విదేశీయత కారణంగా సోనియాని అమ్మగానూ, మా జట్టుగానూ [అంటే నెం.5 వర్గంలోని వ్యక్తిగానూ] అంగీకరించకపోవటం.... సంకుచిత జాతీయ వాదమట. జాతి భేదం పాటించకుండా అమ్మతనాన్ని ఆమెలో గుర్తించాలట.

అసలు ఆ ఇటలీ మహా తల్లికి కన్నబిడ్డల మీదా మమకారం లేదు, కట్టుకున్న వాడి మీదా మమకారం లేదు. కట్టుకున్న వాణ్ణి చంపిన కుట్రలో భాగస్వామి అయిన నళినికి క్షమాభిక్ష పెట్టే విశాల హృదయ! ఆ కుట్రదారుల మీద ఫిర్యాదు ఇచ్చినందుకు మమ్మల్నీ, దాన్ని పట్టించుకుని పనిచేసినందుకు పీవీజీ నీ వేధించిన అతి విశాల హృదయ కూడా! అంతే కాదు, కన్న కొడుకుకి 40 ఏళ్ళు వచ్చినా.... పెళ్ళి చేయాలని కూడా తలచని ప్రేమైక మాతృమూర్తి.

"కోడలినంటూ అత్తగారింటి కొచ్చి ఇందిరాగాంధీకి కొరివి అయిన తన కర్మల సువర్ణముఖి, ఎక్కడ తాను అనుభవించాల్సి వస్తుందోనని.... సాక్షాత్తూ కన్న కొడుకు బ్రతుకునే మోడువార్చిన ఈ మహిళకి మాతృప్రేమ కూడా తెలుసా?" అని మేము సైటెర్లు వేస్తుంటాము. అమ్మఒడిలో ఒక టపాలో ఇదే ప్రధానంగా వ్రాసాము కూడా!

కుటుంబ బంధాల పట్ల నిజాయితీ, నిబద్దతా లేని వ్యక్తికి, పుట్టిన దేశం మీదే నిజాయితీ నిబద్దత లుండవు. ఇక మెట్టిన దేశం మీద ఏముంటుంది? నిలువెత్తు స్వార్ధమూ, అరిషడ్వర్గాలూ, అహంకారమూ తప్ప! అదే మా కేసుతో, ఆమె తన అరిషడ్వర్గాలూ ఏపాటివో, ఈ దేశం పట్ల నిబద్దత ఏపాటిదో, తన భర్త హత్య పట్ల నిబద్దత ఏమిటో నిరూపించుకున్నది.

ఇక మమ్మల్ని వేధించిన ఎస్ ఐ, సిఐ ల దగ్గర నుండి.... అటెండర్లూ, క్లర్కుల దాకా అందరికీ ప్రమోషన్లు ఇచ్చేస్తూ వై.యస్., సోనియాలు హెడ్ మాష్టార్లు [Chief Coach] అయ్యారు. శ్రీశైలంలో మమ్మల్ని వేధించిన వారిందరికీ ప్రమోషన్లు వచ్చాయి. పైసల గలగలలూ విన్పించాయి. వాళ్ళంతా మాకు చిన్న మాష్టార్లు [coach]అన్న మాట.

ఒక్కమాటలో చెప్పాలంటే - సూర్యాపేటలో మమ్మల్ని వేధించిన మా ఇంటి ఓనరు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, శ్రీశైలం ఈవో, డిఈవో, అటెండర్లు..... అందరూ మాకు కోచ్ లే! ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తే.... ప్రైవేటు వ్యక్తులకు వ్యాపార గట్రా అవకాశాలతో పైకం వచ్చింది.

ఇంతగా వాళ్ళంతా మాకు శిక్షణ ఇస్తుంటే, మేం వాళ్ళ మీద ఫిర్యాదు చేయటం తప్పని పదేపదే చెప్పబడింది. ఈ బొమ్మని తిరగేస్తే.... ఇదీ మా "పావే! వీళ్ళూ నా మనుష్యులే! కాబట్టే నీ ఫిర్యాదుకి స్పందించరు. వేధింపూ ఆపరు. కాబట్టే పోరాటం ఆపి లొంగిపో" అని ఘంటాపధంగా చెబుతూ తమని తామే నిరూపించుకున్నారు.

అలా ఫిర్యాదుల పెట్టవద్దని చెప్పడానికి.... మాకు "బోర్డు మీద పావులుంటేనే చదరంగపు ఆటలో మజా" అని చెప్పబడేది. పదే పదే చెప్పబడిన ఈ డైలాగుకి మేము ఏ జవాబూ చెప్పేవాళ్ళం కాదు. ఓసారి మా పాప చదరంగం ఆడుతుండగా ఇదే చెప్పబడితే, ఆమె "ఎదుటి వాళ్ళ పావుని వేసేస్తే.... వాళ్ళు గిలగిల లాడుతారు కదా ఆంటీ! అది ఇంకా మజా కదా!" అంది. అంతే! ఇక మళ్ళీ ఆ డైలాగు వినబడలేదు. బహుశః మా అభిప్రాయాన్ని మా పాప అనేసి ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. ఇలాంటి వాటితో మాకు విషయం బాగానే నిర్దారణ అవుతూ ఉంటుంది.

ఇంకా ’అద్దం’ కధలు కూడా చెప్పబడ్డాయి.

అద్దం కథ:

అనగా అనగా.....

ఒక ఊరిలో ఇద్దరు యువకులు ఉండేవాళ్ళు. ఒకడి పేరు రామూ. మరొకడి పేరూ సోమూ! రామూ అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. అందరి మంచీ కోరేవాడు. సోమూ ఎవరిని చూసినా ఈర్ష్య పడేవాడు. ఎప్పుడూ ధూమ ధూమ లాడుతూ ఉండేవాడు.

ఊళ్ళో అందరూ రామూని అభిమానించేవాళ్ళు. సోమూని చూడగానే తలతిప్పుకొనిపోయే వాళ్ళు. ప్రవేశ రుసుము కట్టి, ఓ అద్దాల మండపం లోపలికి వెళ్తే, చుట్టూ అమర్చి ఉన్న అద్దాలలో మనబొమ్మ రకరకాల కోణాలలో కనబడుతూ గమ్మత్తుగా ఉందని చూచి వచ్చిన వాళ్ళు చెప్పగా ఇద్దరికీ దాన్ని చూడాలన్న కుతుహలం కలిగింది. ఓ రోజు రామూ సోమూలిద్దరూ ఆ అద్దాల మండపాన్ని చూడటానికి వెళ్ళారు.

ఇద్దరూ టిక్కెట్టు కొనుక్కొని లోపలికి వెళ్ళారు. చుట్టూ ఎన్నో అద్దాలు. వాటిల్లో తన బొమ్మే వంద బొమ్మలుగా కనబడుతోంది. రామూ దాన్ని చూచి చిరునవ్వు నవ్వాడు. అన్నీ అద్దాలలో బొమ్మలూ తనని చూచి నవ్వుతున్నాయి. రామూకి చాలా ఆనందం కలిగింది.

సోమూకీ చుట్టూ ఉన్న అద్దాల్లో తన బొమ్మలే కన్పించాయి. అలవాటుగా సోమూ దాన్ని వెక్కిరించాడు. అవీ వెక్కిరించాయి. కనుబొమ్మలు ఎగరేసి గుడ్లురిమాడు. వంద బొమ్మలూ గుడ్లురిమాయి. కోపంతో చెయ్యెత్తి కొడతానని సైగ చేసాడు. అవీ అంతే!

అది చూసి రామూ "చూశావా? మనల్ని బట్టే మన చుట్టూ సమాజం ఉంటుంది. సమాజం అద్దం వంటిది. అందులో కనబడేది మన బొమ్మే! మనం మంచిగా ఉంటే, సమాజంలో అందరూ మనతో మంచిగా ఉంటారు. మనం చెడ్దగా ఉంటే ఎవరూ మనతో మంచిగా ఉండరు" అన్నాడు.

దాంతో సోమూ బుద్ది తెచ్చుకొని, రామూలాగే తానూ అందరితో మంచిగా ప్రవర్తించటం నేర్చుకున్నాడు.

ఇదీ కథ!

నిజానికి ఇది చక్కని నీతి కథ. పిల్లలకి చెబితే, బాల్యంలోనే సత్ర్పవర్తనని నేర్చుకోగల మంచి కథ.

అయితే... ఈ కథలోని అనువర్తనని, శ్రీశైలంలో స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకొన్న మా పూర్వవిద్యార్ధి ఒకరు, మాకు పదే పదే చెప్పటం జరిగింది. ఈ పోలిక నుండి అనువర్తించుకొమ్మన్నది ఏమిటంటే - ‘మీ చుట్టూ ఉన్న వారితో.... వాళ్ళేం చేసినా మీరు వివాదపడవద్దు. అందరితో మంచిగా ఉండండి. మీరు వివాద పడితే, మీ చుట్టూ ఉన్నవాళ్ళకి మీ మీద కోపావేశాలు పెరుగుతాయి. సమాజం అన్నది మన మనఃస్థితిని ప్రతిబింబిస్తుంది. అది అద్దం వంటిది. కాబట్టి మనం మన ప్రవర్తనను సమాజంలో చూసుకోవచ్చు’ అని చెప్పాడు.

దానికి అనుగుణంగా చుట్టుప్రక్కల వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే - కొందరు మమ్మల్ని డబ్బు సాయం అడుగుతారు. మరికొందరు స్కూల్ లో ఉచిత సీట్లు అడుగుతారు. మరికొందరు దైవదర్శనం అప్పుడు దర్శనం చేయించాము కాబట్టి ఉచితంగా చదువు చెప్పాలంటారు. ఇంకొందరు నేను ఫలానా వాడికి భయపడుతున్నాను, నువ్వూ భయపడు అంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళ డిమాండ్లు మా మీద రుద్దటానికి ప్రయత్నిస్తారు. మేము సున్నితంగా చెప్పి తిరస్కరించమా.... అంతే! వేధింపు ప్రారంభం.

ఇంకా కొందరుంటారు. వీళ్ళు చీరా, చికెన్ లు పెట్టి "చూశావా? నేను నీతో ఎంత స్నేహంగా ఉన్నానో. కాబట్టి నువ్వు అరమరికలు లేకుండా నీ జీవిత విశేషాలన్నీ చెప్పు" అన్నది వాళ్ళ డిమాండ్. సరే అప్పటికి మా స్కూలు విశేషాలో, వేధింపు విశేషాలో చెప్పినా సరే! వాళ్ళకి అసంతృప్తి! వాళ్ళు చీరా, చికెనూ పెట్టారు కదా అని మేము, అంతకంటే ఖరీదైన చీర పెట్టిన సరే! వాళ్ళకి అసంతృప్తే! దాంతో క్రమంగా సంబంధాలు క్షీణిస్తాయి.

ఇంకొంతమంది.... వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటారు. వాళ్ళ జీవిత విశేషాలు చెబుతారు. వాటిలోని సాధక బాధకాలు మాట్లాడినా, వాళ్ళకి సంతృప్తి కలగదు. వాళ్ళ డిమాండ్ ఎంతసేపూ మా గురించి చెప్పాలి. మేము చెప్పే యధలాప విషయాలు వాళ్ళకి ఆసక్తి కాదు. పోనీ ఎవరి హద్దుల్లో వాళ్ళం ఉందామన్నా ఊరుకోరు. అదీ.... సోమూ లాగా సమాజంతో చెడ్డగా ప్రవర్తించటమే!

ఎదుటి వాడు నీళ్ళు రానివ్వకపోయినా, కరెంటు గొడవలు పెట్టినా, ఏ ఫిర్యాదులూ పెట్టకూడదు. అసలు వాళ్ళు మనకి నెగిటివ్ చేస్తున్నారనే అనుకోకూడదు. బాపూజీలాగా ప్రేమతో వాళ్ళ మనస్సులు గెలుచుకోవాలి. వెరసి మా పీక పిసుకుతున్నా ఇది స్ట్రాటజీ అనుకొని భరించాలన్నమాట.

వాస్తవం చెప్పాలంటే - మన పెద్దలు ’ నోరు మంచిదైతే ఊరు మంచిది’ అంటారు. మామూలుగా ఎవరి జీవితంలోనైనా అంతే! అయితే గూఢచర్యం గురిపెట్టిన వ్యక్తులకి నోరు మంచిదైనా, చెడ్డదైనా... ఏది నడవాలో అదే నడుస్తుంది. గూఢచర్య గ్రిప్ ఉన్నవాడు, ఆ గ్రిప్ లేనివాడి మీద ప్రయోగించే తంత్రం ఇది. మామూలుగా స్విచ్ వేస్తే దీపం వెలుగుతుంది. తీస్తే ఆరుతుంది. గూఢచర్యంలో గ్రిప్ లేని వ్యక్తి, స్విచ్ వేసినా తీసినా, దాంతో సంబంధం లేకుండానే, గూఢచర్య గ్రిప్ ఉన్నవాడు దీపం వెలిగించదలుచుకుంటే వెలగటం, లేదంటే ఆరటం జరుగుతుంది.

దీనినే - గూఢచర్యపట్టు లేని వ్యక్తి ఏం చేసినా Dis advantage అవ్వటంగా నా గత టపాలలో వ్రాసాను.

ఇదంతా మాకు అవగాహనలో ఉన్నందున, సదరు మా పూర్వవిద్యార్ధి అద్దం కథలోని అనువర్తనని మూడునాలుగుసార్లు చెప్పాక, మేము - "చూడు తండ్రీ! అంత సీన్ సమాజానికి లేదు. ఎందుకంటే అద్దం సమాంతర దర్పణం గాక కుంభాకారంగానో పుటాకారం గానో ఉందనుకో! మన బొమ్మ అష్టావక్రలా కన్పిస్తుంది. అంతమాత్రం చేత మనం వంకరగా ఉన్నట్లా? అలాగే అద్దం ముక్కలూ చెక్కలై ఉందనుకో! మన బొమ్మ కూడా కకావికలై ఉంటుంది. అద్దం మీద మరకలూ మచ్చలూ ఉంటే, మన బొమ్మా అలాగే కన్పిస్తుంది. అద్దం వెనుక రంగుపూత పోయిందంటే, మన బొమ్మ మసక బారి కన్పిస్తుంది లేదా కన్నో ముక్కో కనబడకుండా పోతుంది. అంతమాత్రం చేత మన కన్నో ముక్కో లేకుండాపోవు కదా! అంచేత ఇలాంటి పోలికలన్నీ చెల్లవు. వదిలెయ్" అని చెప్పాము. ఇక అతడు మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు.

ఇది తర్కించుకుంటూ మేము ‘ఓ.పి.నయ్యర్ తీసిన భగవద్గీత సంస్కృత సినిమాలో.... ముక్తి కావాలి అని కోరిన నరుణ్ణి, నారాయణుడు, నదీ ప్రవాహాన్ని చూపి, "అయితే ఈ నీటికి ఎదురీదు" అంటాడు. సమాజంలో అందరూ ఓ వైపు పరుగెడుతుంటే మనం మరో వైపు ఉన్నంత మాత్రానా ముంచుకుపోయేది ఏదీ లేదు’ అనుకున్నాము.

ఇక.... పై అద్దం కథని ఈనాడు ఆదివారపు బాలవినోదం లోనో, జిల్లా ఎడిషన్లో వేసే రోజువారీ హాయ్ బుజ్జీ లోనో అప్పుడప్పుడూ వేస్తూంటుంది. ఈమధ్య కాలంలో [ఈ టపాల మాలిక మొదలు పెట్టాకే] మరోసారి ఆ కథని ప్రచురించి "అందరితో మంచిగా ఉండాలి. ఎవరి గురించీ చెడుగా అనకు" అంటూ గుర్తు చేసింది కూడా!

ఇక పోతే, అలియాస్ విన్యాసాలలో మరొకటి:

కొందరిపేర్లలో అక్షరాలను చిన్న చిన్న మార్పులు చేసుకొని అలియాస్ గా అర్ధం చేసుకోవాలనీ చెప్పబడింది. సోనియాలోని ‘సో’ని ‘సా’ గా మారిస్తే.... సరి! కాబట్టే ఈ టెన్నిస్ క్రీడాకారిణి ఆడకపోయినా, ఓడిపోయినా అంతర్జాతీయ హిట్ బ్రాండెడ్ సెలబ్రిటీ అయిపోయింది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని ఏజంట్లు, ఒకరిని ఒకరు పొగుడుకొని గొప్పవారుగా, ప్రముఖులుగా ఎదిగిపోతుంటారు. మీడియా దీన్నంతటినీ [అంటే ఒకరు మరొకరు పొగడటాన్ని] తన బాణీలో ప్రచారిస్తుంది. సినిమారంగంలోనూ, కార్పోరేట్ రాజకీయక్రీడాది రంగాలలో ఇది అమలు జరపబడుతూ ఉంటుంది.

ఇటీవల, ఒంటిమీద నూలుపోగు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చిన, టెన్నిస్ క్రీడాకారిణిలు విలియమ్స్ సిస్టర్స్ లో ఒకరితో సానియా ఒక మ్యాచ్ ఆడింది. మామూలుగా ఓడింది. కానీ విలియమ్స్ అమ్మాణి, ఈ హైదరాబాదీ అమ్మాయిని పొగిడేసి సెలబ్రిటీ ఇమేజ్ ని పెంచేసింది. అలా.... అలా.... సానియా మీడియాలో అతిముఖ్యమైన వ్యక్తి అయిపోయింది.

ఆ సోనియా గురించీ, ఈ సానియా గురించీ మా అభిప్రాయం ఏమిటో బ్లాగు తెరిచే వరకూ రామోజీరావుకు తెలియదు.

ఇక బ్లాగు ద్వారా తెరిచినా.... ఏ వ్యూహమైనా ప్రారంభించాక, సాగుతుంది. ముగింపు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు చేతిలోనూ ఉండదు. నెం.5 వర్గపు ఆట కూడా అందులో నడుస్తుంది మరీ!

ఇందుకు దృష్టాంతమా అన్నట్లు - ఏప్రియల్ 4 వ తేదీన ‘సానియా ఇంట్లో వరుడు’ అని ఈనాడు, తొలిపేజీలో తొలి హెడ్డింగు వ్రాసింది. అంటే "సోనియా ఇంట్లో ’చట్టం’ పెళ్ళి కొడుకై ఉన్నది. ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు ప్రకటించే సమయం [తెర తీసే వేళన్న మాట] వచ్చింది. కాబట్టి ‘ఢిల్లీకి రా’ అని చెప్పబడింది. ఏప్రియల్ 5 న ‘మళ్ళీ ఢిల్లీనే’ అంటూ క్రీడా వార్త వ్రాయబడింది. క్రికెట్టుకు సంబంధించి మరో హెడ్డింగ్ పెట్టగల అవకాశం ఉన్నా ‘మళ్ళీ ఢిల్లీనే’ అని పెట్టబడింది. ఇతరులు చదివినా పట్టించుకోరు. మళ్ళీ ఢిల్లీ గెలిచింది కాబోలనో మరొకటనో అనుకుంటారు. మా కయితే ఆ రోజూ అది ఒక్కటే వార్త కాదు. ప్రతీరోజూ అలాంటివే చాలా..... సందర్భానికీ, కొనసాగింపుకీ [Contunity] కి సరిపోలుతూ ఉంటుంది.

అయితే సానియా ని, సోనియా కి అలియాస్ చేసుకున్నంత మాత్రాన.... అన్నీ సరైపోతాయా? అందులోంచి నెం.5 వర్గం, ఎవరి బహిర్గతాలు వాళ్ళనీ, ఎవరి సువర్ణముఖి వాళ్ళకీ వడ్డిస్తోంది. అసలుకే నకిలీ కణిక అనువంశీయులకి జంగ్ లన్నా, మీర్జాలన్నా ప్రేమ పిసరంత ఎక్కువ. [హైదరాబాదీ అందాల సుందరి దియా మీర్జా సాక్షిగా]

దాంతో సానియా పెళ్ళి అవ్వాల్సినంత ’రగడ’అయ్యింది. దీనికి వెనకున్న కథ ఏమిటంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

సోనియా, సానియా ల పోలిక నాకు కూడా అర్ధమయ్యింది. సానియ పెళ్ళి రోజున ఆమె ఎర్రచీర కట్టుకుంటుందని ఈ-టీవి ప్రచారం చేసింది .ఆ తరువాతే మిగతా చానెళ్ళు ఆ విషయాన్ని ప్రచారం చేయడం మొదలెట్టాయి . ఆ చీర తన తల్లిదని , దానిని ఆమె పాతికేళ్ళ క్రితం కట్టుకుందని. చిత్రమేంటంతే ఇందిరా గాంధీ, సోనియా, ప్రియాంక లు కూడా ఇలానే వంశపారంపర్యంగా వచ్చే ఎర్ర చీరను కట్టుకుని పెళ్ళి చేసుకున్నారు .

ఈ టీవీ ప్రచారం సంగతి నాకు తెలియదండి. సమాచారం ఇచ్చారు. నెనర్లు!

baaboy..Hatsoff to your analysis and patience.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu