మహాభారతం, సభాపర్వం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో..... జూదంలో ద్రౌపదీ దేవిని ధర్మరాజు ఓడిపోయాక, దుర్యోధనుడు రాణీ వాసపు అంతఃపురంలో ఉన్న ద్రౌపదీ దేవిని, సభకు తోడ్కొని రమ్మని ప్రాతికామిని పంపుతాడు.

అంతటి అనుచిత కార్యానికి ఒణికిపోతూ, ప్రభు ఆజ్ఞను పాటిస్తూ అతడు వెళ్ళి ద్రౌపదికి రాజాజ్ఞ వినిపిస్తాడు. అప్పటికే సభలో నడుస్తున్న జూదం గురించీ, విపరీతాల గురించి వినీ ఉన్న ద్రౌపది, సభాప్రాంగణంలోనికి అడుగు పెట్టవలసి రావటమే అవమానంగా భావిస్తూ, అదే గొప్ప ఉపద్రవమనుకొంటుంది. దాన్ని నివారించేందుకు ఓ ప్రశ్నను సభకు పంపుతుంది.

"నా స్వామి .... నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?" అని! అంటే - ముందుగా తనను తాను ఓడిపోయాక, ధర్మరాజు, నన్ను ఓడిపోయాడా? అలాగైతే ఆ ఫణం చెల్లదు. ధర్మరాజు కిక ద్రౌపదిని పందెం ఒడ్డే అర్హత ఉండదు. తనను ఓడాక ధర్మరాజు దుర్యోధనుడి బానిస! ధర్మరాజుతో పాటు ద్రౌపదీ దుర్యోధనుడికి బానిస కావచ్చుగాక! కానీ దుర్యోధనుడికి ధర్మరాజు ప్రత్యక్ష బానిస అయితే, ధర్మరాజుకి ఇల్లాలయిన ద్రౌపది దుర్యోధనుడికి పరోక్ష బానిస అవుతుంది. ద్రౌపది మాత్రం ధర్మరాజు అధీనంలో ఉన్నట్లే! అప్పుడు ఏ అజ్ఞనైనా ద్రౌపది పాటించాలంటే - అది దుర్యోధనుడైనా సరే, ధర్మరాజు చేత ద్రౌపదికి అజ్ఞాపింప చేయాల్సిందే!

అలాగ్గాక.... ధర్మరాజు, ముందు ద్రౌపదిని పందెం ఒడ్డి ఓడిపోయి, తర్వాత తనను తాను ఫణంగా పెట్టుకొని ఓడిపోయాడా? అలాగైతే అప్పుడు ద్రౌపది దుర్యోధనుడికి ప్రత్యక్ష బానిస. నేరుగా దుర్యోధనుడు ద్రౌపదిని ఏం చెయ్యమనైనా ఆజ్ఞాపింపవచ్చు.

ఈ ధర్మసందేహాన్ని ద్రౌపది సభకు పంపిస్తుంది. అందుకు కోపంతో భగ్గుమన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడికి ద్రౌపదిని జుట్టుపట్టి సభకు ఈడ్చుకు రమ్మని చెబుతాడు. అతడలాగే.... వదినను, అంతఃపుర మహిళని అవమానిస్తూ లాక్కొస్తాడు.

ఆమెను వివస్త్రను చేసి అవమానించాలని ప్రయత్నిస్తారు. సభలోకి రాగానే ద్రౌపది, తన ప్రశ్నను మళ్ళీ వినిపిస్తుంది. వికర్ణుడూ, యుయుత్సుడూ, అశ్వత్ధామ మొదలైన వాళ్ళు చర్చకు సిద్దమైనా.... అందరూ మౌనంగా చూస్తుంటారే తప్ప ద్రౌపదీదేవి కి జరిగే అవమానాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు. అంతటి సంకట స్థితిలో కూడా ఆమె, జరుగుతున్న అవమానాన్ని తనదైన పద్దతిలో నిలువరించేందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే స్వీయమాన రక్షణకు, అదే ధర్మ సందేహాన్ని పదేపదే రెట్టిస్తుంది.

అప్పుడు భీష్ముడు "అమ్మాయీ! ధర్మం బహు సూక్ష్మమైనది. నీ భర్త యుధిష్థిరుడు ధర్మజ్ఞుడు. నీ సందేహాన్ని అతడు మాత్రమే తీర్చగలడు" అంటాడు.

సాభిప్రాయంగా ధర్మజుని వైపు చూసిన ద్రౌపది చూపుల నెదుర్కోలేక ధర్మరాజు తలదించుకుంటాడు. అందులో నిస్సహాయత ఉంది. క్షమనర్దిస్తున్న వేడుకోలు ఉంది. అప్పటికి.... భయ విహ్వలతతో, నిస్సహాయతతో కుప్పకూలిన ద్రౌపదీ దేవిని, ఆ అవమానం నుండి వాసుదేవుడు కాపాడినట్లు మనం భారతంలో చదువుతాము.

వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది లేవనెత్తిన ద్వంద్వం లేదా ధర్మ సందేహానికి సమాధానం అరణ్యపర్వంలో చెప్పబడుతుంది. అరణ్యవాసంలో ఉండగా.... ధర్మరాజు కీ - భీమార్జున నకుల సహదేవులుకీ, ధర్మరాజుకీ - ద్రౌపదీ దేవికీ మధ్య నడిచిన సంభాషణల్లో.... ద్రౌపది ‘మనిషికి అవసరమైనంత మేరకు క్రోధం, రజోగుణం ఉండాల్సిందేననీ, అలా లేకపోవటం దోషభూయిష్టమేననీ’ అంటుంది. ధర్మరాజు ‘అలాగని శాంత గుణాన్ని విడిచి పెట్టకూడ’దంటాడు. ఆ సందర్భంలో ద్రౌపది, నిర్మొహమాటంగా ధర్మరాజులోని లోపాలని ఎత్తి చూపుతుంది.

ధర్మరాజు ‘జూదానికీ, యుద్దానికీ పిలిచినప్పుడు క్షత్రియుడు వెనుకంజ వేయకూడదని’ అంటూనే ‘జూద క్రీడ వినోదం అనే పరిధిని దాటి వ్యసన పూరితంగా పరిణమించటం తప్పేనని’ పరోక్షంగా అంగీకరిస్తాడు. ద్యూత క్రీడలో తనను మించిన వారు లేరనే తన అతిశయించిన ఆత్మవిశ్వాసాన్ని తలుచుకొని ధర్మరాజు ఆత్మనిందకు పాల్పడకుండా, నివారిస్తూ.... భీమార్జున నకుల సహదేవులు.... శకుని మాయాద్యూతాన్ని పసిగట్టలేక పోయిన తామందరూ విధి వంచితులమంటారు.

ఆ విధంగా.... ఇంద్రప్రస్థ నగర నిర్మాణం నాడూ, రాజసూయ యాగ నిర్వహణ నాడూ, తాము ధర్మజుని అగ్రజ నాయకత్వాన్నీ, సమిష్టి విజయాన్ని అంగీకరించినట్లే.... నేడు సమిష్టిగా అపజయాన్ని పంచుకుంటారు.

నిజంగా భీముడు - ద్రౌపది - ధర్మరాజు ల సంవాదం, ధర్మ సమీక్ష భారతంలో కీలకమైనది. ఈ సన్నివేశం చివరిలో, కథలో ప్రవేశించిన వేద వ్యాసుడు, పాశుపతాస్త్రం సంపాదించమని పాండవులను ఆదేశిస్తాడు. ఆ విధంగా సభాపర్వంలో ద్రౌపది లేవనెత్తిన ధర్మ సందేహం, అరణ్యపర్వంలో పరిష్కరింపబడుతుంది. దేనినైనా కాలమే పరిష్కరిస్తుంది అన్నట్లు!

పీవీజీ మాపట్ల నిర్వహించిన గురుత్వం గురించిన మా ధర్మ సందేహాన్ని కూడా కాలమే తీర్చింది.

"ఇవ్వని గురుత్వాన్ని ఆయన ఎవరినడిగి పుచ్చుకున్నాడు?" అని తిట్టుకున్నాం. ఒక్కసారి గూఢచర్యం అనే ప్రవాహంలో దూకాక, ఇక దాన్ని తెలుసుకోక తప్పదు. లేకపోతే కేవలం ప్రాణభయమే ఉండదు. గౌరవగ్లాని, క్షణక్షణం మానసిక, కొండకచో శారీరక చిత్రహింసలుండినా ఆశ్చర్యం లేదు. వీటి నుండి రక్షింపబడాలంటే.... గూఢచర్య జ్ఞానమే రక్షణ కవచం. అందుకే పీవీజీ.... రెండుబోర్డుల మీద ఒకేసారి ఆడే చదరంగపు ఆట వంటి గూఢచర్యపు ప్రక్రియని సృష్టించాడు.

మధ్యలో మా పోరాటం ఆపివేసినా ఆయనని జీవితకాలం తిట్టుకుంటూనే ఉండేవాళ్ళం. అలాగాక ఆత్మహత్య చేసుకుంటే ఇక ఏమీ అనుకోవటానికి లేదు. అందుకని కూడా ఆత్మహత్య చేసుకుంటామంటే బెదిరించి మరీ అలాంటి ఆలోచనలు రాకుండా నివారించాడు. తరువాత అనివార్యంగానైనా పోరాడాం కాబట్టే ఆయన మమ్మల్ని ఎలా రక్షించాడన్నది మాకు అర్ధం అయ్యింది. ఒక ఎరా వరకూ ఆయన చేసినది అధర్మంగా కనిపించినది, తరువాత ధర్మంగా అర్ధమైంది. కాబట్టే ధర్మం బహు సూక్ష్మమైనది.

ఇక "ఫిర్యాదు ఇవ్వటంతో పౌరులుగా మా బాధ్యత తీరింది. మమ్మల్ని, దేశాన్ని కూడా రక్షించటం, ప్రధానిగా ఉన్నందున పీవీజీకి తప్పని ప్రభుధర్మం" అనుకున్నాం.

ప్రజాస్వామ్యంలో ప్రభుధర్మం, పౌరధర్మం అంటూ విడిగా లేవనీ, ప్రజాధర్మమే ప్రభుధర్మమనీ అర్ధమైంది.

ఇక పీవీజీ స్థానే గురు పీఠాన్ని అధిష్టించాననే సోనియా, ఆమె పేరిట ఈనాడు రామోజీరావులు.... చెప్పే వాదనలో ఎన్ని లొసుగులున్నాయంటే.....

పీవీజీ.......1992 నుండి 1995 వరకూ కూడా.... ఎప్పుడూ ’మీకు తెలిసింది ఎవరికీ చెప్పవద్దన లేదు. నిరూపణ లేకుండా చెబితే ఎవరూ నమ్మరు’ అని మాత్రమే చెప్పాడు. అదీ మాకు కలిగించిన అవగాహనలో ఒక భాగమే. అంతే గానీ ‘ఇదంతా చెబితే మిమ్మల్ని పిచ్చివాళ్ళంటారు’ అనలేదు.

’మీకు పిచ్చి, xyz సిండ్రోమ్, ABCD డిజార్డర్’ అనేది నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలకవ్యక్తి రామోజీరావే! అంతే కాదు, 1996 నుండి 2005 వరకూ మేము ఏ విషయమూ పట్టించుకోలేదు, సరే! 2004 లో పీవీజీ మరణించాడు, 1996 నుండి 2004 వరకూ కూడా, ఎప్పుడూ.... మమ్మల్ని "మీకు తెలిసింది ఏమిటో వచ్చి నాకు చెప్పు" అనీ అనలేదు.

అసలు మాకు గూఢచర్య అవగాహన కల్గించిందే పీవీజీ అయినప్పుడు, మాకు తెలిసిందీ, ఆయనకీ తెలియనిదీ ఏముంటుంది? ఆయనని మేము కలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యమైతే, అలాగే Drive చేసి ఉండేవాళ్ళు కదా! మాకు తెలిసినా తెలియక పోయినా, అప్పటికి మాకు గ్రహింపు ఉన్నా లేకపోయినా, మా జీవితాలలో గూఢచర్య ప్రమేయం ఉన్నప్పుడు, ఆ విధంగా Drive చేయటం ఏమంత పెద్ద విషయం కాదు కదా!

అప్పటికి [1996 నుండి 2004 వరకూ] చంద్రబాబు నాయుడి చేత రామోజీరావు మమ్మల్ని చెడుగుడు ఆడుకున్నాడు. కాకపోతే, ఇవేవీ తెలియనందున మేము అదంతా ’విధి వ్రాత’ అనుకున్నాము.

ఆ విధంగా పీవీజీ "నా దగ్గరికి వచ్చి నీకేం తెలుసో చెప్పు" అనీ అనలేదు.
అప్పటికి ఆయన గురించి మాకు వ్యతిరేక భావనలు ఉన్నాయన్నా, వాటిని మార్చే ప్రయత్నమూ చెయ్యలేదు.
’దైవేచ్ఛ ప్రకారమే ఏవైనా జరుగుతాయనీ, కాలమే దేన్నైనా పరిష్కరిస్తుందనీ!’ అన్నట్లుగా....
’ఈ పనిని నేనే చేశాను’ అనీ అహంకారం గానీ,
’ఈ పని ఫలితంగా సత్కీర్తి అయినా, విజయమైనా నాకే చెందాలి’ అనే ఆసక్తిగానీ లేకుండా....
‘దైవేచ్ఛ ప్రకారం ప్రారంభమైన ఈ గూఢచర్య యుద్దం, [మెదళ్ళతో యుద్దం] దైవేచ్ఛ ప్రకారమే నడుస్తుంది, ముగుస్తుంది’
అనుకుంటూ కానరాని లోకాలకు తరలి పోయిన కర్మయోగి పీవీజీ!

అదే.... సోనియా అయితే ’నేను పీవీజీ స్థానే నీ గురువుని! కాబట్టి నీకు తెలిసిందంతా నా దగ్గరి కొచ్చి, చెప్పు’ అంటుంది. అన్నీ తామే నడుపుతున్నప్పుడు, తొక్కలోది మాకు తెలిసిందీ, తమకి తెలియనిదీ ఏముంటుంది?

అదేగాక.... ఒక వేళ, ఆమె దేశం మీద జరుగుతున్న కుట్రలో భాగస్వామి గాక దేశభక్తురాలే అనుకోండి, మేము ఆమెని పొరబాటుగా గుర్తిస్తున్నామనుకోండి! మరి మమ్మల్నెందుకు వేధించినట్లు? ధరల మోత, పన్నుల వాత దగ్గరి నుండి అన్నిటా ప్రజలనెందుకు దోచుకుంటున్నట్లు? ఎన్డీ తివారీ దగ్గరి నుండి నోటుకు ఓటు దాకా, అన్ని అవకతవకలనీ తొక్కిపట్టిందెందుకు? సెజ్ ల పేరుతో భూముల్ని, అభివృద్ది కోసం అంటూ ప్రభుత్వ కంపెనీలని అమ్మి ప్రజాధనం మాయం చేసిందెందుకు? కసబ్ ల దగ్గర నుండి అఫ్జల్ గురుల దాక, [నళినలని సహితం] కాచి కాపాడుతుందెందుకు?

అదే పీవీజీ అయితే, పాక్ తీవ్రవాదుల్ని పట్టి లోపలేస్తే, ఎన్డీయే.... కాందహార్ విమాన హైజాక్ అంటూ సదరు తీవ్రవాదుల్ని, దగ్గరుండి విమాన మెక్కించుకొని, సురక్షితంగా ఆఫ్ఘన్ లో దించి వచ్చింది. యూపీఏ అయితే, అఫ్ఝల్ గురులకి మరణ శిక్ష అమలు చేయకుండా వంకలు చెబుతూ, కాలం వెళ్ళ బుచ్చుతోంది. ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టేందుకు అన్నట్లు.... ఎన్డీయే అద్వానీ అయినా, యూపీఏ సోనియా అయినా ఒకటే!

సరే! ఇవన్నీ కాదు, పీవీజీ మాదిరే సోనియా అనుకుందాం. అలాంటప్పుడు.... ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు తో సహా, రామోజీరావు గూఢచర్యం నిలువునా బహిర్గతమైంది, అడ్మినిస్ట్రేషన్ పరంగానే గాక దృష్టాంత పూరితంగా కూడా నిరూపితమైంది.

"ఏదైతే అదే అయ్యింది? ఫలితం భగవంతుడిది. పనే మనది" అనుకొని.... ఫలాసక్తి రహితంగా, తనను ఎవరైనా కుట్రదారు అనుకోనీ, కుట్రకు ఎదురొడ్డి పోరాడింది అనుకోనీ, దుష్కర్తే రానీ లేక సత్కీర్తే రానీ అనుకొని, వ్యక్తిగతాన్ని వదిలేసి [ధర్మాచరణలో వ్యక్తిగత ప్రయోజనాలకి తావు లేదని మొన్న అంతర్యామిలో కూడా చెప్పారు మరి!].... అన్నిటినీ ప్రకటించేయవచ్చుగా!

సోనియా, తాను దేశభక్తురాలన్నదే నిజమైతే.... మానవతా మూర్తి అన్నదే నిజమైతే.... ఆమెని అర్ధం చేసుకోవటంలో మాతో సహా ఎవరైనా పొరపాటు పడిందే నిజమైతే.... ఆ నిజమే బయటకు వస్తుంది కదా! ఇక భయమెందుకు? పీవీజీ అయితే మరి అలాగే వెళ్ళిపోయాడు. తనకి సత్కీర్తే రానీ దుష్కర్తే మిగిలిపోనీ, విజయమే రానీ, అవేవీ తాను చూడకుండానే..... నిజమైన నిష్కామ కర్మయోగి యై నిష్ర్కమించాడు.

అవన్నీ వదిలేసి.... "నువ్వు మమ్మల్ని నమ్ము, శుభంకార్డు వేసుకుందాం" అనటం ఎందుకు? ’తొక్కలో మేము’ అని వదిలేసి వూరుకునేందుకు.... మరోవైపు నెం.5 వర్గం తమ గూఢచర్య కార్యకలాపాలని, క్రమంగా.... బహిర్గతపరుస్తోంది, కుప్పకూలిస్తోంది! తమ ఏజంట్లతో సహా తమనీ సువర్ణముఖి అనుభవింప చేస్తోంది. ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసుతో సహా రామోజీరావు అనువంశీయ నకిలీ కణికుల గూఢచర్య వలయాన్ని ప్రకటించక పోతే.... నెం.5 వర్గం ఊరుకోదు. బహిర్గతాలు - సువర్ణముఖిలు అంతకంతకూ స్థాయి పెంచుతూ కొనసాగిస్తుంది.

అలాగని కేసు ప్రకటిస్తే.... తమకి మిగిలేదేం ఉండదు, గూఢచర్యపరంగా మరణం తప్పితే! ఈ ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ ని తప్పించుకునేందుకే... ఈ వత్తిడంతా! లేకపోతే ఈ బ్లాగుతో నష్టమేమిటి?

ఏ ప్రజలైతే దగా పడుతున్నారో, కుట్రలకు బలవుతున్నారో, ఆ ప్రజలకి నిజం తెలిస్తే.... కుట్రలకు వ్యతిరేకంగా....ఇందిరాగాంధీ, పీవీజీ ల్లాగే పోరాడుతున్నననే సోనియాకి నష్టం ఏమిటి? ప్రజలకి సత్యం తెలిస్తే పని మరింత సులువవుతుంది కదా! బదులుగా బ్లాగు వ్రాతలు మానమనీ, బ్లాగు డిలీట్ చెయ్యమనీ వత్తిడెందుకు? ఇదంతా అసత్యమే.... అయితే ఈ పాటికి సోనియా, రామోజీరావులు మా మీద న్యాయపరమైన చర్యలూ, పరువునష్టం దావాలూ అంటూ ఖయ్యి మనక పోయారా?

`మొత్తం issue సోనియాకి క్షుణ్ణంగా తెలుసు' అనడానికి 2007, ఏప్రియల్ 20న ఏఐసిసి జనరల్ సెక్రటరీగా దిగ్విజయ్ సింగ్ మాకు వ్రాసిన లేఖ నిరూపణ. coups on world లోని Documentary Evidence – Scanned Copies లో అవన్నీ పొందుపరిచాను.

అసలు ఇదంతా అసత్యమే అయితే,.... ఇంత నైపుణ్యంగా, ఇంత అభూత కల్పనని, ఇంత ఉత్కంఠపూరితంగా, ఆకర్షణీయమైన శైలిలో చెప్పగలుగుతున్నామని తామే అంటున్నప్పుడు.... ఆపాటి మాకు తెలియదా?

అలాంటి చోట.... ఇంత అభూత కల్పననీ, ఇంత ఉత్కంఠపూరితంగా, ఇంత ఆకర్షణీయమైన శైలిలో వ్రాసేటప్పుడు.... ఈ సోనియా, రామోజీరావు ల వంటి వ్యక్తుల పేర్లకు బదులుగా, ఏ సుబ్బారావు అప్పారావుల వంటి కల్పిత వ్యక్తుల పేర్లతోనైనా వ్రాస్తే.... మా ఈ రచనకు.... పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రాదా? వస్తాయన్న ‘ఆపాటి ఇంగిత జ్ఞానం’ మాకు లేదా? పేరున్న వాళ్ళతో పనిలేక తగవు పెట్టుకుంటామా? ‘కేసులు పెడతారు లేదా భౌతిక దాడులు, లేదా చంపటం లాంటివి చేస్తారు, ఎందుకని’ మా పాటికి మేము ఊరుకోమా? జీవితం మాది. మా జీవితం గురించి మేము ఇంకా ఎక్కువగా అలోచిస్తాము కదా!

ఇవన్నీ ఆలోచించకుండానే... మా బ్లాగులో ప్రయత్నపూర్వక అజ్ఞాతలు, కొందరు, వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. ఏ టపాలోనైనా సరే, కీలక విషయాన్ని, రామోజీరావుకి మరింత నొప్పికలిగే విషయాన్ని, తొలిసారిగా చెప్పటం ప్రారంభించిన రోజు, ఆ టపా వ్యాఖ్యలు మరింత దురుసుగా, కొండొకచో బూతులతో, తిట్లతో, ’నీకు పిచ్చి’ అంటునో, వ్యంగ్యాలతోనో ఉంటాయి. క్రమంగా తగ్గుతాయి. మళ్ళీ కొత్త విషయం మొదలు పెట్టగానే.... కొత్త చిందులూ, కొత్త వ్యాఖ్యలూ ప్రత్యక్షమౌతాయి.

నిజానికి పీవీజీ మేధస్సుని మేము గ్రహించిందే చాలా తక్కువ. అందులోనూ కొంత మాత్రమే కాగితంమీద పెట్టగలిగాము. [అంటే బ్లాగులో అన్నమాట] ఆయన స్ట్రాటజీ... పాజిటివ్ లేదా నెగిటివ్ గా ఎలా చూసినా ఫిట్ అవుతుంది. అందుకే ఆయనని గురించి మేము మురిపెంగా [గాయత్రీ మాత వరం పొందిన తెనాలి రామకృష్ణ కవి ని గుర్తు తెచ్చుకుంటూ] ‘వికటకవి’ అనుకుంటూ ఉంటాము. ‘వికటకవి’ ఎటునుండి ఎటు చదివినా ఒకేలాగా కన్పిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ఇది మీ టపా కి సంబంధించినది కాకపోవచ్చు కానీ.. మీకున్న విశ్లేషణా సక్తి తో నాకు కొంచెం విశ్లేసిస్తారని వ్రాస్తున్నా... భారత దేశం లో ఈ బహు పార్టీ వ్యవస్థ ఎక్కడికి తీస్కెళ్తున్నది ..ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పార్టీ అధికారం లో ఉంటే అప్పుడు కేంద్రం లో ఒక్కరే ఎలా అధికారం లోకి రాగలరు... విశ్వసనీయత ఎవరైనా సంపాదించేలా ఉంది.. ఎవరేమి చేసినా తెలవకుండా చేసి.. సాధు జంతువు వేషానికి ఈజీ గా వచేస్తున్నారు.. మీరంటున్న వ్యక్తులూ, సరద్ పవార్, కరునానిధి.. లాంటి వాళ్ళు చేసె యంత్రాలకు ఎవరూ గెలవలేరు... ప్రజలకు పూర్తి స్థాయి అవగాహనా, నిర్ణయం తీస్కునె నేర్పు, ఎలా వస్తాయి... నీళ్ళు డాం ల పేర్లు చెప్పి రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి... ఒకే ప్రాంతీయులు వివిధ వాదనలతో కొట్టుకుంటున్నారు... ఇవన్నీ కంట్రోల్, పట్టు తప్పకుండా ఉండేందుకు నాయకులు వేసే ఎత్తులు అనుకోవచ్చా.... లేక మేము గెలవటమే ధర్మం అనే పాండవుల విధానం లాంటిదే ఇది కూడానా... పెద్ద నాయకుడిగా ఎదగగలిగిన వ్యక్తులు ఎటు తీస్కెల్తే అటు వెళ్తోంది సమాజం...

కొన్ని సార్లు అభివృద్ది కుంటు పడటమూ, మరి కొన్ని సార్లు శరవేగంగా దూసుకెళ్ళినట్లు చూడటం జరుగుతోంది... కానీ నిజం గా అవసరమైన దిశలో వెళ్తోందా... జ్ఞాన సముపార్జన, చైతన్య వంతమైన సమాజ నిర్మాణం , ఆర్థిక అసమానతలు లేకుండా చేసే సరైన ఉద్యోగ ఉపాది కల్పనా విధానాలు సరిగానే జరుగుతున్నాయా... వీటిని ఎప్పటి కప్పుడు లెక్క గట్టగలుగు తున్నామా... వీటిపై కూడా మీ అభిప్రాయాలు వ్రాస్తారని ఆశిస్తున్నాను...

కృష్ణ గారు: మీరన్నది నాకర్ధమైందండి. తదుపరి టపాలలో మరికొంత స్పష్టత ఇవ్వగలను.నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu