కొందరు బ్లాగ్ మిత్రులు ఇచ్చిన వివరణలూ, సవరణలూ అంగీకరిస్తూ, మరికొందరు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు చెప్పాలని ఈ టపా వ్రాస్తున్నాను.

అక్బరూ, ఔరంగజేబుల చరిత్రలు లోతుగా పరిశీలిస్తే అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుంది. బహుశః ఔరంగ జేబుని ఎదుర్కొంటూ తలఎత్తిన శివాజీ కారణంగా అబద్దాలన్నీ చరిత్రగా ఏర్చీకూర్చిన కుట్రదారులకూ వారి మద్దతు దారులకూ ఔరంగజేబుని ’ఇంద్రుడు చంద్రుడు’ అనాలంటే మరీ పచ్చిగా అన్పించిందో లేక మరీ అతి అయితే పట్టుబడి పోతుందని భయంగా అన్పించిందో గానీ, కనీసం ఔరంగజేబుకి పరమత సహనం లేదనీ, హిందువుల పై జట్టుపన్ను విధించాడనీ పిల్లల చరిత్రపాఠాల్లో వ్రాసారు. అది మనం చదివి, బట్టిలేసి పరీక్షల్లో ప్రశ్నాజవాబులు వెలగబెట్టేం. హిందూ సామ్రాజ్యం స్థాపించిన శివాజీ లాంటి వ్యతిరేక శక్తి ఏదీ పని చేయలేదు కాబట్టి అక్బరుని ‘మహా గొప్ప ఉదారుడనీ, చదువుకోని పండితుడనీ’ ఆకాశాని కెత్తేసినట్లున్నారు.

ఏమైనా నా బ్లాగులో నేను ’రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర’ లో వివరిస్తున్న చరిత్ర – మనం పాఠశాల పాఠాల్లో చదువుకున్న చరిత్ర., సామాన్యుణ్ణి చేరిన చరిత్ర., ఏది చరిత్రగా నమ్మి మనం ఇప్పటి వరకూ చదివామో, పిల్లలకి బోధించామో ఆ చరిత్ర.! అంతకంటే లోతుగా వెళ్ళెందుకు సామాన్యులకి అవకాశం లేదు. లోతుగా చర్చించినా కూడా రుజువు చేస్తున్నది కుట్రనే కదా!

1994 , 1995 ల్లో ఈనాడు పత్రికలోనే చదివాను, సి.ఐ.ఏ. తన ఏజంట్లుగా, పైకి ఇతర వృత్తుల్లో అంటే టీచర్లుగానూ, డాక్టర్లుగానూ, రాజకీయనాయకుల గానూ, కళాకారుల గానూ, చరిత్రకారులు గానూ, మీడియాలోనూ, ప్రభుత్వ ఉద్యోగులగానూ, ఇలా రకరకాల వృత్తుల్లో [అప్పటి ఈనాడులో అయితే అన్ని వివరంగా వ్రాయబడ్డాయి.] ఉన్న వ్యక్తుల్ని ’అపాయింట్’ చేసుకొంటుందని. ఇప్పుడు మనం ఐ.ఎస్.ఐ. ఏజంట్లుగా, తీవ్రవాదులకి సిమ్ కార్డులూ, అద్దె ఇళ్ళు, వాహనాలూ, డబ్బూ సమకూర్చుతున్న వ్యక్తుల్ని, పైకి ఇతర వృత్తులు [ఇప్పుడు ఐ.టి. ఇంజనీర్లుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు] చేస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం కదా!

అలాంటప్పుడు మనకి తప్పుడు చరిత్ర అందించబడటం పెద్దవిషయం కాదు. ఇది నిజం కాదు అన్న ప్రొఫెసర్లు చివరికి చరిత్రపాఠాలు వ్రాసే కమిటీ నుండి తొలగించబడతారు, లేదా అదే నిజం అనేవరకూ వత్తిడి చేయబడతారు. ఏమైతేనేం అబద్దాన్నే నిజం అనే వరకూ అన్నీ పరిస్థితుల్నీ అనుకూలించుకోవటమే కుట్రదారుల పనితీరు. ’దీన్ని ప్రభుత్వం ఎందుకు ఎదుర్కోలేదు?’ అంటే – ఇప్పటి ప్రభుత్వాలు ఎటూ కుట్రదారుల అనుచరులవే గనుక ఇప్పుడా ప్రసక్తే లేదు. ఒకప్పుడు అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి, ఆ తదుపరి కొన్ని దశాబ్దాల వరకూ ఉన్న ప్రభుత్వాల ఏం చేసాయి అంటే – ఆకోణంలో కుట్ర జరుగుతుందని ఎందుకు అనుమానిస్తాం? 1962 లో చైనా యుద్ధంలో ఓడిపోయే వరకూ భారతదేశమ్మీద కుట్ర అనుశృతంగా జరుగుతోందని ఎవ్వరూ అనుమానించలేదు. ఆ తర్వాత కూడా ’విదేశీ హస్తాన్ని’ గుర్తించినా ఎక్కడి నుండి పనిచేస్తుందో తెలియలేదు. అలాంటప్పుడు అన్నిటిలాగే ’మామూలుగా’, చరిత్ర వక్రీకరణ కూడా జరిగిపోయింది.

కాబట్టే అమాయకంగా మనం చిన్నప్పటి నుండి మొఘలుల గొప్పదనాన్ని దండోరా వేసిన పాఠాల నడుమ, హిందూ సంస్కృతినీ, చరిత్రని హీనపరిచే విషవృక్షాల నీడన, ప్రచారాన్ని నమ్మితీరాల్సిన అగత్యాల నడుమ పెరిగాం. ఇప్పటికీ మన చిన్నపాపలకి అదే చరిత్ర పాఠాలు చెబుతున్నాం. ఇన్నాళ్ళు నమ్మిన దాన్ని అబద్దం అంటే నిజాన్ని స్వాగతించే వారు కొందరు. ఒప్పుకోలేక వ్యతిరేకించే వారు మరెందరో. అందుకే ఇప్పుడు మన బ్లాగ్లోకంలో ’ఏది నిజం’ అంటూ వ్రాసినా, సుదీర్ఘ కుట్ర ఇదని వ్రాసినా కొంతమందికి జీర్ణం కావడం లేదు.

ఇప్పుడీ గతమంతా ఎందుకు? అంటున్నారు కొందరు. టైం మెషీన్ లో వెనక్కి వెళ్ళి సరిచేయలేం కదా? - అంటారు కొందరు. ఇదంతా తవ్వుకొని ఏం ప్రయోజనం? – అంటారు మరికొందరు. ప్రయోజనం అంటే ఇన్ స్టంట్ ఫలితామా, లేక ఏంలాభం రూపాయల్లో అనో నాకు తెలియదు!

ప్రతీపనికి రూపాయల్లో ప్రతిఫలం ఉండనక్కరలేదు.

ప్రతీ పనికి ప్రత్యక్ష తక్షణ ఫలితం ఉండక్కర్లేదు.

జరిగిన దేమిటో, ఎక్కడ ఎలా మోసపోయామో తెలుసుకోవలసిన అవసరం లేదను కొంటే, వారికి ఎవ్వరు ఏమీ చెప్పలేము. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో తెలుసుకొంటే - ఈ రోజు ఏం జరుగుతుందో అర్ధం చేసుకోగలుగుతాం, రేపు ఏం జరుగుగలదో ఊహించగలుగుతాం.

అప్పుడు కనీసం మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

అందుకే చరిత్ర – నిజమైన చరిత్ర తెలుసుకోవటం మనకి అవసరం.

అందుకే అసలు చరిత్రనే ఎత్తిపారేయాలిని ప్రయత్నించారు కుట్రదారులు.

అందుకేనేమో చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నమూ కొంత చేయబోయి, కుదరక ప్రకటనలతోనే సరిపెట్టుకున్నాడు.

నిజానికి నా టపాలలో నేను చరిత్రని లోతుగా స్పృశించటం లేదు. ఎందుకంటే మనకి తెలిసిన చరిత్రలో నిజనిజాలు ఏపాటివో మనకే తెలీదు గనుక. సామాన్య పాఠశాల విద్యార్ధులుగా అందరం ఏం చదివామో, ఇప్పుడు ఏది చెప్పబడుతుందో, ఏ చరిత్ర, ప్రచారం సామాన్యులకి చేరిందో అందులో నుండే కుట్రకోణాల్ని విశ్లేషిస్తున్నాను. అక్బరు మంచివాడుగా చిత్రించబడిన చెడ్డవాడు కావటం, అతణ్ణి మంచివాడుగా మనం చదివి ఉండటం, నమ్మించబడటం కూడా కుట్రలో భాగాలే!

ఇక్కడ ఒక విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించదలుచుకున్నాను. చిన్నతనం నుండీ నమ్మి ఉన్నందునో, ఆ నమ్మకం తప్పని ఒప్పుకోవాలంటే నొప్పిగా ఉన్నందునో, లేక నిజం జీర్ణం కావడం కష్టమైనందునో, లేక జరిగిన ప్రచారమే హాయిగా నచ్చి ఉన్నందునో కానీ – కొందరికి అక్బరు చెడ్డవాడంటేనూ, అలెగ్జాండర్ అశోకుడి కంటే ఎలా గొప్పవాడంటేనూ కోపం వస్తోంది.

అలెగ్జాండరు కారణంగానే భారతదేశం ప్రపంచానికి తెలిసిందనే వాదనలూ చేస్తూన్నారు. బ్రిటీష్ వాళ్ళు పాలన మూలంగానే భారతదేశం అభివృద్ధి చెందిందనీ, చెందుతుందనీ, వాళ్ళు లేకపోతే ఇండియా సమైక్యంగా ఉండదనీ, చీలికలు పేలికలు అవుతుందనీ కాబట్టి స్వాతంత్రం అవసరం లేదనీ కొందరు స్వాతంత్ర సమరం రోజుల్లో వాదించారట. పై వాదన కూడా అలాంటిదే. బిల్ గేట్స్ కంటే బిన్ లాడెన్ కీ ఎక్కువ గుర్తింపు ఉందని ఓ సర్వే చెబుతుందనీ డైలీ టెలీగ్రాఫ్ పత్రిక వ్రాసిందనీ, ఈనాడు పత్రిక 30/10/2007 వ్రాసింది. మరిన్ని వివరాలకు Coups On World లోని Responsibility of Media గానీ, Fire Pot లో గానీ చూడగలరు. బిన్ లాడెన్ విధ్వంసకారి. అమెరికానే కాదుప్రపంచాన్ని ఇస్లాం మతంలోకి మారలనీ, అల్లాసామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నహింసోన్మాది. బిల్ గేట్స్ కంప్యూటర్ రంగాన్ని అభివృద్ది పరుస్తూ అనేక మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి, సమాచార వ్యవస్థని అభివృద్ది చేస్తూ నిర్మాణాత్మకమైన పనిచేసిన వ్యక్తి.

బిన్ లాడెన్ న్యూయార్క్ ల్లోని WTC ని కూలగొట్టిన విధ్వంసకర పనులు చేసినవాడు. నిర్మాణాత్మకమైన పనిచేసిన వాడికంటే విధ్వంసకారుడు గొప్పంటేనూ, ప్రజలకి మేలు చేసిన చక్రవర్తి[ఆశోకుడి కంటే] ప్రజల్నీ, రాజ్యాన్ని వదిలేసి ఇతర రాజ్యాల మీదకి దాడికి వచ్చిన వాణ్ణి, రాజుగా కంటే సైన్యాధిపతిగా చూసి మెచ్చాలంటేనూ ఏమనగలం? రేపెప్పడో బిన్ లాడెన్ ది గ్రేట్ అన్నా అనగలరు. “ఎంత సామర్ధ్యం, ఎంత వ్యూహరచనాపటిమ, ఎంత ఆర్గనైజింగ్ కెపాసిటి లేకపోతే 11/9 దాడుల్లాంటివి జరిపించగలడు? తరువాత దేశాల చరిత్రలే మారిపోయాయి” అంటే – దీనికి జవాబు ఏముంటుంది?

ఎందుకంటే ఒక విషయాన్ని ఆయా వ్యక్తులు దర్శించే తీరు వారి మనో దృక్పధాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఉంటుంది. కాబట్టే ఇందరు ఈ జగత్తుని ఇన్నిరకాలుగా దర్శించగలుగుతున్నారు. ఎటోచ్చీ నిజాన్ని దర్శించగలిగితే ఎంతోకొంత సార్ధకత పొందినట్లవుతుంది.

ఒక్కటి మాత్రం నిజం – జరిగిపోయిన చరిత్రనే కాదు, నడుస్తున్న చరిత్రని చూసినా – ముస్లింలకు ప్రపంచవ్యాప్తంగా గారాబం నడుస్తోన్న మాట వాస్తవం. దాన్నే మొన్న నవంబరు 26, 2008 న ముంబై మీద పాక్ తీవ్రవాదులు దాడికి తెగబడ్డా, ’ఇస్లామా బాద్ కి ఎంతో బలం’ ఉండబట్టీ, దానికి ప్రపంచవ్యాప్తంగా గారాబం నడవబట్టే, ఢిల్లీలోని యూ.పి.ఏ. ప్రభుత్వం గమ్మున కూర్చుంది. మనం మౌనంగా చూడాల్సి వస్తోంది. బిన్ లాడెన్ పాక్ లోనే ఆశ్రయం పొందాడని తెలిసినా అమెరికా సైతం చూస్తూ పాక్ ని బుజ్జగిస్తూనే ఉంది. ఇంతకంటే కుట్రకు నిరూపణలు అవసరమా?

ఈ కుట్రని ఎత్తి చూపడమే నా ప్రయత్నం. గడిచిన చరిత్రలో నుండే కాదు, వర్తమానం నుండి కూడా.

అందుకే చరిత్రని నేను లోతుగా స్పృశించడం లేదు. లోతుగా చర్చించేందుకు కూడా, మనకి తెలిసిన చరిత్ర, మనం చదివిన చరిత్ర నిజమనేందుకు అవకాశమూ లేదు. అంతేకాదు లోతుగా చర్చించినా కూడా కుట్ర జరిగిందన్న విషయం నిజమేకదా. అక్బరు చరిత్ర తరచి చూసినా అంతే, అలెగ్జాండరు చరిత్ర తరచి చూసినా అంతే. ఎక్కడో పాశ్చాత్యమీడియా అశోకా ది గ్రేట్ అనటం విషయం కాదు, ఇండియాలోని మీడియా అశోకుణ్ణి మామూలుగానూ, అలెగ్జాండర్ ని ది గ్రేట్ గానూ ప్రచారించడం – విషయమే కదా! అది కుట్రకాదా? ఏ చరిత్ర, ఏ ప్రచారం సామాన్యుడికి చేరిందో, అందులో నుండే నకిలీ కణికుడు, అతడి వంశీయుల తరతరాల కుట్రని చెప్పడానికి వ్రాస్తున్నాను. దాన్ని నిరూపించి మరీ వ్రాస్తున్నాను. పూర్తిగా అనువదించి ప్రచురించే వరకూ ఓపిక పట్టవలసిందిగా నా బ్లాగు మిత్రులని కోరుతున్నాను.

నా టపాలకు అవసరమైన చోట వివరణలూ, సవరణలూ ఇచ్చి ప్రోత్సహిస్తున్న నా బ్లాగ్ మిత్రులకి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు చెబుతున్నాను. అలాగే విమర్శలు వ్రాసిన వారికి కూడా! అప్పడే కదా చర్చ అర్ధవంతమై, మనం మరింతగా నిజాన్ని వెలికి తీయగలిగే అవకాశం, అర్ధం చేసుకొనే అవకాశం కలుగుతాయి.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

3 comments:

బాగుంది.

అయ్యా .. మీ కంఠ శోషే గానీ .. అక్బరూ అశోకుడూ తొమ్మిదోతరగతి సోషలు ప్రశ్నపత్రంలో ఐద్ మార్కుల వ్యాసరూప ప్రశ్న .. ఓ సారి, మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్ధం కాకపోవచ్చు .. 9th standard 5 marks essay question .. గా మిగిలినంత కాలం .. మనకి చరిత్ర అర్ధమయ్యేదెక్కడ? మొన్నటికి మొన్న ఒక అంతర్జాతీయ జాలగుంపొకదానిలో ఎవడో అభారతీయుడు భారతీయుల నలుపు తెలుగు రంగుల గురించి ప్రస్తావిస్తే, మన భారతీయ సోదరుడొకడు తనంత తానే ముందుకొచ్చి .. ఉత్తరభారతం లో ఉండేవారందరూ ఆర్యులు, వాళ్ళు తెల్లగా ఉంటారు, దక్షిణాన ఉండే వారంతా ద్రావిడూలు, వీళ్ళు నల్లగా ఉంటారు అని శాస్త్రం చెప్పాడు. అదీ మన చరిత్ర పరిజ్ఞానం.
చిన్నప్పుడు ఎలిమెట్రీ బళ్ళ్ మా టీచరొకామె అనేవార్లెండి .. చదవకముందు కాకరకాయన్నోడు, బడికెళ్ళి సదువుకునొచ్చి కీకరకాయన్నాడట!

చాలా బాగుంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu