ఆ విధంగా.... పీవీజీ కి, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావు ఉనికి తెలిసిన 1992 జూన్ నుండి, డిసెంబరు లో బాబ్రీ కూల్చివేత వరకూ గడిచిన ఆరునెలలు, విషయ నిర్ధారణకు ఉపయోగపడ్డాయి. ఈ విధంగా తొలిదశ నడిచింది.

ఇక రెండవ దశ - 1993 ప్రారంభం నుండి 1996 ఎన్నికలలో పీవీజీ ఓడిపోయే వరకూ గడిచిన కాలం [3 1/2 సంవత్సరాలు]. పీవీజీ, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు... రామోజీరావు, సోనియా, అద్వానీలని "దొరికిపోయావ్" అన్న హెచ్చరిక ఇచ్చినప్పుడు, వాళ్ళు మొదట దిగ్బ్ర్హాంతికి గురయ్యారు. తర్వాత రామోజీరావు తలెగరేసాడు. "అయినా నువ్వేం చెయ్యలేవ్" అన్నది అతడి జవాబు. ఎందుకంటే - ’మహా అయితే ఇండియాలో తానే ప్రధాన విదేశీ ఏజంటనీ, అమెరికా సిఐఏ, ఇజ్రాయేల్ మొస్సాద్ తరుపున లేదా బ్రిటీష్ యంఐ 5 or 6 తరుపున పని చేస్తున్నాననీ, ఇప్పటి దాకా ఇంకెవరెవరో ప్రధాన ఏజంటుగా project చేయబడుతున్నారనీ పీవీజీ తెలుసుకోగలిగి ఉంటాడు’ అనుకున్నాడు. అందుకే నిర్లక్ష్యం, చులకనలతో కూడిన పొగరుతో తలెగరేసాడు. తమ ప్రపంచవ్యాప్త పట్టుని గాని, అనువంశిక గూఢచర్య వలయాన్ని గానీ, ఎవరూ పసిగట్టలేరన్న అపార నమ్మకం అతడిది.

ఏమిటిది!? ఎన్నో పైకారణాలతో[over leaf reasons], ఎన్నో చిక్కుముడులతో, రకరకాల ద్వంద్వాలతో, ఆయాదేశాల కాల మాన పరిస్థితులకి... సహజమైనవనిపించే సంఘటనలతో, మూడున్నర శతాబ్దాలుగా అల్లబడిన గూఢచర్యం! ఎవ్వరు పసి గట్టగలరు? అందునా గూఢచర్యం అంటే, తము ప్రచారించిన సిద్దాంతాలనే అన్నిదేశాలు ఒప్పుకుంటుండగా! ఒక్క గూఢచర్యమే కాదు, ఏ రంగంలో విషయమైనా తము ప్రచారించిందే సిద్దాంతము, సత్యమూ! విస్సన్న చెప్పిందే వేదం లాగా! ప్రపంచమంతా కామమ్మ మొగుడంటే కామోసనుకోవాల్సిందే! అందుకే ఎంతో అతిశయమూ, అహంకారము! కాబట్టే, "నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, మీడియా నా చేతుల్లో ఉంది. మంత్రివర్గం దగ్గరి నుండి కీలక స్థానాల్లో మా [అంటే CIA etc.] ఏజంట్లే ఉన్నారు" అన్నట్లుగా తలెగరేసాడు.

ఉదాహరణకి ’మనకి టైలరింగ్ రాదు’ అంటే ఇక టైలర్ చెపుతాడు చూడండి. ’బట్టలు కుట్టటం అన్నది ఓ బ్రహ్మవిద్య’ అన్న లెవెల్లో చెబుతాడు. అలాగన్నమాట.

దీన్నే ప్రభుత్వోగిపరంగా చెప్తే! మా అనుభవంలో ఉన్న ఒక సంఘటన... శ్రీశైలంలో దేవస్థానపు డిఫ్యూటీ ఈవో కృష్ణయ్య "ఏమిటిది? గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ! ఉద్యోగుల్లో చాలామందికి డ్రాప్టింగ్ రాయటమే సరిగా రాదు. అలాంటిది మామూలు టీచర్లు, ప్రైవేటు వ్యక్తులు. వాళ్ళకేం తెలుసు మన రెడ్ టేపిజం ప్రభావం?" అనే ప్రవర్తన చూపించాడు. కేసుల్లో బాగా కూరుకుపోయాక తెలిసింది అతనికి, తనకి తెలిసింది తక్కువని. అదే ప్రక్క వాళ్లకి చెప్పుకున్నాడు. చాలాసార్లు ఇలాంటి అనుభవం మనకి ఎదురౌతూనే ఉంటుంది.

దొంగని కారుతో సహా పట్టుకున్నపోలీసుని చూసి, అతడికి డ్రైవింగ్ రాదనుకొని "కారు పట్టుకుంటే పట్టుకున్నావ్! నీకు నడపటం రాదుగా" అని దొంగ ఎకసెక్కంగా నవ్వినట్లు.[ఇంతా చేసి తమకి వచ్చింది డీవీడిని రిమోట్ కంట్రోలుతో ఆపరేట్ చేయటం వంటి గూఢచర్యమే! అసలు గూఢచర్యపు పునాదులే భారతీయ ఇతిహాసాల నుండి ప్రారంభమైన చోట, నిజంగా గూఢచర్యం బ్రహ్మవిద్యా తెలుసుకోలేక పోవడానికి?]

దీనికి పీవీజీ మాటలతో జవాబు చెప్పలేదు. చేతలతో చెప్పారు. ఇక యుద్దం మొదలు! తొలినాళ్లల్లో "ఆ! ఇతణ్ణి పడగొట్టటానికి ఈపాటి ఎత్తుగడ చాలు" అన్నట్లుగా నడిపారు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులు. మూడున్నర సంవత్సరాలలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టటం వంటి ప్రయత్నాలు చాలానే చేసారు. ఈ నేపధ్యంలోనే, తదుపరి రోజుల్లో జెంఎంఎం ముడుపుల కేసులు పుట్టాయి. శిబూసోరెన్ కు సంబంధించిన ఈ ప్రకరణం గురించి గతటపాలలో వివరించాను.

తమ ప్రయత్నాలకి పీవీజీ స్పందించకపోవటంతో మౌనానందస్వామి, తాత్సార బ్రహ్మ ఇత్యాది బిరుదులిచ్చి మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. పీవీజీ ఉలకలేదు, పలకలేదు. పైగా ’కొన్ని సమస్యలని పరిష్కరించకపోవటమే, వాటికి సరైన పరిష్కారం’ పొమ్మన్నాడు. తము ప్రయోగించిన సామ దాన భేద దండోపాయాలకి, బెదిరింపులకి, బుజ్జగింపులకి... పలు సందర్భాలలో పైముఖంగా అమెరికా, సీఐఏ లను వాడుకున్నారు.

అప్పటికే 1992 నవంబరు 2 న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో... అప్పటి వరకూ ఉన్న అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ... ’రాస్ పెరాట్’ అనే వ్యక్తి ఎన్నికల్లో క్రియాశీలక అభ్యర్దిగా అవతరించటంతో, అప్పటి వరకూ విజయావకాశాలు మెండుగా ఉన్న రిపబ్లికన్ అభ్యర్ధి సీనియర్ బుష్ ఓటమి పాలై, డెమోక్రాట్ అభ్యర్ధి క్లింటన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే - తము ఒక పార్టీని గెలుపించుకోవాలని అనుకుంటే, అందుకు తగిన పరిస్థితులని పైకారణాలని సృష్టించుకుంటారు. ఆ విధంగా గెలిపించుకున్న తరువాత తమకి కావలసిన ప్రయోజనాలని పొందుతారు. అదే, మరో పార్టీ గెలిస్తే పరిస్థితులన్ని తలక్రిందులవుతాయి. వాటన్నిటికీ తగిన పరిస్థితులని పైకారణాలని సృష్టించుకోవటానికి మరింత సమయం పడుతుంది. ఈ లోపు ఎదుటి పక్షం, మొత్తం తమ వ్యూహాలను మార్చి వేస్తుంది. ప్రభావపరుస్తుంది కూడా!

ఇక్కడ మరో విషయం కూడా ఆసక్తికరమైనది. "ప్రపంచమంతటిలో ఇండియా పనికిమాలినది. ఇండియాలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పనికిమాలినది. ప్రపంచ ప్రజలలో భారతీయులు వ్యర్ధ జీవులు. భారతీయులలో తెలుగువాళ్ళు మరింత వ్యర్ధ జీవులు" - ఇదీ నకిలీ కణిక వ్యవస్థ మనకి చెవినిల్లు కట్టుకుని నూరి పోసింది. [ఈ తరం యువకులకి ఇది నమ్మశక్యం గాకపోయినా, ఇది నిజం. అప్పుడు ఎంత న్యూనత పరిచారో, ఇప్పుడు అంతగా, చచ్చినట్లు పొగడక తప్పటం లేదు.] అయితే ఇలా ప్రచారించి ప్రచారించి, ఆ ప్రచారాన్ని కొంత తమ తలకీ ఇంకించుకున్నారు.

కాబట్టే ’ఆప్ట్రాల్ ఇండియా! అమెరికా అధ్యక్ష ఎన్నికలని ఏమాత్రం ప్రభావపరచలేదు!’ అనుకున్నారు. కనుక సహజంగానే అమెరికా అప్పటి అధ్యక్ష ఎన్నికలలో, అక్కడి కార్ఫోరేట్ మదగజాల మనీ గేమ్ అండ్ పవర్ గేమ్ పైకారణంగా[over leaf reasons] కనబడింది. అదే ఇప్పుడైతే అమెరికా సెనేట్ హిందూ మంత్రోచ్ఛారణతో ప్రారంభమవుతుంది, బరాక్ ఒబామాకి అత్యంత సన్నిహిత సహచరులు, ప్రముఖ రాయబారులూ భారతీయులే అవుతున్నారు.

సరే మళ్ళీ పీవీజీ దగ్గరి కొద్దాం! అప్పట్లో పీవీజీని అంతర్జాతీయంగా ఒత్తిడికి గురిచెయ్యటానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలోనే NPT మీద సంతకం పెట్టటానికి నిరాకరించిన పీవీజీని అమెరికా బెదిరిస్తున్నట్లుగా ఈనాడు కార్టూన్ ప్రచురించింది. మూతి బిగించుకు కూర్చొన్న, పీవీజీ నుండి ’నో’ అన్న సంజ్ఞ వస్తున్నట్లు, అమెరికా ఒకటోసారి, రెండోసారి, వందోసారి హెచ్చరిస్తున్న/అడుగుతున్నట్లు వేసిన కార్టూన్ అది!

1993 తొలినాళ్ళల్లోనే ’నాలుగేళ్ళ మారిటోరియం’ అన్నాడాయన. ఆయన్ని ఇరుకున పెట్టటానికి - గతంలో ఇందిరాగాంధీ మీద ప్రయోగించిన తంత్రాలన్నీ ప్రయోగించింది నకిలీ కణిక వ్యవస్థ! ఆ విధంగా గతంలో వాటిని పునరావృతం చేయించి, రికార్డ్ చేయటం అన్న ప్రక్రియని ఆనాటి నుండి ఈనాటి దాకా, నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ మీదా, నెం.10 వర్గం మీదా, అందులోని కీలక వ్యక్తుల మీదా ప్రయోగిస్తూనే ఉంది. 1969లోనూ,1971లోనూ జరిపిన ప్రత్యేక తెలంగాణా, జై ఆంధ్రా వంటి ఉద్యమాలు తిరిగి సంభవించటం - అందులో ఒకటి. తెలంగాణా వ్యవహారంలో ఉన్న వివిధ కోణాల్లో, సువర్ణముఖి లాగే ఇదీ ఒకటి.

ఆ విధంగా ఇందిరాగాంధీ మీద ప్రయోగించిన తంత్రాల్లో కొన్ని - మానసికంగా అసహనానికి గురిచేసి విసిగించటం. గతటపాలలో వివరించిన షాబానో కేసులాగా!


ఉదాహరణకి - ఎన్డీ తివారి విషయమే. అప్పట్లో ఉన్నట్లుండి కనబడకుండాపోయిన ఎన్డీ తివారీని పీవీజీనే ఏదో చేయించాడని ఓ మోస్తరు ప్రచారం! అందులో మౌఖిక, ప్రాంతీయ [లోకల్ గా ఢిల్లీ వరకూ] ప్రచారమే ఎక్కువ. అతడి గురించి మరో మంత్రివర్గ సహచరుడు రాజేష్ పైలట్ పీవీజీని వాకబు చేయగా... ఎన్డీ తివారీ ఫలానా గెస్ట్ హౌస్ లో ఉండవచ్చని పీవీజీ అన్నాడు. ’తమాషా’గా అతడక్కడే ప్రియురాలితో ఉండటం సంభవించింది.

ఇలా కాదనుకొని - పీవీజీ మంత్రివర్గ సహచరుల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తించారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ అలాంటి వాటిలో కొన్నిటిని Defend చేసుకునేది. ఆ సందర్భంలోనే "అవినీతి లేనిదెక్కడ?" అని ఆవిడ అన్నదని, ఈనాటికీ ఈనాడు, సంపాదకీయ పేజీలోని వ్యాసాల్లో ప్రచురిస్తూ ఉంటుంది. ఆ విధంగా Defend చేసుకోకపోతే ఇందిరాగాంధీ స్వంత బృందం కూడా మిగలక మరింత ’ఒంటరి’ అవుతుంది. అప్పుడు రాజకీయంగా ప్రభుత్వాన్ని నడపటం మరింత కష్టం! అందుచేత ఆవిడ Defend చేసుకునేది. దాంతో ఆవిడని వేధించడానికి మరొక పైకారణం[over leaf reason] పుట్టేది నకిలీ కణిక వ్యవస్థకి. "చూశారా! ఇందిరాగాంధీ మంత్రివర్గం నిండా అవినీతి పరులే. దాన్ని ఆవిడా సమర్ధించుకుంటోంది" అని హోరెత్తించవచ్చు.

అప్పట్లో గూఢచర్యపు పట్టు నకిలీ కణిక వ్యవస్థకి ఉంది గనుక, ఇందిరాగాంధీ ఏం చేసినా, అందులోంచే ఆవిడని వేధించటం, యాగీ చేయటం చేయగలిగే వాళ్ళు. Defend చేసుకుంటే అవినీతిని రక్షిస్తోందనవచ్చు. Defend చేసుకోకపోతే ఒంటరిని చేయవచ్చు. ఇది కూడా ఒకరకంగా ’కన్నా?కాలా?’ స్ట్రాటజీనే! ఇదే తంత్రం పీవీజీ మీదా ప్రయోగించారు. అయితే పీవీజీ, ఎవరి మీద ఆరోపణలు వస్తే వారి మీద సీబీఐ విచారణలు వేసి, ఆ ఆవినీతిని వెలికి తీయటమే పనిగా చేశాడు. అప్పట్లో బయటపడినవే అర్జున్ సింగ్, సుఖ్ రాం తదితరుల అవకతవకల గురించిన కేసులు!

సదరు అర్జున్ సింగ్ సోనియాకి ఎంతగా పాదాక్రాంతుడో 2008, 2009 లలో అందరం చూసిందే. సోనియాకి ఆగ్రహావేశాలు కలిగినందుకు, బహిరంగ వేదిక మీదే గజగజ వణికాడు. అప్పట్లో ఆయా విషయాలపై టపాకాయలు పేల్చాము. అమ్మఒడిలోనూ వ్రాసాము.

ఇక మరో మంత్రివర్గ సహచరుడు మాధవ్ సింగ్ సోలంకి అయితే, విదేశీ పర్యటనకి వెళ్తూ జేబులో ఎవరి కోసమో తీసుకెళ్తున్న లేఖ[చిట్టీ] తో సహా విమానాశ్రయంలో దొరికాడు. "ఏమిటయ్యా ఈ కొరియర్ సర్వీసు?" అంటే "అబ్బే! నాకేం తెలియదు. విమానాశ్రయంలో ఎవరో కుర్రవాడు తెచ్చి ఇస్తే యధాలాపంగా జేబులో పెట్టుకున్నాను" అన్నాడు. అచ్చంగా తాడిచెట్టు ఎందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్న సామెత మాదిరిగా! ఈ మాధవ్ సింగ్ సోలంకి వారసుడు, ఇప్పుడు సోనియా ఆశీస్సులూ, పదవులూ పొందుతున్నాడు.

ఇందిరాగాంధీ హయంలో - ఆవిడ మంత్రివర్గ సహచరులలో కొందరు కావాలని [వ్యూహాత్మకంగా అన్నమాట] తప్పిదాలు చేయటం, వ్యాఖ్యలు చేయటం వంటి పనులకు పాల్పడేవారు. దెబ్బతో రాజుకునే వివాదాలకు ఇందిరాగాంధీ బాధ్యత వహించాల్సి వచ్చేది. మొత్తం పరిస్థితులని చక్కదిద్దుకోవాల్సి వచ్చేది. అదే తంత్రం పీవీజీ మీదా ప్రయోగించారు. అయితే ఆయన నుండి డిటాచ్ మెంట్ స్పందనగా వచ్చేది. ఎవరు ఏ వివాదానికి చిక్కుబడితే, దానికి వాళ్ళనే బాధ్యులుగా వదిలేసాడు. తన మంత్రివర్గం, తన ఇమేజ్, మీడియా కవరేజ్ గట్రాల గురించి ఏమాత్రం తాపత్రయ పడలేదు. దాంతో అవి తిరిగి నకిలీ కణిక వ్వవస్థలోని పావులకే, ఎవరైతే ఆయా వివాదాలని లేదా వ్యవహారాలని ప్రారంభించారో వాళ్ళకే తగలటం ఫలితంగా వచ్చాయి.

వీటన్నిటితో, పీవీజీ అంటే అప్పటి ఆయన మంత్రివర్గ సహచరులకీ [చాలామందికి] ఆగ్రహావేశాలు పుట్టాయి. కానీ పరిస్థితులు అనుకూలించక దిగమింగుకోవాల్సి వచ్చింది. గూఢచర్యపు పట్టు ఆయనకే ఎక్కువగా ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలించవు కదా! అప్పటికే [1993 ప్రారంభంలోనే] తన కార్యాలయాన్ని Renevate చేయించాడాయన. సీలింగ్ తో సహా ఆయన అభీష్టానుసారం మార్పించబడిందన్న వార్తలొచ్చాయి. ఆపైకారణంతో ప్రధాని కార్యాలయం గట్రాలలో అప్పటికే అమర్చి ఉంచిన ’బగ్గింగ్’ వంటి ఏర్పాట్లన్నిటినీ తొలిగించటం జరిగింది.

సమాచార సాంకేతికతని ఉపయోగించి, పరిమాణంలో చిన్నగా ఉండే సునిశితమైన పరికరాలని, తమకి కావలసిన చోట రహస్యంగా అమర్చి, వాటి ద్వారా అక్కడ జరుగుతున్న సంభాషణలని, కార్యకలాపాలని పసిగట్టటాన్ని బగ్గింగ్ అంటారు. అలాంటి వాటిని పనిచేయకుండా నిర్వీర్వం చేయటానికి ఉపయోగించే పరికరాలని ’జామర్లు’ అంటారు. ఇలాంటి వాటి గురించి సామాన్య ప్రజానీకానికి తెలియటం అదే ప్రధమం. ఆ తర్వాత తెహల్కా వ్యవహారం నేపధ్యంలో వాటి గురించి మరింత ప్రచారం వచ్చింది. ఇప్పుడు చాలా సినిమాలలో అలాంటి సునిశిత సూక్ష్మ పరికరాల గురించి చూపబడుతుంది.

ఇలా కార్యాలయాన్ని, నివాస భవనాన్ని దుర్భేద్యం చేసుకున్నాక, ఆయన తన సిబ్బందిని కూడా ప్రత్యేకంగా మార్పుచేర్పులు చేసుకున్నారు. ఈ విధమైన పలుచర్యలతో కూడా, లోపలేం జరుగుతుందో పసికట్టటం, నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకి కష్టమైంది. 1992 జూన్ తర్వాత ఓడల కొద్దీ వెండి, బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాయి. పెద్ద ఎత్తున ఆయుధాలు దొరకటం జరిగింది. మాదక ద్రవ్య దొంగరవాణా రాకెట్ లలో కీలకమైన వ్యక్తులు, కేంద్రాల గురించిన సమాచారం ’లీక్’ అయి పట్టుబడటమూ జరిగింది. ఉగ్రవాదులు వందల సంఖ్యలలో గుంపులు గుంపులుగా లొంగిపోయారు.

1992 అక్టోబరులోనే, అంతకు ఆరునెలల క్రితం [మార్చి, 1992] తిరుపతి కాంగ్రెస్ ప్లీనరీ సభలలో, పీవీజీకి అత్యంత సన్నిహితుడిగా ఈనాడు గోలపెట్టి ప్రచారించిన, ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి, ’ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో కాపిటేషన్ ఫీజుల వివాదం’ అనే పైకారణంతో రచ్చజరిగి పదవీచ్యుతుడయ్యాడు. మహారాష్ట్ర లోనూ ఇలాంటిదే మరో వ్యవహారం నడిచి, అప్పటి ముఖ్యమంత్రి తప్పుకోగా... అప్పటి వరకూ కేంద్రంలో రక్షణ మంత్రిగా ఉంటూ, పీవీజీ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్నాడంటూ మీడియా తెగ ప్రచారించిన శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుండి ముంబైకి పోయాడు.

తదనంతర పరిణామాలలో, అన్ని రాష్ట్రాలలో పీవీజీ పట్టు పెరగడాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులకి కష్టమై పోయింది. [ఇలాంటి సంఘటనలని నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు, ’పీవీజీ రాజకీయంగా’ మాత్రమే అప్పటికి చూశారు. పీవీజీ కూడా, అప్పటికి తనకి గూఢచర్యగుట్టు తెలిసిందన్న విషయం బయటికి పొక్కనీయలేదయ్యె! ]

అప్పటికి వాళ్ళు పీవీజీ కి లభించింది కేవలం భారతదేశానికి సంబంధించిన గూఢచర్య పట్టు మాత్రమే అనుకున్నారు. భారతదేశంలో ప్రధాన ఏజంటుగా రామోజీరావుని పీవీజీ గుర్తించటం వల్ల తమకి ఈ ఎదురుదెబ్బలన్నీ తగులుతున్నాయి అనుకున్నారు. కాబట్టి ఓ మోస్తరు ప్రయత్నాలతో ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అనుకుంటే - మైనారిటీ ప్రభుత్వంతో కూడా ఆయన బలంగా కనబడ్డాడు.

ఇక దాంతో నకిలీ కణిక వ్వవస్థ, అందులోని కీలక వ్యక్తులు, వ్యూహం మార్చి, పీవీజీని మౌననందస్వామి గట్రా పేర్లతో విమర్శించడం మాని, పొగడటం మొదలుపెట్టారు. మీడియా, కీర్తించటమూ మొదలు పెట్టింది. అపర చాణిక్యుడనీ, రాజనీతి దురంధరుడనీ, దార్శనికుడనీ! ఈనాడు మరో అడుగు ముందుకు వేసి అలనాడు పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన వీర భోగ వసంత రాయలు పీవీజీనే అంటూ పొగిడి పారేసింది. దీనికి సమాంతరంగా అప్పటికి ప్రపంచ ప్రఖ్యాతుడని ప్రచారంలో ఉన్న నోస్ట్రడామస్ చెప్పిన దానికి కూడా ఇది సరిపోలుతుందన్న ప్రచారము వచ్చింది. [ఇంతకీ నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్నారంటే - దక్షిణ భారత దేశం నుండీ ప్రపంచాన్ని ప్రభావపరిచే మహావ్యక్తీ ఉద్భవిస్తాడని!]

ఇలా ’అందితే జుట్టు అందకపోతే కాళ్ళు’ అన్న తమ బుద్దిని బహిర్గతం చేసుకుంటూ నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులు, పీవీజీని పొగడటం ప్రారంభించారు. 1993 ప్రారంభంలో ’దొరికి పోయారు’ అన్న హెచ్చరిక ఇచ్చిన తదనంతరం కొద్ది కాలం విమర్శించారు. ఆ తర్వాత పొగిడారు. రెండుసార్లూ వాళ్ళు అమలు చేసిన స్ట్రాటజీ అహం మీదే! ముందు అహాన్ని దెబ్బగొట్టాలన్న ప్రయత్నం. తర్వాత అహాన్ని సంతృప్తి పరచాలన్న ప్రయత్నం. అందుకే నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గానికీ, తెలిసింది కేవలం పది స్ట్రాటజీలేనని గతటపాలలో వ్రాసాను. అందులోనూ అహాన్ని రెచ్చగొట్టటం లేదా చిచ్చుకొట్టటం.

అయితే ఈ మానసిక యుద్ద తంత్రలేవీ పీవీజీ మీద పనిచెయ్యలేదు. ఇక లాభం లేదన్నది అర్ధమైపోయింది. దాంతో ఇక సోనియాని ప్రత్యక్షంగా రంగంలోకి దించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసారు. దాంతో ఆమె మెల్లిగా క్రియాశీలకంగా పరిణమించసాగింది. పీవీజీ మీద వత్తిళ్ళు కలిగించడానికి ప్రయోగించిన తంత్రాలతో, అవినీతి బయటపడిన కొందరు ఆయన సహచర మంత్రులూ, మరికొందరు అనుచరులూ, ఆయన నుండి ఎడం జరిగారు. ఈ పైకారణంతో[over leaf reason]సోనియా చుట్టూ తిరగటం మొదలు పెట్టారు. అప్పటికే, 1992 ద్వితీయార్ధంలోనే, పీవీజీకి సోనియాకి మధ్య సత్సంబంధాలు బిగిసిపోయాయి.దూరం పెరిగింది. దాంతో ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న పీవీజీకి సమాంతరంగా, సోనియా శిబిరం, తెర వెనుక పనిచెయ్యటం ప్రారంభించింది.

అప్పటికి 1996 ఎన్నికల సమయం సమీపిస్తోంది. కొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పీవీజీ ఓడిపోయాడు. ’ఓటమే స్ట్రాటజీ’ తాలూకూ తొలి అడుగులు పడ్డాయి. ఇది తెలియని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీలు తామెంతో పోరాడి చెమటోడ్చి గెలిచామనుకున్నారు. తమ ప్రపంచవ్యాప్త గూఢచర్య పట్టుని[తాత్కాలికంగా] తాము అంతగా ఉపయోగించలేదుమరి! పైకారణంగా[over leaf reason] ఉన్న పరిస్థితులరీత్యా ఎక్కువ పట్టుని ప్రదర్శించుకునే వెసులు బాటు లేదు.

ఈ విధంగా నడిచిన రెండో దశ చివరికి పీవీజీ ఓడిపోయాడు. అదే ఓటమి స్ట్రాటజీ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

What is the non-sense you are 'barking'?

పి.వి.ని. వీర భోగ వసంత రాయలు అని అనటం నిజం గా పేపర్ లో వచ్చిందా? పేపర్లు ఇటువంటి (చెక్క భజన ) రాతలు రాస్తాయా? డిల్లీ లో ఉండె ప్రధాన మంత్రి దృష్టికి కి ఇవ్వని ఏలా వస్తాయి? ఎవరు చెపుతారు? నీ గురించి ఈ రాష్ట్రం లో పేపర్ ఈ రోజు ఇలా అన్నాది? అని.

గత ప్రభుత్వం లో పలు వివాదాలకు కారణమైన అర్జున్ సింగ్ గారిని జాతీయ దిన పత్రికలు పల్లెత్తు మాట అనలేదు. పైగా వారినేదొ పెద్ద నాయకుడిలా రాస్తుండెవి. ఈ సారి మంత్రి పదవి ఎప్పుడైతె రాలేదో మీడియా వారికి మేటర్ అర్థమైయింది . ఎమంటె అధిష్టాన వర్గంలో ఇతనికి ఎమాత్రం సానుకూలం లేదు, అతను అక్కడ తన పరపతి కోల్పోయాడు. బాగా వృద్దుడు కనుక ఇంకొక సారి మంత్రి అయ్యే అవకాశం లేదు కనుక అతని మీద బాగా దాడి చేసింది. చెన్నయి లో మేడికల్ సీట్ల రేట్ల వివరాలు దానిలో జరిగే మోసాలు అవి ఇవి అని టైంస్ ఆఫ్ ఇండియ,టైంస్ టి.వి. లు అదే పని గా చూపించాయి. దీనికి మొదలు గత ప్రభుత్వంలో అర్జున్ సింగ్ ఉన్నపుడే అని రాశారు. ఇతని కూతురికి యం.యల్.ఏ. టికేట్ రాలేదని ఆ రోజులలో తన అసంత్రుప్తిని వేళ్ళ గక్కాడు.

రెండవ అజ్ఞాత గారు: ప్రధాని కార్యాలయంలోనే కాక, సాక్షాత్తూ పది జనపధ్ లోనే టీవీలలో న్యూస్ క్లిపింగ్స్ ని డిస్ ప్లే చూస్తూనూ, జాతీయ, ప్రాంతీయ పత్రికలని ఎప్పటి కప్పుడు విశ్లేషిస్తూ ఓ విభాగమే పని చేయటం నేనే చూసాను.

వై.యస్. మరణానంతరం జగన్ నేనే సిఎం అని గోలపెడుతున్న నేపధ్యంలో అధిష్టానం దగ్గర ప్రాంతీయ వార్తలని, పత్రికలని ఎప్పుటికప్పుడు అనువాదం చేసే ఏర్పాట్లు ఉన్నాయని ఈనాడులో కూడా ప్రచురింపబడింది.

మూడవ అజ్ఞాత గారు: నెనర్లండి!

Madam,

Why don't you write on Swine-Flu ! How suddenly it was highlighted ? Suddenly died-out ? Who benefitted in the entire episode ... Ravi

అజ్ఞాత గారు : స్వైన్ ఫ్లూ వలన ఎవరు లాభపడతారో గత టపాలలో వివరించాను. పాత టపాలు చదవగలరు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu