ముందుగా వేమన యోగి మనకనుగ్రహించిన ఓ పద్యాన్ని వ్రాసి, దాని అనువర్తనతో ఈ అమ్మకింత బలం, ఇంత శక్తీ ఎలా వచ్చాయో వివరించే ప్రయత్నం చేస్తాను.


నీటిలోని మొసలి నిగిడి యేనుగు బట్టు

బైట కుక్క చేత భంగపడును

స్థాన బలిమి కాని తన బలిమి కాదయా

విశ్వదాభి రామ వినుర వేమ.


మొసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగు నైనా పట్టగలదు. బయటి కొస్తే కుక్కల చేత చీల్చబడుతుంది. మొసలి బలం నీటిలోనే. అలాగే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ. కుర్చీ వ్యక్తి, నాయకురాలు నాగమ్మకి బలం గూఢచారతంత్రంలో ఉంది. లేదా ఈ మొసలికి నీరు గూఢచర్యవలయమే [అంటే స్పయింగ్ నెట్ వర్క్ అన్నమాట].


ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలంటే ఓ నాలుగు దశాబ్ధాలు వెనక్కి చరిత్రలోకి వెళ్ళాల్సిందే.


1968లోనో 69 లోనో ఈ నాగమ్మ నవవధువుగా ఆనాటి ప్రధాని ఇందిరా గాంధి ఇంట అడుగుపెట్టింది. ‘Camel In Desert’ కథలోలాగా నేటికి అన్నీ తానే అయ్యింది. ఆనాడెంతో ఒద్దికగా, అచ్చమైన గృహిణిగా అత్తగారినీ, ఇతరుల్నీ నమ్మించడానికి ఆవిడ స్కూల్ ఫైనల్ దాటని చదువు సరిపోయింది.


7 సంవత్సరాలు చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా కాళ్ళూనుకుంది. ఆ స్థానంలో ప్రతిష్ఠింపబడటానికి ఆ పాటి సహనం, జాగ్రత్త తప్పనిసరి. కావాల్సిన చోట, కావాల్సిన ఏజంట్ సరిగా కాళ్ళూనుకోవటం గూఢచార వలయానికి చాలా అవసరం. ఆ పునాది గట్టిగా పడేందుకు వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొంటారు. కాబట్టే నిఘా సంస్థల్ని సైతం ఏమార్చగలిగారు. ఈ బలం 1975 లో రామోజీ రావు ఈనాడుగా ప్రతిఫలించింది.


ఆ పిదప రెండేళ్ళకే ఇందిరా గాంధి విదేశీ హస్తాన్ని గుర్తించింది. ఆ విదేశీ హస్తం భారత దేశం మీద కుట్రచేస్తోందని ఆవిడ ప్రకటిస్తే ఈనాడు పత్రిక దాని మీద పచ్చిజోకులు వేసింది. [ఇంతకు ముందు టపాల్లో చెప్పినట్లుగా]. పిల్లాణ్ణి చంకలో పెట్టుకొని ఓ తల్లి ఊరంతా వెదికిందన్నట్లు విదేశీ కోడల్ని కొంపలో పెట్టుకొని కుట్రలు చేస్తోన్న విదేశీ హస్తన్ని ఆవిడ దేశమంతా వెదికింది.[జన్మని బట్టి, కులాన్ని లేదా మతాన్ని లేదా జాతీయతని బట్టి మనిషిని లెక్కగట్టకోడదన్న సంస్కారం మనల్ని [ఇందిరా గాంధీతో సహా] ఈ నాగమ్మని నమ్మేలా చేసింది. ఆ సంస్కారాన్ని, మంచితనాన్ని ఎక్స్ ప్లాయిట్ చేయడమే పునాదిగా, నమ్మక ద్రోహమే స్తంభాలుగా కుట్ర నడిచింది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఇందిరా గాంధీ బాల్యంలో ఉండగా బాపూజీ స్వాతంత్ర సమరంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమం చేపట్టారు. అప్పుడు ఇందిరా గాంధీ తనకెంతో ప్రియమైన విదేశీ బొమ్మని మంటల్లో వేసింది. కుట్రదారులు [నకిలీ కణికుడు, అతడి వంశీయులు] మానసిక ప్రకోపం లేదా పర్వెర్షన్ ఎలాంటి వంటే విదేశీ బొమ్మని బాల్యంలోనే త్వజించిన ఇందిరా గాంధీ నెత్తిన విదేశీ కోడల్ని రుద్దేటంత! అలాంటిదే ఆనాటి కాంగ్రెసు విదేశీ పాలకుల్ని తరిమి కొడితే ఈనాటి కాంగ్రెసు ఈ విదేశీ నాయకురాలికి, విదేశీ సంస్థలకి పాదాలు వత్తేటట్లు చేయటం కూడా.]


కోడలు కొంపలో అడుగుపెట్టిన పదేళ్ళు కూడా తిరక్కుండానే ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించేంత విషవలయంలోకి నెట్టబడింది. ఎందుకంటే లోపలి నుండి ప్రధాన మంత్రి మోటివ్స్కనుక్కొని బయటికి చేరేసే ఏజంట్లోపల ఇన్ స్టాల్’ [ప్రతిష్ఠాపన] అయ్యింది గనుక.


కాబట్టే చాలా త్వరగా తన స్వంత మంత్రివర్గ అనుచరుల్లో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్ధం కానంత గందర గోళం లోకి ఇందిరా గాంధీ నెట్టబడింది. అందుకే ఎవర్నీ నమ్మదుఅన్న అపఖ్యాతి మూట గట్టుకొంది. ఈ రోజు ఫలానా వారిని నమ్మచ్చు అన్న విశ్లేషణ ఇంట్లో నడిస్తే మర్నాటి నుంచి ఆ ఫలానా వారుమరింత అనుమానాస్పదుడిగా కనబడేట్లు చేయటం గూఢచార వలయానికి అసాధ్యం కాదు. ఎటోచ్చీ ఆ ఫలానా ఎవరో తెలియడమే ప్రధానం.


[‘కుక్కని కొడితే డబ్బులు రాలతాయి. ఏ కుక్కో తెలియాలి అంతే అన్న సినిమా జోక్ లాగా అన్నమాట] లోపలి నుండి ఆ ఫలానాలుఎవరో బయటికి చేరేసే వ్యవస్థా, వ్యక్తీ ఉంటే .... పని చాలా తేలికగా అయిపోతుంది. దెబ్బకి ఇందిరాగాంధీ ఆ ఉచ్చులోనూ పడింది. ఎమర్జన్సీ తెచ్చి చిక్కుల్లోనూ పడింది.


పర్యవసానంగా 1977 లో చేతులకి సంకెళ్ళు వేయించుకొని జైలుకు తీసికెళ్ళబడింది. చివరకి ఇల్లు నడిపేందుకు 50 వేల రూపాయల అప్పుకోసం ప్రయత్నించవలసిన దారుణస్థితిలో పడింది. అలాంటి కష్ట సమయంలో ఈ నాగమ్మ, ఇందిరా గాంధికి కోడలు కాదు, కూతురన్నంతగా మానసికంగా దగ్గరయ్యింది. [అప్పుడు మోటివ్స్ కనుక్కోవడం మరింత తేలిక] ఓ వ్యక్తికి కష్టం తామే కలిగించి, ఆ నేపధ్యంలో ఓ ఏజంట్ ని మానసికంగా దగ్గరచేసి, ఆ ఏజంట్ మీద ఆధార పడేటట్లు చేయటం గూఢచర్య తంత్రంలో ఓ భాగం.[ఇది మనం మాంగల్య బలం లాంటి పాత నాగేశ్వర్రావ్, సావిత్రిల సినిమాల్లో బొచ్చెడు సార్లు చూసినా మన నిజ జీవితంలో జరిగాక గానీ గుర్తించలేనంత నిత్యనూతన వ్యూహం.]


ఈ దెబ్బకి ఎమర్జన్సీ అనంతర కాలంలో ఇందిరా గాంధీ కి తల్లోనాలుక అయ్యింది ఈ విదేశీ కోడలు. ఆ అదనులో 1980 లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు. ఎప్పుడు ఫ్లయింగ్ క్లబ్ కి వెళతారో, ఎలా ప్రమాదాన్ని సృష్టంచాలో అన్నీ పక్కాగా పకడ్బందీగా వ్యూహ రచన చేసి అమలు చేయబడ్డాయి.


ఇదంతా జరుగుతుంటే భారత నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయట?’… అంటారేమో.


"ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తప్పకుండా గెలుస్తాం మేడమ్ అన్న నివేదికతో 1977 ఎలక్షన్లకు ఇందిరాగాంధీని వంచించినందుకు వచ్చిన రూపాయలు కట్టల్ని లెక్క పెట్టుకొనే పనిలో తీరిక లేక ఉండి ఉండచ్చు. ఈ విషయం నాకు 2006 లో నేను IB Office కి రామోజీ రావు మీద 1992 లో ఇచ్చిన ఫిర్యాదు, దాని పర్యవసానాల పై వివరాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడి అధికారులు తామే సాక్షాత్తు రామోజీ రావు డిఫెన్సు లాయర్లు అన్నట్లుగా నాతో వాదిస్తూ రామోజీ రావంటే ఏమనుకున్నారు? అతడు పర్ ఫెక్ట్ బిజినెస్ మాన్ అంటూ వాదించినప్పుడు ఓహో! ఇలాక్కుడా నిఘా సంస్థలు పని చేస్తాయన్నమాట. 1992 లో నా ఫ్యాక్టరీకి వచ్చిన IB అధికారులు కృష్ణారావు, కిషోర్ కుమార్ లే కాదు ఇలాంటి IB అధికారులు కూడా ఉంటారన్నమాటఅని అర్ధమయ్యింది. ఇందులో తమాషా ఏమిటంటే ఆ తర్వాత వారం, పది రోజులకే మార్గదర్శి వివాదం [ఎం.పి. ఉండవల్లీ అరుణ్ కుమార్ ఆరోపణ] రోడ్డున పడింది.


సరే మనం మళ్ళీ మన విషయం దగ్గరకి వద్దాం.


మరిది మరణం తర్వాత తోడి కోడల్ని జయప్రదంగా ఇల్లు దాటి వేరుపడేలా చేసింది ఈ నాగమ్మ. ఆ తర్వాత ఎసరు అత్తగారికీ, తర్వాత భర్తగారికీ. ఇంకేముంది తేలిగ్గా దేశపు పగ్గాలు చేతికొచ్చాయి. ఈ నాగమ్మ చేతికి మట్టి అంటకుండా నకిలీ కణికుడి గూఢచార [నెట్ వర్క్] వలయం ఎంచక్కా సంజయ్, ఇందిరా, రాజీవ్ ల హత్యలు నిర్వహించి ఈవిడకి మార్గం సుగమం చేశారు. ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన మానేకా గాంధీ, ఆవిడ కొడుకు వరుణ్ గాంధీ అసలు ఇందిరాగాంధీ కోడలూ, మనవడూ కాకుండా పోయారు.


కుటుంబం పట్ల ఈ నాగమ్మకి నిబద్దతా, బాధ్యతా లేదనడానికి ఆవిడ తన కుమారుణ్ణి పెంచిన తీరే నిదర్శనం. ఎలాంటి కుటుంబం నుండి వచ్చారు, ఎవ్వరి వారసత్వం పొందారు?’ అన్న స్పృహ కూడా లేకుండా ఇవాళ్ళా రేపూ, తాగితే తప్పే లేదుఅనగలిగేట్లు కొడుకుని పెంచిన ఈ తల్లి నిజంగా గ్రేట్. తాగడం అన్నది అతని పర్సనల్ అవ్వవచ్చు. అతను ఉన్న స్థానం, అతని ప్రవర్తన సమాజంలోకి ఏ సిగ్నల్స్ పంపుతాయన్న స్పృహ లేకుండా ఉండడం తప్పు. అందునా మద్యపాన నిషేధం చెప్పిన గాంధీ, గాంధీ పేరు చెప్పుకొని నడుపుతున్న కాంగ్రెసు పార్టి వారసులు ఇలా బహిరంగ ప్రకటనలు ఇవ్వడం చాలా తప్పు.



సరే మనం మళ్ళీ మన విషయం దగ్గరకి వద్దాం. ఈ నేపధ్యంలో మరో రెండేళ్ళు గడిచేసరికి రామోజీ రావు సినిమా దేవుడు యన్. టి. రామారావుని రాజకీయాల్లోకి తెచ్చి 9 నెలల్లో అధికారంలోకే తెచ్చాడు. [ఇందులోని అసాధారాణాన్ని సాధారణం చేయటానికి ఆ తర్వాత 6 నెలల్లోనే ప్రఫల్ల కుమార్ మహంత ఈశాన్య భారత్ లోని అసోం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.] 1984, ఆగస్ట్ 16, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన యన్.టి. రామారావు ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర రావు గవర్నరు రామ్ లాల్ సహాయంతో కూలదోసాడు. [ఈ గవర్నర్ రామ్ లాల్ కాదనీ రావణ్ లాల్ అనీ ఈనాడు రామోజీ రావు సంపాదకీయాలూ, విలేఖరులు వార్తలూ, శ్రీధర్ లు కార్టూన్లూ రాసారు. కాకపోతే ఈ రామ్ లాల్ 1992 తర్వాత బి.జే.పి.లో చేరాడు, అది వేరే విషయం.]


కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రంలోని యన్.టి.రామారావు ప్రభుత్వాన్ని కూలదోసిందని నాటి మీడియా ముఖ్యంగా రామోజీ రావు కలమెత్తి అరిచాడు. [అసలుకే ఇతడు మొదటి నుండీ కాంగ్రెస్ వ్యతిరేకి! అలాగని కోర్టుకి ఈ మధ్యనే ఆఫిడవిట్ కూడా ఇచ్చాడు] తదనుగుణంగా రామ్ లాల్ ప్రవర్తన కూడా ఉందేమో, వెంటనే కేంద్రం రామ్ లాల్ గవర్నర్ పదవి ఊడబీకి శంకర్ దయాళ్ శర్మని గవర్నరుగా పంపి రామారావు ప్రభుత్వాన్ని పునరుద్దరించింది.


ఈ చర్యలన్నింటితోనూ కేంద్రప్రభుత్వానికి తామిన్నాళ్ళూ వెదులుతున్న విదేశీ హస్తపు కుట్రకి స్వదేశీ కేంద్రం రామోజీ రావే నేమో అన్న అనుమానం కలిగింది. లోపల నుండి మోటివ్స్ తెలుసుకొనే [మామిడిపళ్ళలో నూజివీడు మామిడి పళ్ళు ప్రశస్తం అంటారు. అలాగే నాయకమ్మణ్ణుల్లో ప్రశస్తమయినది ఈ నాగమ్మ.] ఈ నాగమ్మ ప్రమాద సంకేతాల్ని బయటకు పంపింది. అంతే అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ హత్యచేయబడింది. కేవలం నెలన్నర వ్యవధిలో! ఆరోజే ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు ధరించలేదని ఏ ఇంటి దొంగ బయటి సెక్యూరిటి గార్డులకి సిగ్నల్ ఇచ్చింది?


పై కారణంగా ఇంతకు నాలుగునెలలు ముందు జూన్ 6న స్వర్ణదేవాలయంపైని ఆపరేషన్ బ్లూస్టార్ ని వాడుకున్నారు. అదే పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం, 1992 తర్వాత ఎందుకు చల్లారింది. రామోజీరావు అసలు రూపం కేంద్రంలోని పి.వి.నరసింహారావు ప్రభుత్వానికి తెలిసినందుకా?


దీన్ని మరింతగా పరిశీలించాలంటే ........


తదుపరి టపాలో కొనసాగిస్తాను.



తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!


**************

3 comments:

emtadhiryamgaa pariseelustunnaaru.eedwshaaniki emdaru naagammalu vachchinaa kaapaadukunemduku rudramalu siddamgaa vunnaarani niroopistunnaaru

Adi Lakshmi గారు,

మీరు ఈ క్రింది incidents ని study చెసారా?.

1) Madhavrao Sindhia
2) Rajesh Pilot
3) Nepal King's Family
4)

great Conspiracy theory.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu