ఇక సానియా షోయబ్ వివాహ విషయంలో బహిర్గతమైనవి....

తాలిబాన్లు, పాకిస్తాన్ వ్యవహారాలు:

కెరీర్ కోసం, మీడియా ఇచ్చే ఇమేజ్ కోసం, భారత జాతీయ గీతాన్ని అవమానించడం వంటి చర్యలకు మామూలుగానే పాల్పడి, వివాదాలలో చిక్కుకుపోయిన సానియా మీర్జా, తన స్కర్టు ఎంత నిడివి కలిగి ఉండాలో మత పెద్దలు నిర్ధేశించనక్కర లేదని గతంలోనే ప్రకటించింది. [అంటే ఈ వివాహం, తన నిశ్చితార్ధం వంటి వ్యక్తిగత వ్యవహార వివాదాలకు చాలా ముందుగానే]

ముస్లిం మత ఛాందస వాదులైన తాలిబాన్లు, అంతర్జాతీయంగా టెన్నిస్ ఆడటానికి నానా దేశాలు తిరిగే ఈమెను, పిసరంత మాటకూడా ఆక్షేపించలేదు. పాత బస్తీతో సంబంధాలు కలిగి ఉండి కూడా! మరి హైదరాబాదు అమ్మాయి కదా! అందునా మీర్జా మరి!ఆ తాలిబాన్లను ఇష్టంగా భరిస్తున్న పాకిస్తాన్, తమ దేశపు ఆటగాడు ఏమాత్రం ముస్లిం సాంప్రదాయాలను పాటించని ఈ హైదరాబాద్ అమ్మాయిని పెళ్ళడటాన్ని వ్యతిరేకించలేదు. పైగా స్వాగతించింది. వజ్రాల కిరిటాన్నీ బహుకరించింది. ప్రభుత్వం తరుపున మూడో నాలుగో రిసెప్షన్లు ఇస్తారట. ఎంత ఉత్సాహమో!

మొన్నటి దాకా.... భారత్ పై వ్యతిరేకతని పాక్ ప్రజలకి నూరిపోస్తున్నదని, పాక్ ప్రభుత్వానికి పేరు ఉంది. ఇప్పుడు హఠాత్తుగా భారత్ దేశపు అమ్మాయి తమ కోడలు అంటూ నానా హంగామా చేస్తున్నది. అక్కడి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని అక్కడి మీడియా ఎడాపెడా ప్రచారం చేస్తున్నది.

ఇంత సంచలనాల నేపధ్యంలో, బెట్టింగ్ వ్యాపారం పాకిస్తాన్ లో జోరుగా సాగింది. ఒక్క పాకిస్తాన్ లోనే ఏమిటి, భారత్ తో సహా జరిగింది. మీడియా ఇతోధిక సాయంతో నడిచే, మానవ బలహీనతల మీద ఆడబడే, వ్యసనపూరిత బెట్టింగ్ బిజినెస్ గురించి, అందుకోసం సమాజంలో, సెలబ్రిటీల బ్రతుకుల్లో నడిపించబడే చీకటి కోణాల గురించీ, మరో టపాలో వ్రాయాల్సిందే. ఇక్కడ వ్రాస్తే విషయాంతర మౌతుంది.

మరో ప్రక్క, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముఖ్యమంత్రి - ఈ కొత్త జంటని తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాడు. ఆ విధంగా ’కాశ్మీర్ పాక్ లోనిదే’ అనే తమ వాదనకి అంతర్జాతీయ ప్రచారం వస్తుందని అతడి ఆకాంక్ష! ఎంత అంతర్జాతీయ రాజకీయం, ఈ హైదరాబాదీ అమ్మాయి, పాకిస్తానీ అబ్బాయిల వివాహంలో ముడిపడి ఉందో స్పష్టమైంది. లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముఖ్యమంత్రి గానీ, పాక్ ప్రభుత్వం గానీ, మీడియా గానీ ఇంతగా స్పందించవలసిన అవసరం లేదు!

దుబాయ్ వాటా:

పెళ్ళైనా భారత్ తరుపున సానియా ఆడుతుందట. ఇంతకు ముందు ఆడి ఉద్దరించిందేమిటో! గెలిచిందే తూతూమంత్రం! మణికట్టుగాయం, కడుపునొప్పి! స్కూలు ఎగ్గొట్టటానికి చిన్నకుర్రాడు చెప్పినన్ని సాకులు.... ఓడిఫోవటానికీ, ఆడకపోవటానికీ చెప్పటం ఈ క్రీడాకారిణికి వెన్నతో బెట్టిన విద్య. ఒక వేళ గెలిచిందనుకొండి, కడుపునొప్పి ఉన్నా, మణికట్టు నొప్పి ఉన్నా కూడా గెలిచింది అంటూ ప్రచారం చేసుకుంటారు. ఈలాంటి ఈమె భారత్ తరుపున అడుతుందట. షోయబ్ పాక్ తరుపున ఆడతాడట.

ఈ ఇద్దరూ కలిసి, ఇద్దరి మాతృదేశాలకు మేలు చేసేందుకు దుబాయ్ లో కాపురం పెడతారట. దుబాయ్ ఎంతగా మాఫియా కేంద్రమో అందరికి తెలుసు! ఇండియాలో హవాలా దగ్గరి నుండీ, సినిమా వ్యాపారం, క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగూ, బెట్టింగూ గట్రా చాలా వ్యాపారాలు నిర్వహించే దావూద్ ఇబ్రహీం ల వంటి మాఫియా వారి రెండో శాశ్వత చిరునామా అది.

సదరు దుబాయ్ లో, ఈ జంట ప్రచార కర్తలుగా ఉంటారట. దుబాయ్ లో అన్ని ఆటలకీ సానియా ప్రతినిధిగా ఉంటే - భారత్ లో ఐపీఎల్ మాదిరి దుబాయ్ లో క్రికెట్ లీగ్ నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం అనుకుంటుందట. స్థానిక జట్టుకు షోయబ్ సారధ్యం వహిస్తాడట.

ఈ పైకారణాలతో [over leaf reasons], హైదరాబాద్ టూ పాకిస్తాన్ నడిచే గూఢచర్య లాబీయింగులో దుబాయ్ ప్రమేయం ఎంతో నిరూపించబడింది. హైదరాబాద్ టు పాకిస్తాన్ వయా దుబాయ్ అన్నమాట!

భారత ప్రభుత్వ వాటా:

ఇంత గొడవలో కుర్చీవ్యక్తి సోనియా తప్ప ఎవరూ, సానియాకి శుభాకాంక్షలు చెప్పలేదు. పాపం, ఎందుకో గానీ సోనియా, ప్రభుత్వం తరుపున కానుకలు పంపలేదు. ఎంతో విశాల హృదయంతో, ఒక మైనారిటీ క్రీడాకారిణి కాబట్టి కానుకలు పంపుతున్నామని చెప్పలేదు. అంతేగాక సిఎం, మాజీ సిఎంలలో చంద్రబాబునాయుడు మాత్రమే విందుకు హాజరయ్యాడు. అదీ లింకు!

అయితే.... ఎవరూ.... పాకిస్తాన్ తో ఇంత చెట్టాపట్టాలు వేసుకున్న సదరు క్రీడాకారిణిని పెంచి పోషించింది భారత్ అనిగానీ, పద్మశ్రీ గట్రా అవార్డులతో సత్కరించిందీ, భూములూ, లక్షల్లో నగదు బహుమతులూ గట్రా ఇచ్చి పరిపుష్టి చేసింది భారత్ అనిగానీ అనలేదు. అంతే కాదు, భారతీయుల మీద వ్యాపారాలు చేసి గడించిన సొమ్ముతోనే, జీవీకే వంటి సంస్థల అధినేతలు జీవీకృష్ణారెడ్డిలు ఆమెకు స్పాన్సర్ చేశాయనీ అనలేదు.

సదరు క్రీడాకారిణికి బాంబుదాడులతో ఉగ్రవాదుల చేత దాడులు చేయిస్తున్నది పాకిస్థానే అని గానీ, ముంబైదాడులతో సహా ఎన్నో దాడులు జరిపింది పాకిస్థానే అని గుర్తురాలేదు కాబోలు! తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు - ఇక్కడి సొమ్ము తిని, పాకిస్తాన్ ని వరించిన ఈ హైదరాబాద్ యువతికి ఇచ్చిన భూములూ నగదు బహుమతులూ ఎవరివి? ప్రజలవి కావా? అలాంటి అమాయక ప్రజల మీద బాంబుదాడులు చేసిన పాకిస్తాన్ పట్ల ఎంత వ్యూహాత్మక సుహృద్భావం?

ఆయేషా తండ్రి - ఓ దశలో తన నిరసన తెలుపుతూ - షోయబ్ ను కాపాడటానికి పాకిస్తాన్ నుండి పేరెన్నిక గల న్యాయవాది రానున్నారు. అతడికి పాకిస్తాన్ అన్నివిధాలా అండదండలుగా నిలబడుతుంది. మన ప్రభుత్వం మమ్మల్నే అనుమానిస్తోంది. మా ఇంటి వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. మాకు ప్రభుత్వం నుండి ఏ సాయమూ అందటం లేదు. ఎవరూ మాకు సాయం చేయటం లేదు అన్నాడు.

ఈ దేశపు అమ్మాయిని పెళ్ళాడి, కొన్నాళ్ళు కాపురం చేసి, కాదన్న వాణ్ణి కాపాడటానికి పాకిస్తాన్ పాకులాడింది గానీ..... "ఇదేం పని?" అని ప్రభుత్వం, అందునా కుర్చీవ్యక్తిగా మహిళ నిర్వహిస్తున్న ప్రభుత్వం పల్లెత్తి అయినా అడగలేదు.

పాకిస్తాన్ ఆటగాడి వాటా:

‘పాకిస్తాన్ ఆటగాడు ఇలాగాక మరెలా ఉంటాడు?’ అన్న తీరులోనే ఉంది ఇతడి ప్రవర్తన. ముందు ఆయేషా ఎవరో తెలియదన్నాడు. తర్వాత మహా ఆపా అని అన్నాడు. అసలు ఆమెని చూడలేదన్నాడు. చూడకుండానే ఫోనులో పెళ్ళి చేసుకున్నానన్నాడు నిఖానామా మీద తన సంతకం కాదు,పోర్జరీ అన్నాడు. కాదు తనదే... ఆయేషా బలవంతం మీద సంతకం చేశానన్నాడు. తనని చిన్నపిల్లాణ్ణి చేసి సంతకం పెట్టించుకుందన్న మాట! మరోవైపు మచ్చ చెరగకుండా దేశం దాటను అన్నాడు.

శారీరక కలయికకి గుర్తుగా వీర్యపు మరకల పడిన దుస్తులు భద్రపరచబడ్డాయనీ, వాటిని డిఎన్ ఏ పరీక్షలకి పంపడానికి సిద్దమనీ ఆయేషా కుటుంబం ప్రకటించింది. తాము హోటల్ గదిలో కలిసి గడిపామని, అందుకు హోటల్ సిబ్బందిని సాక్ష్యంగా చూపగలమనీ అన్నది. [చాలా సంవత్సరాల క్రితపు దుస్తులు, ఎప్పటికైనా సాక్ష్యంగా పనికొస్తాయని ముందే ఊహించి, ఎలా వాటిని భద్రపరిచినట్లు?] బలమైన సాక్ష్యాలు బయటికొచ్చేసరికీ.... ‘వివాహానికి తను హాజరయ్యానని’ సవతి తమ్ముడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతాననే సరికీ.... కిమ్మనకుండా తలాక్ నామా మీద సంతకం పెట్టాడు.

షోయబ్, ముందంతా తమ పట్టు సాగుతుందేమోనని అయేషా చెప్పిన విషయాలన్నీ అబద్దాలని కొట్టి పారేసాడు. కుదరకపోయేసరికి గమ్మున తలాఖ్ నామా మీద సంతకం చేసాడు. మీడియా కూడా అంతే గమ్మున ఆ విషయాన్ని దొర్లించేసింది.

మీడియా వాటా:

ఈ క్రికెట్ క్రీడాకారులని so and so icon లుగా గుర్తించాలనీ, వాళ్ళ బొమ్మలు ముద్రించిన దుస్తులు విపరీతంగా అమ్ముడు పోతున్నాయనీ మీడియా ప్రచారిస్తుంది. వాళ్ళు ప్రచార కర్తలుగా ఉంటే - శీతల పానీయాల దగ్గరి నుండీ లోదుస్తులు దాకా, తమ బ్రాండు ఉత్పత్తులు బాగా అమ్ముడుపోతాయంటూ వారికి డబ్బులు సమకూరుస్తాయి కంపెనీలు.

ఎవ్వరూ కూడా సదరు వ్యక్తుల నైతిక వర్తనని నిలదీయరు. మీడియా అయితే కమ్ముకు వస్తూందే తప్ప, అసలు అలాంటి ప్రశ్నల వైపుకు పరిస్థితులనీ, పాఠకులనీ వెళ్ళనివ్వదు. పత్రికా విలువల గురించి మాత్రం జనాలకి పాఠాలు చెప్తుంది.

మొదట షోయబ్, ఆయేషా గురించి చెప్పినవన్నీ చివరికీ అబద్దమని తేలింది కదా! అయినా గానీ, షోయబ్ నైతిక వర్తన గురించి ఏమాత్రం ప్రశ్నించలేదు సరికదా.... సానియా పెళ్ళిచీర ఏమిటి? వరుడి దుస్తులూ అలంకారాలేమిటి? వాటిని ఎవరు కుట్టారు? వంటకాలేమిటి? గోరింటాకు ఎక్కడ కోసారు, ఎవరు రుబ్బారు, ఎలా పండిందీ .... ఇలా సదరు క్రీడాకారిణి దగ్గినా తుమ్మినా, వార్తా సంచలనంగా వ్రాసింది.

ఎందుకంత విపరీత ఆదరణో!?

సానియా వాటా:

తాను గౌరవనీయ కుటుంబం నుండి వచ్చాననీ, ఈ ఆరోపణలు వింటే నవ్వోస్తుందనీ అన్నది. తీరా తన వరుడు విడాకులిచ్చాక కిమ్మంటే ఒట్టు. ఉత్తుత్తి ఆరోపణలకు, వ్యవహారం విడాకుల పత్రాల దాకా ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడేమంటారని మీడియా, పత్రికాముఖంగా ఆమెను ఆడగనైనా లేదు. సాటి అమ్మాయికి తన వరుడు చేసిన అన్యాయం గురించీ ఈమె కిమ్మనలేదు.

ఇంకా వాదన కొనసాగి ఉంటే - ‘ఆయేషా మాత్రం తక్కువ తిన్నదా?’ అని ఉండేదేమో! కెరీర్, ఇమేజ్, కరెన్సీ తప్ప.... విలువలూ, అనుభూతులూ లేవన్నది పక్కాగా నిరూపించుకున్నది.

ఇక ఈమె అభిమానులమంటూ మీడియా ప్రచారించిన వారి వాదనల వాటా:

ఆమె ఇష్టం అమెది. ఆమె ఎవరిని వివాహం చేసుకుంటుంది అన్నది అమె వ్యక్తిగత జీవితం. దాని మీద వాదనలూ, వివాదాలూ అనవసరం - అట.

ఈ అమ్మాయి సాధారణ జీవితం గల అమ్మాయి అయితే, అది సరైన వాదనే. కానీ ఈమె ప్రజల సొమ్ముతో భూమూలూ, నగదు బహుమతులూ పొందిన క్రీడాకారిణి. ప్రజల మీద, ఈ గడ్డ మీద వ్యాపారాలూ చేసుకునే కంపెనీలు స్పాన్సర్ చేయగా, అంతర్జాతీయ పోటీలకు విమానాల మీద రివ్వున రివ్వున, గిర్రుగిర్రున తిరిగిన అమ్మాయి.

అలాంటి వ్యక్తికి దేశం పట్ల బాధ్యత లేదా? ప్రజల అనుభూతులని గుర్తించాల్సిన అవసరం లేదా? వరుస బాంబు పేలుళ్ళ దగ్గరి నుండి, ముంబై ముట్టడుల దాకా, ప్రజల ప్రాణాలను హరించిన పాకిస్తాన్ పట్ల ప్రజల మనోభావాలను పట్టించుకోవాల్సిన పని లేదా?

కసబ్ ల ఎగతాళిల పట్ల భారత ప్రభుత్వం కూల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది పాక్ అనుకూల ప్రభుత్వం. కాబట్టే - భారత ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుల వారూ కూర్చొని, అంతర్జాతీయ మీడియా ఎదుట, ‘ఒక్కడు, ఒకే ఒక్కడు’ లాగా డేవిడ్ కోల్మన్ హెడ్లీని, భారత్ పై ఉగ్రవాదుల దాడులన్నిటికీ బాధ్యుణ్ణి చేసి, సూపర్ డూపర్ హీరో/విలన్ ని చేసి, పాకిస్తాన్ ని విజయవంతంగా అమాయకురాలిని చేయ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

కానీ జైలులో కబాబ్ లూ, బిరియానీలు తింటూ, కసబ్ చేస్తున్న ఎగతాళిని సామాన్య భారతీయులు జీర్ణించుకునే స్థితిలో లేరు. ఇవి కూడా పట్టలేదా పాకిస్తాన్ ఆటగాడి మనసు దోచుకున్న క్రీడాకారిణికి? పైగా ఈ పెళ్ళి చేసుకున్న వేళ ‘సరిహద్దులు చెరిగాయనీ’ ఈనాడు, ప్రేమగీతికలు ఆలపించింది.

ఈ విధంగా, అందరి వ్యక్తిత్వాలూ బహిర్గతమైన ఈ విషయంలో కొసమెరుపు ఏమిటంటే - ఏప్రియల్ 6 వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత, సానియా - షోయబ్ ల వివాహ వ్యవహారం గురించీ, ఆయేషా సిద్దిఖీతో షోయబ్ విడాకుల వివాదం గురించీ, సౌదీ - పాకిస్తాన్ - దుబాయ్ - పాతబస్తీల మధ్య నడుస్తున్న గూఢచర్యం గురించీ, ‘జడ టపాకాయ’ ప్రచురించాము. ఆ రోజు మంగళ వారం.

ఆ మంగళ వారం రాత్రంతా కూర్చొని, రెండు కుటుంబాలతో చర్చలు జరిపి, ‘ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న విషయాలు పట్టించుకోకుండా, దేశం పరువు కోసం, ఇస్లాం మతం పరువు కోసం, రెండు కుటుంబాలకు రాజీ చేశామని’ మధ్యవర్తులు చెప్పారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల కల్లా, తలాక్ నామా మీద సంతకం పెట్టేసాడు షోయబ్. తెర మీద పదిహేను వేలు ఇవ్వబడింది. తెర వెనుక పదిహేను కోట్లు ఇచ్చాడని మాట. ఆ విషయం మీడియాకే తెలియాలి.

అలాగే.... ఏప్రియల్ 12 వ తేదీన, ‘అమ్మఒడి టపా’లో, వ్యక్తులలో ఎవరు ఎవరికి అలియాసో చెబుతాను అని వ్రాసాను. ఆ రోజు ఉదయం కూడా ఈనాడులో, సానియా పెళ్ళి చీర రంగులు, వాటి మీద బంగారు డిజైను, వంటకాలు, బిరియానీలు, డిజర్ట్ లూ గట్రలతో ఘనమైన పెళ్ళి విందు అంటూ వ్రాసింది. అయితే మధ్యాహ్నం ఒంటిగంటకల్లా తల్లి పాతికేళ్ళ నాడు కట్టుకున్న ఎర్ర చీర ధరించి, సానియా పెళ్ళి చేసేసుకుంది. తల్లి పెళ్ళి చీర ధరించటం సాంప్రదాయమయితే ఇంకో చీర ఎందుకు డిజైన్ చేయించినట్లు? అలాగే ‘ఎర్ర చీర’ గురించి మీడియా విపరీత ప్రచారం కూడా చేసింది. భద్రతా కారణాలతో, ఫత్వా భయాలతో పెళ్ళి వెంటనే జరిగిందట.

అసలు 15 నే పెళ్ళి అని ఎక్కడా కమిట్ కాలేదని కూడా ఓ మాట బయటికి వచ్చింది. అలియాస్ ల గురించి వ్రాస్తాననగానే, నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు వేగంగా రియాక్ట్ అయిపోయారు. లేకపోతే ‘తెలంగాణా షురూ’ ప్రకటన తర్వాత, ఎలాగైతే విషయం చల్లార్చటానికి తల ప్రాణం తోక కొచ్చిందో, అలాగే ఇది కూడా ఎక్కడికో పోతుంది మరి! అయినా గానీ దుబాయ్ గొడవ ఐపిఎల్ రూపేణా చుట్టుకుంది. కాబట్టే హడావుడిగా ‘షోయబ్ హైదరాబాద్’ లోనే సెటిల్ అవుతాడట అన్న వార్తను ముందుగా లీక్ చేస్తున్నారు. అవసరం అయితే ఈ వార్తే నిజం అంటారు. లేకపోతే పుకారని కొట్టిపారేయవచ్చు.

అసలుకే మీడియా కింగ్ అయిన రామోజీరావు, స్వయంగా పూనుకొని చేస్తున్న ప్రచారంతో నడుస్తున్న పెళ్ళి వ్యవహారం! పెళ్ళి చీర రంగులతో సహా.... పెళ్ళి వేదిక, స్థలం, తేదీల మీద, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న బెట్టింగుతో సహా.... ఒక్క క్షణంలో మలుపు తిరిగి, గోరింటాకు పండగలూ, సంగీత్ చిందులూ జరగకుండానే, ముందు పెళ్ళి తర్వాతే ఇవన్నీ అన్నట్లుగా, అర్జంటుగా జరిగి పోయింది.

‘ఇప్పటికీ రోజుకో మలుపు తిరుగుతోంది. మరింకా ఏమేమి జరుగుతాయో, ఏ విధంగా సాగుతుందో, ఎందుకొచ్చిన గొడవ?’ అనుకుని హడావుడిగా, పెళ్ళి నిర్వహించమన్న ఆసైన్ మెంట్ ని.... సదరు సెలబ్రిటీలూ, వాళ్ళ కుటుంబసభ్యులూ మారుమాట్లాడకుండా నిర్వహించారు. పెళ్ళిళ్ళే వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా, వచ్చిన అసైన్ మెంట్ ప్రకారం చేసుకోవాల్సిందే! అంతగా స్వేచ్ఛని అమ్ముకుంటేనే, సెలబ్రిటీల స్థాయికి చేరగలరు మరి!

ఇది ఎలాంటిదంటే - ఇంట కోడినో, మేకనో బలిష్టంగా మేపుతాము చూడండి. అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునేందుకే జాగ్రత్తగా సాకేది, అలాగన్న మాట! అందుకు చిరంజీవి అయినా, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అయినా మినహాయింపు కాదు. సానియా షోయబ్ ల వివాహానికి పాక్ నుండి అతడి జట్టు సభ్యులలో ఒకరు మాత్రమే హాజరు కాగా, భారత్ లో సానియా ఆహ్వానించిన అమితాబ్, సచిన్, భూపతి, లారాదత్తా, లియాండార్ పేస్, సల్మాన్ ఖాన్, అతడి సోదరుడు అర్ఫాజ్ ఖాన్, షాహిద్ కపూర్ గట్రా సెలబ్రిటీలలో అత్యధికులు ఫోన్ లో శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకున్నారు. అదీ సెలబ్రిటీల గూఢచర్య అవగాహన! లౌక్యపు పరిభాషలో ‘ఎందుటి వాళ్ళకి నడవటం లేదంటే ఎందుకొచ్చిందనుకొనే’ ముందు జాగ్రత్త!

ఇక ఇందులో నకిలీ కణిక వ్యవస్థ, అందులోణి కీలక వ్యక్తి రామోజీరావుకీ, నెం.5 వర్గానికీ మధ్య నడిచిన సంభాషణ ఏమిటంటే -

నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, ’సానియా ఇంట్లో వరుడు’ అంటూ - సోనియానే ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసుని ప్రకటిస్తుంది. ఆ సంఘటనని తమకి అనుకూలంగా మలచుకుంటాము అని, నెం.5 వర్గానికి చెప్పజూసారు. [వీలైతే సదరు ప్రకటనకి ముందుగానో, వీలుగాకపోతే కనీసం ప్రకటన తర్వాతైనా, ఈ కేసునుండి సోనియా మినహాయింపు పొందితే తిరిగి గూఢచర్యపు పట్టు సంపాదించవచ్చు - అన్నది వాళ్ళ ప్రయత్నమూ, పెనుగులాట!]

దానికి నెం.5 వర్గం ఇచ్చిన జవాబు ఏమిటంటే - "ప్రకటన చేసి చూడు. నీ చట్టం [పెళ్ళికొడుకు] లో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎత్తి చూపుతాం. ఆ ప్రకటన, ప్రకరణాలలో నుండే.... ఎవరి వ్యక్తిత్వం ఏమిటో, కుట్రలో ఎవరి వాటా ఏమిటో బహిర్గత పరుస్తాం. ఈ దేశపు అట్టడుగు నిరక్ష రాస్య సామాన్యుడికి కూడా అర్ధమయ్యేంతగా నిరూపిస్తాం. స్వయంగా నువ్వే[రామోజీరావు] కేసుని ప్రకటించుకోవటం తప్ప మార్గాంతరం లేదు".

అందుకే ఎవరికి ఎవరు అలియాసో చెబుతామనే సరికే అప్పటి వరకూ సంచలన సస్పెన్సుగా నడుపుతున్న వ్యవహారానికి ఠక్కున పుల్ స్టాప్ పెట్టి పెళ్ళి జరిపించేసుకున్నారు.

సోనియాకు సానియాని అలియాస్ చేసుకున్నందుకు, సదరు సానియా దెబ్బలమ్మాయిగా ఉపయోగ పడిందన్న మాట.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu