ముందుగా ఓ కథ వ్రాసి, దాని విశ్లేషణా, జరుగుతున్న సంఘటనలూ జరిగిన దృష్టాంతాల మీద ఆ కథసారపు అనువర్తనలతో నా బ్లాగ్ చుట్టాలని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా .....

ఊరిలోని బ్రాహ్మణ వాడలో సరస్వతమ్మ అనే వితంతువు ఉండేది. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు కాశీనాధుడు. కొడుకు పసివాడుగా ఉండగానే భర్తను పోగొట్టుకున్న సరస్వతమ్మ కాశీనాధుణ్ణి ఎంతో ప్రేమగా, అతిగారాబంగా పెంచింది.

కట్టడి చేసేందుకు తండ్రి లేని కారణంగానూ, తల్లి అతిగారాబంతోనూ కాశీనాధుడు ఎదిగే కొద్దీ బాధ్యత లేకుండానూ, వ్యసనపరుడు గానూ తయారయ్యాడు. మొదట్లో జూదమూ, మద్యమూ మరిగిన కాశీనాధుడు క్రమంగా వేశ్యాలోలుడయ్యాడు.

సరస్వతమ్మ కాశీనాధుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఎన్నోప్రయత్నాలు చేసింది. కాశీనాధుడిలో మార్పులేదు సరికదా ఆస్తి హారతి కర్పూరంలా కరగబెట్టి వేశ్యలకు ఖర్చుపెట్టసాగాడు. ఊరిలోని పెద్దవాళ్ళూ, బంధువులూ మందలించబోతే నోటి దురుసుతో నానా మాటలూ అన్నాడు. వ్యవహారం చెయ్యి దాటిపోయింది. ఆ దిగులుతో సరస్వతమ్మ కృంగిపోసాగింది.

దాంతో ఊరిజనం మెరకవీధి మీనాక్షిని తిట్టిపోయసాగారు. ఎందుకంటే ఆవిడే మరి కాశీనాధుణ్ణి వినోదింపజేస్తున్న వేశ్య. దానితో మీనాక్షికి సరస్వతమ్మ అంటే గొంతుదాకా కోపం, ద్యేషం నిండిపోయాయి.

మరింత కసిగా, వేగంగా కాశీనాధుడి ఆస్తి అవగొట్టేసింది. ఓ రోజు ఎంతో నయగారంగా కాశీనాధుణ్ణి మాయ చేసి అతడి స్వంత ఇల్లు కూడా వ్రాయించేసుకొంది. సరస్వతమ్మ చేసేది లేక పూరింటిలోకి మారి ఇల్లు మీనాక్షికి స్వాధీనం చేసింది. అయినా కసి తీరని మీనాక్షి ఓ రోజు కాశీనాధుణ్ణి అతడి తల్లి గుండె తెచ్చివ్వమని కోరింది.

ఉఛ్ఛనీచాలు మరిచిన ఈ కామాంధుడు తల్లి దగ్గరికి వెళ్ళి తనకి ఆవిడ గుండె కావాలని అడిగాడు. అప్పటికే జీవితేచ్ఛ నశించిన సరస్వతమ్మ కన్నీరు నిండిన కళ్ళతో “తీసికెళ్ళునాయనా” అంటూ కత్తితో గుండెలు చీల్చుకొని మరణించింది.

తల్లిగుండెని దోసిట్లో పెట్టుకొని వేగంగా వీధిలోకి వచ్చిన కాశీనాధుడు పరుగు పరుగున నడుస్తూ మీనాక్షి ఇంటిదారి పట్టాడు. ఆ వేగంలో అతడి కాలు రాయికి కొట్టుకొని తూలి పడబోయాడు. మరుక్షణం అతడి చేతిల్లోని తల్లి గుండె “జాగ్రత్త నాయనా! పడతావు” అంది. అదీ తల్లి హృదయం!

అప్పటికి కళ్ళకి కప్పిన కామపు పొరలు తొలిగిన కాశీనాధుడు సత్యం గ్రహించి, తన కామక్రోధాల్ని వదిలి భక్తి మార్గాన్ని ముక్తి దారిని పట్టాడు.

ఇదీ కథ!

[ఈ కథ పాండురంగ మహత్యం[?] ప్రబంధంలోని ఉపకథ అని వినికిడి. నాకు సరిగ్గా తెలియదు. నేను మాత్రం చిన్నప్పడు బాలమిత్రలో చదివాను]

ఈ కథ – తల్లి హృదయం, బిడ్డకోసం, అతడి క్షేమం కోసం ఎంత తపిస్తుందో మనకి వివరిస్తుంది. బిడ్డల మీద తల్లికెంత దయా, ప్రేమా ఉంటాయో చెబుతుంది.

ఇప్పుడు మనదేశంలో కాంగ్రెస్సు భజన పరులంతా పెద్దగొంతుకతో “అమ్మా!” “త్యాగమయి!” అంటూ కాంగ్రెస్సు అధిష్టాన దేవత, యూ.పి.ఏ. కుర్చీవ్యక్తి నాయకురాలు నాగమ్మని తమ శాయశక్తులా పొగుడుతుంటారు. ఎందుకంటే - ఈ అమ్మకి కూడా తన బిడ్డల మీద ఎంత దయో!

కాకపోతే ఆ బిడ్డలు ఎవరయ్యా అంటే ....

1]. ఈ నాయకురాలు నాగమ్మ భర్త, ఒక్కప్పటి భారతప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని ఈ నాగమ్మ దయకు పాత్రులైన బిడ్డలలో ఒకరు. మానవత్వం, విశాల హృదయం, క్షమాగుణం ఈ దయకు పైకారణాలు. ఎంతటి కౄర నేరం చేసినా, ఎంత పెద్ద కుట్రలో భాగస్తులైనా సాక్షాత్తు ఆ కుట్రని వ్యవస్థాగతంగా నడిపే వారి దయ ఉంటే జైల్లో ఉన్నా ఏమీ ఫర్లేదనీ, జీవితం ఢోకా లేకుండానే గడపచ్చనీ ఓ దృష్టాంత సందేశం – తరువాత జరిపే కుట్రలలో పాలు పంచుకొనే వారికి ఈ విధంగా ఇవ్వబడటం లోపలి కారణం లేదా అసలు కారణం.

2]. అలాగే ఎన్నోఎకరాల హృదయ వైశాల్యంతో నళిని కూతురి చదువుకి స్పాన్సర్ చేసింది ఈ అమ్మ అని ఓ వినికిడి కూడా ఉంది.

౩].కరుణానిధి LTTE కి సానుభూతి పరుడనీ, LTTE సభ్యులే భౌతికంగా రాజీవ్ హత్యలో పాలుపంచుకొన్నారనీ ఆనాడు, ఈనాడు అందరికీ తెలుసు. శ్రీలంక సైన్యం కిలినోచ్చిని చేరే కొద్ది కరుణానిధి కేంద్రం మీద ఎంతవత్తిడి తెచ్చి శ్రీలంక సైన్యం LTTE మీద చేస్తున్న యుద్దాన్ని ఆపించాలని [పైకారణం – అక్కడి సామాన్య తమిళ ప్రజల క్షేమం అట] తపించాడో డిసెంబర్ మొదట వారం దాకా మనమంతా చూశాం. కేంద్ర యు.పి.ఏ. ప్రభుత్వానికి తేదీలు విధించి, ఈ లోగా శ్రీలంక vs. LTTE వ్యవహారంలో జోక్యం చేసికొని LTTEని [పైకి చెప్పింది సామాన్యతమిళ ప్రజలని] కాపాడాలని, లేకుంటే రాజీనామా చేస్తామని బెదిరించి మరీ LTTE పట్ల తమ సానుభూతిని చాటుకున్నారు DMK నేత కరుణానిధి. తర్వాత ఏమైందో గాని నిశ్శిబ్ధమైపోయి, హడావుడిగా మనుమడు మారన్ సోదరులతో సంధిచేసుకొనే ప్రయత్నాల్లో బిజీ అయిపోయి ఈ వ్యవహారం వదిలేసారు.

ఇలాంటి ఈ కరుణానిధి అధికార పక్షంలోనూ [అప్పటి బి.జె.పి. నాయకత్వం వహించిన NDA ప్రభుత్వానికి కరుణానిధి మద్దతిచ్చారు లెండి] తాము ప్రతిపక్షంగానూ ఉన్నప్పడు ఈ కాంగ్రెసు అధిష్టాన దేవత నాగమ్మ కరుణానిధిని ఉతికి ఆరేసింది.

అదే కరుణానిధి ఇప్పుడు యూ.పి.ఏ. ప్రభుత్వంలో భాగస్తుడు. నాగమ్మ చెలిమికి పాత్రుడు. మిత్రపక్షం వాడు. దేశంలో సామాన్య స్త్రీ కూడా తన భర్త చావుకి కారణం అయిన వాణ్ణి క్షమించి వదిలేస్తుందేమో గానీ పిలిచి మర్యాదలు చేయదు. తనకి వైధవ్యాన్ని కలిగించిన వ్యక్తిని బుజ్జగించదు. [ఇటాలియన్లకు వైధవ్యం లేకపోయినా భర్త, అనుబంధమూ ఉంటాయి గదా!] తనవారు అనుకొంటే, లేదా తనకి ఉపయోగపడితే అప్పుడు ఈ అమ్మకి అలాంటి వారిమీద చాలా దయ కలుగుతుంది.

4]. అమ్మదయతో నళినికి కోర్టు విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మార్చబడింది. పోనీ ఓ ప్రాణం కాపాడబడింది. కన్నుకి కన్నూ, ప్రాణానికి ప్రాణం అనే ఆటవిక న్యాయం భారతీయులం ఇష్టపడం. కనుక నళినికి మరణశిక్ష రద్దయ్యి, యావజ్జీవ శిక్షగా మారటం మంచిదే. ఓ నేర ప్రవృత్తి గల వ్యక్తికి తప్పు తెలుసుకొనే అవకాశం ఇవ్వబడింది. మంచిది. అయితే కరుణానిధి మరో అడుగు ముందుకు వేసి యావజ్జీవ శిక్షని తగ్గించే ప్రయత్నం కోర్టు ద్వారా చేస్తున్నాడు. దీని వెనుక అమ్మ హస్తం ఎంత ఉందో గానీ, వెరసి ఈ ప్రయత్నాలన్నీ తదుపరి కుట్రల్లో పాలు పంచుకొనే నేరగాళ్ళకు ఇచ్చే భరోసాలే. ఇదే అమ్మదయ - బాంబు దాడుల్లో మరణించిన వారిపట్ల, ఆకలి చావులు లేదా అప్పుల చావులు పట్ల అయితే పరామర్శల వరకూ మాత్రమే ఉంటుంది. అదే సెజ్ భాదితులపట్ల అయితే పరమ ఉదాశీనతే. అంటే మౌనం అన్నమాట.

5]. ఈ అమ్మకి పార్లమెంట్ పై దాడి చేసిన ముస్లిం తీవ్రవాది అప్జల్ గురుకి కోర్టు ఉరిశిక్ష విధించినా, అమలు చేయనంత దయ. అదే పార్లమెంట్ పై దాడిలో దేశపు పరువూ మర్యాదా కాపాడటానికి ప్రాణాలొడ్డిన వీరుల కుటుంబాలని రోడ్డున పారేసింది. అదీ ఈ అమ్మదయ.

6]. జూలై 22, 2008 న జరిగిన విశ్వాస పరీక్షలో ఓటేసిన ఇతర పార్టీ ఎం.పి. లకి కోట్లకొద్దీ డబ్బిచ్చారని ఓ వివాదం బయటికొచ్చింది. కిశోర్ చంద్ర దేవ్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ కొన్నినెలలు విచారించి, జయప్రదంగా నోట్లతో ఓట్లు కొనలేదని కితాబిచ్చింది. మరి శిబుశోరన్ కిచ్చిన ముఖ్యమంత్రి పదవీ, ఆదికేశవుల నాయుడి కిచ్చిన టి.టి.డి. ఛైర్మన్ పదవీ, మంద జగన్నాధానికిచ్చిన ఎ.పి. భవన్ ప్రత్యేక ప్రతినిధి[రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా] పదవికీ ఏం కథలు చెబుతారో? ఓట్లకి నోట్లు, కోట్లకి ఓట్లో ఏపేరు బాగుంటుందో?

ఈ విధంగా అవినీతి, అక్రమాలు చేసేవారి మీద ఈ అమ్మకెంత దయో!

7]. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి సూట్ కేసుల కొద్దీ డబ్బు ఢిల్లీ అధిష్టానికి పోతుందని ప్రతిపక్ష పార్టీ నాయకులంతా విమర్శిస్తున్నారు. అదెంత సత్యమో తెలియదు గానీ, రాష్ట్రంలో బియ్యం, పప్పు, పెట్రోలు, వంటగ్యాసూ, సిమెంట్, ఉల్లిపాయలూ అన్నిటి ధరలూ మండిపోయి బ్లాక్ మార్కెట్ జరుగుతుందంటే ప్రభుత్వం మామూళ్ళ వసూలు చేసుకొని నల్లబజారు వర్తకులకు దోపిడి చేసుకొమ్మని అనుమతి ఇచ్చిందనే అర్ధం. లేకపోతే ప్రభుత్వశాఖలు దాడి చేసి బ్లాక్ మార్కెట్ నీ, ధరల్నీ అరికట్టే ప్రయత్నం చేసేవి. అదేం లేకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందంటే వాటా వసూలు చేసుకొందనే నిజం మనకే కాదు మన సుబ్బిగాడికి కూడా తెలుసు. అలా సూట్ కేసుల కొద్దీ డబ్బు ముట్టచెప్పతున్నారు కాబట్టే అమ్మదగ్గర అప్పాయింట్ మెంట్ ముఖ్యమంత్రికి వస్తూంది గానీ సీనియర్లయినా సరే ఏ కాకా లకీ ఏ సమస్య మీది చర్చకైనా రావడం లేదు. ఆ విధంగా తనకు ధారళంగా నిధులు సమకూర్చే వారి మీద అమ్మకెంత దయో ఆవిష్కృతమౌతోంది.

8]. జూలై 2008 కి ముందంతా తన ఫోన్లు టాప్ చేస్తూన్నారనీ, నాగమ్మ పార్టీ నుండి ప్రాణహాని ఉందనీ ఘోల్లుమంటూ తిరిగిన అమరసింగ్ తెరవెనుక ఏ రాజీలు కుదిరాయో గానీ, విశ్వాస పరీక్ష నెగ్గేందుకు తన శాయ శక్తులా సాయం చేశాడు. తర్వాత తనని చారులో కరివేపాకులా వాడుకొని వదిలేసారని మళ్ళీ ఘోల్లుమన్నాడు. అప్పడయినా కాంగ్రెసు నాయకులంటూ తిట్టాడు గానీ అమ్మ నాగమ్మని పల్లెత్తు మాట అనలేదు. అంతేకాదు ఆవిడ మీద నమ్మకం ఉందని ముందు జాగ్రత్త పడ్డాడు. లేదంటే అమ్మ దయ తప్పుతుంది. ముప్పు పెరుగుతుంది. అదీ అమ్మదయ తీవ్రత.

9]. ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించగానే మార్గరేట్ ఆల్వా క్రమశిక్షణ కోల్పోయింది. వెంటనే అమ్మ దయ కూడా కోల్పోయి ఇంటి కెళ్ళిపోయింది. అదీ అమ్మ పవరు. అది చూసే అర్జున్ సింగ్ వంటి సీనియర్లు వణుకుతారు. శివరాజ్ పాటిల్ లాంటి నిర్భాధ్యతాయుత మంత్రి[ఇప్పుడు మాజీలెండి] తనకు అధిష్టాను ఆశీస్సులున్నాయి కాబట్టి తానెవ్వరికీ జవాబు చెప్పనని ఎగురుతాడు.

10]. అన్నట్లు ఈ అమ్మకి పాకిస్తాన్ మీద కూడా అమిత దయ ఉందండోయ్. అందుకే 40 రోజుల విశ్వప్రయత్నమూ, విరగ నాటకమూ తర్వాత నింపాదిగా కొత్తగృహామంత్రి “మరోసారి పాక్ ముంబై దాడుల్లాంటి చర్యలకి పాల్పడితే క్షమించేది లేదు” అని గంభీరంగా జనవరి4, 2009 డి.డి. వార్తల్లో ప్రకటించాడు. అంటే జయప్రదంగా ఈ సారి క్షమించేసారన్న మాట. ఎంత దయ! రేపోమాపో కసబ్ ని సైతం క్షమించి ఇస్లామాబాద్ కి విశాల హృదయంతో వీడ్కోలు ఉత్సవం జరిపి మరీ పంపించగలిగినంత దయ!

11]. ఈ అమ్మకి దయో కాదండోయ్, ద్వేషం కూడా తెలుసు. జీవితకాలం పార్టీ కండువా వదలని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు వయస్సునీ, అనుభవాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా గుర్తించనంత ద్వేషం తెలుసు. ఆయన హయాంలో బాబ్రీ కూలిందట. దాంతో ముస్లింలు కాంగ్రెసుకు దూరం అయ్యారట. ఈ ఒక్కకారణం ఆయన తన అత్తగారికీ సలహాలిచ్చినంత అనుభవఙ్ఞుడనీ, మేధావి అనీ, భర్తకి గురుతుల్యుడనీ గుర్తించనంత బలమైనది ఈ అమ్మ దృష్టిలో. మరణానంతరం కూడా గౌరవం చూపలేనంత ఇరుకుహృదయం ఈ విషయంలో ఈ అమ్మది. ఈ అమ్మ ద్వేషానికి భయపడి ఆనాడు ఆయన భౌతిక కాయాన్ని దర్శించడానికి ఒక్క శివరాజ్ పాటిల్ తప్ప మరెవ్వరు రాలేదు. మొక్కుబడి దణ్ణం పెట్టి మనోమోహనుడు మాయం అయిపోయాడు. తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆనాటి ప్రధానికి ఈ నాటి ప్రధాని 2004, డిసెంబరులో చూపిన కృతఙ్ఞతా, గౌరవం ఇది. అలాగాకపోతే, తమమీద అమ్మకి దయ పోయి ద్వేషం కలిగితే ఇంకేమన్నా ఉంది? బ్రతుకు బస్టాండ్ కాదూ! అందుకని మిగతా వాళ్ళు గౌరవార్ధం కూడా రాలేదు.

ఇంతపట్టు ఈ నాగమ్మకి ఎలా కలిగిందో గానీ ఆ నిగూఢ మర్మం బహిర్గతమైనప్పుడు తెలియాల్సిందే.

ఇప్పటికి మాత్రం అమ్మదయ చూసి అచ్చెరువొందాల్సిందే.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

3 comments:

simply superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb!!!!!!!!!!

"మొక్కుబడి దణ్ణం పెట్టి మనోమోహనుడు మాయం అయిపోయాడు. తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆనాటి ప్రధానికి ఈ నాటి ప్రధాని 2004, డిసెంబరులో చూపిన కృతఙ్ఞతా, గౌరవం ఇది" బాగా చెప్పారు.

అంతా బంగారమ్మ దయ, దాక్షిణ్యం. ఆమెను అన్నందుకు మన psuedo secular లను మాత్రం బాగా బాధ పడతారు, జాగ్రత్త. ఇటలీ లోనో, వాటికన్ కో, డబ్బులు ఇచ్చి తమకు కావాల్సిన పనులు కావాల్సిన రకంగా చేసుకొనే వీలును ఉంచుకొని, ఎందుకు జనాలను పాకిస్తాన్ వాళ్లు గన్ లు ఇచ్చి పంపుతున్నారో అని నా మిత్రుడొకడు మొన్నీమధ్య వాపోయాడు.

Adi Lakshmi gaaru,

In this post you have covered all the important points. I agree with your following points.

1) writings on కరుణానిధి
2) ఈ అమ్మకి పార్లమెంట్ పై దాడి చేసిన ముస్లిం తీవ్రవాది అప్జల్ గురుకి కోర్టు ఉరిశిక్ష విధించినా, అమలు చేయనంత దయ

3) శిబుశోరన్ కిచ్చిన ముఖ్యమంత్రి పదవీ, ఆదికేశవుల నాయుడి కిచ్చిన టి.టి.డి. ఛైర్మన్ పదవీ, మంద జగన్నాధానికిచ్చిన ఎ.పి. భవన్ ప్రత్యేక ప్రతినిధి[రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా]

4) అమరసింగ్ తెరవెనుక ఏ రాజీలు

5) అమ్మకి పాకిస్తాన్ మీద కూడా అమిత దయ ఉందండోయ్
6) ఈ అమ్మకి దయో కాదండోయ్, ద్వేషం కూడా తెలుసు

Please write about, why Caste Hindus fell on the feet of a foreigner and surrender the political power to them? For the last 1200 years, foreigners were ruling over India. As usual Caste Hindus fight with one another, and support the foreigner.

You already wrote about Sonia's goal. She is a agent of Christian might (Vatican and West), and they want to convert Hindus into Christianity. This will go on until the last Hindu was converted. Dalitism is a tool in the hands of those evil forces (West).

Read about "Joshua Project".
http://www.joshuaproject.net/

http://www.joshuaproject.net/countries.php?rog3=IN

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu