అనుకూల, ప్రతికూల వాతావరణాలని ప్రపంచమంతా గాకపోయినా, కొంత పరిమిత పరిధి మేరకు ప్రభావపరచటం – అన్న ప్రక్రియ గూఢచర్యంలో భాగమే. కనుక, హెలికాప్టర్ ప్రమాదంలో నెం.5 వర్గపు ప్రమేయాన్ని, నెం.10 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావులు తోసిపుచ్చలేకపోయారు. అయితే నిందించనూ లేరు, నిరూపించనూ లేరు. నిందించాలంటే నెం.5 వర్గపు అస్థిత్వాన్ని ప్రకటించాలి, బాహాటంగా అంగీకరించాలి. అలా చేయటం అంటే తమని తాము ప్రకటించుకున్నట్లే. మరోమాటలో చెప్పాలంటే తమ ఓటమిని అంగీకరించినట్లే.

ఇందులో ఉన్న ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీ ఆసక్తికరమైనది. నెం.5 వర్గపు ఉనికిని అంగీకరిస్తూ, బాహాటంగా ప్రకటిస్తే తమ ఉనికినీ ప్రకటించుకున్నట్లే! అంటే ఇప్పటి వరకూ నెం.10 వర్గంగా తము చేసిన పనులు బయటకి వస్తాయి. అప్పుడు ప్రజలందరికి గూఢచర్యం గురించి అవగాహన వస్తూంది. ప్రజలలో అవగాహన వస్తే, తము నడిపే దోపిడి సాగదు. ఆ రీత్యా తమ ఓటమిని అంగీకరించినట్లే. ఇది కన్నుని వదిలేసుకోవటం వంటిది. అంచేత ఈ కన్నుని, అంటే నిందించటమూ, నిరూపించటమూ కూడా మానేసుకుని గూఢచర్యాన్ని కొనసాగిస్తూ పోతే, ఈ Expose, ఈ సువర్ణముఖిలు కొనసాగుతూనే ఉంటాయి.

దానికి తోడు ఇప్పుడు కొత్తగా బయటపడిన YSR అనే ఈ అనుచరుడి ’సందట్లో సడేమియా’ వంటి భాగోతాలు బయల్పడటం ప్రారంభమైతే, నెం.5 తమని ఎంతగా ’దద్దమ్మల్ని’ చేసి కూర్చోబెట్టిందో, అందరికీ [అనుచరవర్గానికి] అర్ధమైపోతుంది. దాంతో తాము తమ అనుచరులకి మరింత చులకన అయిపోతారు. ఒకర్ని చూసి మరొకరు, ’ఫలానా వాడు చర్లాటలాడితే ఏం చెయ్యగలిగారు? మనం అనవసరంగా భయపడుతున్నాం’ అనుకొని….. ఇలా ఒకరికి మరి కొందరు, ఇంకా కొందరు తయారౌతారు. క్రమంగా తమ నెట్ వర్క్ మొత్తం కూలిపోతుంది. ఇది కాలుని వదిలేసుకోవటం వంటిది. ప్రస్తుతానికి కాలు వదిలేసుకున్నా….. తర్వాత కన్ను వదిలేసుకోకతప్పదనీ, ‘పిసినారి ధనయ్య’ వంటి నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావూ వరుసగా అన్ని శిక్షలూ అనుభవిస్తారనీ మీరు గతంలోనే పరిశీలించారు. ఈ నేపధ్యంలో నిందించటమే చెయ్యని చోట ఇక నిరూపించటం ఎలా సాధ్యం?

ఈ రీత్యా, హెలికాప్టర్ ప్రమాదం విషయంలో, తేలు కుట్టిన దొంగల్లా ఊరుకోవాల్సి వచ్చింది. అంతేగాక పైకారణంగా[over leaf reason] ఇద్దరి[రాజ, రామోజీరావులూ] మధ్య తగాదా డ్రామా వల్ల, హఠాత్తుగా ఒకరు[YSR] చనిపోయినప్పుడు, రెండోవ్యక్తిని అందరూ X-Ray కళ్ళతో గమనిస్తారు. అందుకోసం మీడియా, కాంగ్రెస్ అధిష్టానం, అందరూ కలిసి, రామోజీరావు రక్షణ కోసం ’చచ్చినోడి కళ్ళు కిలోమీటర్లు’ అనాల్సి వచ్చింది. అతణ్ణి అర్జంటుగా దేవుణ్ణి చేయాల్సి వచ్చింది. తదుపరి వ్యూహరచన కోసం సమయం gain చెయ్యాల్సి వచ్చింది.

తనకి ఎదురేలేదన్న ధీమాతో, విలాసపు నడకలూ, విపరీత హావభావాలు, ’కోపం నరం తెగిపోయిన వెకిలి నవ్వులూ’ ఒలికించిన YS భౌతిక దేహం, ముక్కలు చెక్కలుగా ఛిద్రమై, అతిదారుణమైన మరణాన్ని పొందటం ఒక ఎత్తైతే, ఆ విషయం, ప్రమాదం జరిగిన నాలుగైదు గంటల్లోనే తేలిపోయినా, ప్రపంచానికి రహస్యంగానే ఉంచి, తాము ఎత్తు పై ఎత్తులు ఆలోచించవలసి రావటం మరో ఎత్తైంది. పర్యవసానంగా ఇప్పటి వరకూ, తమ కళ్ళ ఎదురుగా మసలిన వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలై, అడవిలో, అనాధ మాదిరి, కాలి, వర్షానికి తడిసి, ఉబ్బి, కౄరమృగాల మధ్య దిక్కూమొక్కు లేకుండా పడి ఉండటం, పడిఉండవలసి రావటం, పడవేసి ఉంచవలసి రావటం…. విధి, గూఢచర్యం ఎంత కౄరమో కళ్ళముందు నిలబెట్టింది. అయితే ఈ స్థితిని అనుభవించింది కేవలం నకిలీ కణికవ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలకవ్యక్తులైన రామోజీరావు, సోనియాగాంధీ మరికొందరు కేంద్రంలోని ముఖ్యమైన మంత్రులూ మాత్రమే!

గూఢచర్యపు కౄరత్వం తాము ఇతరుల మీద ప్రయోగించినపుడు తమకేమీ అన్పించలేదు. అది ఇప్పుడు తమ మెడమీదకు వచ్చేసరికి అదెంత కౄరమో ఇప్పుడర్ధమైంది. ఇప్పటి దాకా తమలో ఒకరుగా లేదా తమ వంటివాడే అయిన వై.యస్. భయంకర మరణం, వ్యక్తికన్నా వ్యవస్థ ఎంత బలమైనదో తమదాకా తెచ్చి చూపించినట్లయ్యింది. ఇప్పటివరకూ తమ గూఢచర వ్యవస్థ ఇతరులతో ఆడిన ఆట ఇది. దాంతో మొదలైన ప్రాణభీతికి ప్రారంభ చర్యే ఎకానమీ క్లాస్ ప్రయాణం. పొదుపు పైకారణం[over leaf reason].

వై.యస్. మరణించిన సెప్టెంబరు 2 వ తేదీ, ఆ తర్వాత 24 గంటలూ నెం.10 వర్గానికి అతణి మరణ కారణపు పరిశోధనా, తదుపరి వ్యూహరచన తోనే సరిపోయింది. ఎందుకంటే ముందుగా ముంచుకొస్తున్న పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాలి గదా! ఆ తదుపరి సెప్టెంబరు 7 వ తేదీ రాత్రి నుండి ప్రారంభమైన కేవిపి ఇంటరాగేషన్ తో గానీ, వై.యస్. ఎంతగా తమతో ’చర్లాట’ లాడాడో, ఎంత బుస్సు కొట్టాడో, తమని ఎంతగా గోతిలో పడేసాడో అర్ధం కాలేదు. అందుకే సోనియాగాంధీలో జగన్, కేవిపిల పట్ల క్రోధం పెరిగిపోయింది.

మరో సువర్ణముఖి ఏమిటంటే – ’సందట్లో సడేమియా’ స్ట్రాటజీ! ఇంతకు ముందు టపాలలో వివరించినట్లు, దాదాపు 350 ఏళ్ళకు పైగా, ఏడెనిమిది తరాలుగా, నకిలీ కణికులు క్రమంగా వృద్ది చెందుతూ, క్రమంగా మెరుగు పరుచుకుంటూ నిర్మించిన నెట్ వర్కే – ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు బ్రిటీష్, తర్వాత కేజిబి, తదుపరి సిఐఏ+ఐ.ఎస్.ఐ, ఇప్పుడు ముస్లిం తీవ్రవాదం గట్రాగట్రా పైముఖాల[over leaf reasons] చాటున ఏర్పడిన నకిలీ కణిక వ్యవస్థ. దాన్నే నకిలీ కణికుల గూఢచార వలయంగా గతటపాలలో పరిచయం చేశాను. ఒకో ’ఎరా’లో ఒకో పైముఖం [కేజిబి, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ. గట్రా] వేసుకుని ‘సందట్లో సడేమియా’ గా అనువంశిక నకిలీ కణికులు తయారు చేసుకున్నదే నకిలీ కణిక వ్యవస్థ! అయితే దీన్ని సిద్దించుకోవటానికి అనువంశిక నకిలీ కణికులకి ఏడెనిమిది తరాలు, మూడున్నర శతాబ్ధాలూ పట్టింది. ఈ క్రమాన్ని గతంలో ప్రచురించిన టపాల మాలికలో వివరించాను.

ఇక్కడో ఆసక్తికరమైన ఉదాహరణ చెబుతాను. ఇటీవల వచ్చిన ’ప్రయాణం’ సినిమా కొందరైనా చూసి ఉంటారు. అది కేవలం వినోదార్ధం తీసిన సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోం. కానీ అందులోనూ ఒక ఆసక్తికరమైన స్ట్రాటజీ ఉంది. మామూలుగా మూడేళ్ళో, కనీసం ఆరునెల్లో నడిచే ఓ ప్రేమకథని, [హీరో, హీరోయిన్ ని impress చేసి ప్రేమకు అంగీకరింప చేసుకోవటం]విమానం ఆలస్యమైన మూడుగంటల వ్యవధిలో పూర్తి చేయాలి. అందుకోసం హీరో, అతడి స్నేహితుడు ఓ ప్రేమకథలోని అంకాలని విభజించి, Time bound తో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. చివరికి విజయం సాధిస్తారు. సరిగ్గా ఇదే స్ట్రాటజీని నెం.5 వర్గం, నెం.10 వర్గానికి Apply చేసింది. ఇప్పుడు క్రింది విషయాన్ని పరిశీలించండి.

నెం.5 వర్గం, నెం.10 వర్గానికీ అందులోని కీలక వ్యక్తి రామోజీరావు కీ ’సందట్లో సడేమియా’ అన్న స్ట్రాటజీ, తమకే అనువర్తింపబడితే ఎలా ఉంటుందో ఈ నాలుగున్నరేళ్ళలోనే వై.యస్. రూపేణా చూపించింది. ఎదుటి వాళ్ళు నమ్మితే అదెంత సులభమో చూపించింది. ఆపాటి స్ట్రాటజీ చేయడానికి ఓ పెద్ద మేధస్సేమీ అక్కర్లేదని చూపించింది. గతంలో తనకు ఎదురు తిరిగిన వాణ్ణి ముఠాకక్షల పేరిట, ఫ్యాక్షనిజం పేరిట ప్రాణాలు తీసేయటమే తప్ప బుర్ర ఉపయోగించటం తెలీని ఓ ఛోటా రాజకీయనాయకుడు వై.ఎస్. తము ’సీన్’ ఇస్తే బలపడిన వాడు. తీరా తాము నమ్మితే, తమకి తెలియకుండా తమ గూఢచర్యపు దారిలోంచే ’సందట్లో సడేమియా’ నడిపాడు. ఇది ఇతరులకి తము Apply చేసిన స్ట్రాటజీ. అప్పడది తమ తెలివితేటలుగా, తమ గూఢచర్య జ్ఞానంగా కనబడింది. అదే ఇప్పుడు తిరిగి తమకి Apply చేయబడితే? చేసిన ’కర్మ’ అనుభవించటం ఎలా ఉంటుందో తెలియచేసింది. అందునా తాము తరాల కొద్దీ, శతాబ్ధాల కొద్దీ అందుకు కృషి చేస్తే, అది అత్యల్ప సమయంలో తమకి Apply చేయబడటం, చాలా సులభంగా తాము ఆ గోతిలో పడటం! దాంతో మెదళ్ళతో యుద్ధం ఎలా ఉంటుందో కూడా అర్ధం అవుతోంది.

నిజానికి సెప్టెంబరు 2 వతేదీ మొదలు కొని ఇప్పటివరకూ జరిగిన అనేక సంఘటనలకి, వివిధ నేపధ్యాలున్నాయి. కాబట్టి ముందుగా వై.యస్. నడిపిన ’సందట్లో సడేమియా’ ను నిరూపించే తర్కాన్ని, సంఘటనలని ముందుగా వివరిస్తాను.

1]. సెప్టెంబరు 2 వతేదీ ఉదయం 9.35[?] కల్లా, వై.యస్. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో సంబంధాలు లేవని ATC అధికారులు తెలియజేసారు. అయినా 12 గంటల తర్వాత గానీ అధికారికంగా గాలింపు చర్యలకు ఇతర హెలికాప్టర్లు బయలు దేరలేదు. మరి 11 గంటల సమయంలో నల్లకాల్వ వద్ద పశువుల కాపర్లు చూసిన హెలికాప్టర్ ఎవరిది?

2]. 12 గంటల తర్వాత దాదాపు 7 హెలికాప్టర్లు బయలుదేరి ప్రతికూల వాతావరణ పరిస్థితుల రీత్యా వెనుదిరిగి వచ్చాయి. 11+ హెలికాప్టర్లు, 5000 మంది పైన సిబ్బందీ, పడి వెదికినా, సుఖోయ్ విమానాలు, ఇస్రో విమానము, అమెరికా సాయం కోరడం…. ఇంత హడావుడి జరిగినా, జాడ కనుక్కోవడం అన్న ’పని’ మాత్రం సాధ్యపడలేదు. అయితే అంతర్జాతీయంగా ఇది చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఇంతగా అభివృద్ది చెందిన సాంకేతికత, బలమైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సుశిక్షితులైన సైన్య సిబ్బంది ఉండీ, ఎంతగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, జాడ తెలియకుండా పోయిన ఒక హెలికాప్టర్ ఉనికిని కనిపెట్టలేకపోయారు. ఈ లెక్కన ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అదనుగా తీసుకుని, ఏ పొరుగుదేశాలో భారతదేశమ్మీదికి దురాక్రమణకి దిగితే ఈ ప్రభుత్వాలు ఇంతే అసమర్ధంగా పనిచేస్తాయా? పోనీ అంతగా అసమర్ధ ప్రభుత్వమే అనుకుందాం, మరి సోనియా, చిదంబరంలకు హెలికాప్టర్ కూలినరోజే జాడ తెలిసిందేమో ననీ అనుమానాలు ఎలా వెల్లడి అయినట్లు? [సెప్టెంబరు 4, ఈనాడు 12 పేజీ]

3]. బుధవారం, సెప్టెంబరు 2వ తేదీ హెలికాప్టర్ మిస్సయ్యింది. రాత్రంతా సోనియా గంటగంటకూ సమాచారం తెలుసుకుంటూనే ఉంది. గురువారం హైదరాబాద్ కు సోనియా రావచ్చుననీ రోశయ్య తెలిపిన వార్త గురువారమే పత్రికల్లో వచ్చింది. [అంటే వై.యస్. తప్పిపోయినరోజే (బుధవారమే) ఆ వార్త పత్రికా ఆఫీసుకు చేరాలి]. క్షేమంగా వస్తాడని ఆశిస్తున్నప్పుడు గురువారం హైదరాబాద్ రావాల్సిన పనేముంది? క్షేమంగా వచ్చిన వై.యస్.ని ఫోన్ లో క్షేమ సమాచారాలు అడగవచ్చు లేదా వై.యస్. తర్వాత ఎటూ ఢిల్లీ వస్తాడు. ఇక గురువారం, సెప్టెంబరు 3, ఉదయం మృతుల్ని కనుగొన్నారు. హైదరాబాద్ కు తరలించారు. శుక్రవారం సెప్టెంబరు 4, ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, వై.యస్. మృతికి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. ’దార్శనికుడు’, ’మార్గదర్శి’ అన్న పదప్రయోగాలతో మరీ సంతాప సందేశం వ్రాసారు ఏఐసిసి అధినేత్రి , ఆమె కుమారుడు.

4]. అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 3 వ తేదీ సాయంత్రం, విలేఖరుల సమావేశంలో వై.యస్. మృతి గురించి మాట్లాడుతూ, గద్గత స్వరంతో కన్నీటి పర్యంతమైంది. అంతగా తమ పార్టీ సహచరుడి మరణానికి కదిలిపోయిన నాయకురాలు వారం తిరక్కుండానే సదరు ’పార్టీ సహచరుడి’ కుమారుణ్ణి ఎత్తికొట్టేసిందేం? ఎంతగా తమను బెదిరించ ప్రయత్నిస్తున్నడన్నా, ఎంతగా అహం దెబ్బతిన్నది అనుకున్నా…. 60 ఏళ్ళు దాటిన తనకు 40 ఏళ్ళు నిండని ’జగన్’ అనే ఈ కుర్రవాడు, తన కుమారుడు రాహుల్ గాంధీ వంటివాడే కదా! తండ్రిపోయిన ఆశనిపాతం, దిగ్ర్భాంతిలతో ఏర్పడ్ద భద్రతా రాహిత్యమూ, భవిష్యత్తు పట్ల భయములతో ఉండి ఉండచ్చు అన్న సానుభూతితోనూ, Concern తోనూ డీల్ చెయ్యాలిగా? కనీసం పిలిచి కౌన్సిల్ చేయాలిగా? బదులుగా పరామర్శించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేనెపంతో అయినా, కలవడానికి అపాయింట్ మెంట్ అడిగితే, నిరాకరణ ఎదురైందన్న వార్తలు ఎందుకు వచ్చాయి?

5]. వై.యస్. జగన్ అయినా, కేవిపి అయినా, ఏదన్ను చూసుకుని, లేదా ఏ కారణంతో అధిష్టానాన్ని ఎదిరిస్తున్నారు? వై.యస్. కైనా అధిష్టానం ఇస్తేనే సీన్ నడిచింది! ఈ స్పృహ కాంగ్రెస్ లో, ఈ రోజు రాజకీయాలలో చేరిన కొత్తముఖానికైనా తెలుసుకదా! అంత వ్యవహార జ్ఞానం లేని వాళ్ళా జగన్ అయినా, కేవిపి అయినా? ‘మహారాష్ట్రలో ఎన్.సి.పి. స్థాపించిన శరద్ పవార్ కి కెరియర్ నడిచింది కదా’ అన్న పోలిక తెస్తున్నారు కొందరు. నిజమే. అయితే పవార్ సోనియాగాంధీ నాయకత్వాన్ని, ఆమె విదేశీయతని ప్రశ్నించి, పార్టీ చీల్చుకుపోయి కొత్తపార్టీ పెట్టుకున్ననాడు, ఈ ఇటలీ మహిళ సోనియాగాంధీ అప్పుడే రాజకీయాల్లో కెరీర్ ప్రారంభించింది. పవార్ కి దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉంది. అన్నింటి కన్నా ఆర్ధిక రాజధాని ముంబై కార్పోరేట్ కంపెనీలతో, బాలివుడ్ సినిమా పరిశ్రమతో సంబంధాలు బాగా ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేంద్రంలో మంత్రిగా, రక్షణ శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించాడు. ఒకానొక ’ఎరా’లో కేంద్రంలో అతడికి నెం.2 స్థానం అని కూడా అన్నారు. అంత సీనియారిటీ ఉన్నవాడు. అట్లయ్యీ, సోనియాగాంధీ బలమెంతో అర్ధమై, చచ్చినట్లూ పొత్తుపెట్టుకున్నాడు. మరి జగన్, KVP ల కైతే అంత అనుభవమూ లేదు, సీనియారిటీ అంతకన్నా లేదు కదా? అధిష్టానాన్ని ఎదిరించి నిలబడగలమని ఎలా అనుకున్నట్లు? మరి ఎందుకు ప్రచ్చన్న వైషమ్యం, బలప్రదర్శన వంటి దారిలోకి మళ్ళినట్లు?

6]. 1991 లో, రాజీవ్ గాంధీ మానవబాంబు దాడిలో ఆకస్మిక మరణం పొందినప్పుడు కూడా, బహిరంగంగా కంటనీరు పెట్టలేదు రాజీవ్ గాంధీ భార్యయైన ఈ సోనియాగాంధీ. అప్పుడు వార్తాపత్రికలు వ్రాసిన విశేషణాలు….. గంపెడు దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పట్టిన ధీరవనిత. పిల్లల కోసం, దుఃఖాన్ని దిగమ్రింగి, మౌనంగా రోదించిన మాతృమూర్తి. జీవిత సర్వస్వం పోగొట్టుకున్నా బయటికి కంటనీరు చిందించకుండా, కొండంత దుఃఖాన్ని మనస్సులోనే అదిమి పట్టిన మేరునగధీర…. ఇత్యాది విశేషణాలతో ఆ రోజున పత్రికలన్నీ కోరస్ గా ఈమెని శ్లాఘించాయి.

7]. అప్పుడే కాదు, అత్తగారు ఇందిరాగాంధీ పోయినప్పుడు కూడా, తొణకని ధైర్యంతో, భర్తకు అండగా నిలిచిందని అప్పట్లో పత్రికలు తగుమాత్రంగా కొనియాడాయి. అంతటి వీరధీర గంభీర మహిళ, ఈరోజు తమపార్టీ సహచరుడు పోయినందుకే, విచలిత అయిపోయి, బహిరంగంగా కంటతడిపెట్టి, డగ్గుత్తికతో విలేఖరుల ఎదుట మాట్లాడింది. ఎంతైనా కుటుంబసభ్యుల కంటే పార్టీ సహచరుడు ఎక్కువ కాడు కదా? సరే పోనీ, అప్పటి కంటే ఇప్పుడు వయస్సు, పరిణతి పెరిగి, అనుబంధాల విలువలు తెలిసాయి అనుకుంటే, తమ సహచరుడి కుమారుణ్ణి, అసలే తండ్రిని కోల్పోయి దిశానిర్దేశం పోగొట్టుకున్న వాణ్ణి ఆదరించాలి కదా? పిలిచి “యంగ్ మాన్! ఇలాక్కాదు. నీ అనుభవం తక్కువ. కాబట్టి ఇలా చేద్దాం. లేదంటే రాష్ట్రంలో ఏకంగా పార్టీ ఉనికే తన్నేస్తుంది. లేదూ ఇదిగో ఈ సమస్య వస్తుంది. నీ తండ్రికైనా మేం ఇస్తేనే కదా నడిచింది? అతడెప్పుడూ అధిష్టానానికి [అంటే సోనియాకీ] విధేయుడిగానే పేరు తెచ్చుకున్నాడు కదా? టిక్కెట్లు దగ్గరి నుండి అన్ని విషయాలు మాతో చర్చించి, మమ్మల్ని ఒప్పించే పొందాడు కదా? కాబట్టి కంగారు పడకు. అన్నిటికీ మేమున్నాము. నీ తండ్రి మాకు ఆప్తుడు. కాబట్టి నువ్వు మా బిడ్డ వంటి వాడివే. చెప్పుడు మాటలు వినకు” గట్రా గట్రా….. లతో కౌన్సిల్ కదా చేయాలి?

మరెందుకు ఇలా ఘర్షణాత్మక వైఖరి తెరమీదకి వచ్చింది? ఈ లెక్కన సోనియాగాంధీ, వై.యస్. మరణించినందుకు దుఃఖపడిందా? లేక ’కొంపమునిగింది, సరిగ్గా కీలక సమయంలో ఇతడు చచ్చిపోయాడు. ఇరుక్కుపోయామే’ అనుకుని, తమ క్లిష్టదశకు దుఃఖపడిందా?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

intaku black box loni marmam velladinchara? leda?

మీ వివరణ చాలా విశ్లేషణాత్మకంగా కొనసాగుతోంది. కొనసాగించండి.

బాగుంది మీ విశ్లేషణ. ఎంతోమంది దేశ నాయకుల అకాల మరణాలు, హత్యల వెనకనున్న కారణాలు ఇంతకూబయటపడలేదు. సి.ఐ.ఏ.వాళ్ళు అనేక హత్య్ల వెనక వున్నారని అందరరికీ తెలిసిnాప్రశ్నించలేకపోయారరు. ప్రశ్నింiనన ా్ళ్ళమiలaలలలల దు.ుు వై.ఎస్. మరణం వెనుక ఎన్ని రహస్యlలు దా్గునాయో. ఏ ఏ వ్యాపార రాజకీయ అవసరాలు దాగి్వున్నాయో ఎ్ప్పటికైనaాబయటపడేనా?

దసరా పండుగ శుభాకాంక్షలు !!

నరసింహగారు, కుమార్ గారు, మంచుపల్లకీ గారు,

అందరికీ దసరా శుభాకాంక్షలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu