10 రోజుల క్రితం [29 జనవరి, 2010న] బ్లాగు మిత్రులు చిలమకూరు విజయమోహన్ గారు తన అందమైన బ్లాగు ’లీలా మోహనం’ లో స్వరచిత సురుచిర చిత్రాన్ని ఉంచి, దాన్ని ఎవరైనా ఆధ్యాత్మికత జోడించి వ్యాఖ్యానించవలసిందిగా కోరారు. నాకు తోచింది అక్కడ వ్రాసాను. అందుకు విజయమోహన్ గారు, మిగతా వారు జవాబిస్తూ తమ వెర్షన్ వ్రాసారు. అదంతా మీ పరిశీలన కోసం ఇక్కడ ఇస్తున్నాను.

యాదృచ్చికంగా ఈ రోజు [8 ఫిబ్రవరి, 2010] ఈనాడు అంతర్యామిలో కూడా దాదాపు ఇదే పోలికతో కూడిన వ్యాసం ప్రచురింపబడింది. ఓ సారి పరిశీలించండి.

ముందుగా చిలమకూరు విజయమోహన్ గారి బ్లాగులో మా వ్యాఖ్య:
గన్నేరు ఆకులు క్రింద... గమ్మున... గుంపులో ఒకటిగా ఉండే గుడ్డు, నెమ్మదిగా పిగిలి మెల్లిగా బయటికొచ్చే లార్వా పురుగు! ఎడాపెడా ఆకులన్నీ తినేసి... అస్తిత్వాన్నిచ్చిన పూల మొక్కని గుండు కొట్టేస్తుంది. గోరంత పురుగు చిటికెన వేలంత పెరిగి పోతుంది. అంతలోనే ఏమనుకుంటుందో... ముడుచుకు పోయి, తన చుట్టు తానే అల్లుకుపోయి, గాఢ సుషుప్తిలోకి జారిపోతుంది. బయటి చప్పుళ్ళు తెలియవు. వెలుగు చీకటులు పట్టవు. ఎండా వానా కూడా గుర్తించదు. 21 రోజుల గడిచాక ప్వూపాను చీల్చుకుని బయటికొచ్చే రంగు రంగుల సీతాకోక చిలుక, పూలలో మకరందాన్ని గ్రోలుతూ, పరపరాగ సంపర్కాన్ని నెరవేరుస్తూ పూల మొక్కల వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.

అనువర్తించి చూసుకుంటే, సీతాకోక చిలుక మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.

లార్వా పురుగు, విధ్వంసాన్ని సృష్టిస్తూ... తనకు నీడనిచ్చిన, గుడ్డు పిగిలి తాను పుట్టడానికి ఆవాసాన్నిచ్చిన పూల మొక్క ఆకుల్ని నాశనం చేసేస్తుంది. కొరికి పారేస్తుంది. దుష్ట దృక్పధం ఉన్న మనిషిలాగా!

అదే అంతర్మధనం చెందితే...? తన లోపలికి తాను చూసుకుని తపిస్తే...? బయటి పరిస్థితులని పట్టించుకోనంతగా ఆత్మావలోకనం చేసుకుంటే? గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక లాగా... దుష్టత్వం నుండి దైవత్వం రాగా..., వ్యతిరేక దృక్పధం నుండి సానుకూల దృక్పధం లోకి మనిషి ప్రయాణిస్తాడు. అప్పుడు తనకి జన్మనిచ్చిన పూల మొక్కల వృద్ది కోసం రెక్కలల్లార్చుకు తిరిగే సీతాకోక చిలుకలా జగత్కళ్యాణానికి తోడ్పడతాడు.

అందుకేనేమో, గొంగళి పురుగు రూపు చూడ వికారంగా ఉంటే సీతాకోక చిలుక రూపు మనోహరంగా ఉంటుంది. ప్రకృతిలోనే ఇంత ఆధ్యాత్మికతని జోడించాడేమో ఆ భగవానుడు అన్పిస్తుంది. అందుకేనేమో వివేకానంద స్వామి, "దుష్టుడివైతే మరింత దుష్టుడువైపో, ఎప్పటికైనా వెనుతిరిగి రాక తప్పదని" అన్నాడేమో అన్పిస్తుంది. ఆదికవి వాల్మీకి కథ అయినా అదే! చరిత్రలో చూసినా చంఢాశోకుడు, ధర్మాశోకుడు అయ్యాడు.

ఏమైనా, దౌష్ట్యం స్థానే సౌజన్యం రావాలన్నా, చెడు స్థానే మంచి రావాలన్నా అంతర్మధనం తప్పదేమో కదా!

అలాగే ఈనాడు అంతర్యామి :మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

3 comments:

అంతర్మథనం .. అదే మనలో దాగున్న సీతాకోకచిలుకల్ని వెలికి తీసే తాళంచెవి.

good question sir,,simple sentencelo "JEEVAATMA PARAMAATMANI CHERUKONE MAARGAMLO PAYANISTUNDI"....

కొత్తపాళీ గారు : చాలా రోజుల తరువాత వ్యాఖ్య వ్రాసారు. నెనర్లు!

రుక్మీణి దేవి గారు: నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu