నవంబరు 7 న, ఈ బ్లాగులో ఇదే లేబుల్ క్రింద వ్రాసిన టపాలో, రాష్ట్ర[మాజీ]గవర్నర్ ఎన్.డి. తివారీ అనైతికత గురించి వ్రాసాను. ఇప్పుడు అతడి కామ కేళీ కలాపాల గురించి ABN - ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ వెలికి తీసి ప్రసారించిన వార్తల నేపధ్యంలో, దరిమిలా అతడు పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో, మరికొన్ని అంశాలని ఎత్తి చూపేందుకు ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా కొన్ని ఆంధ్రజ్యోతి వార్తల్ని పరిశీలించండి.

>>>ఎన్ని పదవులు నిర్వహించినా, ఆయన విశృంఖల కామక్రీడలు కొనసాగిస్తూనే ఉన్నారని ప్రతీతి. వీటిగురించి కాంగ్రెస్‌ నాయకులందరికీ తెలిసినా, రసవత్తరంగా చర్చించేవారే తప్ప ఆయన చాపకిందకు నీరు తేలేదు. ఇవే లేకపోతే తివారీది ఘనమైన చరిత్రే. యూపీలో కాంగ్రెస్‌ప్రాభవానికి చిహ్నంగా ఎంతో కాలం నిలిచిన తివారీ తనకిచ్చిన ఏ బాధ్యతనైనా విధేయతతో నిర్వహించినా.. ఆయన బలహీనత మాత్రం మహిళలే. తివారీ సరస సల్లాపాల గురించి ఎన్నో కథనాలున్నాయి.

వాటిలో కొన్ని...
యూపీలో హెచ్‌ఎన్‌ బహుగుణకు తొలుత సన్నిహితంగా ఉన్న ఇందిరా హృదయేశ్‌ తర్వాత తివారీ స్నేహితురాలిగా ప్రసిద్ధి చెందారు.
తివారీ భార్య సుశీలా శర్మ ఉత్తమురాలు. ఆమె కేన్సర్‌తో మరణించారు. ఆమెకు పిల్లలు లేరు. భార్యకు చికిత్సకోసం తివారీ రెండునెలలు అమెరికాలో ఉన్నప్పుడూ ఆసుపత్రిలో ఆయన నర్సులతో శృంగార కార్యకలాపాలు నిర్వహించారని ప్రతీతి. 1984లో ఆయన యూపీ సీఎంగా ఉన్నపుడు తన భర్తకు దూరంగా ఉండాలని స్వయంగా సుశీలాశర్మే ఒక యువతిని కొట్టి బయటకు ఈడ్చారని చెబుతారు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక రోజు ఉన్నట్లుండి తివారీ అదృశ్యమయ్యారు. ఆయనను పీవీయే ఏదో చేయించి ఉంటారని ప్రచారం జరిగింది. అంతర్గత భద్రతా మంత్రిగా ఉన్న రాజేశ్‌పైలట్‌ పీవీ వద్దకు వచ్చారు. ఢిల్లీ నుంచి యూపీ వెళ్లేదారిలో ఉన్న గజ్రోలాలో బిర్లాలకు చెందిన గెస్ట్‌హౌజ్‌లో తివారీ ఉంటారని ఆయనకు పీవీ సూచించినట్లు తెలిసింది. సరిగ్గా అక్కడే తివారీ తన స్నేహితురాలు ఉజ్వలాశర్మతో కలిసి కనపడ్డారు.

ఒకరోజు విల్లింగ్‌టన్‌లో ఉన్న కాంగ్రెస్‌ కార్యాలయానికి తివారీ వచ్చినపుడు ముఖం వాచి, కన్ను ఉబ్బి కనిపించింది. ఆయన మరో మహిళతో ఉండటం చూసి ఉజ్వలాశర్మే చితక బాదారని కాంగ్రెస్‌ నేతలు అంటారు.

మహిళా ప్రతినిధుల వర్గం వస్తే ఎంత అర్థరాత్రయినా ఆయన వారిని కలుసుకోకుండా ఉండరు. ఎవరు ఏం మేలు కోరినా ఆయన ప్రధానంగా కోరేది ఒక్కటే.. తనను సుఖపెట్టాలని. ఇలా ఆయనను సుఖపెట్టి ప్రతిఫలం పొందిన మహిళలు కొన్ని వందల సంఖ్యలో ఉంటారని యూపీ నేతలు చెబుతారు. కార్యక్రమాల్లో వందేమాతరం పాడేవారిని కూడా ఆయన విడిచిపెట్టలేదంటారు. యూపీకి చెందిన ఓ వర్గం నేత నిన్నమొన్నటి వరకూ అందమైన యువతులను హైదరాబాద్‌ రాజ్‌భవన్‌కు చేర్చేవారని చెబుతారు. అసలు ఆయనకు అమ్మాయిలు పక్కన లేకపోతే ముద్ద సహించదు, నిద్రపట్టదు, ఆఖరుకు వాకింగ్‌ కూడా అమ్మాయిల భుజాలపై చేతులు వేసి చేయాల్సిందేనంటారు. ఇక కాంగ్రెస్‌లో ఆయన స్నేహితురాళ్ల గురించి అందరికీ తెలుసు. వారిలో కొందరు ఇప్పుడు ప్రముఖ పదవుల్లో ఉన్నారు, కొందరు గతించారు కూడా.

ఆయన ఉత్తరాఖండ్‌ సీఎంగా ఉన్నప్పుడు సారికా ప్రధాన్‌ అనే 23ఏళ్ల నేపాలీ అందగత్తె ఆయన దృష్టిలో పడ్డారు. అంతే.. ఆయన ఆమెకు ప్రతి అ«ధికార కార్యక్రమానికి ఆహ్వానం పంపి ప్రత్యేక గుర్తింపునిచ్చేవారు. చివరకు ఆయన ఆమెను కేబినెట్‌ హోదాలో మంత్రిగా నియమించారు.

ఎన్డీ తివారీ రాసలీలల గురించి విన్న ప్రముఖ జానపద గాయకుడు నరేంద్ర సింగ్‌ నేగి ఆయనపై ఒక జానపద గీతమే రచించారు. దాన్ని వీడియోగా చిత్రించి నౌచమీ నారాయణ్‌ పేరుతో మార్కెట్‌లో విడుదలచేశారు. అది ఇప్పటికీ ఉత్తరాఖండ్‌లో హాట్‌కేకులా అమ్ముడుపోతున్నది. ఈ వీడియోలో తివారీని పోలిన వ్యక్తి కృష్ణలీలల్లో పాల్గొంటున్నట్లు ఉంటుంది.

>>>శనివారం ఉదయం 11.30 గంటలకు కోర్‌ కమిటీ సభ్యులు ఏకే ఆంటోనీ, ప్రణబ్‌ ముఖర్జీ, చిదంబరం, అహ్మద్‌ పటేల్‌లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా సమావేశమయ్యారు. తివారీ వ్యవహారాన్ని సోనియా అసహ్యించుకున్నారు. దీనివల్ల రాజ్‌భవన్‌ ప్రతిష్ఠే కాక, కాంగ్రెస్‌ పార్టీ పరువు కూడా దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడ్డారు. నైతికత విషయంలో కాంగ్రెస్‌ రాజీపడదన్న సందేశాన్ని పంపాలని కోర్‌ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆయనను వెంటనే సాగనంపాలని సోనియా స్పష్టం చేశారు.

ఇంతగా కాంగ్రెస్ లో బహిరంగ రహస్యం అయిన తివారీ కాముకత్వం, అనైతిక ప్రవర్తన, అక్రమ సంబంధాలూ, పితృత్వ కేసులూ అందరికీ తెలిసి ఉండగా అధిష్టానం అయిన సోనియాకి మాత్రం ఇప్పుడే కొత్తగా తెలిసిందా!? అధిష్టానం అసహ్యించుకుందట! నిజంగా అంత అసహ్యించుకుంటే, అందులో నిజాయితీ ఉంటే... ఎన్.డి.తివారీ నుండి మర్యాదగా, బుజ్జగించి రాజీనామా ఇప్పించుకోవటం దేనికి? అందునా అతడు రాజీనామాకి మొదట ఒప్పుకోకుండా మొరాయించాడట. ఏ దన్ను చూసుకునో? "అందరూ అదే బాపతు కాదా! అదేదో నేనే కాముకుణ్ణి, అనైతికుణ్ణి అన్నట్లు డీల్ చేస్తున్నారు? ఏదో ఈ సారికి దొరికిపోయాను, అంతే! ఆ పాటి దానికి రాజీనామా చేయమనటం ఏమిటి?" అనుకున్నాడో, అన్నాడో మరి!

మొత్తానికీ... నయానా భయానా, అతని పాత స్నేహితుడైన మోతీలాల్ వోరా మాట్లాడీ, రాజీనామా ఇప్పించుకున్నారు. తమ చేతిలోని అధికారం ఉపయోగించి ఎన్.డి. తివారీని గవర్నర్ పదవినుండి బర్తరఫ్ చేసి ఉంటే అతడికి తగిన శిక్ష విధించినట్లయ్యేది, తమ అసహ్యానికి న్యాయం చేసినట్లు అయ్యేది కదా? అలాగ్గాక అనారోగ్య కారణాలతో రాజీనామా వ్రాయించుకోవటం దేనికి? నాలుగురోజులు పోతే ఎవరికీ అతడి అనైతికత, కాముకత గుర్తుండదు. అధికారిక వీడ్కొలు పుచ్చుకున్న గవర్నర్ గానే, అతడు, అడ్మినిస్ట్రేషన్ పరంగా[రాజ్యాంగబద్దంగా], రికార్డుల్లో మిగిలి పోతాడు.

అతడిపైన చర్యలు తీసుకోవాలా వద్దా అన్న మీమాంసతో కొన్ని రోజులు గడుస్తాయి. ఇప్పటికే పోలీసులు [ఎ.కె.ఖాన్] మా పరిధిలోనిది కాదు అంటున్నారు. కోర్టులైతే అసలు విషయంలోకి పోకుండా అతడి పితృత్వకేసుని ’అతడు ఢిల్లీలో లేడు’ అన్న సాంకేతిక కారణంతో కొట్టేసాయి. ఇప్పుడు పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తివారీని, రేపు అవే కోర్టులు "అతడిక్కడ ఇప్పుడు లేడు గనుక ఇది మా పరిధిలోకి రాదు’ అంటారన్న మాట. అప్పుడు అంతగా అనివార్యమైతే ఓ కమిటీని వేయడమో, ఓ సిబిసిఐడి ఎంక్వయిరీ లేదా సిబిఐ ఎంక్వయిరీ అనటమో చేస్తారు. దాంతో అన్నీ సమసి పోతాయి. ఆనక ఆ ఎంక్వయిరీ రిపోర్టులు ఏమౌతాయో ఎవరికీ తెలీదు. లిబర్ హాన్ లూ, జైన్ లూ, తొక్కలూ ఎన్ని చూడలేదు? ఈ లోపు ఎన్.డి.తివారీకి మాత్రం మాజీ గవర్నర్ గా అన్ని అలవెన్సులు అందుతాయి. జనం మర్చిపోయారంటే మళ్ళీ పదవులు అయినా రావచ్చు.

నిజంగా అతడి అనైతికతనీ, కాముకతనీ అసహ్యించుకునేంత నిజాయితీనే కాంగ్రెస్ అధిష్టానానికి ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లో గుమాస్తా[క్రమశిక్షణ గల సైనికుడిని]నని స్వయంగా చెప్పుకునే రోశయ్య, అతడి మంత్రులూ, గవర్నర్ గా తివారీకి అధికారిక వీడ్కొలు ఇస్తారా? ఇలాంటి చర్యలతో ఈ నేతలు, [అధిష్టానం మొదలు అందరూ] ప్రజల్లోకి, రాజకీయ నాయకుల్లోకి ఏ సంకేతాలిస్తున్నారు? ఎంత అనైతికత అయినా ఫర్వాలేదు. అధిష్టానపు అండదండలుంటే... అనేనా?

87 ఏళ్ళ వయస్సులో, మనుమరాళ్ళ వయస్సున్న అమ్మాయిలతో ఒకరికి ముగ్గురితో సరసాలాడుతూ రాజ్ భవన్ ని ’సాని కొంప’గా మార్చిన తివారీకి... పితృత్వకేసు కోర్టులో నడిచిన నేపధ్యం ఉన్న ’గత చరిత్ర’ ఏమిటో [ఉజ్వల శర్మతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నతరువాత కూడా] ’అన్నీ తెలిసిన’ అధిష్టానానికి తెలియదా?

ఇక్కడ మరో విస్మయం గమనించండి.
>>>నైతిక విలువలకు నిదర్శనం! తివారీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: గవర్నర్‌ పదవికి ఎన్డీ తివారీ రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. "ఆయనపై మీడియా ప్రసారం చేసిన దృశ్యాలు నిజమైనవా, కావా అని రుజువయ్యేదాకా పదవిలో ఉండాలని ఆయన అనుకోలేదు. తివారీ సరైన నిర్ణయమే తీసుకున్నారని భావిస్తున్నాం. దీనిని స్వాగతిస్తున్నాం'' అని ఏఐసీసీ మీడియా విభాగం చీఫ్‌ జనార్దన్‌ ద్వివేదీ విలేఖరులకు తెలిపారు. ఆరోపణలను తివారీ కొట్టివేశారని, ఆయనకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినప్పటికీ... నైతిక విలువలకు కట్టుబడే ఆయన రాజీనామా చేశారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు.

ఎన్.డి.తివారీ నైతిక విలువలని కాపాడాడట. ఎంత పాజిటివ్ కప్షన్! ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి బయటికి తీసిన వార్తా సంచలనం నిజమో అబద్దమో తేలే వరకూ అతడు పదవిలో కొనసాగకుండా, రాజీనామా చేసి విలువలని కాపాడాడట. నైతిక విలువల వలువలు ఊడదీసిన ఈ ముసలి కాముకుడి గురించి ఎంత గొప్ప ప్రశంస! పైగా... గత ఏడాది ముంబై ముట్టడి నేపధ్యంలో నాటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసాడని సమర్ధింపు ఒకటి! ఆ మంత్రి పుంగవుడు ముంబై దాడుల నేపధ్యంలో జనం రగిలిపోతుంటే తీరుంబాతిగ్గా క్రాపు సవరించుకుంటూ, సూట్లు మారుస్తూ విలేఖరులకి ఇంటర్యూలిచ్చాడు. సీటు దిగమంటే మొరాయించి సతాయించాడు. చివరికి కార్పోరేట్ వర్గాలు కూడా గయ్యిమంటే, అప్పుడు అధిష్టానం, శివరాజ్ పాటిల్ చేత రాజీనామా చేయించింది.

నిజంగా కాంగ్రెస్ అధికారిక వక్తలు [Congress Spokes men] మనీష్ తివారీలు, అభిషేక్ సింఘ్వీలు, మంచినటులు! లేనిదాన్ని గొప్పగా చెప్పుకోగలరు. వాళ్ళనీ, జనార్ధన్ ద్వివేదీలనీ, మొయిలీలని ప్రయోగించగల అధిష్టానం, గొప్ప ప్రయోక్త[Director] కూడా!

సరే! ఇంతకీ వీరంతా కలిసి కోరస్ గా చెప్పినట్లు ’ఎన్.డి.తివారీ’ కాముకత్వం విషయంలో ’ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ ప్రసారాలలో నిజానిజాలేమిటో విచారించే వరకూ అతడు పదవిలో కొనసాగకూడదు. అందుచేత రాజీనామా చేసాడు’ అనుకుందాం. మరి తాము వెంటనే విచారణ చేయవచ్చుగా? దానికి ఏళ్ళూ పూళ్ళూ కావాలా? అయినా అతడి గత చరిత్ర చూస్తే తెలుస్తుందిగా! అదీగాక... అనామకుడైన వారెవరో రాజ్ భవన్ లోకి ఆఫ్ రికార్డు వెళ్ళగలరా? సెక్యూరిటీ చెక్, మెటల్ డిటెక్టర్ గట్రా గట్రా బందోబస్తు ఉంటుంది గదా? ఏ వ్యక్తిగత సిబ్బందో అతణ్ణి ఇరికించారనటానికి అతడి పడకగదిలోకి అతడికి తెలియకుండా... మరీ కాకమ్మ కథ! ఒక వేళ అలా అనుకున్నా, ఒక గవర్నర్ ని ఇలా భ్రష్టుపట్టించిన వాళ్ళని, వదలకూడదని అర్జంటుగా సిబిసిఐడి ఎంక్వయిరినో, సిబిఐ ఎంక్వయిరినో వేయాలి కదా?

పైగా... ఉదయపు వార్తా పత్రికలో ఆంధ్రజ్యోతి, అదే రోజు ఉదయం పది గంటలకి ఎన్.డి. తివారీ కామకేళి గురించిన వీడియోలని, ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ లో ప్రదర్శిస్తామని ప్రచారించగానే, ఉదయాన్నే రాజ్ భవన్ అధికారులు, ఎన్.డి.తివారీ వ్యక్తిగత కార్యదర్శి[OSD] అర్యేంధ్ర శర్మ సెలవురోజైనా కోర్టుకి ఎందుకు పరుగెత్తినట్లు? [ఉదయం 9.45 కల్లా డివిజన్ బెంచ్ ఏర్పడింది.] నిజంగా ఎన్.డి.తివారీకీ, ఆర్యేంధ్ర శర్మకీ ఏ పాపమూ తెలియనట్లయితే, 87 ఏళ్ళ ఆ వృద్ధ రాజకీయవేత్త ’కృష్ణా రామా’ అనుకునే అమాయకుడే అయితే, ఎవరో ఏ మార్ఫింగో చేసినట్లయితే, అవేవో చూసే వరకూ తమకి తెలియదు కదా? అంటే తాము ఏమేమి చేసారో తమకి తెలుసు. వాటితో ప్రమాదం ఏమిటో కూడా తెలుసు.

సరే! రాజ్ భవన్ అధికారులూ, ఆర్యేంధ్ర శర్మలూ కోర్టుకి పరుగెత్తారు. కోర్టూ స్పందించి, ప్రసారాలు ఆపమని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్ భవన్ గవర్నర్ పదవిల స్థాయినీ, మర్యాదనీ, రాజ్యాంగ పరిధి మేరా పరిగణించి అర్జంటుగా స్టే ఇచ్చింది. అదే కోర్టు, ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి వారు ’తమని వార్తా ప్రసారాలను కొనసాగించుకోనివ్వమని’ పిటిషన్ వేస్తే అది అర్జంటుగా పరిశీలించవలసిన విషయం కాదు గనుక, ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేసింది.

’అవినీతి వెలికితీతని ఆపటం’ కోర్టుకి అర్జంటుగా పరిగణించాల్సిన విషయం అయ్యింది. అదే ’అవినీతిని వెలికి తీయటం’ అయితే, అర్జంటుగా పరిగణించాల్సిన విషయంగా కోర్టుకి అన్పించలేదు. అదీ... కోర్టులూ, ప్రభుత్వాలూ, రాజ్యాంగబద్దంగా అవినీతినీ, అనైతికతనీ, అవినీతిపరులనీ కాపాడే తీరు! ఇంకో కోణంలో చూస్తే... గవర్నరుకి సమయం ఇవ్వబడింది, ఈ లోపు పరిస్థితుల్ని మేనేజ్ చేసుకోమని. అంతే!

పైగా ఎన్.డి.తివారీ ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శి ఆర్యేంధ్ర శర్మ ’గవర్నర్ గా ఎన్.డి.తివారీ వయస్సుకైనా గౌరవం ఇవ్వాల్సింది’ అనీ, ’గవర్నర్ పదవికి ఉన్న స్థాయినీ, గౌరవాన్ని అయినా పట్టించుకోవాల్సింది. ఇది విచారించదగ్గ విషయం’ అని సెలవిచ్చాడు.

’గవర్నర్ పదవిలో ఉన్నాం, రాజ్యాంగ బద్దంగా రాజ్ భవన్ గౌరవనీయమైనది. వాటి పరువూ మర్యాదల్ని మంట గలపకూడదు. కనీసం ఈ స్థాయిలో ఉన్నందుకైనా, హుందాగా, మంచీ మర్యాదలతో ప్రవర్తించాలన్న’ స్పృహ వాళ్ళకి [రాజకీయ నాయకులకీ, వాళ్ళని అనుసరించే ఉన్నతాధికారులకీ] ఉండదు గానీ, ప్రజలూ ఇతరులూ మాత్రం, ఆ స్పృహ కలిగి ఉండాలట! ఎంత అడ్డగోలు వాదన?

మరో అంశం పరిశీలించండి.
>>>పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక రోజు ఉన్నట్లుండి తివారీ అదృశ్యమయ్యారు. ఆయనను పీవీయే ఏదో చేయించి ఉంటారని ప్రచారం జరిగింది. అంతర్గత భద్రతా మంత్రిగా ఉన్న రాజేశ్‌పైలట్‌ పీవీ వద్దకు వచ్చారు. ఢిల్లీ నుంచి యూపీ వెళ్లేదారిలో ఉన్న గజ్రోలాలో బిర్లాలకు చెందిన గెస్ట్‌హౌజ్‌లో తివారీ ఉంటారని ఆయనకు పీవీ సూచించినట్లు తెలిసింది. సరిగ్గా అక్కడే తివారీ తన స్నేహితురాలు ఉజ్వలాశర్మతో కలిసి కనపడ్డారు.

ఆనాడు ప్రధానిమంత్రి సీట్ లో కూర్చున్న పీవీజీకి, ఎన్.డి.తివారీ వంటి వ్యక్తులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలకి చెందిన స్వర్గధామాల వంటి అతిధిగృహలలో, ఎక్కడ ఎలా మజాలు చేసుకుంటున్నారో కూడా తెలుసు! వాళ్ళ అవినీతి, అనైతికతల మీద ఒత్తిడి తెచ్చాడు కాబట్టే అందరికీ శతృవు అయ్యాడు. ఈ ఎన్.డి.తివారీ అయితే పీవీజీ హయాంలో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసాడు. సోనియా నేతృత్వంలో మళ్ళీ పదవులు అలంకరించాడు. పీవీజీ తన హయాంలో ఎవరు ఏం చేస్తున్నారో తెలిసినా, ఎప్పుడూ ’అధిష్టానానికి అన్నీ తెలుసు ’ అని హుంకరించలేదు.

చీటికి మాటికీ ’అధిష్టానానికి అన్నీ తెలుసు! అధిష్టానం ఫలానా విషయమై ఫలానా వారిపై ఆగ్రహంగా ఉంది’ అని తరచూ మనం వార్తాంశాలలో చదువుతూ ఉంటాం. అధిష్టానపు చెంచాల వంటి సీనియర్ రాజకీయ నేతలు స్వయంగా ప్రకటించగా, ఇలాంటి వాటిని వార్తాపత్రికలు ప్రచారంగావిస్తాయి. ’అన్నీ తెలిసిన’ అధిష్టానానికి ఇలాంటి అనైతికతలూ, అసహ్యకరపు వ్యవహారాలు మాత్రం తెలియవు! మరి వారి నిఘా సంస్థలు ఏం చేస్తుంటాయి? ఎవరెవరు అధిష్టానాన్ని ధిక్కరిస్తూన్నారో కూపీల్లాగే పనుల్లో పీకల్లోతూ మునిగి ఉంటాయా?

ప్రధాని ఇచ్చిన విందుల్లోనో, మరో అధికారిక విందుల్లోనో, కాంగ్రెస్ అధిష్టానం, ముఖం జేవురించగా లేదా ఎర్రబడగా, "వాటీస్ దిస్ మిస్టర్ so and so? మీకు చెప్పిందేమిటి? మీరు చేస్తున్నదేమిటి? నాకన్నీ తెలుసు!" అని విసురుగా తలెగరేసి ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం మనకి తెలిసిందే! [ప్రక్కనే ఉండే చెంచాలాంటి వాళ్ళు, ఆ తిట్టించుకున్న వాళ్ళని, ప్రక్కకు తీసుకుని, వెళ్ళి ఆధిష్టానాన్ని ఎదిరించకూడదని చెప్తుంటారు.] కనీసపాటి హుందాతనం కూడా లేని చీప్ ట్రిక్స్ ఇవి!

నిజం చెప్పాల్సి వస్తే... తమని ధిక్కరించలేనంత గ్రిప్, తమకి తమ అనుచరుల మీద ఉన్నప్పుడు, ఇలా ఆగ్రహలు వ్యక్తీకరించవలసినంత అవసరం రాదు. చిరునవ్వుతో పనులు చక్కబెట్టగలరు. తెరచాటున తమ ఏజన్సీ, తమని ధిక్కరించిన వారి నడుములు విరిచి, తమకు సానుకూల పరిస్థితులు సృష్టించుకొస్తుంది. ఆ పట్టు జారిపోతూన్నప్పుడే ఇలాంటి చౌకరకపు ఎత్తులు వేయాల్సి వస్తుంది.

ఇంతకీ, ’అన్నీ తెలిసిన అధిష్టానం’ ఎన్.డి.తివారీ కాముకత్వం గురించి తెలుసుకోలేక పోయిందా? తెలిసీ, చూసీచూడనట్లు ఊరుకుందా? రాష్ట్రంలో వై.యస్.జగన్, కేవీపీ, ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న తెలంగాణా మంత్రులూ, ఎం.పీ.లూ, ఎం.ఎల్.ఏ.లూ, అలాగే సమైక్యాంధ్ర కోరుతున్న ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పీ.లూ... ఎవరితోనైనా ’అన్నీ నాకు తెలుసు’ అని అధిష్టానం అంటుంది. లేదా ’అన్నీ అధిష్టానానానికి తెలుసని’ ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీ.ఎస్., మాజీ ముఖ్యమంత్రి ఎన్.జనార్ధన రెడ్డి, వెంకటస్వామి వంటి ఇతర సీనియర్లు పదేపదే చెబుతుంటారు.

అవిధేయులు ఎక్కడ ఏంచేసినా, ’అన్నీ తెలుసుకునే’ కాంగ్రెస్ అధిష్టానానికి, ఈ వృద్ధ రాజకీయ నాయకుడి కాముకత్వం తెలియలేదా? అందునా పితృత్వకేసు కోర్టులో నడుస్తుండగా, సాంకేతిక కారణాలు చూపుతూ రెడ్ టేపిజం తో కూడిన తీర్పు రాబట్టుకోగలిగిన తివారీ! కేంద్రంలో ఏ సహకారమూ లేకుండానే ఇంత సానుకూలత తెచ్చుకోగలడా? మరి ఏ కారణంగా, కాంగ్రెస్ అధిష్టానం, ఇతడి అనైతికతనీ, కాముకత్వాన్ని తెలుసుకోలేక పోయింది? అంత అమాయకత్వం ఎందుకు కలిగి ఉంది?

’అధిష్టానానికి అన్నీ తెలిసు ’ అనేటట్లయితే, ఇవన్నీ అధిష్టానానికి తెలిసే నడుస్తుండాలి! లేదా ’అధిష్టానానికి ఏమీ తెలియదు’ అని అయినా ఒప్పుకోవాలి! అంటే... అధిష్టానం, గుడ్డిగా పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతుందా? ఏది నిజం?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

ఈ దేశంలో ప్రజలకు కాస్తంత గౌరవం మిగిలున్నది గవర్నరు గిరీ మీద. అదీ ఈ పనికిమాలిన వాడి దయ వల్ల ఊడ్చిపెట్టుకెళ్ళింది.

ఓ "థూ" వాడి ముఖానికి. అధిష్ఠానానికి రెండు "థూ" లు.

ఆదిలక్ష్మి గారు మీకున్న విషయ పరిజ్ఞానానికి, అది అందరికీ అందచేయాలనుకునే మీ సామాజిక బాధ్యత కు నా కృతజ్ఞతా పూర్వక అభినందనలు. దేశం లో ఉన్న ఇలాంటి రాజకీయ కీచకులను బహిరంగం గా నడిరోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపితే అన్న మిగిలిన వాళ్లకి భయం వస్తుందేమో. (కానీ మన జన్మలో అది చూడటం సాధ్యం కాదేమో? అందరూ ఆ త్రాసులో ముక్కల్లాంటి వారే కాబట్టి ). చాలా కాలం తరువాత మళ్ళీ కూడలి లోకి వచ్చినా మొదట వెదికింది మీ బ్లాగ్ కోసమే. ఇలాగే ముందుకు సాగండి

రవి గారు,

ఈ ’థూ!’ ల బాధ భరించలేకే మీతో పంచుకుంటున్నానండి. :)
~~~~

స్నేహితుడు గారు,

మీ అభిమానానికి కృతజ్ఞతలండి.

రాజకీయ ఉపాథి క్రింద పనికిరాని సరుకంతా గవర్నర్లుగా నియామకం అవుతున్న కాలమిది.అలాంటప్పుడు ఆ పదవికి గౌరవమెక్కడుంది రవీ!
ఆదిలక్ష్మిగారూ,మనమెంతమొత్తుకున్నా దున్నపోతుమీద వాన కురిసిన చందమే .

చిలమకూరు విజయమోహన్ గారు,

ప్రజాస్వామ్యం పేరిట ఏం నడుస్తుందో, అది ఎంత డొల్లో, ఇంత చక్కగా expose అవుతుంటే ’దున్నపోతు మీద వర్షం’ అంటారేం సార్!

Amma, please look at this link:

http://scienceintelugu.blogspot.com/2009/12/blog-post_8232.html

"నేను చెప్తున్నదాన్ని దయచేసి అపార్థం చేసుకోకండి. My intention is neither to demean ancient India nor to unconditionally celebrate modern science. Let both our condemnation or appreciation be based on solid knowledge and understanding of the thing we are dealing with. If we wish to defend our culture, let that defence be based on firm grasp of our culture. How can we defend something that we hardly understand, something that we ourselves have never taken the trouble to study sufficiently deeply?"

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu