అమెరికా నుండి నడుపబడుతున్న రష్యన్ టాబ్లాయిడ్ ఎగ్జయిల్డ్, వై.యస్. మరణం వెనక కుట్ర ఉందంటూ అతుకుల బొంత కథనాన్ని సెప్టెంబరు 3, 2009 లో ప్రచురించిందట. అది అతుకుల బొంత కథనం అనీ, ఆ ఆన్ లైన్ పత్రిక లేదా వెబ్ సైటు బూతుల పత్రిక అనీ, విశ్వసనీయత ఏ మాత్రం లేనిదనీ ఈ రోజు, ఈనాడు ప్రతీ పేరాలో పదే పదే వ్రాసుకుంది. సదరు టాబ్లాయిడ్ కథనం అతుకుల బొంత అంటూ ఏకవాక్య తీర్మానం చేసేసిన ఈనాడు, ఆ కథనం ఏవిధంగా అతుకుల బొంతో, ఎందుకు అతుకుల బొంతో తార్కికంగా వ్రాసి ఉంటే సామాన్య పాఠకులకి ఎంతో ఉపయుక్తంగా ఉండేది కదా!ఆ రష్యన్ వెబ్ పత్రిక కథనం సత్యమని గానీ, అసత్యమని గానీ నేను అనటం లేదు. ఈనాడు దాన్ని అతుకుల బొంత అనేటప్పుడు ఎందుకు, ఏవిధంగా అతుకుల బొంతో కూడా వ్రాస్తే సగటు పాఠకుడికి ఉపయుక్తంగా ఉండేది కదా అన్నదే నా ప్రశ్న.
ఇంతగా…. ‘రష్యన్ టాబ్లాయిడ్ కథనం అతుకుల బొంత‘ అంటూ ఆక్రోశించిన ఈనాడు... వై.యస్. మరణం గురించి ఎన్ని అతుకుల బొంత కథనాలు ప్రచురించిందో సెప్టెంబరు 2009 లోనే, నా బ్లాగులో టపాల మాలికలో వ్రాసాను. మరోసారి పరిశీలించండి.
01. ఈనాడు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిపై కురిపిస్తున్న ప్రశంసల వర్షం – ఇదేదో తేడాగా ఉన్నట్లుందే![Sep.14, 2009]
02. నా బ్లాగులో వ్యాఖ్యకి నా స్పందన: [Sep.15, 2009]
10. వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనూహ్యమరణం వెనుక మతలబులు – 8 [ముందే మొదలైన అభిమానుల మరణాలు] [Oct. 02, 2009]
11. వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనూహ్యమరణం వెనుక మతలబులు – 9 [పరస్పర విరుద్ద కథనాలు] [Oct. 03, 2009]
12. వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనూహ్యమరణం వెనుక మతలబులు – 10 [రోశయ్య అర్ధింపు] [Oct. 05, 2009]
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
5 comments:
http://exiledonline.com/enemy-of-larry-summers-ex-boss-dies-in-mysterious-helicopter-crash/ చూడండి అది అతుకులబొంత ఎందుకో మీకే తెలుస్తుంది.
అజ్ఞాత గారు,
ఆ రష్యన్ వెబ్ పత్రిక కథనం అతుకుల బొంత కాదని, సత్యమే అని నేను అనటం లేదు. ఎందుకంటే అది నేనసలు చూడనే లేదు. కాకపోతే ఈనాడు దాన్ని అతుకుల బొంత అనేటప్పుడు ఎందుకు, ఏవిధంగా అతుకుల బొంతో కూడా వ్రాస్తే సగటు పాఠకుడికి ఉపయుక్తంగా ఉండేది కదా అన్నదే నా ప్రశ్న.
ఈనాడు సంస్థలో రిలయన్స్ వారు కొన్ని వేల కోట్ల రూపాయలు బినామీ సంస్థల పేర బదలాయించారు యెందువల్లనంటే వుండవల్లి వారి దెబ్బకి మార్గదర్శి ఫైనాన్స్ మూతవేయవలసి రావడం వల్ల ..మొత్తం చెల్లింపులు చేశాక దివాళా దిశగా పయనిస్తున్నప్పుడు ...శ్రీ మాన్ బాబు గారు మన గాస్ ని అప్పనమ్ గా రిలయన్స్ కి అప్పగించి తద్వారా తమ ఈనాడు సంస్థ ని ఒడ్డు కి చేర్చారు..నస్తమ్ యెవరికి రాస్త్ర ప్రజలకి [పాత సాక్షి పేపర్ లు చూడండి ]...అందువల్లే ఈనాడు రిలయన్స్ ని వెనకేసుకు వస్తూ అందరి మీద అంతా యెత్తున విరుచుకు పడింది ..రామోజీ మార్క్ జర్నలిసం ఇంకా నమ్ముతున్న ప్రజల్ని అనాలి ...ఆ పేపర్ ని చదువుతున్న వాళ్ళకి దృగ్ అడ్డిక్ట్స్ కి తేడా పెద్ద గా లేదు ...
NO one can question the credibility of Eendau ..... Though Ennadu and Sakshi are Rivals in their paper media ... ETV2 lo ilanti gali vaarathalu prasam chesina scene okati vunte choopinchadni .... Media angane andhamina news readers ni petti vachi rani telugu tho, kuracha dusthula tho, sagam basha ni naasanam chestunna Sakshi ekkada .... Eenadu ekkada ... !
Even the suspected person in Ysr incident is also Ramoji ,,
Post a Comment