శివాజీ ’గెరిల్లా! యుద్ధ వ్యూహం కారణంగా ఆయన శతృవులు శివాజీ సేనలో ఎందరు సైనికులున్నారో, ఎంత సాయుధ సంపత్తి ఉందో, సేన సామర్ధ్యం ఎంతో అంచనా వేయలేక పోయారు.

ఓ సారి ఔరంగజేబు ముస్లిం సైనికులు తమ దుర్గం మీదకి దాడికి వస్తున్నారని శివాజీ సేనకి సమాచారం అందింది. తామున్న చోటుకు చేరాలంటే సన్నని లోయలో నుండి ప్రయాణించాలి. శివాజీ సేన, ముస్లిం సైనికులు లోయలో నుండి ప్రయాణిస్తుండగా, సైనికుల మీదికీ, వారి గుర్రాల మీదికి పెద్దపెద్దబండరాళ్ళని కొండ అంచుల నుండి క్రిందికి దొర్లించారనీ ఆ విధంగా వారిని పార దోలారనీ కథనాలున్నాయి.

మరోసారి ఔరంగజేబు మద్దతుదారులైన ఓ సామంత ముస్లింరాజు శివాజీ దుర్గం మీదకి దండయాత్ర కొచ్చాడట. అంత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ దగ్గర చాలినంత ధనమూ లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఉన్నది సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సులే [లగాన్ సినిమాలో ఇండియన్ టీం లాగా]. ఉన్న పరిమిత వనరులతోనే ప్రతివ్యూహం పన్నారు. రాత్రికి శతృశిబిరం ఎక్కడ విడిది చేస్తుందో అంచనా వేసారు, ఆనుపానులు కనిపెట్టారు. దానికి తగిన దూరంలో కనుచూపులో ఉండేటట్లు తమ విడిది [campaign] నిర్మించారు. గుడారాలు వేసారు. కాగడాలు వెలిగించారు. గస్తీ ఏర్పాట్లు చేశారు. దూరం నుండి ఇదంతా చూసిన శతృసైనికులకి ఆ చీకట్లో మండుతున్న కాగడాలు. లెక్కకు మిక్కిలి గుడారాలు గుబులు పుట్టించాయి. గెలవగలమన్న ఆశనీ, ధైర్యాన్ని కోల్పోయారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాల్లో శివాజీ, ఆయన అనుచరులూ, ఉన్నది కొద్దిమందే అయినా గుర్రాలు, ఉడుములూ, కోతులూ, పావురాలని కూడా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నారట.

ఈవిధంగా ధనబలాన్ని, అధికార బలాన్ని, కేవలం మనోబలంతో ఎదుర్కొన్న యోధులు మరాఠాలు. ఒకసారి ఔరంగజేబు శివాజీ తండ్రిని బంధించి, చర్చల కంటూ శివాజీని పిలిపించి బంధించాడు. శివాజీ చెరసాల నుండి మాసిన బట్టల మూటలో దాక్కొని చాకలి వాడి సాయంతోనూ, తన అనుచరుల సాయంతోను తప్పించుకున్నాడట. ఆ సమయంలో ఆ మాసిన బట్టల మూటని చెరసాల కావలి వాళ్ళు గానీ పట్టుకుంటే, శివాజీతో పాటు చాకలి వాడూ మరణాన్ని ఎదుర్కొక తప్పదు. అయినా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. తమ ‘కర్తవ్యం’గా, దేన్ని తమంత తాముగా స్వీకరించారో, ఆ సంస్కృతీ పునఃప్రతిష్ఠ పట్ల వారి కున్న నిబద్దత అది! ధర్మ స్ఫూర్తి అది!

మరోసారి కూడా ఔరంగజేబు శివాజీని, ఆయన జ్యేష్ఠపుత్రుడు శంభాజీని నిర్భందించాడు. శివాజీని చంపితే తన రాజ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న హిందువుల్లో అసంతృప్తి, తిరుగుబాటూ వస్తుందని భయపడి, సరియైన అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. శివాజీ జబ్బుపడినట్లు నమ్మించాడు. అయన అనుచరులు శివాజీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దైవపూజలు నిర్వహించేవారు. ప్రతీరోజూ జైలులోని ఖైదీలకి, కావలి భటులకీ ప్రసాదాలు పంచిపెట్టేవారు.

మొదట్లో జైలు కావలి భటులూ, ఇతర సిబ్బంది ఈ ప్రసాదాలూ, మిఠాయిలు పట్ల జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ముందుగా పరీక్షించాక గానీ పంచి పెట్ట నిచ్చేవాళ్ళు కాదు, తామూ తినే వాళ్ళు కాదు. అయితే మిఠాయిల్లో ఏ మతలబు లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా ప్రసాదాలని పరీక్షించటంలో ఓ సాచాటు వచ్చింది. యధాలాపంగా స్వీకరించటం మొదలు పెట్టారు. పరిస్థితి మామూలుగా, శాంతిపూరితంగా ఉంది.

ఓ రోజు ప్రసాదంగా జైలుకు లడ్డూలు పంపబడ్డాయి. అయితే వీటిలో మత్తు పదార్ధం కలపబడింది. లడ్డూలు తిన్న జైలు సిబ్బంది, కావలి భటులూ, ఇతరులూ స్పృహ కోల్పోయారు. తన అనుచరులూ, జైలులో తన అనుకూలురుల సాయంతో శివాజీ, శంభాజీ కూడా జైలు నుండి తప్పించుకోగలిగారు.

[’ఇది కుట్రకాదా’ అని ఎవరైనా వాదిస్తే వారికి సమాధానం చెప్పకుండా ఊరుకోవాల్సిందే. ఎందుకంటే ముస్లిం రాజుల కుట్రల వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ, శివాజీ జైలు నుండి తప్పించుకోవాడానికి పన్నిన పధకానికి వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ తేడా గమనించని వాళ్ళతో, వాదించి మాత్రం సాధించగల ప్రయోజనం ఏముంది?]

శివాజీ సమాజంలో నీతినీ, ధర్మాన్ని, సంస్కృతినీ తిరిగి స్థాపించడానికి ఎంతో దీక్షతో పోరాడాడు. అదే అయన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొడానికైనా, ప్రాణాలొడ్డానికైనా ఏక్షణమూ వెనుకాడలేదు. తన రాజ్యాన్ని సైతం ప్రజలకు తాను ఆదర్శంగా ఉండేలాగా, ప్రజలు కూడా నీతీ ధర్మాల్ని ఆచరించేలాగా, ఉత్తేజపరుస్తూ పరిపాలించాడు.

ఆయన జీవితంలోని ఈ సంఘటన దీన్ని మనకు స్పష్టంగా చెబుతుంది.

ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా, సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు వినయము, అతృతా నిండిన గొంతుతో “మహారాజా! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను. ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను” అన్నాడు.

ఆరోజుల్లో, ముస్లిం రాజ్యాల్లో, ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం, ముస్లిం రాజులకీ, వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు. బదులుగా రాజుల నుండీ, రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. [అంటే ప్రమోషన్లూ, అవార్డులూ, రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట]ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు. తమ స్వార్ధం, స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు, మతం, కులం, పేదరికం, పాపం పుణ్యం – ఏవీ పట్టవు. శివాజీ ముస్లిం రాజులకీ, ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు. ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు, అనుకొన్నాడు. అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు. అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది. సభికులంతా ఆశ్చర్యం తోనూ, ఉత్కంఠతోనూ చూస్తున్నారు. శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది. ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది.

శివాజీ ఆమె వైపు తిరిగి “అమ్మా! భయపడకు!” అన్నాడు.

సభికుల వైపు తిరిగి “నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది. ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే, నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని. ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు” అన్నాడు.

చివరిగా తన అనుచరుడి వైపు చూచి “స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు. సగౌరవంగా ఈమెను, ఈమె ఇంట దిగవిడిచిరా!” అని ఆఙ్ఞాపించాడు.

శివాజీ ఆమెకు బహుమతులిచ్చి, రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు. అదీ ఆయన నిబద్దత – ధర్మంపట్లా, నైతికత పట్లా, మానవతా విలువల పట్లా! వాస్తవానికి ధర్మం, నీతి, మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవి. వీటినే హిందూ ధర్మం చెప్తుంది. దానిని ఆచరించటమే నిజమైన హిందువు [మనిషి] చేయవలసినది.

ఇలాంటిదే మరో సంఘటన!

ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది. ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు. తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు, అనుంగు అనుచరుడూ, మహా యోధుడు. ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు. తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.

దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత, విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది. ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు. కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది. కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని, ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు. ఇంతలో ఓ సైనికుడు సంతోషం, గర్వం నిండిన గొంతుతో “మహారాజా! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు” అన్నాడు. [బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు.]

శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి, తీవ్రస్వరంతో “ఘడ్ తో ఆయా, లేకిన్ సింహ్ చలాయా!” అన్నాడు. [దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను]

అదీ శివాజీ భావవాద దృక్పధం, ఆలోచనా సరళి! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా, తన ప్రియమిత్రుడూ, మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది. ప్రతి విషయాన్ని, అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ’భావం’ ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక.

నిజం చెప్పాల్సి వస్తే – ప్రస్తుత పరిస్థితి శివాజీ మహారాజు నాటి పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు. ఆ రోజుల్లో ఒక్క ఔరంగజేబు ఢిల్లీలో ఉన్నాడు. అతడితో సమానులైన మరికొందరు అతడి అనుచరులు దేశంలోని వివిధ ప్రాంతాలను పాలిస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు? ఎంతోమంది ఔరంగజేబులు ఢిల్లీ నుండి గల్లీ దాకా ఉన్నారు. ఔరంగజేబుకి, అతడి అనుచరులకీ ఏమాత్రం తీసిపోని పాలకులే ఇప్పుడు పల్లెనుండి పట్నాల దాకా, మునిసిపాలిటి నుండి అసెంబ్లీలు, పార్లమెంట్ దాకా పాతుకుపోయారు. విలువల్లేవు. నీతి నియామాలు లేవు. సత్యము లేదు, పరిపాలనా విధానమంటూ కూడా ఏదీ లేదు. ఉన్నదొక్కటే – లంచం లేదా అవినీతి లేదా రెడ్ టేపిజం లేదా దందా. ఏ పేరైనా ఒకటే! మనిషి అన్న అస్తిత్వం లేదు, వ్యక్తిత్వం అంటే గౌరవం లేదు, ఆస్తికీ, మానప్రాణాలకి రక్షణా లేదు.

మరి శివాజీ ఎక్కడ? ఆయన చిరునామా ఎక్కడ? శివాజీని మనం మన హృదయాలలోనూ, మెదడులోనూ కనుక్కోవాలి, చూడగలగాలి. అలాగ్గాకుండా ఇక ఈ బ్రతుకెందుకు? విలువలూ, నీతినియమాలూ లేని బ్రతుకుకి అర్ధం మాత్రం ఏముంది? అందుకే అన్నాడేమో మహాకవి శ్రీశ్రీ……..

"మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కల వలె నక్కల వలె
సందులలో పందుల వలె
మనదీ ఒక బ్రతుకేనా?"

విలువలూ, నీతినియమలూ లేని జీవితం జంతుప్రాయమే కదా! ’తిన్నామా పడుకున్నామా తెల్లారిందా’ - ఈ Concept తోనే బ్రతికితే, ఆ బ్రతుకు జంతుసదృశం కాదా?

ఇందులో మరీ భయంకరమైన విషయం ఏమిటంటే – స్వలింగ సంపర్కం, అంతటి హేయమైన విషయాన్ని చట్టబద్దం చేయమని గోల. జంతువుల్లో కూడా ఈ అలవాటు ఉందనీ, అది ప్రకృతి సహజం అనీ, అక్కడా ఇక్కడా అడపాదడపా ఆడ ఆడ లేదా మగా మగా పెళ్ళి చేసుకున్నారనీ పత్రికల్లో వార్తలు, సినిమాల్లో కథలూ! ఎంత నీచం గాకపోతే పోయిపోయి జంతువులతోనా పోల్చుకోవాలి? మనిషి జంతువు కంటే పరిణతి చెందిన వాడని కదా దుస్తులు వేసుకొంటాం, వీధుల్లో బహిరంగ ప్రదేశాల్లోనో కాకుండా ఇళ్ళల్లో నివసిస్తాం? అది ప్రకృతి సహజం అంటే. జంతువులకి ప్రకృతి సహజమేమో గానీ మనుఘలకి కూడానా? అదే నిజమైతే జంతువులకీ తల్లీ చెల్లీ అన్న తేడా ఉండదు. వావి వరుసలేని శృంగారం, కొన్ని జంతువుల్లో ఉంటుంది. అలాగే జంతువులు దుస్తులూ వేసుకోవు. బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన దగ్గరనుండీ శృంగార క్రియ వరకూ జరిపేసుకుంటాయి. ’స్వలింగ సంపర్కం’ నిషేధించడం కాదు, చట్టబద్దం చేయాలనే వారు ఇక తర్వాత అడుగులుగా మిగిలిన జంతు ప్రక్రియలు కూడా తెస్తారేమో! ఎక్కడ ఉత్కష్టమైన హిందూ సమాజం – ఎక్కడ అభివృద్ది మంత్రం అంటున్న నేటి సమాజం? 116 సంవత్సరాల క్రితం వివేకానందుడు ఆమెరికా, యూరప్ సమాజంకు హిందూసంస్కృతి గురించి చెప్పి ఉర్రువుతలూగించిన హిందూసంస్కృతి మూలాలెక్కడ? నేటి సమాజం దానికి సరిగ్గా శీర్షాసనం వేసి ఉంది. ఇక్కడ తెలియటం లేదా హిందుమతం మీద కుట్రజరుగుతుందన్న విషయం?

ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే – ఆయన కాలం నాటి సామాజిక స్థితి, మానవ సంబంధాలూ చూసి, ఆ మహాకవిలో పొంగిన పాజిటివ్ భావోద్రేకం ఇంకా చెప్పాలంటే ధర్మాగ్రహం ఆ కవితలో కనబడుతుంది. జనాల్లో పౌరుషాన్ని రగిలించడమే ఆయన సంకల్పం. ఎందుకంటే మనిషిగా ఉన్నతుడయ్యేందుకు ప్రతీ వ్యక్తి ప్రయత్నించాలన్న సంకల్పం ఆయన హృదయంలో ఉంది గనుక, ఆ ఉత్తేజాన్ని అందరిలో నింపాలన్న సంకల్పం ఆయనది. ఆ సంకల్పంలో సత్యమూ, నిజాయితీ ఉన్నాయి గనుక అది అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించి, ఉత్తేజ పరిచింది. వెంటనే కుట్రదారులు, వారి మద్దతుదారుల చూపు ఆయన మీద పడింది. ఫలితం – ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వత్తిళ్ళు సృష్టించబడ్డాయి. పై కారణంగా [ overleaf reason] తోటి కవుల, సాటి వాళ్ళ ఈర్ష్యసూయలూ, కవిత్వం, సినిమా రంగల్లోని కుళ్ళు రాజకీయాలు కనబడతాయి. అంతర్లీనంగా ఉంది మాత్రం, కుట్రదారుల నెట్ వర్క్ భారతీయ కళారంగమ్మీద, సినిమా రంగమ్మీదా లోతుకంటా పనిచెయ్యడమే. పైకి కనబడకుండా చాపక్రింద నీరులా పని చేయటమే గూఢచర్య నైపుణ్యం కదా! ఈ వత్తిళ్ళతో తట్టుకోలేక శ్రీశ్రీ మద్యపాన బానిసయ్యాడు. అది మరింత గగ్గోలునీ, వత్తిడినీ ఆయనిపై పెంచింది. ఇంకొంత మత్తు – మరికొంత వత్తిడి! చర్విత చర్వణం లేదా అదో విషచక్రం. సహజంగానే, ఆయనే కాదు మరింకెవ్వరైనా జీవితంలో కుప్పకూలిపోతారు. ఈ రకపు స్ట్రాటజీ ఎంతోమంది కవులూ, రచయితలు, సినిమా దర్శకులూ, నటీనటులూ, ఇతర కళాకారుల మీద ప్రయోగించబడింది. ఈరకపు వత్తిళ్ళనీ మొదట్లోనే తట్టుకోలేకపోయిన వారు కుట్రదారులకు మద్దుతుదారులైపోయారు. క్రమంగా నైపుణ్యం లేని కళాకారులు కూడా ఘోస్టులను వెనక బెట్టుకొని హిట్టయిపోయారు, మరికొందరు అసలే నైపుణ్యమూ లేకపోయినా గొప్పవారుగా చలామణి అయిపోయారు. అయితే ఎవరైతే ప్రజల్లో చైతన్యం తేగలిగేంత నైపుణ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రజల్ని స్ఫూర్తివంతం చేయగలరో, ఎవరి దగ్గరైతే చక్కని భావ సంపద ఉందో – అలాంటి కళాకారులూ, కవులూ మాత్రం జీవితాల్లో ఓటమి పాలయ్యారు, తమ రంగాల్లో విజయం సాధించలేక పోయారు, కొంత మందైతే కనీసం జీవనభృతి కూడా సంపాదించుకోలేక పోయారు.

ఇలాంటి వారిలో కొందరు ఫీల్డులోంచి కనుమరుగయ్యారు. కొందరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. [ఆదుర్తి సుబ్బారావులూ, గురుదత్ లూ, ఇంకా నటీమణులెందరో] కొందరు రోగగ్రస్తులై మరణించారు. [గోపిచంద్ తండ్రి టి.కృష్ణ లాంటి వారు ఎందరో] కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు [శంకర్ నాగ్ లాంటి వారెందరో] క్యాన్సర్ లాంటి రోగాలే కాదు, ఏ రోగాలైనా పుట్టించవచ్చు, ఏ యాక్సిడెంట్లయినా ఎవరికీ అనుమానం రానంత సహజంగా జరిపించవచ్చు. అదే గూఢచార నెట్ వర్క్ బలమూ, నైపుణ్యము. ఈ నెట్ వర్క్ బాధితులందరిలోనూ ఉన్న ఒకే లక్షణము ‘డబ్బే ప్రధానం కాదు, భావమే ప్రదానం’ అనే భావవాదాన్ని, భారతీయుల్లో ఉన్న సుగుణాన్ని తట్టిలేపే శక్తికలిగి ఉండటమే. కుట్ర భారతీయ కళారంగమ్మీద పనిచేసిన తీరిది. మరింత విపులంగా Coups On World లో Coup on Indian Arts లో చర్చించాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

ప్రస్తుతానికి కళారంగాన్ని వదలి మళ్ళీ రాజకీయ రంగమ్మీది కుట్ర దగ్గరకి తిరిగివద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .
************

2 comments:

చాలా బాగారాస్తున్నారమ్మా కానీ మనచర్మాలు మందగించి పోయినట్లున్నాయి అనిపిస్తుంది ఇటువంటి వాటి పై చర్చలు జరగటము లేదంటే.

దుర్గేశ్వర గారు, బహుశా చర్మాలు మందగించడం కాదు, నిజాలు తెలుస్తుంటే స్థాణువైపోయుంటారు! తేరుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చు.

ఆదిలక్ష్మి గారు శివాజి గురించి బాగా రాసారు తెలియని ఎన్నో నిజాలు తెలియజేసారు. మీరింకో విషయం మర్చిపోయారు, అంత దుర్మార్గుడైన ఔరంగజేబుని కూడా పాఠ్యపుస్తకాలల్లో మంచివాడుగా చిత్రీకరించ ప్రయత్నం జరిగింది, అతడు టోపీలు కుట్టుకొని జీవనభృతిని సంపాదించేవాడని నొక్కిచెప్పేవారు (నేను కూడా మగానుభావుడని చంకలుగుద్దుకున్నా:(

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu