భేతాళుడి ప్రశ్నకు జవాబు చెప్పగలరా? [ప్రజాభిప్రాయం]
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, హాయి[భీతి] గొలిపే ఈ బ్లాగులోకంలో, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా, ప్రతిసారీ టపాభంగం[పూర్తి కాకపోవడం] కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తూన్న ఓర్పూ, దీక్షలను మెచ్చుకోవలసిందే. కాని, ఇంతకూ నువ్వు సాధించదలచిన కార్యం లేక పరిష్కరించ చూస్తున్న సమస్యా, ఏమైవుంటుందో తెలియటం లేదు. జరిగిన, జరుగుతున్న కథ ఒకటి చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు.
అవనీ రాజ్యంలో జనాభా చాలా ఎక్కువ. ప్రభుత్వోద్యోగులూ, వ్యాపార వేత్తలూ, ధనికులని మినహాయిస్తే అత్యధికులు సామాన్య ప్రజలు. అవనీ రాజ్యంలో రాజు లేడు. ప్రజలే రాజులు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల పేరిట, ప్రజల కోసం నిర్ణయాలన్నీ తీసుకుంటారన్న మాట.
క్రమంగా అవనీ రాజ్యం ఆధునిక శాస్త్ర సాంకేతికతలన్నీ సంతరించుకుంది. సమాంతరంగా... అన్నిటిలోనూ ద్వంద్వాలూ పెరిగిపోయాయి. ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ తెలియని స్థితి ఏర్పడింది. ’ప్రజల చేత పరిపాలన, ప్రజల కోసం ప్రభుత్వం ’ అన్నవి కాస్తా ’మరబొమ్మల చేత పరిపాలన, పైవారి కోసం ప్రభుత్వం ’ అన్న స్థితికి చేరాయి.
ఈ దశలో... ప్రజాభిప్రాయం ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయింది. సామాన్య ప్రజల అభిప్రాయాలని, ఆకాంక్షలని ప్రతిబింబించే వారు గానీ, సాధనాలు గానీ లేవు. అసలు సామాన్య ప్రజలు, తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశాలూ సాధనాలూ కూడా లేవు.
ప్రజాభిప్రాయాన్ని రాజకీయ నాయకులు ప్రతిబింబించరు. వాళ్ళ స్వార్ధం కొద్దీ వాళ్ళు తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అంటారు.
పత్రికలు కూడా అంతే! తమకి అనుకూలమైనవి, తమకి కావలసినవే ప్రచారించి, అదే ప్రజాభిప్రాయం అంటారు. ’ఇంత లావు బోండాం లాంటి నటి మాకు ముద్దు కాదురా బాబూ ’ అంటే ముద్దుగుమ్మ కాకపోతే బొద్దుగుమ్మ అంటాయి పత్రికలు. ’ఈ శాల్తీ మాకు వద్దురా బాబూ ’ అంటే ఆవిడే ప్రపంచమేటి తొలి వందమంది ప్రభావశీల మహిళల్లో so and so రాంకర్ అంటాయి పత్రికల సర్వేలు. గెలవకపోయినా ఎల్లో రేటింగ్ లు పొందే క్రీడాకారులు ఈ పత్రికలు నిలబెట్టిన బొమ్మలు.
పోనీ ఎన్నికలలో ప్రజలు తమ అభిప్రాయం వెలిబుచ్చవచ్చు అనుకుంటే - EVM లు ఆ అవకాశం ఇవ్వవు. అధినేత్రి అజ్ఞానుసారం Tamper చేయబడతాయి. అక్కడా ఆవిడ అభిప్రాయమే జనంపై రుద్దబడుతుంది.
టీవీ చర్చలలో ప్రజాభిప్రాయం బయటికొస్తుందా అంటే... చర్చల్లో సంధాన కర్తలు, సమీక్షకులు మ్యాచ్ ఫిక్సింగు చేసుకుని వచ్చీ మరీ, తమకు నచ్చని అభిప్రాయం చెప్పవచ్చేవారిని బలిగొఱ్ఱెలని చేస్తున్నారు. తమకు ఇష్టమైన అభిప్రాయాలకి జై కొట్టీస్తున్నారు.
పోనీ జనాలంతా పోలో మని రోడ్డెక్కి ఉద్యమాలు, ధర్నాలు చేద్దామన్నా... రోజు కూలీలు పుచ్చుకుని గుంపులు గుంపులు వచ్చి కలుస్తున్నారు. అందులో ఎవరి గోల వారిది. కూలీకి వచ్చినవాళ్ళు కొందరు. పనిలో పనిగా ప్రత్యర్ధుల్ని కొట్టటానికి వచ్చేవాళ్ళు కొందరు. వీలైతే లూటీలు చేద్దామని వచ్చేవాళ్ళు కొందరు. దాంతో నిజమైన సామాన్యుడు ఇంట్లో కూర్చుంటే, పెయిడ్ పీపుల్ ఉద్యమాలు చేస్తున్నారు. అందుచేత అవనీ రాజ్యంలో అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం లేదు.
పోనీ నిరాహారదీక్షల ద్వారా ప్రజాభిప్రాయం చెబుదామంటే, ప్రభుత్వం ఎలాగూ ఆసుపత్రిలో బలవంతంగానైనా చేరుస్తుందని తెలిసే నిరాహారదీక్ష చేస్తున్నారని వ్యతిరేక వర్గం వాళ్ళు చెప్తున్నారు. ఇలాగూ ప్రజాభిప్రాయం తెలియకుండా పోతుంది.
పోనీ ప్రజాభిప్రాయం అని కోర్టుకి వెళ్ళి , మాకు న్యాయం చేయమని అడుగుదామని అనుకుంటే - న్యాయమూర్తి దినకరన్ కేసులూ, తివారీని పితృత్వ కేసుల తీర్పులూ చూసిన తరువాత, కోర్టులలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించదు అని అర్ధం అయ్యింది.
పోనీ SMS పోల్స్ కి ఓటింగ్ పెడదామా అంటే... ఒక్కనొక్కు[క్లిక్]తో ఎన్ని సందేశాలైనా పంపవచ్చు. ఏవి నిజమైనవో, ఏవి పకడ్బందీగా పంపబడినవో ఎవరికీ తెలియదు.
అంతర్జాలంలో యూట్యూబుల్లోనూ, మరో గొట్టాల్లోనో సెర్చిరేట్లు చెప్పుకుందామన్నా... వాటి గురించీ విశ్లేషణలు చెప్పేది మీడియాకి సోదరుల వంటి వాళ్ళే. జనాలకి తము చేసిన ’క్లిక్కు’మాత్రమే తెలుస్తుంది గానీ, ఆవనీ రాజ్యంలో అత్యధికులు ఏ ’క్లిక్కు’ ఇచ్చారో ఎవరికి తెలుసు? విస్సన్న[మీడియా] చెప్పిందే వేదం!
బ్లాగ్లోకాల్లో టపాలనో, కామెంట్లనో లెక్కిద్దామన్నా... ఓ పదిమందిని [పదిమంది కాకపోతే మరింత మంది, ఆయా సందర్భాలలో] జీతానికి పెట్టుకుంటే... 24x7గంటల పాటు ఒక్కొక్కరు లెక్కకు మిక్కిలి బ్లాగులు సృష్టించవచ్చు , టపాలు వ్రాయవచ్చు. Profile not found గా ఇతరుల టపాలలో కామెంట్లు వ్రాయవచ్చు. అజ్ఞాతల పేరుతో నానా లింకులూ ఇవ్వవచ్చు. ఎటూ ఆ లింకుల్లో తమకు జీతమిచ్చే యజమానులు ’తమ’అభిప్రాయాన్నే ఉంచుతారు. ఈ జీతాల జీవులు, యజమానుల అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా చెల్లించేస్తారు.
ఇక అవనీ రాజ్యపు అధినేతలూ, అధినేత్రులూ, కోర్ కమిటీలు బోర్ కమిటీలు వేసి, చర్చలంటారు. సమీక్షా సమావేశాలంటారు. ప్రజాభిప్రాయం పేరిట పార్టీ ప్రతినిధులతో మాట్లాడామంటారు.
ఎవరికి వాళ్ళు , తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అంటారు.
ఓ విక్రమార్క మహరాజా! విన్నావు కదా! ఈ దశలో అసలు నిజమైన ప్రజాభిప్రాయం ఏదో తెలుసుకోవటానికి ప్రామాణికం ఏది?
సామాన్య ప్రజలు తమ అభిప్రాయం చెప్పటానికి వేదిక ఏది?
అందులో మెజారిటీ అభిప్రాయం ఏదో నిర్ధారించటానికి ప్రామాణికం ఏది?
వెలువడుతున్న ’ప్రజాభిప్రాయాల’లో ఏది నిజం?
ఏది అబద్దం?
ఈ ప్రశ్నలకి తెలిసీ జవాబు చెప్పకపోయావో నీ తల వేయి వ్రక్కలవుతుంది" గంభీరంగా ముగించాడు భేతాళుడు.
ఆనందంగా నవ్వాడు విక్రమార్కుడు. "భేతాళా! అప్పుడెప్పుడో బంధుత్వ మెరగరాని కథ చెప్పావు. నేను జవాబు చెప్పలేక మౌనం వహించాను. అయినా చందమామ పుణ్యమాని ఇప్పటికీ కథలు చెబుతూనే ఉన్నావు. ఇన్నాళ్ళకు మళ్ళీ నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. కాబట్టి తెలిసీ జవాబు చెప్పక పోవటం అన్న ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వు నాకు లొంగిపోక తప్పదు" అన్నాడు.
భేతాళుడు కూడా ఆనందంగా విక్రమార్కుడికి బంటయిపోయాడు.
బ్లాగు మిత్రులూ! భేతాళుడి ప్రశ్నలకి నాకూ జవాబు తెలియదు. మీకు తెలిస్తే చెప్పగలరా?
ప్రశ్నల సంగతి ప్రక్కన బెడితే,
2009 మన సమస్యల్ని మన కళ్ళకి కట్టినట్లు చూపెట్టింది. పరిస్థితుల్ని ప్రదర్శించింది.
2010 పరిష్కారాలని ప్రసాదించాలని ఆశిద్దాం.
ప్రజలందరికీ... సమస్యల్ని అర్ధం చేసుకునే ఓపిక, అవగాహన తెచ్చుకునే సహనం, కలగాలని మా ఆకాంక్ష!
ప్రజలందరికీ... సమస్యల పరిష్కారానికై కావలసిన ఆలోచన, సంయమనం, కలగాలని మా ఆశ!
అందరి ఆశలూ, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ... అందరికీ శుభాకాంక్షలు!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
9 comments:
భా.రా.రె.,
నీకూ,మీ కుటుంబానికి గా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అవునూ, మరి మెయిల్స్ ఎక్కువయితే ఏం చేస్తావూ? :)
అధ్యక్షా! మేం బృందంలో లేమా అని అడుగుతున్నామూ అధ్యక్ష! నీ బ్లాగులో నా కామెంట్ రావడం లేదు మరి!
మీకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం లో మీ ఈ భేతాళ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను (ప్రజలు చైతన్య వంతులు అవుతున్నారు కాని కార్యాచరణ జరగడం లేదు. ఇప్పుడిప్పుడే అది మొదలైంది.)
Wish you happy new year lakshmi garu. I am regular follower of your blog. I will start day with your post. I am expecting so many good posts in this year.
మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
"ప్రజాభిప్రాయం" మీద భేతాళుడు అడిగిన ప్రశ్నలకు, ఏమైనా సమాధానం చెప్పగలనేమో, ఇంకా ఏవైనా మార్గాలున్నాయోమోనని ప్రొద్దున్నుంచి బుర్ర బద్ధలు కొట్టుకున్నాను. ప్చ్...సమాధానం మాత్రం దొరకలేదు.
ఏది ఏమైనా, బేతాళుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం నాక్కూడా తెలియదు కాబట్టి, తను విక్రమార్కుడికి బంటయిపోయినట్టుగా, షేరింగ్ బేసిస్‌లో నాక్కూడా బంటు కావాల్సిందే. :) :) :)
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
Post a Comment