ముందుగా ఓ పోలిక వ్రాసి, మన జీవితాల్లో దాని అనువర్తన, విశ్లేషణలతో నా బ్లాగ్ అతిధులకి అలరించాలని ఇది వ్రాస్తున్నాను.


ఇప్పుడంతగా కనబడటం లేదు గానీ, మన చిన్నప్పుడు పాముల నాడించే వాళ్ళు వస్తుండేవాళ్ళు. నెత్తిమీద వెదురుబుట్టలు పెట్టుకొని, జోలె కట్టుకొని, చేతిలో నాగస్వరం పట్టుకొని భిక్ష కొచ్చేవాళ్ళు. వెదురు బుట్ట మూత తీసి లోపల పడుకున్న పాముని నాగస్వరంతో కదిపి ఇక ప్రదర్శన మొదలు పెట్టేవాళ్ళు. వాళ్ళు నాగస్వరం ఊదుతుంటే పాము పడగ విప్పి ఆడుతుండేది. ఆ ప్రదర్శన చూసిన వాళ్ళు పదో పరకో[చిల్లర పైసలు] ఇస్తే మళ్ళీ బుట్టమూసి నెత్తిన పెట్టుకొని పోయేవాళ్ళు.


పిల్లలందరం గుమిగూడి ఆ ప్రదర్శన చూస్తూ పాముల వారితో పాటు వీధి చివర వరకూ వెళ్ళి వచ్చేవాళ్ళం.


పాముకి వినిపిస్తుందా లేదా, నాగ స్వరం సంగీతానికి అది స్పందించి నాట్యం చేసిందా కాదా – అన్న మీమాంస ప్రక్కన బెడితే, ఆ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ - పాముల వాడు తన నాగస్వరాన్ని ఎటు తిప్పితే పాము తన పడగని అటే తిప్పడం.


ప్రస్తుతం మన సమాజంలో మీడియా పాముల వాడయితే ప్రజలు పాములన్న మాట.


ఇదేం అనువర్తన అనుకుంటున్నారా? పరిశీలించండి –


సెప్టెంబర్ 26, 2008 న ముంబాయి మీద తీవ్రవాదులు దాడి జరిగింది. అంతకు ముందు, రోజుల వ్యవధిలో బెంగుళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మాదాబాద్ ... ఇలా వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు.


మూడురోజుల క్రితం అంటే జనవరి 1, 2009 న అసోం లోని గౌహతి లో బాంబులు పేలాయి. మన కొత్త గృహా మంత్రి ఆ దారిలో కొద్ది సేపటిలో వెళ్ళవలసి ఉండగా ముందుగా బాంబులు పేలాయి. పేల్చింది ఉల్ఫాలైనా మూలాలు తేలింది మాత్రం బంగ్లాదేశ్ లో. బాంబులు పేలి ఆరుగురు చనిపోయారు, 50 మంది కన్నా ఎక్కువ మంది గాయపడ్డారు.

కానీ మీడియా దృష్టిలో దీని కంత ప్రాముఖ్యం లేదు. వారి దృష్టిలో అసోం భారతదేశంలో భాగం కాదో లేక చెత్తకుండీల్లోనూ, సైకిల్ స్టాండుల్లోనూ పెట్టేవి బాంబులు కావో లేక రోడ్డుమీద బాంబులు పేలితే చచ్చే సామాన్యులు మనుష్యులే కారో మనకి తెలీదు గానీ, మీడియాకి మాత్రం గౌహతిలో పేలిన బాంబు పేలుళ్ళు పట్టలేదు. మీడియా దృష్టిలో రోజుకి 50 వేలనుండి లక్షల్లో గది అద్దెలు చెల్లించ గలిగిన, పేజ్ 3 పార్టీలకు హాజరవ్వగలిగిన ఖరీదైన అయిదు నక్షత్రాల హోటళ్ళ అతిధులు మాత్రమే మనుష్యులేమో. ప్రఖ్యాత కాలమిస్టు, ప్రోక్టర్ & గ్యాంబుల్ మాజీ అధ్యక్షుడు గురుచరణ్ దాస్ రాతలు ప్రకారం ‘భారతీయ మేధో వర్గం[అంటే ఎవరో?] ఒత్తిళ్ళకే కేంద్ర యు.పి.ఏ. ప్రభుత్వం సూట్లు మార్చే గృహా మంత్రి శివరాజ్ పాటిల్ ని ఇంటికి పంపడం లాంటి చర్యలు చేపట్టిందట.’ వీళ్ళకి సామాన్య ప్రజల వ్యతిరేకత కనిపించలేదా? [వివరాలకు ఈనాడు, 28-12-2008, పేజి నెం.09, హెడ్డింగ్: ‘ఉగ్రవాదం భూతం కాదు’.]


అందుకే మీడియా – తాజ్, ట్రిడెంట్ ల మీద దాడికి ఇచ్చినంత ప్రాముఖ్యం మిగిలిన సందర్భల్లోని బాంబుదాడులకో లేక తీవ్రవాదుల హింసకో ఇవ్వలేదు. అధికారులూ, రాజకీయ నాయకుల స్పందన కూడా తాజ్, ట్రిడెంట్ లమీద దాడి విషయంలో అంతే తీవ్రంగా ఉండింది. ఎందుకంటే తాము అలాంటి చోటే కదా విడిది చేస్తారు?[ అందుచేత వాళ్ళు స్పందించడం కూడా సబబే.]


ఎటొచ్చీ సామాన్య ప్రజల స్పందనే చిత్రమైనది. మీడియా [ఎలక్ట్రానిక్ కానీండి, ప్రింట్ మీడియా కానీండి] ఎలా ప్రొజెక్ట్ చేస్తే అలా స్పందించడం చిత్రమే కదా! మీడియా ప్రాధాన్యం ఇస్తే నూటికి 80 నుండి 95% జనమూ ప్రాధన్యమివ్వడం, మీడియా మిన్నకుంటే జనమూ అలాగే ఉండటం, మీడియా హైజాక్ చేస్తే జనమూ యధాలాపంగా హైజాక్ కావండం, మీడియా ఏది ప్రచారిస్తే దాన్నీ అనుసరించమూ – అచ్చంగా పాముల వాడి నాగస్వరాన్ని అనుసరించి పాము పడగ ఆడించడం లాగానే లేదూ?


నిజానికి జనంలో ఉన్న ఈ అనాలోచనా ధోరణే మీడియాకి పెట్టుబడి, పెట్టని కోట. కనుకనే ప్రచారంతో ఎవ్వరినైనా తమ దగ్గరున్నది నల్లమేక కాదు, నల్లకుక్కని నమ్మించ గలుగుతున్నారు. అదే ఈ రాజకీయ నటీనటులకీ, వాళ్ళ నాడించే మీడియా దర్శకులకీ ఉన్న నిజమైన బలం, బలమైన వనరు.


ఇప్పుడు చెప్పండి పాముల వాడి నాగస్వరాన్ని అనుసరిస్తోన్న పాము పడగ, ఆ ప్రదర్శన ఎలా ఉన్నాయో?


తిలా పాపం తలా పిడికెడు అంటే ఇలాగే ఉంటుందేమో కదా?

మరో టపాలో మరికొన్ని విశేషాలు.

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

5 comments:

ఇక ఆపండి మీ మేధో విశ్లేషణ. ముంబాయిలో జరిగింది... మొట్టమొదటి సారిగా ఉగ్రవాదులు ప్రత్యక్షంగా అటాక్ చేసారు. అందుకే అందరూ, మీరు కూడా - మీరూ ఏమి మినహాయింపు కాదు, ఆ దాడికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రత్యేకంగా రెండు టపాలు రాసారు. మిగతా దాడ్డులప్పుడు మీరూ మాత్రం కాముగా లేరా?? ఏదో ఓ టపా రాయాలి అని రాయకండి?? ఇలా రాసి రాసి 16 YEARS వెస్ట్ చేసుకున్నారు. అదికాక ముంబాయి పోరు రెండు (ఒక చిన్న సైజు యుద్దంలా) రోజులు సాగింది. కాని మిగతా బాంబు దాడులు? ఇక పడగా, పాము, నాగస్వరం .. మీరూ అయినా, నేను అయినా, ఎవరు అయినా .. TV CHANNELS వారు ప్రసారం చేసినవి చూడాల్సిందే. తప్పదు. ఓపిక ఉంటే స్వంతంగా కొత్త చానెల్ పెట్టుకొని ఇష్టం వచ్చినవి ప్రసారం చేసుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎవరూ అడ్డు చెప్పరు. మీరూ కూడా మొదలెట్ట వచ్చు.

@krishna rao jallipalli said:

"ఏదో ఓ టపా రాయాలి అని రాయకండి?? ఇలా రాసి రాసి 16 YEARS వెస్ట్ చేసుకున్నారు".

rao గారు, మీరు టపా లొ వ్రాసిన విషయము మీద comment వ్రాస్తె బాగుండెది. Lakshmi గారి meeda మీరు చూపిన authority మంచిది కాదు. మీరు అందరి మీద ఇలానె authority చూపిస్తారా? కుటుంబ సబ్యులతొ సహా?

I know that you have good intentions. Otherwise you won't respond that way.

Adi Lakshmi గారు,

Very well written post. I agree with you. Keep writing.

At times the vested interests may pressurise you with their abusive comments. There are people in this blog world, that they can ban (out-caste) some of the Telugu words. For example if someone use a word like కత్తి or నీవు, those vested interests spring to life and threaten the blogger. God knows what else they can ban in their lopsided world.

కత్తి పార, కత్తి పీట, కత్తి, బాకు, చాకు, కొడవలి, సుత్తి, నీవు, నీను, మీరు, నాకు, వాడు, అది, వీడు, గడప, తలుపు, ... are the common words in Telugu. The vested interests want to ban such words.

Similarly all over the world, officially the "Press" de-linked "that" religion and వుగ్రవాదం. That is the reason why Indian press hush-hush those incidents. Where as countless Hindus die. The Caste political leaders sleep like Kumbh Karan or act like Dhritrastra. But Khumbh Karan and Dhritrastra are useful to their folk when it matters. Where as these Caste Political leaders are useless.

And Nehru and Marxist historians similarly glossed Indian History to save their friends.

Please be careful, these vested interests may go to any length to prove their point.

u had written well.
Even i feel the same.
Today media should be the eyes of people and the media knows it. So they are misleading people by providing false information.
I think this can change by our blogs.

pseudosecular గారూ... నా కామెంట్ టపా మీదనే. ఇక authority అంటారా.. అనవసరంగా చూపను. అవసరం అయితే authority ఏమి ఖర్మ, నాలుగు పీకడానికి కూడా వెనుకాడను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu