నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ఎవరినైనా... భయపడితేనే భయపెట్టగలదు, ప్రలోభపడితేనే ప్రలోభపెట్టగలదు. ధైర్యపడిన వాళ్లని అది ఏమీ చేయలేదు.

కావాలంటే పరిశీలించండి.....

వై.యస్. నే తీసుకుంటే - 1992 వరకూ కూడా, తనని ఉపయోగించుకోవటమే తప్ప ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత, కెరీర్ ఇవ్వటం లేదన్న కసి, రామోజీరావుపై వై.యస్.కి ఉంది. ఫ్యాక్షనిస్టు అయిన వై.యస్.కి, అవకాశం వస్తే ప్రత్యర్ధులని ’వేసేయ్యాలన్న’ ప్రతీకారమూ ఎక్కువే! అదేవిధంగా తన చుట్టూ అనుచరవర్గాన్ని తయారుచేసుకోవటం కోసం కూడా చుట్టూ ఉన్న వారికి ఎంతో కొంత చెయ్యాలన్న ధ్యాసకూడా ఉంది. నియోజక వర్గంలోని వారికి ఎంతో కొంత చేసేవాడు. ఇది నేను ప్రత్యక్షంగా పరిశీలించాను. దాంతోపాటు, స్వలాభం లేదా స్వార్ధం అనండి, భారీగా ధన సంపాదన చెయ్యాలన్న కోరిక ఉంది. బైరెటీస్ గనుల వ్యవహారం అప్పట్లోనే పేపరు కెక్కింది. ముఖ్యంగా... రామోజీరావు గూఢచర్యం ఎంత విస్తారమైనదో తెలియనందున కూడా, వై.యస్.కి, అతడి పట్ల... ’వీలు దొరికితే ఉతికి పారెయ్యాలి’ అన్న కసి ఎంతగా ఉందంటే - 1992 మేలో నేను అతణ్ణి కడపలో కలిసినప్పుడు సాక్ష్యాలుంటే తెమ్మన్నాడు. అందులో... ’అవి చేతిలో పట్టుకుని రామోజీరావుని ఆడించవచ్చు, కెరీర్ పొందవచ్చు’ అన్నది ఓ అంశమైతే, ’వీలు కుదిరితే ఉతికిపారెయ్యాలన్న’ కాంక్ష మరొక అంశం.

2004 లో అతడికి ఆ అవకాశం కల్పించబడింది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, సోనియాలు తమ అవసరార్ధం అతడికి కెరీర్ ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణల నేపధ్యంలో రామోజీరావుని మార్గదర్శి నెపంతో ఉతికి పారేసే ఆసైన్ మెంట్ వచ్చింది. ’వై.యస్. రామోజీరావుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు’ అంటూ నెం.5 వర్గాన్ని నమ్మించి దరిచేర్చటం అన్న వ్యూహంతో, ఈ ఆసైన్ మెంట్లన్ని , తామే ఆమోదించి, ఇష్టపూర్తిగా, వై.యస్.కి ఇచ్చారు. అలాగే వై.యస్.కి భారీగా ధనసంపాదన, తన వాళ్లకి కట్టబెట్టటం గట్రా... అన్నీ వై.యస్. మదిలో ఉన్నదే గతిలోకి వచ్చింది. చుట్టూ తన వర్గంతో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనపట్టు నిలబెట్టుకోవటానికి అనుచర వర్గానికి బాగా అవినీతి సొమ్ము తినబెట్టాడు.

అయితే... మంచికి మంచి, చెడుకి చెడూ ప్రతిఫలంగా వస్తాయని వై.యస్. తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే - ఇప్పుడు నడుస్తున్నది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల పట్టు కాదు, నెం.5 వర్గపు పట్టు. వై.యస్. ముఖ్యమంత్రి అయిన తరువాత అవినీతిలోనూ రికార్డు సృష్టించాడు కాబట్టే, అతడి కర్మల ఫలితం అతడి కొడుకుని, అతడి కర్మలలో వాటాలున్న వారినీ వెంటాడుతోంది. కాబట్టే అప్పట్లో అతడెంత భారీగా డబ్బు సంపాదించుకోనిచ్చినా, ఆ కృతజ్ఞతలైనా లేకుండా, అతడి మంత్రివర్గ సహచరులు, ఇప్పుడు అతడి కొడుక్కి ’తూచ్’ చెప్పేసారు.

ఇక్కడ భగవంతుడి లీల ఎంత అద్భుతంగా ఉంటుందో గమనించండి. ఏ పేరుతో పిలిచినా.... దేవుడు అన్యాయాన్ని, అధర్మాన్ని రక్షించడు. పోప్, క్రైస్తవులైన సీఐఏ ఏజంట్లు ఆరాధించే యెహోవా ఏసుక్రీస్తులైనా, తాలిబాన్లు, ముస్లింలైన పాకిస్తాన్ ఏజంట్లు కొలిచే అల్లా అయినా... అవినీతిని, అధర్మాన్ని, అమానుషత్వాన్ని ఒప్పుకునేటట్లయితే... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి తమ లక్ష్యం నెరవేరబోతోందని పులకరిస్తూ ఎదురు చూస్తుండగా... పరిస్థితి తిరగబడదు కదా!?

అందుకే భగవద్గీత,

శ్లోకం:

యో యో యాం యాం తనుంభక్తశ్శ్రద్ధయా ర్చితుమిచ్చతి
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధా మ్యహమ్ !

భావం:
ఎవరు యేరూపాన్ని ఆరాధిస్తే, వారికి ఆ దేవతయందే శ్రద్ధా, విశ్వాసము కలిగేలా – నేనే చేస్తాను.

అంటుంది.

ఎంతగా ప్రపంచాన్ని గూఢచర్యం ఆక్రమించి నడిపించినా, అదీ భగవంతుడి చేతిలోదే! ఆయన్ని అతిక్రమించి ఏదీ ఉండదు. కాబట్టే నకిలీ కణికుల అనువంశీయుల గూఢచర్య పట్టు, భగవదేచ్ఛ ప్రకారమే నడిచింది, భగవదేచ్ఛ ప్రకారమే తిరగబడింది. కుడితే చావాలన్న చీమ, కుట్టగానే చచ్చినట్లుగా!

హిందూ ఇతిహాసాలలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హిరణ్య కశ్యపాది రాక్షసుల బాధల భరించలేక, భగవంతుడికి మొరపెట్టుకుంటే, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు "తగిన సమయం వచ్చే వరకూ, రాక్షసుల పాపం, కర్మ పరిపక్వం అయ్యేవరకూ వేచి ఉండాల్సిందే" అంటాడు.

సరే, ఈ విషయాంతరం వదిలి మళ్ళీ అసలు విషయానికి వస్తాను.

గూఢచర్య దృష్టితో చూస్తే,

1992 జూన్ నుండి జరిగిన కాలాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు.

1]. తొలిదశ: 1992 జూన్ లో రామోజీరావు గురించి పీవీజీకి తెలిసినప్పటి నుండి 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చటం వరకూ.

2]. రెండోదశ: 1993 ప్రారంభం నుండి 1996 లో పీవీజీ ఎన్నికల్లో ఓడిపోయే వరకూ

3]. మూడో దశ: అక్కడి నుండి 2004 లో పీవీజీ మరణించే వరకూ

4]. నాలుగో దశ: అప్పటి నుండి ఇప్పటి వరకూ, అంటే 2010 వరకూ.

ఆయా దశలలో జరిగిన వ్యవహారాలని రెండు రకాలుగా పరిశీలించాలి.

అ] నెం.5 వర్గం పనితీరు దృష్ట్యా

ఆ]. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల అరిషడ్వర్గాల దృష్ట్యా.

ముందుగా తొలిదశని పీవీజీ, నెం.5 వర్గపు పనితీరు దృష్ట్యా పరిశీలిస్తే...

1992 జూన్ లో పీవీజీకి రామోజీరావు గురించిన సమాచారం తెలియగానే, ఏమాత్రం తొందరపాటుకి గురికాలేదు. తమ ప్రాధమిక పరిశీలనకి, తాము అప్పటి వరకూ.... భారతదేశం మీద జరుగుతున్న కుట్రలో ఏ ప్రధాన కుట్రదారుడి కోసమైతే అన్వేషిస్తున్నారో, అతడే రామోజీరావు అన్న విషయం అర్ధమైంది. 1984 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ & నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు Vs గవర్నర్ రాంలాల్ ల వ్యవహారాలతో, ఇందిరాగాంధీ రామోజీరావు వైపు అనుమానంతో అడుగులు వేసిన మరునెలలో, అప్పటికి మూడు నెలల ముందు నిర్వహించిన ఆపరేషన్ బ్లూస్టార్ ప్రతిఫలం పైకారణంగా[over leaf reason]గా ఇందిరాగాంధీ హత్య జరగటం వంటి ఎన్నో సంఘటనలు పీవీజీకి స్ఫురణలోనే ఉన్నాయి.

నిశ్శబ్ధ పరిశీలనతో, తమకి అప్పటికి అందుబాటులో ఉన్న సమాచార సాంకేతికతని వినియోగిస్తూ, ’రామోజీరావు’ అనే తీగని పరిశీలిస్తూ పోతే, అతడే ప్రధాన కేంద్రం గనుక, అతడికి అనుసంధానమై ఉన్న డొంక అస్తిత్వం [Existence] అర్ధమైంది. అందులోని ప్రతీ అంశాన్నీ పరిశీలిస్తూ.... నిర్ధారించుకుంటూ.... పోతే, బయటపడిన గూఢచర్య వలయం మొత్తం ప్రపంచాన్ని ఆవరించి ఉండటం, సుదీర్ఘ కాలంగా వేళ్ళూనుకొని ఉండటం, అనువంశికంగా తరాలు మారినా ఆధిపత్యం కొనసాగుతుండటం గోచరమయ్యింది. దానినే నకిలీ కణిక వ్యవస్థగా ఉటంకించాను.

హైదరాబాదు నవాబుల పాలనలో భద్రాచల రామదాసు కాలంలో పురుడుపోసుకొని...

ఔరంగజేబుకు ’చెంచాగిరి’ చేస్తూ సామ్రాజ్య విస్తరణ, నిర్వహణల గురించిన పాఠాలు నేర్చి...

నిజాంల కాలంలో బాలారిష్టాలు దాటి...

బ్రిటీషు, తదితర యూరోపియన్లతో దోస్తీ చేస్తూ ఆధునిక ఆయుధ ప్రాక్టికల్స్ తో ఎదిగి...

వీటన్నిటికీ భారతీయ ఇతిహాసాలలోని గూఢచర్య విజ్ఞానాన్ని విపర్యయంగా ఉపయోగించే నేర్పునీ, గూఢచర్య నైపుణ్యాన్ని జోడించి...

ప్రపంచాన్ని వలయంగా ఆవరించి, ఆడించగలిగేంతగా బలపడిన నకిలీ కణిక వ్యవస్థ!

మహాభారతంలోని కణికుడి కూటనీతిని అమలుపరుస్తూ, ఆ కీర్తిని తాత్కాలికంగా ఎవరో ఒకరికి ఆపాదిస్తూ [మొదట్లో బ్రిటీషు - రష్యా - అమెరికా - చైనా, ఇజ్రాయేల్ ల గూఢచార సంస్థలకు] తాము ప్రచ్ఛన్నంగా ఉంటూ, బలపడిన నకిలీ కణిక వ్యవస్థ!

’పరిస్థితులన్నీ సమకూడాయి’ అనుకున్నాక, అద్భుత రీతిలో అస్తిత్వాన్ని ప్రకటించుకుని, అలెగ్లాండరు కాలం నుండే ఎందరో కలలు కని, సంపూర్ణంగా సాధించుకోలేక పోయిన ప్రపంచాధిపత్యాన్ని ప్రతిష్ఠించుకోవాలని, తీవ్రకృషి చేస్తున్న నకిలీ కణిక వ్యవస్థ!

నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయం దృగ్గోచరమైనా గానీ, పీవీజీ, భారతదేశం పట్ల నిబద్దత గల నిఘా సంస్థల్లోని కొందరు వ్యక్తులూ, ఏమాత్రం తొందరపడలేదు. తమకేమీ తెలియనట్లే, ఎవరికీ ఏ అనుమానం రాకుండానే తొలి ఆరేడు నెలలు పనిచేసుకు పోయారు. పంజాబ్ లోని ఖలిస్తాన్ ఉగ్రవాదం, హఠాత్తుగా, కెపీఎస్ గిల్ చాకచక్యంతోనూ, టెర్రరిస్టుల ఆనుపానులు యాదృచ్చికంగా తెలియరావడంతోనూ చల్లారిపోయింది. మండల్ రిజర్వేషన్ల రచ్చ కోర్టు తీర్పులోని చిక్కుముడుల వంటి ’లిటిగేషన్ల’తో చల్లారిపోయింది. [బోడోలాండ్ లాంటివి అసలే ప్రత్యేక కారణం లేకుండానే మామూలుగా తెరమరుగై పోయాయి.] కాశ్మీర్, ఉల్ఫా లాంటి ఉగ్రవాద చర్యలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇలా వేటికి వాటిని సహజంగా అన్పించే పైకారణాల[over leaf reasons] ని జాగ్రత్తగా సృష్టిస్తూ, చూపిస్తూ పీవీజీ, 1992 జూన్ నాటికి రగులుతున్న సమస్యలని, తదుపరి నెలలలో చల్లార్చాడు.

ఇక్కడ ఓ సంఘటన గుర్తు చేస్తాను. 1992లో, అయోధ్యలో బాబ్రీ మసీదుని ముట్టడించి, మందిర నిర్మాణం ప్రారంభిస్తామని భాజపా, ఆరెస్సెస్ లు హెచ్చరించిన నేపధ్యంలో దేశం భగ్గున మండుతోంది. సమస్యని చల్లార్చడానికి పీవీజీ, వారణాసి, తదితర ప్రాంతాల నుండి సాధు సంతులని చర్చలకి ఆహ్వానించాడు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రప్పించి, గంటల పాటు వాళ్ళతో చర్చలు జరిపాడు. ఆయన వాదనకి, తర్కానికి వాళ్ళు మెత్తబడ్డారు. ఆయన నచ్చచెప్పిన విధానానికి తాము convince అయ్యామని ప్రకటన కూడా ఇచ్చారు. సమస్య జటిలత తగ్గగలదని అంతా అనుకునేంతలోనే, తిరిగి వెళ్ళిన సాధుసంతులు, రెండురోజుల్లో మళ్ళీ మొదటికి వచ్చారు. ఆ విధంగా కూడా ఒకో సంఘటన జరిగే కొద్దీ, పీవీజీకి, నకిలీ కణిక వ్యవస్థ గూఢచర్య వలయం confirm అవుతూ వచ్చింది.

ఈ రకంగా అయోధ్య సమస్య విషయంలో శాయశక్తులా కృషి చేసిన పీవీజీ, ఎక్కడా తనకి గూఢచర్యపు గుట్టు తెలిసినతనాన్ని పైకి పొక్కనియ్యలేదు. [సెప్టెంబరు ఆక్టోబరు నాటికే, అప్పటి వరకూ సోనియాతో ఉన్న సత్ససంబంధాలు తగ్గుతూ వచ్చాయి. దూరం పెరుగుతూ పోయింది.]

ఇక్కడ ఓ పోలిక చెబుతాను. ఓ విద్యుత్ వలయంలో విద్యుత్తు సరపరా సవ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఎలక్ట్రీషియన్, విద్యుత్ వలయాన్ని కొన్ని విభాగాలుగా సరిచూసుకుంటాడు. టెస్టరు, మల్టీ మీటరు వంటి పరికరాలతో, విద్యుత్ వలయంలోని ఒకో విభాగాన్ని పరీక్షించుకుంటూ పోతాడు. ఫలానా డయోడ్ వరకూ ఒక విభాగం, మరో ట్రాయోడ్ వరకూ మరో విభాగం, ఈ జంక్షన్ వరకూ, ఈ ట్రాన్స్ ఫార్మర్ వరకూ... ఇలా! అదేవిధంగా పీవీజీ కూడా, గూఢచర్య వలయాన్ని పరీక్షించుకుంటూ వెళ్ళాడు. అదీ పైకి తెలియనీయకుండా!

కాబట్టే... 1992 డిసెంబరు 6న, బాబ్రీ మసీదు గుమ్మటాన్ని కరసేవకులు కుప్ప కూల్చుతుండగా అద్వానీ... "నా శరీరం పులకరిస్తోంది. జన్మ తరించింది. చిరకాల లక్ష్యం సాక్షాత్కారమౌతోంది" అని పరవశంతో అన్నాడు. ఈ మాటలు అప్పటి వార్తా పత్రికలలోనూ, ఇండియా టుడే వంటి పత్రికలలోనూ వచ్చాయి కూడా! ఆ నాటి పరిస్థితులని నా గత టపాలలో పూర్తిగా వివరించాను.

తదుపరి, వారం రోజుల గృహ నిర్భంధం తర్వాత, అద్వానీ... కంటిక్రింద నల్లటి చారలతో, మ్లాన వదనంతో, అప్పటి వరకూ ఘర్జనలు చేసిన కంఠం మూగబోగా... విషణ్ణ చిత్తంతో విడుదల అయ్యాడు. అప్పుడే, తొలిసారిగా, అతడికి "దొరికిపోయావ్" అన్న హెచ్చరిక ఇవ్వబడింది. అలాగే, కొంచెం అటూ ఇటూగా నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలకి కూడా!

ఈ తొలిదశని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తుల దృష్ట్యా చూస్తే...

1991 మేలో రాజీవ్ గాంధీని హత్య చేయించాక, పీవీజీని ప్రధానిగా చేయటంలోనే, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం లోని కీలక వ్యక్తులకి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. తన మేధస్సుతో, స్ఫూర్తితో, ఎప్పటికప్పుడు తమ వ్యూహాలని బాగానే అడ్డం కొట్టినందుకూ, తమ కుట్రకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇందిరాగాంధీకి నైతిక స్థైర్యాన్ని, మద్దతునీ ఇచ్చినందుకూ, పీవీజీకి వాళ్ళు ఇవ్వదలుచుకున్న బహుమతి - ఆయన ప్రధానిగా ఉండగా దేశాన్ని కుప్పకూల్చటం! అందుకు ముందో వెనుకో దేశాన్ని వీలైనన్ని ముక్కచెక్కలు చేయటం. ఆ దుష్కీర్తిని ఆయన తలకెత్తటం. అందుకే 1991 జూన్ లో ప్రధాని పదవినధిష్టించిన పీవీజీని, 1992 జూన్ కల్లా, అంటే సంవత్సరం తిరిగేసరికల్లా, సమస్యల సుడిగుండంలో ముంచాలని చూశారు. స్టాక్ ఎక్చేంజ్ హర్షద్ మెహతా ఆర్ధిక నేరాలు, మండల్, మందిర్, పంజాబ్, కాశ్మీర్, ఉల్ఫా, బోడో, నాగా గట్రాల ఉగ్రవాదం... ఇలా లెక్కలేనన్ని సమస్యలు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి, భాజపా, ఆర్ ఎస్ ఎస్ ల వీరంగం నేపధ్యంలో అయితే, ప్రపంచవ్యాప్తంగా మీడియా మొత్తం, అయోధ్యలో, ఢిల్లీలో మోహరించింది. పూర్తిగా భారత్ పైనే దృష్టిపెట్టింది.ప్రత్యక్ష ప్రసారాలు, నేతల ముఖాముఖిలు, కర సేవకుల మనో భావ చిత్రీకరణలు! ముస్లిం దేశాలన్నీ అప్పటికే భారత్ లోని ముస్లింలకి మద్దతు పలికాయి. సౌదీ మద్దతుతో సలాఉద్దీన్ ఓవైసీ చెలరేగి పోతూ ఉన్నాడు. [ఆ మీటింగ్ ల కోసం తిరుగుతున్నప్పుడు ఓసారి సలాఉద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న విమానం, సరిగ్గా రెండు భాగాలుగా విరిగిపోయింది. ఎవరికి ప్రాణాపాయం కలగకుండా ఈ ప్రమాదం[?] జరిగింది. తరువాత ఓవైసీ ’గొంతు’ కొంచెం తగ్గింది. ఈ వార్తాంశానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకుండా పత్రికలలో ప్రచురణ జరిగింది.]

ఈ పరిస్థితిని ఏమాత్రం నిభాయించలేకపోయినా పర్యవసానం దారుణంగా ఉండబోతోన్నది పీవీజీకి అర్ధమయ్యింది. దేశం కుప్పకూలడంతో పాటు, అయిదారు వందల ముక్కలుగా విభజింపబడినా ఆశ్చర్యం లేని స్థితి! పూర్వపు రాజులు, జైపూర్ ల దగ్గర నుండి మైసూర్ ల దాకా వివిధ మాజీ సంస్థానాధీశులు, నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యపు గొలుసులో పూసలై , తమ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారయ్యె!

ఇదంతా కవర్ చెయ్యాటానికే ప్రపంచమీడియా ఆర్బాటం చేస్తోందన్న విషయమూ పీవీజీకి పూర్తిగా స్పష్టపడింది. స్టాక్ ఎక్చేంజ్ కుంభకోణం, ఆలిండియా లారీ బంద్, మండల్, పంజాబ్, బోడో, నక్సల్ వంటి సమస్యలని పరిష్కరించటం అనే తాత్కాలిక విజయం ఇచ్చి, తీరా బాబ్రీమసీద్ సమస్యతో తనని బొక్కబొర్లాపడేసి, దేశాన్ని ముక్కలుచెక్కలుగా విడగొడితే...?

మరోప్రక్క, భాజపా RSS నాయకులు, అద్వానీ లాంటి సీనియర్ నుండి జూనియర్ దాకా, ఏదో ఒక కారణంతో [హైదరాబాద్ లో చిన్నచిన్న కార్యక్రమాల వంకతో] బాబ్రీమసీదు కూలేవరకూ హైదరాబాద్ చుట్టూ తిరిగారు. ఈ హడావుడీలో పీవీజీకి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, అద్వానీల గూఢచర్య కార్యకలాపాల గురించిన వ్యవహారం పూర్తిగా confirm అయిపోయింది. [కావాలంటే గమనించి చూడండి. ఇప్పటికీ, హైదరాబాద్ లో International Seminars, Meetings జరుగుతాయి. అంతర్జాతీయ సమావేశాల వేదిక మాత్రమే గాని, ఫ్యాక్టరీలు, ప్రాజెక్ట్ లు మొదలైనవన్ని తమిళనాడు కే తరలిపోతాయి. ఒక్క ఐటీ తప్ప, మనకి వచ్చిన పెద్ద ఫ్యాక్టరీలు లేవు.]


అయితే, ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, తమగురించి పీవీజీకి తెలిసిపోయిందని ఊహించలేకపోయింది. తమని ఎవరూ గుర్తించలేరని, తాము ప్రకటించుకున్న రోజున ప్రపంచం విభ్రమం చెందాల్సిందేననీ నకిలీ కణిక వ్యవస్థ లోని కీలక వ్యక్తుల నిశ్చితాభిప్రాయం! అతి విశ్వాసమూ, అతిశయంతోనూ కూడిన అభిప్రాయము!

దాంతో.... పీవీజీ సాధుసంతులని convince చేసినప్పుడు, ’హిందూ మనోభావాలపై, ఆయన కున్నపట్టు, వాదనాపటిమ కారణం’ అనుకున్నారు. కళ్యాణ్ సింగ్, [యూపీ అప్పటి సీఎం] జిల్లా ఎస్పీ మధుకర్ గుప్తాల వంటి ఉన్నతాధికారులు ఆడుతున్న రెడ్ టేపిజపు అడ్మినిస్ట్రేషన్ ని, కోర్టుకి అనుసంధానించి ’బుక్’ చేసినప్పుడు, పీవీజీలోని ’లాయర్’ మేధస్సు కారణంగా కనబడింది. కోర్టు న్యాయమూర్తులని నిఘాసంస్థ అధికారులు ’కలిసి’ మాట్లాడాక, కళ్యాణ్ సింగ్ ఆటలూ, భాజపా ఆరెస్సెస్ నేతల మాటలు, అన్నిటికీ తాళం తిరగబడినప్పుడు - పీవీజీ యొక్క రాజనీతిజ్ఞత కారణంగా కనబడింది.

ఈ పరిస్థితిలన్నిటి గురించీ పీవీజీ తన ’అయోధ్య’ గ్రంధ రచనలో స్పష్టంగా, వివరించారు. అప్పటికే తన మంత్రి వర్గంలోని సహచరులందరూ "గెలిస్తే అది సమిష్టిగా అందరికీ చెందుతుంది. ఓడితే అది పీవీజీకే చెందుతుంది" అనే స్థిర నిర్ణయానికి వచ్చేసారని పీవీజీ ’అయోధ్య’లో వ్రాసారు.

ఆ విధంగా, అయోధ్యలోని బాబ్రీ మసీదుని 1992 డిసెంబరు 6న కూల్చటంతో ప్రారంభించే మతఘర్షణలు, ఇతర గొడవలు చాలకపోతే - తర్వాత క్యూలో మధుర కృష్ణ దేవాలయం ప్రక్క మసీదు ఉంది. ఆ తర్వాత దేశంలో 500 మసీదులు కూలగొట్టటం అనే బృహత్కార్యం భాజపా, ఆరెస్సెస్ ల జాబితాలో ఉంది. ఈ దశలోనే, పీవీజీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీలకి "దొరికిపోయారు" అన్న హెచ్చరిక ఇచ్చింది! గమనించి చూడండి - ఆ నాటి నుండీ వినయ్ కతీయార్, గోవిందాచార్య, అశోక్ సింఘాల్ ల వంటి హిందూమత ఉద్ద్రరణ నాయకుల కంచు కంఠాలు మూతబడి, గర్జించటం తగ్గించేసాయి, పూర్తిగా మానేసాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

అమ్మా, వీర్ సింఘ్వి అనే ఒక హిందుస్తాన్ టైంస్ విలేఖరి పి.వి.జి. మీద ఆయన చని పోయినప్పుడు తన అక్కసు వేళ్ళగక్కాడు. పి.వి.ఆర్.కే. ప్రసాద్ మీద అవాకులు చవాకులు పేలాడు. ప్రసాద్ గారు పి.యం. కొలువులో ఉన్నాడు. వీర్ సింఘ్వి వ్యాసం చదివి నప్పుడే నాకు అర్థమైంది కాంగ్రెస్ లో పై వాళ్ళకి పి.వి. మీద ఎంత వ్యతిరేకత ఉందో. వాళ్ళు వీడి చేత వారి ఉద్దెశాలు బయట పెడతారు. సి.యన్.బి.సి. టి.వి.18 లో మొన్న ప్రణబ్ ముఖర్జి తో ఇంటెర్వ్యు చేసి అందరి పి.యం.ల తో పని చేస్తున్నపుడు అనుభవాలు అడీగాడు ఒక్క పి.వి.జి. తప్ప. పి.వి.జి. కి ఢిల్లి లో సమాధికి స్తలం ఎవ్వలేదు అంటెనే మనకు అర్థమౌతుంది వీరి సంగతి. ఇప్పుడు వీర్ సింఘ్వి కామేడిగా ఏ రెస్టారెంట్ లో ఎమీ దొరుకుంతుంది, మందు ఎంత మోతాదులో కలిపి తాగాలీ లాంటి వ్యాసాలు, దీపికా పదకొణే లాంటి వారిని ఇంటెర్వ్యులు చేసుకుంటూ పొట్ట పోసుకుంట్టున్నాడు. ఇది వీడి దేశ భక్తి. ఇటువంటి కామేడి గాళ్ళు పి.వి.జి.ని విమర్శిస్తూ రాయడమా?

అజ్ఞాత గారు,

హిందూస్తాన్ టైమ్స్ లో వ్రాసే వీర్ సింఘ్వీ నిర్వాకం గురించి నాకు తెలియదు గానీ, పివిఆర్ కె ప్రసాద్, ఐఏఎస్ గురించి మాత్రం గుర్తుందండి. విశాఖ పోర్టు ఉన్నతాధికారిగా ఉన్న ప్రసాద్ గారిని అప్పట్లో పీవీజీ ప్రత్యేకంగా ప్రధాని కార్యాలయంలోకి తీసుకున్నారు. ఒక్కసారిగా అడ్మినిస్ట్రేషన్ లో జరిగిన చాలా మార్పుల్లో అదీ ఒకటి. వీర్ సింఘ్వీ వంటి వాళ్ళ గురించిన మంచి సమాచారం మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

this very same PVRK Prasad also worked as secretary for Chandra Babu Naidu also.
I would like to tell something abt this PVRK Prasad. This guy has a column in Swathi weekly untill recently (I don't know bcoz I am not following Swathi). Once he had written that During the era of PV and Clinton, PV tried very much to fix an appointment for dinner with clinton, but he couldn't do that. But Chandra Swamy was able to fix a dinner with Clinton (who is current President of America) in Washington DC which is capital of US with his contacts. That day I was able to figure out that there is a lot of network or backgound for even Chandra Swamy also.
This Chandra Swamy was later accused of corruption along with PV (after PV was out of post). I don't remember what happened later.
Can you mention or explain about these in your later posts please???

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu