ఇప్పుడు కాదు, దశాబ్ధాల క్రితం నుండి రామోజీరావుకీ, ఈనాడుకీ, అంబానీలంటే అమిత ప్రేమే! 1980 లలో ధీరూబాయ్ అంబానీ తుమ్మినా, దగ్గినా ఈనాడుకి వార్తే! అప్పట్లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు పదవి విషయమై, దాదాపు పక్షం రోజులపాటు, ఈనాడు అర్థపేజీ కేటాయించి మరీ పెద్దపెద్ద శీర్షికలతో ధీరూబాయ్ అంబానీకి మద్దతు గానూ, అతడికి ఇమేజ్ ఇస్తూనూ వ్రాసి పారేసింది. ’ఈ రోజు ప్రపంచమంతా అటే చూస్తోంది’ అంటూనూ, ’అందరిలోనూ అదే ఉత్కంఠ’ అంటూనూ వ్రాసింది. 1989 - 90 లలో జరిగిన ఈ ప్రచారం చదివి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1992 లో ఈనాడులోని నా మిత్రురాలు చెప్పిన భోగట్టాతో అలాంటి వ్రాతలపట్ల ఓ అవగాహన వచ్చింది. 2005 తర్వాత వాటి తాలూకూ కార్యకారణ సంబంధం అర్ధమయ్యింది.
తర్వాత రోజుల్లో, ధీరూబాయ్ అంబానీ సదరు L&T ని వదిలేసుకున్నాడు లెండి. అప్పుడు ఈనాడు గప్పుచుప్పున ఉండిపోయింది. 2008 లో, ఆదివారం సంచికలో, అప్పటికి కీర్తిశేషుడైన ధీరూబాయ్ అంబానీ మీద ప్రత్యేక కథనం సమర్పిస్తూ, ఎన్నో ఉపమాన, ఉత్ర్పేక్ష అతిశయోక్తి అలంకారాలన్నీటినీ ఏర్చికూర్చి ఈనాడు వ్యాసం ప్రచురించింది.
అంతగా ఈనాడు రామోజీరావుకి అంబానీలు ఎంతో ’అయినవాళ్ళు’. ఇక ఈనాడు, అంబానీసోదరులు అనిల్, ముఖేష్ లలో ముఖేష్ వైపుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటుంది. ఎంతగా అంటే మచ్చుకి క్రింది వార్త పరిశీలించండి.
పైన పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ విశ్వసనీయత గురించి, ఇటీవలే ఈనాడు, ఎగ్జయిల్డ్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ TV 5 ప్రసారం చేసిన వై.యస్. మరణవార్త నేపధ్యంలో జరిగిన, రిలయన్స్ ఆస్థులపై దాడుల గురించి వ్రాస్తూ, జనవరి 8న, సదరు ’న్యూయార్క్ టైమ్స్’ దశాబ్దాల నుండి గొప్ప విశ్వసనీయత గల పత్రిక అని వ్రాసింది. అంత విశ్వసనీయ పత్రిక ఎంతగా ముఖేష్ అంబానీని, అహింసామూర్తి అయిన బాపూజీ తో పోల్చి, ఆకాశానికేత్తేస్తూ వ్రాసిందో మీరే పరిశీలించండి.
సామాన్యులు ఒక్కరుగా సాధించలేని స్వాతంత్రాన్ని, అందరిని సంఘటిత పరిచి, అహింసాపద్దతిలో బాపూజీ దేశ స్వాతంత్రాన్ని సాధించాడు. అదే అంబానీ సోదరులు, సామాన్యుడు స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో, బ్రతకగల వ్యాపారాలని, ప్రభుత్వ సహకారంతో, లాబీయింగ్ తో ఊడగొడుతూ రిలయన్స్ ఫ్రెష్ లు, రిలయన్స్ మార్ట్ లు పెడుతున్నారు, ముందు ముందు రిలయన్స్ మంగలిషాపులు కూడా పెడతారట. సామాన్యుడు పెట్టుబడి పెట్టలేని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు, తయారి సంస్థలు పెట్టాలి గాని, ప్రజలు పెట్టుబడిపెట్టగల చిన్నచిన్న వ్యాపారాలని మూతేయిస్తూ, తాము ఆ వ్యాపారాలు చేయటం ఎలాంటి దేశ సేవ? ఇది పక్కా దోపిడి మాత్రమే! ఈ రిలయన్స్ లాంటి వాళ్ళు, కిరాణా వ్యాపారంలోని రాకముందు కిరాణా దినుసుల ధరలు నేల మీదనే ఉండేవి. మాంద్యం పైకారణంగా[over leaf reason] చూపిస్తూ, నల్లబజారు వ్యాపారం జోరుగా నడుపుకుంటున్నారు.
ఇలాంటి ముఖేష్ అంబానీ, తమ్ముడు అనిల్ అంబానీ పై హత్యా ప్రయత్నాలు చేసాడని సాక్షాత్తూ అతడి తమ్ముడే ఆరోపించాడు. అదే కథనాన్ని ఎగ్జయిల్డ్ పత్రికా ఉటంకించింది. సాక్షి కూడా వ్రాసింది. అనిల్ హెలికాప్టర్ ఇంజన్ లో ఇసుక గట్రా ఉండటం గమనించి ఫిర్యాదు చేసిన సాంకేతిక ఉద్యోగి శవం, తదుపరి రెండు రోజుల్లోనే, రైలు పట్టాలపైన తేలింది. జనవరి 7 వ తేదీ రాత్రి, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రిలయన్స్ ఆస్థులపై దాడులని ముఖేష్ అంబానీ కూడా ’ఇది తమ వ్యాపార ప్రత్యుర్దులతో కలిసి పన్నిన కుట్ర’గా అభివర్ణించాడు. అలాంటి ముఖేష్ అంబానీకి మహాత్మాగాంధీతో పోలిక! బాపూజీ భారతదేశానికి దిశానిర్దేశం చేసినంతగా, ముఖేష్ అంబానీ భారతదేశ వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేసాడట!
అంతగా, ఈనాడు ఒక్కటే గాక, దేశీయ అంతర్జాతీయ మీడియా కూడా ముఖేష్ అంబానీకి అంత సీన్ ఎందుకు ఇస్తాయో, ఏ ప్రయోజనాలను ఆశించి ఇస్తాయో ఈశ్వరుడికే తెలియాలి. ఇక అంబానీలు తమ భార్యలకి ఎంత విలువైన కానుకలిస్తారో ఈనాడు ఆదివారం అనుబంధంలో పలుమార్లు ఫోటోలతో సహా కథనాలు వ్రాసింది. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీకి విలాసవంతమైన నౌకని కానుకగా ఇస్తే, అంతకంతే మరికొన్ని కోట్లరూపాయలు ఎక్కువ విలువైన విలాసవంతమైన విమానాన్ని , ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీకి కానుకగా ఇచ్చాడట. ’ఎంత గొప్ప ప్రేమ కానుకలో గదా!’ అంటూ ఈనాడు ముక్తాయించింది.
’ఎంత ఎక్కువ ఖరీదైతే అంత ఎక్కువగా ప్రేమ ఉన్నట్లన్న’ ప్రచారం సంగతి పక్కనుంచినా, తమ భార్యలకి లేదా ప్రియురాళ్ళకి ఆయా విలాస పురుషులు కానుకలిచ్చుకుంటే, ఆయా సెలబ్రిటీల గురించి పత్రికలు కథనాలు ఫోటోలు[కత్రినా కైఫ్ కి వజ్రాలు పొదిగిన వాచీలు గట్రా కానుకగా ఇచ్చిన సల్మాన్ ఖాన్ ల గురించి కూడా] ప్రచురించి పత్రికలు ఏవిధంగా ప్రజాసేవ చేస్తున్నట్లో వారికే తెలియాలి.
పైగా ఈ ప్రచారంలోనూ, ఆస్తుల్లోనూ, ప్రభుత్వ అండదండల్లోనూ కూడా అన్నదే పైచేయి అని తమ్ముడు వాపోతూ ఉంటాడు. అన్న ముఖేష్ చేస్తున్న, చేసిన వ్యాపార అక్రమాల గురించి బయటపెట్టినా కూడా, కేంద్రం కలిసి రాకపోయే సరికి, మెట్టు దిగొచ్చి "అన్నయ్యా! రాజీ పడదాం. అమ్మకి ఇంతకన్నా మంచి బహుమతి మరొకటి ఉండదు" అంటూ బహిరంగంగానే urge పెట్టుకున్నాడు. అయినా ఫలితం రాలేదు. నిజానికి వీరి తండ్రి ధీరూబాయ్ అంబానీ హయాంలో, లాబీయింగ్, లైజాన్ వ్యవహారాలన్నీ అనిల్ అంబానీయే చూసుకునే వాడన్న వార్తలున్నాయి. అయినా గానీ, అన్నదమ్ములిద్దరిలో అన్న వైపే, మీడియా దగ్గర్నుండి సోనియా దాకా మొగ్గు చూపటం ఇక్కడ గమనార్హం.
ముఖేష్ అంబానీ, పరస్పరం ప్రతిపక్షాలైన ఎన్టీయే కీ, యూపీఏ కీ కూడా గారాబు బిడ్డే. అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకీ, కాంగ్రెస్ వ్యతిరేకి రామోజీరావుకీ కూడా ముద్దుబిడ్డే. అదే ఇక్కడ విచిత్రం! ఇక్కడ తెలియటం లేదూ అన్నిటి వెనుకా, అందరి వెనకా ఒకే వ్యవస్థ ఉందన్న విషయం?
వేలకోట్ల రూపాయలు వెచ్చించి ముఖేష్ అంబానీ నిర్మిస్తున్న 26 అంతస్థుల విలాసవంతమైన నివాస భవనం గురించి మరికొన్ని ఆసక్తికరమైన కథనాలు ఈనాడు పీరియాడికల్ గా వేస్తూంటుంది. అతడి 26 అంతస్థుల ఇంద్రభవన నిర్మాణం, ముంబైలో, కొంతమేర వక్ఫ్ బోర్డు భూభాగంలోకి విస్తరించిందని, అందుకు తాము అనుమతించబోమనీ, పేల్చివేస్తామని, ఓ దశలో ముస్లిం ఉగ్రవాదుల అల్టిమేట్ విన్పించింది. తర్వాత డబ్బే చేతులు మారిందో, లాబీయింగే పనిచేసిందో, రెండూ కలిసి మరీ ప్రభావం చూపాయో గాని, మళ్ళీ ఏ ఊసూ బయటకి రాలేదు.
ఈ మొత్తం వెలుగు జిలుగుల వెనక, చీకటి మరకలు ఏమిటంటే - ముఖేష్ అంబానీకి కాంట్రాక్టు మీద అప్పచెప్పే నాటికి గోదావరి కృష్ణా బేసిన్ లో అపార గ్యాస్ నిక్షేపాలు, కాగితాల మీద ఇంకా బయటపడలేదు. ఇదెంత పకడ్బందీగా నడిచిన దోపిడి అంటే - అక్కడ నిక్షేపలున్నాయో లేవో చూసుకోకుండానే... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాలు సవరించి మరీ, అప్పటికి కాగితాల మీద ఉటంకించబడిన చమురు నిక్షేపాలని మాత్రమే దృష్టిలో ఉంచుకుని, ముఖేష్ అంబానీకి అనుమతి ఇచ్చాయి. తరువాత ముఖేష్ అంబానీ ’అదృష్టం’ కొద్దీ అక్కడ అపార గ్యాస్న్ నిక్షేపాలు వెలుగు చూసాయి. ఎంత నాటకీయ అదృష్టామో అంత అద్భుత రాజకీయ విన్యాసం అది. ఈ నేల, అందులోని విలువైన నిక్షేపాలు ఇక్కడి ప్రజల సొమ్ము కాదు. యూపీఏ లేదా ఎన్టీయే ప్రభుత్వాల, ప్రభుత్వాధినేతల గుత్తసొత్తు. కాబట్టే అప్పనంగా అంబానీలకు అప్పచెప్పారు.
అందునా ముఖేష్ అంబానీ ఎంత పవర్ ఫుల్ అంటే... జనవరి 7 రాత్రి అతడి ఆస్థులపైన దుండగులు దాడి చేసిన కొద్ది వ్యవధిలోనే అతడూ సీరియస్, కాంగ్రెస్ అధిష్టానమూ సీరియస్, ఆపైన ఆ ’రెండు పత్రికలు’ సీరియస్! గంటల వ్యవధిలోనే ముఖేష్ అంబానీ నుండి ఫోన్ వస్తే... వెంటనే లైన్ లోకి వచ్చిన ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధినేత్రి! ఎంత అత్యవసర పరిస్థితులలోనైనా, ఏ రాష్ట్రముఖ్యమంత్రికయినా అంత సీన్ లేదు! సీనియర్ నాయకులయితే అధిష్టానం అపాయింట్ మెంట్ ల కోసం, ఫోన్ కాల్ కోసం పడిగాపులు పడాల్సిందే!
ముఖేష్ అంబానీ ఫోన్ రావడం ఆలస్యం, చక చకా ప్రభుత్వం కదిలింది. రాష్ట్రంలో ప్రతిపక్షనేత చంద్రబాబు, ఒక్క ఉదుటున మీడియా ముందుకు వచ్చాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో టైమవ్వగానే బయటికొచ్చి గంటలు కొట్టి, లోపలికి వెళ్ళిపోయే బొమ్మలాగా, ఒక్కసారిగా బయటకు వచ్చి మీడియా ముందు ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన వెలిబుచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అరెస్టులూ, బెయిళ్ళు అన్నీ అయిపోయాయి.
రెండు నెలలన్నది కాస్తా నాలుగున్నర నెలలు గడిచినా వై.యస్. హెలికాప్టర్ ప్రమాదపు కేసుని తేల్చలేదు. సంవత్సరం దాటినా అనిల్ అంబానీ హెలికాప్టర్ ఇంజన్ లోని లోపాల్ని గుర్తించిన ఉద్యోగి హత్య కేసు తేల్చలేదు.[మొదట ప్రమాదం అనీ, తర్వాత ఆత్మహత్య అనీ, ఆ తర్వాత హత్యగా పోలీసులు దీన్ని నమోదు చేసారు].ఇక సోనియా భర్త రాజీవ్ గాంధీ హత్య కేసయితే 18 ఏళ్ళయినా తేల్చలేదు.
అదే ముఖేష్ అంబానీ ఆస్తులపై దాడులనే సరికి మాత్రం ఆఘమేఘాల మీద, వార్తల్ని ప్రసారం చేసారన్న కారణంగా సంపాదకులని అరెస్టు చేసారు. ఎస్.ఎం.ఎస్. లిచ్చాడన్న కారణంగా వంశీ చందర్ లని అరెస్టు చేసారు. పార్టీ నుండి బహిష్కరణలూ చేసారు. అదీ ముఖేష్ అంబానీ పట్ల సోనియాకీ , మీడియాకీ ఉన్న శ్రద్ద!
రాష్ట్రంలో పదికోట్ల విలువ చేసే రిటైల్ సంస్థలున్న రిలయన్స్ కు రెండుకోట్ల రూపాయలు ఆస్థినష్టం సంభవించిందట.[బీమా వస్తుంది లెండి] రాష్ట్రంలో రిలయన్స్ ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందో తెలుసా? పదివేల మందికి. గొప్పవిశేషంగా, దీన్ని గురించి చెప్పే మీడియా, ఇంతా చేసి రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తుందో, అందులో ఎన్ని కోట్లు లాభంగా పొందుతుందో మాత్రం చెప్పదు. అంతేకాదు, ఎన్ని చిన్నవ్యాపారాలు మూతపడ్డాయో చెప్పదు. పదివేల మందికి ఉద్యోగమిచ్చి ఉద్దరిస్తోందని మాత్రం ఊదర పెడుతుంది.
ఈ వ్యవహారంలో మరణించిన వై.యస్. కీ, రిలయన్స్ అధినేతకీ మధ్య ఏం నడిచిందో ఇంకా వెలికి రావాల్సి ఉంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే - 1980 లలో, ఇందిరాగాంధీ హయాంలో... ప్రభుత్వం గానీ, మరెవ్వరు గాని, పత్రికల గురించి పల్లెత్తు మాట అన్నాసరే...
’పత్రికా స్వేచ్ఛ’ అంటూ గగ్గోలు పెట్టిన ఈనాడు,
’పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లే’ నని హుకరించిన ఈనాడు,
’ఇందిరాగాంధీ పత్రికల [మీడియా] నోరు నొక్కబోతోందని’ హోరెత్తించిన ఈనాడు,
ఈ రోజు తానే తోటి మీడియా సంస్థల మీద, విరుచుకు పడింది. జర్నలిస్టుల అరెస్టులని సమర్ధించింది.[అప్పట్లో ఈనాడుతో మరికొన్ని రాష్టీయ, జాతీయ పత్రికలు గొంతు కలిపాయి లెండి. ట్రెండ్ సెట్టర్ ని అనుసరిస్తాయి కదా!] అలాంటి ఈనాడు, ఒక్కసారి గాకపోతే ఒక్కసారి, మాట వరసకైనా, ’పత్రికా స్వేచ్ఛ’, ’మీడియా స్వాతంత్రం’ అననే లేదు సుమా! జర్నలిస్టులని బెదిరించ కూడదని, శిక్షించకూడదని అనలేదు. నిర్ధారించుకోకుండా అబద్ధాలు ప్రచారించారని ఖస్సుమంది. మరి ఇన్నాళ్ళుగా తాను చేసిందీ అదేగా? [ఎంతయినా అంబానీ నిధులు కంపానీ పేరుతో రామోజీరావు కుటుంబ వ్యాపార సంస్థ మార్గదర్శిలోకి మళ్ళాయి మరి!]
తాను చేస్తే శృంగారం, ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం - ఇవే రామోజీరావు పాత్రికేయ విలువలు!
అసలింతకీ- ఇంతగా ముఖేష్ అంబానీని రక్షించుకోవలసిన అవసరం సోనియాకి, మీడియాకి ఎందుకు వచ్చినట్లు?
సెప్టెంబరు 2 వ తేదీ 2009 న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో, ముఖ్యమంత్రి వై.యస్.కి, మరణానికి ముందు 18 నిముషాల సమయం ఇవ్వబడింది. ఈనాడు అప్పట్లో అయోమయాలు సృష్టిస్తూ వ్రాసిన వార్తాంశాలలో ఇది కూడా ఒకటి. ’ఆ 18 నిముషాలలో ఏం జరిగినట్లు?’ అన్న శీర్షికతో వ్రాసింది. ఆ వార్తే గనక నిజమైతే, ఆ 18 నిముషాలలో వై.యస్. మాట్లాడిన విషయాలు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో ఉండాలి. 18 నిముషాలు గాకపోయినా, ప్రమాదంలో మరణించే ముందు వై.యస్. వాంగ్మూలం అందులో రికార్డయి ఉండాలి.
అందునా... తమ ప్రయోజనాల కోసం చంపటానికి, చావటానికి సిద్దపడే ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చిన వై.యస్., చావు ఖాయంగా ఎదుటనిలబడిందని అర్ధమయ్యాక, ఏయే విషయాలు వెలిగక్కాడో! అవి సజావుగా బయటికొస్తే.... అప్పుడు రిలయన్స్ అంబానీయే బయటకొస్తాడో, ఈనాడు రామోజీరావే బయటకొస్తాడో, అధిష్టాన దేవత సోనియానే బయటకొస్తుందో, లేక మరింకే విషయాలు బయటికొస్తాయో!?
అందుకోసమే... హెలికాప్టర్ ప్రమాద నివేదిక మీద, సివిఆర్ నివేదిక మీదా, డీజీసిఏ సీబిఐ లూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దోబూచులాడుతుండవచ్చు. అందుకోసమే రిలయన్స్ అంబానీని అర్జంటుగా ఆధినేత్రి సోనియా, ఈనాడు తరుపు మీడియా కాపాడుకుంటుండవచ్చు. కానట్లయితే, హెలికాప్టర్ ప్రమాదం వ్యతిరేక వాతావరణం కారణంగా సంభవించిందని ముందునుండి ప్రచారిస్తూ ఉన్నప్పుడు, ఆ విషయాన్నే బయటపెట్టేస్తే సరిపోతుంది కదా? మొత్తానికి ఏం జరగనుందో… వేచి చూడాల్సిందే!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
10 comments:
నీలాంటి నీచ నికృష్ట బ్లాగర్ల వలన బ్లాగు సమాజం చెడి పోతుంది ఏమో అనిపిస్తుంది. నీలాంటి బ్లాగుల వలన ఇంకో టీవీ ప్రచారం చేసి ఇంకేవరిని నాశనం చేస్తుంది.
అమ్మా! మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఇన్ని విషయాలు ఎలా గుర్తు ఉంటాయి? ఇంత బాగా ఎలా రాయగలుగుతారు? చాలా కాలం నించి మీ బ్లాగులు చదువుతున్నా, మీ టపాల టైటిల్స్ చూసి ఆ ఈమె ఎవరోకరిని విమర్శిస్తూనే రాస్తారు, ఎందుకులే అని తెరిచేదాన్ని కాదు. ఈ రోజు అనుకోకుండా మీ బ్లాగు తెరిచాను. ఓపిగ్గా చదివాక అర్ధం అయ్యింది మీరు ఎంతటి విఙాన సంపన్నులో, ఎన్ని గుట్టుమట్టులను తెరిచిన పుస్తకం చేస్తున్నారో. ఇక మీ బ్లాగుని మొదలు నించి చదవాలి అదే నా పని. కొంతకాలం పాటు ఈ కూడలి, హారం, జల్లెడలను వదిలేసి మీ బ్లాగుని చదువుతాను. మీ విఙాన గని నుంచి కొంత తవ్వుకుంటాను. ఇప్పుడిప్పుడే ఒక విషయం అర్ధమవుతోంది. ప్రజల్లో ఏదైనా ఒక అభిప్రాయాన్ని బిల్డ్ చేయాలంటే అది మీడియా వల్లే జరిగే పని. ఈ బలహీనతని అడ్డం పెట్టుకుని, ఎన్ని రాజకీయ పార్టీలు, పారిశ్రామిక వేత్తలు, మీడియాని అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని అబద్ధాలకు నిజం రంగు పులుముతున్నారో!
అబద్దమో ,నిజమో తెలియాలంటే కాలమే సమాదానం .బ్లాగ్ లో ఏమి వ్రాయాలో ఎవరు నిర్ణయించ గలరు .డబ్బున్న వాడు పెట్టిన పేపర్లో ,రాజకీయాల కోసం నందమూరి ని ఏమి చేసారో అందరికి తెలుసు
దేశ సంపద ఐన గ్యాసు గురించి ఎవడు వ్యాసాలు పేపర్ లో వ్రాయదేమి ? సత్యం కొన్నిసార్లు కొన్ని రూపాల్లో బయట పడుతోంది .గతంలో పేపర్లు ,తరువాత టీవీ లు,వెబ్సైటు లు ,ఇదిగో ఇప్పుడు బ్లాగ్ లు
నీచం అని ఎలా చెప్పగలరు ? ఈవిడ చెప్పేది నిజమో,అబద్దమో తెలియదు కాని ,ఇంత విశ్లేషణ చేయగల సత్తా ఎ పేపర్ వాడికైనా ఉందా ? బ్లాగ్ లో వంటలు ,జోక్స్ ,సినిమాల కబుర్లు ,విమర్శలు ,వ్రతాలూ ,
ఇలాంటి వి బ్లాగ్ సమాజమా ? మీకు నిజాల్ని బయటపెట్టుకొంటు పోతే అన్ని లింకులు కలసి అసలైన నిజం బయటకు వస్తుందేమో .సర్వ స్వతంత్ర ,స్వేచ్చాపూరిత వాతావరణం లోనే సత్యం బయటకు వస్తుంది లేదా దానంతట అదే లావా లా తన్నుకొని బయటకు వస్తుంది .(ఒకడి మీద ఇంకొకడి కోపం ,ఈర్ష్య వలన నిజం బయటకు వచ్చినట్టు ).
Eenadu pi vyathirekatha unna murkulu eelaage vrastharu.
@ మొదటి అజ్ఞాత గారు: నాకంటే మీకే సామాజిక స్పృహ ఎక్కువ సుమా!:)
~~~~
@ Swarna Mallika గారు: మొత్తం చదివాక మీ అభిప్రాయం వ్రాయండి. నెనర్లు.
~~~
@ రెండో అజ్ఞాత గారు:నిజం నిలకడ మీదే తెలుస్తుందండి. వ్యాఖ్య వ్రాసినందుకు కృతజ్ఞతలు.
~~~~
@ మూడో అజ్ఞాత గారు:అవునా? నిజమా?
ఈ ఉదంతమంతా చూచిన తరువాత నాకు అనిపించినది ఒకటేనండీ! "మొత్తానికి రిలయెన్స్ లేకపోయినా ప్రపంచం బ్రతకగలదు" అని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారూ అని!!
రాఘవ గారు,
అది నిజం సుమా!
visit
apmediakaburlu.blogspot.com
for commentary on Telugu media.
నాణేనికి రెండో వైపు చూపిస్తున్నారు. ఇరవై యేళ్ళ నుండి ఈనాడుపై (ఆ మాటకొస్తే మీడియాపై) ఉన్న అభిమానం పోయింది. ఇలాంటి వ్యాసాలు మరిన్ని వ్రాస్తారని ఆశిస్తున్నా. ఎన్నో బ్లాగులు...అందులో జనాలకు ఉపయోగపడేవి కొన్నే...అందులో మీది ఒకటి అని చెప్పవచ్చు.
అజ్ఞాత గారు, నవీన్ గారు,
మీడియాపై ఇంతక్రితం చాలా టపాలు రాసానండి. నా టపా నచ్చినందుకు సంతోషం. నెనర్లు!
Post a Comment