తెలంగాణా ఏర్పాటు వెనుకనున్న అసలు కథ అనే లేబుల్ లో వ్రాసిన తొలి టపాలో....

తెలంగాణా ఉద్యమం - దాని పర్యవసానంగా చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాల వెనుక గల అసలు కారణాలని పరిశీలించాలంటే - రెండు అంశాలని పరిశీలించాలి. ఒకటి రాజకీయ నేపధ్యం. ఇందుకు దాదాపు 10 నెలల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అంటే 2009 మే ఎన్నికల ముందు నాటికి. ఇక రెండోది గూఢచర్య నేపధ్యం. దీన్ని పరిశీలించాలంటే దాదాపు పదేళ్ళ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. - అని వ్రాసాను.

పదినెలల ఫ్లాష్ బ్యాక్ ను ఆ టపాలలో వివరించాను. ఇక, పదేళ్ళ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్త్తే.... 2001 లో తెదేపా నుండి కేసీఆర్ బయటికి వెళ్ళిపోయాడు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నెపంతో తెరాస పార్టీ పెట్టాడు. నాటి నుండి తెలంగాణ ఉద్యమం పేరుతో అతడి వైఖరీ, వ్యవహారశైలి, నోటి దురుసు, భాషా... అనేక మలుపులతో అందరికీ తెలిసిందే.

2004 లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ కూటమి గెలవటంతో, రెండుచోట్లా తెరాస, మంత్రి పదవులు తీసుకుంది. కేంద్రంలో కేసీఆర్, పోర్ట్ పోలియో లేని మంత్రిగా ఆరుదైన కీర్తి ఆర్జించాడు. 2005 లో అక్టోబరులో మేము ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ తాలూకూ తొలి ఫిర్యాదుని ప్రధాని మన్మోహన్ సింగ్ కు, స్వయంగా పి.ఎం.ఓ.లో దాఖలు చేసాము. అందులో, పీవీజీకి 1992 లో ఇచ్చిన ఫిర్యాదుతో సహా నాటి నుండి 2005 వరకు జరిగిన సంఘటనలన్నీ [మా జీవితాలలోనూ, దేశంలోనూ] క్లుప్తంగా ఉటంకించాను.

2005 లో ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఫిర్యాదు ఇచ్చాక, గతంలో జరిగిన సంఘటనలనీ, వార్తాంశాలనీ ఫిట్ చేసుకున్నాము. అప్పుడే పీవీజీ రచించిన ’లోపలి మనిషి’ కూడా చదివాను. క్రమంగా అన్నిటిని విశ్లేషించుకుంటూ అవగాహన పెంచుకున్నాము. తదుపరి కాలంలో ఈనాడు రామోజీరావు రెండు చదరంగపు బోర్డుల ఐడెంటికల్ లో భాగంగా, ’తెలంగాణా రాష్ట్ర వేర్పాటు’ని పీవీజీకీ, రామోజీరావు కేసుకీ అలియాస్ చేయటం, మమ్మల్ని కేసీఆర్ కి అలియాస్ చేయటం అర్ధం అయ్యింది.

పీవీజీ మన రాష్ట్రముఖ్యమంత్రిగా ఉండగా.... తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్రా ఉద్యమం చెలరేగి.... ఆయన రాష్ట్రం నుండి కేంద్ర రాజకీయాలలోకి వెళ్ళిపోయాడు. ఆ పోలికతో నేటి ’తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ’ ప్రకటన, పీవీజీకి 1992 ఫిర్యాదు ఇవ్వటంతో ప్రారంభమైన ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు ప్రకటనకు అలియాస్ అయ్యింది.

2006, అక్టోబరు తరువాత, 2006, 2007 లలో కొనసాగిన మా ఫిర్యాదుల పరంపరలలో మేము, వారూ వీరని లేకుండా అందరినీ నిందిస్తున్నామనీ, వై.యస్., సోనియాలు [మాక్రింది అంతస్తులోని అటెండర్లతో సహా అందరూ] మాకు కోచ్ లయి ఉండగా వాళ్ళిస్తున్న శిక్షణని పట్టించుకోకుండా ఫిర్యాదులకి ఎక్కిస్తున్నామనీ, ఆ విధంగా అందరినీ దుర్భాషలాడుతున్నామనీ, అందుచేత కేసీఆర్ వంటి నోటు దురుసు మనిషి మాకు అలియాస్ చేసారు.[అప్పటికే చంద్రబాబు నాయుడి మీద ఫిర్యాదులు పెట్టటం అయిపోయింది.]

నిజానికీ 2001 లో కేసీఆర్ తెదేపా నుండి బయటికి వచ్చినప్పుడు గానీ, తెరాసా స్థాపించిన్నప్పుడు గానీ, అప్పటి అసైన్ మెంట్లని నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అప్పటి పరిస్థితుల దృష్టితోనూ అవసరాల దృష్టితోనూ చూసారు. తమ అరిషడ్వర్గాలకు తగిన భాష్యాలు చెప్పుకున్నారు. అంతే తప్ప, అవి ఆత్మహత్య సదృశ్య అసైన్ మెంట్లని అనుకోలేదు. అప్పటికి పీవీజీ పదవి దిగిపోయినా గూఢచర్యపరంగా తమకు ఎదురు దెబ్బలు తగలడం అనే మూడో దశలో ఉన్నారయ్యే!

తరువాత కాలంలో కేసీఆర్, చంద్రబాబునాయుడికి జాతర బొమ్మ జంట పీతగా పరిణిమించాడు. అంతేగాక సూర్యాపేటలో మా ఇంటి ఓనరూ తదితరుల చేత మమ్మల్ని బూతులు తిట్టించిన చంద్రబాబునాయుడు.... కేసీఆర్ నుండీ, తెరాసా నుండీ దుర్గంధపూరితమైన దుర్భాషలని తన సువర్ణముఖిలో భాగంగా అందుకున్నాడు, అందుకుంటున్నాడు. అంతే తప్ప, వీసమంతైనా నైతికత లేనీ, మాట నిలకడలేని, ఏ విధమైన విలువలూ లేని కేసీఆర్ మాకు అలియాస్ ఎలా అవుతాడో రామోజీరావుకే తెలియాలి.

అయితే ఈ తర్కవితర్కాలన్నీ పట్టించుకోకుండా, రామోజీరావు అతడి సోదరీ తుల్య సోనియాలు, తమ అవసరాల వేగంలో తాముండి అసైన్ మెంట్లు నిర్వహించుకుంటూ పోయారు. 2009, మే ఎన్నికలకు ముందు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ - నవంబరు 29 న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చొవటం, డిసెంబరు 9 అర్ధరాత్రి సోనియా పుట్టినరోజు కానుకగా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ ప్రకటన చేయబడటానికి రాజకీయ కారణమైతే, ఇందులోని గూఢచర్య కారణం మరింత ఆసక్తికరమైనది!

ఈ ఉదంతానికి పైకారణం [over leaf reason] గా నడిచిన రాజకీయ చిత్రాన్ని ’తెలంగాణా ఏర్పాటు వెనుక ఉన్న అసలు కథ’ అనే మూడు టపాలలోనూ వివరంగా వ్రాసాను. ఇక గూఢచర్య కారణాలు - డిసెంబరు 8 న, కేసీఆర్ నిరాహార దీక్ష మీద, మీడియా రాజకీయ నాయకులు ముమ్ముర నాటకీయత అభినయిస్తుండగా.... ‘కేసీఆర్ ఆరోగ్య కారణాల రీత్యా ఖమ్మం ఆసుపత్రి నుండి నిమ్స్ కి మార్చినట్లుగా, హైదరాబాదు నిమ్స్ నుండి ఢిల్లీ ఎయిమ్స్ కు మారిస్తే ఎలా ఉంటుంది అని, అప్పుడు మీడియా ఎంచక్కా, ’ఢిల్లీకి మారిన సీను’ అని హెడ్డింగులు పెట్టుకోవచ్చును అని రాజకీయ నాయకులు హైదరాబాదు టూ ఢిల్లీ, ఢిల్లీ టూ హైదరాబాద్ ఎడాపెడా తిరుగుతారు కాబట్టి విమాన యాన సంస్థలకు ఇబ్బడిముబ్బడి వ్యాపారం నడుస్తుందని’ టపాకాయ పేల్చాం.

24 గంటలు దాటేసరికల్లా, సోనియా పుట్టిన రోజు కానుకగా చెప్పబడుతూ, చిదంబరం ‘తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ’ ప్రకటన చేసాడు. నెం.5 వర్గపు అవుట్ లెట్ మా చిరునామానే గనక, అది నెం.5 వర్గపు వాయిస్ గా గుర్తించి, నిజంగానే సీను హైదరాబాద్ నుండి ఢిల్లీ మారుతుందేమో, పరిస్థితులు అక్కడికే తోసుకోస్తాయేమో అనే భయోత్పాతం తోనూ....

దానిని నివారించాలనే ఆతృతతోనూ....

ఇదుగో ఈ క్షణమే ‘రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు కేసు’ ప్రకటన షురూ అని ఆ విధంగా చెప్పబడింది. ఆ తదుపరి రెండుమూడు రోజుల పాటు ఈనాడు, తన హెడ్డింగులతోనూ, వాణిజ్య ప్రకటనలతోనూ ’ఇదిగో సోనియా కేసు ప్రకటించనుంది. మీరు వెళ్ళి ఆమెతో adjoin అయిపోండి’ అని ఊదరబెట్టింది. తెర తీసే వేళకు పాత సినిమాల్లో లాగా శుభంకార్డు పడిఫోవాలి. పాత సినిమాల్లో శుభం కార్డు పడేటప్పటికి కథలోని పాత్రలన్నీ గతం అంతా మర్చిపోయి, అందరూ కలిసిపోయి, నవ్వులు చిందిస్తారు కదా! శుభంకార్డు అంటే అదన్న మాట.

ఇందుకు దృష్టాంతంగా - డిసెంబరు 4 న ఈనాడు తొలిపేజీలోనూ 2,3 పేజీలోనూ 'ఇక నా నెంబరు' అంటూ uninor మొబైల్ కంపెనీ పై. 29/నిముషానికి అంటూ ప్రకటించింది. అంటే ఇక నా నెంబరు 29 అని దాని అర్ధం. uninor కంపెనీ పెద్ద వాణిజ్య ప్రకటన రైలు బొమ్మతోనూ ఒక మోడల్ యువకుడితోనూ వచ్చింది. మేము ఢిల్లీ వెళ్ళాలంటే ఎక్కేది రైలే కదా! కేసీఆర్ నిరాహార దీక్ష Nov. 9 తేదీన ప్రారంభిస్తానని మొదట ప్రకటన చేసి, తరువాత దానిని చివరికి Nov. 29 వ తేదీన ప్రారంభించాడు.

పార్లమెంట్ లో ఇదే నంబరును[29] ఉపయోగిస్తూ, డిసెంబరు 10న భాజపా నేత ఎల్.కె.అద్వానీ "29వ రాష్ట్రం [తెలంగాణా] ఎప్పటిలోగా ఏర్పాడుతుందో" చెప్పాలని కోరాడు. ఇప్పటికి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కలుపుకుంటే, ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం 29 వది. 11 వ తేదీన ఈనాడు, మొదటి పేజీలో ’ఏకాభిప్రాయం తర్వాతే!’ అని పెద్ద అక్షరాలతో వ్రాసింది. అదే రోజు చివరి పేజీలో పుల్ పేజీ వాణిజ్య ప్రకటన, uninor కంపెనీది [నా నెంబరు 29] వచ్చింది.

ఆ రోజు అంతర్యామిలో చెప్పబడిన ’సమయ సిద్ది’శీర్షిక క్రింద "కొందరు చేయాల్సిన పనులు సకాలంలో, సరైన సమయంలో చెయ్యరు. అన్నీ తమ వశంలో ఉన్నప్పుడు అలక్ష్యం చేసి, తరువాత విచారిస్తారు" అంటూ మొదలు పెట్టి... చాలా చెప్పాడు. మిగిలిన హెడ్డింగులు, అంతర్యామి అన్నీ కలుపుకుంటే మాకు చెప్పింది, ఎప్పుడూ చెప్పే గోలే! అంటే సోనియా మీ జట్టు. అందరూ కలిసి ఏకాభిప్రాయానికి వస్తేనే కేసు ప్రకటన.

ఒకవైపు మా ఉద్యోగ, ఉపాధి మార్గాలు మూసేస్తూ, ఆర్ధిక మూలాలు నలిపేస్తూ.... మరో వైపు మాకు తెరిచి ఉన్న దారి అది ఒక్కటే అని చెప్పటం! ఇవి 2009 డిసెంబరులో చేసిన సర్కస్ ఫీట్లయితే, 2008 June, Julyలలో చేసిన సర్కస్ ఫీట్లు మరింత అకర్షణీయమైనవీ, ఆసక్తికరమైనవి.

అప్పుడు భారత ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం 123 ఒప్పందంగా ప్రచారింపబడింది. అప్పటికింకా మేము బ్లాగు తెరవలేదు. Coups On World అనే ఆంగ్ల బ్లాగులో నకిలీ కణిక వ్యవస్థ యొక్క కుట్రల గురించి, స్ట్రాటజీల గురించి వివరాలు ఉంచేటందుకు టపాలు సిద్దం చేసే పనిలో ఉన్నాం. ముమ్మరంగా వ్రాయటం, టైపు చేయటం, అచ్చుతప్పులను సరిచేసుకోవటం, ఇలా! ఆ దశలో ‘ఏదో వ్రాస్తున్నాం. అంతర్జాలంలో ఉంచుతామో, ఏం చేస్తామో’ తెలియని స్థితి! అప్పటికి మా కుటుంబ మిత్రుడు ఖాసింతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకుని 6 నెలలు అవుతుంది. ఈనాడు ద్వారా రామోజీరావు ఆ స్నేహాన్ని పునరుద్దరించుకొమ్మని ఎంత మొత్తుకున్నా ఫలించలేదు.

ఈ నేపధ్యంలో ‘ఇదుగో తెర తీయబడుతుంది. రెడీ 123’ అని చెప్పబడింది. అదే అమెరికాతో 123 అణుఒప్పందం! ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు కేసు’ ప్రకటించాలంటే అమెరికా సహకారం తప్పని సరికదా! మరి, భారత్ పర్యటనకి వచ్చి, చంద్రబాబు భుజం మీద చెయ్యి వేసి, ఇచ్చిన సమయం కంటే ఎక్కువ గడిపిన క్లింటన్ కి సీనియర్ బుష్ ప్రత్యర్ది. అతడి కుమారుడు జూనియర్ బుష్ కూడా అదే కావాలి కదా! అలాంటప్పుడు ’శతృ కో శతృ మితృ హోతా హై’ అనే చాణిక్య నీతి ప్రకారం, జూనియర్ బుష్, చంద్రబాబు కూ, ఎన్డీయే కూ ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ అధినాయకత్వానికీ, యూపిఏ కీ మితౄడు కావాలి.

కాబట్టి ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు కేసు’కు రెడీ 123 చెప్పాలంటే, ఋష్ సహకారం తప్పనిసరన్న మాట. కాబట్టే మన్మోహన్ సింగ్ ’బుష్ కి నా ముఖం ఎలా చూపించను?’ అంటూ వాపోయాడు. మరి రామోజీరావు భారత దేశంలో సిఐఏ ప్రధాన ఏజంటు కదా! 1992 - 1995 వరకు మా అవగాహన అంతే. ఇప్పటికీ అక్కడే ఉంటామనే ఊహతో, కేసు ప్రకటన అనే ప్రలోభాన్ని మాకు చూపిస్తూ రెడీ 123 చెప్పారు.

తరువాత ఏముంది? ‘రైలు ఎక్కి ఢిల్లీ రా! లేదా, అప్పటికే కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్న సమాచారం అంతా సీడీకి ఎక్కించి ఢిల్లీకి పోస్ట్ చెయ్యి’ - ఇదే ఊదర గొట్టబడింది. తాము ‘రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు కేసు’ ప్రకటించేటందుకు రెడీ 123 అంటుంటే [ఒప్పందం 123 దీనికి అలియాస్ అన్నమాట] ఎర్రపార్టీలు అడ్డం తగులుతున్నాయట.

కాబట్టే వాళ్ళు మద్దతు ఉపసంహరిస్తానన్నా, అవిశ్వాస తీర్మానం పార్లమెంట్ లో ప్రవేశపెడతామని బెదిరించినా, తాము లెక్క చేయకుండా సాహసించారట. ఇలా అని మాకు ఈనాడు రామోజీరావు తన సంకేత భాష ద్వారా పదేపదే చెప్పాడు. ఇందులో ఎంత నాటకీయత నడిచిందంటే - మన్మోహన్ సింగ్, ఎర్రపార్టీల వారి మీదికి కయ్యానికి కాలు దువ్వుతూ "పోతే పొండి. ఇన్నాళ్ళు నన్ను పురుగుని చూసినట్లు చూసినా సహించాను" అన్నాడు. ఈ హెడ్డింగులు ఈనాడు పెట్టినవే. ఇలా పొమ్మన్న పొగబెట్టేసి, తాను తూర్పు దేశాలకు [చైనా - జపాన్] పర్యటనకు పోయాడు మన్మోహన్ సింగ్.

అతడటు వెళ్ళగానే ఎర్రపార్టీ వాళ్ళు, "ప్రధానమంత్రి అంతమాట అనగా తమకు మాత్రం అంత పాకులాట ఎందుకనీ, కాబట్టి తాము మద్దతు ఉపసంహరించుకునేది ఖాయం" అనీ అన్నారు. ఐతే ‘ప్రధాని మన్మోహన్ సింగ్ జపాన్ లో ఉన్నందున, అతడు అక్కడ ఉండగా తాము ఇక్కడ మద్దతు ఉపసంహరించటం పద్దతిగానూ, మర్యాదగానూ ఉండదనీ, అందుచేత అతడి విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చే వరకూ వేచి ఉంటాం’ అని అన్నారు. ఈ మాట పత్రికలలో వచ్చిన రోజే, మన్మోహన్ సింగ్ టోక్యో నుండే, తాను జంకేది లేదంటూ సవాళ్ళూ, మాటల రాళ్ళూ రువ్వాడు. అంతే! అతనక్కడ ఉండగానే ఎర్రపార్టీల వాళ్ళు మద్దతు ఉపసంహరించారు.

అయితే ఇందులో ఉన్న గొప్ప ట్విస్ట్ ఏంటంటే - జూలై 22, 2008 న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా, ఓటుకు నోటు ఆరోఫణతో పార్లమెంటులో నోట్ల కట్టలు ప్రదర్శింపబడ్డాయి. అప్పటి వరకూ రెడీ 123 అంటూ, సోనియా ఆమె చేతిలోని రిమోట్ బొమ్మ మన్మోహన్ సింగ్ ప్రదర్శించిన నటనా వైదుష్యానికి, నెం.5 వర్గం ఇచ్చిన ఝలక్ అది. ఆ తర్వాత ఆ మంటను చల్లార్చుకోవటానికి నానా తంటాలు పడింది యూపిఏ ప్రభుత్వం!

ఈ విధంగా ఆయా విషయాలకి ప్రకటనలకి గల పలు కారణాలలో ఈ సంకేత భాష ఒక కారణం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

18-4-2010 ఈనాడు ఆదివారం అనుబంధంలో బాలవినోదిని లో అరుదైన అవకాసం అనే శీర్షిక కింద మి బ్లాగు డిలీట్ చెయ్యమని రామోజీరావు ఇండైరెక్టుగా సూచుస్తున్నాడు . ఇప్పటికే మీకు ఎన్నొ అవకాశాలు (బ్లాగు డిలీట్ చేయడానికి ) ఇవ్వబడ్డయని , మీ అవివేకంతో వాటిని పాడుచెసుకున్నారని అంటున్నాడు

అజ్ఞాత గారు: ఆ కథ నేనూ చదివానండి. నిజమే!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu