ఈ నెల 9 వ తేదీ, అర్ధరాత్రికి అరగంట ముందు, కేంద్రప్రభుత్వ కుర్చీవ్యక్తి పుట్టిన రోజు కానుకగా ’తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ’ ప్రకటన వెలువడింది. అంతే! పార్టీల పేర్లు వేరైనా తెరాస నాయకదాసులూ సభ్యదాసులూ, కాంగ్రెస్ నాయకదాసులూ సభ్యదాసులూ, కాంగ్రెస్ అధిష్టాన దేవతని పొగడ్తల వర్షంలో ముంచేత్తారు. కృతజ్ఞతల సునామీలు సృష్టించారు.

తీరా అది సమైక్యాంధ్ర గొడవకి దారి తీసే సరికి, ఇప్పుడు, పరిస్థితి చక్కదిద్దటానికి ప్రధానమంత్రిగా మనోమోహనుడు రంగంలోకి దిగాడు. నిజానికి ఈ ప్రధాని, ఆ ఇటలీ అమ్మ సోనియా చేతిలో బొమ్మ అని అందరికీ తెలుసు! ఇప్పటికి ఎన్నోసార్లు, ఇతడి రిమోటు ఆమె చేతిలో ఉండటం నిరూపితమైందే! అంతెందుకు? తెలంగాణా ఏర్పాటు ప్రకటన నేపధ్యంలో కూడా దీనికి బాధ్యురాలుగా, నిర్ణేతగా, అందరూ [మీడియాతో సహా] సోనియాని పరిగణించారు గానీ మన్మోమోహన్ నో, చిదంబరాన్నో కాదు. కాబట్టే జానారెడ్డిలూ, రాంరెడ్డి దామోదర రెడ్డిలూ, కేసీఆర్ లూ వంటి నాయకమ్మణ్యులు, సోనియాకి అభినందన సభలనీ, కృతజ్ఞతా సభలనీ నిర్వహిస్తున్నారు, నిర్వహిస్తామంటున్నారు గానీ, ఏ చిదంబరానికో మన్మోహనుడికో కాదు.

అయితే, కథ అడ్డం తిరిగే సరికి మాత్రం, చిదంబరం ప్రకటనకి చిదంబరమే బాధ్యుడన్నట్లు విమర్శలు! చిదంబరం రిమోట్ అయినా అధిష్టానం చేతుల్లోనే కదా ఉన్నది? ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దేందుకు మన్మోహన్ బొమ్మ నిలబడింది. ఇంత గొడవ జరుగుతున్నా తెలంగాణా నాయకులు సోనియాకి కృతజ్ఞతలు చెబుతున్నారు. సమైక్యాంధ్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం చిదంబరంని తిడుతున్నారు. అంతగా సోనియా అనబడే ఈ వ్యక్తి[ఏజెంట్]ని కాపాడుతుంది, సదరు వ్యక్తిని ప్రయోగించిన గూఢచర్య ఏజన్సీ! అంతగా నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకి, ఈమె అత్యంత విలువైన, అవసరమైన వ్యక్తి!

ఈ పరిస్థితి ఇప్పుడొక్కసారే కాదు. ఎప్పుడైనా సరే, Advantage లేదా గెలుపు వచ్చినప్పుడు అది ఆమె స్వంత సామర్ధ్యం, ప్రతిభ, దీక్షా, దక్షత! Disadvantage లేదా ఓటమి లేదా ఇబ్బంది వచ్చినప్పుడు అది ఉమ్మడిగా పార్టీది. అన్ని బాగుంటే ఆమె ఒక్కతే అధిష్టానానికి ప్రతీక! పరిస్థితులు అడ్డం తిరిగితే అధిష్టానంలో మరికొందరు క్రియాశీలకంగా మారతారు. ఎల్లప్పుడూ వార్తాహరత్వం, చర్చా సమీక్షకత్వం వహించే వారు కొందరుంటార్లెండి. ప్రణబ్ ముఖర్జీలు, ఆంటోనీలు, అహ్మద్ పటేల్ లూ! నియమిత Spokesmen కీ, వీళ్ళకీ వ్యత్యాసం పెద్దగా ఉండదు.

కావాలంటే ఇటీవల జరిగిన ఏ సంఘటన అయినా చూడండి. వై.ఎస్. జగన్ శిబిరాన్ని గాడిలో పెట్టినప్పుడూ, సార్వత్రిక ఎన్నికలలో గెలిచినప్పుడూ, గతంలో వివిధ రాష్ట్రాల ఎన్నికలలో, ఇతర ఉపఎన్నికలలో ఓడిపోయినప్పుడూ,... ఎప్పుడైనా సరే... గెలిస్తే సోనియా నాయకత్వ సామర్ధ్యం. ఓడితే పార్టీ ఉమ్మడి బాధ్యత! ఇలా తప్ప మీడియా మరో సమీక్షచేయదు, మరోరకంగా వ్రాయదు.

సోనియాని ఎదిరించిన నాయకులకి కంచం తిరగబడుతుంది. ఎలాగంటే EVM లతో, అవినీతి వెలికితీతతో, సిబిఐ, ఐటీ దాడులతో! దాంతో వాళ్ళు ఆమె కాళ్ళమీద పడాల్సిందే! దీనికి లాలూ ప్రసాద్ యాదవ్ వే తాజా ఉదాహరణ. వీటి కార్యకారణ సంబంధాలని మాత్రం ఏ మీడియా చర్చించదు.

నిజానికి వ్యూహాత్మకంగా నడిచిన కేసీఆర్ సైలెన్ బాటిళ్ళ నిరాహార దీక్షకీ, సోనియా పుట్టిన రోజు కానుకగా చేసిన తెలంగాణా ప్రకటనకీ, ఆ నేపధ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ఆరోపణలకీ వెనుక ఉన్న గూఢమర్మాలు వెలికి వస్తే గానీ అసలు కథ అందరికీ అర్ధం కాదు. హఠాత్తుగా రాష్ట్ర ఏర్పాటు షురూ ప్రకటనకీ, అందునా ఎవరూ ఊహించని విధంగా... జరగటానికి, కార్యకారణ సంబంధం ఉండకుండా ఉండదు కదా!

ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ[ఒకోసారి ఇతర పార్టీలు కూడా], మీడియా, సోనియాని కాపాడుకొస్తున్న విధానం మాత్రం అత్యంత ఆసక్తి కరం, ఆశ్చర్యకరం కూడా! అదే ఒకప్పుడు ఇందిరా గాంధీకి, పీవీజీకి అయితే గెలుపు పార్టీ ఉమ్మడిది, ఓటమి వ్యక్తిగతంగా వారిది. ఈ విషయం స్పష్టంగా పీవీజీ తన ’అయోధ్య’ గ్రంధ రచనలో చెప్పారు. ఓటమి వ్యక్తిగతమైతే వ్యక్తికి ఇమేజ్ పడిపోతుంది, గ్రిప్ డామేజ్ అవుతుంది. అందుకే ప్రస్తుతం సోనియాని పార్టీ సహచరులు, మీడియా శక్తిమేరా కాపాడుతున్నారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మఱి ఈ సమైక్యాంధ్రావాదం అంతా జగన్మోహనరెడ్డి ఆడిస్తున్ననాటకం అన్న మాటల సంగతి ఏమిటండీ?

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

రహంతుల్లా గారు,

యానాంకి నేను ఒకటి రెండుసార్లు వచ్చానండి. ఎంతో చక్కని ప్రదేశం. అక్కడి ఉప్పు పొలాలు కూడా గుర్తున్నాయి. సిరామిక్ ఇండస్ట్రీస్ చూడటానికి వచ్చాను. దరియాలా దిబ్బ దగ్గర గోదావరి సౌందర్యం, అక్కడి సూర్యాస్తమయం ఇప్పటికీ తీయని గుర్తులే! కలిసి ఉండాలనే మీ ఆకాంక్ష సమంజసమైనది. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu