మేము ’అమ్మఒడి’ అనే ఈ తెలుగుబ్లాగుని ప్రారంభించి ఇప్పటికి సరిగ్గా 11 నెలలయ్యింది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం మరునాడు, అంటే నవంబరు 2 వ తేదీ మేమీ బ్లాగు ప్రారంభించాము. మొదట్లో చిన్నచిన్న కథలతో ప్రారంభమైన మా బ్లాగు టపాలలో, క్రమంగా, భారతదేశం మీద, భారతీయుల జీవన సరళి మీద, భారతీయ సంస్కృతి మీద, వివిధరంగాల ద్వారా జరుగుతున్న కుట్రల గురించి వివరణ ప్రారంభించాము.

ఆ నేపధ్యంలోనే – మొదట మేము వ్రాస్తున్న విషయాలలోని సత్యాసత్యాలని నిర్దారించుకునే క్రమంలో, విశ్లేషించుకునే క్రమంలో, మా బ్లాగు అతిధులు కొందరు కొన్ని సందేహాలు లేవనెత్తారు. వాటిని నివృత్తి చెయ్యటానికి మేం అప్పుడప్పుడూ, అవసరమైనప్పుడూ ’ఊహాగానాలు కాదు ఉన్న నిజాలు’ అనీ టపా వ్రాయటం జరిగింది.

నిన్నటి మా టపా ’వై.యస్. రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం వెనుకనున్న మతలబులు – 7 [విడిచిపెట్టని ఎలుగుబంటి] లో వ్యాఖ్యానిస్తూ, కొందరు బ్లాగు సోదరులు, ‘ఈ టపాల మాలికలో మేం చెబుతున్నవి ఎంతనిజం?’ అన్న సందేహాలు లేవనెత్తారు. వారి సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ టపా వ్రాస్తున్నాము.

ముందుగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. అదేమిటంటే –

వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. వ్యవస్థ కంటే ‘సత్యం’ గొప్పది. ఎందుకంటే వ్యవస్థని మనుష్యులు సృష్టిస్తారు. కాని ‘సత్యం’ అంటే సాక్షాత్తూ ‘భగవంతుడే’ కాబట్టి. వ్యవస్థను బట్టో, వ్యక్తిని బట్టో ‘సత్యం’ మారదు కాబట్టి!

ఈ బ్లాగులో మేము టపాలు వ్రాస్తూ ఆయా సందర్భాలలో తెదేపాని విమర్శించినప్పుడు, ఆ పార్టీలోని వారి రాజకీయాల్లోని లొసుగుల్ని ఎత్తి చూపించినప్పుడు, కాంగ్రెస్ అభిమానులకి నచ్చింది. తెదేపా అభిమానులకి సహజంగానే అది నచ్చలేదు. అలాగే కాంగ్రెస్ నీ, అందులోని వ్యక్తుల్ని విమర్శించినప్పుడు, అది తెదేపా అభిమానులకి నచ్చింది. సహజంగానే కాంగ్రెస్ అభిమానులకి నచ్చలేదు. అలాగే భాజపా విషయంలో కూడా! కానీ ‘సత్యం’ అన్నది ఒకరికి నచ్చటం కోసం ఉండదు. మరొకరికి నచ్చకపోయినంత మాత్రాన మారదు. ఎందుకంటే అది ‘సత్యం’ కాబట్టి.

అయితే ’మేమేది వ్రాస్తే అది సత్యం, సత్యం అంటే భగవంతుడే కాబట్టి మారు మాట్లాడకుండా మేము వ్రాసేదంతా నమ్మండి’ అంటున్నాం అనుకోకండి. బ్లాగులో ఇప్పటి వరకూ అలా మేమెప్పుడూ అనలేదు. [ఎందుకంటే – మొదట్లో, ఇవే విషయాలు పరిశీలన దశలో ఉండగా, మాకు కూడా నమ్మశక్యగా కన్పించలేదు.] అంతేకాదు, ఎవరో ఏదో చెబితే అది సత్యమై పోదు. అలాగే అయితే, ఇప్పుడు మీడియా, పత్రికలూ, రాజకీయనాయకులు చెప్పిందంతా నిజమే కావాలి కదా?

కాబట్టి ఎవరేం చెప్పినా, [మాతో సహా] నమ్మాల్సిన అవసరం ఎవరికీ లేదు.

అందుకే….

‘వినదగు నెవ్వరు చెప్పిన
విని నంతనే వేగపడక వివరింప దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ ’

అంటూ, చిన్నప్పుడు రెండో తరగతిలో మనం నేర్చుకున్న బద్దెన పద్యాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుని, మేం చెప్పిన విషయాల్ని, చూపించిన దృష్టాంతాలని, విశ్లేషించి వివేచించి పరీక్షించి మరీ, అందులోని వాస్తవాలని గ్రహించమనే చెప్పాము. ’ఈ గోలంతా మనకెందుకు?’ అనుకునే వారిని, ఇదంతా నమ్మమనీ చెప్పము. ఎందుకంటే – ఎవరైనా ఇది నమ్మకపోతే, నమ్మేవాళ్ళకి వచ్చే నష్టం లేదు. అలాగే ఎవరైనా ఇది నమ్మితే, నమ్మని వాళ్ళకి వచ్చే లాభమూ లేదు. మాకైతే ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఏ లాభమూ లేదు.

ముందు పేరాలో చెప్పినట్లు, తమ అభిమాన వ్యక్తుల్ని విమర్శించినప్పుడు బాధ కలగటం, అలా విమర్శించారు కాబట్టి సదరు టపా రచయితల పట్ల వ్యతిరేక భావాలు కలగటమూ సహజం. కాబట్టే తెదేపాని విమర్శించినప్పుడు కాంగ్రెస్ అభిమానులకు బాగుందనిపిస్తుంది, కాంగ్రెస్ ని విమర్శించినప్పుడు తెదేపా అభిమానులకి బాగుందనిపిస్తుంది. కానీ ’సత్యం’ అన్నది మన వ్యక్తిగత అభిమానాలకు అతీతమైనది కదా?

కాబట్టే, ’నేను’, ’నా అభిమాన పార్టీ’, ’నా అభిమాన నాయకుడు’, ’నా అభిమానం’ – ఇలాంటి వ్యక్తిగత పరిధి దాటి ’ఏది నిజం? ఎంత వరకూ నిజం? ఎందుకు నిజం? లేదా ఎందుకు అబద్ధం? ఎంత వరకూ అబద్దం’ – ఇలా వివేచిస్తే, ఆలోచిస్తే…. మన ఆలోచనా పరిధి, పరిణితి పెరుగుతాయి.

మరో విషయం పరిశీలించండి. మేము నకిలీ కణిక వ్యవస్థని, నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులని కేవలం ఆంధ్రప్రదేశ్ కు కుదించి, వాళ్ళ స్ట్రాటజీలని నిరూపిస్తే “ఓస్! ఈ పాటి అందరికీ తెలిసిందే! రామోజీరావు, ఈనాడులు తెదేపాకి మద్దతిస్తాయి. కాబట్టి రాష్ట్రం మీద అతడికి గ్రిప్ ఉంది. కావాలంటే మేం ఇంకా ఇన్ని దృష్టాంతాలు చూపగలం” అని చాలామంది అని ఉండేవాళ్ళు.

అప్పుడు మేం చెప్పదలచుకున్న విషయానికి మరింత మద్దతు లభించేది. విషయ నిరూపణకి పెద్దగా శ్రమ ఉండేది కాదు.

అలాగే 1992 లోనే, పీవీజీ గనక నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తి రామోజీరావునీ కూడా, కేవలం భారతదేశానికీ కుదించి, వాళ్ళ స్ట్రాటజీలనీ, వాళ్ళనీ నిరూపించి ఉంటే, అందరూ అంగీకరించి ఉండేవాళ్ళు. అంతేకాదు, స్వయంగా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, రామోజీరావు కూడా నిరంభ్యంతరంగా అంగీకరించి ఉండేవాళ్ళు. ఎందుకంటే తాత్కాలికంగా ఓటమి ఒప్పుకున్నా, మళ్ళీ కొంతకాలం పోతే తిరిగి పుంజుకోగల అవకాశం ఉండటం చేత. ఇప్పుడున్న వైఫల్య కారణాలని కూడా సవరించుకుని, రెట్టించిన బలంతో మళ్ళీ తమ గ్రిప్ సాధించగలరు కనుక.

బ్రిటీషు వారి నుండి భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు జరిగింది ఇదే! అప్పుడు ఏవి తమ బలహీనతలో వాటినే బలంగా మార్చుకున్నారు. అలాగే అప్పుడు ఏవి భారతీయుల బలాలో వాటినే ఇప్పుడు బలహీనతలుగా మార్చారు. కాబట్టి తాము మీడియా అవతారం ఎత్తారు. కాబట్టే అహింసా యుద్దంతో, శాంతి సహనాలతో, బ్రిటీషు వారి రూపేణా ఉన్న అమానుషత్వాన్ని, క్రౌర్యాన్ని, రాజనీతిజ్ఞత పేరిట ఉన్న స్ట్రాటజీలని, ప్రపంచానికి బహిరంగపరిచిన భారతీయుల దృక్పధాన్ని, అంటే అప్పటి బలాన్ని, నేడు భారతీయుల బలహీనతగా మార్చారు.

ఇక్కడ ఓ ఉదాహరణ పరిశీలించండి. ఓ మహా విషవృక్షం ఉందనుకొండి. మనం దాని కాయలనో, పూవులనో, ఆకులనో విషపూరితంగా గుర్తించామనుకొండి. వాటి వరకూ తొలగిస్తాం. కానీ మూలం నుండి సర్వమూ విషపూరితమే అయిన ఆ వృక్షం ప్రసరించే గాలి కూడా విషమే అయి ఉంటుంది. ఇది తెలియని మనం, ఎన్నిసార్లు దాని పూలనీ, ఆకులనీ, కాయలనీ తొలగించినా ప్రయోజనం ఉండదు. మరికొన్ని ప్రయత్నాల తర్వాత, ఈసారి ఓ పెద్దకొమ్మని కూడా ’విషపూరితం’ అన్న విషయం గుర్తించామనుకొండి. కొమ్మని కొట్టేస్తాం. కానీ చెట్టుకేం నష్టం? కొమ్మని కోల్పోవటం తాత్కాలికమే! మళ్ళీ కొట్టేసిన కొమ్మ స్థానే చిగురులు పుట్టుకొస్తాయి. మళ్ళీ కొమ్మ పెరుగుతుంది. అంతే!

కాబట్టి నకిలీ కణిక వ్యవస్థ నీ, నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావునీ కేవలం భారతదేశానికి కుదించి, వాళ్ళ గూఢచర్య స్ట్రాటజీని నిరూపించి నిర్మూలించే ప్రయత్నంలో పీవీజీ సరిపెట్టుకోలేదు. మొత్తం వేర్లతో సహా విషవృక్షాన్ని పెరికి వెయ్యనిదే శాశ్వత పరిష్కారం ఉండదన్న విషయం ఆ మేధావికి తెలుసు. కాబట్టే, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో, తమ తమదేశాల పట్ల భక్తీ, నిబద్దతా, మానవత్వం గల వారిని కలుపుకుని నెం.5 వర్గాన్ని తయారు చేసారు. అలాగ్గాక నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్ని, రామోజీరావునీ, కేవలం భారతదేశానికి కుదించి ఉంటే పీవీజీ హయంలోనే ’వీళ్ళని నిర్మూలించటం’ అన్నపని అయిపోయి ఉండేది. అయితే ఆ పరిష్కారం తాత్కాలికమైనది అయి ఉండేది.

కాబట్టే పీవీజీ, నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావునీ కేవలం భారతదేశానికి కుదించి నిర్మూలించే ప్రయత్నం చేయలేదు. మొత్తం ప్రపంచమంతా విస్తరించిన వారి గూఢచార వలయంతో సహా బహిరంగపరచే ప్రయత్నం చేసారు. దీనికోసం 17 ఏళ్ళుగా నెం.5 వర్గం చేసిన కృషి ఫలితమే – ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ రంగపు అమానుషత్వాన్ని, వ్యాపార కౄరత్వాన్ని, ముస్లిం ఆధిపత్యాన్ని, మీడియా మేడిపండునీ, అంతర్జాతీయంగా అల్లుకున్న ఆర్ధిక బాంధవ్యాలనీ బహిరంగ పరుస్తోంది.

ఎందుకిలాంటి స్ట్రాటజీ ఎన్నుకున్నారో విశదీకరించడానికి పైన చెప్పిన విషవృక్షం ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ చెబుతాను. మన వీధి మొత్తం పరమ మురికిగా, చెత్తా చెదారంతో నిండి, దుర్గంధభూయిష్టంగా ఉందనుకొండి. అప్పుడు కేవలం మన ఒక్కరి ఇంటినే మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్న ప్రయోజనం ఉండదు. మళ్ళీ మళ్ళీ మురికై పోతుంది. మళ్ళీ మళ్ళీ శుభ్రపరుచు కోవలసి రావటమే తప్ప ఫలితముండదు. మన ఇల్లు మాత్రమే శుభ్రపరచుకోవటం తాత్కాలిక ప్రయోజనం, తాత్కాలిక పరిష్కారం.

శాశ్వత ప్రయోజనం, శాశ్వత పరిష్కారం అంటే వీధి మొత్తం శుభ్రంగా ఉండేటట్లు చేయటమే. అందుకు వీధిలోని అన్ని ఇళ్ళవాళ్ళు సమిష్టిగా కృషి చేయక తప్పదు. అందరూ తమ తమ ఇళ్ళు శుభ్రంగా ఉంచుకుని, వీధినీ శుభ్రంగా ఉంచినప్పుడే అందరి ఇళ్ళు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండటం అన్న శాశ్వత ప్రయోజనాన్ని పొందగలం. పీవీజీ చేసిన ప్రయత్నం ఇదే! ఎక్కువ సమయం పట్టినా, ఎక్కువగా శ్రమించవలసి వచ్చినా….. ఇదే శాశ్వత పరిష్కారం. ఒక ‘తుపాకి సాంకేతికత’ , ‘విభజించు – పాలించు’ వంటి స్ట్రాటజీతో సుదీర్ఘకాలం సూర్యుడు అస్తమించని సువిశాల ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ రాజవంశం అందరికి తెలిసిందే. 150 ఏళ్ళుగా వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటాలు, లేమాన్ సోదరులు వంటి వ్యాపార కుటుంబాలూ అందరికీ తెలిసిందే! అలాగే 350 ఏళ్ళుగా రహస్యంగా తెర వెనుక మంత్రాంగం నడిపే గూఢచార కుటుంబం లేదా వంశం ఉండటం అసంభవం కాదు. అటువంటిదే నకిలీ కణికుల వంశం. ఏదయితే తమ లక్ష్యమో అది సిద్దించాక ఉనికి ప్రకటించుకోవాలన్నది వారి ఉద్దేశం. కాబట్టే పీవీజీ, నెం.5 వర్గమూ కూడా, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం తరతరాలుగా, 350 ఏళ్ళకు పైగా ప్రపంచమంతా నిర్మించి, నడిపిస్తున్న గూఢచర్య వలయాన్ని, ప్రపంచవ్యాప్తంగా బహిరంగ పరచే దిశలోనే తమ యుద్ధం ప్రారంభించారు. నకిలీ కణికులు, నెం.10 వర్గమూ 3 ½ శతాబ్ధాలుగా నిర్మించిన నెట్ వర్క్ నీ, గూఢచర్య సామ్రాజ్యాన్ని, నెం.5 వర్గం కేవలం 17 ఏళ్ళలోనే తుత్తునియలు చేసింది, చేస్తోంది.

నా గతటపాలలో చెప్పినట్లు – ఒకవేళ ఈ రామోజీరావు గనుక హైదరాబాదు వాడు గాక, ఏ అమెరికాలోని వాడో అయి ఉంటే, రామోజీరావు అన్న పేరుగాక ఏ ’మర్డోక్’ అన్న పేరో ఉండి ఉంటే, మన వాళ్ళు మరి కొంత ఎక్కువగా, తొందరగా నమ్ముతారు. ఇది కూడా నకిలీ కణిక వ్యవస్థ మనవాళ్ళల్లో కలిగించిన దృక్పధమే! ఎవరో ఎక్కడో ఏదో విశేషం [అది మంచి విషయంలో కానివ్వండి, చెడు విషయంలో కానివ్వండి] సాధించారంటే ’ఓహ్! ఎంత గొప్ప!’ అనటం, అదే మనకి దగ్గరలోని, మనకి తెలిసిన వాళ్ళే అయితే ’ఆఁ వాడి ముఖం. వాడికంత సీన్ లేదులే’ అనటం, మీడియా మనకి బాగా ఇంకించిన గుణం. నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికి కీలక వ్యక్తి, హైదరాబాదులో నివాసం ఉండే రామోజీరావే అంటే నమ్మటం కష్టంగా ఉండటానికి కారణం ప్రజలలో ఇంకిన ఈ గుణమే!

ఒక్కసారి బుర్రవిదిలించి, మీడియా మనకి ఇంకించిన ఈ దృక్పధాలని వదిలించుకుని, మీడియా ప్రచారించిన ’ఊదర’ని విదిలించికొని, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలని, వాటి మధ్య కార్యకారణ సంబంధాలనీ, వాటి ప్రభావాలనీ, పరిణామాలని నిశితంగా పరిశీలించి, విశ్లేషిస్తే, సత్యం ఏమిటో మీకే స్పష్టంగా గోచరిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

అయ్యో సోదరీ మీరు పొరపడుతున్నారు . నా ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. "అభిమాన" రచయిత్రి రాస్తే చదివినట్లు చదువుతూనే వున్నాను.
ఇకపోతే , ఏం జరిగిందో / ఎలా జరిగిందో కొద్దిమందికి మాత్రమే తెలిసే అవకాశం ఉండడం వల్ల , అవి ఎప్పటికీ బయట ప్రపంచాన్ని చూడవు కనుక, ఒకవేళ వచ్చినా పుకార్ల గానే ( లాల్ బహదూర్ శాస్త్రి మరణం లాగా ) మిగిలిపోతాయి కాబట్టి "నిజమెంతో" తెలియడం కష్టం అనే ఉద్దేశ్యంలోనే రాసాను.

>>తమ అభిమాన వ్యక్తుల్ని విమర్శించినప్పుడు బాధ కలగటం, అలా విమర్శించారు కాబట్టి సదరు టపా రచయితల పట్ల వ్యతిరేక భావాలు కలగటమూ సహజం. కాబట్టే తెదేపాని విమర్శించినప్పుడు కాంగ్రెస్ అభిమానులకు బాగుందనిపిస్తుంది, కాంగ్రెస్ ని విమర్శించినప్పుడు తెదేపా అభిమానులకి బాగుందనిపిస్తుంది. కానీ ’సత్యం’ అన్నది మన వ్యక్తిగత అభిమానాలకు అతీతమైనది కదా?

కాబట్టే, ’నేను’, ’నా అభిమాన పార్టీ’, ’నా అభిమాన నాయకుడు’, ’నా అభిమానం’ – ఇలాంటి వ్యక్తిగత పరిధి దాటి ’ఏది నిజం? ఎంత వరకూ నిజం? ఎందుకు నిజం? లేదా ఎందుకు అబద్ధం? ఎంత వరకూ అబద్దం’ – ఇలా వివేచిస్తే, ఆలోచిస్తే…. మన ఆలోచనా పరిధి, పరిణితి పెరుగుతాయి

:-) , హమ్మా ఇన్ని రకాలుగా తిట్టాలా నన్ను? ;)

మేమేది వ్రాస్తే అది సత్యం, సత్యం అంటే భగవంతుడే కాబట్టి మారు మాట్లాడకుండా మేము వ్రాసేదంతా నమ్మండి’ అంటున్నాం అనుకోకండి.

సరిగ్గా ఈ పాయింట్ వల్లనే నేను మీ బ్లాగ్ ఎక్కువగా ఫాలో అయినా వ్యాఖ్యానించను. మీరు రాసిన ప్రతి విషయంలోనూ లోతైన పరిశీలన, పరిశోధన కనిపిస్తాయి. అయితే వ్యాఖానిస్తే మీరు చెప్పిన విషయంతో అంగీకరించినట్లేనని భయం. మీరు రాసిన విషయాలే ఏదైనా దినపత్రిక లో వచ్చుంటే నాతో పాటూ నూటికి 99 మంది నమ్మేసేవారేమో!

అయితే వ్యవస్థను బట్టో, వ్యక్తిని బట్టో ‘సత్యం’ మారదు

మీ, నా, మా, మన నమ్మకాలకు అతీతమైనది సత్యం. ఇది మాత్రం సత్యం :)

ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
http://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
rakigita9@yahoo.com
rakigita9@gmail.com
mobile:9849693324

భాస్కర రామిరెడ్డి,

నేను నిన్ను తిట్టలేదు తండ్రీ! విషయం వివరించానంతే! ఎందుకంటే ’మీరు వ్రాస్తుంది నిజమో కాదో గానీ’ లాంటి సందేహాలు బ్లాగు సోదరులలో చాలామందికి ఉండి ఉండొచ్చన్న అభిప్రాయంతోనే, ఇంతకు ముందు చెప్పినదే అయినా మళ్ళీ ఓసారి చెప్పాను, అంతే. ఇక నువ్వు ఈ టపాకిచ్చిన వ్యాఖ్య
>>ఇకపోతే , ఏం జరిగిందో / ఎలా జరిగిందో కొద్దిమందికి మాత్రమే తెలిసే అవకాశం ఉండడం వల్ల , అవి ఎప్పటికీ బయట ప్రపంచాన్ని చూడవు కనుక, ఒకవేళ వచ్చినా పుకార్ల గానే ( లాల్ బహదూర్ శాస్త్రి మరణం లాగా ) మిగిలిపోతాయి కాబట్టి "నిజమెంతో" తెలియడం కష్టం అనే ఉద్దేశ్యంలోనే రాసాను.
చూశాక మరో టపా వ్రాయాలన్న ఆలోచన వచ్చింది, వ్రాయటం మంచిదనిపించింది. ఈ విధంగా ఆలోచిన రేకెత్తించినందుకు నెనర్లు![ సోదరుడికి ‘కృతజ్ఞతలు’ అవసరమంటవా?]నీకు రెండు టపాలు బాకీ అన్నమాట!

~~~~
బృహస్పతి గారూ,
మీ వ్యాఖ్య ఎంతో లోతుగానూ, స్పష్టంగానూ ఉంది. మాకెంతో సంతోషం కలిగించింది. కృతజ్ఞతలు.
~~~~

వెన్నెల రాజ్యంగారు,
మామూలుగా మనం ఎన్నో విషయాలని పరిశీలిస్తుంటాం. మామూలుగా మరచిపోతుంటాం. మరచిపోయామని అనుకుంటాం. అయితే కొన్ని లోతైన పరిశీలనలు మన అంతచ్ఛేతనలో నమోదు అయి ఉంటాయి మళ్ళీ అలాంటి సంఘటనలే ఎదురైనప్పుడు అవి జ్ఞాపకాలుగా స్మ్పతి పధంలోకి వస్తుంటాయి.
బహుశః అలాగే ఇప్పుడు ’రోశయ్యకి పెరుగుతున్న మద్దతు’, మీకు ఎన్టీఆర్ నీ, సామ్రాట్టు హోటలనీ గుర్తుకుతెచ్చి ఉంటాయి. మీ పరిశీలన అంత లోతుగా, సునిశితంగా ఉందన్న మాట. ఇక మీరడిగిన రోశయ్య గురించిన విశ్లేషణ ఈ టపాల మాలికలోనే వ్రాస్తాను. నెనర్లు.
**********

nijam cheppalamte konni vishayallo unna samdigdhata mee blag chadavadam modalupettadam modalupettadam tarvata poyindi.
mi anta kaakapoyina paristitulni kanapaddattu kaakunda puranala valla maaku telisi unna vishayalato konchem lotugaa adhyayanam cheyyagalugutnnam. thanks to your efforts for making us educated.(The true uducation)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu