ముందుగా భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని, భావాన్ని వ్రాసి మన జీవితాల్లో ఆ అనువర్తనతో నాబ్లాగు చుట్టాలని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.


యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః

స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే


భావం లోకంలో ఉత్తములైన వారు దేనిని అనుసరిస్తారో జనులందరు దానినే అనుసరిస్తారు. ఉత్తములైన వారు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో ప్రజలందరు దానినే అనుసరిస్తారు.


కాబట్టే పూర్వపు రోజుల్లో మునులేం చెబితే ప్రజలది చేశారు. శ్రీరాముణ్ణి, హరిశ్చంద్రుణ్ణి అనుసరించారు. నిన్న మొన్న కూడా తిలక్, బాపూజీలని అనుసరించారు.


సరిగ్గా ఇక్కడే మీడియా తన గూఢచారపు ఆట లేదా కుట్ర మొదలెట్టింది.


ఒకప్పుడు నీతినీ, నిజాయితీనీ లేక సిద్దాంతాన్ని ఆచరించి చూపిన వారు నాయకులయ్యారు. ఇప్పుడు అవన్నీ నటించి చూపుతున్న వారిని నాయకుల్ని చేస్తోంది మీడియా.


ఇందుకు దృష్టాంతాలు మన కళ్ళ ముందు కోకొల్లలు.


ఒకప్పుడు నటులంటే [మన తాత తండ్రుల హయాంలో[ ముఖానికి రంగేసుకొని మనల్ని అలరించ ప్రయత్నించే కళాకారులు. వేమూరి గగ్గయ్యలైనా, షణ్ముఖ ఆంజనేయులైనా, ఈలపాటి రఘురామయ్య అయినా, వాళ్ళెంత నేర్పున్న నటులూ, గాయకులూ అయినా వాళ్ళు కళాకారులు మాత్రమే. నాయకులు కాదు.


వాళ్ళు నటించి ప్రదర్శించే పాత్రలు వాళ్ళు కారుఅన్న స్పృహ ప్రేక్షకుల్లో బాగా ఉండేది.

ఇక్కడో చిన్న సంఘటన ఉదహరిస్తాను. మా చిన్నప్పుడు గుంటూరులో శ్రీరామ నవమికి పెద్దపెద్ద తాటాకు పందిళ్ళు వేసి, అలంకరించి ఉత్సవాలు జరిపేవారు. శ్రీరామ కళ్యాణం, ప్రసాదాలు, అన్నదానాలు తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలతోనూ ఊరంతా ఉత్సాహం నిండేది.


ఓ సారి పందిరిలో యోగి వేమన నాటకం వేసారు. ఆ నాటకంలో వేమన యోగి వేషం వేసిన నటుడు చూపిన హుందాతనం, నటన చూసి అందరూ చాలా మెచ్చుకున్నారు. అప్పటికి నాకు తొమ్మిదేళ్ళో ఎనిమిదేళ్ళో ఉంటాయి. ఆ నటుణ్ణి చూడాలన్న ఉబలాటంతో ఉత్సవకమిటీ పెద్దల కన్నుగప్పి స్టేజి ప్రక్కనే ఏర్పాటు చేసిన గ్రీన్ రూమ్ లోకి పిల్లిలా దూరాను. అప్పటికి వేషం తీసేసిన సదరు నటుడు చుట్టతాగుతూ సహనటీనటుల్లో ఎవరినో బండబూతులు తిడుతున్నాడు. నేను అప్పటి వరకూ పాఠాల్లో నేర్చుకొన్న వేమన పద్యాల్ని కమ్మటి గొంతుతో ఆలపించిన ఆ కంఠమే ఇప్పుడు బండబూతులు పలుకుతోంది. దెబ్బకి పారిపోయి బైటకి వచ్చాను. తర్వాత మా నాన్నకి చెబితే ఆయన ఫకాల్న నవ్వి నటులు వేసే పాత్రలు గొప్పవి తల్లీ. అంతేగాని ఆ పాత్రల గొప్పదనం ఆ నటుల్లో ఉండదు. నటులు వ్యక్తులు. వాళ్ళ వృత్తివేరు. ప్రవృత్తి వేరు అని చెప్పారు.


ఈ సూక్ష్మం నాటక రంగంలో బయటికి కన్పిస్తుందిగానీ, సినిమా రంగంలో అయితే మనం వెళ్ళి చూడలేము కదా! ఆయా నటీనటుల గురించి మీడియా ఏది ఆపాదిస్తే దాన్నే మనం కామమ్మ మొగుడంటే కామోసు అనుకోవాలయ్యే. [ఈ సూత్రం సినిమా నటులకే కాదు, రాజకీయ నటీనటులకీ వర్తిస్తుంది]


కాబట్టే తము వేసిన పాత్రల గొప్పదనాన్ని తమకే ఆపాదించుకొన్న ఆనాటి నటుల్ని భరించాం. సినిమా రంగంలో కెరీర్కోసం కింగ్ మేకర్లవంటి గాడ్ ఫాదర్ల కాళ్ళుపట్టుకున్న లాబీయింగ్ ని తెర వెనుకే దాచేసి, తెరమీద తాము ధరించిన పాత్రల గొప్పదనాల్ని గుర్తుచేసి, తొడలు గొడుతున్న లేదా మీసాలు మెలేస్తున్న నేటి నటుల్నీ చూస్తున్నాం.


ఈ విధంగా కుహనా శ్రేష్ఠుల్ని మన నెత్తిన రుద్దడంలో మీడియా ఎంత శక్తి వంచన లేకుండా పని చేస్తోందో మనకే కాదు, మన సుబ్బిగాడికి కూడా బాగా తెలుసు.


మచ్చుకి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.


1]. 2006 లో సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్, మరో వ్యక్తి ఇద్దరి మీద తుపాకి కాల్పులు జరిగాయి. ఆ తర్వాత అదే ఇంట్లో దొంగతనానికొచ్చిన దొంగలెవరో ఆ ఇంటి పనివాళ్ళని హత్య చేశారు. బెల్లంకొండ సురేష్ మీద తుపాకి కాల్పులు జరిగినప్పుడు ఆ కేసు సంచలనం సృష్టించింది. అతడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఈ షాక్ తో బాలకృష్ణ హాస్పిటల్ లో పడ్డాడు. తూటాలు దిగిన బెల్లం కొండ సురేష్ కూడా కోలుకొని ఇంటికి పోయాడు గాని, అంతకంటే ఎక్కువ రోజులే బాలకృష్ణ కేర్హాస్పటల్ లో డా. సోమరాజు వైద్యంలో మెంటల్ షాక్ నుండి తేరుకోలేక హాస్పటల్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత మామూలుగా కేసు కోర్టులో వీగిపోయి కొట్టివేయబడింది. పోలీసులు ఆధారాలు చూపలేక పోయారు. ఏ వత్తిడికో మరి, తూటాలు తిన్న బాధితుడు మాట మార్చాడు.


అయితే ఇందులో మీడియా ఏ కూపీ లాగలేక పోయింది. అవును మరి, బాలకృష్ణ ఏమన్నా ఢిల్లీ డాక్టరు రాజేష్ తల్వారా? లేని నేరాన్ని తవ్వి బయటికి తీయడానికి?


పాక్ తీవ్రవాదులు తాజ్ హోటల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసుకొనేంతగా ఎవ్వరు సహాయం చేసారో మీడియా ఈనాటికి కూపీ లాగలేదు. అలాగే బాలకృష్ణ ఇంట్లో తుపాకీ తానంత తానే వచ్చి గాల్లో కాల్పులు [రజనీకాంత్ శివాజీసినిమాలోని డ్యూయెట్ పాటలోలాగా] జరిపిందా బెల్లం కొండ సురేష్ మీద? తూటా అంటూ పేలాక పేల్చిన వాడొకడు ఉండాలిగా? అవేవీ బయటకు రావు. మీడియా బయటికి తీయదు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. బాలకృష్ణ తుపాకి కాల్పులు చూసే తట్టుకోలేంత సున్నిత మనస్కుడు అయిన అవ్వాలి [సామాన్యుడు కూడా బాంబుదాడులు చూసి తట్టుకుంటున్నాడు] లేదా కేసు నుండి తప్పించుకోడానికి నాటకం అయినా ఆడి ఉండాలి. ఇలాంటి వాళ్ళని భావి ముఖ్యమంత్రులు గానో లేక ప్రస్తుత నాయకులుగానో మాత్రం మీడియా చిత్రిస్తుంది.


2. మరో ఉదాహరణ మాయావతి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఈవిడకు, ఆ బహుజన్ సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన కాన్షీరామ్ తో గల సన్నిహిత మైత్రీ బంధంతోనే అత్యంత దగ్గర దారిలో ముఖ్యమంత్రి అయ్యిందన్నది అందరికీ తెలిసినదే. అంతే కాదు అతడి అవసాన దశలో హాస్పటల్ ఉండగా మాయావతి దాదాపు అతణ్ణి కిడ్నాప్చేసిందేమో అన్నంతగా నిర్బంధించిందనీ, తమను అతణ్ణి కలవడానికి కూడా వీలుకానంత పకడ్బందీగా ఇదంతా జరుగుతుందనీ సాక్షాత్తూ కాన్షీరాం తల్లీ, చెల్లీ కోర్టుని ఆశ్రయించారు.


ఏదో నెపంతో సమాజంలోనో లేక రాజకీయాల్లోనో పెద్ద పొజిషన్లో ఉన్నవాడికి దగ్గరైతే అక్కడ నుండీ ఆపార్టీని, తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం, ఆ పెద్ద పొజిషన్లోకి తాము రావడం ఎంత సులభం?


ఇవేవీ మీడియా ఆక్షేపించదు సరికదా, భావి ప్రధాని కావచ్చేమో అన్నంత ఇమేజిని పాజిటివ్ కవరేజ్తోనో, అది వీలు కాకపోతే నెగిటివ్ కవరేజ్తోనో ఇస్తుంది.


ఈ పాజిటివ్ లేదా నెగిటివ్ కవరేజిల విన్యాసం ఎలాంటి వంటే కార్పోరేట్ వ్యాపార రంగంలో ఒక నానుడి ఉంది - మన యాడ్ ఉంటే పరమ అద్బుతంగా నన్నా ఉండాలి. లేదా పరమ ఛండాలంగా నన్నా ఉండాలి. అప్పుడే మన యాడ్ ప్రజలకి గుర్తుంటుంది, జనాలకి మన ప్రొడక్ట్ చేరుతుంది’ - అన్నదే ఆ నానుడి.

ఇదే ప్రచార సూత్రం మీడియా అన్ని రంగాలకీ అనువర్తిస్తుంది.


3]. నిజానికి మాయావతి ఉదాహరణలాంటిదే 1993 నుండి 1995 దాకా మన రాష్ట్రంలో జరిగిన లక్ష్మీ పార్వతి ఉదంతం కూడా. తండ్రి ఎన్.టి.ఆర్. రాజకీయాల్లోకి వస్తే ఎండనకా, వాననకా పగలనకా, రేయనకా కష్టపడ్డ హరికృష్ణల్లాంటి కొడుకులూ, అల్లుళ్ళూ, ఇతర కార్యకర్తలూ, పులుసులో కలిసిపోయి, జీవిత కథ వ్రాస్తానంటూ దరిచేరిన ఈ హరికథా కళాకారిణి సాక్షాత్తూ ఎన్.టి.ఆర్. కి రెండో భార్య అయి, తె.దే.పా.కి అడ్డదారిలో అధిష్టాన దేవత అయిపోయింది. అది సహించ లేక పాపం తెదేపా వర్గీయులు విప్లవం లేవదీసి ఎన్.టి.ఆర్. ని ఇంటికి పంపారనుకొండి, అది వేరే విషయం. ఇక్కడ రాజకీయాల్లో పై స్థానానికి రావడానికి ఇది ఎంత దగ్గరి దారో చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.


నైతికత తాలూకూ ఈ మూలాలని ఏమాత్రం ప్రశ్నించకుండా మీడియా వహించే వ్యూహాత్మక మౌనాన్ని మనం ఏమని పిలవాలి? ఈ దేశంలో ప్రతి చిన్న ఉద్యోగానికి, పాస్ పోర్టు వీసాలకీ అడిగే కాండక్ట్ సర్టిఫికేట్ లేదా పోలీస్ స్టేషన్ లో ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం కానీ, రాజకీయనాయకులకి మాత్రం అసలు నైతికతే అవసరం లేదా?


4]. ఇదే అడ్డదారిలో ఎంతో సునాయాసంగా కేంద్ర ప్రభుత్వ కుర్చీవ్యక్తి, రాజ్యాంగేతర శక్తి అయిపోయింది ఈ నాగమ్మ. దశాబ్ధాల పాటు క్రియాశీల రాజకీయాల్లో పడి కొట్టుకున్నా కేంద్రమంత్రులు కూడా కాలేకపోయిన సీనియార్లు మన రాష్ట్రంలోనే బొచ్చెడుమంది ఉన్నారు. కోడలిగా ఇంట అడుగుపెట్టి, ఒక్కొక్క అడ్డే తొలిగించుకొంటే ఎంత సునాయాసంగా పై సీటు ఎక్కేయవచ్చు గదా.


5]. అంతేకాదు, అసెంబ్లీల్లోనూ, పార్లమెంట్లుల్లోనూ రాజకీయనాయకులు తమ అక్రమ సంపాదన నీవిన్ని కోట్లంటే నీవిన్ని కోట్లంటూ పరస్పరం నిందించుకొంటారు. నీకిన్ని అక్రమ సంబంధాలున్నాయంటే నీకిన్నని, ‘నీకిందరు భార్యలంటే నీకిందరనీ పరస్పరం దూషించుకొంటారు.


ఎలక్షన్లప్పుడు ప్రజలు ఇవే విషయాలు నిలదీసినా, మీడియా ప్రచారించదు. మీదు మిక్కిలి వాళ్ళ పట్టు ఎంత ఎక్కువో అన్యాపదేశంగా వ్రాస్తుంది. ఉదాహరణ కావాలంటే పైకి తెగ కొట్టుకున్నట్లు నటించే రామోజీరావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డిలను పరిశీలించవచ్చు. మొన్నటి జడ్పీటిసీ ఎన్నికల గురించి వ్రాస్తూ వై.ఎస్. పట్టుగురించి ఎంత పట్టుగా వ్రాసిందో ఈనాడు 03-01-2009 చదివితే తెలుస్తుంది.


రాజు తలుచుకొంటే దెబ్బలకి కొదవా అన్నట్లు, మీడియా కింగ్ మేకర్ లు తలుచుకొంటే మార్గాలే కొదవా?


నిజానికి శ్రేష్ఠులంటే వీళ్ళా? ఎవరు పేరు ప్రఖ్యాతులు పొందితే, ఎవరు సిరిసంపదల్నీ పోగేస్తే, ఎవరు తమ వ్యాపర లేదా ఇతర రంగాల్లో విజయాల్ని సాధిస్తే, వారిని మనం విజేతలుగానూ, శ్రేష్ఠులు గానూ గుర్తుస్తాం. వారి గుణగణాల్ని ప్రశంసిస్తాం.


అయితే ఎవరికైనా పేరు ప్రఖ్యాతులు కట్టబెట్టిగలిగిన మీడియా, ఎవరిని శ్రేష్ఠులంటే వారే శ్రేష్ఠులుగా చెల్లుబడి అయ్యేస్థితి ఇప్పుడు సమాజంలో నెలకొంది.


అందునా ఈ ఫాలోయింగ్ అంతా సినిమా తారలకీ, క్రికెట్ వీరులకీ కట్టబెట్టటంలో మీడియా కృతకృత్యమైంది. ఇక చూస్కోనా సామిరంగా అంటూ కార్పోరెట్ ప్రోడక్ట్ ల అమ్మకాల దగ్గరనుండీ పెళ్ళికాకుండానే సహజీవనాలు చేసే బిపాసాబసు, జాన్ అబ్రహాం ల దాకా ఎన్నో ఒరవళ్ళు. జులపాల జుట్టులూ, టాట్టుస్ లూ, డిజైనర్ దుస్తులూ, ఆభరణాలు ఆపైనా 6 to 8 ప్యాక్ శరీరాలు. దేని లీడ్ [అనుసరణ] దానిదే.


సద్గుణాల్లోనూ, సత్ర్పవర్తనలోనూ గాక కేవలం వెర్రిల్లో పై శ్రేష్ఠులంతా ఎంతో గొప్పగా సమాజాన్ని లీడ్చేస్తున్నారు. విలువలు పోయాయని ఏడవకుండా ఇదే అభివృద్ది మంత్రం అనుకొమ్మని మనల్ని గొడవ పెడుతున్నారు.


తనకంటే ఆర్ధికబలం ఎక్కువున్న రావణుడు తన భార్య సీతని, తను లేనప్పుడు అపహరించి తీసుకుపోతే పోతే పోనిలే అని రాముడనుకోలేదు. పోయిన విలువల కోసం, పోయిన బంధాల కోసం ఏడవకుండా, ఇదే అభివృద్ది మంత్రమనీ, తనకంటే బలవంతుడు తన భార్యని ఎత్తుకెళ్ళాడు గనుక తాను, తన కంటే బలహీనుడి భార్యని ఎత్తుకొచ్చుకుంటే సరిఅనుకోలేదు. అటు సీతమ్మ తల్లీ కూడా రావణుడు చూపెట్టిన సంపద, పట్టమహిషి పదవి వంటి అన్నిటికీ అభివృద్ధి అనో, బాగుపడాలంటే ఇంతే అనో అనుకోలేదు. తృణం అంటే గడ్డిపరకని చూపెట్టి మరీ గుణం [సౌశీల్యం] కంటే ఏ సంపదా గొప్పవికాదని చెప్పింది.


అలాంటి శ్రేష్ఠుల్ని దేవుళ్ళనుకొని కొలిచేంతగా మంచిని అనుసరించే వాళ్ళు మన భారతీయులు. అలాంటి భారతీయులకి ఈ రోజు ప్రచారపు మేలిముసుగు వేసి రంగులు అద్దుకున్నట్లుగా నటననీ, అబద్దాలనీ అద్దుతున్న రాజకీయ నటీనటుల్ని, వృత్తి గత నటీనటుల్ని శ్రేష్ఠులుగా చూపెట్టి మాయ చేయాలనుకుంటున్న నీచపు కుట్రా, గూఢచారపు మోసం భారీ ఎత్తున నడుస్తున్నాయి.


ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నది భారతీయులుగా మన నమ్మకం.


ప్రచారంతో అబద్దాన్ని నిజమని నమ్మించగలమన్నది మీడియా కుట్రదారుల ప్రయత్నం.


చూద్దాం ఏమవుతుందో!


తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!


**************

6 comments:

:-)

నిజమే

బాగా వ్రాసారు.ధన్యవాదములు.

bagaa raasaru

మీ వెశ్లేషణ బాగుంది.
"ఈ అమ్మకింత బలం ఎలా వచ్చింది?" ఈ వ్యాసము అమెరికా వాడు చంద్రుడి మీద కాలుపెట్టాడా లేదా అనేటంత క్లిష్టమైంది.

మీరిలా చెప్తుంటే నాకొక విషయం గుర్తు వస్తుంది. 92-95 మధ్యలో అనుకుంటా ఇది జరిగింది.
రామోజీరావు మానేజర్ ఒకతను కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నాడు. తనను చంపబోతున్న రామోజి నుండి తప్పిచుకునేందుకు అప్పుడే రాజకీయంగా ఎదుగు తున్న దేవినేని వంశాంకురం రమణను అల్లుడిగా చేసుకుని ఆపై అమెరికా చెక్కేశాడు. మన రామోజి సామాన్యుడా? ఆ రమణ తమ్ముడు ఉమని పట్టుకుని అన్నని రమణని లేపేశాడు. చంద్రబాబు, ప్రణీతను రాజకీయాల్లోకి దింపుదామని చేసిన ఆలొచనతో మన ఉమ గారికి నషాలానికి అంటింది. చెట్టంత మగాడిని నన్ను కాదని వదినకు అవకాశమిస్తారా? దాంతో ఎవరో పుణ్యత్ములు గర్భవతి అనికూడా చూడకుండా ప్రణీతను సైలెంట్ గా చంపేశారు.
పిల్లలు ఎక్కడ వీళ్ళ ఘాతుకానికి బలవుతారో అని అమెరికాకు తీసుకెళ్ళిపోయారు. ఇవన్ని ఆనాడు నందిగామ పరిసర ప్రజలందరకు తెలిసిన విషయాలు. కాని పెద్దలు బయటకు రాకుండా మానేజ్ చేశారని వినికిడి.
అంతెందుకు బాలయోగిని బ్రతికున్నప్పుడు ఎంత పొగిడారు, చనిపోయిన తర్వాత తన భార్యను బలవంతంగా ఎమ్మెల్యేని చేశారు. ఆతరువాత వళ్ళను పట్టించుకున్న దిక్కేలేదు. మనవాడు కదు కదా మనకెందుకు. అదండీ సంగతి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu