నకిలీ కణిక వ్యవస్థ స్ట్రాటజీ మూలాలు – 1 [ఆడది – ఆకలి]
టపాలో చెప్పినట్లు ఆడది అన్న స్ట్రాటజీ పై మరికొన్ని దృష్టాంతాలు:
అంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి.తివారీ కామక్రీడల నేపధ్యంలో ఆంధ్రజ్యోతి నుండి మరికొన్ని వార్తాంశాలు పరిశీలించండి.
>>>సెక్స్ కుంభకోణాలు:
వీరంతా బాధ్యతాయుత నేతలు...గా మెలగాల్సిన వారు! ప్రజలకు మార్గదర్శనం చేయాల్సిన విధానాల రూపకర్తలు! కానీ.. వారి చీకటి జీవితం కడు కామపూరితం! అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపులు.. వారి రెండో పార్శ్యం. తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉండి.. రాజ్‌భవన్‌లోనే రాసలీలలు జరిపిన ఎన్‌డి తివారి ఉదంతం నుంచి.. కాస్త వెనక్కు వెళితే.. ఈ 'వికృత అంతర్ముఖాలు' కోకొల్లలు. వీటిలోనూ అమెరికాదే అగ్ర స్థానం. అలాంటి కొన్ని ప్రముఖ సెక్స్ కుంభకోణాలివి.
సెక్స్ కుంభకోణాలు, వీడియో టేపులు, అసభ్య ప్రచారాలు భారత రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఒక్క వారం ముందే కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ ప్రధాన కార్యదర్శి రాజ్‌మోహన్ ఉన్నితాన్(57) మహిళలను అక్రమంగా తరలిస్తున్నారన్న కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు.
మొన్నటి ఎన్నికల సందర్భంగా ఈ సెక్స్ రాజకీయాలు మరీ నీచ స్థాయికి దిగజారాయి. ఈ ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలని సమాజ్‌వాది పార్టీ నేత ఆజమ్ ఖాన్.. తాను నగ్నంగా ఉన్నట్లు ఫొటోలు, సీడీలు తయారు చేయించి పంపిణీ చేస్తున్నారని తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌కు.. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు తరలిన తార జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు.
2005 డిసెంబర్‌లో బీజేపీకి చెందిన నేత, ఆరెస్సెస్ మనిషి సంజయ్ జోషి ఓ అపరిచిత మహిళతో కలిసిన ఉన్న సీడీలు బయటికి వచ్చాయి. ఈ ఎపిసోడ్‌తో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మధుమిత శుక్లా అనే కవయిత్రి హత్య కేసులో యూపీ మాజీ మంత్రి అమర్‌మణి త్రిపాఠీని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో త్రిపాఠీ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. దారుణంగా హత్యకు గురైన ఆమె.. ఆ సమయానికి గర్భవతి కూడా. విచారణ సందర్భంగా కడుపులోని పిండం డీఎన్‌ఏ త్రిపాఠీ డీఎన్‌ఏతో సరిపోలింది. దాంతో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరాక్ సర్కార్ రావత్ పెళ్లికాని తల్లితో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 2003లో రాజీనామా చేశారు.
ఇక 2001లో సంచలనం రేపిన తెహల్కా స్టింగ్ ఆపరేషన్ 'ఆపరేషన్ వెస్ట్ ఎండ్'లో విలేఖరులను మభ్య పెట్టేందుకు సమతా పార్టీ కోశాధికారి ఒకరు వేశ్యలను ఏర్పాటు చేసేందుకు బేరాలాడిన సన్నివేశాలు రికార్డయ్యాయి. ఇదే ఆపరేషన్‌లో కొందరు ఆర్మీ అధికారులు రక్షణ కాంట్రాక్టులు వచ్చేట్టు చేయాలంటే తమకు ఖరీదైన వేశ్యలు కావాలని విలేఖరులను డిమాండ్ చేశారు కూడా.
కేరళలో 'ఐస్‌క్రీమ్ పార్లర్ కుంభకోణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఆ రాష్ట్ర ప్రముఖ నేత పి.కె.కుంజలికుట్టి ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారి అని వెల్లడైంది. కోజికోడ్‌లోని ఈ ఐస్‌క్రీం పార్లర్ ద్వారా సెక్స్ వ్యాపారానికి ఉపయోగించేవారు. ఈ కుంభకోణంలో పలువురు కమ్యూనిస్టుల నేతలపైనా ఆరోపణలు వచ్చాయి.
ఇక ఇటీవలి కాశ్మీర్ సెక్స్ స్కాండల్ సంగతి సరేసరి. తమను సీనియర్ అధికారులు, భద్రతాదళాల అధికారులు లైంగిక అవసరాల కోసం ఎలా ఉపయోగించుకున్నదీ బాధిత బాలికలు వెల్లడించడంతో సంచలనం రేగింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. గత ఏడాది సెక్రటేరియట్‌లోనే ఓ అధికారి రాసలీలలు జరిపాడు. అప్పటి ఆరోగ్య మంత్రి సంభాని చంద్రశేఖర్ కార్యదర్శి గిరిరావు మంత్రి చాంబర్‌లోనే శృంగారం జరుపుతున్న సెల్‌ఫోన్ క్లిప్పింగులు సంచలనం రేపడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.
1978లో అప్పటి రక్షణ మంత్రి జగ్జీవన్‌రామ్ కుమారుడు సురేష్ ఒక మహిళతో నగ్నంగా ఉన్న ఫొటో సూర్య అనే మాస పత్రికలో ప్రచురితమైంది.
వివిధ దేశాలలో కొన్ని సెక్స్ కుంభకోణాలు
బిల్ క్లింటన్-అమెరికా
వైట్‌హౌస్ ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీతో ముఖ రతి జరిపారన్న ఆరోపణలపై అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ అభిశంసనకు గురయ్యారు.
జాన్ ఎఫ్ కెన్నడీ-అమెరికా
హాలీవుడ్ అందగత్తె మార్లిన్ మన్రోతో వ్యవహారం నడిపారని 60వ దశకంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ఎఫ్ కెన్నడీపై ఆరోపణలొచ్చాయి. 1962లో మన్రో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఇలియట్ స్పిట్జర్-అమెరికా
న్యూయార్క్ గవర్నర్‌గా పని చేసిన ఇలియట్ స్పిట్జర్ ఏకంగా ఎంపరర్స్ క్లబ్ వీఐపీ పేరుతో ఖరీదైన 50 మంది వేశ్యలతో ఒక రాకెట్‌నే నడిపారని వెల్లడైంది.
మోషే కట్సవ్-ఇజ్రాయెల్
దాదాపు పది మంది మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాలతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు మోషేకట్సవ్ 2007లో పదవి నుంచి తప్పుకున్నారు.
పాల్ ఉల్ఫోవిజ్-ప్రపంచబ్యాంక్ ప్రపంచబ్యాంకు అధిపతి పాల్ ఉల్ఫోవిట్జ్ తన వద్ద పని చేస్తున్న ప్రియురాలు షాహాను విదేశాంగ శాఖకు 2005లో పదోన్నతిపై పంపించారు. ఏడాదికి 60వేల డాలర్ల జీతం (విదేశాంగ మంత్రి జీతం కన్నా అధికం) ఇచ్చేట్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఆయన తన పదవి కోల్పోయారు.
జేమ్స్ మెక్‌గ్రీవీ-అమెరికా
అమెరికా చరిత్రలో తొలి 'గే ' గవర్నర్‌గా నిలిచారు న్యూజెర్సీ గవర్నర్ జేమ్స్ మెక్‌గ్రీవీ. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన మాజీ అంగరక్షకుడు గోలన్ సిపెల్ 2004లో ఫిర్యాదు చేయడంతో జేమ్స్‌బాగోతం బయటపడి రాజీనామా చేశారు.
ప్రపంచవ్యాప్తంగా... దేశదేశాల్లో... మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో... చాలా మంది అగ్రనేతలు ఎన్.డి.తివారీ వంటి బాపతే! ఆనాటి ముస్సోలినీ కథా ఇదే! ఉత్తరకొరియా అధిపతి కథ ఇలాంటిదే! ఇది చెప్పడం లేదా ప్రపంచవ్యాప్తంగా ఈ అనైతికతనీ, అవినీతినీ వ్యవస్థీకృతంగా నడుపుతోంది ఒకే గూఢచార వ్యవస్థ అని! లేకపోతే... ఒకచోట కాకపోతే ఒకచోటనైనా... కనీసం నూటికి 90% నీతివంతులు పైకి రాకపోయారా?
ఇక - ఎన్.డి.తివారీ కాముకత్వం గురించిన వార్తాసంచలనాన్ని , ఆ రెండు పత్రికలలో ఒకటైన ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ ప్రచారించాయి. ఆశ్చర్యకరంగా, దానిపై మిగిలిన అగ్ర వార్తా సంస్థలన్నీ తగినంత మౌనం పాటించాయి. సాక్షి పత్రికాసంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.యస్.జగన్ కి సంబంధించినది గనుక తివారీ గురించి మౌనంగా ఉంది కాబోలు! అతడి రాజీనామా గురించీ, అందుకు దారితీసిన పరిస్థితులు గురించీ నామ మాత్రంగా వ్రాసి అయ్యిందనిపించింది. రాజ్ భవన్ లో కామక్రీడల విషయంలో మరికొందరు కాంగ్రెస్ ఎం.పీ.ల ప్రమేయమూ ఉందన్న మాట వెలువడింది. దీన్ని గురించి సైతం ఏ అగ్ర వార్తా సంస్థలూ మాట్లాడలేదు. సాక్షితో సహా!
మరి ఈనాడు? అసలుకే ’కాంగ్రెస్ కి వ్యతిరేకినని’ తనని తాను ప్రకటించుకున్న రామోజీరావు, ఈనాడు, ఎందుకు గమ్మున ఉన్నట్లు? తివారీ రాజీనామా శీర్షికలో అందుకు దారితీసిన పరిణామాలని ఏకవాక్యంతో సరిపెట్టింది. ఆ వృద్ధనేత కాముకత గురించీ, రాజ్ భవన్ ని వేశ్యాగృహంలా మార్ఛేసినందుకూ, వివిధ పార్టీల నాయకులు చేసిన విమర్శలనీ, వివిధ మహిళాసంఘాలు చేసిన నిరసనలనీ ఓ మల్టీ బాక్సుతో అయ్యిందనిపించింది. అందునా లోక్ సత్తా నాయకుడు జేపీ వంటి వారు సైతం ’అది హేయమైన చర్య’ వంటి ’పడికట్టు’ మాటలతో వ్యాఖ్యానించారు. అదే ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచారించదలుచుకుంటే, తమ వార్తా పత్రికలోని 14 పేజీల్లోనూ రకరకాల శీర్షికల క్రింద - ఢిల్లీ పెద్దల నుండి గల్లీ పిన్నల దాకా అందరి వ్యాఖ్యలూ, విమర్శలూ ప్రచురించి - రోజుల తరబడి ప్రచారించి ఉండేది. వై.యస్.ని దేవుణ్ణి చేసిన విధంగా అన్నమాట!
తమకి అవసరమైన వాటికి అవసరమైనంత పరిమాణంలో... అంటే తమకి కావాలంటే అతి ఎక్కువగా, వద్దనుకుంటే తూతూమంత్రంగా వార్తాసంస్థలు వార్తల్ని ప్రచారిస్తాయని ఇప్పటికే నిరూపితమై పోయింది. ఈ నేపధ్యంలో... ఈనాడుకి ఎన్.డి.తివారీ, కాంగ్రెస్ ఎం.పీ.ల అనైతికత, కాముకతల గురించిన వార్తల్ని అంత రహస్యంగానో, అతి సామాన్యంగానూ ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకు ముందు మన రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రిని [అచ్చంగా ఎన్.డి.తివారీ లాంటి రకం] ఈనాడు పత్రిక బయటకు రాకుండా, ఇలాగే రక్షించుకు వచ్చింది.
ఇక్కడ ఉన్న స్ట్రాటజీ ఆసక్తికరమైనది. ఒక ఘరానా మోసగాళ్ళు గుంపు ఉందనుకొండి. వారిలో ఒకడు దొరికిపోయాడనుకొండి. అప్పుడు మిగిలిన వాళ్ళంతా గోలగోలగా అరుస్తూ, ఇంకేవేవో మాట్లాడుతూ, విషయాన్ని ప్రక్కదారి పట్టిస్తారు. మీడియా ప్రజల దృష్టిని హైజాక్ చేయటం[హైసరబజ్జా]లాగా! లేదా ఎవ్వరూ దానిపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. మోసగాణ్ణి పట్టుకుని మోసాన్ని బయటపెట్టిన వాడు తానే నోరు[కలం లేదా కీబోర్డు] నొప్పి పుట్టే దాకా అరిచి, చివరికి ఓపిక అయిపోయి, నోర్మూసుకుంటాడన్న మాట. ’ఎవరూ మద్దతివ్వకపోతే, సహకరించకపోతే ఏం చేస్తాడు?’ అన్నదే తంత్రం.
[నిజానికి ఇక్కడ ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ పరిస్థితి ఇది కాదు లెండి. ఈనాడుకు జంట పత్రిక అయిన ఆంధ్రజ్యోతి , రామోజీరావుకు అనుంగు అనుచరుడైన ఆంధ్రజ్యోతి సంపాదకుడు - రామోజీరావు, నెం.10 వర్గమూ ఎదుర్కొంటున్న ’కన్నా? కాలా?’ తంత్రంలో భాగంగానూ, ఆత్మహత్యాసదృశ్య అసైన్ మెంటు గానూ, తివారీ కామక్రీడల రహస్యాన్ని బహిర్గత పరచవలసి వచ్చింది. దాన్ని నిర్వహించకుండా వాయిదా వేసుకుంటూ కాలం నెట్టుకొస్తే... పరిస్థితి పెనం మీంచి పొయ్యిలోకి, అందులోంచి గాడిపొయ్యిలోకి, ఆపైన కొలిమిలోకి నెట్టబడుతుంది. గూఢచర్యంలో అది సహజ ప్రక్రియ. వచ్చిన అసైన్ మెంటు నిర్వహించకపోతే, పరిస్థితులు మరింత దిగజారతాయి. ’తుపాకీ ఎవరి చేతిలో ఉంటే వాడికి ఎదుటివాడు బానిస’ అన్నట్లు... గూఢచర్యంలో ఎవరికి గ్రిప్ ఉంటే వాళ్ళు, రెండో వాళ్ళకి ఈ స్థితి కలిగిస్తారు. ఇలాంటి సంఘటనలు రాజకీయనాయకులలో సర్వసాధారణం. మ్యూజికల్ సీటు ఆటలోలాగా పాట అగిపోగా ఎన్.డి.తివారీ వంతు వచ్చి, అవుట్ అయ్యాడు, అంతే!]
ఇక విషయానికి వస్తే... ఈ విధంగా ’దొరికినప్పుడు దొర్లించటం’ మనకూ నిత్యజీవితంలో చాలాసార్లు ఎదురౌతుంటుంది. సూర్యాపేటలోని కళాశాలల్లో పనిచేస్తున్నప్పుడు ఆయా యాజమాన్యాలు నన్ను బాగా వేధించాయి. ఎప్పుడైనా వేధింపు పచ్చిగా బయటపడినప్పుడు, ఇలా ’దొరికినప్పుడు దొర్లించటం’ చేసేవాళ్ళు. దొరికిన పాయింట్ వదిలేసి మిగతాది మాట్లాడమనేవారు. ఇక మాట్లాడటానికి ఏముంటుంది? తర్వాత, ఈ ’లౌక్యాన్ని’ చాలామంది ఇతరులపై ప్రయోగించటం పరిశీలించాను. అది రాజకీయాల్లోనూ, మీడియా మాయాజాలంలోనూ కూడా ఉండటం స్పూటంగా అర్ధమయ్యింది.
అదే ప్రక్రియని, ఎన్.డి.తివారీ కాముకత్వం విషయంలోనూ ఈనాడు అనుసరించింది. సాధారణంగా ’దొరికినప్పుడు దొర్లించటం’ తమ గ్రిప్ తక్కువగా ఉన్నప్పుడు అనుసరించే తంత్రం. దొరికినప్పుడు ప్రజల దృష్టిని హైజాక్ చేయడం తమ గ్రిప్ అధికంగా ఉన్నప్పుడు పాటించే తంత్రం!
అందునా సుదీర్ఘ రాజకీయ కెరియర్ గల ఎన్.డి.తివారీ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిగానే గాక కేంద్రంలో కీలక శాఖలు [విదేశీ వ్యవహారాలు కూడా] నిర్వహించాడు. ఇంత కాముకత్వం గల ఈ వ్యక్తికి, అందమైన అమ్మాయిలనో లేక సెలబ్రిటీ హోదా గల అమ్మాయిలనో అందిస్తే, ఇక విదేశీ శత్రువులకి ఏ రహస్యాలనైనా పంపకం చేయడా? ఎంతగానైనా సహకరించడా? 1963లో, చైనా యుద్దం తర్వాత, నాటకీయ పరిణామాలతో నెహ్రుదృష్టి నాకర్షించి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎన్.డి.తివారీ ’ఇందిరా గాంధీకి నమ్మిన బంటు అనీ, సంజయ్ గాంధీ చెప్పుల్ని సైతం మోస్తానని స్వయంగా ప్రకటించికున్న విధేయుడనీ’ మీడియా ప్రచారించింది! అతడూ స్వయంగా చెప్పుకున్నాడు! ఇంతా చేసి... ఇందిరాగాంధీ ఇతణ్ణి చాలా entertain చేస్తోందన్న మీడియా ప్రచారం ఎంతో, నిజం ఎంతో ఎవరికి తెలుసు? అసలుకే ఎవరినీ నమ్మదని పేరు మోసిన ఇందిరాగాంధీ! అందుకు దారితీసిన గూఢచర్య స్థితిగతులు గురించి గతటపాలలో వ్రాసాను.
అంత నమ్మకస్తుడని చెప్పుకున్న ఎన్.డి.తివారీ, ఎమర్జన్సీ అనంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయాక, ఎంచక్కా... చరణ్ సింగ్ మంత్రివర్గంలోకి ఎలా చేరగలిగాడు? అలాంటి వాడు ఈ సోనియాగాంధీకి ఎలా అనుకూలుడు కాగలిగాడు? కానిదే... ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవిని 2007, ఆగస్టులో కట్టబెట్టదు కదా? అందునా ఇతడు పీవీజీ హయంలో కాంగ్రెస్ నుండి నిష్ర్కమించి, తిరిగి సోనియా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక, పదవులు పొందాడు మరి!
అంతేగాక ఈ ఎన్.డి.తివారీ.. కాంగ్రెస్ అధిష్టానం రాజీనామా చేయమంటే మొరాయించాడట! మరి!?సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాడయ్యె! మొరాయించక వెంటనే విధేయత చూపటానికి అతడేమైనా పిల్ల కాకా? అతడి వయస్సు వై.యస్.జగన్ కి లాగా 37 ఏళ్ళు కాదు, 87 ఏళ్ళు! అతడి రాజకీయ అనుభవం జగన్ కి లాగా రెండు మూడు నెలలు కాదు, 70 ఏళ్ళు! సుదీర్ఘ రాజకీయ జీవితంలో, ఎవరెవరికి ఎంతగా సహాయసహకారాలు అందించాడో... ఆ ’చిట్టా ’ ఆ మాత్రం దన్ను ఇవ్వదా? కాబట్టే తను ఇరుక్కున్న శృంగార దౌష్ట్యాలలో కూడా, ఎదుటి వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేయ ప్రయత్నించాడు. అవి బయటపడితే... ఆ అమ్మాయిలతో పోల్చుకుంటే అతడికే ఎక్కువ నష్టం కదా! అయినా వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేయబోయాడని సదరు బాధితులు వాపోయారట. అలాంటివాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఆ వెనుకనున్న వారి గూఢచార ఏజన్సీలని కూడా, ఆపాటి కట్టడి చేయ ప్రయత్నించడా?
కాబట్టే... తన దుష్కార్యాలు బయటపడినా, అగౌరవనీయమైన బర్తరఫ్ బదులు గౌరవనీయమైన అధికారిక వీడ్కొలు పొందాడు. పైగా ఇతడు తన రాజీనామా అనంతరం ఉత్తరాఖండ్ చేరాక, ఈటీవీ ప్రత్యేక సమాచార విభాగానికి[నిజానికి ఇదే వార్తాంశాం అన్ని పత్రికలలో వచ్చింది.] ’తనను కొందరు తెలంగాణా వేర్పాటు వాదులు కలిసి, శీతాకాలపు విడిదికి వస్తున్న రాష్ట్రపతితో సమావేశం కావాలని అడిగారనీ, తనందుకు తిరస్కరించాడనీ, ఇందుకు మనసులో కోపం పెట్టుకున్న వారు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని’ ఆరోపించారు.
’తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డికోసం అన్నాడట’ - ఈ సామెత అచ్చంగా అతడికి అనువర్తింపవచ్చు!
ఇందులో గమనార్హమైన విషయం ఏమిటంటే - ఒక్క వార్తాప్రసారంతో మీడియా, అది ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి కానివ్వండి మరొక వార్తా సంస్థ కానివ్వండి, గవర్నర్ అంతటి వాణ్ణి ఇంటికి పంపగలిగింది. అదీ మీడియా శక్తి! దురదృష్టం ఏమిటంటే - ఆ శక్తి గరిష్టంగా అబద్దాలని ప్రచారించటానికి ఉపయోగపడుతోందే గానీ, అన్యాయాలనీ అవినీతినీ అసలు నిజాలని వెలికి తీయటానికీ ఉపయోగపడటం లేదు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
బాగా విశదీకరించారండీ.
* * *
పానకంలో పుడక. సెక్సు "కుంభకోణాలు" అన్న శీర్షిక పెట్టినవాడికి మొట్టికాయ వేసి కుంభకోణం అని ఇలాంటివాటికి వాడను అని వెయ్యి సార్లు వ్రాయమని శిక్షించాలి.
రాఘవ గారు,
హిందువులకి సంబంధించిన ప్రతీ పవిత్రపదం పరమనీచానికి ఉపయోగించటం మీడియాకి, అందరికి పరిపాటి అయిపోయింది. మంచి విషయం ఎత్తి చూపారు. నెనర్లు!
Post a Comment