రామోజీరావు, సోనియా గాంధీల అరిషడ్వర్గాల స్థాయి గురించి మాకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసు.

1996 జూన్ లో పీవీజీ ప్రధాని పదవి దిగిపోయాడు. 1997 ఫిబ్రవరి - మార్చిలలో మామీద భౌతిక దాడి జరిగింది. మా వారి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది.

అప్పటికి మా ఫ్యాక్టరీ ఖాళీ చేసి నంబూరులో ఉండేవాళ్ళం. మంచినీళ్ళు, బావి నీళ్ళ మోటారు, వీధి తలుపు వంటి చిన్న చిన్న విషయాలు పైకారణంగా[over leaf reasons] మాటా మాట పెరిగింది. మా cotenents కి కూడా వీధి తలుపు తీయకపోవటంతో ప్రారంభమైన గొడవ, చిలికి చిలికి చివరికి మా మీదకి వచ్చింది. ఆ వంకతో మా ఇంటి మీదకి దొమ్మికి వచ్చి ఇనుపరాడ్ తో మా వారి చేతిమీద కొట్టారు. మేం పోలీసు కేసుపెట్టటానికి వెళ్ళెటప్పటికే మా మీదే ఎదురు కేసుని పెట్టారు. ఆ విషయాన్ని ఎస్.పి. రాజీవ్ త్రివేది దృష్టికి తీసికెళ్తే అతను "మీరు చదువుకున్నారు కాబట్టి నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు పల్లెటూరి వాళ్ళు, చదువుకోలేదు కాబట్టి నా దగ్గరికి రాలేరు. సరే అయినా విషయం పరిశీలిస్తానని" చెప్పాడు. వెరసి పోలీసు కేసు పెట్టినా, పోలీసులు స్పందించలేదు.

అప్పటికి నంబూరు కమిటీ కాలేజీలో పనిచేస్తుండేదాన్ని. ఆ తర్వాత గుంటూరు వికాస్ కాలేజీలో చేరాను. మా వారి వర్క్ ఎలాగూ గుంటూరులోనే ఉండేది. గుంటూరుకి మకాం మార్చాము. ఆ అనుభవంతో ’ఇతరుల గొడవల్లో తలదూర్చకూడదు. ఎంత గొడవ జరిగినా, చుట్టూ ఉన్న జనం సినిమా చూసినట్లు చూస్తారు కాని, ఇది తప్పు అని ఎవరూ అనరు. కాబట్టి మాటలు వద్దు. బుద్దిబలం ఉపయోగించటమే సరియైనది’ అన్నది అర్ధమయ్యింది.

అప్పటికి ’గుంటూరు మాయాబజార్ లో పుట్టి పెరిగామన్న’ పొగరు మా దగ్గరా ఉండేది. ఆ సంఘటన తర్వాత ఏ వ్యవహారంలోనైనా కండబలం, నోటిబలం ఉపయోగించి ఏమీ సాధించలేమనీ, దేనికైనా బుద్దిబలం ఉపయోగించాలనీ నేర్చుకున్నాము. అంతే తప్ప, కావాలని మా మీద దాడికి కాలు దువ్వారని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే మేం అన్నీ మరిచి పోయి ’మా బ్రతుకు మాది’ అన్న స్థితిలో ఉన్నాము.

పీవీజీ పదవి దిగిపోయిన ఏడెనిమిది నెలలకి మా మీద భౌతిక దాడి జరపబడింది. తర్వాత ఎక్కడ ఎలా కట్టడి చేయబడిందో తెలియదు గానీ, మళ్ళీ మా మీద అలాంటి ప్రయత్నాలు జరగలేదు. పస్తుల దాకా పరిస్థితులు రావటం, ఎదుటి వాళ్ళు మమ్మల్ని బండబూతులు తిట్టటం, ఇల్లూ వాకిలి ఊడగొట్టి ఊళ్ళు పట్టి తిప్పటం, ఎన్ని జరిగినా భౌతిక దాడికి మాత్రం సాహసించలేదు. మళ్ళీ, హైదరాబాద్ నానల్ నగర్ లో ఉన్నప్పుడు, ఎదురింటి అతను మా వారి చొక్కా పట్టుకున్నాడు. అప్పుడు మేం పోలీసు కేసుపెట్టడానికి బయలుదేరగానే మొత్తం ఆ వీధి జనం మమ్మల్ని ఆపి సర్ది చెప్పి ఇంట్లోకి పంపారు. ఈ మొత్తం వ్యవహారాలన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి. 2005 తర్వాత, అవన్నీ తిరగ ఆలోచించినప్పుడు, వాటన్నిటి మధ్య ఉన్న కార్యకారణ సంబంధాలు అర్ధమయ్యాయి.

అయితే నంబూరు సంఘటనతో మాత్రం మేం పాఠాలు నేర్చుకున్నాము. ఆ తర్వాత, శ్రీశైలంలో, 2006 లో మా బడిలో పనిచేసే వృద్దురాలు ఆయమ్మని మర్మాంగం మీద కొట్టి బాధించినా కూడా, మేము "ప్రక్కవాళ్ళ గొడవలో తలదూరిస్తే అది పరిష్కారం కాకపోగా మరింత జటిలం అవుతుంది" అనుకుని ఆయమ్మ సమస్యని మా విద్యార్ధుల తల్లిదండ్రులైన పోలీసుల సాయంతో, off record గా పరిష్కరించే ప్రయత్నం చేశాము. ఎందుకంటే మేము అందులో తలదూరిస్తే "అన్నిట్లో తలదూరుస్తారు. అందుకే అందరితో వివాదాలు. అంతే తప్ప రామోజీరావు లేడు, అతడి వ్యవస్థీకృత వేధింపూ వీళ్ళ మీద లేదు" అనేందుకు, అక్కడి దేవాదాయ అధికారుల దగ్గరి నుండీ పోలీసు CI,SI ల దాకా సిద్దంగా ఉన్నారని మాకు అప్పటికే అర్ధమైంది. దీని గురించిన పూర్తి వివరాలు పీవీజీ - రామోజీరావు - మా కథ అనే టపాల మాలికలో వ్రాసాను.

అప్పుడే కాదు - 2007 నవంబరులో, కేంద్ర హోంమంత్రికి స్వయంగా ఫిర్యాదు అందచేయాలని, నంద్యాల నుండి ఢిల్లీకి రైలు టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాము. అప్పటికే రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం మా కేసుని కేంద్ర హోంశాఖకు పంపినట్లుగా మాకు లేఖ పంపించబడింది. మరుసటి రోజు మా ప్రయాణం ఉంది. ఆ సమయంలో - మా పొరుగు వాటాలో ఓ ముస్లిం కుటుంబం ఉంది. అప్పటికే రోడ్డు ప్రమాదంలో అతడి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉన్నాడు. అతడి తమ్ముడు పరామర్శించటానికి వచ్చాడు. ఉదయం నుండి ఇంట్లోనే తాగుతున్నారు. సాయంత్రానికి ఏమయ్యిందో - తన్నుకోవటం మొదలుపెట్టారు. పొరుగు వాళ్లతో మేం బాగానే ఉండేవాళ్ళం. అతడికి ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే, వాళ్ళ బంధువుల కంటే ముందుగా మేమే వెళ్ళాం.

కానీ ఆ సమయంలో, అతణ్ణి అతడి తమ్ముడే భయంకరంగా కొడుతున్నాడు. ఇద్దరూ తాగి వాగుతూ ఉన్నారు. సరిగ్గా అతడికి దెబ్బతగిలిన కాలి మీద అతడి తమ్ముడు గట్టిగా కొడుతున్నాడు. అతడి భార్య, పిల్లలు గట్టిగా ఏడుస్తున్నారు. వీధిలో అందరూ గుమిగూడారు. అతడి తమ్ముడు ఎవరొస్తే వాళ్ళని తిడుతున్నాడు, మీదిమీదికి వస్తున్నాడు. మా ఇంటి ఓనరు పెద్దాయనని సైతం బూతులు తిడుతున్నాడు. అప్పటికే ఎన్నోసార్లు ఫోన్ చేసినా పోలీసులు రాలేదు.

అందరితో పాటు మేము చూస్తూ ఊరుకున్నాము. నిజానికి అలా చూస్తూ సహించి ఊరుకోవటం, ఎదిరించి పోరాడటం కన్నా బాధాకరం. అయినా ఊరుకున్నాము. ఎందుకంటే, అప్పటికే మేము అలాంటి పాఠాలు నేర్చుకున్నాము. ఓ గంట రచ్చ జరిగిన తర్వాత, ఆ తాగిన వాడు అతడంతట అతడే వెళ్ళిపోయాడు. తర్వాత సంవత్సరానికి ఆ ముస్లిం కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ పలకరింపులు ఉంటాయి. ఇక ఈ విషయాంతరం వదిలేసి...

రామోజీరావు, సోనియాల అరిషడ్వర్గాల గురించి చెప్పాల్సి వస్తే... 2005 అక్టోబరులో, మొదటిసారిగా మేము రామోజీరావు మీద ఫిర్యాదు చేశాము. అందులో, 1992 లో పీవీజీకి రామోజీరావు రహస్య కార్యకలాపాల గురించి మేం ఇచ్చిన ఫిర్యాదు గురించి, తదనంతరం మా మీద జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపు గురించి మొత్తం వివరంగా వ్రాసాము. అయితే మాకు ఏ విధమైన స్పందనా రాలేదు.

ఆ తదుపరి ఆరునెలలకు, 2006 ఏప్రియల్ - మే లలో ప్రధాని మన్మోహన్ సింగ్ కి వ్రాసిన ఫిర్యాదు నకలుకి, కవరింగ్ లెటర్ జత చేసి సోనియాకి పోస్టులో ఫిర్యాదు పంపించాము. అందులో ’దేశ ద్రోహాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, మేం బ్రతికే హక్కుని కోల్పోయామా?’ అని ప్రశ్నించాము. ఆ తదుపరి జూన్ లో ఆరో తేదీన మా స్కూలు రీ ఓపెనింగ్. ఆ రోజు, ఈనాడు కర్నూలు జిల్లా సంచికలో, ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలను నడుపుతున్న వారి మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ప్రకటన వచ్చింది.

అందులో కనీసం బోర్డు కూడా లేని, కేవలం 60 మంది పిల్లలున్న మా స్కూలు పేరు కూడా ఉంది. శ్రీశైలంలో ఉన్న ఏ స్కూలుకీ రికగ్నిషన్ లేకపోయినా మా విషయమే పెద్ద సంచలనం అయ్యింది. మేం ఆ సమస్యని మా పద్దతిలో పరిష్కరించుకున్నాం లెండి. మళ్ళీ ఇప్పటి వరకూ అలాంటి ప్రకటనా రాలేదు, ఎలాంటి చర్యలూ లేవు. శ్రీశైలంలో, కర్నూలు జిల్లాలో, గుర్తింపులేని స్కూళ్ళు బోలెడు బ్రహ్మండంగా నడుస్తున్నాయి.

2006, సెప్టెంబరులో మరోసారి, సోనియాకి రామోజీరావు మీద ఫిర్యాదు పంపాము. అందులో ’భారతదేశానికి రాక ముందు ఇటలీలో ఉన్నప్పుడైనా, ఇటాలియన్ గా తన మాతృదేశం మీద తనకి దేశభక్తి తెలిసే ఉంటుంది కాబట్టి, మాకు భారతదేశం మీద ఉన్న భావాన్ని గుర్తించవచ్చని’ వ్రాసాము. మూడునెలలు తిరిగేసరికి మాగది కేటాయింపుని రద్దు చేస్తున్నట్లుగా దేవాదాయాధికారులు లేఖను పంపారు. అయితే అది నలుగురితో పాటు గనక, అందరితో పాటే ఆగిపోయింది. ఈ వివరాలన్నీ కూడా మా కథలో గతటపాలలో వ్రాసాను. Coups on world లోని డాక్యుమెంట్స్ లోనూ, Events List లోనూ కూడా పొందుపరిచాము.

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ బ్లాగులో రామోజీరావు గురించి, అతడి గూఢచర్యపు వ్యాసాల గురించి, జరుగుతున్న తాజా సంఘటనల వెనక అసలు కథల గురించి, టపాలు వ్రాసినప్పుడు దాదాపు బూతులతో మాకు అజ్ఞాతలు వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. వాటిని ప్రచురించము. అంతేకాదు వాటినీ, ఆ ముందు వెనుకల్లో ఈనాడు వ్రాతల్నీ కూడా చూసి నవ్వుకుంటూ ఉంటాము.

ఉదాహరణకి మాకు తెలిసిన అతనితో మా బ్లాగు రమారమి ఓ రెండొందల మంది దాకా చూస్తారు అన్నాం. అంతే మరుసటి రోజు నుండి మా బ్లాగు హిట్ కౌంటర్ 500 దాకా పరిగెత్తింది. అంటే రోజుకి 500 మంది దాకా చూస్తున్నట్లు కాబోలు! ఒకోసారి రీడింగ్ బాగాపడిపోతుంది. అది మేం గుర్తించామో, లేదో అని అజ్ఞాతలు చెప్తారు ’మీరు ఈమధ్య గమనించారా? మీ బ్లాగు చూసేవాళ్ళు తగ్గిపోయారు. మీరు ఇలాంటి వ్యాసాలు కాకుండా వేరే ఏమైనా వ్యాసాలు వ్రాయండి’ అంటూ సలహాలని కూడా ఇస్తుంటారు.

కొన్ని ప్రత్యేక టపాలకి మా హిట్ కౌంటర్ అసలు కదలదు. ఒక్కోసారి ఆగిపోతుంది కూడా! కొన్ని సార్లయితే ఓ వెయ్యిదాకా సంఖ్య వెనక్కి కూడా పోతుంటుంది. మా బ్లాగు దర్శించిన అతిధులు ఆ తర్వాత ’తూచ్! మేం రాలేదు’ అనరు కదా!? అయినా హిట్ కౌంటర్ లెక్క వెనక్కి పోతుంది. అవన్నీ అలా ’స్పామ్’ అయిపోతాయి. ఈ హిట్ కౌంటర్ల మీద బ్లాగులోకంలో చాలా జోకులే నడిచాయి. అంచేత అదీ మేము పట్టించుకోము. కాకపోతే ఆ హిట్స్ బట్టి మేమే మయినా ప్రోత్సాహం పొందుతున్నామేమోనని అనుమానం కావచ్చు! మేం మాత్రం హిట్ కౌంటర్ చూసి, అది "కదల బొమ్మాళీ! నే కదల!" అంటోందని జోకులు వేసుకుంటాము.

అంతేకాదు, భాగస్వామ్యపక్షాల నేతలూ, మాయావతి వంటి ఇతరపార్టీల నేతలూ, తనపట్ల ధిక్కార ధోరణిని చూపెట్టినప్పుడు, EVM ల టాంపరింగ్ తో ఆయా వ్యక్తుల కెరీర్ కి కామా, పుల్ స్టాఫ్ లు పెడుతూనూ... కాంగ్రెస్ సభ్యులు తనపట్ల అవిధేయత ప్రదర్శించినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూనూ.... సోనియా ప్రదర్శించేది ఈ అరిషడ్వర్గాలనే! సోనియాకి గాని, తనకి గాని, ఇబ్బంది కలిగిస్తే, కలిగించిన వాళ్ళ అవకతవకలని మరుక్షణం పేపర్ లో పెద్దక్షరాలలో వేసి రామోజీరావు ప్రదర్శించేదీ ఈ అరిషడ్వర్గాలనే.

ఇలాంటి అరిషడ్వర్గాలతో ఉన్న వారికి, 1996 లో పీవీజీ ప్రధానిగా ఓడిపోయిన తొలి సంవత్సరాలలో, తమ అసైన్ మెంట్లుకి తమకి నచ్చిన భాష్యాలు చెప్పుకున్నారు. కాబట్టే పీవీజీని ఒంటరిని చేయటం, అవమానించటం, శిబూశోరెన్ ల వంటి వారి సహకారంతో పీవీజీ మీద కేసులు బనాయించటం వంటి నిర్ణయం మొదట్లో బాగున్నాయనిపించాయి. కాబట్టే సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, జె ఎం ఎం ముడుపుల వంటి కేసుల విషయమై కోర్టుకు హాజరైన పీవీజీ ఫోటోని వేస్తూ ’ఈనాడు’ ప్రధానిగా ఉన్న రోజుల్లో అంబాసిడర్ కార్ల కాన్వాయ్ తో కలకలాడిన పీవీజీ, ఈ రోజు నిస్సహాయంగా ఒంటరిగా కోర్టు గుమ్మాలు ఎక్కాడని వ్రాసింది.

’నాడు కలకల నేడు విలవిల’ అంటూ ప్రాసలతో కూడిన శీర్షికలూ పెట్టింది. తర్వాతి సంవత్సరాలలో రామోజీరావు కూడా కోర్టు గుమ్మాలూ, పోలీసు స్టేషన్లూ ఎక్కి దిగాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ విధంగా రెండూగూఢచార ఏజన్సీలు i.e. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 & నెం.5 వర్గమూ సంభాషించుకున్నాయి. అలాంటి భాష చాలానే నడిచింది, నడుస్తోంది. దాని గురించి మరో టపాలో వ్రాస్తాను.

ఇప్పటికి 1999 లో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం దగ్గరికి తిరిగి వద్దాం.

1996 నుండి 1999 లోపల రెండు మధ్యంతర ఎన్నికలతో, నాలుగు ప్రభుత్వాలు ఏర్పడటాన్ని ప్రజలంతా యధాలాపంగా కొందరూ, నివ్వెరపడి కొందరూ తిలకించారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ , వాజ్ పేయ్ ప్రభుత్వాలు! మామూలుగా అయితే కనీసం 15 ఏళ్ళు గడిస్తే గాని, కేంద్రంలో నాలుగు ప్రభుత్వాలు ఏర్పడటాన్ని చూడలేము. ఇంతకంటే ’ప్రయాణం’ సినిమా స్ర్కిప్టు ఏముంటింది?

మొత్తం మూడేళ్ళలో రాజకీయ పార్టీలు, నేతలు, అందరూ... తమ సమీకరణాలని, అవసరమొచ్చినప్పుడు అవసరమొచ్చినట్లు మార్చేసి, తమ అసలు రంగు బయటపెట్టుకున్నారు. 1992 కి ముందు, కాంగ్రెస్, భాజపా, ఇతర చిన్న చితకా పార్టీలన్ని, ఎర్రపార్టీలతో కలిసి నేషనల్ ఫ్రంట్ లాగా ఉండేవి. ఎట్టిపరిస్థితలోనూ తమ సిద్దాంతాలని బహిరంగంగా మార్చుకునే అవసరం వచ్చేది కాదు. అలాంటిది, నకిలీ కణిక వ్యవస్థ అవసరార్ధం, ఎవరయినా ఎప్పుడైనా సిద్దాంతాలని అర్జంటుగా మార్చేసుకుని మరి, ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే అందుకు అనుగుణంగా సమీకరణాలు మార్చేసారు.

ఇక, ఇది కాదనుకొని, 1999లో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా అయిదేళ్ళు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు. అప్పటికి పీవీజీ దిగిపోయి మూడేళ్ళు దాటుతున్నా, గృహమంత్రిగా అద్వానీ లోపలంతా గుచ్చిగుచ్చి వెదికినా, పట్టు దొరకలేదు. సరికదా గూఢచర్య పట్టు తమకి గాక ఎదిరి పక్షానికి ఉండటం అనుభవానికి తెలుస్తోంది. అప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ప్రధాని సీట్లో వాజ్ పేయ్ ని ఉంచి, అద్వానీ గృహమంత్రిగా పనులు చక్కబెడుతున్నాడు.

అప్పటి వరకూ సోషలిజం పాఠాలు చెప్పిన జార్జి ఫెర్నాండేజ్ మత భావాల భాజపాకి భాగస్వామ్య పార్టీ అయ్యాడు. జస్వంత్ సింగ్ గట్రాలందరితో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగింది. "దేశాన్ని గురించిన అభద్రతకి గురిచెయ్యటం, రెచ్చగొట్టటం, కవ్వించటం వంటివి చేస్తే, నెం.5 వర్గం ఆందోళనకి, అలజడికి గురవుతుంది. అప్పుడు ఎక్కడైనా, ఏ అంశంలోనైనా, ఎవరిలోనైనా ఆ ’కదలిక’ పట్టుకోగలిగితే... ఎవరు ఎక్కడి నుండి ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చు".

"తన ఒక్కడి ఆచూకీ తేలిస్తే పీవీజీ చాలానే తెలుసుకోగలిగినట్లు, తానూ నెం.5 వర్గం తాలూకూ ఒక్కరి ఆచూకీనైనా తెలుసుకుంటే, వాళ్ళ నెట్ వర్క్ ని చాలా వరకూ తెలుసుకోవచ్చు" - ఇదీ నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావు ఆలోచన! దాన్ని అమలులో పెట్టింది అద్వానీ, ఇతర మంత్రి బృందం. ఇందులో వాజ్ పేయిని రక్షా కవచంగా ఉపయోగించుకున్నారు. చాలా విషయాలు వాజ్ పేయి దాకా రాకుండానే నడిచిపోయాయన్న మాట బయటికి వచ్చింది. చివరికి ’కాందహార్ కి మళ్ళించిన విమాన హైజాక్ విషయంలో, పీవీజీ హయాంలో బంధించిన పాక్ ముస్లిం తీవ్రవాదులని, రక్షణమంత్రిగా జస్వంత్ సింగ్ వెంటబెట్టుకుని వెళ్ళి మరీ తాలిబాన్లకి అప్పగించిన’ వ్యవహారంలోనూ.... అద్వానికీ తెలుసు, తెలియదు గట్రా వివాదాలు వచ్చాయి గానీ, వాజ్ పేయి గురించి అలాంటి వివాదాలు లేవు.

అందునా నెం.5 వర్గపు వ్యూహం ప్రకారం... ఆయా వ్యక్తుల సంకల్పాన్ని బట్టి, వాళ్ళకి వచ్చే అసైన్ మెంట్లు ఉండటం జరిగింది. మతిలో ఉన్నదే గతిలోకి వస్తుందన్నట్లుగా! ఈ స్ట్రాటజీ గురించి, వ్యక్తుల పరంగా, తర్వాత వివరిస్తాను.

మొత్తంగా అద్వానీకి ఆ విషయాలలో అన్నీ తెలుసు. అతడి ప్రమేయం ఉందన్నదే మొన్న జస్వంత్ సింగ్ ఆత్మకథ విషయంలో బహిరంగంగా నిరూపితమైంది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తి రామోజీరావు వ్యూహం ప్రకారం, దేశం గురించిన అభద్రతకి గురిచేసి, రెచ్చగొట్టి, కవ్వించి నెం.5 వర్గం తాలూకూ ఉనికిని పట్టుకోవటం కోసం... 1999 లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే కార్గిల్ యుద్దం సంభవించింది. అదీ అంతకు ముందుగా వాజ్ పేయి లాహోర్ బస్సుయాత్ర చేసి వచ్చాడు. ప్రధానమంత్రితో పాటుగా వెళ్ళే డెలిగేట్ల బృందంలో ఎవరు ఎన్ని కొరియర్లు నిర్వహించారో ఎవరు చెప్పగలరు? సాక్షాత్తూ గృహమంత్రిగా అద్వానీ సంపూర్ణ అండదండలుండగా, అటువైపు నకిలీ కణిక వ్యవస్థకి బహిఃప్రాణమైన పాకిస్తాన్ లో మాత్రం ఎదురేముందని?

కాబట్టి అన్ని సవ్యంగా జరిగిపోయాయి. ఏర్పాట్లనీ పూర్తయ్యాయి. చలికాలంలో, మంచు విపరీతంగా కురిసే రోజుల్లో, అప్పటికి సంవత్సరాలుగా సియాచిన్ ల దగ్గరే గాక ఇతర సైనిక పోస్టుల్లో కూడా సైనిక క్యాంపులు తాత్కాలికంగా మూసివేయబడతాయి. ఇరుదేశాల మధ్య ఒప్పందాలరీత్యా ఆ సమయంలో చొరబాట్లు జరగవు. అంతకు క్రితం పాకిస్తాన్ సైతం ఆ ఒప్పందాన్ని పాటించింది. అదే తొలిసారి చలికాలంలో చొరబాట్లకు పాల్పడటం! [ఇప్పుడు అది మామూలైపోయింది లెండి.] కార్గిల్ యుద్దం ప్రారంభమై, ముగిసిపోయినా.... ఎక్కడా నెం.5 వర్గం తాలూకూ చడీ చప్పుడూ కనబడలేదు, వినబడలేదు. చివరికి కార్గిల్ ప్రాంతంలో కొంత భూభాగం కోల్పోయామన్న పుకారులు కూడా వచ్చాయి. అయినా నెం.5 వర్గం విషయములో అదే పరిస్థితి.

ఇదే కారణంతో ఎర్రకోటపై ముస్లిం తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. లాభం లేకపోయింది. చివరికి భారత దేశపు పరువు మర్యాదలకి ’సవాలు’ అన్నట్లుగా పార్లమెంట్ పై దాడి జరిగింది. అంత వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించినా నెం.5 వర్గం అజా అయిపు దొరకలేదు గానీ, భారతదేశపు గౌరవ మర్యాదలు కాపాడటానికి, రక్షణ పోలీసు వర్గాలలోని వారు మాత్రం ఒడ్డిపోరాడి అసువులు బాసారు.

భాజపాకి, అద్వానీకి, నెం.5 వర్గపు ఉనికిని అన్వేషించడం మీద ఉన్న శ్రద్ద ఆసక్తి, భారతదేశ మీదగానీ, భారత ప్రజల మీదగానీ, దేశ గౌరవాల మీద గానీ లేవన్నది ఈ క్రింది వార్తే చెబుతుంది.


పైగా సుష్మాస్వరాజ్ ’ఇది విచారించదగిన అంశం’ అన్నది. ఘటన జరిగింది 2001లో. 2004 వరకూ తాము అధికారంలో ఉన్నారు. అప్పుడు తమకి తీరిక లేదు. 2007 నాటికి కాంగ్రెస్, యూపీఏ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటింది. వాళ్ళకీ తీరిక లేదు మరి! ఇదీ ఎన్డీయే, యూపీఏ నిబద్దత దేశం పట్ల, ప్రజల పట్ల, దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల పట్ల!

ఇటు ఈ ప్రయత్నాలు [నెం.5 వర్గపు ఉనికి కనిపెట్టేందుకు] చేసుకుంటూనే మరోవైపు......

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

నిజంగా నెం.5 వర్గం ఉందంటారా? లేక అది మీ సృష్టా ? ఒకవేళ ఉంటే దేశంలో పరిస్థితులు ఇంత ఘొరంగా ఉండవు ... ఏమంటారు ? ఇంకో విషయం ... నకిలీ కనికవ్యవస్త బలపడి దేశం లేదా ప్రపంచ ఆధిపత్యం వాళ్ళచేతుల్లోకి ప్రజలు ఎలా స్పందిస్తారు ? వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రజలు ఒప్పుకుంటారా? అప్పటికే విలువలు సచ్చిన ప్రపంచాన్ని వాళ్ళేంచేసుకుంటారు ?

నిజంగా నెం.5 వర్గం ఉందంటారా? లేక అది మీ సృష్టా ? ఒకవేళ ఉంటే దేశంలో పరిస్థితులు ఇంత ఘొరంగా ఉండవు ... ఏమంటారు ? ఇంకో విషయం ... నకిలీ కనికవ్యవస్త బలపడి దేశం లేదా ప్రపంచ ఆధిపత్యం వాళ్ళచేతుల్లోకి vasthe ప్రజలు ఎలా స్పందిస్తారు ? వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రజలు ఒప్పుకుంటారా? అప్పటికే విలువలు సచ్చిన ప్రపంచాన్ని వాళ్ళేంచేసుకుంటారు ?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu