ఇటీవల [సెప్టెంబరు 15, 2009] సాక్షిలో ప్రచురించబడిన ఈ క్రింది వార్త చూడండి.

>>>ముస్సోలినీ బ్రిటన్‌ గూఢచారి!
లండన్‌:

ఫాసిజం వ్యవస్థాపకునిగా, ఇటలీ నియంతగా ప్రసిద్ధి చెందిన బెనిటో ముస్సోలినీ, తన రాజకీయ జీవితాన్ని బ్రిటన్‌ గూఢచారిగా ప్రారంభించారు! ముస్సోలినీ మర ణించాక అరవై నాలుగేళ్ల తరువాత, ఇటీవలే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌ గూఢచారి సంస్థ ఎమ్‌ఐ5, 1917లో వారానికి వంద పౌండ్ల (నేటి ఆరువేల పౌండ్లు) వేతనానికి ముస్సోలినీని తన ఏజెంటుగా నియమించింది. ముస్సోలినీ అప్పట్లో 'ఇల్‌ పపొలో డి ఇటాలియా' అనే వార్తా పత్రికను నడిపేవాడు. ఆ పత్రిక ద్వారా, యుద్ధంలో గట్టిగా నిలిచి పోరాడేలా ఇటాలియన్లను ప్రేరేపించాలని ఎమ్‌ఐ5 కోరింది.

పారిశ్రామిక కార్మికులలో ప్రబలిన అసంతృప్తిని చల్లార్చి, వారు బోల్షివిక్కుల ప్రభావంలోకి పోకుండా కాపాడాలని కూడా ఆశించింది. అప్పట్లో ఎమ్‌ఐ5 అధికారిగా ఇటలీలో ఉన్న సర్‌ సామ్యూల్‌ హోరె,ముస్సోలినీకి ఆ పని అప్పగించారు. పీటర్‌ మార్ట్‌ల్యాండ్‌ నేతృత్వంలోని కేంబ్రిడ్జ్‌ చరిత్రకారులు ఎమ్‌ఐ5 డాక్యుమెంట్లను పరిశోధించి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ముస్సోలినీ శిక్షణ పొందిన గూఢచారి కాకపోయినా ఎమ్‌ఐ5 అతనికి భారీగానే ముట్టచెప్పింది. స్త్రీలోలునిగా బాగా పేరున్న ముస్సోలినీ ఆ డబ్బులో అధిక భాగం ఆ వ్యసనానికే వెచ్చించి ఉండవచ్చని మార్ట్‌ల్యాండ్‌ అభిప్రాయపడ్డారు.

యుద్ధానంతరం ముస్సోలినీ క్రూర ఫాసిస్టు నియంతగా మారాడు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి హోదాలో హోరె, 1935లో తిరిగి ముస్సోలినీని కలుసుకున్నారు. ఒకప్పుడు తన దగ్గర వారం జీతానికి పనిచేసిన ఆ ఫాసిస్టు నియం..."
~~~~

ఇటలీ నియంత ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి అన్న విషయం దాదాపు ముస్సోలినీ మరణించిన 65 సంవత్సరాల తరువాత బయటికొచ్చింది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ, మీడియా, ఈ విషయాన్ని అంతగా ప్రచారం కాకుండా చూసేందుకు శతధా ప్రయత్నిస్తుందనుకోండి!

ఏది ఏమైనా, రెండవప్రపంచయుద్దానికి బలీయ దోహదకారులుగా పేరుపడ్డ ఇద్దరిలో, జర్మనీ నియంత హిట్లర్ ఒకరు కాగా, ఇటలీ నియంత ముస్సోలినీ మరొకడు. ఇతోధికంగా అప్పటి మీడియా ప్రచారం, [నాజీల గురించీ, జాత్యహంకారాల గురించీ] కూడా రెండవ ప్రపంచయుద్దానికి దారి తీసిన కారణాలలో ఒకటనే వాదం చరిత్రలో చదువుకున్నాం. [ఇప్పటికీ 10 వ తరగతి పాఠ్యాంశాంలో ఇదే ఉంటుంది.] ఈ విషయాల గురించిన మరింత వివరణ, 166. నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు [Assumptions] – 9[హిట్లర్ – నానాజాతి సమితి వైఫల్యం] [May 26, 2009] లో చూడగలరు.

65 సంవత్సరాల క్రితమైతే, ఇటలీలో ఈ నియంత ముస్సోలినీని, వారికి విదేశమైన బ్రిటన్ ఏజంటుగా ఎవరూ అనుమానించి ఉండరు కదా! ఒకవేళ ఎవరైనా గుర్తించి, ఎవరు ఎవరికి చెప్పినా, ఎవరూ నమ్మి ఉండరు కదా? మరి ఇప్పుడో......? అప్పట్లో అయితే ఆ ఇటలీ అధినేతకు అప్పటి మీడియా జేజేలు కొట్టి ఉంటుంది. బాకాలు ఊది ఉంటుంది. అతడి నుండి ప్రయోజనాలు పొందిన వారు, పొందాలనుకునే ఆశావహులూ, అమితభక్తులూ వారిదైన పద్దతులలో గౌరవాభివందనాలు చూపి ఉంటారు కదా! అధినేత నిర్ణయమే శిరోధార్యం అని కూడా ఉంటారు.

ఇక్కడ ఓ దృష్టాంతం పరిశీలించడం సమయోచితంగా ఉంటుంది. 1991 లో శ్రీ పెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డాడు. అతడితో పాటుగా మరో 18 మంది చనిపోయారు. హంతక ముఠాలో సభ్యురాలైన నళినికి పడిన ఉరిశిక్షను, అప్పటికి ఆమె గర్భవతైనందున, ఆమె కడుపులో బిడ్దని దృష్టిలో ఉంచుకుని ’పరమ కరుణామయి’ అయిన సోనియాగాంధీ, నళినీ ఉరిశిక్షని యావజ్జీవ కారాగారా శిక్షగా మార్చాల్సిందిగా కోర్టుకు విన్నవించింది. ఆపైన ఇంకేం ప్రయత్నాలు జరిగాయో గానీ, మొత్తానికీ నళినీ ఉరిశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్ష అయ్యింది. [హంతక ముఠాలో సభ్యురాలైన నళిని, విచారణ సమయంలోనే అదే ముఠాలో సభ్యుణ్ణి పెళ్ళాడి గర్భవతైంది. ఆ పైకారణంతో(over leaf reason) ఉరిశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మార్చబడింది.] ఇప్పుడావిడ తానిప్పటికే 18 ఏళ్ళు జైల్లో ఉన్నందున తనని విడుదల చెయ్యమనీ, విడుదల తన హక్కన్నంత స్థాయిలో జైల్లో ఆందోళన చేస్తోంది లెండి. అయితే రాజీవ్ గాంధీతో పాటు మరణించిన మిగిలిన 18 మంది తాలుకూ కుటుంబసభ్యులు కూడా, సదరు నళినిని, క్షమించారో లేదో మనకి తెలియదు. ఈ విషయం గురించి విశ్లేషిస్తూ ప్రముఖ సినీ రచయిత, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు, తన బ్లాగులో ’శ్రీ పెరంబుదూర్ లో రాజీవ్ గాంధీతో పాటు చనిపోయిన ఒకతని తల్లి వంటలపని చేసుకుంటు ఉండవచ్చు, ఒకవేళ అతడి తండ్రిగానీ బ్రతికి ఉంటే అతడు డాక్టర్ అయి ఉండేవాడేమో? ఎవరికి తెలుసు?’ అన్నారు.

నిజమే కదా! ఒక పిల్లవాడికి తండ్రి బ్రతికి ఉంటే అతడి జీవితం మరోలా ఉండి ఉండేదేమో! అలాగే రాజీవ్ గాంధీ బ్రతికి ఉంటే అతడి సంతానం ప్రియాంకా వాద్రా, రాహుల్ గాంధీల జీవితాలూ, ఆలోచనా సరళీ మరోలా ఉండి ఉండేవేమో?

వ్యక్తి జీవితమైనా దేశ చరిత్ర అయినా ఒకటే! ఉదాహరణకి బాపూ లేకపోతే భారతదేశ చరిత్ర మరోలా ఉండేది కదా! హిట్లర్ లేకపోతే జర్మనీ చరిత్రా, ప్రపంచచరిత్రా మరోలా ఉండేవి కదా? అంతేకాదు సైనిక నియంతల వలన పాక్ బ్రతుకు మన కంటి ముందు కనిపిస్తున్న నిజం! ఒకవ్యక్తి మంచివాడా, చెడ్డవాడా అన్నది వేరే విషయం. ’ఒక వ్యక్తి కూడా, దేశ చరిత్రనీ, ప్రపంచ చరిత్రనీ మార్చగలడు’ అన్నదే ఇక్కడ ముఖ్యవిషయం.

ముస్సోలినీ మరణించిన తరువాత 65 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఇటలీ ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి అన్న విషయం వెలుగులోకి వస్తోంది. అతడి స్థానే ఇటలీ పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండి ఉంటే, ఇటలీ చరిత్ర మరోలా ఉండేది కదా! అతడి హయాంలో ఎందరు తమ దేశంపట్ల నిబద్దతా, భక్తీ ఉన్న ఇటాలియనులు నాశనమై ఉంటారో, ఎందరు స్వార్ధపరులు బలపడి ఉంటారో ఎవరు చెప్పగలరు?

ఇప్పుడంటే గూఢచార తంత్రాలు బయటపడటం, Expose కావటమే స్ట్రాటజీగా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గానికీ, నెం.5 వర్గానికీ మధ్య గూఢచార యుద్ధం నడుస్తున్న కారణంగా, ఇలాంటి విషయాలు బయటికొస్తున్నాయి గానీ….. గతంలో, రెండు దశాబ్ధాల క్రితంలో అయితే ఇవేవీ బయటికొచ్చేవి కావు. సాక్షాత్తూ బ్రిటనే ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టటం, ఏ స్ట్రాటజీలో భాగమైనా కానివ్వండి లేదా ఆత్మహత్యా సదృశ్య assignments లో భాగమైనా కానివ్వండి, మొత్తానికీ బ్రిటనే ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

అప్పుడే కాదు, ఇప్పుడూ బ్రిటన్, ఇలాంటి ముస్సోలినీలకే అండదండలందిస్తుంటుంది. ఖలిస్తాన్ పేరిట మనదేశంలో టెర్రరిజం నడుస్తున్నప్పుడు, ఆ టెర్రరిజానికి అండదండలు, దాని నేతలందరు బ్రిటన్ నుండే నడిపారు. దీనిని స్వేచ్ఛావాదం పేరిట బ్రిటన్ నడవనిచ్చింది. ఇప్పుడు ఆల్ ఖైదాకు అండదండలు అందిస్తున్న వారు బ్రిటన్ లోనే ఉన్నారన్న విషయాలు బయటికొస్తున్నాయి. ఇవే కావు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెర్రరిస్టు సంస్థలకు సంబంధించిన అండదండలు బ్రిటన్ లో నుండే ఉంటాయి.

ప్రక్కదేశాలలో తమ ఏజంట్లని అధినేతలుగా ఇన్ స్టాల్ చేసే బ్రిటన్, ఎంత ధర్మపన్నాలు చెబుతుందో అందరికీ తెలిసిందే! ఇప్పుడే కాదు, 18, 19 వ శతాబ్ధాలలో సైతం, ఓప్రక్క పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా తమ కార్ఖానాలలో 8,9 ఏళ్ళ పిల్లల చేత కూడా రోజుకి 15 – 16 గంటలు పనిచేయిస్తూ….. అలిసిపోయి పని ’నిదానిస్తే’, ఆ పిల్లలని కొరడాలతో బాదుతూ ఊడిగం చేయించుకుంటూ….. మరో ప్రక్క – ’మిత్రమా! నీ చేతి కర్ర ఊపుకునే స్వేచ్ఛ నీకుంది. అయితే నా ముక్కు ఎక్కడ ప్రారంభం అవుతుందో, అక్కడ నీ స్వేచ్ఛ అంతమవుతుంది’ అంటూ స్వేచ్ఛకు కుహనా నిర్వచనాలు చేప్పేది. అప్పట్లో బ్రిటిషు వారి స్వేచ్ఛా భావనలు, ఎంతగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయో, అప్పటి చరిత్ర పుస్తకాలు గానీ, ఆనాటి ప్రముఖుల జీవిత చరిత్రలు గానీ, చదివిన వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అంతగా ఆచరణ శూన్యమైన కుహనా భావ వాదాన్ని[Psudeo Idealism] ఎలుగెత్తి ప్రచారించింది.

ఇంతగా కుహనా భావవాదపు ముసుగులేసుకుని గూఢచర్య తంత్రాలు నడిపిన బ్రిటన్, తన కుయుక్తులు బయటపడి పట్టుబడిపోయినప్పుడు ఎంచక్కా క్షమాపణలు చెప్పెస్తుంటుంది. తనంత గొప్పదేశం క్షమాపణలు చెప్పటం కంటే ఉద్దరణ ఎదుటివాడికి ఇంకేం కావాలన్నట్లు! తము చేసిన ముస్సోలినీలు వంటి వ్యవహారాలలో ఎందరి జీవితాలు ఎంతగా నలిగి పోయినా, ఇప్పుడు తము చెప్పే ఒక్క క్షమాపణలో ‘అన్నీ చెల్లు’ అన్నరీతిలో ఉంటుంది ఆ వ్యవహార సరళి! అక్కడా అహంకారమే! ’నా అంతటి గొప్పవాళ్ళు క్షమాపణ చెప్పటం కంటే ఇంకేమిటి కావాలి నీకు?’ అన్నట్లు! ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది మాత్రం జాత్యహంకారం కాదా? అలాగయ్యి…. మళ్ళీ…. ఇంత బుర్రా బ్రిటిషుకి ఉండి కూడా కాదు. ఇంతకు ముందు ఇదే లేబుల్ లోని ఇతర టపాలలో చెప్పినట్లు బ్రిటన్ వెనుక నకిలీ కణిక అనువంశీకులు ఉండబట్టి, బ్రిటన్ ఒకప్పుడు ’మంచి రూపాయిగా చెల్లింది. లేకపోతే ’సత్తురూపాయే!’

ఇక – ఈ నాడు, ఇటలీ నియంత ముస్సోలినీ గుట్టుబయటికొస్తోంది.
ఇలా ఎన్ని దేశాల్లో….. ఎందరు దేశాధినేతలు….. ఆయాదేశాల శతృదేశాలకు ఏజంట్లో….. ఎవరికీ తెలుసు?
ఈ నాడు ఇటలీ ముస్సోలినీ?
రేపు ఎవరో?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

దీపావళి శుభాకాంక్షలు .

ముస్సోలినీ మరణించిన తరువాత 65 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఇటలీ ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి అన్న విషయం వెలుగులోకి వస్తోంది.
***** అతడి స్థానే ఇటలీ పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండి ఉంటే, ఇటలీ చరిత్ర మరోలా ఉండేది కదా! అతడి హయాంలో ఎందరు తమ దేశంపట్ల నిబద్దతా, భక్తీ ఉన్న ఇటాలియనులు నాశనమై ఉంటారో, ఎందరు స్వార్ధపరులు బలపడి ఉంటారో ఎవరు చెప్పగలరు? *****

మీరు చాలా గొప్ప మాట అన్నారు. చదువుకున్న మనుషులందరు ఆలోచించ వలసిన విషయము.

అమ్మ గారు, మన నాయకులు కాంగ్రెస్ కాని, కమ్యునిస్ట్ లు, దళిత ప్రముఖ నాయకుడైన కానివండి ఎవ్వరైనా అప్పటినుంచి ఇప్పటి వరకు పశ్చిమ దేశాలను చూచి ఇన్స్పిరేషన్ పొందుతు ఉంటారు. "వారి స్వేచ్ఛా,సమానత్వ భావనలు అటువంటివి.అంతగా ఆచరణ శూన్యమైన కుహనా భావ వాదాన్ని ఎలుగెత్తి ప్రచారించింది" అని మీరంట్టున్నారు కాని మన రాజ్యంగం అంతా ఇతర దేశాల నుంచి కాపి పేస్ట్ చేయబడింది. అందూవలననే మన దేశ ప్రజలు ఇలా తయారయ్యారంటారా?
భారత ప్రజాశ్వమ్యం ఆఖరికి ప్రజలకి ఆశలు చూపిస్తూ, రాజకీయ నాయకులు నేరవేరని వాగ్దానాలు చేసి, మాటనిల బేట్టుకోలేక వారు ఎంత సంపాదించుకొన గలరో అంత సంపాదించుకొని నిజాయితీ గా ఎవరైనా పని చేస్తె వాడి నెత్తిన బురద జల్లుతూ కాలక్షేపం చేస్తున్నారూ.

నిజమే ! ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.గదా !! వివరణాత్మక వ్యాఖ్య బాగుంది.

మాలాకుమార్ గారు, అజ్ఞాత గారు, ఎస్.ఆర్.రావు గారు,

వ్యాఖ్యవ్రాసినందుకు నెనర్లు!

****
అజ్ఞాత గారు,

మీ ప్రశ్న చిన్నది, జవాబు చాలా పెద్దది. గత టపాలలో వివరించానండి!

మీరు చెప్పింది నిజమే... ఏ విషయాన్నయినా ఓ అని ఊదరగొట్టే మీడియా దీన్ని low key affair గా చిత్రీకరించడానికి ప్రయత్నించింది:

http://www.smh.com.au/world/from-italy-with-love-mussolini-was-a-spy-20091014-gxgr.html

http://blogs.usatoday.com/ondeadline/2009/10/italian-dictator-benito-mussolini-adolf-hitler-ally-in-world-war-ii-was-on-the-payroll-of-british-intelligence-during-the-f.html

http://in.reuters.com/article/oddlyEnoughNews/idINTRE59D4MW20091014

RK,
మంచి లింకులిచ్చారు. నెనర్లు!

ఈ ముస్సోలిని బ్రిటిష్ ఏజెంట్ అన్న వార్త మీరు రాసే వ్యాసాలకు చాలా బలాన్ని ఇచ్చిందని నా అభిప్రాయము. మనకి స్వాతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి మన నెత్తిన వివిధ రకాలుగా దొంగ చాటు దెబ్బలు తీస్తూ మన దేశాన్ని అనునిత్యం ఎదో ఒక రకం గా తక్కువ చేసి చూపుతూ ఆనందించటం బ్రిటిష్ , అమేరికా దేశాల వారికి ఒక సరదా. కావలంటె మీౠ ఒకసారి బి.బి.సి. లో వార్తలు గమనిచండి. శ్రీహరి కోట నుంచి రాకెట్ విజయవంతం గా ప్రయోగిస్తె దానికి వారు ఒక నిముషం ప్రసారం చేస్తారు అదే రాకేట్ పడి పోతే భారతీయులకు ప్రయోగించటం రాదు అన్న తరహాలో చాలాసేపు బి.బి.సి. లో చూపుతారు. మన దేశం/ఆసియా దేశాల నుంచి ఎత్తుకు పోయిన నెత్తుటి డబ్బుల తో అభివృద్ది చెంది వారెదో ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నట్లు ఆ హక్కులు ఈ హక్కులు అని ఒక సంగం పెట్టి మళ్ళి దొంగ దారి లో మన నెత్తిమీద ఆంక్షలు పెట్టతం. ఇది వీరి ప్రపంచ లో ప్రజాస్వమ్యమును రక్షించే విధానం.
ఆయిల్ కుంభ కోణం మీద రాజినామ చేసిన నట్వర్ సింగ్ వర్సెస్ డిక్ చెని మీద కూడా రాసేది.అది కూడ పెద్ద గందరగోళ వ్యవహారం. ప్రపంచం లో ఆ డబ్బులు తీసుకున్న లిస్ట్ లో పేరు ఉన్న ఏ దేశ మంత్రి రాజీనామా చెయ లేదు ఒక్క నట్వర్ సింగ్ తప్ప. దానికి డిక్ చెని కారణ నట్వర్ సింగ్ గారు నెత్తి నోరూ కొట్టుకున్న ఎవ్వరు ఆయన మాటను పటించు కోలేదు.

పై టపాకు దృష్టాంతం[circumstantial]:

ఉగ్రవాదుల అడ్డా.. బ్రిటన్‌
లండన్‌: వివిధ పాశ్చాత్య దేశాల్లోని ఉగ్రవాదులకు బ్రిటన్‌ అడ్డాగా మారింది. ఈ దేశాల్లో ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడ్డా మొదట అందరి చూపు బ్రిటన్‌ వైపు మళ్లుతోంది. బ్రిటన్‌.. ఉగ్రవాదులకు రాజధానిగా మారిందని చాలాకాలం నుంచి ఆరో పణలు ఉన్నాయి. తాజాగా మీడియాలో కూడా ఇదే అంశాన్ని బలపరుస్తూ పలు కథనాలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట అమెరికాకు చెందిన నార్త్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌బస్‌ విమానాన్ని పేల్చివేయడానికి విఫలయత్నం చేసిన నైజీరియా జాతీయుడు ఉమర్‌ ఫరూక్‌ అబ్దుల్‌ ముతలబ్‌ కూడా లండన్‌లోనే నివసిస్తుండడం గమనార్హం. అతడు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌(యూసీఎల్‌)లో ఇంజనీరింగ్‌ అభ్యసిస్తున్నట్లు కొన్ని టీవీ చానెళ్లు శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ విషయం తమకు ఆశ్చర్యమేమీ కలిగించలేదని బ్రిటన్‌ మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉగ్రవాదం తీవ్రతను తెలియజేస్తూ, కొద్ది సంవత్సరాల కిందట అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ, లండన్‌కు 'లండనిస్థాన్‌' అని పేరుపెట్టిన విషయాన్ని స్పెక్టెకిల్‌ పత్రిక సంపాదకుడు ఫ్రేసర్‌ నీల్సన్‌ ఈసందర్భంగా గుర్తు చేశారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu