మతం ముసుగు వేసుకుని, మాటల్లో మానవీయ విలువల్ని చెబుతూ, చేతల్లో గూఢచర్యం నెరపిన సి.ఐ.ఏ.కీ, ఇస్కాన్ కీ విధించబడిన మరో సువర్ణముఖి ఏమిటంటే – తాము సృష్టించిన మోజుతో డబ్బున్న వాళ్ళు విహారయాత్రలకొచ్చినట్లు లేదా రిసార్ట్ లకి వచ్చినట్లు ఇస్కాన్ కి వచ్చి చెల్లించిన సొమ్ముతోనూ, ఇదని తెలీని విద్యార్ధులని పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు విహారయాత్రలో భాగంగా ఇస్కాన్ కి తీసుకెళ్ళటం వంటి రాబడితోనూ, ఇస్కాన్ వంటి సంస్థలకి విరాళం ఇవ్వటం తమకు పైనుండి వచ్చిన ఆదేశమో లేక వ్యాపార అవసరమో అవటం చేత ’దాతలు’ చెల్లించిన విరాళాల సొమ్ముతోనూ, ఇతరత్రా గూఢచర్య లాబీయింగ్ తో సమకూడిన సొమ్ముతోనూ, గతంలో [అంటే 1992 కు ముందు] మళ్ళీ గూఢచర్యమే నిర్వహించేవాళ్ళు. ప్రజాదృక్పధాన్ని విషపూరితం చెయ్యటం, మతం పేరిట మానవత్వం మంటగలపటం, దోపిడికి మరింత బాటలు వేయటం వంటి పనులు నిర్వహించేవాళ్ళు. సామూహిక రేప్ లతో స్పృహ కోల్పోవటాన్ని రాసలీలగానూ, మత్తుపదార్ధ వినియోగంతో బాహ్యస్పృహ కోల్పోవటాన్ని మధురభక్తి గానూ ఆచార్య రజనీష్, ఇస్కాన్ వంటి వారు ప్రచారం చేశారు.

ఇప్పుడు ఆత్మహత్యా సదృశ్య Assignments కారణం కావచ్చు లేక ‘కుట్రదారులమే అయితే ప్రజాహిత, సేవాకార్యక్రమాలెందుకు చేస్తామని’ అంటూ ద్వంద్వం సృష్టించి, [అంటే ఎలీబీలు సృష్టించి] ప్రజలని నమ్మించవలసిన అవసరం కారణం కావచ్చు, ఏ కారణమైనా కానివ్వండి, 1992 తర్వాత ఇస్కాన్ ‘అక్షయపాత్ర’ అంటూ రోజుకి పదిలక్షల మందికి భోజనం పెడుతోంది. మరో కారణం ‘కన్నా?’’కాలా?’ అన్న స్ట్రాటజీ గురించి తర్వాత వివరిస్తాను. కాబట్టి ఇది ఇస్కాన్ కీ, సి.ఐ.ఏ.కీ లిఖించబడిన మరో సువర్ణముఖి అన్నాను.

ఏది ఏమైనా ఇస్కాన్ అసంశయ పేరుతో వ్యక్తిత్వ వికాస శిక్షణ నిస్తోందనీ, అక్షయ పాత్ర పేరుతో అన్నదానం చేస్తోందనీ ఆనందిద్దామా లేక మతం ముసుగువేసుకుని భారతీయుల, హిందువుల ఆధ్యాత్మికతను ’ఎకసెక్కం’ ఆడుతోందని విచారిద్దామా?

కావాలంటే ఆగస్టు 27 న ప్రచురింపబడిన ఈ క్రింది వార్త చూడండి.

రాధాదేవిని బార్బీ బొమ్మలా అలంకరించాలనుకోవడం ఎగతాళి చేయడం కాదా? ఇస్కాన్ వెనుకా, శ్రీల ప్రభుపాదుడి గతం వెనుకా గల గౌడీయమఠపు పునాదుల ఊసెత్తని మీడియా, శ్రీల ప్రభుపాదుడి గురించీ, ఇస్కాన్ గురించీ ఆకాశానికెత్తుతూ వ్రాసి, నిజాలు దాచే మీడియా, చేస్తోంది కుట్ర కాదా? మీరే విశ్లేషించండి.

ఇక ఇస్కాన్ వ్యాపార నేపధ్యం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టవలసిందే! హరేకృష్ణ ఉద్యమం పేరిట ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాల్లో క్యాసెట్లు, టీషర్టులు, ఇతర యాక్సెసరీస్ వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా జరిగింది. అందులో ముఖ్యంగా సంగీత వ్యాపారం చెప్పుకోదగింది. మ్యూజిక్ కాన్సర్ట్ లవంటి కార్యక్రమాలు, క్యాసెట్ల అమ్మకం జోరుగా సాగింది. పాప్ గాయక బృందం ’బీటిల్స్’ పరంపరగా క్యాసెట్లు మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఒక్కరే హిందువు. మిగిలిన ముగ్గురూ హిందూయేతరులే. సంగీత వ్యాపారం పతాక స్థాయిలో ఉండగా ఈ బృందంలోని ఒకగాయకుడు హత్య[?] చేయబడ్డాడు. వారి పాటల్లో ’హరేకృష్ణ’ మంత్రం ఉందన్న ప్రచారం విపరీతంగా సాగింది. కృష్ణమంత్రం ’పాప్’ స్ట్రయిల్ లో జపించబడింది, పాడబడింది. దాని మీద వివాదాలు చెలరేగాయి కూడా. కొన్ని వివాదాలు కోర్టుల దాకా పోయాయి. ఈ నేపధ్యంలో ’బీటిల్స్’ బృందం విడుదల చేసిన ఓ క్యాసెట్ పైన శ్రీకృష్ణుడి బొమ్మ ఉంది గానీ లోపల ఒక్క పాట కూడా అందుకు సంబంధించినది లేదన్న వివాదం కూడా ఒకటి.

ఇక జగన్నాధ రధయాత్రల తిధి,తేదీలలో గౌడీయమఠం వారు కూడా రధయాత్ర నిర్వహిస్తారు. ‘లొక్కిదేవి’ అంటే ‘లక్ష్మీదేవి’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎంతో వేడుకగా ఉంటుంది, ఆ కార్యక్రమం! అందులో డబ్బూ, వ్యాపార ప్రసక్తి, ఏదీ ఉండదు. ఆ రోజు ఊరందరికి అన్నప్రసాదం పెడతారు.

పూరీ జగన్నాధుడి రధయాత్రని పురస్కరించుకుని మాయాపూర్ లో గౌడీయమఠం వారు నిర్వహించే రధయాత్రలో ఎంతగా మధురభక్తి ప్రతి ఫలిస్తుందంటే – గౌడీయమఠంకి అనుబంధంగా జగన్నాధుడి ఆలయం [చిన్నది] ఉంది. గౌడీయ మఠం పూజారులే అక్కడా పూజాదికాలు నిర్వహిస్తారు. ముందుగా గౌడీయమఠంలోని బ్రహ్మచారులు, పూజారులూ కొందరు రధం తీసుకునిపోయి, జగన్నాధుడి ఆలయంలోని శ్రీకృష్ణుడి ఉత్సవమూర్తిని ఎత్తుకొచ్చేస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పూజారులు లక్ష్మీదేవి [లొక్కిదేవి అనిపిలుస్తారు] తరుపున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకుపో ప్రయత్నిస్తున్న వారిని నిలువరించప్రయత్నిస్తారు. వీళ్ళు అయ్యవారి తరుపు వారన్న మాట. చిన్నపాటి యుద్ధాన్ని అభినయిస్తారు, రెండువర్గాల వారు కూడా! ఇక వీళ్ళు శ్రీకృష్ణుడు విగ్రహాన్ని తీసుకొస్తూ ఊరంతా రధం మీద ఊరేగించి మఠానికి తెచ్చి షోడశోపచారాలూ చేస్తారు.

దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అక్కడ యజమానికి భక్తుడైన సేవకులు ఎలా సేవిస్తారో అలా సేవిస్తారు. ముందుగా భక్షభోజ్యాలతో కూడిన అన్నప్రసాదాన్ని వడ్డించి, నెయ్యి వడ్డించి బయటికొచ్చి గర్భగుడి తలుపులు వేసేస్తారు. ఎందుకంటే అయ్యవారు ప్రేమగా అమ్మవారికి తినిపిస్తారట. వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా నైవేద్య నివేదన చేసిన పూజారి బయటికొచ్చి నిలబడతారు. బయట సంకీర్తనలో మునిగి ఉండగా, ఈ పూజారి మళ్ళీ లోపలికి వెళ్ళి అయ్యవారు, అమ్మవారికి పెరుగు ఉప్పు వడ్డించి వస్తాడు. వెళ్ళేముందు చిన్నగా చప్పట్లు చరిచి, తలుపు మీద చిన్నగా తట్టి అనుమతి తీసుకున్నట్లుగా ఆగి, అప్పుడు గర్భగుడిలోనికి వెళతాడు. భోజనానంతరం హస్త ప్రక్షాళన, వస్త్రంతో చేతులు తుడవటం... అన్నిటినీ ప్రాణం ఉన్న యజమానికి చేసినట్లుగా సపర్యలు చేస్తారు. నగలూ, వస్త్రలూ అలంకరించేటప్పుడు కూడా ఇదే మధురభక్తి, గాఢానురక్తి ఉంటాయి. అదే ఇస్కాన్ లో అయితే దేవుడు గర్భగుడిలో ఉండడు. స్టేజ్ మీద నర్తిస్తున్నట్లుగా ఉంటాడు.

ఇక మూడోరోజున లొక్కిదేవి [వీరు అమ్మవారితరుపు వారన్న మాట] తరుపు పూజారులు చిన్నచిన్న కాగడాలు వెలిగించుకుని గౌడీయమఠం పైకి దాడికి వస్తారు. వీళ్ళు ద్వారాలు బంధిస్తారు. వాళ్ళ కాగడాలతో గేటుపై బడి కాస్సేపు వీరంగం చేస్తారు. ఊరి వాళ్ళంతా కూడా రెండు గ్రూపులుగా విడిపోయి, అయ్యవారి తరుపున కొందరు, అమ్మవారి తరుపున కొందరు నిలబడతారు. ఆ రోజుకి ఇక ఊరుకుంటారు. వాళ్ళు అయిదోనాడు వస్తారు. ఆ రోజు ఇక గేటు తీసేస్తారు. వాళ్ళంతా లోపలికి కేకలు పెట్టుకుంటూ, చిన్నరధం మీద లొక్కిదేవి విగ్రహంతో వస్తారు. అయ్యవారి విగ్రహాన్ని పట్టుకొచ్చిన పూజారులంతా పూపొదలచాటునా, తోటలోనూ, అక్కడో చిన్న కొలనుంటుంది, ఆ ఒడ్డున ఉన్న పొగడ పూలచెట్లు చాటుగా దాక్కుంటారు. లొక్కిదేవి పూజారులు వీళ్ళ కోసం వెదుకుతారు. గ్రామస్థుల్లో కొందరు అయ్యవారి పూజారుల్ని దాచడానికి, కొందరు పట్టివ్వడానికి ప్రయత్నిస్తారు. చివరికి అయ్యవారిని ఎత్తుకొచ్చిన పూజారుల్ని, లొక్కిదేవి పూజారులు పట్టుకుని రధానికి కడతారు.

వీళ్ళు వదిలేయమని బ్రతిమాలుతారు. వాళ్ళు బెట్టు చేస్తారు. చివరికి కట్నకానుకలిస్తామని అంగీకారాలయ్యాక వదిలిపెడతారు. ఇక రెండువర్గాలు కలిసి లొక్కిదేవి, జగన్నాధులకు సంకీర్తన, హారతిలతో భజన చేస్తారు. అయ్యవారి తరుపు పూజారులు అమ్మవారి తరుపు వారికి భోజనాలు పెడతారు. అచ్చం వియ్యాల వారిలా వాళ్ళు దానికి ఉప్పులేదని, పప్పులేదని వంకలు పెడతారు. ’రేపు మీ ఇంటికి వచ్చాకా మీరెలా పెడతారో మేమూ చూస్తాం గా’ అని వీళ్ళు మేలమాడతారు. అంతా అయ్యాక లొక్కిదేవిని కూడా ఇక్కడే ఉంచి వాళ్ళు వెళ్ళిపోతారు. మరో మూడు రోజుల గడిచాక అయ్యవారి తరుపు పూజారులు జగన్నాధుణ్ణి, లొక్కిదేవిని పూజించి, నూతన వస్త్రాలతో అలంకరించి, రధం మీద ఊరేగిస్తూ జగన్నాధుడి ఆలయానికి తీసుకెళతారు. రెండువర్గాలుగా విడిపోయిన గ్రామస్థులలో కొందరు అయ్యవారికీ, అమ్మవారికీ కానుకలిస్తారు. ఇరువర్గాల పూజారులకీ నూతన కాషాయ వస్త్రాలు ఇస్తారు. అప్పుడు లొక్కిదేవి తరుపు పూజారులు భోజనాలు వడ్డిస్తారు. వియ్యాల వారు మాటకి మాట వడ్డిస్తారు. ఇక ఈ సంబరాలలో వారు చేసే సంకీర్తన చెప్పుకోదగింది. ఒంటి మీది కాషాయపు అంగీలు చెమటకు తడిచి చిరిగిపోయినా స్పృహ ఉండనంతగా, అయ్యవారి అమ్మవారి తరుపు పూజారులు, పోటాపోటీగా చిందులు వేస్తూ భజన చేస్తారు. అప్పుడు వాళ్ళు ముఖాల్లో దీప్తి, కళ్ళల్లో కాంతి, చెమటకు తడిసి వగరుస్తున్నా వాళ్ళల్లో కనిపించే స్ఫూర్తి…. అనిర్వచనీయంగా ఉంటుంది.

ఇక ఈ రధయాత్రని ఇస్కాన్ ఎలా నిర్వహిస్తుందంటే – జర్మనీ, అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో శ్రీకృష్ణుని రధయాత్రని, పూరీ క్షేత్ర రధయాత్ర తిధులతో సంబంధం లేకుండా, ఆయా దేశాల్లోని సెలవు దినాలకు అనుగుణంగా నిర్వహిస్తుంది, అదో ర్యాలిలాగా ఉంటుంది. కాషాయంబరధారులైన ఇస్కాన్ బ్రహ్మచారులు భజన చేస్తుండగా, రధయాత్ర ఊరేగింపులో, హరేకృష్ణ పాటల క్యాసెట్లు, పుస్తకాలూ, టీ-షర్టులూ, టోపీలు గట్రాగట్రా వ్యాపారాన్ని ఇస్కాన్ ఇతర సభ్యులూ, ఇస్కాన్ అభిమానులు నిర్వహిస్తారు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అన్నమాట. గౌడీయమఠంలోనూ, రామకృష్ణమఠంలోనూ అడ్మినిస్ట్రేషన్ పని కూడా బ్రహ్మచారులైన సన్యాసులే చేస్తారు. అదే ఇస్కాన్ లో అయితే ఆ గుమస్తాపనులు సంసారులైన కాషాయంబరధారులు చేస్తారు. అందులో మధురభక్తి మచ్చుకైనా కానరాదు గానీ, హిందూ సాంప్రదాయాలను అపకీర్తి పాలుచేయటంతో పాటు, కాసుల వ్యాపారం అపారంగా నిర్వహించబడుతుంది. ఇది కూడా వివాదాస్పదమై కోర్టుల దాకా పోయింది.

ఇక గోవిందాస్ రెస్టారెంట్లు, ఇతర రెస్టారెంట్లు, ప్రసాదాల కౌంటర్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. వైష్ణవాలయంలో కోడిగుడ్డుతో చేసిన కేకులు [ఇప్పుడు పిజ్జా, బర్గర్ లు కూడా ప్రసాదాలుగా పెడుతున్నారట] ప్రసాదాలుగా పెట్టడం, ఎంతగా గుడ్డు శాఖాహారం అని వారించినా ’అపవిత్రం’ అన్పించక మానదు. అదీగాక భగవానుడి పేరిట రెస్టారెంట్లు నడపటం ఇస్కాన్ కే చెల్లింది. ఈ విషయం తెలిసాక, ప్రపంచంలో మరేదైనా చర్చిగానీ, మసీదుగానీ ఇటువంటి వ్యాపారం చేస్తుందో లేదో నిజంగా తెలుసుకోవాలనిపించక మానదు.

ఇక ఇస్కాన్ పుస్తక వ్యాపారం మరో అంశం. ఇస్కాన్ ప్రచురణలు ఉచితంగా పంచిపెట్టటం గురించి పత్రికలలో, అదీ ఇటీవలనే చదివాను తప్ప వాస్తవంలో అయితే చూడలేదు. ఇస్కాన్ ప్రచురణలు చాలా ఖరీదుగానే ఉంటాయి. వారి బొమ్మలు అందంగా, ఆకర్షణీయంగా, ఖరీదుగా ఉంటాయి. కాలండర్ల దగ్గర నుండీ, వాల్ హంగింగ్ లదాకా, అన్నీ అంతే! వాటిల్లో కురుక్షేత్ర యుద్ధసమయంలో విజృంబిస్తున్న భీష్మాచార్యుణ్ణి, ఎవ్వరూ నిరోధించలేక పోతున్నప్పుడు, సాక్షాత్తూ శ్రీకృష్ణుడు కోపితుడై, చక్రాయుధం పూని భీష్ముడి మీదికి లంఘిస్తున్న చిత్రం పేరిన్నిక గలది. ఓ వైపు ముకుళిత హస్తుడై భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి స్వాగతిస్తుంటాడు. మరోవైపు శ్రీకృష్ణుణ్ణి శాంతింపచేయప్రయత్నిస్తూ అర్జునుడు, కృష్ణుడికి అడ్డుపడుతూ ప్రార్ధిస్తుంటాడు. వెనుక రణరంగం కన్పిస్తుంటుంది. దీనికి పేరు[caption] ఏమని ఉంటుందో తెలుసా? ’The Encounter in Kurukshthra’ అని ఉంటుంది. ఎన్ కౌంటర్ అనటంలోని మర్మం ఏమిటో?

ఇలాంటి మర్మాలు వదిలేస్తే, ఇస్కాన్ పుస్తక కేంద్రం, ఏనాడూ గౌడీయమఠం వారిలాగా చౌకగా పుస్తకాలు అమ్మలేదు. శ్రీరామకృష్ణ మఠం వారిలాగా 12 రూపాయలకి ఉపనిషత్తుల్ని ప్రచురించలేదు. బాలల కోసం పురాణగాధల్ని ఆరు రూపాయలకి ఒకటి చొప్పున పదిహేను సంపుటాలు[ఒకో సంపుటిలో కనీసం 8 నుండి 10 కథలుంటాయి. అదీ బొమ్మలు మాట్లాడుతున్నట్లుగా! (కామిక్స్ లా)] ప్రచురించలేదు. ఇక ఉచితంగా పంచటం గురించి నాకు తెలియదు. తిరుమల కళ్యాణ కట్ట ఎదురుగా, ఆర్చి క్రింద, ఇస్కాన్ వారి పుస్తక కేంద్రంలో బ్రహ్మచారులు[కాషాయాంబరధారులు] ఇస్కాన్ ప్రచురణలు అమ్మటం మాత్రం, నేను తిరుమల వెళ్ళినప్పుడల్లా పరిశీలిస్తుంటాను. నాకు తెలిసీ ఇస్కాన్ ప్రతికోణంలోనూ వ్యాపారం చెయ్యటమే చూశాను.

ఇక ఈ అన్నదానాలు 1992 తర్వాతే 1999 లో భారీఎత్తున ప్రారంభించటం, విస్తరించటం జరిగింది. కారణం ఇంతకు ముందే వివరించినట్లు - నెం.5 Vs నెం.10 వర్గాల మధ్య గూఢచర్య యుద్ధంలో నెం.5, నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలకవ్యక్తులకీ, ఇస్కాన్ వంటి సంస్థలకీ విసిరిన కన్నా? కాలా? స్ట్రాటజీ కూడా ఓ కారణం.

ఇక్కడో విచిత్రం లేదా విశేషం గమనించండి. 1992 కు ముందర, ఇస్కాన్ విషయంలో వివాదాస్పదం అయిన హరేకృష్ణ ఉద్యమం కానివ్వండి, ఇస్కాన్ నడిపే పాఠశాలల్లోని బాలలపై లైంగిక హింస, ఇతరత్రా హింసల విషయంలో అయిన వివాదాలు కానివ్వండి, అప్పుడు భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అందునా అవి అన్నీ కోర్టు పరిధుల్లోనే ఉన్న వివాదాలు, వివిధ దేశాల కోర్టుల పరిధుల్లో ఉన్న వివాదాలు! అయితే విచిత్రం లేదా విశేషం ఏమిటంటే, ఆయా వివాదాలన్నీ 1992 తర్వాత దేశవిదేశ కోర్టుల్లోనూ తిరగబడ్డాయి. గతంలో జరిగిన మాదిరి వివాదాలే మళ్ళీ సంభవించి మరోసారి వివాదాస్పదం అయ్యాయి. అటువంటి వివాదాలని ప్రారంభించింది, స్వయంగా ఇస్కానే! దానాదీనా విదేశీ కోర్టుల్లో[స్వదేశంలో కూడానేమో] మిలియన్ల కొద్దీ డాలర్లని ఇస్కాన్ నష్టపరిహారంగా ఆయా బాధితవ్యక్తులకి[అంటే తమ పాఠశాలల్లో హింసకు అనుభవించినవాళ్ళు, అలాంటి ఇతరులకి] 1992 తర్వాత [1998] చెల్లించింది. ఆ తర్వాతే అక్షయపాత్రల్లాంటి అన్నదానాది ప్రజాహిత కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఆయుధాలతో గాక మెదళ్ళతో జరిగేయుద్ధం, మరో మాటలో చెప్పాలంటే గూఢచార యుద్ధం ఎంత హోరాహోరీగా జరుగుతుందో ఈ విచిత్రం లేదా విశేషం ఆవిష్కరిస్తోంది.

చావుకు పెడితే లంఖణానికి ఒప్పుకున్నాడని సామెత. దీన్నే మరోమాటలో చెప్పాలంటే భారీనష్టపరిహారాలు చెల్లించటం కన్ను ఊడగొట్టుకోవటం అన్పించింది. దాంతో అక్షయ పాత్రలూ, అసంశయాలూ, ఆనాధశ్రయ నిర్వహణలూ కాలు పోగొట్టుకోవటంగా అన్పించింది. వెరసి కన్ను కాపాడుకోవటం కోసం కాలు వదిలేసుకోవటం అన్న స్ట్రాటజీ ఇలాక్కూడా పనిచేసింది.

శ్రీల ప్రభుపాదుడి రెండోముఖం, కోర్టుద్వారా గౌడీయమఠం ఆస్థుల పంపకంలోని నిజానిజాలు తెలుసుకోవటం కోసం, మీరు గౌడీయమఠం ప్రధాన కేంద్రాన్ని సందర్శించి విచారించవచ్చు. లేదా గుంటూరులోనూ, రాజమండ్రి ప్రక్కన గల కొవ్వూరులోనూ గల గౌడీయమఠపు శాఖలోని వృద్ధులైన, సన్యసించిన మహారాజ్ లేదా బ్రహ్మచారులని కలిసి వివరాల సేకరించవచ్చు. నాకు తెలిసినది మన రాష్ట్రంలో రెండుశాఖలే. ఇంకా ఎక్కడైనా గౌడీయమఠం ఉంటే స్వయంగా విషయాలు తెలుసుకోగలరు. వికీపిడియాని దర్శించినా, ఇంత వివరంగా గాకపోయినా కొంత వివరంగా తెలుసుకోగలరు.

ఏది ఏమైనా, మాయాపూర్ మాత్రం నిజంగా దర్శనీయ స్థలం. అక్కడి నేలలో చైతన్యుడి పాదధూళి ఇప్పటికీ పరిమళిస్తుందేమో అన్నట్లుంటుంది. సాయంసంధ్యలో, గోధూళివేళ, ఆకాశం కెంజాయి రంగులో మెరుస్తుండగా, అక్కడి గాలిలో, పొగడపూల చెట్ల వాసనలో, గంగనీళ్ళలో చైతన్యుడి మధురభక్తి సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్నట్లుంటుంది. వీధి వీధినా మ్రోగే హారతి గంటా, కృష్ణ సంకీర్తనా అలలు అలలుగా తేలి వస్తూంటుంది. చీకట్లలో చెట్లకు మిణుగురు పురుగుల కాంతితో గమ్మత్తుగా ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

మీరు చెప్పింది చదువుతుంటే, నాకు మళ్ళీ వేయిపడగల కళ్యాణోత్సవాలు గుర్తొస్తున్నాయి. పదకొండు రోజుల కల్యాణోత్సవాలలో గిరికా మహా ప్రస్థానంతో పాటు చెప్పుకోవాల్సింది, అయ్యవారికి గిరికా సంబంధం మాట్లాడుకునే ఘట్టం . చాలా బాగుంటుంది. మరొక్క సారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
ఉద్యోగ రీత్యా వేరే ప్రదేషంలో(పూనే) ఉండడంచేత ఆగస్ట్ నుండి మీ బ్లాగు చదవడం కుదరలేదు. ఈ రోజు ఆగస్ట్ నుంది మొదలుపెట్టి మొత్తం చదువుతూ కూర్చున్నాను.

చాలా బాగా రాసారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu