితే మహారాజు తన కుమారుడు గొప్ప చక్రవర్తి కావాలని కాంక్షించాడు. యోగి కావటం ఆయనకు సుతారాము ఇష్టం లేదు.

ఇలా ఉండగా మాయావతి పురిటికి పుట్టింటికి బయలు దేరింది. పల్లకి మెల్లిగా సాగుతోంది. ఉత్తర భారతాన అందమైన లుంబినీ వనం చేరింది. ఆమె ఆ వనంలోనే ఓ బాలుడికి జన్మనిచ్చి, తన జన్మ సార్ధకం చేసికొంది; జన్మ చాలించింది. ఆ బిడ్డకు పుట్టిన సమయం, స్థలాలు బట్టి జ్యోతిష పండితులు ఆ బాలుడు పరమ యోగి అవుతాడని నిర్ధారించారు.

బాలుడికి సిద్ధార్ధుడని పేరు పెట్టారు. సవతి తల్లి గౌతమి పెంచింది, కాబట్టి గౌతముడనీ పిలవబడ్డాడు. చిన్నతనం నుండే హృదయ సౌకుమార్యం, నైర్మల్యం సిద్ధార్ధునిలో పెల్లుబికి కన్పిస్తూనే ఉండేవి. శుద్ధోధనుడు తన పుత్రుడు యోగి కాకుండా, చక్రవర్తి అయ్యోందుకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు. [తండ్రిగా ఆయన తాపత్రయం ఆయనది. కాని జరగవలసిందేదో అదే జరిగింది]

ఓ చక్కని అందమైన విశాలమైన రాజప్రాసాదాన్ని నిర్మించి, దాని చుట్టూ విశాలమైన ఉద్యానవనాలు, సరస్సులు ఏర్పాటు చేశాడు. కష్టం తెలియకుండా యువరాజు సిద్ధార్ధుడిని పెంచాడు. దాంతో అందమైన యువకుడిగా ఎదిగిన సిద్ధార్ధుడికి అందమైన వధువు యశోధరనిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకి మరింత అందమైన బాలుడు జన్మించాడు. ముద్దులు మూటగట్టునట్లూన్న ఆ చిన్నారికి రాహులుడని నామకరణం చేశారు. కష్టం, ఇబ్బంది, బాధ తెలియని విధంగా, ఇతరులు బాధలు, ఒత్తిళ్ళు గమనించే అవకాశం లేకుండా సిద్ధార్ధుడు ఆ రాజ భవనంలో నివసిస్తున్నాడు.

ఇలా ఉండగా……. ఓ రోజు నగర సందర్శనకి తీసికెళ్ళమని తన రధ సారధిని పురమాయించాడు సిద్ధార్ధుడు. నగరాన్ని పరికిస్తూ వెళ్ళుతున్నాడు. దారిలో ఓ వ్యాధిగ్రస్తుడు కనిపించాడు. అతడి ముఖం బాధతో నిండి ఉంది. రోగ బాధతో శరీరం వణుకుతుంది. సిద్ధార్ధుడి మనస్సు ఆర్ధ్రమైంది. తన సారధిని అతడెందుకు అలా ఉన్నాడని అడిగాడు. సారధి “యువరాజా! మానవులకి రోగ బాధలు సహజం. ఒకోసారి ఆ అనారోగ్యాలతోనూ, రోగాలతోనూ మనుష్యులు కొందరు చనిపోతుంటారు” అన్నాడు.

సిద్ధార్ధుడికి కొంత అర్ధమైంది. మరికొంత అర్ధం కాలేదు. మరి కొంతదూరం వెళ్ళేసరికి వణుకుతూ నడవ లేక నడుస్తూ, కర్ర సహాయంతో వెళుతోన్న, బలహీనుడైన వృద్ధుణ్ణి చూశారు. ఈసారి సారధి “యువరాజా! ఇది ముసలి తనం. ప్రతీ వ్యక్తి అతడి శరీర సౌందర్యం, పటుత్వం, శక్తి వీటన్నిటికీ అతీతంగా ఈ వార్ధక్యపు స్థితికి చేరతారు. అది ప్రతీ మనిషికి జీవితంలో సహజం. ఆ స్థితిలో శరీరం వడలిపోతుంది. బలహీనపడుతుంది. చర్మం ముడతలు పడుతుంది. పళ్ళు, జుట్టూ ఊడిపోతాయి. చూపు, వినికిడి లాంటి ఇంద్రియ సామర్ధ్యాలు, పని సామర్ధ్యం క్రమంగా నశిస్తాయి” అన్నాడు.

[అందుకేనేమో గుడిలో తీర్ధం ఇస్తూ పూజారి చెప్పే మంత్రం ’అకాల మృత్యుహరణం జరావ్యాధి భయ నివారణం శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభమే’ విన్నప్పుడు ఎంతో భద్రతగా అన్పిస్తుంది; దడుచుకున్నప్పుడు వెన్నుతట్టిన అమ్మచేతి స్పర్శలాగా! ఇది భగవంతుణ్ణి నమ్మే ఆస్తికులు మాత్రమే అనుభవించగల భద్రతాభావం. దీని గురించి తర్కం అనవసరం. ఎందుకంటే నమ్మకాలని తర్కంతో నిరూపించలేం గనుక.]

మరికొంత దూరం వెళ్ళేసరికి, ఈసారి వారికి శవయాత్ర ఎదురైంది. పాడె మీద శవం, వెనుక విషణ్ణ వదనాలతో బంధుజనం. సారధి వివరిస్తూ “యువరాజా! ఇది మరణం. పుట్టిన ప్రతీ ప్రాణి ఏదో ఒక రోజు ఇలా మరణిస్తుంది. మృత్యువుకి పేద ధనిక అనిగానీ, స్త్రీపురుష అనిగాని బేధం లేదు. మృత్యువు మనల్ని పిలిచినప్పుడు మనం ఏదీ వెంట తీసుకు వెళ్ళలేం, ఈ శరీరంతో సహా. ఎవ్వరూ మన తోడురారు” అన్నాడు.

సిద్ధార్ధుడు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. “ఇక చాలు. అంతఃపురానికి పోదాం” అన్నాడు.

సిద్ధార్ధుడి మనస్సు అల్లకల్లోలమైంది. మనుష్యుల బాధలు చూచి ఆయన చాలా కలత చెందాడు. అవి తన బాధలు కావు. తనకి ఏలోటూ లేదు. కానీ ఇతరులు బాధలు ఆయన్ని ఆలోచింపచేశాయి. ఈ ప్రపంచం లో అందరూ దుఃఖాలు లేకుండా, శాంతి సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నాడు. [ఇలా ‘కోరుకున్న’ వాడు మరి కోరికలే మనిషి కష్టాలకి మూలం అని ఎలా చెప్పాడు?’ అని వాదించగల మేధావులకి ఓ నమస్కారం ముందే చెప్పి, వారి వాదనకు ముందరే నా ఓటమి ఒప్పేసుకొని ముందుకు వెళుతున్నాను.]

తన సుఖమయి జీవితంతో ఆయన సంతృప్తి పడలేకపోయాడు. ఆ రాత్రే ఆయన తన అందమైన భార్య యశోధరనీ, ముచ్చటైన పుత్రుడు రాహులుణ్ణి, తన విలాస వంతమైన భవంతినీ, సౌఖ్యవంతమైన యువరాజు జీవితాన్ని విడిచిపెట్టేసాడు. అడవికి ప్రయాణమైపోయాడు. అక్కడ తపస్సు చేశాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎందరో యోగుల్ని, మునుల్నీ, పండితుల్నీ, ప్రఖ్యాతి పొందిన వారినీ కలిసాడు. చర్చలు చేసాడు. ప్రపంచానికీ, మానవ జీవితానికీ అర్ధం తెలుసుకోవాలని ప్రయాణించాడు, అన్వేషించాడు. ప్రతీ చోటా ఆయనకు నిరాశ కలిగింది. అసంతృప్తి మిగిలింది. దాంతో తపన మరింత పెరిగింది. ఙ్ఞానపు ఆకలి, సత్యం పట్ల దాహం ఆయన అన్వేషణని మరింత తీవ్రతరం చేశాయి.

తనలో తానే తర్కించుకొన్నాడు. తీవ్రంగా ఆలోచించాడు. చివరికి గయలో [తర్వాత అది బుద్దగయ అయ్యింది], ఓ వృక్షం క్రింద [ తర్వాత అది బోధివృక్షం అయ్యింది] ఆయన ఙ్ఞాన సిద్ధి పొందాడు. సత్యాన్ని దర్శించాడు.

ఇది మనకు భాగవతం లోని ప్రధమ ఘట్టాన్ని గుర్తుకు తెస్తుంది. బ్రహ్మాదేవుడు విష్ణునాభి నుండి ఉన్న తామర పుష్పంలో జన్మించాడు. [ఇక్కడ నేను మానవ లేదా ప్రాణ సృష్టి ప్రక్రియనీ, మాతృగర్భవ్యవస్థనీ, బయోలాజీ ని చర్చించడం లేదు. శాస్త్రసాంకేతికతకీ ఇతిహాసాల్లోని నమ్మకాలకీ ముడిపెట్టటం అసంబద్ధం. నమ్మకం అన్నది సైన్సుకి అతీతమైనది] చుట్టూ చీకటి. బ్రహ్మాదేవుడికి తానెవ్వరో, ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలన్పించింది. తాను తామర పుష్పంలో పుట్టాడు గనుక ఆ తామర తూడులోకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తూడు లోపలా చీకటి, బయటా చీకటి. ఎంత దూరం ప్రయాణించాడో! ఎంతకాలం ప్రయాణించాడో! కానీ ఎంతకీ తానెక్కడ పుట్టాడో ఆ తామర తూడు ప్రారంభ స్థానాన్ని తెలుసుకోలేక పోయాడు. చేసేది లేక వెనుదిరిగి మళ్ళీ పువ్వు మీదకే వచ్చాడు. తపస్సు ప్రారంభించాడు. తనలో తనే ఆలోచించటం మొదలుపెట్టాడు. తనకి తాను తెలుసుకోవటం, తనకు తాను పరిశీలించుకోవటం ప్రారంభించాడు. దానితో ఙ్ఞానాన్ని తనలోనే తెలుసుకోగలిగాడు. [ఇది ఎంతోనిజం. ఏ విషయమైనా, ఎవరు మనకి ఎంత వివరంగా చెప్పినా దాన్ని మనం మన మనస్సుతోనే అర్ధం చేసుకోగలం. అది మన మనస్సులోకి ఇంకినప్పుడు, ఆలోచనలోకి పాకి నప్పుడు మాత్రమే మనం సదరు విషయాన్ని అర్ధం చేసుకోగలం అంటే తెలుసుకోగలం. ఇది మనందరికీ చిన్నతనం నుండి తెలిసిందే.] సరే! ఆ తపస్సుతో బ్రహ్మా తనలోనే తన తండ్రి విష్ణువుని తెలుసుకోగలిగాడు. [పోతన మహాకవి ఈ విషయాన్ని ఎంత తియ్యని పద్యంలో చెప్పారో!] ఈ విధంగా భాగవతం మనకి ఙ్ఞానం అంటే నే దైవమనీ, దాన్ని మనం మనస్సులో ఆలోచించి, మనస్సులోనే తెలుసుకోవాలనీ చెబుతోంది. ఙ్ఞానాన్ని మనం కార్బోరేట్ సంస్థలో, కార్యాలయాల్లోని కంప్యూటర్లో ఇచ్చే సర్టిఫికేట్లుతో పొందలేమన్నది సత్యం.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా “ఙ్ఞానం అంత పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఙ్ఞాని అంటే నేనే[భగవంతుడే] అని నా అభిప్రాయం. ఙ్ఞానికి భగవంతుడు కనబడతాడు, భగవంతుడికి ఙ్ఞాని కనబడతాడు” అని చెప్పాడు.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

8 comments:

బుద్ధుని సవతి తల్లి పేరు ప్రజావతి, గౌతమి కాదు. గౌతమి పెంచినందు వలన సిద్ధార్థుడు గౌతముడు కాలేదు (సంస్కృత వ్యాకరణం దృష్ట్యా కూడా అలాంటి వ్యుత్పత్తి సాధ్యం కాదు). ఆయన అసలు పేరు గౌతముడే. ఇక లుంబినీ వనం ఉత్తర భారతంలో లేదు. నేపాల్ లో ఉంది. మీరు చెప్పిన కాలం కూడా (క్రీ. పూ 600) సరికాదు.

చారిత్రిక విషయాలను ప్రస్తావించేటప్పుడు సత్యైక దోషాలను (Factual Errors) వీలైనంతగా పరిహరిస్తే బాగుంటుంది.

అభినందనలు!

చంద్ర మోహన్ గారూ,

చారిత్రకాంశాల మీద [అంటే స్థలకాలాల మీద] నాకంతగా సాధికారత లేదు. బుద్దుడికాలం క్రీ.పూ.600 లని నేను మరో పుస్తకం నుండి గ్రహించాను. అలాగే బుద్దుడి పూర్వనామాలు సిద్ధార్ధుడు, గౌతముడు విషయం కూడా. క్రీ.పూ. నాటికి నేపాల్ దేశం లాంటివన్నీ భరత ఖండంలో భాగాలే కనుక లుంబినీ వనం ఉత్తరభారతాన ఉన్నది అని వ్రాసాను. అలాగాక నేటి నేపాల్, నాటి ఉత్తర భారతం అనో లేక హిమాలయ పాదాల దగ్గర అనో వ్రాస్తే సరిగా ఉండేదేమో. ఏదేమైనా పొరపాట్లు నాదృష్టికి తెచ్చినందుకు మీకు నా కృతఙ్ఞతలు. బుద్దుడి అసలుకాలం ఎంతో తెలిపితే తర్వాత సరిదిద్దుతాను.

ఇకపోతే నా టపాల్లో నేను చరిత్ర మనకిచ్చే స్ఫూర్తిని, ఆపైన ‘రాజకీయాలు’ మొదలైన రంగాల మీద కుట్ర కోణాన్ని చర్చించే ప్రయత్నం చేస్తున్నాను. బుద్దుడికాలం క్రీ.పూ. 600 అని ఒక చోట, క్రీ.పూ. 567 – 489 అని మరో చోట ఉంది. మహావీర జినుడికి సమకాలీనుడనీ చదివాను. ఏదేమైనా బుద్దుడు క్రీ.పూ.600 సంవత్సరాలకి ఓ 100 ఏళ్ళు ముందో వెనుకో పుట్టిందీ, మనకు స్ఫూర్తినీ, సత్యాన్ని అనుగ్రహించింది నిజం కదా! అంతవరకే నాదృష్టి. అలాగని నా పొరపాట్లు నేను ఒప్పుకోవటం లేదని అనుకోవద్దు. పొరబాటు మానవ సహజం కదా! I’m always correct అనటం అహంకారం కూడా! అహం పాము నుండి మనం ఎల్లవేళలా జాగరూకతతో ఉండాలనే ‘గీత’ని నేను ఆచరించ ప్రయత్నిస్తాను. అందుచేత, ఇప్పుడేకాదు, ఎప్పుడు నేను చారిత్రక అంశాల మీద పొరపాటు పడినా మీరు సరియైన వివరాలు చెబితే నేను చాలా సంతోషిస్తాను.

మరో మాట ఏమిటంటే – నేను చాలా చోట్ల చదివాను, మన చరిత్ర [ మన చరిత్రే కాదు, ప్రపంచ దేశాల్లో చాలావాటి చరిత్ర] వక్రీకరించబడిందనీ. ఒక దాని కొకటి పొంతన లేని గ్రంధాలు, విద్యార్ధుల చరిత్ర పాఠ్యాంశాల్లోనే పరస్పర విరుద్ద వివరణలు ఉండటం మనకి తెలుసు. అసలు నిజాలేమిటో చరిత్రలో పరిశోధించిన వారు చెబితే మాలాంటి వారికి, మనలాంటి వారికి మరింత మేలు జరుగుతుందనుకుంటాను.

మరోసారి మీకు మనఃస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.
************

ఆదిలక్ష్మి గారూ,

నేను చూపిన తప్పులను మీరు సహృదయంతో స్వీకరించడం సంతోషంగా ఉంది. నేను కూడా ఏదో తప్పులు వెదికేయాలని వ్రాయలేదు. మీ బ్లాగు చాలా మంది చదువుతున్నారు కనుక అందులో చరిత్ర గురించిన తప్పులు ఇతరులకు అపోహలు కలిగించే అవకాశం ఉందనే మీ దృష్టికి తీసుకు వచ్చాను. మీ ఇతర టపాలలో కూడా ఇలాంటివి నేను గమనించాను (ఉదా: అశోకుని తండ్రి బింబిసారుడు కాదు, బిందుసారుడు).

మన సాధారణ చరిత్ర పుస్తకాల ప్రకారం బుద్ధుడు క్రీ.పూ. 483 లో పుట్టి క్రీ.పూ.403 లో మరణించాడు. ఐతే ఆ తేదీలు అబద్ధమని, బుద్ధుడు క్రీ.పూ.1886 లో పుట్టి క్రీ.పూ.1807 లో మరణించారని ఇప్పుడు మన చరిత్రకారులు అంటున్నారు. ఎం.వి.ఆర్. శాస్త్రి గారి "ఏది చరిత్ర" పుస్తకంలో దీని గురించి ఒక పెద్ద వ్యాసమే ఉంది.

చరిత్ర విషయం అలా ఉంచి, మీ టపాలు బాగా ఆలోచింపజేస్తున్నాయి.

అభినందనలు.

When some one inspecting the blanket made by sheep wool, they should concentrate on the design patterns and how skillfully the weaver created the blanket, but on sheep hair.

Reader should understand that Adi Lakshmi గారు is not writing a History book.

If she really writing a history book, then you have every right to question about the facts.

Even Historians contradict with each other about the birth dates and life span of many prominent figures like Jesus, Bhuddha, Mahaveera and others.

But it doesn't mean blog writers ignore the prevailing historical facts.

It is observed that narration of Historical events change, based on who is writing the history. This is the reason why you see controversies like 1) Intelligent Design versus Darwinism 2) Marxists history versus true history of India written by Nationalists.

@pseudosecular

When you go to buy a blanket made of Sheep wool, you should go with a minimum knowledge to differentiate sheep wool from reindeer wool or goat wool. When your basic identification fails, you will end up a real "Bakra".

The post will be good without mentioning the dates, and historical data. But when they are mentioned, it is expected to be factually correct, and that is what is my only observation.

pseudosecular గారూ, చంద్రమోహన్ గారూ,

నేను మీ ఇద్దరి వాదననూ అంగీకరిస్తానండి. ఎందుకంటే మనం తివాచీ కొనడానికి వెళ్ళినప్పుడు కేవలం గొర్రె ఊలునీ మాత్రమే పట్టించుకొని, దాని డిజైన్ నీ, అల్లికలోని కళాత్మకతనీ పట్టించు కోకపోయినా, లేక కేవలం డిజైన్ నీ, అల్లికలోని కళాత్మకతనీ మాత్రమే పట్టించుకొని, గొర్రె ఊలుని పట్టించుకోకపోయినా తివాచీ కొన్న దాని ప్రయోజనం నెరవేరదు.

కాకపోతే దేని అవధి ఎంతో తెలుసుకోవటం లోనే మన విఙ్ఞత ఉంటుంది. ఈ విషయాన్నీ గీత చెబుతుంది.

గీతా శ్లోకం

‘ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా’

భావం...... మితాహారం, మిత నిద్ర, మిత విహారం, చివరకు కర్మలు చేయడంలోనూ మితం పాటిస్తూ మితమైన మెలకువ కలిగి అభ్యాసం చేసేవాడికే – సర్వదుఃఖ నాశకమైన యీ యోగం సిద్దిస్తూంది.


కాబట్టి ఈ వాదనని ఇంతటితో వదిలేద్దాం.

మరో విషయం ఏమిటంటే – మన బ్లాగు లోకంలో కొందరు తప్పులెన్నెడమే పనిగానూ లేదా వ్యక్తిగత విమర్శలూ దూషణలే ధ్యేయంగా వ్యాఖ్యలు వ్రాయడం కూడా ఉంది. అందుచేత ఏ వ్యాఖ్య చూసినా ముందు నెగిటివ్ గా చూడవలసి వస్తోంది. నేను కూడా ప్రతీసారి ఈ విషయమై నన్ను నేను హెచ్చరించుకుంటూ ఉంటాను. కీడెంచి మేలెంచడం, పాలతో మూతి కాలినప్పుడు మజ్జిగ ఊది తాగటం సహజం కదా! అయితే పాజిటివ్ గా స్పందిస్తే మన బ్లాగుల స్ఫూర్తికి మరింత విజయం కలుగుతుంది కదా! సహృదయం, పాటిజివ్ ఆలోచనా ధోరణి చక్కని తోటలో విహరించినట్లు మనస్సుకి సేదతీరుస్తాయి. ఏమంటారు?


**************

Adi Lakshmi గారు,

I agree with your assessment. People have different agenda. Typically they resort to personal attack due to their inherent deficiencies, instead of discussion and reasoning.

Keep up the good work.

What is your assessment on "Does blogging solve real life problems"?.

Pseudo secular Garu,

Newton law states that, “There is reaction for every action.”

In my opinion, ‘Every action has its own impact.’

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu