దీన్ని మరింతగా పరిశీలించాలంటే ..........


సెప్టెంబరు 16, 1984 న ఇందిరా గాంధీ AP గవర్నరు రామ్ లాల్ ని వెనక్కిపిలిచి, శంకర్ దయాళ్ శర్మని గవర్నర్ గా APకి పంపి ఎన్.టి.రామారావు ప్రభుత్వాన్ని పునరుద్ధించింది. తమ ప్రమేయం లేకుండానే తమపేరన నడిచిన ఈ నాటకం ఆవిడ దృష్టి రామోజీ రావు మీద పడేలా చేసింది. ఈ ప్రమాదాన్ని లోపలున్న విదేశీ కోడలు బయటికి చేర వేసింది.


ఈ లోగానే ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర నిఘా సంస్థలు ఈ రామోజీ రావు పుట్టుపూర్వోత్తరాలనీ, మీడియా ముసుగు వేసుకొన్న గూఢచార నెట్ వర్క్ నీ పరిశోధించ మొదలెట్టాయి. ఆ కారణంగానే రామోజీ రావు ఆ రోజుల్లో ప్రచురించిన కొన్ని వార్తలూ, ముఖ్యంగా అతడు వ్రాసిన ఓ సంపాదకీయం రాజ్యాంగ వివాదమై కూర్చున్నాయి. అతణ్ణి అసెంబ్లీకి పిలిచి సంజాయిషీ అడుగుతారా లేదా అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ రేపేంతగా పరిస్థితులు వేగంగా పరిణమించాయి.


ఏదో కారణంగా అరెస్టయనా, గూఢచారికీ, గూఢచార వ్యవస్థా కేంద్ర బిందువైన వాడికీ ముప్పే! అందుకే ముందుగానే ప్రమాద హెచ్చరికని అందుకొన్న రామోజీ రావు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. 1984 సెప్టెంబరు - అక్టోబరు నెలల్లో ఇది ప్రముఖ వార్త అయ్యింది. అంతలోనే అఖిల భారత ఎడిటర్స్ గిల్డ్ కు ఇతడు ఛైర్మెన్ అయ్యాడు. అంతలోనే ఇందిరా గాంధీ నం.1 సఫ్ధర్ జంగ్ రోడ్ లో ఆవిడ అధికార నివాసం లోనే హత్యకు గురైంది. అప్పడు సిక్కులు చాలా మంది ఢిల్లీలో హత్యలకు గురైనారు. అవి భావోద్రేకంతో జరిగాయని, రాజీవ్ గాంధీ యే చేయించాడని రకరకాలుగా పుకార్లు ఉన్నాయి. కానీ మొన్న విచారణ కమిటి రిపోర్టులో 500/- రూపాయలకి ఒక హత్య చొప్పున కాంట్రాక్ట్ మీద జరిగిందని, అంతా ముందే ప్రీపాన్ల్ డ్ గా జరిగిందని రిపోర్ట్ వచ్చింది. ఇందిరా గాంధీ హత్య జరుగుతుందని ముందుగా ఎవరికి తెలుసో లేదా ఎవరు ప్రణాళిక రచించారో వాళ్ళు కదా సిక్కులను చంపాలని కాంట్రాక్ట్ కుదుర్చుకోగలరు? ఇక్కడ తెలియడం లేదా కుట్రస్వరూపం?


అప్పటికి ప్రాంతీయ పేపరు వాడైన ఈ రామోజీ రావు చుట్టూ అద్వానీ, వి.పి.సింగ్ లాంటి కేంద్ర నాయకులు [కాబోయే ప్రధానులూ, మాజీ కేంద్రమంత్రులూ కూడా] కరుణానిధి లాంటి ఇతర పార్టీ నాయకులూ తిరిగేవారు.


మీడియా, రాజకీయ రంగాలు పరస్పరం ఆధారపడ్డరంగాలు అనుకొన్నా రామోజీ రావు కూడా రాజకీయ నాయకుల చుట్టూ తిరగాలిగా? అలా ఉండేది కాదు. ఇప్పడంటే ఇతడు చిరంజీవి తండ్రిగారు మరణిస్తే వచ్చి పలకరించిపోతున్నాడు, ఎల్.కె. అద్వానీ జీవిత చరిత్రని ఆవిష్కరించడానికీ బయటికొస్తున్నాడు గానీ 1992 కి ముందర దాదాపు రామోజీ రావు ముఖం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఇక ఆయన కుటుంబసభ్యుల సంగతి సరేసరి. రాష్ట్ర ముఖ్యమంత్రులిచ్చే నంది అవార్డులు కూడా, ఇతడి తరుపున ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణ చంద్రరావు లాంటి వాళ్ళు తీసికొనే వాళ్ళు. ఆ విధంగా రామోజీ రావు ఎవరి చుట్టూ తిరిగేవాడు కాదు. కానీ పదే పదే ఎల్.కె. అద్వానీ. వి.పి. సింగ్ లూ మాత్రం ఇతడి చుట్టూ తిరిగే వారు.


ఇదెక్కడైనా అప్పట్లో మనం చదివామా? ఎందుకంటే ఈ మీడియా కింగే, కింగ్ మేకర్ అయిన చోట ఇతడి గురించిన ఇలాంటి వార్తలు ఎవరైనా వ్రాస్తారా? వ్రాసేంత దమ్ముంటుందా? అలాంటి దమ్ము చూపెట్టిన ఎన్ కౌంటర్ పత్రిక అధినేత, సంపాదకుడూ, పింగళి దశరధరామ్ [ఈయన మన జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకన్న గారి మనుమడు] బెజవాడ వీధుల్లో హత్య చేయబడ్డాడు. మరింకెవరైనా నోరెత్తగలరా? [ఈ వివరాలు నేను 1992 లో పి.వి. నరసింహరావు గారికిచ్చిన ఫిర్యాదులో ఒకభాగం]


ఇంతబలమైన ఈ నకిలీ కణికుడి గూఢచార వలయం ఈ నాగమ్మని కాపాడుతుండగా లేదా


ఇంత బలమైన ఈ నాగమ్మ రామోజీ రావుని కాపాడు తుండగా


ఈ ఇద్దరికీ ఇంతబలమూ ఇంత శక్తి ఉండటం సహజమే కదా!


ఎటూ ఈ రెండు శక్తులకి ముందో వెనకో ఇస్లామా బాద్ ఉండనే ఉందయ్యా!


మళ్ళీ విషయంలోకి వద్దాం. రాజీవ్ గాంధీ హత్యకి LTTE ధనూ ఎంత పైకారణమో, ఇందిరా గాంధీ హత్యకి సిక్కు సెక్యూరిటీ గార్డులు అంతే పైకారణం. అంతర్గత కారణం మాత్రం ఆనాడే కాదు ఈ నాటికీ నడుస్తున్న ఈ నకిలీ కణికుడు, అతడి వంశీయుల కుట్రే.


ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే నా ఆంగ్ల బ్లాగు Coups On World లోని Coup on Indian Politics & Govt…… లో చూడండి.


అందరి దృష్టీ ఓ వైపు కేంద్రీకరింప చేసి, మరో వైపు తమ పని చల్లగా కానిచ్చేసుకోవడం చోర కళలోనూ, చార కళలోనూ ఓ విన్యాసం.


అందులో భాగమే 1992 లో ముందు రామోజీ రావు రాష్ట్రానికే పరిమితమైయిన ఓ ప్రాంతీయ తెలుగు వార్తపత్రిక ప్రచురణ కర్త. [ఇప్పుడైతే పలు దేశీయ భాషల్లో టీ.వి. ఛానెళ్ళు, గిన్నిస్ రికార్డు, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఫిల్మ్ సిటిలాంటివి ఉన్నాయి గానీ అప్పటికైతే అంతే] ఎవరికైనా [నిఘా సంస్థలతో సహా] అనుమానం వచ్చినా ఇంత చిన్న లోకల్ పేపర్ వాలాకి అంతసీన్ ఉండదులే అనుకోవాలన్నదే ఇక్కడ తంత్రం లేదా నైపుణ్యం. సి.ఐ.ఏ. ఏజంట్లుగానూ, కుట్రదారులుగానూ హిందూ ఎన్.రామ్ లూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాధ్ గోయంకాలు కనబడేవాళ్ళుగానీ రామోజీ రావు మీద అస్సలు అనుమానం కూడా రాలేదు.


అలాంటిదే ఈనాటి ఈ నాగమ్మ అతడికి సహోదరి వంటిదో, సరిసమానురాలో గానీ, ఈవిడ కూడా పైకి వాటికన్ కీ ఏజంట్ లాగా కనబడుతోంది గానీ అంతర్గతంగా ఈవిడ పాకిస్తాన్ కూ అనుకూలంగా, ఇంకా చెప్పాలంటే నకిలీ కణీకుడి ఏజంట్. అందుకే పైకి మాటల్లో క్రిస్టియన్ పక్షపాతిలా కనబడుతున్న లోపల చేతల్లో ముస్లిం అనుకూలవతి.


ఇక ఈ నాగమ్మకి ఉన్న పట్టు ఎంతటి దయ్యా అంటే – 1972 లో పాకిస్తాన్ తో [బంగ్లాదేశ్ అవతరణ సమయంలో] యుద్ధం తర్వాత ఇందిరా గాంధీ బడ్జెట్ లో రక్షణ వ్యయాన్ని పెంచిందని ఈ నాటి ప్రధాన మంత్రి, ఆనాటి ప్రణాళిక సంఘం ఛైర్మనూ, ఎప్పటికీ ఆర్ధికవేత్తా అయినటువంటి మనోమోహనుడు ఆరోజెంతో వెన్నెముక చూపిస్తూ ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మీద అలక ప్రదర్శించాడు.


అదే ఈ రోజైతే తాను సాక్షాత్తూ ప్రధానమంత్రి అయినా ఈ నాగమ్మకున్న రాజ్యేంగేతర శక్తికి లోబడి, ఆవిడ చేతిలోని రిమోటు కంట్రోలు ఆడించినట్లూ ఆడుతున్నాడు. కాబట్టే అణుఒప్పందం కోసం పుంజీలు తెంచుకొని పెట్టిన పరుగూ, వేగమూ, చురుకుదనమూ ఇప్పుడు ముంబైదాడుల విషయంలో మచ్చుకైనా కనపడటం లేదు.


అంతేకాదు ఆనాడు బ్రహ్మానందరెడ్డిలాంటివారూ, దేవరాజ్ అర్స్ ల్లాంటి వారు కూడా ఇందిరా గాంధీ కి ఎదురితిరిగి పార్టీని చీల్చగలిగారు. అదే ఈ నాడైతే ఎదురుతిరగటం కలలోని మాట. కడుపుమంటతో ఒక్క ఫిర్యాదు లేదా ఆరోపణా చేసినా మార్గరెట్ ఆల్వాల్లా ఇంటి కెళ్ళాల్సిందే. లేదా వీ.హెచ్.ల్లా, వెంకట స్వామిల్లా ఇతర సీనియర్లలాగా మూలన కూర్చోవాల్సిందే.


కోడలిగా ఇంట్లో అడుగుపెట్టి, ఒక్కో వ్యక్తినీ పైకి పంపించి, భావి తరాన్ని పస లేని వాడిగా మార్చి చక్రం తిప్పతున్న ఈ[అమ్మ] నాగమ్మకి స్వంత కుటుంబం పట్ల నిబద్దత లేకపోవటం సజీవ తార్కాణం మాత్రమే కాదు, అసంభవం కూడా కాదు.


ఇలాంటి పాత్రలు ఇప్పుడు టీ.వి. సీరియళ్ళల్లోని కుటుంబ కుట్రల్లోనూ, ఫ్యాక్షన్ సినిమాల్లోనూ మనకి పరిచయమే. చాణక్య, చంద్రగుప్తుల లాంటి గూఢచార చరిత్రల్లో విషకన్యప్రయోగాలు మనకి పరిచయమే.


అలా ఈ అమ్మకి ఇంత బలమూ, ఇంతశక్తి.


అంతేకాదు........


ఇందిరాగాంధీ హయాంలో మంత్రులెవరికీ ఏ సంఘటనకీ బాధ్యత ఉండేది కాదు. మంత్రుల దగ్గర నుండి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ ఎవరి తప్పిదాలకైనా ఇందిరా గాంధీదే బాధ్యత. ఒకవేళ ఆ సదరు మంత్రులు వ్యూహాత్మక తప్పిదాలు కావాలనే చేసినా వాళ్ళది బాధ్యత కాదు. ఇందిరా గాంధీదే బాధ్యత. ఆ బాధ్యతని ఆవిడ నెత్తిన రుద్దడానికి మీడియా [ఎటూ తాము ఇందిర నిరంకుశ ధోరణుల కారణంగా ఆవిడనీ, కాంగ్రెసుకీ వ్యతిరేకులమన్న ముద్రవేసుకున్నాం గనుక] నిరంతరం వేలు పైకెత్తి, కలం మూత తీసి, సిద్ధంగా ఉండేవాళ్ళు.


ఈ పరిస్థితి ఇందిరా గాంధీకే కాదు, పి.వి.నరసింహరావుకీ ఉంది. 1992 డిసెంబర్ 6 న బాబ్రీ కూలే ముందు జరిగిన సంఘటనలు వివరిస్తూ ఆయన వ్రాసిన అయోధ్యలో దీన్ని స్పష్టంగా వ్రాస్తూ గెలుపు సంభవిస్తే సమిష్టిదనీ, ఓటమి సంభవిస్తే అది నా ఒక్కడినెత్తికే చుట్టేందుకు అప్పటికే నా మంత్రివర్గ సహచరులంతా సిద్ధమై ఉన్నారు అంటూ వ్రాసాడాయన.


అదే ఈ నాగమ్మకైతే పరిస్థితి ఎంత అనుకూలమో చూడండి. కీలక సమయాల్లో, ఆపత్సమయాల్లో హఠాత్తుగా మనోమోహనుడు నాయకుడైపోతాడు. శివరాజ్ పాటిళ్ళు బాధ్యులౌతారు. మిగతా సమయల్లో వాళ్ళంతా ఈ అమ్మ చేతిలోని కీలు బొమ్మలౌతారు. ఏ సమయల్లోనూ మీడియా నాగమ్మవైపు కలంకాదు, నోరూ కాదు, కనీసం వేలుకూడా ఎత్తదు. ఎంతో జాగ్రత్తగా గాజు బొమ్మని కాపాడినట్లు కాపాడతుంది మీడియా ఈ నాగమ్మని.


అలా ఈ నాగమ్మకి ఇంత బలం , ఇంత శక్తి.


తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!


**************

3 comments:

అప్పటికి ప్రాంతీయ పేపరు వాడైన ఈ రామోజీ రావు చుట్టూ అద్వానీ, వి.పి.సింగ్ లాంటి కేంద్ర నాయకులు [కాబోయే ప్రధానులూ, మాజీ కేంద్రమంత్రులూ కూడా] కరుణానిధి లాంటి ఇతర పార్టీ నాయకులూ తిరిగేవారు..... హబ్బ. భలే కనిపెట్టారండి. మీరు రాస్తున్న విషయాలు ఇంతవరకు ఎవరకి తెలియదు. ఎక్కడా చదవలేదు. నిజంగా మీరు ఎంతో పరిశోదన చేసి ఉంటారు. నిజంగా షాక్ అయ్యాను.. మీరు రాస్తున్న పచ్చి నిజాలు చదివి.

క్రిష్ణారావు గారూ, గత కొన్ని టపాలు గా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు అర్థం ఏమిటి? ఎందుకు వ్యంగ్యం?

క్రిష్ణారావు గారు January 3 దాక బాగానె ఉన్నారు. కాని January 4 నుండి మారినారు. ఎందుచెత? ఎమైంది? Read the responses in the following link.

http://ammaodi.blogspot.com/2008/12/blog-post_5234.html

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu