భాజపా నుండి బహిషృతుడైన జస్వంత్ సింగ్, తన పుస్తకంలో దేశ విభజన చరిత్ర గురించి వ్రాస్తూ, జిన్నాని ప్రశంసించాడట. అందుకోసం భాజపా అతణ్ణి పార్టీ నుండి బహిష్కరించింది. ఆ నేపధ్యంలో, గతంలోని కాందహార్ విమాన హైజాక్ సంఘటన గురించి మాట్లాడుతూ, జస్వంత్ సింగ్ ’అద్వానీకి తీవ్రవాదుల విడుదల గురించి తెలుసనీ, తెలియదని బొంకాడనీ, తాను కూడా ఇతోధికంగా ఆ అబద్ధాన్ని సమర్ధిస్తూ ప్రకటనలు ఇచ్చాననీ’ చెప్పుకున్నాడు.
దానాదీనా గొడవలు చెలరేగాయి. మీడియా కథనం ప్రకారం, అంతా పది రోజుల్లోనే జరిగిపోయి, భాజపా అగ్రనాయకత్వమైన అద్వానీకి గండం వచ్చిందని, ’తరం మారాలిసిందేననీ’, ’తప్పుకోక తప్పదా?’ అని వార్తలొచ్చాయి. ఆ నేపధ్యంలోనే అల్పాహార విందులతోనూ, అసలు విందులతోనూ సమావేశాలు జరిపి, అర్.ఎస్.ఎస్. నేత మోహన్ భగవత్ ముఖతః ’అద్వానీ వైదొలగాలి. ఎప్పుడన్నది ఆయనే నిర్ణయించుకోవాలి’ అంటూ ప్రకటనలు వచ్చాయి.
నాయకత్వం నుండి అద్వానీ వైదొలగాలట. అది ఎపుడన్నది అతడే నిర్ణయించుకోవాలట. అంటే అతడి నాయకత్వం తిరుగులేనిది అనటమే కదా!
‘ఓ రూపవతీ! నీవు కురూపివి కావు.
కోరి నిన్ను గన్న తల్లి గొడ్రాలు కాదు’
అన్నట్లు, నాయకత్వం నుండి ఎప్పుడు వైదొలిగేదీ అతడే నిర్ణయించుకోగలిగినంత తిరుగులేని నాయకుడు భాజపాలో అద్వానీ! అద్వానీ జిన్నాని పొగిడినట్లే, జస్వంత్ సింగ్ కూడా జిన్నాను పొగిడాడు! మరి అద్వానీకి ఒక న్యాయం, జస్వంత్ సింగ్ కు ఒక న్యాయం. అలాంటి పార్టీకి ’అంతర్గత ప్రజాస్వామ్యం మెండుగా కలిగిన పార్టీ’ అని పేరు ఉండింది. నేతి బీరకాయపేరులో నెయ్యి ఉన్నట్లుగా నన్నమాట.
మరో తమాషా ఏమిటంటే – ఇది జరిగి పక్షం రోజులు కావస్తున్నా, ఇక ఆ ఊసేలేదు. మధ్యలో అద్వానీ యాత్ర గురించిన ఒకటి రెండు చిన్న వార్తాంశాలు, పార్టీ కట్టబెట్టిన పార్లమెంటరీ కమిటీ పదవుల నుండి జస్వంత్ సింగ్ తప్పుకోవలసిందేనన్న సుష్మా స్వరాజ్ ల హెచ్చరికలు తప్ప మరో చప్పుడు లేదు.
జస్వంత్ సింగ్ తన పుస్తకంలో జిన్నాను సమర్ధించినందుకు బహిష్కారం శిక్ష అయినప్పుడు, అద్వానీ స్వయంగా, సాక్షాత్తూ జిన్నా సమాధిని దర్శించి ’జిందాబాద్’ చెప్పి వచ్చినందుకు ఏ శిక్షపడాలి? ఇన్నేళ్ళు గడిచినా ఏ శిక్షా ఎందుకు పడలేదు? పేరుకు అధ్యక్షపదవి ఊడిందన్నా, పరోక్షంగా పగ్గాలున్నది అతడి చేతిలోనే అన్నది జస్వంత్ సింగ్ వ్యవహారం తేటతెల్లం చెయ్యడం లేదూ!
భాజపాలో ఉన్నది అద్వానీయే! ప్రజాస్వామ్యం కాదు.
కాంగ్రెస్ లో ఉన్నది సోనియానే! ప్రజాస్వామ్యం అంతకన్నా కాదు!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
As somebody rightly said, BJP is more congressized than Congress itself :))
As somebody rightly said, BJP is more congressized than Congress itself :))
Post a Comment