నిజానికి పీవీజీ మేధస్సుని మేము గ్రహించిందే చాలా తక్కువ. అందులోనూ కొంత మాత్రమే కాగితంమీద పెట్టగలిగాము. [అంటే బ్లాగులో అన్నమాట] ఆయన స్ట్రాటజీ... పాజిటివ్ లేదా నెగిటివ్ గా ఎలా చూసినా ఫిట్ అవుతుంది. అందుకే ఆయనని గురించి మేము మురిపెంగా [గాయత్రీ మాత వరం పొందిన తెనాలి రామకృష్ణ కవి ని గుర్తు తెచ్చుకుంటూ] ‘వికటకవి’ అనుకుంటూ ఉంటాము. ‘వికటకవి’ ఎటునుండి ఎటు చదివినా ఒకేలాగా కన్పిస్తుంది.

1992 నుండీ ఇప్పటి వరకూ పీవీజీ, నెం.5 వర్గమూ.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తుల మీద ప్రయోగించింది ఇటువంటి ద్వంద్వ స్ట్రాటజీలనే! వికటకవి లా ఎటు నుండి చూసినా ఫిట్ అయ్యే స్ట్రాటజీలనే! కాబట్టే.... రామోజీరావు, సోనియా, అద్వానీల వంటి వారికి, అవి తమ అరిషడ్వర్గాలకు సంతృప్తి కలిగించేటట్లుగా, ఆ విధమైన భాష్యాలు చెప్పుకోగలిగినట్లుగా తోచాయి. అందుచేతే.... నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, ఆయా సందర్భాలకు ఆయా ఆసైన్ మెంట్లను నిర్వహించారు. గతంలో జరిగిన అవే అసైన్ మెంట్లు, సంఘటనలు.... ఇప్పుడు చూస్తే తమ బహిర్గాతాలుగానూ, సువర్ణముఖిలు గానూ కనబడుతున్నాయి. అదే గూఢచర్యపు గమ్మత్తు! బొమ్మ తిప్పి చూస్తే గానీ అర్ధం కానట్లు!

మరో గణితపరమైన ఉదాహరణ చెప్పాలంటే - పరావలయాన్ని[parabola] పరిశీలించండి. Extremities లో పరావలయం పైని బిందు నిరూపకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే ధన ఋణ [+, -] గుర్తులు మారతాయి. సరిగ్గా అలాంటిదే పీవీజీ, సోనియాల మధ్య వ్యత్యాసం. కర్పూరం ఉప్పూ ఒకేలాగా కన్పించినట్లన్న మాట!

మరో ఉదాహరణ చెప్పాలంటే - ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడనుకొండి. వాడు అంతర్ముఖుడైన మహాజ్ఞాని కావచ్చు. మాట్లాడటం చేతగాక మౌనం పాటిస్తున్న మహామూర్ఖుడు కావచ్చు. సదరు మౌని మేధావో, మూర్ఖుడో తెలియాలంటే - కాలం గడిచి, వాళ్ళ చర్యలు బయటపడితే గానీ స్పష్టత రాదు.

పతాక దశలో ఉన్నప్పుడు.... సత్త్వగుణమూ, తామసమూ కూడా, ఇలాగే ఒకే తీరులో కన్పిస్తాయి. ’గీత’ సహాయంతోనే దాన్ని దాటగలం, వ్యత్యాసాన్ని గుర్తించగలం.

ఇప్పుడు మరోసారి - రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆటగాడి విన్యాసాన్ని ఉటంకిస్తాను.

A Vs C మరియు C Vs B బోర్డులలో A Vs C బోర్డు చిన్న పరిమాణం. దాని మీద నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాలు మాతో ఆడారు. ఆట ప్రారంభకులు వాళ్ళే! దేశం మీద గతంలో ఏయే స్ట్రాటజీలు ప్లే చేసారో, ఆవే మా మీద ప్రయోగించారు. కాకపోతే, ప్యాకింగ్ తేడానే గానీ లోపల సరుకు ఒకటే అన్నట్లు, అవే 10 స్ట్రాటజీలు! అదే ’అహం’ పై ఆటలు! ఆడది కుదరదు కాబట్టి ’ఆకలి’ ప్రయోగించటాలు!

ఇక, C Vs B బోర్డు పెద్ద పరిమాణం. దాని మీద నెం.10 వర్గంలోని ఏజంట్లతో, నెం.5 వర్గం ఆడుకుంది. ఆట ప్రారంభకులు నెం.5 వర్గమే. కాకపోతే, అది కూడా సదరు నెం.10 వర్గపు ఏజంట్లకు జాతర బొమ్మలైన ఇతర ఏజంట్లు [వాళ్ళు నెం.10 వర్గం లోని వారే!]ని ఉపయోగించి, ఆట ప్రారంభించింది. A Vs C బోర్డు మీద [అంటే చిన్న పరిమాణంలో] A మా మీద ప్రయోగించిన స్ట్రాటజీలనే, C Vs B బోర్డు మీద [అంటే పెద్ద పరిమాణంలో] నెం.5 వర్గం ప్రయోగించింది. కాబట్టే ఈ నకిలీ కణికుల స్ట్రాటజీలు మాకు అర్ధమయ్యాయి. లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థలో ఏం జరుగుతుందో ఎవరూ తెలుసుకోలేరు.

నకిలీ కణిక అనువంశీయ గూఢచర్యం తెలియని చంద్రబాబులు, వై.యస్.లని నెం.10 వర్గీయులుగా పరిగణించవచ్చు. నకిలీ కణిక అనువంశీయ గూఢచర్యం తెలిసిన అద్వానీ, సోనియాల వంటి వారు, నకిలీ కణిక వ్యవస్థలో కీలక ఏజంట్లు!

ఇక ఈ ఆట ఎలా ఉంటుందంటే - చిన్నపరిమాణపు బోర్డు మీద నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, పైముఖంగా పెట్టుకున్న వ్యక్తులతో మొదటగా తన ఆట ప్రారంభించాడు. సూర్యాపేటలో మా ఇంటి ఓనరు, త్రివేణి కాలేజీ యాజమాన్యం, స్థానిక పోలీసులు, హైదరాబాద్ నానల్ నగర్ లో మా ఇంటి ఓనరుతో సహా ఇరుగు పొరుగులు, శ్రీశైలంలో ఈవో, డిఈవో, వాళ్ళ వంటవాళ్ళు/అటెండర్లు గట్రాలు పైముఖంగా ఉన్న వాళ్ళన్న మాట! ప్రతీసారీ అంతే! అదే ‘వేధింపు’గా మేము ఫిర్యాదులకి ఎక్కించాము.

ఫిర్యాదు పెట్టకుండా సామరస్యం కోసం ప్రయత్నించినా ఫలించక పోవటం కూడా ఈ ఆటలో భాగమైంది. వేధింపుని ఎదుర్కొంటూనే మేము, పైముఖంగా మమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళ మీద ఫిర్యాదు చేసేవాళ్ళం.

ఫిర్యాదు చేసే వరకూ.... ఓ వైపు వేధింపు ఆపేవాళ్ళు కాదు గానీ, మరో వైపు, అవినీతిలో వాటా పంచుకుందాం రమ్మనే ఆఫర్లు మాత్రం ఉండేవి. కొన్ని మాకు ఆ సమయంలో అసలు అర్ధం కూడా కాలేదు. జరిగిపోయిన సంఘటనలని తిరిగి గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఆఫర్ అర్ధమయ్యేది. ఆ దృక్పధం, ఆ రకమైన ఆలోచన తీరు ఉంటే కదా, అది క్యాచ్ అయ్యేందుకు!? ఇలా ప్రతీ సందర్భంలోనూ రెండు దారులుండేవి. అలాంటి ఆఫర్ ని అందుకొని అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం. రెండో దారి అంటే - ఫిర్యాదు పెట్టటమే!

సూర్యాపేటలో ఎంసెట్ ర్యాంకుల మ్యాచ్ ఫిక్సింగ్ మీద ఫిర్యాదు పెట్టగానే... "ఆ గోల్ మాల్ అంతా మేం చూసుకుంటాం. మీరు కాలేజీ మెయిన్ టయిన్ చేస్తే చాలు. జాయింట్ వెంచర్ గా కాలేజీ నడుపుదాం రమ్మంటూ" మాకు వచ్చిన ఆఫర్ ఒక ఉదాహరణ అన్నమాట.

సరే, ఇక ఫిర్యాదు దారే ఎంచుకుంటే - పైముఖంగా ఉన్నవ్యక్తులూ మొత్తుకునే వాళ్ళు, తదుపరి దశలో మాపై వేధింపు సాంద్రతా పెరిగేది. క్రమంగా మేం ఎవరి మీద ఫిర్యాదు పెడతామో ఆ వ్యక్తులు Drop అయిపోయి, కొత్త వాళ్ళు తెరపైకి [అంటే వేధించేందుకు] వచ్చే వాళ్ళు, అంటే ముందరి వ్యక్తులు అవుట్ అయిపోయే వాళ్ళన్న మాట. ఇలా వ్యక్తులు Drop కావాల్సి వచ్చినప్పుడు - ఒక్కోసారి వాళ్ళే Drop అయిపోయేవాళ్ళు. ఒక్కోసారి మేమే ఇల్లు మారటం, ఊరు మారటం వంటివి జరిగేవి. ఆ విధంగా మమ్మల్నే Drive చేసారు.

సరిగ్గా ఇలాగే.... పెద్దపరిమాణంలో అంటే C Vs B బోర్డులోనూ, కొందరు ఏజంట్లు [వాళ్ళు కార్పోరేట్ వ్యాపారుల కావచ్చు, బ్యూరోక్రాట్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు] Drop అయిపోయేవారు. అంటే జారత బొమ్మల్లా నడిచిన ఈ వ్యవహారంలో, సదరు ఏజంట్ల అవకతవకలూ, కేసులూ లేదా చీకటి చరిత్రలూ, వారి గురించిన వివరాలూ, బహిరంగమై ఆ పావులు/ఏజంట్లు Expose అయిపోవటం జరుగుతుంది.

ఈ విధమైన Identicality నడిచేది. మామూలు చదరంగంలో అయితే A ఎత్తుగడని B మీద ప్రయోగించి, బదులుగా B ప్రయోగించిన ఎత్తుగడని తెచ్చి A మీద వేసే, C ఆటగాడు.... ఎక్కడో ఓ బోర్డు మీద ఓడితేనే మరో బోర్డు మీద గెలవగలడు. కానీ గూఢచర్యంలో అయితే.... తన గొంతు మీద తనే కాలు వేసుకు తొక్కుకోవటం వంటి ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు సాధ్యమైనట్లే.... రెండు బోర్డుల మీదా C గెలవటం కూడా సాధ్యమే! అదే గూఢచర్యంలో ఉండే గమ్మత్తు!

నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల ప్రమేయం, పైముఖంగా.... క్రింది స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల దాకా [చంద్రబాబు, వై.యస్.], ప్రధానమంత్రుల దాకా ఇన్ వాల్వ్ అయి ఉండటాన్ని, మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా నిరూపించాము. ఆ విధంగా చిన్న బోర్డు మీద మేము గెలిచాం.

అలాగే పెద్ద బోర్డు మీద నెం.5 వర్గమూ గెలిచింది. ఎవరికీ తెలియకుండా కీలక వ్యక్తుల వ్యక్తులకు మాత్రమే తెలిసిన నకిలీ కణిక వ్యవస్థని, పైముఖంగా..... నెం.10 వర్గాన్ని పెట్టుకుని నడుపుతున్న గూఢచర్యాన్ని, ఒకరి మీద ఒకరిని ప్రయోగించి, రెండు వ్యవస్థలనీ కుప్పకూల్చడం ద్వారా, నెం.5 వర్గం విజయం సాధించింది. అదే ఇంతగా.... 18 ఏళ్ళ క్రితం చెబితే ఎవరూ నమ్మని విషయాలు, మీడియా నిజరూపంతో సహా..... 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చెబితే, ఎవరికైనా అర్ధమయ్యేటంతగా బహిర్గతమయ్యాయి. నిరూపణా అయ్యాయి.

రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆటగాడు, రెండు చోట్లా ఏకకాలంలో గెలవటమే ఇక్కడి మేధస్సు! అది పీవీజీ గొప్పతనమే! వికటకవి మేధస్సు!

ఇక్కడ ఒక పోలిక చెబుతాను. నాణెం ఎగరెస్తే బొమ్మో, బొరుసో పడిందనుకొండి. నాణానికున్న ఒక ముఖమే కనబడుతుంది. రెండో ముఖం కనబడదు. అంటే సగం నిజమే తెలుస్తుందన్న మాట. రెండో సగం కనబడకుండానే ఉండిపోతుంది.

అదే నాణేం నిలబడితే!? ఒకే సమయంలో దాని రెండు ముఖాలూ కనబడతాయి. పూర్తి సత్యం ఆవిష్కరింపబడినట్లన్న మాట!

ఇప్పుడు జరిగిందదే! ఒక బోర్డు మీద గెలిచి, మరో బోర్డు మీద ఓడితే.... నాణెపు ఒక ముఖమే కనబడినట్లుండేది. రెండు బోర్డుల మీదా గెలవటమే సంపూర్ణంగా సత్యావిష్కరణం!

అదీ నకిలీ కణిక వ్యవస్థ, తరతరాలుగా చేస్తున్న గూఢచర్యానికి సంబంధించిన సంపూర్ణ సత్యావిష్కరణం!

ఎప్పటికైనా స్వీయ ప్రకటన చేసుకోక నకిలీ కణిక అనువంశీయులకి తప్పని సత్యావిష్కరణం!

ఎంత కాలం ఈ స్వీయ ప్రకటనలని వాయిదా వేసుకుంటే అంతకాలం.... ‘బహిర్గతాలు - సువర్ణముఖి’లతో, వాయిదా పద్దతిలో ప్రకటింపబడే సత్యావిష్కరణం! ఇది చిన్న చావు అన్నమాట.

తమకు తాముగా ప్రకటించుకుంటే పెద్దచావు! ‘కన్నా? కాలా?’ లో తాత్కాలికంగా కన్ను కాపాడుకున్నా, మళ్ళీ మళ్ళీ సంభవించే అలాంటి కీలక సందర్భాలలో చివరికి అన్ని కళ్ళూ, కాళ్ళూ కోల్ఫోక తప్పదు. అప్పటి వరకూ.... నెం.10 వర్గం తాలూకూ ఏజంట్లూ బహిర్గతమవుతూ కొంచెం కొంచెంగా నకిలీ కణిక వ్యవస్థ కూలుతూనే ఉంటుంది.

3 1/2 శతాబ్దాల తరబడి, ఇన్ని ద్వంద్వాలతో అల్లుకున్న నకిలీ కణికుల అనువంశీయ గూఢచర్యాన్ని, ఉల్లిపాయ పొరలు ఒలిచినట్లుగా ఒలిచి, ద్వంద్వాలన్నిటినీ తుత్తునియలు చేసి, లోపలి ’కోర్’ని ప్రదర్శించే విధంగా ఈ గూఢచర్య స్ట్రాటజీని రచించింది పీవీజీ అయితే.... 18 ఏళ్ళుగా, ఆయనతో పాటూ, ఆయన మరణానంతరం కూడా, అమలు చేసిందీ, చేస్తున్నదీ ఆయన సమీకరించిన నెం.5 వర్గం.

తన వెనక నడిచిన, తనని అనుసరించిన నెం.5 వర్గపు సభ్యుల మీదా, తన భావ వారసుల మీదా ఆయనకి అంత నమ్మకం! తాను ప్రారంభించిన ఈ పనిని, తన మరణానంతరం కూడా వాళ్ళు పూర్తి చేస్తారనీ, ఎప్పటికీ అధర్మానికి వడిగట్టరనీ నమ్మకం!

ఏ ప్రలోభాలకీ, భయాలకీ లొంగరని నమ్మకం!

తను నేర్పిన విద్యని తన శిష్యులు అంతగా సఫలీకృతం చేస్తారన్న నమ్మకం! దైవం మీద నమ్మకం! గీత మీద నమ్మకం! మానవత్వం మీదా, సత్యం మీదా నమ్మకం!

కాబట్టే, తరవాతి వారి మీద పని బాధ్యత, యుద్ద విజయపు బాధ్యత వదిలి పెట్టి, నిశ్చింతగా వెళ్ళిపోయిన స్థితప్రజ్ఞుడాయన! ఇందుకు దృష్టాంతంగా....పీవీజీ లోని ’లోపలి మనిషి’ని పరిశీలించండి.

ఈ గ్రంధ ప్రచురణ కర్త ధూపాటి విజయకుమార్....
>>>ఆ పుస్తకం చదువుతుంటే నాకు ఓ సుదీర్ఘమైన ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది. ఆ అనుభూతి నన్ను బలోపేతం చేసేది గానూ, స్పూర్తినిచ్చేది గానూ, జ్ఞానదాయకంగానూ అనిపించింది.

స్వాతంత్ర్యానంతర భారత రాజకీయ, సామాజిక చరిత్రలో ప్రయాణానికి బయలు దేరుతున్న మీకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను."
అంటూ, అందంగా ప్రచురించి ఇచ్చిన ఈ గ్రంధపు అట్ట మీద, పీవీజీ ఫోటోతో పాటు ముద్రించిన మాటలు -

ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృతిపుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుటయే నా ప్రతిజ్ఞ.

‘నిద్రలోనూ, చీకటిలోనూ ఉన్న ఈ జగత్తు జాగృతి పుంజంగా వెలిగేందుకే తన తపస్సనీ, వెలిగించటయే తన ప్రతిజ్ఞ’ అనీ చెప్పాడాయన. మన పెద్దలు, ‘గీత’ తామసాన్ని నిద్రగానూ, అజ్ఞానాన్ని చీకటిగానూ పోలుస్తారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=489845&Categoryid=14&subcatid=0

అజ్ఞాత గారు: మీరు పంపిన లింక్, భాష అర్ధంకాలేదు! బహుశ సాక్షి ఫాంట్ దిగుమతి చేసుకుంటే గాని మన తెలుగులో కన్పిస్తాయో కదా!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu