ప్రారంభంలో శివాజీ దగ్గర సైన్యం లేదు సంకల్పం తప్ప. శివాజీ వ్యక్తిత్వం విప్పారే కొద్దీ, ఆయనలోని సంకల్పబలం, ఇదే ఆలోచన సరళి గల మరికొందరిని ఆయన వైపు ఆకర్షితమయ్యేలా చేసింది. క్రమంగా అలాంటి వ్యక్తులతో బలమైన దళం తయారయ్యింది. హిందూ ధర్మాల్ని, విలువల్ని తిరిగి నిలబెట్టటానికి, ముస్లిం సామ్రాజ్యానికి వ్యతిరేకంగా హిందూ సామ్రాజ్యం స్థాపించాలన్న సంకల్పం వారిలో వజ్ర సదృశ్యమైనది.
భగవద్గీత మనకి
శ్లోకాలు:
యదా యదాహి ధర్మస్య గ్లాని ర్భవతి భారత
అభ్యుత్ధాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్
భావం:
ఓ భారతీయుడా![అర్జునా!] ధర్మం క్రుంగి, ఆధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూంటాను.
***********
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే
భావం:
సజ్జన సంరక్షణకూ, దుర్జన శిక్షణకూ, ధర్మసంస్థాపనకూ ప్రతీయుగంలోనూ నేనవతరిస్తూనే ఉంటాను.
అంతేకాదు ’దైవం మానుష రూపేణా’ అంటారు పెద్దలు. అలా ధర్మసంస్థాపనార్ధం మరోసారి దైవం తనను తాను వ్యక్తుల సమిష్టిగా సృజించుకొన్నాడేమో అన్నట్లుగా శివాజీ జీవితం మన కళ్ళముందు అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. దీన్ని మరింతగా దర్శించాలంటే మనం కొన్ని సంఘటనల్ని గురించి చెప్పుకోవాలి.
క్రమంగా శివాజీ, ఆయన అనుచరులూ పౌరుషవంతులైన యువకుల్ని సమీకరించి, వారికి ఆయుధ ప్రయోగాల్లోనూ, యుద్ధవిద్యల్లోనూ శిక్షణ నిచ్చి సైనిక దళాలుగా తయారుచేసారు. జరుగుతున్న, జరిగిన యధార్ధాల్ని యువతరానికి వివరించి వారిని ఉత్తేజపరచారు. మొదట్లో వారు చిన్న చిన్న దుర్గాలని, కోటలని స్వాధీనం చేసుకొన్నారు. క్రమంగా సామ్రాజ్య స్థాపన చేశారు. ఇదంతా శివాజీ, ఆయన అనుచరులు ఒక్కరోజులోనో, ఒక్క సంవత్సరంలోనో సాధించలేదు. మనం సినిమాల్లో ఒక్క ’సోలో సాంగ్’ లో చూసినంత సులభంగానో, ఈనాటి రాజకీయాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ క్రీడల్లోనూ జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ ల్లాగానో సాధించలేదు.
సామ్రాజ్యస్థాపన వారు తమ స్వసుఖల కోసం చేయలేదు. హిందూ ధర్మాల్ని, సంస్కృతినీ పునఃస్థాపించటానికి చేశారు. అందుకోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు, విపరీతంగా శ్రమించారు, నిబద్దతతో కష్టించారు. తమ ప్రాణాల్ని, జీవితాన్ని ఫణంగా పెట్టారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాల్నీ తీసుకొని అమలు చేశారు. అందులో గెలుపుల్నీ, ఓటముల్నీ కూడా ఎదుర్కొన్నారు. ఓడినప్పుడల్లా లోపాలు సవరించుకొంటు శ్రమించారు. వారి పోరాటం నేటి మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్ క్రీడల్లాగా కృత్రిమ ఉత్కంఠపూరితం కాదు. కుత్తుకలు కోసుకుపోయే రుధిరమయం.
శ్రీశైలంలోని స్థానిక ’చెంచు’గిరిజనులు చెప్పగా విన్న విషయం ఒకటి ఇక్కడ ఉటంకిస్తున్నాను.
పోరాట ప్రారంభ దినాల్లో ఒకసారి శివాజీ తీవ్రనిరాశకీ, నిస్పృహకీ గురయ్యాడట. దానితో శ్రీశైలం వచ్చిన శివాజీ అక్కడ కొంతకాలం – ఆ అడవుల్లో మల్లయ్య స్వామి గుడిలో గడిపాడట. [స్థానికులు శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని ’మల్లయ్య సామీ’ అంటారు.] ఆధ్యాత్మిక చింతనతోనూ, ధ్యానంతోనూ గడిపాడట. దాదాపు తపస్సు చేసాడన్నమాట. ఆ సమయంలోనే ఆయనకి భవానీ మాత[భ్రమరాంబ దేవి]ఖడ్గ ప్రదానం చేసిన స్ఫూర్తిని పొందాడట. ఆ తర్వాత ఇక్కడ నుండి మహారాష్ట్ర చేరిన శివాజీ దిగ్విజయ బాటలో నడిచి సామ్రాజ్యస్థాపన చేశాడు. శ్రీశైలంలో ఆలయానికీ గోపురం కట్టించాడు. ఈ నాటికీ ఆ గోపురాన్ని శివాజీ గోపురమనే పిలుస్తారు. శివాజీ శ్రీశైలంలో తపస్సు చేసిన రోజుల్లో అక్కడి చెంచుప్రజలు ఆయనకి ఆవుపాలూ, ఆహారం సమకూర్చారట. అందుకనే శ్రీశైలంలో అయ్యవారి పల్లకి సేవలోనూ, ప్రత్యేక పూజల్లోనూ చెంచులకి ప్రత్యేక విధులు నిర్వహించే సాంప్రదాయం శివాజీ ఆఙ్ఞతో ప్రారంభమయి ఇప్పటికీ కొనసాగుతుందని అక్కడి చెంచులు అంటారు. ఏదేమైనా శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ జీవిత సచిత్రమాలిక చూస్తే ఎవరికైనా స్ఫూర్తి కలగటం మాత్రం నిశ్చయం.
ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.
ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు. శివాజీ ఆ ప్రమాదాన్ని[రిస్క్ ని] ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!
ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు. అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.
ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.
ఔరంగజేబు పాలనా కాలం కంటే ప్రస్తుత సమాజం మరింత భ్రష్టస్థితిలో ఉంది. ఈనాడు ప్రతీ వ్యక్తి తనకు తానే ఓ శివాజీలా జీవించగలిగితే గానీ ఈ స్థితిలో మార్పులేదు. అంతేగాని ప్రతీవ్యక్తి తనకు తాను, తనకు వీలైన చోట ఔరంగజేబు అనుచరులా ప్రవర్తిస్తే మార్పుసంగతి దేముడెరుగు మరింత భయానక స్థితికి సమాజం దిగజారడం ఖాయం. జీవితంలో సుఖశాంతులు అవసరం. అయితే సత్యం, ధర్మం మరింత అవసరం. ’నిజం’ నుండి ఎంత దూరం జరిగితే ’శాంతి’ వాళ్ళకి అంత దూరమవ్వడం సత్యం. జీవితంలో కష్టాలని ఎదుర్కొనే ధైర్యాన్ని, నీతిని సత్యాన్ని ధర్మాన్నీ ఆచరించే స్ఫూర్తిని – శివాజీ వ్యక్తిత్వం మనకి ప్రసాదిస్తుంది.
ఔరంగజేబుది అప్పటికే తాతతండ్రుల నుండీ ఏర్పడి ఉన్న పటిష్టమైన వ్యవస్థ. దానితో పోరాడటానికి శివాజీ ’గెరిల్లా యుద్ధం’ అనే ప్రక్రియని ప్రవేశపెట్టాడు. ఔరంగజేబుది వారసత్వంగా సంక్రమించిన సామ్రాజ్యం. అతడికి అపారమైన అర్ధ అంగ బలాలున్నాయి. సైన్యం, సాధన సంపత్తి ఉన్నాయి. శివాజీ సంకల్పమూ, లక్ష్యమూ పెద్దవి. కానీ సైన్యం చాలా చిన్నది. అందుచేత శివాజీ ’గెరిల్లా యుద్ధాన్ని’ రూపొందిచాడు. ఈ పద్దతిలో శివాజీ సైనికులు శతృసైనికులు మీద హఠాత్తుగా, ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడి చేస్తారు. అప్పటి వరకూ రహస్యంగా అడవుల్లోనూ, కొండగుహల్లోనూ ఉంటారు.
కుట్రదారులు [అంటే నకిలీ కణిక సంబంధిత రామోజీరావు, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., ఇంకా వారి మద్ధతుదారులూ] ఇదే ’గెరిల్లా’ పద్దతిని నక్సల్స్, బోడోస్, మావోయిస్టుల, ఇప్పడు పాకిస్తాన్ తీవ్రవాదుల నెట్ వర్కులో ఉపయోగిస్తున్నారు. వారి విశిష్ట వాదన ఏమిటంటే – “శివాజీ ’గెరిల్లా’ యుద్ధం దేశభక్తి పూరితమైనవైతే మరి నక్సల్స్, మావోయిస్టు, బోడోల ’గెరిల్లా’ యుద్ధం ఎందుకు దేశభక్తి కాదు?” ఎంత గొప్ప వాదన? గెరిల్లా యుద్ధరీతిని పోలుస్తారే గానీ దాని వెనకున్న సంకల్పాలను పోల్చరు. శివాజీ ’ఇన్ ఫార్మర్లనో’ మరో అనుమానం తోనో, వంకతోనో సామాన్యప్రజలని చంపలేదు. శివాజీ లక్ష్యం అవినీతి, అనైతికత మూలాల మీద, అందుకు పట్టుగొమ్మలైన నాటి ముస్లిం రాజులు, రాజ మద్దతుదారులు, కౄర రాజోద్యోగుల మీద, వారి పరిపాలనా యంత్రాంగం మీదే.
అదే నక్సల్స్ లేదా తీవ్రవాదులు ప్రైవేట్ వ్వాపార సంస్థల నుండీ, అవినీతి అధికారుల నుండీ దందా వసూలు చేస్తున్నారు. సామాన్యుణ్ణి, అమాయక గిరిజనులనీ పోలీస్ ఇన్ ఫార్మర్లంటూ చంపుతున్నారు. పోలీసు కానిస్టెబుళ్ళనీ, అందులో పేద ధనిక తారతమ్యలు లేకుండా చంపుతున్నారు. బడా పారిశ్రామిక వేత్తలు, కార్పోరేట్ కింగ్ లూ ఎంతగా ప్రజా దోపిడి చేస్తున్న వారి జోలికి వెళ్ళరు. టాటాలూ, అంబానీల జోలికో వెళ్ళరు. ఎందుకంటే వారి మామూళ్ళు వారికి ముడతున్నాయి కావచ్చు లేదా వ్యవస్తీకృతంగా నడుపుతున్న తీవ్రవాదం తమ వారైన కార్పోరేట్ల కు ఇస్తోన్న ’రక్షణ’కావచ్చు.
ఇంకో విచిత్రం ఏమిటంటే మానవహక్కుల సంఘాలన్నీ నక్సల్స్, మావోయిస్టులు పోలీసు ఇన్ ఫార్మర్లంటూ గ్రామీణుల్ని, గిరిజనుల్నీ చంపినప్పుడూ, లేదా పోలీసుల్ని చంపినప్పుడు కిమ్మనరు. అదే పోలీసులు నక్సల్స్ నీ, తీవ్రవాదుల్నీ, చంపినప్పుడు మాత్రం మరుక్షణమే గద్దర్ లూ, వరవరరావులూ, కళ్యాణరావులూ, ఇంకా అలాంటి వారూ, మానవహక్కుల సంఘాలా వారూ – ప్రింటు మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సింహ గర్జనలు చేస్తారు. మానవహక్కుల్ని ప్రభుత్వం కాలరాచిందని, రాచి రంపాన పెడుతుందనీ ఎలుగెత్తి అరుస్తారు. వారి దృష్టిలో తీవ్రవాదూలూ, నేరస్తులూ మాత్రమే మానవులేమో మరి. నిజానికి పోలీసులు నక్సల్స్ ని చంపినా, నక్సల్స్ పోలీసుల్ని చంపినా రెండూ హింసాత్మకమే; రెండూ జరగకూడని సంఘటనలే. ఈ మానవహక్కుల సంఘాలు రెండు రకాల సంఘటనలకీ ప్రతిస్పందించాలి. కానీ స్పందించరు. అక్కడే కుట్ర నెట్ వర్కు కనబడటం లేదూ? అదే, అడవుల్లో మావోయిస్ట్ నేతని పోలీసు బలగాలు చుట్టిముట్టాయన్న వార్త పొక్కగానే మాత్రం కళ్యాణ రావులు పరుగు పరుగున హోంమంత్రి దగ్గరికి పోయి లాబీయింగ్ మొదలుపెట్తారు.
ఇందులో మరో ఘోర కృత్యం ఏమిటంటే – ఈ నక్సల్స్, మావోయిస్టులూ ’గెరిల్లా యుద్ధం’ ఎందుకు చేస్తారంటే – ప్రజల సొమ్ముతో కట్టిన బ్రిడ్జిలనీ, రోడ్లనీ, ప్రాజెక్ట్ లనీ పేల్చిడానికీ, బస్సులూ, రైళ్ళూ తగలెయ్యడానికి చేస్తారు. ఆ విధంగా వారు ప్రజల కోసం పోరాడినట్లు ఎలా గవుతుందో వారికీ, వారిని ఆర్గనైజ్ చేస్తున్న కుట్రదారులకీ తెలియాలి. ఇలాగ తుపాకీ గొట్టాలతో విప్లవాన్ని ఎలా తెస్తారో, ఎలా ప్రజలకి మేలు చేస్తారో? ఇందులోని మర్మం, మోసం మరింతగా తెలియాలంటే మనం నిశ్చయంగా మాజీ నక్సల్స్, మాజీ మావోయిస్టుల్నీ, ప్రభుత్వానికి లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలిసి పోయామంటూ వసతులూ, ఇన్ సెంటివ్స్ పుచ్చుకొని సమాజంలో స్థిరపడిన ఆయా ’మాజీ’ల జీవన సరళినీ పరిశీలించాల్సి ఉంది. వారిలో చాలామంది ’దందా’ చేస్తూ, వ్యాపార మాఫియాలూ, లాండ్ మాఫియాలూ నిర్వహిస్తూ, తగదాల్లో రెండుపార్టీల నుండీ కమిషన్లు దండుకొని సెటిల్ మెంట్లు చేస్తూ, చిన్న రాయుడిలా, పెద్దరాయుడిలా లేదా పొట్టిరాయుడిలా దర్జాగా బ్రతికేస్తూ, భట్టిప్రోలు పంచాయితీలు తీర్చడం చూస్తున్నాం, వింటున్నాం. నిన్నటి నక్సల్స్, నిన్నటి మావోయిస్టులూ అయిన నేటి మాజీల అవినీతినీ, దందాని చూసి కూడా నక్సల్స్, మావోయిస్టులూ దేశభక్తులనీ, ప్రజా ప్రేమికులనీ, పేదల బాధల పట్లా, వెతల పట్లా సానుభూతి గలవారనీ, వారి కోసం పాటు పడేవారనీ ఎలా నమ్మగలం?
ఈ సోకాల్డ్ దేశభక్త తీవ్రవాదులు, నక్సల్స్, మావోయిస్టులూ, ధనికుల్ని[వ్యాపార, ప్రభుత్యోద్యోగ, రాజకీయ నాయకులు అన్న తేడాపాడాలు లేకుండా] బెదిరించి డబ్బు గుంజుతారని విన్నాం, చదివాం, చూశాం. అడవుల్లో డబ్బు, ఆయుధాల డంపులు దొరకడమూ వార్తలుగా వింటున్నాం. అంతటి డబ్బుతో వారు ప్రజలకి, పేదలకి ఏమేలు చేశారో, చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కొన్నేళ్ళ క్రితం సమ్మయ్య విదేశీ ఎయిర్ పోర్టులో, బాంబు ఉందన్న పుకారు పుట్టించిన తొక్కిడిలో నలిగి చచ్చిపోయి వార్తల్లోకి ఎక్కినప్పుడు నక్సల్స్, మావోయిస్టులు విదేశీ విహారాలకి వెళ్తూంటారని తొలిసారి బయటికి పొక్కింది. ఇప్పుడది సర్వసాధారణ విషయం. విదేశీవిహారాలకీ, అయిదు నక్షత్రాల హోటళ్ళలో విశ్రాంతులకీ, మారు పేర్లతో మారు రూపాలతో వెళ్ళగలరనీ, పాస్ పోర్టు గట్రా తతంగం వారికి చాలా సులభ సాధ్యమనీ ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే. ఈ నక్సల్స్, మావోయిస్టులకీ సమాజంలోని బడా వ్యక్తులు కొందరికీ[బ్యూరోక్రాట్లు కీ, రాజకీయ నాయకులకీ] సంబంధాలుండటమూ వింటున్నాము. నక్సల్స్, మావోయిస్టులకీ, బోడోలకీ, ఎల్.టి.టి.ఇ. లకీ, పాకిస్తాన్ తీవ్రవాదులకీ సంబంధాలను మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ తెలియటం లేదా అన్ని గ్రూపులు ఒకే సంస్థ క్రింద పనిచేస్తున్నాయని? ఎవరు ఏ పేరుతో హింసోన్మాదం చేసినా, కారణం ఏదైనా గాని ఇండియాకి ఆర్ధికంగా, సామాజికంగా నష్టమూ, కీడే జరుపుతున్నాయి. దీన్నీ కుట్ర అనక దేశాభివృద్ధి అనాలా? స్వేచ్ఛవాదం అనాలా? ఇదా చెడుని వ్యతిరేకిస్తూ చేసే ’గెరిల్లా’ యుద్ధం?
ఈ విధంగా కుట్రదారులు [అంటే నకిలీ కణిక సంబంధిత రామోజీ రావు, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.. ఇంకా వారి మద్ధతు దారులూ] చరిత్రలోని, పురాణాల్లోని, సంస్కృతిలోని ప్రతీ విషయాన్ని ఎగతాళి చేయటం, ప్రతి దానిలో నుండీ Disadvantage ని మాత్రమే బయటికి తీయటమే కుట్ర స్వరూపం. ఇందుకు మరో నిదర్శనం స్వాతంత్ర సమరపు రోజుల్లో హిందువుల్ని ఉత్తేజపరచటానికి తిలక్ మహాశయుడు మొదలు పెట్టిన గణపతి నవరాత్రి ఉత్సవాలు నేడు పర్యావరణ ప్రమాదకరంగానూ, మత ఘర్షణలకు పైకారణం గానూ మారడం!
నా ప్రధాన లక్ష్యం కుట్రని విశదీకరించటమే గనుక ఈ కోణాల్ని ఇక్కడ చర్చించాను. ఇది ఇక్కడికి ఆపి తిరిగి శివాజీ దగ్గరికి వద్దాం.
తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు
అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినోభవంతు!
**************
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
hmm...
Very well written post. You have exposed the anti-national forces.
sir chala bagundhi
అరుణ గారు, psedosecular గారు: నెనర్లండి.
ప్రదీప్ రెడ్డి గారు: టపా నచ్చినందుకు నెనర్లు. సర్ కాదండి. మేడమ్ ని!:)
Post a Comment