నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులతో సహా చాలామందికి, పైకారణంగా [over leaf reasons] ఇతర వృత్తులు నిర్వహిస్తూనో, నిర్వహిస్తున్నట్లు అభినయిస్తూనో ఉంటారు. అందుచేత పూర్తి సమయం గూఢచర్యానికి కేటాయించలేరు. కేటాయించినా, ఒక్కరికి లేదా ఒకరిద్దరున్న బృందానికి... వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో, వివిధ వ్యక్తులని, వివిధ పరిస్థితులని గురించిన సమాచారాన్ని విశ్లేషించుకోవటం... ఆయా ప్రాంతాల, దేశాల, వ్యక్తుల, పరిస్థితుల గతాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తుని డిజైన్ చేసుకుని, వాటన్నిటిని బట్టి వర్తమానాన్ని నియంత్రించటం అసాధ్యం. అందుచేత గూఢచర్య సంస్థలు విశ్లేషణా కేంద్రాలని[analyzing centers ని] నిర్వహిస్తూ ఉంటాయి.

సహజంగానే అన్ని దేశాలలో, వారి నిఘా సంస్థలు, గూఢచర్య సంస్థలూ తమ దగ్గరికి చేర్చబడిన సమాచారాన్ని విశ్లేషించటం, తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవటం చేస్తూనే ఉంటారు. వీటిని కూడా అతిక్రమించి, వీటిని ప్రభావపరుస్తూ నిర్వహించబడేవి నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ విశ్లేషణా కేంద్రాలు.

నకిలీ కణిక వ్యవస్థలో, మీడియాది ప్రధాన పాత్ర అయినందున... అన్ని ప్రాంతాలలో, అన్ని పరిస్థితులపై, దాదాపు అందరు వ్యక్తుల గురించి, ఏమాత్రం చెప్పుకోదగిన మార్పు ఉన్నా... ఆ సమాచారం ఆయా ప్రాంతాలలోని తమ విలేఖరుల, న్యూస్ కంట్రిబ్యూటర్లతో కూడిన నెట్ వర్క్ నుండి సేకరించబడుతుంది. సదరు సమాచారాన్ని సేకరించే విలేకరులకి ఇదంతా ఏం తెలియదు. తమ వృత్తిలో భాగంగా, చాలా మామూలుగా, యాంత్రికంగా సమాచారం ఇస్తారు. వృత్తిలో భాగంగా తాము ఇచ్చే సమాచారం గూఢచర్యంలో ఉపయోగపడుతుందని వారిలో చాలామందికి తెలియదు కూడా!

దాదాపు ఇదే సర్వీసుని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలూ నిర్వహిస్తుంటాయి. అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలూ ఇలాటివే అనిగాని, అందరు సామాజిక సేవా కార్యకర్తలూ ఇలాంటి వారే అని గానీ, అనను గానీ, స్వచ్ఛంద సేవా తత్పురులలో కొందరు ఇలాంటి వారే. ఎక్కువగా ఇలాంటి వారికే పత్రికల పరంగా కీర్తి ప్రతిష్ఠలూ ప్రభుత్వపరంగా బిరుదులూ, అవార్డులూ వస్తుంటాయి. ఇక్కడ కూడా చాలా మందికి తెలిసి చేయటం కాదు, తమ ప్రాజెక్టులలో భాగంగా వివరాలు ఇస్తారు. అంతే! ఇక మన సంస్కృతి, కళలు, జీవన సరళి నచ్చి, ఇక్కడే స్థిరపడిన వారిలో కొందరు ఆ ముసుగులో చేసేది ఇలాంటి గూఢచర్య సేవనే!

ఈ విధంగా సేకరించబడిన ఆయా సమాచార అంశాలన్నీ విశ్లేషణా కేంద్రాలకి చేర్చబడతాయి. తాము ప్రచారిస్తున్న కొత్త నమ్మకాలు, తమకి అనుకూలంగా తాము ప్రవేశ పెడుతున్న దృక్పధాలు, మిధ్యా భావనలు, కొత్త ట్రెండ్స్, సామాజిక మార్పులు గట్రా గట్రాలు... తాము నిర్ణయించిన దిశలోనూ, వేగంలోనూ ఉన్నాయో లేవో, విశ్లేషణా కేంద్రాల్లోని నిపుణులు విశ్లేషిస్తారు. వీరు గూఢచర్యంలో, విశ్లేషణలలో ఆరితేరిన వారై ఉంటారు.

ఎక్కువగా ఈ విశ్లేషణా కేంద్రాలు - పర్యాటక కేంద్రాలుగా, విద్యా కేంద్రాలుగా, వ్యాపార కేంద్రాలుగా, లేదా అంతర్జాతీయ సంస్థలున్న ప్రదేశాలుగా ఉంటాయి. వాటిల్లో పర్యాటక కేంద్రాలదే ఎక్కువ ప్రాధాన్యం. ఇలాంటి ప్రదేశాలలో సాధారణంగా వచ్చిపోయే వారు ఎక్కువగా ఉంటారు గనుక, పైకారణం[over leaf reason] ఎవరికీ ఏ అనుమానం రానంత నమ్మకమైనదై ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అనుమానించినా, ఆ మాట పైకి అనలేనంత సహజమైనదై ఉంటుంది. అందుకోసమే అలాంటి, రద్దీని ఆకర్షించగల బిజీ ప్రదేశాలలోనే ఎక్కువగా గూఢచర్య విశ్లేషణా కేంద్రాలని నెలకొల్పుకుంటారు.

నిజానికి 2001, సెప్టెంబరు 11 న కూల్చబడిన WTC జంట భవనాల తాలూకూ 110 అంతస్థులలో, అనధికారక సీఐఏ కార్యాలయాలు ఉన్నాయని, అప్పట్లోనే ఒక మాట బయటికి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత షాపింగ్ సెంటర్ గా అవతరించిన దుబాయ్ లో మాఫీయా ఉంది. అలాగే అక్కడ ఈ ఒకటిన్నర దశాబ్దంలో విద్యా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మూడు పూలు, ఆరు కాయలుగా వృద్ది చెందటం గమనార్హం. మన భారత చిత్రపరిశ్రమకి చెందిన వారు, పదేపదే అక్కడికి షాపింగ్ అన్న పైకారణంతో[over leaf reason] వెళ్లటమూ గమనార్హం. అంతేకాదు సినీపరిశ్రమకి, మాఫియాకి సంబంధాలు మనకి తెలిసిన విషయమే. ముస్లిం సాంప్రదాయలు పాటించని, దుబాయ్ లాంటి ముస్లిం దేశాలపై , తాలిబాన్లు ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు ఎటువంటి దాడులు చేయవు సుమా!

పర్యాటక కేంద్రాలలో ఇలాంటి విశ్లేషణా కేంద్రాలు గుట్టు చప్పుడు గాకుండా నడిచిపోతుంటాయి. ఇలాగాక, మారుమూల ప్రదేశాలలో కూడా విశ్లేషణా కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు. ఏ రకపు ముసుగు వేసుకోవాలన్నది వారి అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఉంటుంది.

ఇలాంటి విశ్లేషణ కేంద్రాలలో మరో సౌలభ్యం ఏమిటంటే - చాలామందితో కూడిన గూఢచార విశ్లేషకుల బృందం, ఇక్కడ చడీ చప్పుడు లేకుండా పనిచేస్తుంటుంది. వారు సెలబ్రిటీలు కాదు గనక ఏవిధమైన ఫోకస్ వారిమీద ఉండదు. ఆర్ధిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాలతో కూడిన గూఢచార శాస్త్రం, వాటి మాదిరిగానే... అనేక ప్రామాణికాలు [parameters], నిర్వచనాలతో అభివృద్ది చేయబడి, వారివైన సిద్దాంతాలతో నిర్వహించబడుతూ ఉంటుంది.

ఉదాహరణకి - పోలీసుల నేర విభాగ శాస్త్రాల్లో, సంవత్సరానికి జరిగిన చోరీలు, మాన భంగాలు, హత్యలు వంటి నేరాలని బట్టి ఓ ప్రాంతంలో ప్రజల జివన స్థాయిని లెక్కగట్టుకుంటారు. ఒకదేశంలో సంవత్సరానికి సబ్బు వాడకాన్ని బట్టి ఆ దేశపు నాగరికత స్థాయిని, సల్ఫూరిక్ ఆమ్ల వాడకాన్ని బట్టి పారిశ్రామిక అభివృద్ది స్థాయిని లెక్కగడతారు. అలాగన్న మాట! అలాగే పులుల అభయారణ్యంలో పులుల పెరుగుదల సంఖ్యని బట్టి ఆ అడవిలో Eco Development ని లెక్కగట్ట వచ్చు. ఆ అడవులు ఆక్రమణకి గురవుతున్నాయో లేవో కూడా చెప్పవచ్చు. ఒక Departmentలో ఫిర్యాదుల సంఖ్యని బట్టి కూడా,ఎక్కడో ఉన్న IAS, IPS అధికారులు ఆ డిపార్ట్ మెంట్ లో ఉన్న అవినీతిని లెక్కకట్ట వచ్చు. అందుకే ఫిర్యాదుదారులని ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేది.

అదేవిధంగా, ఈ గూఢచార విశ్లేషణా కేంద్రాల్లో కూడా, వారివైన ప్రామాణికాలు, నిర్వచనాలు ఉంటాయి. ఉదాహరణకి - తము ప్రచారించిన, ప్రాముఖ్యత నిచ్చిన వ్యక్తులు/కళాకారులు, ఎంత సమయంలో తము నిర్ణయించిన సెలబ్రిటి స్థాయికి ఎదిగారు? దీన్ని బట్టి ఆ ప్రాంతం మీద, ప్రజల మీద తమ పట్టుని లెక్కించుకుంటారు. అలాగే ఒక ఫ్యాషన్ లేదా ట్రెండుని ప్రవేశపెడితే... ఎంత కాలంలోగా తము నిర్దేశించుకున్నంత వ్యాపార లావాదేవీలు జరిగాయి? - దీన్ని బట్టి తమ గ్రిప్ ని వెరిఫై చేసుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం, దేశీయంగా ధన్ తేరస్ ల వంటి వాటిని మచ్చుకి ఒకటి రెండూ చెప్పుకోవచ్చు. వ్యాపార కారణం మనం చూస్తాం. అందులో వ్యాపార కోణంతో పాటు, గూఢచర్య కోణమూ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే అదే ముఖ్యమైనది కూడాను.

ఇలాంటి లెక్కలతోనే... ప్రజలలో ఉన్న తమకి అనుకూలం కాని నమ్మకాలని ఎంత వరకూ రూపుమాపారో, తమకి అనుకూలమైన కొత్తనమ్మకాలని ఎంత వరకూ ప్రవేశపెట్టగలిగారో విశ్లేషించుకుంటారు. దాన్నిబట్టి... ప్రపంచవ్యాప్తంగా వర్తమాన భవిష్యత్ కార్యాచరణనీ, ప్రచార ప్రణాళికలని, రాజకీయ వ్యూహాలని డిజైన్ చేస్తారు. వాటిని తమ గూఢచార సంస్థలోని, అంటే నకిలీ కణిక వ్యవస్థలోని, కీలక వ్యక్తుల అనుమతికై పంపుతారు.

ఇవి ఎలా పనిచేస్తాయో అర్ధం చేసుకోవాలంటే - ఉదాహరణకి కార్పోరేట్ కంపెనీలలో, తమ ఉత్పత్తుల మార్కెట్ ని పెంచడానికి, ప్రచార వ్యూహాలని రూపొందించుకోవడానికి, ఉద్యోగ శ్రామికుల పని సామర్ధ్యాలని పెంచడానికి, మరింతగా ఉపయోగించుకోవడానికి మానవ వనరుల అభివృద్ది విభాగాల[HRD]ని నిర్వహిస్తూ ఉంటారు. ఏయే ప్రదేశాలలో తమ ఉత్పత్తుల అమ్మకం ఎక్కువగా ఉంది, అందుకు కారణాలేమిటి? అందుకు తమ ఉద్యోగుల కృషి ప్రభావం ఎంత? ఉద్యోగుల పనితీరు ఏమిటి? - ఇలాంటి వాటిన్నిటి గురించి, HRD, సమాచారం సేకరించి, విశ్లేషించి, భవిష్యత్ వ్యూహాలని రచిస్తుంది.

దీనినే పెద్ద పరిమాణానికి అనువర్తిస్తే, అదే తరహాలో పని చేస్తుంది నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ సమాచార సేకరణ - విశ్లేషణ - అమలు తీరు!

నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు, ఇటువంటి విశ్లేషణా కేంద్రాలని తగుసంఖ్యలో నిర్వహిస్తున్నందున, ఒకదాని విశ్లేషణని మరొక దానితో పోల్చి సరిచూసుకుంటారు. [Triangularate చేసుకోవటం అన్నమాట.] నకిలీ కణిక వ్యవస్థ తీసుకునే జాగ్రత్తలతో, విశ్లేషణా కేంద్రాలలోని ఏ ఒకరికి మరొక దాని గురించి తెలియదు గనక వారి పని వారు చేసుకుంటూ పోతారు. ఆ విధంగా నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు, తమ దగ్గర ఉన్న సమాచారాన్ని,తమకి వచ్చిన విశ్లేషణా సూచలనని, సరిచూసుకుని, దానిపై తమ తుది నిర్ణయం తీసుకుంటారు. అంతిమాధికారం, నిర్ణయాధికారం నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులదే! వారిలో కొందరు పైకి కనబడుతుండవచ్చు, మరి కొందరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండి ఉండొచ్చు.

ఇక ఈ విధంగా తీసుకున్న తమ నిర్ణయాలను, వివిధరంగాలలో ఉన్న తమ అనుచర ఏజంట్ల చేత అమలు చేయిస్తారు. ఆ అమలు తీరు గురించి, మళ్ళీ తమ విలేఖరులతో కూడిన నెట్ వర్క్ తో సమాచారం సేకరిస్తారు. దాన్నుండి విశ్లేషణ, వ్యూహరచన, ఇక ఆపైన అమలు...! ఇలా ఇదొక వలయం.

ఇక నకిలీ కణిక వ్యవస్థలో, వ్యూహాలని అమలు పరిచే నెట్ వర్క్ ఎలా ఉంటుందంటే - ఇందులో ప్రధాన భాగస్వామి మీడియా అయితే, మూల స్తంభాలు రాజకీయ నాయకులూ, కార్పోరేట్ వ్యాపారులు! ఆ పునాదిలోనే భాగాలుగా కొందరు బ్యూరోక్రాట్లూ ఉంటారు. [ఉన్నతాధికారులన్న మాట. ఆయా మంత్రిత్వ శాఖల సెక్రటరీల దగ్గరి నుండి కొన్ని దేశాల్లో పనిచేసే రాయబారుల దాకా! అందరూ కాకపోయినా చాలామంది. కులదీప్ నయ్యర్ లాంటి వాళ్ళన్నమాట.]

వారి పరిధి, అవకాశాలని బట్టి, వారికి ’అమలు పని’ అప్పచెప్పబడుతుంది. దీనినే అసైన్ మెంట్సుగా పిలవవచ్చు. విశ్లేషణా కేంద్రాల నుండి తమకు వచ్చిన సూచనలు[Hints],సలహాలని బట్టి, విశ్లేషకులు పంపిన వ్యూహాలకు, తమ అంతిమ విచక్షణాధికారంతో, సవరణలు చేసి, మెరుగులూ దిద్దీ అమలు పరిచేందుకు ఉన్న నెట్ వర్క్ లోని వివిధ ఏజంట్లకు, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు అసైన్ మెంట్స్ ఇస్తారు. అది కూడా అంచెలవారిగానే జరుగుతుంది. అందులో కొన్ని పరోక్ష పద్దతిలో ఉంటాయి.

1992 కు ముందు, ఈ నెట్ వర్క్ తీరు నకిలీ కణిక వ్యవస్థ లోని ఏజంట్లకి చాలా స్పష్టంగానే ఉండేది. ఉదాహరణకి - రాజకీయ నాయకులనే తీసుకుందాం. అప్పట్లో ఈనాడు, హిందూ గట్రా పత్రికలు ’వార్తలు ప్రెజెంట్ చేసిన తీరు’ని బట్టి, అప్పటి ట్రెండు ఏదో రాజకీయ నాయకులకి తెలిసిపోయేది. అంటే అప్పటికి ఏ సమస్యని నెత్తికెత్తుకోవాలి, వేటిని దొర్లించేయాలి, ఏ సంచలనాలని నెత్తికెత్తుకుని ఏ విషయాలని హైజాక్ చేయాలి, ఎవరిని ఏ వాదనలతో ఇబ్బంది పెట్టాలి? - ఇలాంటివన్నమాట. దీనికి, అంగీకారం [Final touch up వంటి confirmation అది] రాగానే, ఆయా రాజకీయ నాయకులు రెచ్చిపోయి, తమకి వచ్చిన అసైన్ మెంట్ ని అతి సమర్ధంగా నిర్వహించేవాళ్లన్నమాట. అందుకే 1992 తరువాత చాలా సార్లు రాజకీయ నాయకులు/నాయకురాళ్ళు ఒక స్టేట్ మెంట్ ఇచ్చి, తరువాత వెనక్కి తీసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం.

తమ రాజకీయ బాస్ ల [అన్నల] కార్యనిర్వహణ తీరుని బట్టి, వారి క్రింది వారు ఆటోమాటిక్ గా స్పందించే వారు. ఈ రాజకీయ గొలుసు వంటిదే... అధికారుల, కార్పోరేట్ రంగాల గొలుసు కూడా! ఎవరిని బట్టి సాపేక్ష కోణంలో [with respective గా] తము నడవాలో, తమకి ఎప్పుడో చెప్పబడింది గనుక, ఏ ఏజంటుకి ఆ ఏజంటు, తమకి అప్పగించబడిందనుకున్న పనిని నిర్వహిస్తారు. ’గాడ్ ఫాదర్ ల నుండి ఆశీస్సులు పొందటంగా’ ఇది పరిభాషలో ఉండేది.

ఇదంతా కూడా, సాక్షాత్తూ అమలు నెట్ వర్క్ లో పనిచేస్తున్న ఏజంట్లకి కూడా పూర్తిగా తెలియదు. తమ వరకూ తమకు తెలుసు. మహా అయితే తమ పైనున్న ఓ నలుగురు లేదా పదిమంది ఏజంట్ల గురించీ, తమ క్రిందనున్న ఓ నలుగురు లేదా పదిమంది ఏజంట్ల గురించి, వారి వారి కార్యకలాపాలు [Assignments] గురించి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి వారు... తము చేస్తున్నదాని పూర్తి పర్యవసానం తెలియకుండానే... చేస్తె తమకి కలిగే స్వప్రయోజనాల్ని మాత్రమే చూస్తూ... స్వార్ధపు ఇరుకు చట్రంలో పనిచేసుకుంటూ పోతారు.

ఇది ఎంత పకడ్బందీ అంటే... ఒకవేళ ఎప్పుడైనా, ఏ కారణం చేతనైనా, ఏ ఏజంటయినా దీనికి ఎదురు తిరగలేనంతగా! అప్పటికే తమ సవాలక్ష తప్పులూ, లొసుగులూ అందులో ఇరుక్కొని ఉంటాయి. ఏ మాత్రం తేడాపాడా వచ్చినా, తమ అవినీతి, అవకతవకలు, తెరచాటు తప్పులూ బయటకి వస్తాయన్న భయానికి చచ్చినట్లు పడుండాల్సిందే! అసలందుకే - ఎక్కువ స్వార్ధ పరత్వమూ, ధన వ్యామోహమూ, సుఖలాలస ఉన్న వాళ్ళనే, తమ అమలు నెట్ వర్క్ లోకి తీసుకుంటుంది నకిలీ కణిక వ్యవస్థ! పైగా "అలాంటి వాళ్ళకే ఇవాళా రేపు నడుస్తోంది. రోజులే ఇలా మారిపోయాయి. అవినీతి పరులదే రాజ్యం అయిపోయిందీ" అని ప్రచారిస్తూ, దీనంతటికీ సహజత్వపు రంగు అద్దుతుంది. ఇందుకు మీడియానే తమ ప్రధాన ప్రచార అస్త్రం మరి!

ఇదంతా నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి పూర్తి అవగాహన ఉంటుంది గానీ ఆయా ఏజంట్లకి కాదు.

దీనికి ఓ ఉదాహరణ చెబుతాను. ఓ సినిమాకి దర్శకుడు, కథకుడూ, కెమెరా మెన్ ల బృందం ఉందనుకొండి. కథమేటో, దాన్ని ఎలా చూపాలో వారికి పూర్తి అవగాహన ఉంటుంది. [ఆ మూడూ ఒకడే అయితే, అవగాహన ఆ ఒక్కడికే ఉంటుంది.] ఆయా నటీనటులకి ఎవరి స్ర్కిప్టు వారికి ఇచ్చి, డైలాగ్ ఎలా చెప్పాలో, దాని మాడ్యులేషన్ ఏమిటో, నటన ఏమిటో వివరించారనుకొండి. ఎవరికి వారికి తమ పాత్ర గురించి మాత్రమే తెలుస్తుంది. ఆయా సీన్స్ లో తెరమీద ఏమేం ఉండాలో ఆ ’ప్రాపర్టీ’ గురించి నటీనటులకి ఏమీ తెలియదు. [ఆయా సీన్స్ లో కనబడే వస్తువులని సినీపరిభాషలో ’ప్రాపర్టీ’ అంటారు.] తమ ప్రాతల్ని తాము నటిస్తూ పోతారు. అంతే! ఇదే ’విభజించి పాలించటం, విభజించి ప్రచారించటం’ అనే ప్రధాన సూత్రం.

అయితే, కెమెరా మెన్, దర్శకుడు కలిసి, ప్రేక్షకులని ఎంతగా ఇన్ వాల్వ్ చేస్తారంటే - మనం ఓ సీన్ చూస్తున్నప్పుడు అందులో లీనమైపోతాం. అంతలో కెమెరా ప్రక్కకి తిరిగి మరో దృశ్యాన్ని చూపెడుతుంది. మనం అంతే తన్మయంగా, అప్పుటి వరకూ చూస్తున్న సీన్ లోంచి, తర్వాతి సీన్ లోకి ప్రయాణించేస్తాం. అదే విధంగా... రాజకీయాలు, ఇతర కారణాలతో ప్రజలని కూడా, ఒక సమస్య లోంచి మరో సమస్యలోకి ప్రయాణింపచేస్తుండటమే నకిలీ కణికుడు వ్వవస్థ నడిపిన, నడుపుతున్న గూఢచర్యం!

అలాగే, కెమెరా అప్పటి వరకూ ఏదో వస్తువుని, బొమ్మని, zoom in లో చూపిస్తుంది. క్రమంగా ఆ దృశ్యం zoom out అయిపోతుంది. ఒకోసారి, కెమెరా ఏదో దృశ్యాన్ని ప్రముఖంగా focus చేస్తుంది. క్రమంగా ఆ దృశ్యం మసక బారుతూ fade out అయిపోయి, మరో దృశ్యం focus in లోకి వస్తుంది. అదంతా అలోచించలేనంత వేగంగా నడిచిపోతుంది కాబట్టి, సదరు ప్రేక్షకులు అప్రయత్నంగా, ఆనాలోచితంగా, కెమెరా మెన్, దర్శకుడూ కలిసి చూపిన దాన్ని అనుసరిస్తూ పోతారు. సరిగ్గా మీడియా చేస్తోంది ఇదే! ఎవరూ గ్రహించలేనంత, అర్ధం చేసుకోలేనంత వేగం, జన జీవితంలోకి ప్రవేశపెట్టబడిందీ ఇందుకే! ఒకప్పుడు ’వేణ్ణేళ్ళకు చన్నీళ్ళు’ పేరుతో కుటుంబంలో ఇద్దరి సంపాదనకి పలికిన నాందీ, ఇప్పుడు ’ఇద్దరు సంపాదిస్తే తప్ప అవసరాలు తీరవు, బ్రతకడం కష్టం’ అనే దశకు చేరి... పొద్దున లేస్తే, భార్యభర్తలిద్దరూ చెరో వైపుకూ, పిల్లలు మరో వైపుకూ పరుగులెత్తాల్సి వస్తోంది.

ఇంతగా నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ ’అమలు పరిచే నెట్ వర్క్’ [implimenting net work] పటిష్టంగా పనిచేస్తుంది. అందులో మీడియాదే పూర్తిపట్టు. గతంలో ఇది ప్రముఖంగాకనడేది కాదు, ఇప్పుడు మీడియా మీదే focus అవుతోంది కాబట్టి దృగ్గోచరమౌతుంది. అంతే తేడా!

ఈ విధంగా - సమాచార సేకరణకు ఉపయోగించే నెట్ వర్క్, అమలు జరిపే నెట్ వర్క్ ల మధ్యలో, విశ్లేషణా కేంద్రాలు ఉంటాయి. ఆయా నెట్ వర్క్ లకి మిగిలిన వాటితో గాని, ఆయా నెట్ వర్క్ లలో పనిచేసే వారికి మిగిలిన నెట్ వర్క్ లలో పనిచేసే వారిలో గాని, సంబంధాలు ఉండటం, ఉండకపోవటం అన్నది, ఆయా ప్రత్యేక అంశాలని బట్టి ఉంటుంది. ఏమయినా... విశ్లేషణా కేంద్రాలు మాత్రం, ప్రత్యక్షంగా కాని పరోక్షంగా గాని ఇతరులతో ఏ జోక్యం ఉంచుకోవు. కేవలం సమాచారం అందుకోవటం, విశ్లేషించటం, తదుపరి వ్యూహ రచనలని తిరిగి పంపటం - ఇదే వాటిపని. అచ్చంగా ఇదొక అద్బుత వలయం వంటిది.

ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతని తమ గుప్పిటిలో ఉంచుకుంటూ దీన్నంతటినీ నకిలీ కణిక వ్యవస్థ నియంత్రిస్తూ ఉంటుంది.

1992 లో రామోజీరావు అస్తిత్వాన్ని, అతడి కార్యకలాపాలనే తీగని జాగ్రత్తగా లాగుతూ పోయే కొద్దీ, కదిలిన డొంకలో, కళ్ళు మిరమిట్లు గొలిపేలా దర్శనమిచ్చింది ఈ అద్భుత వలయమే! దానినే నకిలీ కణిక వ్యవస్థ అనీ, అందులోని కీలక వ్యక్తులలో కూడిన సమహారాన్ని నెం.10 వర్గం అనీ ఉటంకించాను. అప్పటికి, అంతగా బయటకి తెలియని, ఆధునిక సమాచార సాంకేతికతని చేతిలో ఉంచుకొని, నకిలీ కణిక వ్యవస్థ దీన్నంతటినీ నిర్వహిస్తూ ఉండింది.

కాబట్టే... తదుపరి సంవత్సరాలలో, ఆధునిక సమాచార సాంకేతికతలో భాగమైన ’ఇంటర్ నెట్’ ’GPS' వంటి సౌకర్యాలు, సామాన్యప్రజలు ఉపయోగించగలిగేంత తేలికగా, ప్రజల అరచేతిలోకి రావటంతో, నకిలీ కణిక వ్యవస్థకి నడ్డి విరిగినంత పనయ్యింది. తమ రహస్య ఆయుధాలలో ముఖ్యమైనదీ, బలమైనదీ, బహిరంగమై తమకి ఒట్టిపోయింది.

ఈ విధమైన నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయాన్ని పరిశీలించాక, పీవీజీ, ప్రపంచవ్యాప్తంగా... మానవీయ విలువలు, ఆయా దేశాల పట్ల నిబద్దత గల వారితో నెం.5 వర్గాన్ని సమీకరించి, తమ యుద్దరీతినీ, వ్యూహాలని రచించుకున్నారు. అందులో భాగంగా... 350 ఏళ్ళుగా నకిలీ కణిక వ్వవస్థ మెల్లిమెల్లిగా బలపడుతూ, విస్తరిస్తూ, చివరికి ప్రపంచవ్యాప్తంగా ప్రబల ప్రచ్ఛన్న శక్తిగా పరిణమించినప్పుడు... దాన్ని తుత్తునియలు చేయటానికి తగినంత సమయం ఇవ్వాలనుకున్నారు. అలాగని అది మరో 350 ఏళ్ళు ఉండదు కదా! వాళ్ళు 350 ఏళ్ళుగా చేసినప్పుడు, మనకి కనీసం అందులో పదో వంతన్నా పట్టదా! పదో వంతు గాకపోతే పాతిక!

అచ్చంగా ’ప్రయాణం’ సినిమాలో చూసినట్లుగా - ఒక అమ్మాయిని ప్రేమలో పడెయ్యటానికి అధమపక్షం ఒకటో రెండో సంవత్సరాలు పడితే... దాన్నే అంశాల వారీగా విభజించుకుని విమానాశ్రయంలో విమానం ఆలస్యం అయిన మూడుగంటల్లో ముగించినట్లుగా...

నెం.5 వర్గం కూడా, ఈ పనిని [అంటే నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తులని బహిర్గతం చేయటం, సువర్ణముఖి అనుభవింప చేయటం, మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థని తుత్తునియలు కొట్టటం. అదే సమయంలో ప్రజాదృక్పధాన్ని మార్చటం.] కొన్ని దశలుగా విభజించుకుంది. కొన్ని విభాగాలుగా నిర్వహించదలిచింది.

ఎలాగంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

:-)

meeru okkaru kadani naa doubdt.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu