1674 లో రామదాసు భద్రాచలంలో గుడి కట్టిన నాటికి తానీషా తీవ్ర ఆర్ధికావసరాల్లో ఉన్నాడు. [అవసరం అనే కంటే ఆశ అనడం సరి అయిన పదం.] సుఖభోగాలకీ, ప్రభుత్వం నడపడానికి డబ్బు కావాలి. కరువులూ, వరదలతో అతడి రాజ్యమంతటా కూడా ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించడం లేదు. బకాయిలు మొండిదేరాయి.

అలాంటి స్థితిలో తానీషాకి రామదాసు లక్షల మొహరీలు ప్రజల నుండి విరాళాలుగా వసూలు చేసి భద్రాచలంలో రాముని గుడి కట్టించాడన్న విషయం తెలిసింది. అంతలేసి విరాళాలు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారన్న నిజం తానీషాకి కళ్ళు మెరిపించింది. రామదాసులో ఉన్న ఆ ’జనాకర్షక శక్తి’, భక్తిపాటలు వ్రాసి, సంగీతం సమకూర్చి, గానం చేసి ప్రజల్ని విరాళాలు గుమ్మరించేలా సమ్మోహన పరచిన ‘శక్తి’ తానీషాకి కావాలి.

రామదాసు చేత ’ఇదే దేవాలయ నిర్మాణ పధకాల్ని’ తన రాజ్యంలోని వేర్వేరు ప్రాంతాల్లో అమలు పరిస్తే విరాళాల వెల్లువెత్తుతుంది. డబ్బే డబ్బు! డబ్బు సమకూరాక ఎంత సద్వినియోగమయ్యిందో, ఎంత గోల్ మాల్ అయ్యిందో ఎవరు చూడొచ్చారు? – ఇదీ అతడి కాంక్ష!

పరోక్షంగానూ, పిదప ప్రత్యక్షంగానూ తానీషా కాంక్ష రామదాసుకి తెలియజేయబడింది. రామదాసులోని అమాయక భక్తుడికిది మొదట అర్ధంగాక పోయినా విపులంగా తెలియచేసే రాజభక్తులకి కొదవుండదు గనుక అర్ధమైంది. అయితే జీర్ణం కాలేదు. శ్రీరాముడి పేరు చెప్పి [నేటి బి.జే.పి., ఆరెస్సెస్ లు చేసినట్లుగా] ప్రజలని మోసగించటం దారుణం అనిపించింది. అందునా శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడు. తండ్రిమాట నిజం చేయటం కోసం స్వసుఖలు వదలి అడవికి పోయినవాడు. దానితో రామదాసు ఈ వ్యూహాన్ని నిర్ధ్వంద్వంగా నిరాకరించాడు. తానీషా తన అవసరం రీత్యానూ, అహంకారం రీత్యానూ, ఒక సామాన్యుడైన వ్యక్తి, రామదాసు ‘తనంతటి నవాబు’ని వ్యతిరేకించడాన్ని, అవిధేయత చూపడాన్ని ఎలా ఉపేక్షించగలడు?

మరుక్షణమే రామదాసు మీద నిందారోపణ చేయబడింది. కొలువులో విచారణ మొదలైంది. గుడి కట్టటానికి నవాబు అనుమతి తీసుకోలేదన్నదీ, పన్నుల సొమ్ము గుడికట్టటం కోసం ఉపయోగించాడన్నదీ అభియోగాలు. నవాబుగా అతడికి అనుమతి పత్రాలు మాయం చేయటం లేదా పుట్టించటం, మంచి లెక్కల్ని దొంగ లెక్కలనడం లేదా దొంగ లెక్కల్ని మంచి లెక్కలనడం అసాధ్యమా? [ఇప్పటికీ ప్రభుత్వపాలకులూ, అధికారులూ తలచుకొంటే ఇలాంటి వెన్నో సుసాధ్యులై మన కళ్ళ ముందు ఎన్నోసార్లు కనబడటం లేదూ!]

అందుకే అంటారేమో ’రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా?’ అని!

ఇంకేముంది! నిరాటంకంగా తానీషా రామదాసుని చెరసాలలో 1675 AD నుండి 1687 AD దాకా 12 ఏళ్ళు పాటు బంధించాడు. ప్రతీ రోజూ చిత్ర విచిత్ర హింసలతో, పస్తులు పెట్టి, సామదానభేద దండోపాయాలతో రామదాసుని ఒప్పించే ప్రయత్నం చేసాడు. లోపలి కథ తెలియక పోయినా, బహిరంగంగా మోపబడిన అభియోగాలూ, జైల్లోని శిక్షలూ ప్రజల్లో ప్రచారమయ్యాయి. ప్రజల్లో అధిక సంఖ్యకులైన హిందువుల్లో ఇది అసంతృప్తికీ, నిరసనకీ దారి తీసింది.

మరో ప్రక్క 1656 AD నుండి ఔరంగజేబు గోల్కొండని పట్టుకునేందుకు దాడులు చేస్తూనే ఉన్నాడు. 31 ఏళ్ళుగా అంటే 1656 నుండి 1687 AD వరకూ ఎన్నోసార్లు [18 సార్లు అంటారు] దాడి చేసినా గెలిచిన పాపాన పోలేదు. అయితే ఇప్పుడు, 1687 లో గోల్కొండ ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, సైనికుల్లోనూ రేగిన అసంతృప్తి, తానీషా పట్ల నిరసన పెరిగిపోయాయి. దాంతో వారి కర్తవ్యనిర్వహణలో నిజాయితీ, నిబద్ధతా లేకుండా పోయాయి. మొక్కుబడిగా కార్యనిర్వహణ చేస్తున్నారు. తానీషాకి తన ’ఏజంట్లు’ అంటే అనుకూలురు, వేగులూ, మొదలైన వారి నుండి ఈ సమాచారమంతా అందిందే. ప్రజల్లో తన పట్ల ఉన్న వ్యతిరేకత, అసహ్యం తానీషా గమనించాడు. ప్రజల్లో ఉన్న గుసగుసలు - “పాపం రామదాసు! శ్రీరాముని కోసం చిన్న గుడి కట్టించాడు. అంతేగాని తన కోసమో, తన వారి కోసమో భవంతి కట్టించుకోలేదు కదా! ఏ హిందూ రాజు కూడా, ఏ ప్రాంతంలో కూడా ఏ ముస్లింనీ ఈద్గా కట్టించాడనో, మసీదు కట్టించాడనో శిక్షించలేదు. ఇంకా కొన్ని ప్రార్ధనా మందిరాలైతే ప్రజల సొమ్ముతో కట్టలేదా! చార్మినార్ అలా కట్టిందే కాదా! అవి మనం కట్టిన పన్ను సొమ్ముతో కావా? ఈ నవాబులు తమ బేగంలకీ, ప్రియురాళ్ళకీ, వేశ్యలకీ, భవంతులు కట్టిందీ, వారి తాతముత్తాతలకి సమాధులు కట్టిందీ మనం కట్టిన పన్ను సొమ్ములు పెట్టి కాదా? అలాంటిది మనం ఇచ్చిన విరాళాల ద్వారా శ్రీరాముని కోసం ఓ చిన్న గుడి కట్టటం అంతనేరమా, 12 ఏళ్ళు జైల్లో పెట్టి చిత్రవధలు చేయటానికి? పన్ను ఎగ్గొట్టిన ఇతర ముస్లింలు లేరా? వాళ్ళనింతగా శిక్షించటం లేదే? ఎంత కౄరుడు ఈ తానీషా?"

ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయన్న నిజం నవాబునీ, అతడి అనుచర గణాన్నీ భయపెట్టింది. దాంతో తానీషా తన అనుయాయులతో బాగా ఆలోచించాడు. ప్రజల్లోని వ్యతిరేకతని పోగొట్టానికి ఓ పధకం రూపొందించారు. ఆ పధకంలో భాగంగానే రహస్యంగా శ్రీరామ పట్టాభిషేకం ఓ వైపూ, ఆంజనేయుని బొమ్మ ఓ వైపూ ఉన్న బంగారు శ్రీరామ మాడల్ని తయారు చేయించారు.

ఈ వ్యూహంలో భాగంగా హఠాత్తుగా ఓ రోజు తానీషా, నిండు కొలువులో తన ’కల’ ప్రకటించాడు. అతడి వివరణ ప్రకారం ’ఆ కలలో ఇద్దరు, యువకులూ అందమైన వారూ, కనిపించారు. ఒకరు నల్లగా శ్రీరాముని పోలి ఉన్నారు, పేరు ’రామోజీ’ అని చెప్పారు. మరొకరు తెల్లగా లక్ష్మణుని పోలి ఉన్నారు, పేరు ’లక్ష్మోజీ’ అని చెప్పారు. తన పడక గదిలో ఇలా తమని తాము పరిచయం చేసుకొని, తాము గోపన్న సేవకులమని చెప్పి, నవాబు అప్పు తీర్చి రసీదు పుచ్చుకున్నారు.’

ఆ కలకు సాక్ష్యంగా నవాబు తానీషా, రామ మాడల రాశిని చూపించాడు. ఈ విధంగా ప్రకటించి గోపన్నను చెరవిడిపించాడు. కానుకలూ, ఉద్యోగం ఎర చూపాడు. తానీషా తనని తాను శ్రీరామ భక్తుడు గానూ ప్రకటించుకున్నాడు. ప్రతీ శ్రీరామ నవమి పండుగకీ భద్రాచలానికి పట్టు దుస్తులూ, ముత్యాలూ పంపుతానని ప్రకటించాడు. ఈ ’కల’ నాటకం లేకుండానూ తానీషా రామదాసుని జైలు నుండి విడుదల చేయవచ్చు. కానీ ప్రజల్లో తనపట్ల ఉన్న ఏహ్యతనీ, అసంతృప్తినీ పోగొట్టలేడు. అందుచేతా ఈ వ్యూహం పన్నారు.

అయితే, తప్పు నిప్పూ దాగవంటారు. రామదాసు విడుదల తర్వాత ఈ ’కల’ నాటకపు రహస్యం కూడా ప్రజలకి ’లీక్’ అయ్యింది. దీని గురించిన గుసగుసలూ, రహస్యచర్చలూ రాజ్యమంతా విస్తరించాయి. సాక్షాత్తూ నవాబు తమనిలా మోసగించటం వారిలో ఉక్రోషాన్ని నింపింది. [మనకంటే ఆనాటి ప్రజలు చాలా నయం కదా! తమని ’చవటదద్దమ్మల్నిగా జమకట్టి నాటకాలాడి మోసగిస్తారా’ అని ఉక్రోషపడ్డారు. మనం రోజు నాటకాలు చూస్తూ కూడా వాటిని ఏ సిద్ధాంత ప్రాతిపదికన జరిగింది అని ఉదాసీనంగా చర్చలు జరుపుకుంటూ ఉండగలుగుతున్నాం.]

ఈ పరిస్థితిల్లో ఔరంగజేబు మరోసారి గోల్కొండ మీదకి దాడి చేసాడు. 31 సంవత్సరాలుగా ఎప్పుడూ ఫలించని దాడి ఈ సారి ఫలించింది. ఔరంగజేబు లంచానికే లొంగిపోయారో లేక తానీషా మీది అసహ్యం కొద్దీనే చేశారో గానీ గోల్కొండ కోట తలుపులు లోపాయికారిగా తెరవబడ్డాయి. ఔరంగజేబు తానీషాని బందీగా పట్టుకొని ఢిల్లీ తీసుకుపోయాడు. చచ్చిపోయేవరకూ తానీషా ఔరంగజేబు ఖైదీగానే ఉన్నాడు.

ఇదీ అసలు కథ.

అయితే ఈ కథ అస్సలు బయటికి రానీయరు కుట్రదారులు. మీడియా, ఈ విషయాలు ప్రచారం కానివ్వదు. మరెవ్వరూ ప్రచారించ కుండా కావలసినన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా తానీషా చచ్చిపోయే వరకూ ఔరంగజేబు ఖైదీగా ఉన్నాడన్న విషయం!

తర్వాత అసఫ్ షాహీ వంశమైన నిజాములు 1724 AD లో గోల్కొండ సింహాసనం ఎక్కారు. హిందువుల్ని చల్లబరిచేందుకు, మంచి చేసుకునేందుకు [ఎటూ హిందువులు సెంటిమెంటల్ ఫూల్స్ కదా! భావవాదులకిది బిరుదన్నమాట] భద్రాచలంకి ప్రతీ యేటా శ్రీరామనవమికి పట్టువస్త్రాలు, ముత్యాలూ పంపడం ఆనవాయితీగా చేసారు. దాన్ని ఇప్పటి ప్రభుత్వాలూ కొనసాగిస్తాయి. ఈ విషయాన్నయితే మీడియా పదే పదే వీలయినన్ని సార్లు ప్రచారిస్తుంది.

’రామదాసు విషయంలో తానీషా చెప్పిన ’కల’ వ్యూహాత్మక నాటకమనీ, పైన చెప్పిన కథ వాస్తవ మనీ ఎలా చెప్పడం?’ అంటారా ………

తార్కిక దృష్టితో తర్వాతి దృష్టాంతాలని [సర్ కంస్టాన్షియల్ అయిన సంఘటనల్ని] పరిశీలించండి.

1]. ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన వారికి ఎలాంటి శిక్షలుంటాయో తానీషా నాటి శిక్షాస్కృతి ఏమిటో ఎక్కడా ఉటంకింపబడదు. ఎందుకంటే రామదాసుకు వేసిన శిక్ష తానీషా ఇచ్ఛానుసారం గనుక. ఇతర నేరస్తులకీ నవాబులు ఇష్టానుసారమే శిక్షస్తారేమో గాక! కానీ రోజుకు రోజూ చిత్రహింసలు పెడుతూ 12 ఏళ్ళు శిక్షించటంలో ప్రత్యేకమైన వ్యక్తిగత ఆసక్తి ఉంది . అంటే తానీషా యొక్క ’కామం తీరని క్రోధం’ ఉంది. గోల్కొండ కోటను చూసిన వారికి రామదాసు చెర ఎంత చిన్నదో ఇరుకైనదో తెలిసేఉంటుంది. మనిషి నిటారుగా నిలబడటానికి కూడా వీలుకానంత చిన్నది. ఇంకా సినిమాల్లోనే చాలా పెద్ద చెరసాల గది చూపారు.


2]. 12 ఏళ్ళ చెరసాల తర్వాత శ్రీరాముడు తానీషాకి కలలో కనబడి రామదాసుని కాపాడాడట. రామదాసు తాను పన్ను ఎగవేయలేదని వాదించాడు. మరి శ్రీరాముడు తానీషాకి పన్నుబకాయిగా బంగారు మొహరీలు కట్టి ఎందుకు రసీదు తీసికొన్నాడు? తప్పుచేయని భక్తుణ్ణి, తప్పు చేశాడంటాడా దేవుడు? తప్పు చేసిన వాణ్ణి కాపాడటానికి వస్తాడా? నమ్మకాల ప్రకారమైనా ఇవి పరస్పర విరుద్దాలు కదా?

3]. అంతగా తానీషా భక్తి పూరితుడైతే అతడి నిజాయితీ ప్రజల్ని కదిలించదా? ఔరంగజేబు కి సహకరించి తానీషాని ఖైదీగా మారుస్తుందా? ఈ సంఘటనలో ప్రజలకి తానీషా మీద ఏహ్యతా, వ్యతిరేక భావమూ ఉండటమే ద్యోతకమౌ తోంది కదా!

4]. తర్వాత రోజుల్లో ఈ కట్టుకథని నమ్మించడానికి చాలా ప్రచారాలే ప్రజల్లోకి వ్యాపింపచేయబడ్డాయి. [తానీషా, ఔరంగజేబు చేతిలో ఖైదీ అయి ఢిల్లీకి రవాణా అయిపోయాడు గదా! మరెవరు ఈ ప్రచారాలు చేసినట్లు? – ఈ ప్రశ్నకు ఈ టపా చివరలో జవాబు చెబుతాను.]

అలాంటి ప్రచారాల్లో కొన్ని.

అ] రామదాసు పంజరంలో చిలకల్ని పెంచాడు. ఆ పాపఫలితంగా జైలు జీవితం గడిపాడు. [మరి తానీషా ఏ చిలకల్ని పెంచి ఔరంగజేబు చెరలో మరణపర్యంతం ఉన్నాడు?]

ఆ] రామదాసు భార్య జాతకం ప్రకారం [ఆమె భర్త చెరసాల పాలవుతారని జాతకంలో ఉందట] రామదాసు చెరసాల పాలయ్యాడట. హిందువుల నమ్మకం ప్రకారం ఎవరి కర్మ వారు అనుభవిస్తారు గాని, ప్రక్క వారి కర్మ మనం అనుభవించం గదా?

ఇ] రామదాసు పూర్వ జన్మ కర్మఫలం తీరలేదట. అందుచేత శ్రీరాముడు 12 ఏళ్ళు వేచి ఉండి అప్పుడు తానీషా కలలో కనబడి రామదాసుని కాపాడాడట. ’భగవద్గీత’లోని కర్మసిద్ధాంతానికి విపరీత భాష్యం ఇది. ఇలాంటి భాష్యాలు ఈనాటి సినిమాల్లోనూ [అమితాబ్ ’అక్స్’ మొదలైనవి], కోర్టు జోకుల్లోనూ బొచ్చెడు చూస్తున్నాం.

ఉదాహరణకి:

జడ్జి:
ఎందుకు హత్య చేసావు?

హంతకుడు:
చంపింది నేను కాదు. చచ్చింది అతడు కాదు. శ్రీకృష్ణుడే అన్నీ చేశాడు.

లేదా

హంతకుడు:
ఆత్మని ఎవరూ చంపలేరు. కాబట్టి నేను హత్య చేసినట్లు కాదు.

ఈ] మరి ఏ కర్మ ఫలం పూర్తిగాక తానీషా జైలు పాలయ్యాడు? [అందునా కలలో శ్రీరామ దర్శనం పొందిన తర్వాత కూడా] తానీషా యొక్క ఈ ఓటమి గురించీ, జీవితపు చివరి దుర్దశ గురించి ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరు. ఏ మీడియా కిక్కురమనదు. ఏ చరిత్రకారులూ ఇది బయటకు తీయలేదు.

ఎందుకంటే ఇలాంటి నిజాలు బయటి కొస్తే ప్రజలు భక్తి వైపు, దేవుడి వైపు ఆకర్షితులేతారు. అదే జరిగితే అప్పుడు ప్రజలు మంచి వైపు, ’ఐడియలిజం’ వైపుగా ప్రయాణిస్తారు. అదే జరిగితే అప్పుడు ప్రజలు సుఖభోగాలంటూ ’లాలస’ తో పరుగులు పెట్టరు. అదే జరిగితే ఇక పదార్ధవాదపు కార్పోరేట్ రంగం ప్రజల రక్తం ఎలా పిండి, సంపదగా మార్చుకోగలదు?

అందుకే కుట్రదారులు ’తానీషా కల’లాంటి అసత్యాలనే తప్ప, నిజాలని ప్రచారం కానివ్వదు. పదే పదే అదే ప్రచారంతో నలుపుని తెలుపనీ, నీళ్ళని పాలనీ నమ్మించవచ్చన్నదే వాళ్ళ మూలమంత్రం!

ఉ] ఇంకా ఇలాంటి కట్టుకథలు నమ్మించడానికి మరికొన్ని అలాంటి కట్టు కథలు ప్రచారం చేశారు. 1764 AD లో జన్మించిన వాగ్గేయకారుడు, భక్త కవి గాయకుడూ అయిన త్యాగయ్య జీవితగాధలోనూ ఇలాంటి సంఘటనలు జొప్పించారు. పల్లకిలో ప్రయాణిస్తున్న త్యాగయ్య పై గజదొంగలు దాడి చేయగా విల్లంబులు ధరించిన శ్యామ సుందరుడూ, మరో తెల్లని సుందరుడు కలిసి తరిమి వేసారనీ, తనకు కనబడని శ్రీరామ లక్ష్మణులు దొంగలకి కనబడ్డారని త్యాగయ్య దుఃఖించాడనీ చెప్పు కుంటారు. పోతన్న, తులసీ దాసు ఇంకా ఎందరి జీవిత కథల్లోనో ఇదే మాదిరి సంఘటనలు జరిగాయ’ట’.

ఊ]. మరో మౌఖిక ప్రచారం ఏమిటంటే శ్రీరామ భక్తులు ఇబ్బందుల పాలవుతారట. రామదాసు, త్యాగయ్య, పోతన ...... ఇలాగన్నమాట. అదే నిజమైతే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా శ్రీరాముణ్ణి ఎందుకు పూజిస్తారు? అదే నిజమైతే ప్రతి ఊరిలో శ్రీరామ విగ్రహం తో గుడి ఒకటైన ఉంటుంది. మరి ఇదెలా సాధ్యం?

‘ఇక్కడ తెలియటం లేదా మన దేవుణ్ణి మనం పూజిస్తే కష్టాలు వస్తాయి’ అని మనకి ఇంకించటానికి కుట్ర జరుగుతుంది అన్న విషయం.

బు] అక్కన్న మాదన్నల గుడి కట్టడాలలో నిజాలెంత? రామదాసు గుడి కట్టినందుకు తానీషాకి కోపం రాలేదు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల సొమ్ముతో కట్టినందుకే కోపం వచ్చి జైల్లో పెట్టాడు’ అన్న వాదనని మరింత ప్రచారం చేసుకొనేందుకే అక్కన్న మాదన్నలు ఓరుగల్లులో చాలా గుడులు కట్టించారన్న ప్రచారం జరిగింది. కుట్రదారులు తలుచుకొంటే సాక్ష్యాలకు కరువా? శాసనాలతో సహా సాక్ష్యాలూ సిద్ధమై పోయాయి.

’తానీషా ఔరంగజేబు చేత బందీ చేయబడి, గోల్కొండ నుండీ ఢిల్లీకి పట్టుకుపోబడ్డ తర్వాత ఎవ్వరీ ప్రచారమంతా చేశారు’ అంటే…….

౧]. ఎవరైతే తానీషాకి ’కల’ వ్యూహం చెప్పారో,

౨]. ఎవరైతే ఔరంగజేబు టోపీలు కుట్టి, ఖురాన్ కి వ్రాతపతులు వ్రాసి, అవి అమ్మి తిండికి సంపాదించుకొనే వాడనీ, అంతేగానీ ప్రజల సొమ్ముతో తిండి తినలేదనీ ప్రచారం చేశారో

౩]. ఎవరైతే అందరు ముస్లింరాజులని [అక్బర్ తోసహా] సర్వోత్తములని ప్రచారం చేశారో

౪]. ఎవరైతే రాముడు గొప్ప హిపోక్రైట్ అంటూ విషవృక్షాలని వ్రాయింపించి ప్రచారించారో……… వారు.

తరతరాలుగా, వందల సంవత్సరాలుగా [కనీసం 300+ సంవత్సరాలు] వారు చేస్తోన్న కుట్రలివే.

కాబట్టే అన్ని చర్యలకీ, అన్ని సంఘటనలకీ అన్ని ప్రచారలకీ అంతిమ లక్ష్యం ‘హిందూ సంస్కృతిని నాశనం చేయటం, భారతీయుల్ని, హిందువుల్ని కించపరచటం, హిందూ మతాన్ని అవహేళన, నాశనం చేయటమే’ అయ్యింది. పరిశీలించి చూడండి – ఇది నిజమో కాదో?

ఇలా అన్నిటివెనుకా ఒకే లక్ష్యం, ఒకే అంతస్సూత్రం ఉన్నప్పుడు ఆ చర్యలూ, సంఘటనలూ, ప్రచారాలు వాటంతటవే జరుగుతాయా? అవన్నీ ఓ పద్ధతిప్రకారం నడిపించబడటం ఉన్నప్పుడు ఓ పద్దతి ప్రకారం నడిపించే వాళ్ళెవరో ఉండాలి కదా! అదీ – ఓ విదేశీ [సి.ఐ.ఏ.లాంటిది] వ్యవస్థే కానివ్వండి, ఓ వంశస్థుల వ్యవస్థే కానివ్వండి, ఉండి తీరాలి కదా!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .
************

5 comments:

" ఎవడబ్బ సొమ్మని కులికేవు రామచంద్రా " అంటూ రామదాసు రాసిన పాటల మాటేమిటి ?
మీరు చెప్పిన విషయాలు చాలా వరకు నమ్మేట్టుగానే ఉన్నా ఈ విషయంలో కొంచెం సందేహంగా ఉంది.

ప్రదీప్,

రామదాసు తానీషా చెరలో
“సీతమ్మకి చింతాకు పతకము
లక్ష్మణునకు ముత్యాల పతకము
శ్రీరామునికి కలికితురాయి,
గుడికి గోపురాలు కట్టించాననీ,
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరుగుతున్నావనీ శ్రీరాముణ్ణి తిట్టి,
ఆనక
"అబ్బ తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్ర
యీ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర
ఏటికి జల్లిన నీళ్ళాయె నాబ్రతుకు రామచంద్ర
నేను అధములందరి కంటె నన్యాయమైతిని రామచంద్ర”
అని దుఃఖించాడు.

కానీ – ఆ పతకాలకీ, కలికితురాయికీ, గోపురాలకీ పట్టిన వేలాది వరహాలు తాను పన్ను ఎగ్గొట్టిన సొమ్ము అనలేదు కదా! పతకాలకీ, గుడి గోపురాలకి శ్రీరాముని తండ్రి దశరధ మహారాజో, మామ జనక మహారాజో డబ్బు పంపలేదనీ, తాను ఎంతో భక్తిగా విరాళాలు సేకరించి, ఎంతో శ్రద్దగా పతకాలు చేయించి, గోపురాలు కట్టిస్తే శ్రీరాముడు హాయిగా గుళ్ళో కులుకుతూ కూర్చోన్నాడు గానీ, గుడికట్టినందుకు ప్రతిఫలంగా తానిన్ని బాధలు పడుతుంటే తనను కాపాడలేదని ఆక్రోశించకూడదా? తాను అన్యాయమైపోయాననీ, మొరాలకించి రక్షించమనీ వేడు కొనడమే గదా ఆ పాటలో ఉంది?

మీరు చెప్పిన రెండవ సగం నాకు తెలియదు. ఎంతసేపూ మొదటి సగం గురించే విన్నాను. నాకు రెండవ సగమెవరూ చెప్పలేదు. చెప్పినందుకు కృతజ్ఞతలు

చరిత్ర పుటల్లో ఎక్కడో చిన్న వాక్యం గా కనపడే మరో మాట కూడా రాయాలని అనిపిస్తోంది. ఔరంగజేబు తానీషా ని జయించి బందీ చేశాక, గోల్కొండ వీధుల్లో అక్కన్న, మాదన్న లని (కేవలం వారు హిందువులన్న ఒక్క కారణంగా నేమో !) రాళ్ళతో కొట్టి చంపించాడట ! అలా భయపెడితే హిందువులు తాము తెలివి తేటలు ఉన్నా, మరి ఇక ఏ పదవులకీ ముందుకు రాకుండా చేయాలన్న ఉద్దేశ్యమే బహిరంగం గా కనిపిస్తోంది. మీ అభిప్రాయం తెలుపుతారా దీని గురించి?

విరజాజీ గారూ!

అక్కన్న మాదన్నలని గోల్కొండ వీధుల్లో రాళ్ళతో కొట్టి చంపించారని నాకు తెలియదండి. మంచి సమాచారం ఇచ్చారు. కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu