అనైతికత, అమానుష ప్రవర్తన, స్త్రీలను లైంగికంగా, శ్రామికంగా దోచుకోవడానికి అర్ధ అంగ అధికార బలాలను ఉపయోగించటం, స్త్రీలని అవమానించటం, ముఖ్యంగా హిందువుల్ని హీన పరచటం – ఈ స్థితి జౌరంగ జేబు పరిపాలనా కాలంలో పరాకాష్ఠలో ఉండింది.

జౌరంగ జేబు ముత్తాత అక్బరు. ఈయనకి చదవటం వ్రాయటం రాదని అంటారు. Literacy, knowledge వేర్వేరు అనడానికి సజీవ తార్కాణమా అన్నట్లు అక్బరు అక్షరాస్యుడు కాకపోవచ్చు గాని నిశ్చయంగా మాత్రం ఙ్ఞానం కలవాడు. రాజకీయ అవసరమో, మానసిక పరిపక్వతో – కారణం ఏదైనా సరే అక్బరు హిందువులని ముస్లింలాగే గౌరవించాడు, ఆదరించాడు. అతడు సత్యం ఎక్కడున్నా స్వీకరించాడన్నదే చరిత్రకారులిచ్చిన సమాచారం. ఆయన ప్రతిపాదించిన మతం దీన్ – ఇ – ఇల్లాహి లోనూ ఇదే విషయ చర్చ ఉందనీ, అక్బరు హిందూ మంత్రులని ఆదరించాడని, [బీర్బల్ ఓ ఉదాహరణ, బీర్బల్ అసలు పేరు వీరబలుడు అని అంటారు], హిందూ స్త్రీని వివాహం చేసుకున్నాడని అంటారు. వీటిలో కొన్ని చారిత్రక అంశాల మీద ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. అలాంటివే మొన్న ’జోధా అక్బర్’ సినిమా నేపధ్యంలో బయటకొచ్చాయి.

ఏది ఏమైనా అక్బరు ఉత్తర భారతదేశాన్ని ఏలిన రాజుగా చరిత్రలోనే గాక ప్రజల హృదయాల్లోనూ ఉన్నాడన్నది అబాల గోపాలం చెప్పుకునే కథలే చెబుతున్నాయి. ఈ విజయాన్ని అక్బరు హృదయ వైశాల్యం సాధించింది. అదే జౌరంగజేబు పరమత సహనం లేని ఇరుకూ, కుపిత మనస్కడు కావటం చేత ఢిల్లీ నేలిన చివరి మొగలాయి అయినాడు. అతడి తర్వాత అతడి కుమారుడు రాజ్యాని కొచ్చినా, వారి సామ్రాజ్యము బలహీన పడింది; క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, తదుపరి బ్రిటీషు ప్రభుత్వం యొక్క అధీనంలోకి వెళ్ళిపోయింది.

జౌరంగజేబు, అతడి మద్దతుదారులు హిందూవుల మీద చేసిన అకృత్యాలు నిజాం నవాబు, అతడి మద్దతుదారులైన రజాకర్లు తెలంగాణా ప్రజల మీద చేసిన అకృత్యాలకు ఏమాత్రమూ తీసిపోవు. ఇది మనకు ఛత్రపతి శివాజీ చరిత్ర ద్వారా మరింత స్పష్టంగా కనబడుతుంది.

మరాఠా పోరాట యోధుడు శివాజీ. భారతదేశంలో ఆనాటికి నాశనమైన సంస్కృతిని పునఃస్థాపించటానికి మహారాష్ట్రలో బలమైన సామ్రాజ్యస్థాపన చేశాడు. శివాజీ జీవితచరిత్ర నిజంగా ప్రతి ఒక్క భారతీయుడికీ స్ఫూర్తిన్ని ప్రసాదించగలిగి నట్టిది. ఒక్కసారి మళ్ళీ ఓపికా, తీరికా చేసికొని ఆయన జీవితాన్ని చదివితే అది మనలో ఎన్నో ఆలోచనల్ని రేకేత్తించి, మన రక్తాన్ని రగిలించగలదన్న విషయంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. శివాజీ తండ్రి ముస్లిం రాజుల కొలువులో పనిచేస్తున్నా, శివాజీ తల్లి జిజియా బాయి మాత్రం తన కుమారుణ్ణి భారత రామాయణాలు చెప్పి, హిందూ సంస్కృతి, హిందూ ధర్మాలని రంగరించి పోసి యోధుడిగా పెంచింది. ఆ విధంగా పిల్లలు పెంపకంలో తల్లి పాత్ర ఎంత ప్రభావశీలమో ఆ తల్లి మన కళ్ళముందు ఆవిష్కరించింది.

బాల్యంలోనే, తల్లి తన మేధస్సులో నాటిన మానవీయ విలువలు, కర్మానుష్ఠానం, ధర్మానుష్ఠానం అనే బీజాలు, శివాజీ తన జీవితాన్ని సమాజంలో భ్రష్టమైన నీతిని తిరిగి బ్రతికించడానికి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అంకితం చేసేలా పురికొల్పాయి. ఆ విత్తనాల ఫలితమే ఈ మహా వృక్షం.

ఇక్కడ కుట్రలో ఒక భాగాన్ని మీకు చెప్పాలి. చికాగో మతసభల ఉపన్యాసాలలో వివేకానందుడు అక్కడి వారిని ఉద్దేశించి చెబుతూ “భారతదేశంలో పొలం దున్నుకుంటున్న ఓ రైతు దగ్గరకెళ్ళి ‘నీ దేశప్రభుత్వం గురించి చెప్పూ’ అంటే ఏమీ చెప్పలేడు. కాని ‘నీ మతం గురించి చెప్పు’ అంటే అతడు మిమ్మల్ని చెట్టు నీడలో కూర్చోబెట్టి, చల్లనీ నీళ్ళిచ్చి, అనర్గళంగా చెబుతాడు. అది నా దేశపు గొప్పదనం” అన్నాడు. కానీ 100+ సంవత్సరాల తరువాత చూస్తే చదువు విషయంలో సాధించిన అభివృద్ది కంటే ‘తత్త్వచింతన, మతం’ విషయంలో సాధికారత పూర్తిగా పోగొట్టుకున్నాము. వితండవాదన, పబ్ సంస్కృతి, డేటింగ్ సంస్కృతి, ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని అభివృద్ది మంత్రంగా పాటించేటట్లు కుట్రదారులు భారతీయుల్లో చాలామందిని నడిపారు.

మనం ముందే చెప్పుకున్నట్లుగా భారతదేశంలోకి ముస్లిం లు ప్రవేశించినప్పుడే రాజకీయాల్లో, ప్రవర్తనలో కుట్రాకుతంత్రాలనీ ప్రవేశపెట్టారు. భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఈ కుతంత్రాలతోనే స్థాపించారు. ఆ కాలానికి హిందూమతం, బౌద్ధమతం కూడా కొందరు పెద్దల, మరి కొందరు మూర్ఖుల అహంకారం, స్వార్ధాల కారణంగా బలహీన స్థితిలో ఉన్నాయి. దానితో ఇస్లాం మతం ‘పాలకుల మతం’ అయ్యేటప్పటికి చాలామంది ప్రజలు రాజుల్ని, రాజోద్యోగుల్ని సంప్రీతుల్ని చేసుకోవటం కోసం, వారి నుండి ప్రయోజనాలు పొందటం కోసం ’ఇస్లాం’ మతంలోకి మారారు. [అంటే ఎ.ఆర్. రహమాన్ లాగా, భజన్ లాల్ కుమారుడి లాగా అన్నమాట] అప్పటికే అవధులు దాటిన వర్ణాహంకారమూ, ’ఇస్లాం’లోని సమానత్వ ప్రచారము కూడా మత మార్పిడి పట్ల ప్రజల్ని ఆకర్శితుల్ని చేసింది.

’యధారాజా తధాప్రజ’ అని పెద్దలంటారు.

భగవద్గీతలోనూ

“యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే”


భావం – లోకంలో ఉత్తములైన వారు దేనిని అనుసరిస్తారో జనులందరు దానినే అనుసరిస్తారు. ఉత్తములైన వారు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో ప్రజలందరు దానినే అనుసరిస్తారు.

ఇలా మతం మారిన వారికీ, మారని వారికీ కూడా ముస్లిం రాజులే నాయకులు లేదా శ్రేష్ఠులు. కాబట్టి ఆయా ముస్లిం రాజుల్లోనూ, వారి బంధుగణంలోనూ ఉన్న అవధుల్లేని అధికారం, సుఖాభిలాష [సుఖం పట్ల వెంపర్లాట], అంటే బలహీనుడిపై అధికారం చలాయించటం, మద్యమాంసాది విలాసవంతమైన ఆహార విహారాలు, శృంగారం సమాజాన్ని ప్రభావితం చేసింది.[ ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తునే ఉన్నారు] మతం మారినప్పుడు నమ్మకాలు మారతాయి, సడలతాయి. కొన్ని వెసులుబాట్లు కూడా వస్తాయి. [ఒకరికి నలుగుర్ని వివాహం చేసుకోవటం చట్టబద్దత అయినట్లు, మూడక్షరాల మాటని మూడు సార్లంటే చాలు, భార్యకి ఉద్వాసన చెప్పగలిగినట్లూ, 16 ఏళ్ళు పెంచి పిల్లల్ని తండ్రికి అప్పగించాలంటే సరి, స్త్రీ తన చావు ఛస్తుంది, ఈ విధంగా స్త్రీని శారీరకంగా, మానసికంగా వాడుకోగలిగినట్లు] అంతేకాదు పాపపుణ్యాలు, రౌరవాది నరకాలు, వైతరణీ దండనలు, భాగవతాలు చెప్పే నరక శిక్షలూ, మనం చేసిన పాపం మన పిల్లల్ని తరతరాలని కట్టికుడుపుతుంది, చేసుకున్న పుణ్యం రేపు మన పిల్లలకి అక్కర కొస్తుంది, చేసికున్న మంచీ చెడులే వెంటవస్తాయి – ఇలాంటి నమ్మకాల మీద ఆధారపడిన కట్టడి సడలిపోయింది. ఏంచేసినా ఫర్వాలేదు, సాక్ష్యం ఉండకపోతే సరి, న్యాయస్థానం ఏం చేయలేదు – ఇలాంటి నమ్మకాలు సుఖాభిలాషని మరింత పెంచాయి.

కుట్రలో ఇక్కడ ఇంకొక కోణం చెప్తాను. స్వాతంత్రం తరువాత కూడా కుట్రదారులు నిదానంగా, వ్యవస్థీకృతంగా మంచి చేసేవారికి అన్యాయం జరిగేటట్లు చేస్తూ, చెడు చేసేవారికి అన్ని కలిసివచ్చేటట్లు చూస్తూ ప్రతీ ఒక్కరు “న్యాయం ఎక్కడ ఉంది, అంతా అన్యాయానికే నడుస్తున్న రోజులు” అనేటట్లు మొదలుపెట్టించి, చివరికి మనం కూడా మనకి అందుబాటులో అన్యాయం చేస్తేనే బ్రతకగలం అనే పరిస్థితి కల్పిస్తూ, దానికి ’లౌక్యం’ అనే పాజిటివ్ కాప్షన్ పెట్టారు. ఆ విధంగానే సమాజాన్ని ఈ స్థితికి దిగజార్చారు.

ఈ అవధుల్లేని సుఖాభిలాష, పనిచేసే తత్త్వాన్ని తగ్గించింది. స్త్రీలనీ, సంపదనీ తమ కంటే బలహీనుల నుండి బలంతోనూ అధికారంతోనూ గుంజుకునే మనస్తత్త్వం పెరిగింది. ఏం చేసినా రాజు, రాజోద్యోగుల దయ మన మీద ఉంటే చాలు. అందుకోసం మనం గుంజుకున్న సంపదలలో, స్త్రీల లోనూ కొంత రాజుకూ, రాజోద్యోగులకూ సమర్పించుకుంటే చాలు, భద్రత వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ముస్లిం రాజులకి గుడిగోపురాల కట్టేపని లేదు. దైవం పట్ల భయం భక్తీ కలిగించే ఏ కార్యక్రమాలు చేపట్టే పని లేదు, దాన ధర్మాలూ లేవు. ’తమ ప్రియురాళ్ళకీ తమకీ భవంతులూ, సమాధులూ కట్టించుకోవటంతో వాళ్ళు చాలా బిజీ. తాము చచ్చాకా కూడా తమ సమాధులు చిరస్థాయిగా మిగిలిపోవాలనుకొనే పదార్ధవాదులకీ, ’చచ్చాక ఎంతటి రాజు దేహమైనా పిడికెడు బూడిదే – మిగిలేది ఏదీ లేదు, చేసుకొన్న మంచితప్ప’ అనుకొనే భావవాదం అర్థం కావటం – అసంభవం కదా! [ఇక్కడనేను భారతీయ ముస్లింల్లోనూ, క్త్రెస్తవుల్లోనూ మరణానంతరం తమ బంధువుల పార్ధివ శరీరాన్ని ఖననం చేసే ఆచారాన్ని విమర్శించడం లేదు. మరణించిన మన వారికి మనం అర్పించే ఈ నివాళిని నేను గౌరవిస్తాను. అయితే 6x3 అడుగుల సమాధిపైన ఎంతో సొమ్ము[ప్రజల సొమ్ము] పెట్టి కట్టిన హూమాయూన్ టూంబులకీ, ప్రఖ్యాత తాజ్ మహళ్ళకీ [ఆగ్రా, జౌరంగబాద్ లోనివి] వెనుక ఉన్న పదార్ధవాద మూలాల్ని చూపటమే నా ఉద్దేశం.]

అలాంటి సమాజంలో సంపదకీ, స్త్రీలకి రక్షణ ఎక్కడ? ఒక్కసారి ఊహించండి – మనకి ఓ చిన్న కుమార్తె ఉందనుకొండి. ఇక ప్రశాంతంగా నిద్రపోవడం కరువే. ఇక ఆమె యుక్త వయస్సుకి వస్తే? ఓ రోజు ఓ బలమైన వాడో, వస్తాదు లాంటి వాడో వచ్చి అమాంతం మనల్నీ ఓ తోపు తోసి, అప్పటికీ అడ్డం వస్తే కత్తితోనో, బాకుతోనో పొడిచి మరీ, మన బిడ్డని లాక్కుపోతాడు. ఇక ఆ పిల్లని రాజుకో, రాజోద్యోగికో ఆమె శరీరాన్ని, సేవల్ని వాడుకొనేందుకు బహుమతిగా బహు శ్రద్దావినయాలతో సమర్పిస్తాడు. ప్రతిఫలంగా ఓ ఉద్యోగాన్ని లేదా మరో ప్రయోజనమో పొందుతాడు. తాను ఉద్యోగి అయితే తర్వాత ఎటూ తనకి బహుమతులు తెచ్చేందుకు మరికొందరు వస్తాదులు తయారౌతారు కదా! ఇలాంటి స్థితిలో ఓ సామాన్యుడు ఎలా తన జీవితాన్ని, ప్రాణాల్ని, తమ ఆడవారి గౌరవాన్ని కాపాడుకోగలడు? మనిషి మాన ప్రాణాలకి లేని రక్షణ సంపదకో, విలువైన లోహాలకో ఎలా ఉంటుంది? ఈ స్థితి నిజాం పాలనలో తెలంగాణా ప్రజల గుండెల్లో ఇంకా పచ్చిగా ఉన్న గాయమే. [కొంతమంది వాదించవచ్చు ‘అప్పడంటే ప్రజస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజస్వామ్యం పటిష్ఠస్థితిలో ఉంది, కాబట్టి అలాంటి సంఘటనలు జరగవు’ అని. కాని బీహార్ లోనో, యు.పి.లోనో ఈ పరిస్థితి ఇప్పటికే ఉంది. ఒక ఐ.ఏ.యస్. అధికారి భార్య మార్కెట్ కు వెళ్ళినప్పుడు అక్కడి మాఫియా డాన్ కమ్ రాజకీయ నాయకుడు ఆమె నచ్చి, ఆమెను బలవంతగా ఎత్తుకెళ్ళిపోయాడు. పాపం ఆ ఐ.ఏ.యస్. అధికారికి మాత్రం న్యాయం జరగలేదు. తరువాత ఏం జరిగింది మీడియా ప్రచారించలేదు. మరి ప్రజస్వామ్యంలో ఏంన్యాయం జరుగుతున్నట్లు? ]

ఇలాంటి స్థితిలో, పరిపాలనా ఉండదు, పాలనా యత్రాంగమూ ఉండదు. ముస్లిం రాజులు, రాజు బంధువులు, రాజోద్యోగులూ, వారి మద్ధతుదారులూ, మరికొందరు ధనబలవంతులూ, ఏదైనా చేయగలిగే వారు. ఏది చేయాలనుకొంటే అది. దైవ భయం లేనప్పుడు చట్టం తమ చుట్టం అనుకొన్నప్పుడు ఇది సంభవమే కదా! ఇక ప్రజాజీవితంలో భద్రతా లేదు, శాంతీ లేదు.
జౌరంగజేబు హయాంలో మహారాష్ట్రాతో పాటు చాలా ప్రదేశాల్లో ఉన్న స్థితి ఇదే. ఇలాంటి నేపధ్యంలోంచే శివాజీ మానవత్వాన్ని, విలువల్నీ నిలబెట్టటానికి తలెత్తాడు.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

8 comments:

ఏ కాలంలోనైనా ఎక్కడైనా ఇంటికి దీపం ఇల్లాలు అని మరోసారి గుర్తుచేసారు.

నా అభిప్రాయం ప్రకారం స్త్రీ కుటుంబ వ్యవహారాలు మరియు పిల్లల బాగోగులకే అధిక సమయం కేటాయిస్తేనే ఆ పిల్లల ఎదుగుదల పరిపుష్ఠంగా ఉంటుంది, ప్రస్తుత కాలంలో స్త్రీని వంటింటి కుందేలు చేయడానికే ఇలాంటి కుటుంబ వ్యవస్త రూపొందించారనే వాదన ఉంది కాని దీనికె నేను వ్యతిరేకిని(తప్పనిసరి పరిస్తితుల్లో వేరే విషయం).
దీనిపై మీ అభిప్రాయం?

ఎందుకో ఈ సారి అక్బర్ విషయంలో ఏకీభవించలేకపోతున్నాను. ఒకసారి కింద ఇచ్చిన లింకు చదవండి.
http://theuntoldhistory.blogspot.com/search/label/అక్బర్

కన్నాగారూ,

ఈ విషయాన్ని నేను విశదంగా నా ఆంగ్ల బ్లాగు Coups On World లో చర్చించానండీ. తెలుగులో తరువాతి టపాల్లో వివరిస్తాను.

ప్రదీప్!

’ఏది నిజం’ బ్లాగులోని అక్బరు గురించిన వ్యాసాలు ఇంతకుముందు కొన్ని చూశాను. ఇప్పుడు కొన్ని చదివాను. ఆ బ్లాగులో నిజంగా మనకి తెలియని ఎన్నో నిజాలున్నాయి. చిన్నప్పుడు బుద్ధిగా చరిత్రపాఠాల్లో బట్టీవేసిన వందలాది అబద్దాల సుడిగుండంలో పడిన మనకి తెలియని ఎన్నో నిజాలున్నాయి.

నిజంగా భయంకరమైన స్థితి ఏమిటంటే – ‘చరిత్ర’ అన్న విషయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీని విషాదకరస్థితి మనది. గొంగట్లో అన్నం తింటూ గొర్రె వెంట్రుకలు ఏరుతున్నట్లుంది మన స్థితి. ఈ రోజు కొందరన్నా కష్టపడి నిజాలు వెలికి తీసి చెబితే గుడ్లుతేలేసే వాళ్ళం కొందరం, వ్యతిరేకించే వాళ్ళు మరికాస్త ఎక్కువే ఉన్నారు. ఇక విమర్శించే వాళ్ళకూ, ఏం ఉపయోగమంటూ పెదవి విరిచి, నిజం తమకి అవసరమే లేదు అని నిరుత్సాహ పరిచే వారికి కొదవే లేదు.

నిజానికి నేను చరిత్రని అంతలోతుగా స్పృశించట్లేదు. జన బాహూళ్యంలో ఏది అమిత ప్రచారం చేయబడిందో, సామాన్యుడికి ఏ చరిత్ర తెలియచేయబడిందో, అందులోంచే కుట్రకోణాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అక్బరు గురించి నాకూ సందేహమే, అయితే ఆధారం లేదు. శ్రీరాముడిలో లోపాలెంచడమే పనిగా పెట్టుకున్న పదివేల రంగనాయకమ్మలూ, దాన్ని బహుళ ప్రచారించిన మీడియా కింగ్ లూ అక్బరుని, జౌరంగజేబునీ పరమ ఉదాత్తులనీ, పర్ ఫెక్టు కింగ్ లనీ చెప్పరనుకోవటం కేవలం అమాయకత్వమే. నీ సవరణని నేను ఒప్పుకుంటాను. నేను మాత్రం చరిత్రని అంతలోతుగా స్పృశించట్లేదు. జన బాహూళ్యంలో ఏది అమిత ప్రచారం చేయబడిందో, సామాన్యుడికి ఏ చరిత్ర తెలియచేయబడిందో, అందులోంచే కుట్రకోణాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
************

Adi Lakshmi గారు,

Excellent post. People who read the Marxists adulterated Indian history under Nehru can not understand many issue that you are writing.

Several generations of Indians (before Internet age) were intoxicated with false history manufactured by Marxists. Romila Thapar was one of the king pin of such Marxist cabal.

Keep up the good work. Please read the book written by Arun Shourie (EMINENT HISTORIANS:
Their Technology, Their Line, Their Fraud)

http://www.indiastar.com/wallia19.html
http://sify.com/news/fullstory.php?id=14514872

akbar is not such a good ruler. many pseudosecular leaders say that akbar encouraged hindu-muslim friendship by marrying hindu women. Here is a question for them. How many daughters or women did akbar gave to hindus in return for their friendship????
the answer is a big zero. not only akbar, all muslim rulers married hindu women, but never gave their women in return. i think in friendship is a two-way road. if it is a one-way road, it is called dictatorship.
wake-up from illusion of akbar's attempts for hindu friendship.
many of the facts you mentioned are true mainly about confiscating of women. i think that is the reason why we have child marriages untill recently. i don't remember child marriages in 12th centuary.

నేను కూడా అక్బర్ గురించి ప్రదీప్ చెప్పిన విషయాన్ని చెబుదాం అనుకొన్నా

ఇస్లాం – కొన్ని నిజాలు గారూ,


నిజంగా మీ బ్లాగులో చాలా విలువైన సమాచారం ఉందండి. మహమ్మద్ ప్రవక్త గురించీ, వయో బేధం ఉన్న విధవ మహిళతో అతడి వివాహం గురించీ, ఇతర విశేషాలు కొన్ని ఇంతకు ముందే చదివి ఉన్నాను. కానీ మీ బ్లాగులో నాకు మరింత సమగ్రంగా తెలుసుకున్నట్లనిపించింది. నిజం చెప్పాల్సి వస్తే – ఇస్లాం మతస్థుల్లో చాలా మందికి, ముఖ్యంగా మనదేశంలో ఉన్న ముస్లింలకి అసలు తమ మతం ఏంచెబుతుందో, తమ ప్రవక్త జీవిత విశేషాలేమిటో, ఆకాశం నుండి రంజాన్ మాసంలో భూమికి దిగివచ్చిన తమ మత గ్రంధం ’ఖురాన్’లో ఏంవ్రాసి ఉందో తెలియదేమోనని నా అనుమానం. వాళ్ళకి తెలిసిందల్లా హిందూ మతాన్ని వ్యతిరేకించడం, ద్వేషించడమే ననుకుంటా.

ఇంకా చెప్పాల్సి వస్తే ఈ స్థితి మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా అంతేనేమో! ప్రపంచవ్యాప్తంగా ’ముస్లింలు’ తామున్న ప్రదేశంలో ఏది ప్రధాన మతమైతే, ఆ మతాన్ని వ్యతిరేకించడం, ద్వేషించడమే తమ మతంగా పాటిస్తారనుకొంటా. అంటే ఇండియాలో హిందూ మతాన్ని, టిబెట్,ఇండోనేషియా, చైనాలలో బౌద్ధమతాన్ని ..... మరో దేశంలో క్రైస్తవాన్ని ...... ఇలాగన్న మాట. ఇలా వ్యతిరేకించమనీ, ద్వేషించమనీ వాళ్ళ మత సంస్థలే చెబుతాయి.

ఇక – హఠాత్తుగా ఆవిర్భవించిన ఇజ్రాయేల్ దేశం, రాత్రికి రాత్రి దాన్ని గుర్తించిన బ్రిటన్, మొత్తం వ్యవహారంలో ప్రముఖ పాత్ర వహించిన అమెరికా, వీటన్నిటి వెనుకా మీరన్నట్లు మనకి అర్ధంకాని చాలా వ్యూహాలున్నాయి. ఇజ్రాయేల్ Vs పాలస్తీనా గొడవలు, West Asia Peace అన్నది మాత్రం – ప్రపంచ ప్రజల దృష్టిని నిరంతరం హైజాక్ చేయగల అంశం. ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో, మనకి తెలిసినవి కొన్నే. ఏమైనా గడిచిన చరిత్రలోనే కాదు, నడుస్తోన్న చరిత్రలో కూడా మనకి తెలిసింది కొంతే, తెలియాల్సింది కొండంత. ఏమంటారు?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu