ముందుగా ఓ కథవ్రాసి ..... ఉహూ ఎప్పుడూ కథలేనా? ఈ సారి టామ్ & జెర్రీ కార్టూన్ల సిరీస్ లోంచి ఓ ఎపిసోడ్ వ్రాసి దాని అనువర్తనతో నా బ్లాగ్ చుట్టాలని అలరించాలని ఇది వ్రాస్తున్నానండి.


ఓ సారి టామ్ యజమానురాలు టామ్ గాడి మీద ఒళ్ళుమండి ఇంట్లోంచి వాణ్ణి బయటికి గెంటేస్తుంది. వీధిలోని చెత్తకుండీ ప్రక్కన దోమల్ని తోలుకుంటూ టామ్ గాడు చింతిస్తూ ఉంటాడు.


జెర్రీగాడు చాలా ఆనందంగా గెంతులేస్తూ తన కలుగుకి To-let బోర్డు పెట్టేసి, టామ్ గాడి పరుపు చింపేసి చాలా మజా చేసుకుంటాడు. కానీ కొన్ని రోజులకి టామ్ గాడు, వాడితో ఛేజింగ్ లేక జర్రీగాడికి జీవితం బోర్కొట్టేస్తుంది.


దానితో ఓ తెల్ల కర్చిఫ్ తీసికొని టామ్ గాడికి సంధి సిగ్నల్ ఇచ్చి, వాడితో ఓ ఒప్పందానికి వస్తాడు. దాని ప్రకారం జర్రీగాడు ఇంటి యజమానురాలిని నానా గొడవా పెడతాడు. దాంతో భయపడిపోయిన యజమానురాలు కెవ్వున కేకలు పెట్టి టామ్ గాణ్ణి పిలుస్తుంది. ఆ ప్రక్కనే నక్కి అందుకోసమే ఎదురు చుస్తున్న టామ్ గాడు వెంటనే రంగప్రవేశం చేసి జర్రీగాడి పనిపడుతున్నట్లు నాటకం మొదలు పెడతాడు.


ఇక ఇద్దరూ కలిసి ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు, ఛేజ్ చేసుకున్నట్లుగా నటిస్తూ ఇల్లంతా గిరికీలు కొడతారు. అందులో భాగంగా ఫిజ్జ్ లో దూరి ఓప్రక్క అన్నీతింటూ, మరోప్రక్క ఒకరి గొంతు మరొకరు పిసుకుతున్నట్లు నటిస్తారు. అల్మారాలో దూరి ఓ ప్రక్క సంగీత పరికరాలు వాయిస్తూ మజా చేసుకుంటూ మరో ప్రక్క జర్రీగాడు తన గొంతు పిసుకుతున్నట్లు నాలుక బయటపెట్టి మరీ నటించేస్తాడు టామ్ గాడు.


[చివరకి జర్రీగాణ్ణి చంపేసినట్లు నటించి యజమానురాలి దగ్గర క్రెడిట్ కొట్టేసి, మళ్ళీ ఇంట్లో పాగా వేస్తాడు. ఆవిడ పెట్టిన తిండిలో వాటాకొచ్చిన జర్రీగాణ్ణి తన్ని తగలేస్తాడు. మళ్ళీ వాళ్ళ మధ్య ఛేజింగ్ మొదలు.]


కొసమెరుపు: ఈ మొత్తం జరుగుతున్న మోసం యజమానురాలికి మాత్రం తెలీదు. యజమానురాలు నిజంగా టామ్ గాడు జెర్రీని చంపిందనే అనుకొంటుంది.


ఇది మనమంతా పిల్లలతో కలిసి చూసి ఎంతో ఆనందంగా నవ్వుకొనే కార్టూన్. అయితే ఈ కార్టూన్లలో ఎంతగానో మానవ మనస్తత్త్వ చిత్రణ ఉండటం విశేషం.


అంత చక్కని టామ్ & జర్రీలతో వై.ఎస్.నీ, రామోజీ రావుని పోల్చకోడదు. కానీ పై ఎపిసోడ్ లోని టామ్ & జర్రీల యాక్షన్ డ్రామాతో మాత్రం, ఈనాడుసాక్షిల యుద్దాన్ని, రాజరామోజీల యుద్దాన్ని పోల్చవచ్చు.


మరో చక్కని పోలిక చెప్పాలంటే .....మొన్నా మధ్య వచ్చిన ప్రభాస్ సినిమా మున్నామీకు గుర్తుండే ఉంటుంది.


అందులో ఖాఖా[ప్రకాష్ రాజ్ వేసిన పాత్ర] తనకు ప్రత్యర్ధిగా తన అనుచరుడు ఆత్మ [సోనూసూద్ వేసిన పాత్ర] ని నిలబెడతాడు. తనకి వ్యతిరేకంగా ఏది జరిగినా, ఎవరు నడిచినా అది ఆత్మకు లింకప్ అయ్యేలా ప్రణాళిక వేస్తాడు ఖాఖా.


అలాంటిదే ఈ రాజరామోజీల యుద్దపు నాటకం.


ఇందుకు మరికొన్ని తార్కాణాలు, దృష్టాంతాలు పరిశీలించండి.


1]. 1980 వ దశకంలో పొలిటికల్ ఎన్ కౌంటర్పక్షపత్రిక తనకు వ్యతిరేకంగా వ్రాస్తోందని ఆ పత్రిక ఎడిటర్ పింగళి దశరధ రామ్ ని హత్య చేయించాడు రామోజీ రావు అని అప్పట్లో జనాలు చెప్పుకోవడం విన్నాం. ఆ హత్యజరిగిన తీరుని 80 వ దశకంలో వచ్చిన రాజకీయ సినిమా మండలాధీశుడులో చిత్రించారు కూడా. [నాకు గుర్తుండి ఆ పాత్రని విజయచందర్ నటించాడు]


2]. ఆ తర్వాత సుప్రభాతంఅన్న పక్షపత్రిక పెట్టిన విఙ్ఞాన్ లావు రత్తయ్యని, రామోజీ రావు తన ఆఫీసుకి పిలిపించుకొని మరీ వార్నింగ్ఇచ్చాడని నా మిత్రులైన కొందరు జర్నలిస్టులు చెప్పగా విన్నాను. ఆ తర్వాత సుప్రభాతం మూలనపడింది.


3]. ఆపైన 1992 లో తనకుపోటిగా ఉందన్న ఉదయంపత్రిక ఆర్ధిక మూలాలు దెబ్బతీయటానికీ రామోజీ రావు దూబగుంట్లసారా వ్యతిరేక ఉద్యమం లేపాడని మొన్నామధ్య సాక్షి వ్రాయగా చదివాము.

అంత బలమైన మీడియా కింగ్, పొలిటికల్ కింగ్ మేకర్ అయిన రామోజీ రావుకి ఇప్పుడు ఈ రాజశేఖరుడు కొరకరాని కొయ్య అయ్యాడనటం ఓ పెద్ద డ్రామా. అంతసీన్ ఇతడికి లేదు.


ఏ ఆధారంతో అలా అంటున్నానంటారేమో, మరి కొన్ని తార్కాణాలు, దృష్టాంతాలు చూడండి.


1]. 1990 ల్లో ఘటకేసర్ దగ్గర ప్రయాణికుల రైలు భోగీలు తగల బెట్టిన సంఘటన వెనక, జంట నగరాల్లో జరిగిన అల్లర్ల వెనుకా రాజశేఖరుడి హస్తం ఉందనీ, చెన్నారెడ్డి తరువాత ఇతడు ముఖ్యమంత్రి అవుతాడనీ అప్పట్లో అనుకొన్నారు. [1990 లో అక్టోబరో, నవంబరో నెల గుర్తులేదు కానీ ఓ నెలలో ఆదివారాలు, పండుగల తర్వాత సమ్మెలూ, బంద్ లూ పోను కేవలం ఆరు రోజులు పనిదినాలైనాయి] అయితే అక్కడా అతడి అదృష్టం అతణ్ణి వెక్కిరించి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.


2]. 1992 లో ఈ రాజశేఖరుడికి పులివెందులలోని ఓ ఎస్.ఐ. కూడా తలనొప్పి పెట్టించగలిగి ఉన్నాడు. అతణ్ణి ట్రాన్స్ ఫర్ చేయమని ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి పెషీ కి ఇతడు ఫోన్ల మీద ఫోన్లు చేయటం నేను స్వయంగా చూశాను. పూర్తి వివరాలకూ FIRE POT [The Episode of YS Raja Sekhara Reddy] చూడండి.


3]. రాజకీయాల్లో రాజశేఖరుడు కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండీ జిల్లాలో తప్ప రాష్ట్రంలో రాణించింది చాలా తక్కువ. అలాంటిది 1998 లో కేంద్రంలో నాగమ్మ రాజకీయ కెరియర్ ప్రారంభించిన తర్వాత ఇతడి కెరియర్ గ్రాఫ్ పైకి సాగి చివరికి ఏకంగా 5సంII నిండుగా సీట్లో కూర్చోగలిగిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగలిగాడు. [క్రిస్టియన్ అయిన కారణంగా ఇతడిపై అమ్మదయ కలిగింది అన్నది కేవలం పైకారణం మాత్రమే]


4]. 2004 లో అధికారానికి రాకముందు ఈ రాజశేఖరుడు బ్యాంకులకు సైతం అప్పులు పడ్డాడనీ, ఇప్పడింత ఆస్థిపాస్థులెక్కడివనీ విమర్శలు వెల్లువెత్తగా అందరం చదివిందే. అంటే ఆర్ధికంగా కూడా అధికారంలోకి రాక ముందు అంత బలంగా ఏమీ లేడు. మరి ఇంతలోనే ఎవరి అండా, ఆశీర్వచనాలు లేకుండానే ఇడుపుల పాయల్లాంటి ఎస్టేట్లూ, సాక్షి పేపర్లూ, సూర్యవాటాలూ, సిమెంట్ కంపెనీలు వగైరా వగైరా వస్తాయా?


5]. 2003 లో ఇతడు పాదయాత్రలు చేసినప్పుడు ఇతడికి శతృవుగా చిత్రించబడుతున్న రామోజీ రావు ఇతడెంతగా భుజాలపై మోసాడో అప్పటి ఈనాడు తిరగేస్తే తేటతెల్లమవుతుంది.


6]. ఇడుపుల పాయ భూమి కుంభకోణం ఈరోజు జరిగింది కాదు. అధికారంలోకి రాకముందు దశాబ్ధాల క్రితం జరిగింది. పాదయాత్ర జరిపేటప్పుడు ఈనాడు రామోజీరావు కి వై.ఎస్. చరిత్ర తెలియదా?


7]. అంతెందుకూ! మొన్న జడ్పీటిసీ ఎన్నికల్లో ఓటమి [3 కాంగ్రెస్, 3 తెదేపా, ఒకటి ప్రరాపా గెలిచాయి] పొందినందుకు వై.ఎస్. కల చెదిరింది అన్న శీర్షికన ఈనాడు న్యూస్ చదవండి. శీర్షిక మాత్రమే వై.ఎస్.కి నష్టం జరిగిందని ఉంటుంది. లోపల వార్త అంతా అతడికున్న రాజకీయ పట్టునీ, ఇద్దరు మంత్రుల్నీ గంటలో పీకిపారేయ గలిగిన సమర్ధుడనీ ఊదర బెడుతూ వ్రాసి ఉంటుంది. ఆ ఒక్క రోజే కాదు, ఏ రోజైనా అంతే. సీనియర్లు తెలంగాణా గోల నేపధ్యమైనా అంతర్లీనంగా వై.ఎస్.కి ఢిల్లీలో అధిష్టాన నాగమ్మ దగ్గర ఎంత హవా నడుస్తుందో బిల్డప్ఉంటుంది.


పైకి మాత్రం ఈనాడుసాక్షి , రాజరామోజీలు తెగకొట్టుకుంటారు.


నిజానికి .....


ఇప్పుడు ఇంత సామర్ధ్యం, చాణక్యం, రాజకీయ చాతుర్యం గట్రా గట్రా చూపిస్తున్న ఈరాజశేఖరుడు 2004 కు ముందు ఇంకా చెప్పాలంటే 1998 కి ముందు మరింత ఖచ్చితంగా చెప్పాలంటే 1992 కి ముందు అంత అల్లాడాడెందుకు?


ఎవరి ఆశీర్వాదం లేకా?


ఇప్పుడెవరి అండ దొరికి ఇంత కండ?


చివరిగా .......


ఇప్పుడు ఈ సత్యం కంప్యూటర్స్ఎపిసోడ్ విషయంలోనూ అంతే! ఇదే డ్రామా!


కొన్నిరోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సమాచారం సత్యం కంప్యూటర్స్ తెలుసుకొని బయటికి చేరేసిందని వార్తలు బయటికి పొక్కాయి. తదనంతర పరిణామాల్లో ఆ విషయం తొక్కివేయబడింది. వేరే పైకారణాలతో 8 ఏళ్ళ నిషేధం విధిస్తున్నామనీ ప్రపంచబ్యాంకు ప్రకటించింది. తదుపరి వేగంగా సంభవించిన పరిణామాల్లో సత్యం కుప్పకూలింది. రామలింగరాజు అరెస్టయ్యాడు.


ప్రపంచ బ్యాంకు రహస్యాలు రామలింగరాజు దొంగిలించి ఉంటే, దొంగిలించి ఏం చేసుకుంటాడు? అదేమన్నా జిలేబియా కూర్చోని తినడానికి? ఎవరికో ఒకరికి అమ్ముకునేందుకే గదా! అమ్మాలంటే కొనే వాళ్ళెవరో ఉండాలి గదా! [ఈ ఆర్దిక నేరాలకి కూడా హైదరాబాదే కేంద్రం కావడం కేవలం యాదృచ్చకమా?]


ఇక్కడ రామలింగరాజుని బలి గొర్రెని చేయటం మరెంకెవ్వరినో కాపాడటానికే? ఆతడు స్వయంగా నేరం ఒప్పుకోవడం కూడా అందులో భాగమే!


ఇదెలాంటిదంటే.......


ఉదాహరణకి A నుండి Z దాకా ఒకదానికొకటి అంతర్గత సంబంధాలున్న సంస్థలో, జంక్షన్లో ఉన్నాయనుకొండి. Z కి నిప్పంటుకుంది. అది Y,X,W లని తగలెట్టి వరుసగా మండుకొస్తోంది. ఆ మంట F నుండి E కి అంటుకొనే లోగా ఓ డ్రమ్ము నీళ్ళూ కుమ్మరించారనుకొండి. A నుండి E దాకా ఉన్న సంస్థలు లేదా జంక్షన్లు కాపాడబడతాయి.


ఆప్రయత్నమే ఈనాడు రోజురోజుకి సత్యం వార్తలకి పేజీలకి పేజీలు కేటాయించి మరీ చేస్తోంది.


అందులో భాగంగానే రామోజీ రావు సత్యం మంటని రాజశేఖరుడికి చుట్టే ప్రయత్నం చేస్తోన్నాడు. [అంటే ఈ రాజశేఖరుడు పత్తిగింజని కాదు. కానీ ఇతడే మెయిన్ కాదు అని నాఉద్దేశం. ఎంతైనా ఇతడు సబ్మాత్రమే. రాజశేఖరుడికి సంబంధించి డబ్బు’, రామోజీ రావుకి సంబంధించి ప్రపంచబ్యాంక్ రహస్యాలు. ఇది చెప్పగలిగేవాడు రామలింగరాజు అయ్యాడు ] అది వీలుగాక పోతే చంద్రబాబుకి చుట్టే ప్రయత్నం చేస్తాడు. అదీ వీలుగాకపోతే ఏ చిరంజీవికీ చుట్టినా మనం ఆశ్చర్యపోరాదు సుమా!


ముగించే ముందు మరో తమాషా........


మన బ్లాగు మిత్రుడు నిరంజన్ పులిపాటి గారు అన్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ కి జలుబే చేసిందో లేక గొంతే పోయిందో.


ఎక్కడ నేరం జరిగినా వాసన పట్టేసి అరిచేసే కుక్కగా తనను తానూ అభివర్ణించుకొన్న ఈ ఎం.పి. 2006 లో ఈనాడు రామోజీ రావు దేశద్రోహి అని వారం రోజులలో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన సాక్షాత్తూ ఈనాడు లోనే వచ్చింది. ఇప్పటికి రెండేళ్ళు దాటినా సదరు ఎం.పి. దృష్టిలో వారంకాలేదో లేక అతడి రిమోట్ ఎవరి కంట్రోలు లో ఉందో వారి నుండి అనుమతే రాలేదో గాని ఇప్పటికీ ఇతడు ఏ సాక్ష్యాలూ బయటపెట్టలేదు, ఏ దేశద్రోహన్నీ నిరూపించలేదు.


ఇంతకంటే ధ్రిల్లరు సినిమాని ఏ రాంగోపాల్ వర్మలూ, పూరీ జగన్నాధ్ లూ చూపించలేరు, ఒక్క రామోజీరావు తప్ప.తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!


**************

25 comments:

మీ ఎనలైజేషన్ బానే ఉంది. ఐతే, రాజు కూలిపోటానికి రామోజీనో లేక రాజశేఖరోనే కాక చంద్రబాబు హస్తం లేదంటారా? ఉండవల్లి లేవదీసిన అంశంలో నిజం లేదంటారా? రామోజీలో జనాలకి తెలియని కోణాలపై రాయటానికి ఇంటర్నెట్ చాలదు అని ఎక్కడో చదివా. ఏమైనా సచ్చిన గొఱ్ఱెల్ని ఇంకా చంపుతున్నారు. ఓ వైపు ఎకానమి స్లోడౌన్, ఇంకోవైపు ఏడువేలకోట్లు నల్లధనంలా మారిపోయింది. మూలిగేనక్కపై తాటికాయలా అయింది జనజీవితం.
ధన్యవాదాలు

ఆదిలక్ష్మి గారూ..
మీ బ్లాగులో నాకు తెలియని.. తప్పకుండా తెలుకోవాల్సిన అవసరం ఉన్నవి అయిన బోలెడు సంగతులు తెలుస్తున్నాయి.
మీరింత శ్రమ తీసుకుని నాలాంటి వారి కోసం ఇంత చక్కటి విశ్లేషణలు పోస్టు చేస్తున్నందుకు కృతజ్ఞతలు.
వీటన్నిటికీ మనమేమయినా సొల్యుషన్ చెప్పగలమా లేదా అన్నది పక్కనబెట్టి.. కనీసం చదువుకున్న అజ్ఞానుల్లాగా మిగిలిపోకుండా.. అసలేం జరుగుతుంది మన దేశంలో.. అని తెలుసుకోవడం కనీస కర్తవ్యం అని నేను భావిస్తున్నాను.
దేశం పట్ల మీకున్న నిబద్ధతకీ, మీ ఓపికకీ.. నిజంగా చాలా అచ్చెరువొందుతున్నాను.
keep posting..!
and YOU ARE REALLY... BORN TOUGH :)

ఎందుకిలా టైం వేస్ట్ చేసుకుంటారు, ఏవేవో ఉహాగానాలు చేస్తూ
ఏదన్నా పనికొచ్చే పని చెయ్యవచ్చు కదా.

It seems you are thinking everything negatively in the name of insight. looks like imaginative. I don't say whatever you are writing is wrong but I could say it neither true.

Worst analysis i have ever read ....

మొత్తానికి, రాజశేఖరుడు-రామోజీ ఒకటే కానీ మున్నా సినిమాలో ప్రకాష్‌రాజ్-సోనూసూద్, లేదా టామ్ & జెర్రీ ల్లా నాటకాలాడుతున్నారంటారు. దానివల్ల వాళ్లకొచ్చేదేమిటో కూడా వివరిస్తే మీ విశ్లేషణ మరింత బాగుంటుంది. అది చెప్పకుండా తోచినవేవేవో రాసేస్తే ఎలా?

After reading all the views, still I could not understand the point, you desire to tell. I liked the tom and jerry show and i hope that is the only entertaining part.

Good post. I agree with the content and the message there in. Keep up the good work.

ఒరెమూనా గారూ,
ఊహాగానాలను వ్రాయటానికి నేను బ్లాగు మొదలు పెట్టలేదండి. అంతేకాదు ఎవరూ ఊహాగానాలతో, ప్రధానమంత్రులకి, రాష్ట్రపతికీ, కేంద్రప్రభుత్వ కుర్చీవ్యక్తికి వ్రాయరు. ఊహాగానాలకి రాష్ట్రపతి, AICC ప్రధాన కార్యదర్శులు స్పందించరు గదా. పెద్దవాళ్ళతో పరిహాసాలు ఏ సామాన్యుడు ఆడడు కదా! ’సత్యం’ వ్యవహారంలో ఇంకా బయటపెట్టాల్సిన నిజాలు ఉండవచ్చుగానీ, రామోజీ రావు కుట్రల గురించి, అతడి ఏజంట్లే అయిన చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేంద్ర NDA ల , UPA ల గురించి సాక్ష్యాలతో సహా, తార్కిక నిరూపణలతోనూ, దృష్టాంతాలతో [అంటే జరిగిన, చారిత్రాత్మక సంఘటనలన్న మాట] సహా వివరంగా నా ఆంగ్ల బ్లాగు Coups On World లో పెట్టాను. మీకు ఓపికా, తీరికా, అవగాహనా ఉంటే పరిశీలించండి. పరిశీలించాక కూడా ఇవి ఊహా గానాలే అనిపిస్తే మీరు నాకుఇచ్చిన సలహానే నేను మీకు ఇస్తాను. అదేమిటంటే నా బ్లాగు చదవటం, దానిలో వ్యాఖ్య వ్రాయటం మానేసి పనికొచ్చే మరో పనేదైనా చేసుకొండి.

******************

Satya garu,


You said that my attitude is –ve and I’m presenting imaginatory. Before commenting on my character, it is appropriate act to refer my case which I presented with documentary evidence in my blog ‘Coups On World’. Without knowing the back ground, it won’t be nice to use pen – this is my opinion and the policy which I follow.


*****************

Anonymous gaaru,

You said that my analysis is worst. I think it will be more helpful to me if you analyze – how and why it was worst with logical representation. I request you to present your analysis to correct the mistakes in my analysis and to help me to extract the truth from the subject what I discussed. Anyway, thank you for the comment.

******************

అబ్రకదబ్ర గారూ,

నేను తోచినదెదో వ్రాయలేదండి. రాజశేఖర రెడ్డి వెనుకా, చంద్రబాబు నాయుడు వెనుక, NDA ప్రభుత్వం వెనుకా, UPA ప్రభుత్వం వెనుకా ఉన్నది రామోజీ రావే అని నిరూపించే అంటున్నాను. సాక్ష్యాలతో సహా నా ఆంగ్ల బ్లాగ్ Coups On World లో పెట్టాను. ఎటోచ్చీ మీకు అవి పరిశీలించేంత ఓపికా, తీరికా, అవగాహన, అవసరం. గతంలో ఓ సారి ’నకిలీ కణికుడు[రామోజీరావు ఆ ఏజన్సీ వాడేలెండి] ఎవరో మీకు తెలీదని అన్నారు. ఆ వివరాలన్నీ ఇంతకు ముందటి టపాల్లో విపులంగా ప్రచురించాను. అదేదీ అసలు పరిశీలించకుండానే నేను తోచినదేదో వ్రాస్తున్నానటం, మీకు తోచినట్లుగా వ్యాఖ్యనించడమౌతుందేమో?

*****************

alswy garu,

Our elders used to say as “We can learn something from anything, if we have the nature of learning.” I believe in this. With that view, I observe everything. In fact ‘Tom & Jerry’ is a part of entertainment, an undercurrent of human psychology is there. I afforded my level best, to explain the strategy behind the current issues by comparing the above said episode of Tom & Jerry.

*********

pseudosecular గారూ,

కృష్ణారావు జల్లిపల్లి గారిలో జనవరి 4 నుండి మార్పు రాలేదండి. జనవరి 1 వ తేది నుండే వచ్చింది. కొత్త సంవత్సరం రోజున గీతా సారాన్ని ఉటంకిస్తూ నేను వ్రాసిన టపాకి ఆయన ‘మరి ఇది 16 ఏళ్ళుగా ఎందుకు విస్మరించారూ’ అంటూ వ్యాఖ్యానించారు. దానికి నేను గీత మన కర్తవ్యాన్ని విస్మరించమనదండి, పోరాడమని చెబుతుందంటూ వివరణ ఇచ్చాను. దానికి ఆయన ప్రతిస్పందిస్తూ వ్రాసిన వ్యాఖ్యలోని భాష కూడా సంస్కార హీనంగా ఉండటంతో ఆ వ్యాఖ్యని ప్రచురించకుండా తిరస్కరించాను. ఆయన సంస్కారపు పరిమితి అర్ధమవ్వటంతో ఆ పిదప నేను స్పందించలేదు. ఆ ’సంస్కారం’ ఆయన మీ వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ వ్రాసిన వ్యాఖ్యలోనూ ప్రతిబింబిస్తోంది.

ఇక ఎందుకు అలాంటి వ్యాఖ్యని ప్రచురించానంటే - లోకో భిన్న రుచిః అన్నారు పెద్దలు. ప్రపంచంలోని వివిధ వ్యక్తులు ఎలా ఉంటారో తెలియటం మంచిదే కదా. ఈ సృష్టిలో ఇన్ని వైవిద్యాలున్నాయి కాబట్టే, ఇది ఇంత వర్ణభరితంగా, రసరంజితంగా ఉంది అని నా అభిప్రాయం. ‘ఇంత అద్భుతమైన సృష్టిలో మనల్నీ భాగం చేసినందుకు ఆ దేవుడికి కృతఙ్ఞతలు తెలుపుకొని, మంచిని గ్రహిస్తూ, చెడుని విస్మరిస్తూ ముందుకు పోవడమే మనిషిగా మనం చేయవలసింది’ అని నేను అనుకొంటాను. దాన్ని ఆచరించ ప్రయత్నిస్తాను. ఏదేమైనా మీరు నాకు ఇచ్చిన మానసిక మద్దతుకి మీకు మనస్పూర్తిగా నా కృతఙ్ఞతలు.

*************

ఆదిలక్ష్మి గారు,

నాకిచ్చిన మీ సమాధానం 'ఈ టపాలో రాసిన విషయానికి ఆధారాలు, వివరణలు వగైరా వెనకటి టపాల్లో ఉన్నాయి, అవన్నీ ఫాలో అయితేనే ఇది మీకర్ధమవుతుంది' అన్నట్లుగా ఉంది. మీ టపాలు చదివే వారందరూ పాతవన్నీ చదివుండాల్సిన అవసరం లేదు కదా. వాళ్లందరూ నాలాగే అనుకునే అవకాశముంది. కాబట్టి మీరు అసలు టపాలోనే దానికి సంబంధించిన నేపధ్యాన్ని, ఇతర వివరాలనూ క్లుప్తంగా రాయటమో, లేదా ఆ పాత టపాలకు లింకులు ఇవ్వటమో చేస్తే మాలాంటి వారు ఇలాంటి ప్రశ్నలేసే అవసరం రాదు.

>>నాకుఇచ్చిన సలహానే నేను మీకు ఇస్తాను. అదేమిటంటే నా బ్లాగు >>చదవటం, దానిలో వ్యాఖ్య వ్రాయటం మానేసి పనికొచ్చే మరో పనేదైనా >>చేసుకొండి.

Thanks.

That explains you.

అబ్రకదబ్ర గారూ,

మీరన్నది నిజమే. తరువాతి టపాల్లో అలా వివరించటానికి ప్రయత్నిస్తాను. మంచి సలహా ఇచ్చినందుకు కృతఙ్ఞతలు.

good work

Adi Lakshmi గారు,

It is just my observation.

As long as you write about person, party or entity that "they"* dislike, they are happy and stay away from commenting.

As soon as you write about a person, party or entity that "they" like, immediately they spring to life and comment -vely on you.

* here "they" means other bloggers who judge you by content but not by intent. And post -ve comments about you (personally).

pseudosecular garu,

Your observation is 100% correct.

Oremuna
your first comment speaks volumes about you, lets not claim undue moral high grounds.

keep writing.

Adi Lakshmi గారు,

In most of the cases, "Caste Hindus" have the following loyalties and limitations. In other words they can not think or imagine beyond a certain point.

1. Caste (Kamma, Reddy, Maala, Kapu, etc)
2. Political Party (Congress, BJP, etc)
3. Popular person like, Movie Hero or Political Leader (NTR, Sonia, Samuel Reddy, etc.)
4. Media Personality (Ramoji, N. Ram, etc)
5.

When you write about the truth, indirectly you are hurting the feelings and loyalties and limitations of Caste Hindus.

So they question your integrity.

Can any body save Caste Hindus? What you think? We need a missionary (foreigner) to rule us. We need a Missionary Samuel Reddy to manage our Temples.

ఆదిలక్ష్మి గారు, మీరు నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు అనేది ఈ పోస్ట్ కంటెస్ట్ లో మాత్రమే అన్నది. మీ క్యారెక్టర్ గురించి అన్న వ్యాఖ్య కాదు. sorry for giving such impression.
ఇంక మీరు ఇచ్చిన రిప్లయ్ ప్రకారం మీ దగ్గర రామోజీరావు కుట్రల గురించి, అతడి ఏజెంట్లుగా వై.యస్, చంద్రబాబు వ్యవహరించిన తీరు గురించి ఆధారాలు ఉండొచ్చు గాక, But how does those facts represents in this subject(SATYAM's case)? how much you are sure with the things that you presented here? then are these not imaginative? you are just supposing/assuming that since Ramoji, chandrababu and YSR had common interests in some other case, they can also may have in this issue also, which I felt as imaginative

"Without knowing the back ground, it won’t be nice to use pen – this is my opinion and the policy which I follow."

I hope here on it would be helpful if you give proper links to the facts/background that you wish people to know before penning. No offense

ఆదిలక్ష్మి గారు, చాలా మంచి వ్యాసము. ఇప్పుడే కాదు, ఎప్పటినుండో వీళ్ళిద్దరూ తోడు దొంగలని నా నమ్మకం. కేవలం ఒకే ఒక్క ప్రశ్న వేసుకుంటే జవాబు మనకే తెలుస్తుంది: రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్సు అధికారంలో ఉంది. ఏది చేయాలన్నా YSR కు అడ్డు లేదు. అయినా సరే అప్పుడపుడు 'అరెస్టు ' 'సోదా' అనడమే కానీ, ఇప్పటివరకు రామోజీ పైన చర్య తీసుకోలేదు. ఎందుకు?

కాకపోతే అర్థము కానిదల్లా - మరి అన్నేసి కోట్లు నష్టపోతూ YSR 'సాక్షి ' పత్రిక ఎందుకు పెట్టాడు? కేవలం తన దగ్గర ఉన్న వేల కోట్లను ఏమి చేయాలో తెలియకనా?

సంస్కార హీనంగా ఉండటంతో ఆ వ్యాఖ్యని ప్రచురించకుండా తిరస్కరించాను...
నాకు అంతగా చెక్క బజన చేయడం, డబ్బా కొట్టడం రాదు. ప్రచురించినా తిరస్కరించినా ఎవరకి ఏమి లాభం ఉండదు, అలాగే నష్టం, హాని ఉండవు. ... ఎందుకంటే ఈ బ్లాగు పూర్తిగా మీ స్వంతం, మీకు పూర్తీ hakkulu ఉన్నాయి. dammu ధైర్యం ఉన్నవారు prachiristaaru అవి లేని వారు yevo vankalu cheputuntaaru. ఇవి కేవలం బ్లాగులు. అందరూ వారి వారి ఆలోచనలని, భావాలని, స్పందనల్ని, వికరాలని, వైరాగ్యలాని velibuchee vedika మాత్రమే. ofcourse... 1992 taruvaata bharata mukh chitraane marchesina meelaanti వారికి నేను cheppetantadi vaadinaa... yedo నా picchi కాని.

అన్నీ conspiracy లే! అందరూ తోడుదొంగలే!

నిజం చెప్పారు క్రిష్ణారావ్ గారు, మీ కామెంట్లు ప్రచురించాలంటే కొంచెం దమ్ము, ధైర్యం కావాలి. బ్లాగు కామెంట్లలో "ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులు" అని సంభాషించే ఏకైక దమ్మున్న వ్యక్తి మన క్రిష్ణారావ్ గారికి...జై!
బైదవే, సంస్కారం అంటే చెక్క భజన, డబ్బా కొట్టటం అని మీరు ఏ వీకిపీడియా లో తెలుసుకున్నారు?

comnets nu prachurinchataani kaadu dhriyam undedhi, nijaalanu nirbhayamga cheppataniki.

1990 evaraina bharathadesam mariyu AP rajakeeyalu grahinche variki paina cheppinavanni konchem burra upayogishte suluvuga arhthamavuthundi.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu