వై.యస్.రాజశేఖర్ రెడ్డి – నెం.5 వర్గమూ, నెం.10 వర్గాల మధ్య, తాను చాలా బాగా ’సందట్లో సడేమియా’ చేయగలుగుతున్నాననుకొని మరీ ’ఎక్స్ ట్రా’లు పోయాడు. గారెల వంట వంటి గూఢచర్యం చేస్తూ, అందులో తాను గొప్ప చాకచాక్యంగా అన్నీ నిర్వహించ గలుగుతున్నాననుకున్నాడు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అంతర్గతంగా ముస్లింలను ఎత్తుకునీ, అంతంత మాత్రంగా క్రైస్తవుల్ని ఎత్తుకున్నది గనుక, తాను బాహుటంగానే క్రైస్తవుల్ని ఎత్తుకుంటే సరిపోతుందనుకున్నాడు. ఆ దన్నుతోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుండీ, అన్ని దేవాలయాల్లో నానా ’నీచమూ’ చేశాడు. చివరికి దేవాలయాల్లో, ఆకలికి, అప్పులకు అల్లాడుతూ సామాన్యులు ఆత్మహత్యలు చేసుకునే దాకా ’చర్లాటలు’ ఆడాడు. ఒక పత్రిక, ఒకటీవీ పెడితే, మీడియా వ్యవస్థ కలిగి ఉన్న రామోజీరావుకి సమ ఉజ్జీ నై పోతాననుకున్నాడు.
హిందూ, ముస్లిం ఘర్షణల్లానే మత మార్పిడుల పేరుతో హిందూ క్రైస్తవ ఘర్షణలు పెరిగేటట్లు చూస్తే అంతర్జాతీయంగా తనకి ’ఫండింగ్’ లభిస్తుందనుకున్నాడు. ఇందుకు చేసిన కృషిలో భాగంగానే, అప్పటికే స్వంత విమానాలు, అమెరికా ప్రెసిడెంట్లతో సమావేశాలు…. గట్రా లాబీయింగులు గల క్రైస్తవ మతప్రచారకుల ’వ్యాపారాని’కి పోటీ పడ్డాడు. అల్లుడు అనిల్ కుమార్ ని, అందుకే ప్రపంచమంతా పరుగులు పెట్టించాడు. తనకన్నీ, అలా ‘కలిసి రావటం’ అన్న దాని వెనుక, ’నెం.5 నన్ను నమ్మింది’ అంటూ తను ఆడుతున్న నాటకాన్ని నమ్మి నెం.10 వర్గమూ, ఆ నాటకాన్ని తమకి కావలసినంత వరకూ పండించటానికి నెం.5 వర్గము కూడా, పరిస్థితుల్ని allow చేస్తున్నాయి, పరిస్థితుల్ని సమకూర్చుతున్నాయి – అన్న విషయం రాజశేఖర్ రెడ్డి కి తెలియదు.
ఇక్కడో ఉదాహరణ చెబుతాను. ఇటీవల వచ్చిన ’రెడీ’ సినిమాలో [రామ్ హీరోగా నటించాడు] బ్రహ్మనందం పాత్ర ఏం ఊహిస్తే అది జరిగిపోతుంటుంది. ఊహల్లోని పాత్రలన్నీ ప్రాణం పోసుకుని అందరి ముందుకీ వచ్చేస్తాయి. దాని గురించి అతడు అయోమయంతోనూ, సందిగ్ధంతోనూ ఉంటే రామ్ “నీ గొప్పదనం నీకు తెలియదు మావఁయ్య! నువ్వు Extraordinary creativity ఉన్నవాడివి” అంటూ నమ్మిస్తాడు. అలాగన్న మాట! ఏ సందర్భంలోనైనా, ఏదైనా ఇబ్బంది పడుతూ, బుర్ర గిలకొట్టి, మిత్రులిద్దరూ[YS&KVP], లేదా మిత్రులు మరికొందరు సన్నిహితులతో కలిసి, తెగ ఆలోచించి పరిష్కారం కనుక్కొన్నారనుకొండి. అది అద్భుతంగా పనిచేస్తుందన్న మాట. ఎలాగైతే బ్రహ్మానందం అనుకుంటే, రామ్ అతడి కుటుంబసభ్యులు దాన్ని నిజం చేసారో అలాగ! దాంతో మిత్రులిద్దరూ లేదా పరిమిత మిత్రబృందం మహదానందపడిపోయి, తమ సామర్ధ్యాన్ని, కృషినీ తామే ప్రశంసించేసుకుంటారు. ఇలా మరి కొన్ని సంఘటనలు జరిగితే చాలు. ఆత్మవిశ్వాసం అంచెలంచెలుగా పెరిగి ఎంత కొండనైనా ఢీ కొట్టగలమనిపిస్తుంది. ఇప్పటికీ… పోయిన ముఖ్యమంత్రికి అవకాశం లేదు గానీ…. బ్రతికి ఉన్న అతడి మిత్రుడికి, పుత్రుడికి తాము పొట్టేళ్ళ పోరాటంలో నలిగిన నక్క వంటి వారిమని గాని, ఆంబోతుల పోరాటంలోకి ఉబలాటం కొద్దీ దూరి ఊపిరి వదిలిన, ఊపిరి సలుపుకోలేక పోతున్న, లేగ దూడల వంటి వారిమని గానీ స్పృహ లేదు. ఆ స్పృహ రావటం అంత తేలికా కాదు. ఎందుకంటే అది గూఢచర్యపు సంక్లిష్టత.
YS కి తెలిసిందల్లా ’తను ఏమనుకుంటే అది జరుగుతోంది. తను ఏం అభిలషిస్తే అది నెరవేరుతోంది. తను ఏ ప్రత్యర్ధుల్ని నలగెయ్యాలనుకుంటే అది నెం.10 వర్గంమో లేక నెం.5 వర్గమో చేసిపెడుతున్నాయి’ - దీనితో అతడికి ఎంచక్కా ’కోపం నరం’ తెగిపోయింది.
గీతలోని క్రింది శ్లోకాలని పరిశీలించండి.
శ్లోకం:
ధ్యాయతో విషయా పుంస స్సంగస్తేషూప జాయతే
సంగా త్సంజాయతే కామః కామా త్ర్కోధో౨ భిజాయతే
భావం:
ఎల్లప్పుడు వస్తువిషయాల గురించి ఆలోచన చేసే వాడికి వాటిమీదే ఆసక్తి గల్గుతుంది. ఆ ప్రీతి చేత కామం[కోరికలు] – కామం వల్ల క్రోధమూ కలుగుతాయి.
శ్లోకం:
క్రోధా ద్భవతి సమ్మోహఃసమ్మోహా త్స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశా ద్భుద్ధినాశో బుద్ధినాశా త్ర్పణశ్యతి
భావం:
కోపం వలన అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం దాని వలన బుద్ధీ చెడతాయి. ఆ బుద్ధి చెడగానే మనిషి నశించిపోతాడు.
గీతలోనే కాదు, ఉపనిషత్తులలోనూ, రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలలోనూ, స్పష్టంగా చెప్పేదేమిటంటే కామం [అంటే కోరికలు, ఆకాంక్షలు] తీరకపోతే క్రోధం కలుగుతాయని.
కాబట్టి తన కోరికలన్ని తీరే వాడికి, బావిలోని నీరు తోడే కొద్దీ ఊరినట్లుగా మళ్ళీ మళ్ళీ కోరికలు పుడతాయి గాని, క్రోధపడవలసిన అవసరం తక్కువ. తన ’సందట్లో సడేమియా’తో రాజశేఖర్ రెడ్డి, తన బలాన్ని, బలగాల్ని[టీంని] వృద్ధి చేసుకోవటం అన్న ప్రక్రియ జయప్రదంగా చేసుకోగలిగాడు. అందులో భాగంగానే తనని నమ్మిన వాళ్ళకి అన్నీ దోచిపెట్టటం, వ్యతిరేకించిన వాళ్ళని చితక్కొట్టి అణిచి పారేయటం చేసాడు. గారెల వంటలో అదీ భాగమే. ఇవన్నీ గతంలో రామోజీరావు చేసినవే! దాన్ని రాజశేఖర్ రెడ్డి అనుసరించాడు. ఎటూ నెం.10 వర్గమూ, నెం.5 వర్గమూ కూడా, తమతమ కారణాల రీత్యా [ఆయా కారణాలేవో రాజశేఖర్ రెడ్డికి తెలియకపోవచ్చుగాక] తనకి ‘మడమ తిప్పని వీరుడు, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాడు’ ఇత్యాది ఉపమాన ఉత్ర్పేక్షలతో ఇమేజ్ ఇస్తున్నాయి కూడా! దాంతో చెలరేగిపోయాడు. అన్నీ తన కోరికలకి అనుగుణంగానే జరుగుతున్నప్పుడు ఇక ’కోప నరం’ తెగిపోక ఏం చేస్తుంది? అదే అసెంబ్లీలో, ఒకోసారి, ‘ఎదుటివాడు నోరుముయ్యటం లేదు’ అనుకున్నప్పుడు ఇరిటేట్ అయ్యి నోరు జారటం జరిగింది.
ఈ స్థితిలో, వై.యస్.రాజశేఖర్ రెడ్డి, తనకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలా, అవినీతితో రాష్ట్రాన్ని దోచిన సొమ్ముని, కేవలం గూఢచర్యానికి ఖర్చుపెట్టలేదు. అలా పెడితే చంద్రబాబునాయుకి లానే తనకి తదుపరి ఎన్నికల్లో 50 మంది ఎం.ఎల్.ఏ.లే మిగులుతారు. [అప్పటికి EVM ల ఊహలేదు మరి! కాబట్టి ఆలోచన అంత వరకే చేయగలడు] అంతేగాక చంద్రబాబునాయుడు అవినీతిని Centralized చేసాడని అంటారు. అసలే తానున్నది తెదేపా వంటి స్థానిక పార్టీ కాదు. అసమ్మతి ఆనవాయితీగా గల జాతీయపార్టీ. అందునా గతంలో తానే, వంద అసమ్మతి ముఠాలు కట్టిన నిత్య అసంతృప్తి వాది షాపేన్ హోవర్ వంటి వాడయ్యె!
అందుచేత – సెజ్ ల నెపంతో భూములమ్మనీ, క్రైస్తవమంత్రుల్ని, ఛైర్మన్లనీ పెట్టి దేవాదాయ శాఖల ద్వారా హిందూ ఆలయాల ఆదాయాన్ని దోచనీ, ప్రాజెక్ట్ లంటూ కాంట్రాక్టులిస్తూ, ఆరోగ్యశ్రీ ల పేరిట కార్పోరేట్ ఆసుపత్రిలకి డబ్బు ప్రవహింపచేస్తూ, అందులోంచి వాటాలు పుచ్చుకోనీ – ఇలా వీలయిన అన్నిమార్గాల్లో చేసిన అవినీతి, పోగేసిన సొమ్ముతో కొంత అధిష్టానానికీ పంపినా, ఎక్కువ మొత్తం క్రింది మంత్రులకి కూడా పంచాడు. అప్పడే కదా తనకి భక్తులు ఏర్పడతారు? అదీగాక, తమ తమ వ్యూహాలరీత్యా కొన్ని పనులను నెం.10 వర్గమూ, నెం.5 వర్గమూ కూడా అనుకూల పరుస్తుండగా, ఆయా పనుల కోసం లాబీయింగ్ చెయ్యటానికి కావలసిన సొమ్ము మిగిలిపోతుంది కదా! ముఖ్యమంత్రిగా తన అధికారమూ, అందుకు నెం.5, నెం.10 వర్గాలు చేస్తున్న సాయమూ కూడా కలిసి వస్తుందయ్యె! అందుకే బాగా బలగాన్ని, భక్తగణాన్ని, డబ్బుని కూడా పోగెయ్యగలిగాడు. వేలకోట్ల డబ్బుంటే గూఢచర్యం చేయటం, గారెలు వండట మంత సులభం అనుకున్నాడు. అందుచేత చంద్రబాబు తొక్కిన మార్గానికి భిన్నమైన మార్గం తొక్కాడు.
నిజానికి గతంలో 9 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు కూడా అవినీతిలో తక్కువేమీ కాదు. అయితే అతడు, దోచిన సొమ్మునీ, నెం.10 వర్గమూ, రామోజీరావు తనకి అదనంగా సమకూర్చిన సొమ్మునీ, తన బలం, బలగం పెంచుకోడానికి ఉపయోగించలేదు. అందుకే అతని హయాంలో ’అవినీతిని కూడా ఈ హైటెక్ ముఖ్యమంత్రి Centralize చేసాడు’ అన్నమాట వచ్చింది. అంతేకాదు 2004 ఎలక్షన్లలో అతడికి కేవలం 50 మంది ఎం.ఎల్.ఏ.లని మాత్రమే మిగిల్చింది. ’తను తినటమే గానీ క్రింది వాళ్ళని ఎక్కువ తిననివ్వడు’ అన్న కీర్తి పార్టీశ్రేణుల్లో వ్యాపించింది. అది మాపు కోవటానికి చంద్రబాబునాయుడు, పదేపదే ’నా మైండ్ సెట్ మార్చుకున్నాను. ఇక అందరికీ అందుబాటులో ఉంటాను’ అంటూ ప్రకటించుకోవలసి వచ్చింది.
నిజానికి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా, రామోజీరావు కోసం ప్రపంచపు అంచులదాకా ’పెట్టుబడులు ఆకర్షించటం’ అన్న నెపాన బృందాన్ని వెంట వేసుకుని అతడు చేసింది ఈ లాబీయింగే! దాంతో చంద్రబాబు తాను చాలా గొప్పవాడిని అయిపోయానన్న ఫీలింగ్ తో, ‘ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి’ అన్న వ్యవహార సరళితో అందరికి నెగిటివ్ అయికూర్చున్నాడు. ఆ కారణంగానే “కార్యకర్తలకి అసలు అందుబాటులో లేడు” అన్న పేరుపొందాడు. నిజానికి అతడి హయాంలో అతడికీ మస్తు హవా నడిచింది. అమెరికా అప్పటి అధ్యక్షుడు ‘బిల్ క్లింటన్ ఇచ్చిన సమయం కంటే అధిక సమయం చంద్రబాబుతో గడిపాడు. భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా మాట్లాడాడు’…. గట్రాగట్రా ఎన్నో ’ఇమేజ్ ఇచ్చే కార్యక్రమాలు’ నడిపింపబడ్డాయి.
అయితే పాపం చంద్రబాబునాయుడు ’పిల్లనిచ్చిన మామకి సైతం నమ్మకద్రోహం, వెన్నుపోటు పొడవగలిగాడు’ గానీ, కెరియర్ ఇచ్చిన రామోజీరావుతో ’చర్లాట’లు ఆడలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి [Sep.1, 1995 నాటికీ, 1999 నాటికీ కూడా] పరిస్థితి మరీ ఇంత దిగజారలేదు. 2004, 2005 ల నాటికి దిగజారినంతగా 1995 కో, 1999 కో పరిస్థితులు దిగజారి ఉంటే, రామోజీరావు, తన అవసరం గురించి, తన స్థితి గురించి, మరింత ఎక్కువ సమాచారాన్ని చంద్రబాబునాయుడికి చెప్పి ఉండే వాడు. అప్పుడు చంద్రబాబు కూడా, రాజశేఖర్ రెడ్డి లాగా ’సందట్లో సడేమియా’ నడిపి, కెరీర్ ఇచ్చిన బాసుకయినా వెన్నుపోటు పొడవగలనని నిరూపించుకునేవాడు.
ఎందుకంటే – ఎదుటివాడు అవసరంలో ఉన్నాడంటే సాయం చేయకపోగా Exploit చేయటం, ఎదుటి వాడు తమని నమ్మతున్నాడంటే ద్రోహం చేయటం – ఇవే విజయ సూత్రాలనీ, బ్రతక నేర్చిన తనాలనీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ప్రజా దృక్పధంలో బాగానే ఇంకించింది. ఆ దృక్పధాన్ని మరింతగా ఇంకించుకున్న వారే నకిలీ కణిక వ్యవస్థ, 10 వర్గమూ నిర్మించిన నెట్ వర్కులో సునాయాసంగా పైకి వచ్చే విధంగా డిజైన్ చేయబడింది. కాబట్టి అటువంటి దృక్పధం ఉన్నవారే ఆర్దికంగా, రాజకీయంగా బలపడ్డారు, అభివృద్ధిలోకి వచ్చారు. అది ప్రభుత్యోద్యోగులైనా, వ్యాపారులైనా, రాజకీయ నాయకులైనా, సినిమా తారలైనా…. ఎవరైనా సరే! కాబట్టే ‘గాడ్ ఫాదర్’ లేదా ‘ఫలానా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నాయి’ అన్న పదాలు బాగా పాపులర్ అయ్యాయి.
కాబట్టి చంద్రబాబు నాయుడైనా, ఇప్పుడు రామోజీరావు, నెం.10 వర్గమూ ఉన్న స్థితిని, వై.యస్.లాగే, అంతకు కొంచెం ఎక్కువ మోతాదులోనో తక్కువ మోతాదులోనో, Exploit చేసే ప్రయత్నము చేసేవాడు. KVP, వై.యస్.లకి ఉన్నపాటి బుర్ర, చంద్రబాబుకీ లేకపోలేదు. కాబట్టి వ్యత్యాసం పరిస్థితుల్లోనే ఉంది అని చెప్పటమే నా ఉద్దేశం. విపులంగా చెప్పాలంటే ఈ స్థితి, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులకు – తము ప్రయోగించిన ఆయుధం తిరిగి వచ్చి తమనే గాయపరచిన స్థితే! ఇదీ ఒక సువర్ణముఖే!
ఇక్కడ ఓ ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మషిషాసురుడి కథ మనందరికీ తెలిసిందే! యుద్దరంగంలో మషిషాసురుడి శరీరం నుండి నేలకు జారిపడిన ప్రతీరక్తపు బిందువు నుండీ మషిషాసురుడంతటి మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. అందుచేతనే, జగన్మాత అయిన పార్వతీ దేవి, కాళికయై, తన అనేక బాహువులతో వివిధ ఆయుధాలు ధరించి మషిషాసురుడితో యుద్ధం చేస్తూనే, తను, వాడి శరీరం మీద చేసిన గాయాల నుండి కారిన రక్తం నేలకు జారకుండా, తన నాలుకను పొడవుగా పెంచి, ఆతడి క్షతగాత్ర శరీరం నుండి కారే రక్తాన్ని నాకేస్తుంది.
తల్లినే కామించిన ఆ నీచ రాక్షసుడి శరీరం నుండి కారిన ప్రతీరక్తపు బిందువూ నేలను చేరితే మళ్ళీ మహిషాసురుడంత రాక్షసుడు పుట్టటం ఎలాంటిదో, ఇప్పుడు ప్రజానీకంలో ఉన్న అవినీతి కూడా అలాంటిదే. జగన్మాతనే కామించిన మహిషాసురుడిలాగా, ఈ అవినీతిపరులు కూడా కన్నతల్లి వంటి దేశాన్ని దోచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది అవకాశం రాక మంచితనంతోనూ, నీతితోనూ ఉండటమే! దీన్నే నిరూపించాడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గనుక RFC అంతటి స్థానంలో ఉంటే, రామోజీరావుకి ఏమాత్రమూ తీసిపోడు. ’సందట్లో సడేమియా’ నడిపి, ఇస్లాం స్థానే క్రైస్తవం తీసి, ‘మీడియా సంస్థ పెడితే, బలగాన్ని డబ్బుని సమీకరిస్తే చాలు కింగ్ నైపోతాను’ అనుకుని రాజశేఖర్ రెడ్డి చాలా వేగంగా దూసుకెళ్ళిపోయాడు.
ఇతడొక్కడే కాదు, ఎవరికి ఇంతగా పరిస్థితులు కలిసి వస్తే, ఎవరికి గూఢచర్యం వంటివి అందుబాటులోకి వస్తే, వారు అంతగా ’పనితనం’ చూపిస్తారన్నదే ఇక్కడ విషయం. కాబట్టే సమస్య రామోజీరావుతో లేదు. ప్రజల దృక్పధంలోనే ఉంది. ఒక్క మహిషాసురుణ్ణి చంపితే, నేల జారిన వాడి ప్రతి రక్తపు బొట్టు, మరో మహిషాసురుణ్ణి సృష్టించినట్లు, ఒక రామోజీరావు అంతమొందితే, మరెందరో రామోజీరావులు తయారౌతారు. ’ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే, నేల రాలిన ప్రతి రక్తపు బొట్టూ వందలూ వేల సీతారామరాజుల్ని సృష్టిస్తుంది – ఇటువంటి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు, ఒకప్పుడు ప్రజల్ని స్వాతంత్ర్యోద్యమంలోనికి దుమికేలా ప్రేరణ కల్గించాయి. ’వందేమాతరం’ అన్న ఒక్క నినాదమే ప్రజలని ఎంతో ప్రేరేపించింది.
ఆ విధమైన ప్రజల దృక్పధమే, నాడు నకిలీ కణికవ్యవస్థకి తీరని దుఃఖం, చేదు ఓటమి మిగిల్చింది. యదార్ధం చెప్పాలంటే భారతీయుల బలం వారి దృక్పధమే. అందుకే, దాన్నే భారతీయుల బలహీనతగా మార్చే ప్రయత్నం నకిలీ కణికవ్యవస్థ చేసింది. ఆనాడు, అంటే స్వాతంత్రసమరపు సమయంలో, ప్రజాదృక్పధాన్ని సంఘటిత శక్తిగా మార్చిందీ, సరైన రీతిలో నడిపిందీ, దేశభక్తుల చేత నడిపింపబడిన ఆనాటి వార్తా పత్రికలే [అంటే మీడియా] . అందుకే, తదనంతర కాలంలో నకిలీ కణిక వ్యవస్థ, తన ప్రధాన సాధనంగా మీడియానే ఎంచుకుంది. ఆ విధంగా భారతీయులని నిర్వీర్యులుగా, దుర్భలురుగా, నిస్సహాయులుగా మార్చప్రయత్నించింది. కొంత వరకూ సఫలీకృతమైంది.
అందుకోసమే పదార్ధవాదాన్ని, పలాయన వాదాన్ని, కుహనా భావవాదాన్ని ప్రచారించింది, ప్రభోదించింది. అయితే తాను ప్రచారించిన కుహనా భావవాదం రీత్యానే నెం.5 వర్గం ఎవ్వరి ప్రాణాలూ తీయదని గుడ్డిగా నమ్మేసారు నకిలీ కణికవ్యవస్థా, వారి నెం.10 వర్గమూ కూడా! ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారులే’. ‘ముక్తి కోరేవాడు అందర్నీ క్షమించాలి’ గట్రాగట్రా ధర్మపన్నాలతో…. తామే ప్రచారించిన కుహనా భావవాదపు మాయలో తామే పడిన పర్యవసానం అది.
అయితే దేనికైనా ఒక అవధి ఉంటుందని, సామ దాన భేద దండోపాయాలలో ఏదీ ఒకదానికొకటి తీసిపోదని, అవసరమైన చోట సరైన దండన విధించడం తప్పు కాదని, నెం.5 వర్గానికి తాము ప్రచారించిన కుహనా భావవాదపు అభ్యంతరాలు ఏవీ లేవని నెం.10 వర్గం గ్రహించలేకపోయింది.
ఇక్కడ ఓ సత్యం చెప్పుకోవాలి. నెం.10 వర్గానికి, నకిలీ కణికులకీ, శతాబ్ధాలుగా గూఢచర్యం నడిచింది అంటే – అది దైవం నడవనిస్తేనే! ఇప్పుడు పరిస్థితులు తిరగబడి, నెం.5 వర్గానికి బలం పెరిగింది, నెం.10 వర్గాన్ని Expose చేయటం, సువర్ణముఖి అనుభవింప చేయటం వంటి గూఢచర్యం నడపగలుగుతోంది అంటే – అదీ దైవం నడిపిస్తేనే! గూఢచర్యమైనా దైవఘటనకీ, దైవానుగ్రహానికీ అతీతం కాదు. దేనికైనా పాపం పండాలి, కాలం కలిసి రావాలి. అందుకే గీతలో విభూతియోగంలో
శ్లోకం:
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం
జయో౨స్మి వ్యవసాయో౨స్మి సత్త్వం సత్త్వవతామహమ్
భావం:
వంచకాలలో జూదాన్నీ, తేజోవంతులలోని తేజాన్నీ, విజయం పొందేవారి విజయాన్ని, కృషి చేసే వారి ప్రయత్నాన్నీ, సాత్త్వీకులలోని సత్త్వగుణాన్నీ నేనే.
అని చెబుతాడు భగవంతుడు. ఇంకా
శ్లోకం:
కాలో౨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతే౨పి త్వాం న భవిష్యంతి సర్వే యే౨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః
భావం:
ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాలస్వరూపుడిని నేను. ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే, నువ్వు తప్ప, మీ ఉభయపక్షాలలోనూ ప్రతిపక్షంలో ఎవడు కూడా మిగలడమనేది అసంభవం.
అని కూడా చెబుతాడు.
భగవంతుడి పేరిట గూఢచర్యపు నీచపు స్ట్రాటజీలు నడపటమే గొప్ప అనుకోవటం, కంచర్ల గోపన్న[భద్రాచల రామదాసు] కాలంలో ప్రారంభమైన నకిలీ కణిక వ్యవస్థ వంశీకులకి అలవాటే. అలాంటి వారికి భగవంతుడి గురించిన ఈ లోతు అర్ధం కావటం అసంభవం. కాబట్టి వారు గూఢచర్యాన్నే చూసారు. అయితే నెం.10 వర్గానికి, నకిలీ కణికవ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాగాంధీలకి, దైవం గురించిన లోతు అర్ధం గాకపోయినా దైవం గురించిన భయం మాత్రం ఇప్పుడు సోకింది. అదీ ప్రాణభయం దగ్గరికి, పరిస్థితి వచ్చేసరికి, అది అనుభవంలోకి వచ్చింది.
కావాలంటే పరిశీలించండి. హెలికాప్టర్ ప్రమాదంలో YS రాజశేఖర్ రెడ్డి మరణం, రుద్రకోడూరు పరిధిలోని, రుద్రకోటేశ్వరస్వామి ఆలయానికి 18 కిమీ దూరంలోని రుద్రకొండ వద్ద జరిగిందని, సెప్టెంబరు 3,4 తేదీలలోని తొలివార్తలలో వచ్చింది. తర్వాత అది పూర్తిగా పావురాలగుట్టగా మాత్రమే గుర్తింపబడింది. ఎక్కడా ’రుద్ర’కోడూరు ప్రసక్తిగానీ, రుద్రకోటేశ్వరస్వామి ఆలయంగానీ, రుద్రకొండ ప్రసక్తి గానీ మీడియా తేవటం మానేసింది. ప్రజలకి ఎక్కడ దేవుడు గుర్తుకొస్తాడోనన్న భయమూ, గుర్తురాకూడదన్న జాగ్రత్తా, మీడియా తీసుకుంది. [లయకారుడైన శ్రీశైల మల్లిఖార్జున స్వామి సామ్రాజ్యంగా నల్లమల కొండలకు పేరు. ఇంకెక్కడా శివుడికి సామ్రాజ్యం ఉన్నట్లు చెప్పబడదు. సిద్దవటం, ఉమామహేశ్వరం, ఆలంపూరం, త్రిపురాంతకం ఈ నాలుగు దేవస్థానాలు నాలుగు ద్వారాలుగా, వీటి మధ్యనున్న నల్లమల అడవులని శ్రీమల్లిఖార్జున స్వామి సామ్రాజ్యంగా చెప్పబడింది. క్రైస్తవుడయి ఉండి, వై.యస్., శివరాత్రి పర్వదినాన ’నా మనసే మహాశివుడు’ అని ప్రకటించుకున్నందుకు, లయకారుడైన శ్రీశైల మల్లన్న ’రుద్ర’ తాండవమా ఇది?] రుద్రుడంటే భయమేసిందేమో మరి!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
3 comments:
good analysis.well written.
నిజమేనండీ. మీడియా బొత్తిగా తర్వాత్తర్వాత రుద్రకొండ పేరు కూడా ఎత్తకపోవడం నాకూ ఆశ్చర్యం వేసిందండీ. కానీ నేను ఇంత ఆలోచించనేలేదు!!
ys rajasekherbreddy garu chala manchi panulu chesaru intha talent use chanipoyinavarini kinchaparachadam chala badakaramina vishayam
chandrababu naidu ramojirao antha bad persons inkaevaru undaremo
Post a Comment