ఎంతో ప్రయత్నం తర్వాత రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే ఆటగాడి విన్యాసం మాకు విశ్లేషణకు అందింది. దాంతో పూర్తిగా స్పష్టత వచ్చింది. ఇప్పుడు మీకు దాన్ని పూర్తిగా వివరిస్తాను.

అయితే ....ఇది సంక్లిష్టమైన విషయమైనందున విశ్లేషణలో, పూర్తిగా స్పష్టత రావడానికి రెండు మూడు టపాలు పట్టవచ్చు. ఓపికతో చదివి, స్వీయ విశ్లేషణలతో అర్ధం చేసుకోవాల్సి రావచ్చు. మరోసారి ఆ concept ని గుర్తు చేస్తాను.

A మరియు B అనే ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళున్నారు. వాళ్ళకు ఆట వచ్చు. C అనే వాడికి చదరంగపు ఆట రాదు. అయినా A,Bలతో ఆడి గెలవాలన్నది C లక్ష్యం. దాంతో రెండు చోట్లా ఆటకు తలపడతాడు. ముందుగా A దగ్గరి కొస్తాడు. చదరంగపు బల్లమీద, A ఒక ఎత్తు వేస్తాడు. వెంటనే C, B దగ్గరున్న బోర్డు మీద అదే ఎత్తుగడ వేస్తాడు. అంటే A బోర్డు మీద, A ఏ పావుని ఎలా కదిపాడో అలాగే B బోర్డు మీద C కదిపాడన్న మాట. A తో ఆటలో... ఆట ప్రారంభకుడు A అయితే, Bతో ఆటలో.... ప్రారంభకుడు C అన్నమాట.

సరే! C వేసిన తొలి ఎత్తుకు ప్రతిగా B ఒక ఎత్తువేస్తాడు కదా, అదే ఎత్తుగడని తెచ్చి C, A మీద ప్రయోగిస్తాడన్న మాట. దానిమీద A మరో ఎత్తువేస్తాడు కదా! అది తీసికెళ్ళి B మీద ప్రయోగించటం, B వేసిన ఎత్తుగడని తెచ్చి A మీద ప్రయోగించటం - ఇదీ C ఆడే ఆట. ఆ విధంగా ఆడుతూ చివరికి రెండు బోర్డుల మీదా గెలిచాడు.

ఈ concept లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు :

1]. A Vs C బోర్డు మీద, A ప్రారంభకుడు. C Vs B బోర్డు మీద, C ప్రారంభకుడు, B రెండవ ఆట గాడు. అయితే C, A ఎత్తుగడని తెచ్చి B మీదా, B ఎత్తుగడని తెచ్చి A మీదా ప్రయోగిస్తాడు గనక, ఎప్పుడు చూసినా A Vs C బోర్డు, C Vs B బోర్డూ ఒకేలా ఉంటాయి. 'ఐడెంటికల్ ' గా అన్నమాట. అంటే - ఆయా బోర్డుల మీద, ఇద్దరు ఆటగాళ్ళ పావులు i.e. గుర్రాలూ, ఏనుగులూ శకటులూ బంట్లూ గట్రాలు ఉన్నగళ్ళు ఒకే రకమైన గళ్ళలో ఉంటాయి.

2]. C ఏదో ఒక బోర్డు మీద ఓడితేనే రెండో బోర్డు మీద గెలవ గలడు. రెండు చోట్లా గెలవ లేడు.

3]. ఎప్పుడు C మైనస్ అయితే అప్పుడు A,Bలు ఒకరితో ఒకరు తలపడినట్లే! మరో రకంగా చెప్పాలంటే - C కేవలం పోస్ట్ మాన్ లాగా అక్కడి ఎత్తుగడ ఇక్కడా, ఇక్కడి ఎత్తుగడా అక్కడా అందజేస్తున్నాడు, అంతే! రెండు బోర్డుల మీదా పరోక్షంగా A,Bలు ఆడుతున్నట్లే! అంటే A,Bలలో ఒకరు మరొకరి మీద గెలవాలి. ఒకరు ఇంకొకరిని ఓడించాలి. ఒకరు మరొకరి పావులని చంపాలి.

ఈ రకపు ఆటలో యధాతథ అనువర్తన [As it application] కొంతా, చిన్నపాటి మార్పు చేర్పులతో కూడిన అనువర్తన మరి కొంతా ఉంది.
ఈ టపాల మాలికలోని గత టపాలలో చెప్పినట్లుగా.... 1992 జూన్ లో రామోజీరావు గూఢచర్య వలయపు ఉనికి పీవీజీకి తెలిసినా డిసెంబరు 6, 1992 లో బాబ్రీ మసీదు కూలిపోయే వరకూ ఆయన దాన్ని పరీక్షించుకూ, సమీక్షించుకూ చూసుకున్నాడే గానీ, ఎక్కడా విషయాన్ని బయటికి పొక్కనీయలేదు. అదే తొలిదశగా అభివర్ణించిన టపాలో వివరించాను. ఆ ఆరునెలల సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో, ఇండియా టుడే వంటి వాటిల్లో గూఢచర్య మర్మాల గురించిన విశేషాలు ప్రచురింపబడ్డాయి.

ఇక రెండవ దశలో పీవీజీ రామోజీరావుకీ, సోనియాకీ, అద్వానీ ప్రభృతులకి ’దొరికిపోయావ్’ అన్న హెచ్చరిక ఇచ్చాడు. ఆ నేపధ్యంలో పీవీజీ, భారత దేశం పట్ల నిబద్దత గల నిఘా సంస్థలలోని వ్యక్తులతో కూడిన, అప్పటికి స్వల్ప సంఖ్యలో ఉన్న నెం.5 వర్గం, రామోజీరావుకి ఇచ్చిన సవాలు, హెచ్చరిక గురించి గత టపాలలో వ్రాసాను.

అదేమిటంటే - "ఇప్పటి వరకూ మీరు ఎవరో, ఎక్కడి నుండి, ఎలా కుట్రలు చేస్తున్నారో మాకు తెలియదు గనక మీ ఆటలన్నీ సాగాయి. ఇక కాస్కోండి. మీ వేళ్ళతో మీ కళ్ళే పొడిపించినట్లుగా, మీ చేతులతో మీ నెట్ వర్క్ నే కుప్పకూల్పిస్తాము" అన్నది. నిజానికి ఇది ఆ హెచ్చరికలోని సగ భాగం మాత్రమే. [మరో సగం గురించీ చెబుతాను.]

ఇప్పుడు జరుగుతోంది అదే! రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆట గాడి విన్యాసంలో.... A Vs C, ఇంకా C Vs B బోర్డుల మీది C ఆటగాడు నెం.5 వర్గమే! A ఎత్తుగడని తీసుకెళ్ళి B మీదా, B ఎత్తుగడని తెచ్చి A మీదా వేస్తూ పోస్ట్ మాన్ [PM] సర్వీసు చేసిన C ఆటగాడి స్థానంలో ఉన్నది నెం.5 వర్గం! ఎప్పుడు C తప్పుకుంటే అప్పుడు....లేదా C ఆటని మైనస్ చేస్తే A,B ని ఓడించేందుకూ, B,A ని ఓడించేందుకూ ఒడ్డిపోరాడి ఆడినట్లే!

A స్థానంలో నకిలీ కణిక అనువంశీయులూ వారి కీలక ఏజంట్లు, B స్థానంలో నెం.10 వర్గంపు ఏజంట్లు ఉన్నారు. గూఢచర్యం విస్తారమైనదీ, సంక్లిష్టమైనదీ అయినందున, ప్రపంచ చరిత్రలో, దేశపు చరిత్రలో, దశాబ్దాల కాల పరిమాణం స్వల్పమైనందునా..... ఈ ఆట ప్రభావమూ, ఫలితమూ తొలినాళ్ళలో ప్రముఖంగానూ ప్రస్ఫుటంగానూ కనబడలేదు. అంతే!

ఇప్పుడు చూస్తే.... A ఓడినా, B ఓడినా C కి విజయమే! అంటే నకిలీ కణిక అనువంశీయులు ఓడినా, నెం.10 వర్గం ఓడినా నెం.5 వర్గానికి విజయమే!

మరో కోణంలోంచి చూస్తే... B చేతిలో A ఓడినా, A చేతిలో B ఓడినా అది ఆత్మహత్యా సదృశ్యమే! అది తమ గొంతు మీద తామే, కాలు వేసుకొని తొక్కుకోవటం వంటిదే!

నిజానికి నకిలీ కణిక అనువంశీయులు, వారి కీలక ఏజంట్లు చాలా గుప్త చరులు. పైకి వీళ్ళు మరో ఏజన్సీ [సిఐఏ, ఐఎస్ ఐ, మొస్సాద్, యం.ఐ.5 or 6 లేదా చైనా ఏజన్సీ] కీ చెందిన ఏజంట్లలాగే కన్పించ ప్రయత్నిస్తారు. రామోజీరావు సిఐఏ కీ చైనా కీ ఏజంటునన్న ముద్రా, సోనియా వాటికన్ ఏజంట్ ననే ముద్రా, అద్వానీ మొస్సాద్ ఏజంట్ ననే ముద్రా వేయించుకో జూసినట్లుగా!

అయితే మాజీ నవాబులకీ, ప్రస్తుత సౌదీ, బూనై గట్రా కొన్ని ముస్లిం దేశాల సుల్తానులకీ ఈ గూఢచర్య వలయం గురించి మరి కొంత ఎక్కువ తెలుసు. వీరితో కూడిన వలయాన్నే నకిలీ కణిక వ్యవస్థగా ఉటంకించాను. ఇది రెండు బోర్డుల చదరంగపు ఆటలో A స్థానంలో ఉంది.

ఇక నెం.10 వర్గం:
ఇందులో ఉన్నవారు ఎంత కీలక స్థానంలో ఉన్నా , వీరి వెలుగు కొంత పరిమిత కాలానికి చెంది ఉంటుంది. ఇందులోని ఏజంట్లు, ఎవరికి వాళ్ళు, తాము ఫలానా సిఐఏ కో, ఐఎస్ ఐ కో, మొస్సాద్ కో లేక బ్రిటన్ యంఐ 5 or 6 కో పనిచేస్తున్నామనుకుంటారు. ’ఏ దేశానికైతే నేమిటి? డబ్బు, అధికారం, కెరీర్ వస్తుంది చాలు’ అనుకుంటారు. పక్కా పదార్ధవాదులు. వీళ్ళకి మహా అయితే తమ పై నున్న నలుగురో లేక పదిమందో ఏజంట్లూ, తమ క్రింది నలుగురో లేక పదిమందో ఏజంట్లు తెలిసి ఉంటారు తప్పితే, గూఢచర్య వలయం తెలియదు. తెలుసుకునే ఆసక్తి ఓపికా కూడా ఉండవు. సుఖలాలసకే సమయం సరిపోదు మరి!

దానికి తగ్గట్టు నకిలీ కణిక వ్యవస్థ, వీళ్ళ మీదా జారత బొమ్మ/ జంట పీతల స్ట్రాటజీ అమలు చేస్తుంది గనుక, అందులో పడి కొట్టుకుంటూనే జీవిత కాలం గడిచిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల దగ్గరి నుండి రాజకీయుల దాకా, కార్పోరేట్ దిగ్గజాల దగ్గరి నుండి క్రీడా సెలబ్రిటీల దాకా, అందరూ ఇందులో భాగస్థులే!

ఇలాంటి రెండు గుంపులనీ [నకిలీ కణిక అనువంశీయులు ఒక గుంపు, నెం.10 వర్గం ఒక గుంపు] A మరియు B స్థానాలలో ఉంచి, తాను C స్థానంలో ఉండి.... నెం.5 వర్గం ఆడిన, ఆడుతున్న చదరంగపు ఆటే.... గల్లీ నుడి ఢిల్లీ దాకా, ప్రపంచ వేదిక మీదా ఇప్పుడు ప్రదర్శితమౌతోంది.

నిజానికి ఇది కూడా మన పురాణ ఇతిహాసాలకి అతీతమైన వ్యూహం కాదు. ఎలాగంటే -

పూర్వం సుందుడూ, ఉపసుందుడూ అని ఇద్దరు రాక్షసులు ఉండే వాళ్ళు. ఇద్దరూ సోదరులు. సర్వబల సంపన్నులు. బ్రహ్మ గూర్చి ఉగ్ర తపస్సు ఆచరించి చావు లేకుండా వరం కోరతారు. [ఈ తపస్సు అనే ప్రక్రియ ఈనాడు శాస్త్రవేత్తలు చేసే నిరంతర, జిజ్ఞాసాపూరిత శాస్త్ర పరిశోధన వంటిది. అలనాడు రాక్షసులు, మహర్షులూ తపస్సులు చేసేవారు. తపఃఫలాలుగా రాక్షసులూ వరాలు పొందేవారు. మహర్షులూ వరాలు పొందేవారు. రాక్షసుల వరాలు లోక కంటకాలైతే, మహర్షుల వరాలు లోక కళ్యాణాలయ్యేవి. ఇప్పుడు శాస్త్రవేత్తలు శాస్త్ర పరిశోధనలకై తపస్సు చేస్తున్నారు. అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. అవి ఆనాడు బ్రహ్మాది దేవతలిచ్చిన వరాల వంటివే. ఆ వరాల్లాగే దుప్రయోజనాలూ కలిగిస్తున్నాయి, సత్పలితాలూ కలిగిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, ఉపయోగించే తీరుని బట్టి మంచీ చెడూ కలిగిస్తున్నాయి.]

సుందోపసుందులు కోరిన మరణ రాహిత్యాన్ని బ్రహ్మ అంగీకరించనందున, ప్రత్యమ్నాయంగా తామిద్దరూ ’ఒకరి చేతిలో ఒకరు మరణించాల్సిందే తప్ప, ఇతరుల చేతిలో తమకు చావులేకుండా’ వరం కోరుకుంటారు. బ్రహ్మ తధాస్తు అన్న మరుక్షణం చెలరేగి పోతారు. వారి అకృత్యాలకు అదుపు లేకుండా పోతుంది. దేవతలు, మునులూ, మనుషులూ, యక్ష గంధర్వాది సకల లోక వాసులూ త్రిమూర్తులను కాపాడమని వేడుకుంటారు.

ఆ రాక్షసులని సంహరించే మార్గాన్ని అన్వేషిస్తారు. నారాయణుడు "సుందోపసుందులు ఇతరులని హింసించడానికి, నాశనం చేయడానికి శతధా ప్రయత్నస్తారు గానీ, తమలో తాము విభేదించు కోరు. అది స్వయం వినాశనమని వారికి తెలుసు. కాబట్టి వారి మధ్య కలహ మోహాన్ని కలిగించాలి" అని ఆదేశిస్తాడు.

ఆ ప్రకారం సర్వ దేవతలూ, సర్వ లోకవాసులూ, బ్రహ్మవిష్ణు మహేశ్వరులూ, సరస్వతీ లక్ష్మీ పార్వతులు.... తమ తమ అందచందాల నుండీ, స్థైర్య ధైర్యాల నుండీ, సామర్ధ్యా స్వభావాల నుండీ.... తలా తిలాంశం [నువ్వు గింజంత] తీసి ఒక మూర్తిని సృష్టిస్తారు. ఆ మూర్తి అతిలోక సౌందర్యవతిగా ప్రభవిస్తుంది. అందరి నుండీ తిలాంశం తీసుకున్నందు వల్ల ఆమెను ’తిలోత్తమ’ అని పిలుస్తారు.

తిలోత్తమ తన నేర్పూ నైపుణ్యాలతో సుందోపసుందులను ఆకర్షిస్తుంది. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారిని వరిస్తానంటుంది.

ఇక కొట్టుకోవటం ప్రారంభించిన సుందోపసుందులు, ఒకరి చేతిలో మరొకరు మృత్యువాత పడతారు.

ఈ కథలోని సుందోపసుందుల వంటి వారే.... నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ. నెం.10 వర్గంలో ఎప్పటి కప్పుడు ఏజంట్లుగా వ్యక్తులు మారుతుండవచ్చు. వర్గం మాత్రం స్థిరంగా ఉంటుంది. కంపెనీలో ఉద్యోగులు మారినా కంపెనీ స్థిరంగా ఉన్నట్లు! ఇక నకిలీ కణిక వ్యవస్థ అయితే వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తోంది. ప్రపంచం మొత్తం మీదా, చివరికి అంతర్గతంగా నెం.10 వర్గం మీద కూడా ’విభజించి - పాలించే’ కణిక నీతిని ప్రయోగించే నకిలీ కణిక అనువంశీయులు.... తమకూ, నెం.10 వర్గానికీ మధ్య మాత్రం సుందోపసుందుల మాదిరిగా అంతఃకలహం రానీయరు. ఇది 1992 వరకూ సాగిన కథ!

1992 తర్వాత పీవీజీ సమీకరించిన నెం.5 వర్గం, అందరి నుండీ, తిలాంశం గ్రహించి ప్రభవించిన తిలోత్తమ వంటిదే! నెం.5 వర్గం అన్ని దేశాల నుండీ దేశభక్తినీ, మానవత్వాన్ని,నిజాయితీని, విశ్వమానవ ప్రేమనీ అందిపుచ్చుకున్న భావ సౌందర్య మూర్తి! భౌతిక సౌందర్యం తాత్కాలికమైనది. భావ సౌందర్యం నిత్యనూతనమైనది, శాశ్వతమైనది.

ఇందులో ఒక విశేషం ఏమిటంటే - B స్థానంలో ఉన్న నెం.10 వర్గంలోని ఆటగాళ్ళ చేత, A స్థానంలోని నకిలీ కణిక అనువంశీయుల మీదికి, ధృఢమైన శరాఘాతాల వంటి ఎత్తుగడలు ప్రయోగింపబడుతున్నాయి. ఆ విధంగా నకిలీ కణిక అనువంశీయులూ, వారి ఆప్త కీలక ఏజంట్లూ బలహీనపడుతున్నారు. నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, సుందోపసుందుల్లా పరస్పర ఆశ్రితాలు గనుక, నకిలీ కణిక అనువంశీయులు బలహీన పడినందు వల్ల, నెం.10 వర్గమూ బలహీనపడుతోంది. నెం.10 వర్గంలోని ఏజంట్లకి ’నకిలీ కణిక వ్యవస్థలోని కీలక ఏజంట్లు తమలాగే మరో దేశ గూఢచార సంస్థల ఏజంట్లు’ అనే అవగాహనే తప్ప.... అసలు ప్రపంచాన్ని గూఢచర్య పరంగా శతాబ్దాల పర్యంతం నడుపుతోందే నకిలీ కణిక వ్యవస్థ అని తెలియదయ్యే!

దీన్నే మరో మాటలో చెప్పాలంటే - నెం.10 వర్గం ఒక కంపెనీలో ఉద్యోగుల సమూహం వంటిదైతే.... నకిలీ కణిక అనువంశీయులు ఆ కంపెనీ యాజమాన్యం వంటి వారు. ఉద్యోగులూ యాజమాన్యామూ పరస్పర ఆధారితాలు. ఉద్యోగులే యాజమాన్యానికి బలం. యాజమాన్యం ఉంటేనే ఉద్యోగుల అస్తిత్వం. అందుచేత, ఆ కంపెనీని రూపుమాపాలన్నా యాజమాన్యాన్ని రూపుమాపాలి తప్ప ఉద్యోగులని కాదు. యాజమాన్యం ఉన్నంత సేపూ, కొత్త కొత్త ఉద్యోగుల్ని తయారు చేస్తుంది.

ఆ రీత్యా.... రెండు చదరంగపు బోర్డుల ఆట వంటి గూఢచర్యంలో A స్థానంలో ఉన్న నకిలీ కణిక అనువంశీయులనీ, దాదాపు వారి రక్త సంబంధీకులేమో నన్నంత ఆప్త అంతరంగిక కీలక ఏజంట్లనీ... ఢీకొని... ఇప్పుడు మనం పాకిస్తాన్ లొ చూస్తున్న ఆత్మాహుతి బాంబుల్లా, తాము చచ్చి మరీ నకిలీ కణిక అనువంశీయులని చంపుతున్నారు. కాకపోతే పాకిస్తాన్ ఆఫ్గనిస్థాన్ లోని ఆత్మాహుతి బాంబులది భౌతిక మరణం అయితే, వీళ్ళది గూఢచర్యపరంగా మరణం, కెరీర్ పరంగా మరణం, ఒకేసారి భౌతిక మరణం కూడా అవుతోంది. అంతే వ్యత్యాసం!

C స్థానంలో ఉన్న నెం.5 వర్గానికి A స్థానంలో ఉన్న నకిలీ కణిక అనువంశీయులు ఓడినా, B స్థానంలో ఉన్న నెం.10 వర్గం ఓడినా విజయమే కావచ్చు. కానీ ప్రధానంగా ఓడించాల్సింది నకిలీ కణిక అనువంశీయులనే! నకిలీ కణిక అనువంశీయులే... నెం.10 వర్గానికి జవసత్వాలు ఇచ్చిందీ, ఇస్తోన్నదీ! అందుచేత.... ప్రపంచానికి మూలంలో పట్టిన చీడ వంటి నకిలీ కణిక వ్యవస్థనే ముందుగా నాశనం చేయాల్సింది, ప్రధానంగా నాశనం చేయాల్సింది!

ఇక్కడున్న మరో అంశం ఏమిటంటే - A Vs C లేక C Vs B బోర్డులలో ఏదో ఒక దాని మీద C ఓడిపోతేనే కదా రెండో బోర్డు మీద గెలిచేది? ఇక్కడ చిన్న మార్పు ఉంది. అదేమిటంటే - ఓటమి నిజమే! అయితే అది రెండు బోర్డుల మీదా ఏక కాలంలో! ఈ 18 ఏళ్ళల్లో నెం. 5 వర్గం, ఒక ’ఎరా’లో పూర్తిగా ఓటమి స్ట్రాటజీ పాటించింది.

గల్లీ నుండి ఢిల్లీ దాకా.... జాతీయం నుండి అంతర్జాతీయం దాకా!

ఢిల్లీ స్థాయిలో చూస్తే... పీవీజీకి టిక్కెట్టు నిరాకరించి పార్టీ నుండి వెళ్ళగొట్టినా, ఆయన పార్ధివ శరీరాన్ని అవమానించినా, జెంఎంఎం ముడుపుల వంటి కేసులతో ఆయనని కోర్టు గుమ్మాలు ఎక్కించి దించినా.... ఆ ’ఎరా’లో నడిచింది ఓటమి స్ట్రాటజీనే!

దాన్నుండే పొందిన గెలుపు ఏమిటంటే - కాంగ్రెస్ అధిష్టానంగా అవతరించిన సోనియా అసలు నైజం బహిర్గతం కావటం!
సువర్ణముఖి ఏమంటే - అవే కోర్టుగుమ్మాలు, స్థలం లీజుకిచ్చిన యజమానుల కేసులు, పరువునష్టం కలిగించాడని ఈనాడు యాజమాన్యంపై కేసుల నేపధ్యంలో.... రామోజీరావు ఎక్కిదిగడం! సోనియాకా సీన్ ఇంకా రాలేదు లెండి!

ఇక గల్లీ స్థాయిలో చూస్తే.... రామోజీరావు విషయంలో మేము ఎన్ని ఫిర్యాదులు పెట్టినా.... ప్రతి దానిలోనూ మేము అందుకున్నది ఓటమినే! ఎవరికి ఫిర్యాదు చేసినా.... "ఇతడు/ఈమె నీ కేసు, నీ సమస్య పరిష్కరిస్తాడనుకుంటున్నావా? ఇదీ నా పావే [ఇతడు/ఈమె నా ఏజంటే]. ఇదీ నా బలం. నీకు అర్ధం కావడం లేదు. ఏం చేస్తారు? ఇప్పటికైనా పోరాటం మాని రాజీపడండి?" అంటూ రామోజీరావు మమ్మల్ని వేధించేవాడు. [ఆ విధంగానే మాకు గూఢచర్య బలం ఒక వ్యక్తిపై ఎలా పనిచేస్తుందో, ఒక వ్యవస్థ పై ఎలా పనిచేస్తుందో, ఒక దేశం పై ఎలా పనిచేస్తుందో అర్ధం అయ్యింది.]

అదే... సిబిసిఐడి ఐజీ కృష్ణరాజ్ స్పష్టంగా "ఈ attitutude తో మీరు ఎక్కడికెళ్ళినా మీ problem solve కాదు" అన్నాడు.

అదే... సూర్యాపేటలో మా ఇంటి ఓనరు "నువ్వు చదువు కున్నావు గానీ నీకు తెలివి లేదు. అలా కాదు ఇలా అని మాట్లాడుకుంటారు గానీ కేసులు పెట్టుకుంటారా?" అంది.

అదే... శ్రీశైలం డిప్యూటి ఈవో "రామోజీరావు మీద కేసు పెట్టింది. చంద్రబాబు నాయుడి మీద కేసు పెట్టింది. నా మీద కేసు పెట్టింది. ఇలాంటి ఆడామెని నేనెక్కడా చూడలేదు" అంటూ క్రోధావేశాలు వెళ్ళగక్కాడు.

ఆ ఫిర్యాదులన్నిటితో మేం ఒకో ఊరూ ఖాళీ చేస్తూ మరో ఊరికి వలస పోయాం. ఏ ఊరికా ఊరిలో మాది ఓటమే.

అయితే ఇందులో విజయం ఏమిటంటే - ఆ విధంగా చంద్రబాబు నాయుడు, వై.యస్. ల దగ్గరి నుండి మన్మోహన్ సింగూ, సోనియాల దాకా, అందరూ రామోజీరావు ఏజంట్లే అన్న విషయం.... సాక్ష్యాధార పత్రాల సహితంగా, దృష్టాంతపూరిత సంఘటనలతో సహా నిరూపితమైంది.

ఇక ఇందులో సువర్ణముఖి అయితే - దేశం విషయంలోనే కాదు, మా విషయంలోనూ ఎవరెవరు ఏమేమి చేశారో దాదాపుగా అవన్నీ తిరిగి అనుభవించారు, అనుభవిస్తున్నారు. అది ఇక్కడ విషయాంతరం అవుతుంది గనుక మరో టపాలో వివరిస్తాను. [బహిర్గతమైన, అందరికీ తెలిసిన సంఘటనలతో సహా!]

జాతీయ స్థాయిలో చూస్తే - 1999 లో కార్గిల్ దగ్గరి నుండి 2002 లో పార్లమెంట్ పై దాడి, 2008 ముంబైముట్టడి దాకా.... ఇవి గాక ఎన్నో హింసాత్మక తీవ్రవాద ఘాతకాలలోనూ... నెం.5వర్గం.... భారత దేశం మీద పాకిస్తాన్ నైచ్యాన్ని అడ్డుకోలేకపోయింది. అంటే ఓడి పోయింది. ఆయా సంఘటనలని, దాడులని తిప్పి కొట్టింది గానీ, అసలు అలాంటి సంఘటనలు జరగకుండా నియంత్రించలేకపోయింది, నివారించ లేకపోయింది.

ఇందులో విజయం ఏమిటంటే - ఆయా ప్రభుత్వాలకు [ఎన్డీయే, యూపీఏ] దేశం పట్ల ఉన్న నిబద్దత గురించి ప్రజలకు అర్ధమయ్యేటట్లు బహిర్గతం చేసింది, చేస్తోంది! జన్మతః నే కాదు, బుద్దిరీత్యా కూడా పాకిస్తానీ అయిన అద్వానీ [జిన్నా జిందాబాద్ అనటం నిశ్చయంగా పాకిస్తానీతనమే!], పాక్ లో పుట్టి భారత ప్రధాని అయిన మన్మోహన్ సింగూ, ఇటలీ నుండి ఇండియాకి వచ్చిన సోనియాల నిజస్వరూపాలు, కాందహార్ విమాన హైజాకుల సాక్షిగా, కసబ్ ల సాక్షిగా, అఫ్జల్ గురుల సాక్షిగా నిరూపితమవటం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

మీ వద్ద ఉన్నవి ఆధారాలుగా పనికి వస్తాయి కానీ... సాక్ష్యాలు గా పనికి రావని నాకనిపిస్తోంది...

అవి ఆధారాలు మాత్రమే... అవి నిజమే అని నిరూపిస్తే వాటిని సాక్ష్యాలుగా పరిగణించవచ్చు... అలాంటివి నిరూపించలేకుండా చేయగలిగారు కాబట్టే వాళ్ళు ఇంకా కాలం వెళ్ళబుచ్చ గలుగుతున్నారు.....

http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=51194&subcatid=17&categoryid=1

http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=51194&subcatid=17&categoryid=1

http://apmediakaburlu.blogspot.com/2010/03/blog-post_9994.html

details of an old interview with PV thatha:

P. V. Narasimha Rao, Former Prime Minister of India
THE ONLY STATE FEASIBLE AND NATURAL
IN INDIA IS THE SECULAR STATE

Former Prime Minster of India, P. V. Narasimha Rao, answering a question by The DayAfter Editor-in-Chief Sunil Dang about the future of India, said pointedly: "I hold fast to my view, which is the Congress view, that the only state feasible and natural in India is the secular state. Even non secular outfits often need to have a secular-looking face handy, in order to carry conviction to the people. Sometimes there are attempts to communalise and fanaticise the masses. This may succeed temporarily, but not for all time. The nation will revert to the pattern that it has followed for many centuries".
After an informal interaction with Sunil Dang and Think Tank Director Yogendra Bali, P. V. Narasimha Rao had suggested that a set of questions be asked in writing to help him think out his answers clearly and provide them in writing. A set of 20 questions were presented to him and he was kind enough to provide his answers. Because of the significance and high reader interest in his views, we present the interview with him in question-and-answer format.
DayAfter: As one of the significant makers of modern India, looking at the political, economic, social and governance scenario today, what do you think is the future of India?
P.V. Narasimha Rao: This is an omnibus question. So my omnibus answer is that India’s future is assured to be bright. It has never been otherwise, through the centuries and millennia.
DA: In your opinion, what are the dangers and major problems that stare the country in the face today? What solutions would you suggest?
PVN: Again, it is a general question. A country of this size and complexity normally is prone to several dangers—of unity, integrity, of economic difficulty, social cohesion, etc. Each of these dangers needs to be examined separately and the solutions sought with reference to the kind of danger that faces us. But I have no doubt that as in the past, India has overcome all the dangers. Nothing will be easy, yet nothing will be impossible either.


(Contd...)

@రమణ గారు : ఆధారాలు - సాక్ష్యాలు - వాటి మధ్య వ్యత్యాసాలు వంటి న్యాయపరిభాష కోర్టులకి అవసరమేమో! కోర్టులూ, న్యాయమూర్తుల అవినీతి సహితంగా కుట్రలో భాగస్వామిగా నిరూపించబడుతున్న నేపధ్యంలో, సత్యాన్ని తెలుసుకోవాలనుకునే ప్రజలకి ఆ పరిభాషా పదాలతో అవసరం లేదనుకుంటాను.

ఇకపోతే... ’ఈ ఆధారాలు, సాక్ష్యాలూ చాలవు. మరికొంత కాలం ఆగాలి. కాబట్టి బ్లాగు డిలీట్ చేసి, నీ దగ్గరున్న ఆధారాలూ, సాక్ష్యాలూ, ఇంకా బ్లాగులో వ్రాయాలనుకుంటున్న సమాచారమూ... అంతా, అధికారంలో ఉన్న సోనియాకి చెప్పు. ఆమె, ఇంకా కావలసిన సాక్ష్యాలని, ఆధారాలని సేకరిస్తుంది’ అని, ఈనాడు రోజూ మాకు ఊదర పెడుతూనే ఉంది.

@అజ్ఞాత గారు : లింక్ ఇచ్చినందుకు నెనర్లు!

@రాఘవేంద్ర రెడ్డి గారు : నెనర్లు!

@chanda-mama గారు: మంచి సమాచారం ఇచ్చినందుకు నెనర్లు!

Ramana garu: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ నెల 1న ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించింది. ఇందుకు దిన కరన్ నిరాకరించాడు కూడా! దాంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కొలీజియం దినకరన్ ను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిక్కిం హైకోర్టు రాష్ట్ర బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu