భారత దేశం మీద జరుగుతున్న కుట్రలో, కీలక వ్యక్తి అయిన రామోజీరావు కార్యకలాపాలపై పీవీజీ దృష్టిపెట్టిన తర్వాత, ఆ తీగ లాగుతూ పోతే కదిలిన డొంకే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూను! తదుపరి కాలంలో పీవీజీ, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో, తమ మాతృదేశం పట్ల భక్తి, నిజాయితీ గల వారిని సమీకరించటం, నెం.5 వర్గాన్ని నిర్మించటం గురించి గత టపాలలో వివరించాను.

నెం.5 వర్గం... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల తాలూకూ నెట్ వర్క్ ని పరిశీలించుకుంటూ పోయాక, తమ పని తీరుని యుద్దరీతిని రచించుకుంది. నకిలీ కణిక వ్యవస్థలో నుండే అసైన్ మెంట్స్ వెళ్తాయి. అయితే అవి ఆయా ఏజంట్లకి ఆత్మహత్యాసదృశ్యం అవుతాయి. నిర్వహించలేదో పెనం మీదనుండి పొయ్యిలోకి, పొయ్యిలోంచి గాడి పొయ్యిలోకి అందులోంచి నిప్పుల కొలిమిలోకి పడ్డట్టుగా పరిస్థితి తయారౌతుంది. అంతేగాక, ఎక్కడి కక్కడ, ఏవ్యక్తి[ఏజంటు]కైనా ’కన్నా?కాలా?’ అన్న స్ట్రాటజీ ఎదురు పెట్టబడింది. ఈ గూఢచర్య వ్యవహారం ఎలా నడుస్తుందో గత టపాలలో విపులంగా వ్రాసాను.

అనివార్యమై, ’చంపు లేదా ఛస్తావ్’ అన్న పరిస్థితి ఎదురయ్యీ, నకిలీ కణిక వ్యవస్థలోని ప్రధాన ఏజంట్లు, కొన్ని జాతర బొమ్మలు ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారు, బయటపెట్టుకుంటున్నారు. దొంగలు దొంగలు తన్నుకుని గుట్టురట్టవ్వటం జరుగుతోంది. ఒకప్పుడు ఈ ’బహిర్గతాలు’ ఇంతగా జరిగేవి కావు. ఒకవేళ, పైకారణం[over leaf reasons]రీత్యా నకిలీ కణిక వ్వవస్థకీ, నెం.10 వర్గానికీ చెందిన, ఏ ఇద్దరు ఏజంట్లయినా వివాదపడవలసి వస్తే, అందులో ఒకరిని అప్పటికి తాత్కాలికంగా ఓటమి పాలు చేసి fade out చేసేవారు. అదే రాజీనామాలు, బదిలీల పేరుతో జరిగేవి. గొడవ చల్లారి, మామూలు పరిస్థితులు ఏర్పడ్డాక, గుట్టు చప్పుడు గాకుండా, ఆ fade out చేయబడిన వారికి మళ్ళీ ఏవో పదవులు, కాంట్రాక్టులు కట్టబెట్టటం జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళ రాబడి నౌక సుఖంగా నడిచిపోతుంది.

ఇప్పడది సాధ్యం కావటం లేదు. ఒకవేళ పదవి/కాంట్రాక్టులు ఇచ్చినా, మళ్ళీ వాళ్ళు వివాదస్పదం అయి తెరపైకి వస్తున్నారు. దాంతో... ఇచ్చినవాళ్ళు, తీసుకున్నవాళ్ళు ఇద్దరూ expose అవుతున్నారు. ఎవరికి వచ్చిన Assignments వాళ్ళు నిర్వహించవలసి రావటం, ఆవి ఆత్మహత్య సదృశ్యమైనా, తమ అనుంగు అనుచరుల హత్యా సమానమైనా తప్పటం లేదు. దాంతో ’సువర్ణముఖి’లు అనుభవించకా తప్పటం లేదు. గూఢచర్యంలో ఎవరికి పట్టు ఉంటే వాళ్ళు ఎదిరి వర్గానికి ఈ పరిస్థితి కల్గించగలరని గతటపాలలో వివరించాను.

’కన్నా?కాలా?’ అనే స్ట్రాటజీ మీకు విశదంగా అర్ధమయ్యేందుకు ఒక తాజా ఉదాహరణ చెబుతాను.

ఇప్పుడు నడుస్తున్న తెలంగాణా ఉద్యమాన్నే తీసుకుంటే... దాని కార్యకారణ సంబంధాలని గత టపాలలో తెలంగాణా ఉద్యమం వెనుక అసలు కథ - 01 లో వివరించాను. అందులో కాంగ్రెస్ అధిష్టానానికి, తెలంగాణా ఉద్యమ నాయకులకీ ఎదురుగా నిలబడిన ’కన్నా?కాలా?’ స్ట్రాటజీని ఇక్కడ వివరిస్తాను.

కాంగ్రెస్ అధిష్టాన దేవత సోనియా, 2009 ఎన్నికలకి ముందు కేసీఆర్ తో చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా[ప్రకటనలు మాత్రమే, తెలంగాణా రాష్టం కాదు సుమా!], తన పుట్టిన రోజు నాడు ’తెలంగాణా షురూ’ ప్రకటన ఇప్పించింది. మరుక్షణం ’సమైక్యాంధ్ర’ అన్న గగ్గోలు రేగింది. ఆ స్థితిలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి, వేర్పాటు వాదానికి ఊతం ఇచ్చిందా?... అదే వరుసలో దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో 11 నుండి13 దాకా చిన్న రాష్ట్రాలు నిలబడి ఉన్నాయి. విదర్భ, గూర్ఖాలాండ్ గట్రా. దెబ్బతో దేశమంతా వేర్పాటు వాదులు, సమైక్యవాదులు అన్న వర్గాలు తయారౌతాయి. దాంతో నకిలీ కణిక వ్యవస్థలో, నెం.10 వర్గంలో కీలక వ్యక్తి అయిన సోనియా, ఆ వ్యవస్థే అమలు చేసిన ’విభజించి పాలించు’ అన్న తంత్రాన్ని అమలు పరుస్తూ, అలనాటి బ్రిటీషు వాళ్ళ స్థానంలో నిలబడుతుంది. నిజరూపం బయటపడుతుంది. ఆ దుష్కీర్తినీ కొంగున కట్టుకోవాల్సి వస్తుంది. ఇది కన్ను పోగొట్టుకోవటం వంటిది.

సరే, "తూచ్! ఇప్పుడు రాష్ట్రం ఇవ్వను" అంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోని అధిదేవత అయి కూర్చొంటుంది. ఇది కాలు పోగొట్టుకోవటం వంటిది. నిజానికి ఈ అధిదేవత తెరవెనక చేసేది ఇదే! అవసరానికి మాట ఇవ్వటం, ఆ తర్వాత చారులో కరివేపాకులా తీసి అవతల పారెయ్యటం! అదేమొత్తుకున్నారు ఎర్రపార్టీల వాళ్ళు, అమర్ సింగూ గట్రాలు. ఇక్కడ ఈ అధిదేవత ఉపయోగించే స్ట్రాటజీ ఏమిటంటే వాళ్ళంతట వాళ్ళే బయటకు వెళ్ళేటట్లు చేయటం. అయితే తెరమీద, బహిరంగంగా, అందరికీ తెలిసేటట్లుగా మాట ఇచ్చి "తూచ్!" అంటే ఇమేజ్ డామేజ్ అవుతుంది. ఎందుకంటే "తూచ్" అంటే తెలంగాణా విద్యార్ధులు తెరమీద ఉన్నారు. ఈ సోనియా పరువును డామేజ్ చేస్తారు. కాబట్టి ఇది కాలు పోగొట్టుకోవటం వంటిది. అందుచేత ప్రస్తుతం కన్ను కాపాడుకుని, కాలు వదిలేసుకుంటోంది. కమిటీలు, రోడ్ మ్యాప్ లూ, మెకనిజంలూ, విధివిధానాలూ అంటూ నడుస్తోంది కాలు వదిలేసుకునే స్ట్రాటజీనే! అందుకే కాలయాపన నడుస్తోంది.

ఇక ఇదే విషయంలో, తెలంగాణా ఉద్యమనాయకుల ’కన్నా?కాలా?’ ఏమిటంటే - కాంగ్రెస్ అధినేత్రినైనా, తమనైనా నడుపుతోంది ఒక గూఢచార ఏజన్సీయే! దాన్ని మనం నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అంటే వాళ్ళు తమవైన పేరుతో పిలుచుకుంటారు. అది సిఐఏ కావచ్చు, ఐఎస్ ఐ కావచ్చు, మొసాద్ కావచ్చు, ఎంఐ 5/6... ఏదైనా కావచ్చు! ఇప్పుడు ’తెలంగాణా లేదు గిలంగాణా లేదు, కాలయాపన చేసి సద్దిపెట్టెలో పెట్టటమే’ అన్న కాంగ్రెస్ అధిష్టానపు స్ట్రాటజీకి అనుకూలంగా పనిచేయాలి. చేయకపోతే సదరు ఏజన్సీ కెరీర్ పరంగా తమని మటాష్ చేసేస్తుంది. ఇది కన్ను వదులు కోవటం వంటిది.

తమ నాటకాలన్నీ నమ్మి, వాదనలకీ ఉపన్యాసాలకీ ఆవేశపడి, ప్రజల్లో విద్యార్ధుల్లో కొందరు ఉద్యమ స్ఫూర్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు అధిష్టానాన్ని సంతృప్తిపరచటానికి తెలంగాణా ఉద్యమానికి తిలోదకాలిస్తే ప్రజల్లో తాము తుస్సుమంటారు. ఇది కాలు వదిలేసుకోవటం వంటిది. నిజానికి రెండింటిలో ఏది కన్నో, ఏది కాలో తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెస్, తెరాసలకు సంబంధించిన రాజకీయ నేతలున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి, తమని నడుపుతున్న ఏజన్సీకి, పరిస్థితుల మీద, గూఢచర్యంలోనూ పూర్తి పట్టు లేదన్న విషయం ఇప్పుడిప్పుడే తమ అనుభవంలోకి వస్తోంది మరి! అందుకే వంద డెడ్ లైన్లు ప్రకటించటం! ఈ మొత్తం వ్యవహారంలో పార్టీలకతీతంగా, రాజకీయనాయకులను ప్రజలకి expose చేసి చూపిస్తుంది నెం.5 వర్గం! ఈ విధంగానైనా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావటమే ప్రధాన ఉద్దేశం. పైకారణం ఏదైనా కానీ పుట్టిన గడ్డ మీద ప్రేమ కలగటమే ఇక్కడ విషయం.

ఇక తెదేపా నేతల , సమైకాంధ్ర నేతల విషయంలో ’కన్నా?కాలా’ స్ట్రాటజీ ప్రస్ఫుటం కావటానికి మరికొంత స్పష్టత వచ్చేదాక వేచి చూడాల్సిందే!

ఇది నెం.5 వర్గం నకిలీ కణిక వ్యవస్థతోనూ, నెం.10 వర్గంతోనూ చేస్తున్న యుద్దరీతి. దీంతోపాటు, నెం.5 వర్గం మరో పని కూడా చేస్తోంది. అది ప్రజా దృక్పధం మీద! అది ఎలాగో, ఎందుకో పరిశీలించండి.

1]. ముందుగా ప్రజల అవగాహన శక్తినీ, తార్కికతనీ పెంచటం మీద దృష్టి పెట్టారు. అప్పుడు గానీ ప్రజలు కుట్రని అర్ధం చేసుకునే స్థితికిరారు. బహిర్గత మౌతోన్న అవినీతి, గూఢచర్యంతో నిండిన రాజకీయాలు, రాజకీయ నేతల నీతిమాలిన చరితలూ చేస్తోంది అదే. పొలం దున్నబడిన తర్వాత విత్తనాలు చల్లితేనే సరైన పంట దిగుబడి వస్తుంది. అలాగే ప్రజల మానసిక స్థాయి కూడా, ఇంత కుట్రనీ అర్ధం చేసుకునే విధంగా దున్ని సిద్దం చేయబడాలి. [ఉదాహరణకి, టీవీలలో అత్తాకోడళ్ళు, భార్యభర్తలు, వ్యాపార భాగస్వామ్యులు, ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోవటం చూస్తున్నాం. అన్ని భాషలలోనూ అన్నిటీవీ ఛానెళ్ళలలోనూ ఇవే కథలు. అలాగే సినిమాలలోనూ కుట్రలకి, ఎత్తుపైఎత్తులకి, మానసిక తంత్రాలకి సంబంధించిన కథలే.]

2].ఇందుకోసం... ముందుగా... నెం.5 వర్గం... అప్పటి వరకూ అన్నిదేశాల్లో, అన్ని రంగాల్లో, అన్ని ప్రభుత్వ శాఖల్లో, అన్ని స్థాయిల్లో... అవినీతిని వ్యతిరేకిస్తున్న, కట్టడి చేయ ప్రయత్నిస్తున్న నిజాయితీ పరులని, ప్రత్యక్ష జోక్యంతోనో, పరోక్ష జోక్యంతోనో ఆ ప్రయత్నాల నుండి తప్పించింది. ఎందుకంటే - ఎటూ మరికొన్నేళ్ళ పోరాటం తర్వాతనైనా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ఆయా నిజాయితీ పరులని అణగదొక్కటం ఖాయం. అదీగాక ఇలా ఎదురుతిరిగే వాళ్ళున్నంత కాలం, నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గానికి సహజమైన పైకారణాలు[over leaf reasons]పుడతాయి. ద్వంద్వాలు సృష్టించటం సులభమౌతుంది. అదే అడ్డుకునే వాళ్ళు లేకపోతే ’పెరుగుట విరుగుట కొరకే’ అన్నట్లు అవినీతి అమితవేగం పుంజుకుంటుంది. ’అవినీతికి బారికేడ్లు తొలిగించటమే అవినీతిని అంతం చేయటానికి మార్గం.’ అలాగే ’గూఢచర్యాన్ని బహిర్గతం చేయటమే గూఢచర్యాన్ని నిర్వీర్వం చేయటానికి మార్గం’ అన్నవే ఇక్కడ ఆచరణలో పెట్టబడ్డాయి.

అందుకోసమే 1996 వరకూ, ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలలో, భారత గూఢచార సంస్థలు, దేశంపట్ల నిబద్దత ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రధాని పదవిని అధిష్టించేందు కోసం పనిచేసేవి. మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్ ల హయాంలో, వారి ప్రభుత్వాలు కొద్దికాలంలోనే కూలిపోయినప్పుడు ఈ మాట బయటికి వచ్చింది. ఇటీవల మన్మోహన్ సింగ్, సోనియాల యూపీఏ ప్రభుత్వం కూడా... 2008, 2009లలో, ముఖ్యంగా ముంబాయి దాడుల అనంతర రోజుల్లో, నిఘా సంస్థలు తమకు పారదర్శికంగా ఉండటం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేసిన వార్తాంశాలు పత్రికల్లో వచ్చాయి.

ఆ విధంగా, 1996 తర్వాత, నెం.5 వర్గం ’ఓటమే స్ట్రాటజీ’గా ఎంచుకుంది. ఆ తర్వాత ఎక్కిన ప్రభుత్వాలన్నీ నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గానికి చెందిన ఏజంట్లవే! కాబట్టే సోనియా ప్రధానిగా అవ్వటానికి వీలుగా చట్టాలని సవరించింది భాజపా ప్రభుత్వం. ఇందులో ఎన్డీయే రోజుల్లోని వాజ్ పేయిది ప్రత్యేక అంశం. సీటులో ఉన్నది వాజ్ పేయి అయినా ప్రభావశీలి అద్వానీయే! ఈ విధంగా ప్రభుత్వంలో సైతం, అవినీతికి బారికేడ్లని తొలిగించటమే ఇక్కడ స్ట్రాటజీ. అదీ పైస్థాయి నుండి సమాజంలో అట్టడుగు దాకా!

అప్పుడేమౌతుంది? అవినీతిలో పోటీ పెరుగుతుంది. క్రమంగా అవినీతి పరులలో కూడా, కొందరు అతి అవినీతిపరులతో, సాపేక్షంగా మిత అవినీతి పరులు పోటీ పడలేకపోతారు. ఫిర్యాదులు ఇచ్చే, అవినీతికి అడ్డుకట్టవేయ ప్రయత్నించే నిజాయితీపరులు, ఇప్పుడు రంగంలో లేరు. ప్రేక్షకత్వం వహించి ప్రక్కకు తప్పుకున్నారు. తము అడ్డుపడి చేయగలిగింది ఏమీ లేదని, అడ్డుపడక పోవటంతోనే చేయగలిగింది ఎంతో కొంత ఉందనీ వారికి అర్ధం చేయబడింది. దాంతో, అవినీతిపరులు, విపరీతమైన వేగంతో, అవినీతి శిఖరాల దాకా ఆయాసంతో మరీ పరుగులు తీస్తున్నారు. కాబట్టే ఒక్క IAS అధికారిని పట్టుకుంటే వందల కోట్లు. ఒక్క మండలాధికారిని పట్టుకున్న వంద కోట్లు! ఒక్కరోజు సచివాలయంలో న్యాయాధికారిని పట్టుకుంటే లక్షల్లో లంచాల డబ్బు కట్టలు! ఈ లెక్కన సంవత్సరానికి ఎన్ని కోట్లుండాలి?

ఇంతగా పరిగెట్టి కొండకొమ్ము చేరాక...? లోయలోకి దూకటం మినహా దారే ముంటుంది? అందుకే వివేకానందస్వామి "నువ్వు చెడ్డవాడివైతే మరింత చెడ్డవాడివి కా! ఏదొక రోజు వెనుదిరిగక తప్పదు" అంటారు.

ఈ విధంగా, బారికేడ్లు ఎత్తేయటంతో కూడా పరుగు ఎక్కువైంది. ఎందులోనైనా ’అతి’ కొన్నాళ్ళకైనా మొహం మొత్తిస్తుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. ఆ సంఘర్షణే, ప్రజలలో తామసం [అలసత్వం] స్థానే రజోగుణాన్ని[చైతన్యాన్ని] రగల్చాలి. అంత వరకూ ఇది తప్పదు. అందుకు తరాలు మారినా సరే! సంఘర్షణా తప్పదు. పరిణామమూ తప్పదు. కాబట్టి ప్రారంభించిన తరం పీవీజీ వెళ్ళిపోయినా ఇది నడుస్తూనే ఉంది. మరోతరం వెళ్ళిపోయినా ఇలాగే నడుస్తుంది. ఆ చైతన్యం రగిలే వరకూ ఈ అవినీతి గురించిన విషయాలు expose అవుతూనే ఉంటాయి.

3]. ప్రజాదృక్పధం గురించి, నెం.5 వర్గం ఈ రకమైన పనితీరు ఎంచుకోవటానికి మరో కారణం కూడా ఉంది. ఏమిటంటే - ఎవరినీ మాటలతో మార్చలేం. అందునా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ ఎక్కించిన తామసాన్ని, అహంకారాన్ని నరనరాన నింపుకున్నాక, మాటలతో మార్పు మరింత అసాధ్యం. అసలుకే "ఈ రోజుల్లో చెప్పేవాడు లేడు. చెబితే వినేవాడు లేడు. రోజులు అలా మారి పోయాయి" అంటూ నకిలీ కణిక వ్యవస్థ పదే పదే ప్రచారించాక, ఆ ప్రచారం అన్ని స్థాయిల వారికీ నిండా తలకెక్కాక!

కాబట్టే ’అనుభవమైతే తప్ప తత్త్వం బోధపడదు’ అన్నారేమో పెద్దలు!

ఒకప్పుడు ఇందిరాగాంధీ వంటి వారు విద్యా, వైద్యరంగాల్లో పెట్టుబడిదారులని అనుమతించలేదు. ’ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్య సంస్థల పనితీరు నాసిగా ఉందనీ, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందనీ’ మీడియా గోలపెట్టింది. అప్పటి జనాలు చూస్తూ ఊరుకున్నారు. కొందరైతే మీడియాతో, ప్రతిపక్షాలతో గొంతు కలిపారు.

సరే! నెం.5 వర్గం వచ్చాక విద్య, వైద్య రంగాలలో కార్పోరేట్ సంస్థలకి తలుపులు బార్లా తెరిచింది. అప్పటికే విద్యారంగంలో కొంత ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నా, కార్పోరేట్ స్థాయిలేదు. మచ్చుకి... 1992 వరకూ విజ్ఞాన్ సంస్థల అభివృద్ధి స్థితీ వేగం, 1992 తర్వాత ఆ సంస్థ అభివృద్ది వేగం, విస్తరణ వేగం పరిశీలించినా మీకు విషయం పూర్తిగా బోధపడుతుంది.

ఇక ఇప్పుడు, దాదాపు 18 ఏళ్ళ తర్వాత చూసుకుంటే, విద్య, వైద్య రంగాలలో పెట్టుబడిదారి విధానం ఎంత భయంకర దోపిడికి తలుపులు తెరిచిందో, మానవీయ విలువల్ని ఎంతగా సమాజం నుండి తరిమేసిందో ప్రత్యక్షంగా అనుభవానికొచ్చింది కదా!

ఇంకా బలమైన, స్పష్టమైన ఉదాహరణ చెప్పాలంటే - ప్రైవేటు టీవీ ఛానెళ్ళు! 1992 కు ముందర కేబుల్ టీవీలు ఉన్నాయి. ఎక్కడికక్కడ [గ్రామస్థాయి నుండి] VCRలతో సినిమాలు వేస్తుండేవాళ్ళు. పల్లెల్లో అయితే ఈ సర్వీసుని టేబుల్ టీవీ అనటం విని నవ్వుకునేవాళ్ళం. వార్తా ఛానెళ్ళు లేవు. [1991లో స్టార్ టీవీ ఛానెళ్ళ ప్రసారాలు మాత్రం కొత్తగా భారత్ లోకి అడుగుపెట్టాయి.] దూరదర్శన్ మీద కుళ్ళు జోకులుండేవి. ఏ మాట కామాట చెప్పుకోవాలి, దూరదర్శన్ కూడా బొచ్చెడు నాసిగా ఉండే కార్యక్రమాలు వేసేది. దాంతో పేపర్ మీడియా "ఫలానా ఫలానా దేశాల్లో ప్రైవేటు టీవీ కంపెనీలు ప్రజలని ఎంతగా అలరిస్తాన్నాయో! విజ్ఞానం, వినోదం,... అంతంలేనంత వాసి, రాసి! ఇక్కడి ప్రభుత్వం తన సొంత ఇమేజ్ కోసం దూరదర్శన్ ని వాడుకుంటోంది. తమ బండారాలు బయటికి వస్తాయని ప్రైవేటుని అనుమతించటం లేదు" అంటూ అరిచిన అరుపులకి జనం కూడా దరువులు వేసారు.

ఇప్పుడు? నట్టింట శనిలాగా ప్రైవేటు టీవీ సంస్థలు కనబడుతున్నాయి. వాళ్ళ స్వార్ధం కోసం వాళ్ళు ఏవైనా ప్రచారిస్తారని, అబద్దాలు చెబుతారని, అశ్లీలం, నేరాల గురించి ప్రసారం చేస్తారని, మొత్తుకోవాల్సి వస్తోంది. ఓ పదిహేను రోజులు టీవీలు మూతబడితే ఎంత బాగుణ్ణో అని కలవరించాల్సి వస్తోంది. కోర్టులు టీవీలకి మార్గదర్శకాలు పెడితే ’హమ్మయ్య’ అని ఊరడిల్లాల్సి వస్తోంది. [ఇప్పుడు అర్జంటుగా నకిలీ కణిక వ్వవస్థకి అవసరం వచ్చింది లెండి. అందుకే కోర్టులు స్పందించాయి.]

ఇదంతా... అనుభవంలోకి వచ్చాక బోధపడిన తత్త్వమే. లేకపోతే దూరపు కొండలు నున్నగానే కనబడేవి. మనం కొండల్ని చేరినా లేక కొండలే మన దగ్గరికి కదిలి వచ్చినా, అప్పుడు తెలుస్తుంది, అవీ ఎగ్గిరి గొగ్గిరిగానే ఉన్నాయనీ, ఎగుడు దిగుళ్ళతో, ముళ్ళతో నిండి ఉన్నాయనీ!

’అవి దూరంగా ఉన్నాయి గనక నున్నగా అన్పించినా, అది నిజం కాదు’ అని చెప్పిన పెద్దల సూక్తులు చాదస్తం అన్పించాయి. రామాయణ భారతాలు విషంగా తోచాయి. గీత ముసలి వాళ్ళ సోదిలా కన్పించింది.

అనుభవమైతేనే గదా అర్ధమయ్యేది మరి!?
ఇందుకు మరో ఉదాహరణ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

Please read and write i
http://www.tehelka.com/story_main.asp?filename=ts013004shashi.asp

adbhutamaina pariseelana .dhanyavaadamulu

Please read this about eenadu

http://apmediakaburlu.blogspot.com/2010/02/blog-post_08.html

అజ్ఞాత గారు : మీరిచ్చిన లింక్ లు చూసానండి. నెనర్లు!

దుర్గేశ్వర రావు గారు: మీ అభినందనలకు ధన్యవాదాలండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu