ఓ వైపు నెం.5 వర్గపు ఉనికి కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేసుకుంటూనే, మరోవైపు చంద్రబాబు ద్వారా ప్రపంచపు అంచుల దాకా వెదికే పని పెట్టుకున్నాడు రామోజీరావు. పీవీజీ దిగిపోయాక కూడా నెం.5 వర్గం తాలూకూ ఆధికత్య పట్టు ఇండియాలో కన్పిస్తుంది. అయితే భారతదేశం దాటి కూడా తమకి, గూఢచర్యంలో, రాజకీయంలో, అన్నిరంగాలలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

నెం.5 వర్గానికి భారత్ ని దాటి... ప్రపంచమంతా తమకు పోటీ ఇచ్చేంత, తమను ఇబ్బంది పెట్టేంత, పట్టు ఉండటం తమ దృష్టిలో ’అసాధ్యం’. అయితే వాస్తవంలో తమకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తమ ఏజంట్లు ఇక్కట్ల పాలవుతున్నారు. కెరీర్ పోగొట్టుకుంటున్నారు. కనబడుతున్న పైకారణాలని[over leaf reasons] తామూ ఒప్పుకోవాల్సి వస్తోంది. అసలేం జరుగుతోంది? - ఈ గందరగోళం పరిష్కరించుకునేందుకు - చంద్రబాబు పెట్టుబడులని ఆకర్షించటం అన్న పేరుతో ఓ పెద్ద బృందాన్ని వెంటేసుకుని మరీ దేశదేశాలు తిరిగాడు. ముఖ్యమంత్రి వెంట ఉండే బృందంలో అధికారులు, మంత్రులూ, వారి వ్యక్తిగత సహాయకులు, పాత్రికేయులు గట్రాలు చాలామందే ఉండేవాళ్ళు. కావలసినంతగా సమాచార మార్పిడి, ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా జరిగింది.

మనం సమాచారాన్ని పంపించేందుకు, అందుకునేందుకు ఒక నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకున్నామనుకొండి. ఇంటర్ నెట్ గానీ, సెల్ ఫోన్లతో గాని సమాచారం మార్పిడి చేసుకుంటే, హ్యాకింగ్ తోనూ, టాపింగ్ తోనూ ’ఇతరులు’ అందులో చొరబడే అవకాశం ఉంటుంది. మరింకే పద్దతిలో సమాచార మార్పిడి చేసుకోవాలి? ఆ మధ్య [2008 - 2009లలో] ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా ల మధ్య ఫోన్లలో గాకుండా, కాగితాలలో వ్రాసుకుని సమాచారాలు పంపుకున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. అసలు కాగితాలలో సమాచారం పంపించుకోవలసిన అవసరం ఎందుకని కూడా భాజపా ప్రశ్నించింది. ఆ వార్తను అప్రాధాన్య వార్తాంశంగా పత్రికలో ఎక్కడో ఒక మూలన వేసారు.

ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను. A నుండి Bకి, B to C, C to D, D to E, ఇలా K to L దాకా ఒక గొలుసు ఉందనుకొండి. మనం పంపించిన సమాచారం A నుండి Bకి ప్రయాణించి, L ని చేరి, అక్కడి నుండి జవాబుతో కూడిన సమాచారం మళ్ళీ A ని చేరాలి. ఈ మధ్యలో ఏ దశలో నయినా, సమాచారం మార్పుచేర్పులకి[టాంపరింగ్] గురవుతుందేమో... ఎలా తెలియాలి? తాము సాంప్రదాయంగా, ’నిర్ధారించుకునే పద్దతి’ని కూడా అనుమానించాల్సి వస్తే... ఏం చెయ్యాలి?

అప్పుడు ఓ సమాచారాన్ని మామూలుగా A to B, to C, to D,... to L దాకా పంపించి, మరోవైపు డైరెక్టుగా A నుండి సమాచారాన్ని L కి మరోవ్యక్తి లేదా బృందం వంటి ప్రత్యామ్నాయ మార్గాన పంపిస్తే...? అంటే A to B to C to D.... to L కి సమాంతరంగా A to L సమాచారం వెళ్తుందన్న మాట. రెండింటికి తేడా వస్తే.... దాన్ని బట్టి, A to L మధ్యలో ఎక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టవచ్చు.

ఈ విధంగా తమ నెట్ వర్క్ మొత్తాన్ని కొన్ని విభాగాలుగా చేసుకుని, ఆయా విభాగాలలో తమ సాంప్రదాయ మార్గంలో సమాచారాన్ని పంపిస్తూ, అదే సమయంలో దానికి సమాంతరంగా తమకి అత్యంత నమ్మకస్తులైన వ్యక్తితో సమాచారాన్ని పంపి, రెండింటినీ సరిపోల్చుకోవటం [Tally చేసుకోవటం] ఇందులో నడిచే ప్రక్రియ. ఎంతగా ఆధునిక సాంకేతికత వృద్ది పొందినా, ఒక్కోసారి పాతరాతి యుగపు పద్దతుల్లా, ముడి పద్దతులే [Crude methods] అనుసరణీయం అవుతాయి. అది గూఢచర్యంలో మరింత ఎక్కువగా అనుసరించాల్సి వస్తుంటుంది.

ఇలాంటి ముడిపద్దతికి రామోజీరావుకి నమ్మకంగా పనిచేసి పెట్టిన వాడు చంద్రబాబు నాయుడు. అలాగని రామోజీరావు చంద్రబాబునాయుడికి తన గుట్టు మట్లన్నీ చెప్పాడనుకుంటే పొరబాటే. ఒక్క చంద్రబాబుకే కాదు, ఎవరికైనా రామోజీరావు ఎంత చెప్పాలో అంతే చెబుతాడు. ఏదో... తన సోదరీతుల్య సోనియాకి, అంతే ముఖ్యుడైన అద్వానీ లాంటి ’అతికొద్ది మందికి’ తప్ప తమ ’అనువంశీయం’[అంటే వంశపారంపర్యంగా నడుపుతున్న గూఢచర్య వలయం] గురించి మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకుంటారు.

అంతగా నకిలీ కణిక వంశానికి ’దగ్గర’ కాబట్టే.... సోనియా.... ఎంతో ధైర్యంగా.... సాక్షాత్తూ దేశప్రధాని ఇందిరాగాంధీ ఇంటి కోడలిగా, తదనంతరం ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా అలవోకగా, ఎవరికీ అనుమానం రాకుండా గూఢచర్యం నిర్వహించడానికి సాహసించింది. అందుకే ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. కాబట్టే, ఆమె, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ప్రాణహాని లేదన్న ధైర్యంతోనూ, తేడా పాడా రాదన్న నమ్మకంతోనూ, నిఘాసంస్థల ప్రత్యేక కన్ను ఉండేచోట కూడా ’నటించి నమ్మించటం’ అనే పని నెత్తికెత్తుకుని రాగలిగింది.

సరే! ఇలా చంద్రబాబు నుపయోగించి, సమాచారం ఎక్కడైనా టాంపరింగ్ అవుతుందేమో తెలుసుకునేందుకు, ’పెట్టుబడుల ఆకర్షించటం’ అనే మిషతో ప్రపంచదేశాల పర్యటనలు నిర్వహించబడ్డాయి. దాంతో మరింతగా నెం.5 వర్గపు పట్టు బలపడినట్లుగా, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులకి తోచింది. తమే ’చంద్రబాబు పర్యటనల’ వంటి ప్రక్రియలతో, మరింతగా ’నెం.5 వర్గంకు ప్రపంచ గూఢచర్యం మీద పట్టుని చేజేతులా ఇచ్చామా?’ అన్నట్లు పరిస్థితి తయారైంది. దాంతో ద్వంద్వంలో పడ్డారు. ’విత్తుముందా? చెట్టు ముందా?’ లాగా!

నెం.5 వర్గానికి తమ గూఢచర్య నెట్ వర్క్ విభాగాల గురించి ముందుగా తెలిసినందునే తము చంద్రబాబు పర్యటనల వంటి ప్రక్రియలతో నిర్దారించుకున్నారో.... లేక.... తాము నిర్దారించుకునేందుకు చేసిన సదరు ప్రక్రియల తర్వాతే నెం.5 వర్గానికి ఆయా విభాగాలు తెలిసాయో.... అర్ధం కాని ద్వంద్వం అది. ఇక ఈ వేగం ఎంతగా పెరిగిందంటే... తదనంతర కాలంలో సినీనటులు, ఇతర ప్రముఖులు, తమ విదేశీ పర్యటనల నేపధ్యంలో వ్యక్తిగత సహాయకుల పేరిట, బంధువుల పేరిట, ఎవరెవరినో వెంట తీసుకెళ్లటం వంటి చర్యలు బహిర్గత మయ్యాయి. సాక్షాత్తూ ఎంపీలు, ఎం.ఎల్.ఏ.లూ కూడా, స్వంత భార్యల బదులు ఎవరో ఎల్లమ్మ పుల్లమ్మలని వెంట బెట్టుకుపోతూ పట్టుబడ్డారు.

అలాగే చిన్న సినిమాలు కూడా, కనీసం పాటలకోసం అంటూ విదేశాలకు ప్రయాణాలు చేసారు. ఆ విధంగా విదేశాలకు పర్యటకా వ్యాపారం, తమ సమాచార మార్పిడి రెండిందాల లాభం. ఇలాంటి సినిమాలు హిట్ లేదా కనీస వ్యాపారం నడవటం కోసం, బాలీవుడ్ కి అంతర్జాతీయ వ్యాపారం కల్పించబడింది. మన భారతీయ సినిమాలని అంతర్జాతీయ మీడియా ప్రచారంతో ఊపి పారేసింది. ఆ విధంగా, అంతర్జాతీయంగా హాలీవుడ్ కి దరిదాపులుగా బాలీవుడ్ మార్కెట్ట్ కూడా బలపడింది. బాలీవుడ్ ఎవరిచేతుల్లో ఉందో మనందరి తెలిసిన విషయమే కదా!

అలాగే... ఈ నేపధ్యంలోనే... హైదరాబాదు అంతర్జాతీయ సమావేశాలకు వేదిక అయ్యింది. మనకి కించిత్తు సంతోషాన్ని, గర్వాన్ని చేకూరుస్తూ, హైదరాబాదు బిర్యానీకి పేరొచ్చింది. విద్యా కేంద్రంగా, వైద్యకేంద్రంగా కూడా హైదరాబాద్ ప్రసిద్ది చెందింది. అయితే ఒక్క ఐటీ తప్ప వచ్చిన పరిశ్రమలూ, పెట్టుబడులూ ఏమీ లేవు. పరిశ్రమలొస్తే కదా ఉపాధి అవకాశాలు, అభివృద్దీ వచ్చేటందుకు? అవన్నీ ప్రక్క రాష్ట్రాలకు చక్కాపోయాయి.

అయితే... మరో చెప్పుకోదగ్గ మార్పు మాత్రం వచ్చింది. ఒకప్పుడు, [1990 - 91 వరకూ కూడా] హైదరాబాదు ఆటోవాలాల ధాష్టీకం గురించి, హైదరాబాదు లో తెలుగు భాష ఖూనీ గురించి జోకులు ఉండేవి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, తెలుగు భాషకి కనీస గౌరవం దక్కినా, ఆటోవాలాల దగ్గరి నుండి ముస్లింల, ఉర్దూ ఆధిపత్యంల గురించి, హైదరాబాదు రోడ్ల అధ్వాన్నం గురించి జోకులుండేవి. మల్లిక్ ఇత్యాది కార్టూనిస్టులు వ్యంగ్యాలు వేస్తుండేవాళ్ళు కూడా! ఇక అక్కడి మంచీనీళ్ళ వెతలైతే ’జంటనగరాల్లో పెళ్ళి కొచ్చేవాళ్ళు తలా బిందె నీళ్ళు వెంట తెచ్చుకోవాలనీ, లేదా కట్నంగా ఇచ్చే లక్షలతో పాటు ఇన్ని బిందెల నీళ్ళు కూడా లాంఛనంగా ఇస్తామన్నామని’ జోకులుండేవి.

హైదరాబాదు రోడ్లయితే... టాంక్ బండ్, సెక్రేటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్ రోడ్లు లాంటి ముఖ్యమైన అతికొద్ది రహదారులు తప్పితే, మిగిలిన వన్నీ గుంతల మయం అనేమాట ఉండేది. అది నిజం కూడా! ఆటో ఎక్కి ప్రయాణం మొదలెడితే, గమ్యం చేరేలోపల, కడుపులోని పేగులు ఉండచుట్టుకు పోయి ఎగిరెగిరి పడటం ఖాయం. అలాంటిది చంద్రబాబు హయాంలో హైదరాబాద్ రోడ్లు వంతెనలతోనూ, ఉద్యాన వనాల తోనూ, అభివృద్ది చెందాయి. ఇంకో దృష్టితో చూస్తే అంతర్జాతీయ సమావేశాలు పెట్టాలంటే అందమైన నగరంగా తీర్చకపోతే పైకారణంగా[over leaf reason] బాగోదు కదా!

హైదరాబాద్ ని అందంగా తయారుచేసినందుకు మాత్రం చంద్రబాబు కృషిని అభినందించి తీరాలి. ఎందుకోసమైనా చేయనీయండి...మామ ఎన్టీఆర్ లా ఫేస్ గ్లామర్ లేదు గనక ఎంతో కొంత పని చేసి, చేశాననిపించుకునీ, ’ఒకేఒక్కడు’ లాంటి ప్రచార ఆర్భాటల కోసం చేయనీయండి... ఎంతో కొంత అభివృద్ది చేసిన మాట కూడా నిజం! [అలాగే అవినీతి సొమ్ము కూడా వెనకేసాడు. ఈ రకంగా చూసిన అతడి మతిలో ఉన్నదే గతిలో ఉన్నది.]

అయితే వీటితో బాటుగా, వీటి కంటే ఎక్కువగా, రామోజీరావుకి నమ్మకంగా గూఢచర్యం కూడా చేసిపెట్టాడు. ఇందుకు ప్రతిఫలంగా రామోజీరావు, తన ఈనాడు, ఇతర మీడియా ద్వారా చంద్రబాబుని ’ఇంటర్నేషనల్ ఫిగర్’ ని చేశాడు. అతడి 2020 విజన్ ని తెగ ప్రచారించాడు. దెబ్బకి 2020 దాకా తానే సీఎంగా ఉంటానని నమ్మేసాడు చంద్రబాబు. అంతకంటే ’అలా చంద్రబాబుని నమ్మించాడు రామోజీరావు’ అనటం సబబు.

ఎవ్వరికైనా అరచేతిలో వైకుంఠం చూపించగల మాంత్రికుడు రామోజీరావు, అతడి మీడియా! గూఢచర్య పరిభాషలో దీన్ని ఇనుప తెర[Iron Curtain] వేయటం అంటారు. ఈ ఇనుప తెరతో అరచేతిలో వైకుంఠాన్నే కాదు, ప్రత్యక్ష నరకాన్ని కూడా, తము లక్ష్యంగా ఎంచుకున్న వారికి చూపించవచ్చు. వాస్తవంలోనూ చూపించవచ్చు. అసలేమీ లేకుండానే వొట్టిస్తరి మంచినీళ్ళతో కూడా, వైకుంఠం లేదా నరకం చూపించవచ్చు. అదీ గూఢచర్యంలో తమాషా!

ఇక చంద్రబాబుకి ’ఇంటర్నేషనల్ ఫిగర్’ ఇమేజిని మాటాల్లోనే గాక చేతల్లోనూ ఇచ్చాడు రామోజీరావు. ఇందిరాగాంధీని ఇచ్చిన అప్పాయింట్ మెంట్ కు పదిహేను నిముషాల వేచి ఉండింపించిన అమెరికా అధ్యక్షుల వారు,[ఎవరైనా ఒకటే... నిక్సన్, కార్టన్, బుష్, క్లింటన్, ఒబామా గట్రా] ఎన్టీఆర్ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడికైతే తామే హైదరాబాద్ కు వచ్చిభుజం మీద చెయ్యి వేసి మరీ మాట్లాడారు. పదిహేను నిముషాలు ఇచ్చిన సమయం కాస్తా రెట్టింపు సమయం గడిపారు. అంతగా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ నేర్పు, పరిపాలనా నైపుణ్యం చూసి ’ఇంప్రెస్’ అయిపోయారు మరీ! [ తదుపరికాలంలో పాపం అదే చంద్రబాబుని అసెంబ్లీలో వై.యస్, రోశయ్యల కూడా చెడుగుడు ఆడుకున్నామన్నారు. చంద్రబాబు జాతర బొమ్మ వైయస్ కాబట్టి, అతడి హయాంలో కూడా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జి జూనియర్ బుష్ ఆంధ్రా వచ్చాడు.]

అలా ఇంప్రెస్ అయిపోయిన అమెరికా అధ్యక్షుల వారి సాక్షిగా, ఐటీ కంపెనీ అధినేత సత్యం రామలింగరాజు ప్రస్తానం ప్రారంభమయ్యింది. 2009 నాటి కథ మనకి తెలిసిందే! జైలులో అనారోగ్యం పాలై, బెయిల్ కోసం అంగలారుస్తున్న సత్యం అధినేత వార్త ఇప్పుడందరికీ పాతన్యూస్. అదే సత్యం కంపెనీ, ఐరాస వారి నుండి, ప్రపంచ బ్యాంకు నుండి సమాచారాన్ని తస్కరించిందన్న ఆరోపణలైతే అసలెవరికీ గుర్తు కూడా ఉండనంతగా పాతబడి పోయాయి. ఇక్కడ విశేషమేమిటంటే లేని లాభాలు ఉన్నట్లుగా చూపించి మోసగించిన రామలింగరాజు, సత్యం కంఫ్యూటర్స్ ని చంద్రబాబూ, మైటాస్ ని వై.యస్. కూడా ఇతోధికంగా ఆదరించి ప్రోత్సహించటం! ఇద్దరికీ అతడంతగా హితుడు. ఆ ఇద్దరూ రామోజీ రావుకీ....?

అంతగా.... చంద్రబాబుని ఉపయోగించి ప్రపంచపు అంచుల దాకా పరుగులు పెట్టించడంతో ఏర్పడిన ’విత్తుముందా? చెట్టు ముందా?’ లాంటి ద్వంద్వంతో తాము కొట్టుమిట్టాడుతుండగా.... అప్పటికి వాళ్ళకి అర్ధమయ్యింది ఏమిటంటే... నెం.5 వర్గానికి ప్రపంచవ్యాప్తంగా గూఢచర్యంలో పట్టు ఉండటం! అమెరికాలోనే, సీఐఏ లోనే, ఎవరో నెం.5 వర్గానికి సహాయపడుతున్నారన్నది అర్ధమయ్యింది. ఆ నేపధ్యంలోనే సీఐఏ అనధికార కార్యాలయం ఉన్న WTC జంట భవనాలు, 2001, సెప్టెంబరు 11 న విమానదాడిలో నిలువునా కుప్పకూలాయి. తాలిబాన్ల దాడి ప్రపంచాన్ని విస్మయపరిచింది.

కాల గతిలో, అది ’తన చేతితో తన కన్ను పొడిపించినట్లు, తన కాలితో తన పీకనే నొక్కించినట్లు’... ఆత్మహత్యా సదృశ్యమే అయ్యింది. ఎందుకంటే తాలిబాన్లు, సీఐఏ రెండూ తనవే! వైరం పైకారణంగా[over leaf reason గా] నడిపించబడుతూ ఉంటుంది. పరస్పర దాడులు తమ చెప్పుచేతల్లో ఉండాలి గానీ, తమకి చెంపదెబ్బల్లాగా ఉండకూడదు కదా.

దీనితో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ గూఢచర్య నెట్ వర్క్, నెం.5 వర్గం చేత Take over లేదా over power చేయబడిందన్నది అర్ధమయ్యింది, నిర్దారణ అయిపోయింది! దాంతో నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులకి గంగవెర్రులు ఎత్తింది. అప్పటి వరకూ తమ పైకారణాల కోసం, తాము అమెరికనులకు నూరిపోసిన అగ్రరాజ్యాధిపత్యపు మనోభావనలు, యుద్దప్రీతి, WTC కూల్చివేత తర్వాత ఆఫ్ఘన్ మీద యుద్దానికి పరిణమించాయి. పరిస్థితుల వేగం తము నిభాయించలేనంత తీవ్రంగా ఉంది.

దాంతో దాన్నే Advantageగా ఉపయోగించుకోదలచి, ’ఆఫ్గాన్ పై తాలిబాన్ల ఏరివేతకై యుద్దం’ పైకారణంగా[over leaf reasons] చూపెడుతూ పెట్రో దేశాలకు, ఆయుధ కంపెనీలకు, ’పాకిస్తాన్’కి ఆర్ధిక, సాయుధ సహాయలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. ఆ విధంగా ’ఇస్లామా బాద్ కు ఇంత బలం’ ఉండటం బహిర్గతం అవుతోందని గ్రహించలేకపోయారు. అది తొలిదశలో గుర్తించటం కష్టం కూడానూ! గూఢచర్యం విస్తృతమైనదీ, సుదీర్ఘమైనదీ అయినందున, ఒక్కచర్యకే ఎంతటి నిష్ణాతుడైనా, దేనినీ గుర్తించలేడు. ఆ తర్వాతే ’ఇరాన్ మీద యుద్దం’ వైపు అడుగులేసింది అమెరికా!

అమెరికా సైన్యం, బిన్ లాడెన్ ని వ్యూహాత్మకంగా పారిపోనిచ్చిందని వార్తలొస్తున్న నేపధ్యంలో, అమెరికా, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ని మాత్రం, 2006 డిసెంబరు 30న ఉరి తీసి చంపించింది. అతడి అనుచరులకి, ముందూ వెనకలుగా మరణశిక్షలు అమలు చేస్తూనే ఉంది. బంకర్లో పట్టుపడినప్పుటి నుండి, మరణ శిక్ష అమలుకు కొద్దిరోజుల ముందు వరకూ కూడా, విచారణ సమయంలో ఘర్జిస్తూ, స్వయంగా వాదిస్తూ, సద్దాంహుస్సేన్, తనకు గూఢచర్యపరంగా సహాయం లభిస్తుందన్న ఆశతోనూ, నమ్మకంతోనూ ఎదురు చూశాడు. అంతర్జాతీయంగా మీడియా తన కిచ్చిన ఇమేజి సాక్షిగా, తన దేశ గూఢచర్య ఏజన్సీని దాటి తను ఇచ్చిన సహాయసహకారాలకు ప్రతిగా, పట్టుబడినా కూడా తనకు వెసులుబాటు వచ్చితీరాలి.

అయితే ముస్లిం దేశాల మధ్య కూడా ’విభజించి పాలించే’ కణిక నీతి ’కన్నా? కాలా?’ స్ట్రాటజీలో, తనని కాలుగా భావించి వదిలేసుకుందని అతడికి అర్ధమయ్యేసరికే మరణం ఎదురుగా నిలబడింది. అలా... అలా... ఇంతింతై వటుడింతై...లాగా నెం.5 వర్గపు గూఢచర్య ఆధిపత్యం! ప్రపంచవ్యాప్తంగా, తరాలు తరబడి, శతాబ్దాలుగా, తాము నిర్మించి నిర్వహించిన గూఢచర్య వలయం... తమ అధీనంలో లేకపోగా, తామూ అందులో భాగంగా లాగబడటం.... నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి ఆందోళననీ, ఆభద్రతనీ, ఆతృతనీ పుట్టించింది.
నెం.5 వర్గపు ప్రపంవవ్యాప్త గూఢచర్య పట్టు, 2001 లో WTC కూల్చివేత తో నిర్ధారణ అయ్యింది. వేగం పెరిగింది. అమెరికా ప్రజలకు వాస్తవాలు బహిర్గతం చేయబడ్డాయి. తమ ప్రభుత్వాలు, తమ ఏజన్సీలు, తమ దేశం తరుపున పనిచేయటం లేదన్న వాస్తవం ఇంకి, తామసం వదిలించుకోవలసి వస్తుంది. మాంద్యంతో తమ ఆర్ధిక రంగం గురించి వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వాలు, ప్రజల కోసం కాక, కార్పోరేట్ సంస్థలకోసం ఎలా పనిచేస్తాయో మరింత బాగా అవగాహన వస్తూ ఉంది.

ఆ విధంగా... నెం.5 వర్గంలోని, అమెరికా పట్ల నిబద్దత ఉన్న వర్గాలు, తమ దేశప్రజలని తామసం వదిలించి, రజోగుణం వైపుకు నడిపిస్తున్నాయి. కాబట్టే ఒబామా చేత పదేపదే ’తమ ఆధిపత్యం తగ్గిపోయిందనీ, భారత్ చైనా కొరియాలు దూసుకెళ్తున్నాయనీ, అమెరికన్లు కూడా తమ పిల్లలని బాగా చదివించుకోవాలనీ, అమెరికన్లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనీ’ అమెరికన్లకి హెచ్చరికలు చేయబడుతున్నాయి. సాధారణంగా.... అధిపత్యం ఉందనగానే ఎవరైనా తమకు అన్నిరకాలుగా వైభవం నడవాలని కోరుకుంటారు. కాని నెం.5 వర్గం మాత్రం, ప్రజలని సత్యం వైపు నడిపిస్తుంది. సత్యమార్గంలో ఘర్షణ, చైతన్యం ఉంటాయి. అంతేగాని, సబ్సిడీలు ఇచ్చి కూర్చోబెట్టి తినిపించడం ఉండదు. ఇది వాస్తవం.

వీటన్నిటితో ’నెం.5 వర్గపు ఉనికి తెలుసుకోవటం’ నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గానికి అత్యవసరం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్ధిక మాంద్యానికి అప్పుడే [2001] అంకురార్పణ జరిగింది. మీడియా మాత్రం దాన్ని రకరకాలుగా ప్రచారించింది. మొదట కాదనటం, తర్వాత కొంచెం నిజమే అనటం, ఆ తర్వాత ’అవును పూర్తిగా నిజమనటం’, అంతలోనే ’అయిపోయింది అయిపోయింది. మాంద్యం నుండి బయటికి వచ్చేసాం’ అనటం, ’బయటకి వచ్చేసాం కాని రికవరీ అవటానికి కొంచెం సమయం పడుతుంది’ అనటం మీడియాకి మామూలే! తమకి డామేజి అయ్యేదాన్ని ’ఉన్నా లేదనడం’, తమకి ఇమేజి అయ్యేదాన్ని ’లేకున్నా ఉందనటం’ - ఇదే ప్రపంచవ్యాప్తంగా మీడియా చేసే పని! దీన్నే నందిని పంది, పందిని నంది చేయటం అంటాం మనం!

ఏ విధంగానైనా సరే! నెం.5 వర్గపు ఉనికి తెలుసుకోవాలి! అది తమకు తక్షణ అవసరం! ప్రాణాంతక అవసరం! కార్గిల్ యుద్దం లాంటి దేశభద్రతకి సంబంధించి నెం.5 వర్గం స్పందించటం లేదు. ’దేశపుపరువు మర్యాదలు’ అనే భావోద్వేగం మీద ఆధారపడి... పార్లమెంట్ పై దాడి జరిగింది. అయినా ఫలితం లేదు. సెజ్ లన్నా, దేశీయ కంపెనీలని అమ్మేయటం అన్నా స్పందించటం లేదు. జనాలు మట్టిగొట్టుకుపోతారన్న బెదిరింపులు బెదిరించినా ఫలితం వచ్చేటట్లు లేదు. [ఇప్పుడు, తాలిబాన్ల చేతికి అణ్వాయుధాలు చిక్కుతాయని, అమెరికా, భారత్ లకే ప్రమాదమని బెదిరిస్తున్నారు. అంటే అమెరికా, భారత్ ల మీదకి అణ్వాయుధ దాడికి దిగుతామని బెదిరింపన్నమాట!]

ఇక లాభం లేదు, వ్యూహం మార్చుకోవాలనుకున్నారు. అద్వానీ గృహమంత్రిత్వం ఏ ఆచూకీ కనుక్కోలేక పోయింది. విదేశీయులు కీలక పదవులు అధిష్టించడానికి రాజ్యాంగపరంగా మార్గం సుగమం చేయటం, పెద్దగా చప్పుడు గాకుండా చేసేసారు. అందుకోసం ఎన్డీయే ప్రభుత్వానికి, మతతత్త్వానికి వ్యతిరేకమైన ఎర్రపార్టీలతో సహా అందరూ ఎవరి వంతు సహాయ సహకారాలు వాళ్ళు అందించారు.

ఈ లోపున, ఓ సారి పార్లమెంటు సమావేశాల్లో... అప్పటికి ఎన్డీయేలో డిఎంకే అధికార పక్షంలోనూ, కాంగ్రెస్ ప్రతిపక్షంగానూ ఉంది. సోనియా ప్రతిపక్ష నేతగా, పార్లమెంటు సమావేశ మందిరం సాక్షిగా... "నా మరిదిని చంపారు. అత్తని చంపారు. నా భర్తని చంపారు’ అని ఆవేశంతో ఊగిపోయింది. టాంపరింగ్ తో తాము పంపిన అసైన్ మెంట్ ని, ఆమె అభినయించిన తీరు చూసి, నెం.5 వర్గం సైతం నివ్వెర పడేటట్లు ఉంది ఆమె నటన!

ఈ సంఘటన గురించి, 2006లో, ఈనాడు సంపాదకీయ పేజీలోని రాజకీయ వ్యాసంలో, అప్పటి సంఘటనని ఉటంకిస్తూ వ్రాయగా చదివి, అంతకంటే నివ్వెర పోయాము మేము. ’అనవసరంగా సినిమా నటీనటులని అనుకుంటాం గానీ, అంతకంటే నిజజీవితంలో నటించగల ఈ రాజకీయ నాయకులే గొప్ప నటులు’ అనుకున్నాము.

"పాపం! మహానటి సావిత్రి! నిజజీవితంలో నటించటం చేతగాక, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తన ఇమేజిని ఉపయోగించి నడిపిస్తామంటే ఒప్పుకోనందున, జెమినీ గణేశన్ ప్రేమ నటనకు మోసపోయిన పైకారణంతో [over leaf reason], ఆస్థి, ఆరోగ్యాలని పోగొట్టుకుని, సంవత్సరం పాటు కోమాలో ఉండి ఉసురు కోల్పోయింది. తెరమీద మాత్రమే నటించటం వచ్చి, జీవితంలో నటించటం రాని అలాంటి నటీ మణులు ఈమె ముందు ఏపాటి? నిజంగా ఆస్కార్ లు ఈమెకివ్వాలి" అనుకున్నాము.

గమనించి చూడండి. నాయకురాలుగా ఈమె అర్హతలేమిటి? జయలలిత లాగా వాగ్దాటితో ప్రజలను చైతన్యపరచలేదు, అద్వానీ లాగా ప్రజలను[హిందూ ఓటర్లను] ఉద్రేక పరచలేదు. మన్మోహన్ సింగ్ లాగా ఆర్ధిక వేత్త కూడా కాదు. పీవీజీతో పోల్చడం అంటే నక్కకి, నాక లోకానికి ఉన్నంత తేడా! ఈమె కేవలం నటించటానికి వచ్చిన ఏజంట్ లేదా ట్రాన్స్ ప్లాంటర్. తన గూఢచార వ్యవస్థ ఇచ్చిన దర్శకత్వంలో, ఇచ్చిన విజయాలతో, తనని ఎదిరించిన వాళ్ళని తన ఏజన్సీ మట్టికరిపిస్తుంటే, తనకి దాసోహం అన్నవాళ్ళకి కెరీర్ ఇస్తుంటే, అదంతా తన ప్రతిభ అన్నట్లు నటించటం మాత్రమే ఈమెకి వచ్చిన విద్య.

తదనగుణంగా ఈమెకి వ్యక్తిగత విమర్శలు చేయటం ఇష్టముండదని, ఎన్నికల వేళలోనే పార్టీలైన విమర్శించుకోవాలని అంటుందని మీడియా ప్రచారిస్తుంది. ఈమె ఎవరినీ విమర్శించదు, ఈమెను కూడా ఎవరు విమర్శించరు/కూడదు సుమా! ఈమె అనుచర వర్గం మాత్రం, ఈమె చెప్పినట్లు చేస్తూ, అందరిని విమర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా... పార్టీని, ప్రతిపక్షాలని ఈమెకి దాసోహ పరుస్తుంది నకిలీ కణిక వ్యవస్థ! అందుకే... ఈమె నకిలీ కణిక వ్యవస్థలో, నెం.10 వర్గంలో కీలక వ్యక్తి!

ఇక ఇలాంటి రకరకాల రాజకీయ డ్రామాల అనంతరం 2004 ఎన్నికలు వచ్చాయి. అప్పటికి సంవత్సరం క్రితమే చంద్రబాబుకి ’ఇక కుర్చీ దిగక తప్పదు’ అన్నది ఇంకించబడింది. గింజుకున్నందుకు ’అలిపిరి’ దాడి కనబడింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించ బడిన తరువాత ఒక సారి పి.వి. ని కలసి నీకు నేను అన్యాయం చేశాను, నన్ను క్షమించు. నీకు చేసిన అన్యాయనికి నాకు తగిన శాస్తి జరిగింది అని అన్నాడని ఆ రోజులలో పేపర్లో వచ్చింది. ఆయన కావలనుకున్న ప్రధాన మంత్రి పదవి దక్కక పోగా అసలి కాంగ్రెస్ అధ్యక్ష పదవికే ఎసరు వచ్చింది కదా!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu