నిన్నగాక మొన్న, ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' కేసీఆర్ గురించి….. ’ఢిల్లీని గెలిచిన బక్కమనిషి – తెరాసవాదులను ఏకం చేసిన దీక్ష - దక్షత’ అన్న శీర్షికతో అతణ్ణి ఆకాశానికి ఎత్తేస్తూ వ్రాసింది. తెల్లవాళ్లని దేశం నుండి వెళ్ళగొట్టిన బాపూజీ గురించి, అప్పట్లో వాడిన ’బక్కమనిషి’ అన్న ఉపమానాన్ని సైతం ఉపయోగించి మరీ, భజన పాఠం వ్రాసింది.

నిజమే! కేసీఆర్ కేవలం ఒక్క బక్కమనిషే కాదు. పరమ తిక్కమనిషి కూడా. ఈ రోజు చెప్పిన మాట మీద మరురోజే నిలబడనంత తిక్కమనిషి. ఈ కేసీఆర్ ఎలా బక్కమనిషి అయ్యాడు? మద్యం తాగి తాగి బక్కమనిషి అయ్యాడు. ఈ బక్కమనిషి పక్కాతాగుబోతే కాదు, పక్కా వదరు బోతు కూడా! ఎంత తాగుబోతు అంటే - ఇంకా తాగుడు మితిమీరితే నేత్ర నష్టం నాయనా అంటూ వైద్యులు ముద్దుగానూ, దగ్గరి వారు మొత్తుకునీ చెబితే, ఇక తప్పక త్రాగుడు మానేసాడు. అలాంటి ఇతడి గురించి ’ఈనాడు’
>>>ఆయన మార్పు తనతోనే మొదట కావాలని భావించారు. ఆ మేరకు తన వ్యక్తిగత అలవాట్లను మార్చుకున్నారు. ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు’ అని డిసెంబరు 10 న వ్రాసింది. ఎంత ధనాత్మక శీర్షిక [పాజిటివ్ కాప్షన్] పెట్టటం ఇది!

ఇతడి గురించి.... అర్ధరాత్రి వరకూ మద్యం సేవించి, ఆ హేంగోవర్ కి మర్నాడు మధ్యాహ్నం వరకు లేవడని అయినవాళ్ళు, కానివాళ్ళు కూడా గగ్గోలు పెట్టటం జరిగింది. ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని, ఇతడు తనని తాను పొట్టి శ్రీరాములుతో పోల్చుకోవటం మరింత ఘోరం. ఇలాంటి వాడి పట్ల ఆనాటి బాపూజీకి ఉపయోగించిన మాట ఉపయోగించటం పత్రికల వైచిత్రి. అదీ ఢిల్లీని గెలిచాడట! అక్కడికి ఆ ఢిల్లీ అధిష్టానం అంత గొప్పదైనట్లు! పదిరోజుల నిరాహారదీక్షకీ బెదిరిపోయారో, బెదిరినట్లు నటించారో గానీ, ప్రత్యేక రాష్ట్రం ప్రక్రియకి పచ్చజెండా ఊపామన్నారు. అసెంబ్లీలో తీర్మానం అమోదించమని హోంమంత్రి చిదంబరం ప్రకటించాడు. అంతలోనే ఆ మాటని తీర్మానాన్ని ప్రవేశపెట్టడంగా మార్చారు. ఇలాగని రోశయ్య స్పష్టంగానే చెప్పేసాడు. అలాంటి ’మాట మార్చే అధిష్టానం’ చాలా గొప్పదన్నట్లు ’ఢిల్లీని గెలిచిన బక్కమనిషి’ అట.

సమైక్య వాదులం అంటూ ఎం.ఎల్.ఏ.లు రాజీనామాల బాటల బాట పట్టగానే, ’ఏకాభిప్రాయం తర్వాతే....’ అంటూ కొత్తపాట అందుకున్న ఢిల్లీ అధిష్టానం, అక్కడికి మేరు నగధీరం అన్నట్లు ’ఢిల్లీ గెలిచిన బక్కమనిషి’ అట. సరే! అంతటి ఢిల్లీని గెలిచిన ఈ బక్కమనిషి, పక్కా తాగుబోతే కాదు, వదరు బోతు కూడా అన్న విషయం అందరికీ తెలిసిందే! ఎంత వదరు బోతు అంటే - తమ తోటి రాజకీయ నాయకుడు హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోతే, ముక్కూ ముఖం తెలియని సామాన్యులు కూడా, మోహమాటం కోసమైనా ’చచ్చినోడి కళ్ళు బారెడు’ అన్నారు గానీ, పరిచయముండీ, కలిసి మెలిసి రాజకీయాలు నడిపిన ఇతడు మాత్రం, ’దిక్కుమాలిన సావు సచ్చిపడిండు, పినుకులెక్క’ అంటూ తన నోటి దుర్వాసన రాష్టమంతా చూపించాడు. అంతటి వదరబోతు! ఢిల్లీ నాయకుల దగ్గర నుండి గల్లీ సామాన్యుల వరకూ అందరిని తిట్టిన మనిషి.

అంతేకాదు. చచ్చినా అన్న మాట మీద నిలబడడు. ఎనిమిదేళ్ళ క్రితం ఇతడు ’తెలంగాణా ఉద్యమం’ అంటే, ’ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంతకంటే పరిస్థితులు మెరుగుపడతాయి’ అనుకున్న అమాయక తెలంగాణా వాదులు కొందరు, నిజమేనని నమ్మి ఉర్రూతలూగారు. తర్వాత అతడి మాట తీరు చూసి దిమ్మెర పోయారు. లాబీయింగ్ తో ప్రత్యేక రాష్ట్రం సాధిస్తా నంటూ కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నాడు. పోర్టుపోలియో కూడా లేకుండా మంత్రిగా కొనసాగిన ఘనత ఇతడిదే! ఇతడి తోడుదొంగ టైగర్ నరేంద్ర తర్వాత తెరమరుగై పోయాడు. తాము కేంద్రమంత్రులుగా కొనసాగుతూ, రాష్ట్రంలో భాగస్వామ్యం తీసుకున్నందున మంత్రులుగా కొనసాగుతుండిన సంతోష్ రెడ్డి+ ఇతర మంత్రులని రాజీనామా చేయమన్నాడు. ఆ ఆక్రోశంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మంత్రి పదవులు వదులుకున్న సంతోష్ రెడ్డి, ఇతరులని, రాష్ట్రప్రజలంతా ఆరోజు గమనించిందే! తనకో న్యాయం తన వారికో న్యాయం అంటూ, ఉద్యమాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ గా నడిపిన.... ఆ నెపంతో స్వప్రయోజనాలు, స్వంత ఆస్తులు సమకూర్చుకున్న.... కుదురైన నాలుక లేని వాడు కేసీఆర్.

ఇతడిది ఒట్టి నోటి దురుసే కాదు. మాట నిలకడ కూడా ఉండదు. ఇంతక్రితం నిరాహార దీక్ష అంటూ రెండో రోజుకే జెండా ఎత్తేసాడు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాలు, ఆనక అనుయాయులు పట్టుబట్టారంటూ అలక మానడాలూ వంటి నాటకాలని ఇతోధికంగా రక్తి కట్టించాడు. ప్రజా సమస్యల్ని, ఉద్యమాలని ప్రక్కదారి పట్టేంచేందుకు.... సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసి, మధ్యంతర ఎన్నికలకు తెగబడటం వంటి చర్యలకూ పాల్పడ్డాడు. అందరూ తనని వదిలి వెళ్ళినా కూడా, లాబీయింగ్ తెలుసు కాబట్టి ఫర్వాలేదనుకున్నాడు. ఉద్యమాన్ని కావలసినప్పుడు లేవనెత్తడం, అవసరం లేదనుకున్నప్పుడు ఆపి వేయడం చేసాడు.

మీడియా, అతడు ఏ చర్యలు చేసినా విపరీత ప్రచారం ఇచ్చి, అతడిని నిలబెడుతూ వచ్చింది. ఇదే మీడియా, తెరాస నుండి చీలీన వాళ్ళకి, కేసిఆర్ ని వ్యతిరేకించిన వాళ్లకి మొదటి రోజు మాత్రమే ప్రచారమిచ్చి, తరువాత వాళ్ళకి ప్రాముఖ్యం ఇవ్వకుండా తెరమరుగు చేసింది. ఆ విధంగా మీడియా, ఎవరయినా కేసీఆర్ ని ఎదిరించి బయటకు రాకుండా అడ్డుకట్ట వేసింది. కేసీఆర్ మీడియా చేస్తే హీరో అయ్యాడు, కాని తెలంగాణా గల్లీ గల్లీ తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసి కాదు. అతడికి మీడియా మద్దతు చూసే తక్కిన వాళ్ళు అతడిని అనుసరించటం! మీడియా ప్రచారం ఇవ్వకపోతే కేసీఆర్ కథ ఎప్పుడో ముగిసేది. మీడియాకు కేసీఆర్ ఎందుకు ముద్దుబిడ్డో, వాళ్ళకే తెలియాలి.

నిన్నటికి నిన్న.... నిరాహార దీక్ష చేపట్టానన్నాడు. రెండోరోజుకే దీక్ష విరమిస్తూ పళ్ళరసం తాగేసాడు. విశ్వవిద్యాలయ విద్యార్ధులు ’ధూ!’ అంటూ నిరసనల గళం హోరెత్తే సరికి "ఛఛ! నేను తాగలేదు. వైద్యులు నా చేత బలవంతంగా తాగించారు" అన్నాడు. ఓ దశలో ’నాకు మత్తుమందు ఇచ్చి స్పృహ లేని స్థితిలో నా చేత దీక్షా విరమణగా పళ్లరసం తాగించారు" అన్నాడు. తనకు మత్తుమందు ఇవ్వవద్దని వైద్యుల కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడట. ఒక రాష్ట్ర నాయకుడు, ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నాననే వాడూ.... ఎంత ఉద్యమం కోసమైనా పోరాడుతాడు గానీ కాళ్ళుపట్టుకు బ్రతిమాలతాడా? ఏం మెలో డ్రామా ఇది? ఇంకా నయం! "నాకు చేతబడి చేసి నా చేత మాట తిరుగుడు చేయిస్తున్నారు. నా చేత పళ్ళరసం తాగించారు" అన్నాడు కాడు.

ఇంతేనా! ఇదే నోటితో "నాకు ప్రాణ హాని ఉంది" అంటూ ఆసుపత్రి మంచమ్మీద నుండి కూడా ప్రకటనలు గుప్పించాడు. ఓ ప్రక్క సైలెనూ పెట్టుకుని సౌకర్యవంతమైన ఆసుపత్రి ఐసీయూలో దీక్షలు. ’ఇప్పుడో మరో క్షణమో కోమాలోకి పోబోతున్నాడు’ అని ప్రకటనలు గుప్పించబడిన కేసీఆర్ ఒక్కరోజులో కోలుకుని ఇంటి కెళ్ళిపోయాడు కూడా! మళ్ళీ ఆసుపత్రిలోనే ఉంటే "అన్నా! అంతా ఒట్టిదే నంటే. ఏదో ఫార్సు నడుస్తుందే. తెలంగాణా రాష్ట్రం ఇచ్చెడిది కాదు. సాఆఆ...గుత్తుందే. మళ్ళీ దీక్ష పట్టరాదే!" అంటారేమో నన్న భయమో మరొకటో గానీ, హడావుడిగా గమ్మున, ఇంటి కెళ్ళిపోయాడు.

ఈ నేపధ్యంలో.... ఓ ప్రక్క.... రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెదేపా ’మ్యాచ్ ఫిక్సింగ్’ కి పాల్పడ్డ కాంగ్రెస్ అంటూ విమర్శిస్తోంది. ’మ్యాచ్ ఫిక్సింగ్ ఏమిటి? ఎవరితో అనేది తొందరలోనే బయటపడుతుంది’ అని జోస్యం చెబుతోంది. ఇక అదేదో బయటపడేదాకా వేచి చూడాల్సిందే!

మరోప్రక్క.... సినిమా హీరో చిరంజీవి హీరోయిజం చూపించక పోయినా అతడి పార్టీ ఎం.ఎల్.ఏ.లన్నా కనీసం హీరోయిజం చూపించారు. "పదిరోజుల దీక్షకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తారా?’ అని నిలదీసి అడిగారు. రాజీనామా లేఖలు జేబుల్లో పెట్టుకుని, రోజుల పాటు డ్రామాలాడిన కేసీఆర్ లా గాకుండా, 130 మంది ఎం.ఎల్.ఏ.లు దమ్ము చూపిస్తూ రాజీనామాలని నేరుగా స్పీకరుకే ఇవ్వటం, నిస్సందేహంగా హీరోయిజమే! పార్టీలకి అతీతంగా, పార్టీల అధిష్టానాలని తోసి రాజవటం మెచ్చదగిన పరిణామం.

రేపు అసెంబ్లీ టిక్కెట్లు, పార్టీ పదవుల వంటి ’అవసరాల’ గురించి ఆలోచించకుండా, రాజీనామాలకి క్యూకట్టటం వెనక ’తెలంగాణాలో తమ ఆస్తుల పరిరక్షణ’ అనే ప్రయోజనం ఉందన్న మాట వినబడుతోంది. అయితే - ’ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఏముంది? వాటాలిస్తే కేసీఆర్ మాత్రం వినడా? ఇప్పటి ప్రభుత్వానికీ, గతించిన ముఖ్యమంత్రికీ, వాటాలివ్వకుండానే.... బడా వ్యాపార సంస్థలు, శ్రీచైతన్యలూ, నారాయణల వంటి విద్యాసంస్థలు హైదరాబాదులో మనుగడ సాగించాయా? అక్కడి నుండి అధిష్టానాలకి మూటలు ప్రవహించకుండానే మాటలు చెల్లాయా? రేపు తమ వ్యాపారాలైనా అంతే! అదీగాక, ఈవీఎం లు తమ అధిష్టాన దేవత చేతిలో ఉండగా, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమైనా, కేసీఆర్ తెరాస గెలిచేది కల్ల! మొన్న పార్లమెంటు ఎన్నికల్లో గెలిచింది రెండు సీట్లు. ఒకటి తాను, మరోకటి సినిమా నాయిక విజయశాంతి. ఇక 50 అసెంబ్లీ సీట్లకి నిలబడితే, సీట్లు అమ్ముకుని, మహాకూటమి కొంపముంచుతూ, గెలిచింది పది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేపాటి ధైర్యం కూడా చేయలేక పోయాడు. అలాంటి చోట, తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా, కాంగ్రెస్ జాతీయపార్టీ కాబట్టి, అక్కడా నిలబడుతుంది గెలుస్తుంది. ఇక తమకొచ్చే వ్యాపారభయం, ఆస్తినష్ట భయం ఏముంది?’ అనుకోకుండా.... రాజీనామాల బాట పట్టటంలో మరింత లోతైన కారణాలే ఉండి ఉండాలి.

ఇక... మాట మీద నిలకడ నాలుక మీద అదుపు లేని, డబ్బుల కోసం ఉద్యమాన్ని నట్టేట ముంచగల వాడిని నమ్ముకుని, తెలంగాణా అభివృద్ధి గురించి కలల కనడం అంటే ’కుక్కతోక పట్టుకుని గోదారి, కృష్ణా, మూసీలను కలగలిపి ఈదటమే!’

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

Rajinama chesina vallu entha sepu mata meeda nilabatharo chudali.. chivari varaku nilusthe vallaku hats up cheppalsinde..kani valla meda naku doubte.

Kcr di idli ahara deeksha ani antunnaru.Nims lo Kcr ni treat chesina doctors team lo enduku abhipraya bhedalu.oka doctor selavu lo enduku velli poyadu?

మీ లాంటి వాళ్ళు ఇలా రాస్తారను కోలేదు... బలవంతం గా గట్టిగ పట్టి సెలైన్ ఎక్కిస్తే అతనేం చేస్తాడు... అలా చేస్తూనే ఉంటే...అది దీక్ష లో ఉన్నట్టా.. ? ... రెండో రోజు కే ఎత్తేశాడు అన్నారే.... ఈ మాత్రం మీకనిపించలేదా.. వాళ్ళ చేతుల్లో ఉన్నాడు కాబట్టి... ఏమి చేయలేని నిస్సహాయుడయ్యాడు... బలవంతం గా సెలైన్ ఎక్కిస్తే.. ఇంక ఇదేం దీక్ష... ఎన్ని సార్లైనా ఇలానే ఎక్కిస్తారు అని.. దీక్ష ఆపించారు .. పిల్లలు చని పోతున్నారని.. నిజం గానే బాధ పడ్డారేమో...

అది దురాక్రమన దారుల దమ్ము... మేము విడిపోతాం మొర్రో అంటే వద్దు మిమ్మల్ని వెళ్ళ నియ్యం అంటూ రాజీనామాల పర్వం చెసి భయ పెడుతున్నారే... ఇది ఎంత వరకు న్యాయం...

ఉన్న 5 గురు ఎం పీ లు.. 2 ఎం పీ లు.. ఏం సాధిస్తారు ప్రత్యేక రాష్ట్రం... అందుకే రక రకాల పనులు చేశాడు... లక్షల మంది లోనుండి... ఒకరిద్దరికి మొదటి రాంకు లు ఇస్తున్నట్టే... మనిషి వ్యవహారాన్ని బట్టి వారి వారి పనులు చక్కబెట్ట బడుతాయి ...అది ఇద్దరు ఎం పీ లు ఉన్నా.... 100 మంది ఉన్నా... అందుకే... వినమ్రం గా ఉన్నాడు.. కుదరలేదు... రాజీనామా చేశాడు... కుదర లేదు.. రకరకాల ఎత్తులు వేశాడు కుదరలేదు.. ఎందుకంటే అక్కడ వై ఎస్ లాంటి వ్యక్తి... ఉన్నాడు.... ఎంత క్షోభ పెట్టాడు వీళ్ళని.. ముందు ఎం ఎల్ ఏ లను గుంజుకుని... తర్వాత అసలు నామ రూపలు లేకుండా చేయాలని ....ఈ వీ ఎం ల సంగతి మీరే అన్నారు కదా.... ఎలా ఓడి పోయారో.. శాసన సభ లో తలలు ఎక్కడ పెట్టుకుంటారు అని అడి గాడే... అతనిదేమి నోరు..

పక్కోడి మీద దేశ ద్రోహం కేసు లో ఆరోపణ వస్తే.. నిజం కూపీ లాగి.. ఇంటి నుండి వెళ్ళ గొట్టాడు... అదే వై ఎస్ ఇంకోసారి జాగ్రత్త గా ఉండమన్నాడు సూరీడు ని... ఎవరి వ్యక్తిత్వం ఏమిటి.. ఇలా చేసీ చేసీ ఇక వేరే దారి లేక ... నిరాహార దీక్ష అన్నాడు... ఒక్కడి వల్ల ఎమైతది... అందరూ తోడు ఉంటే సాధిస్తా అన్నాడు... కానీ... ప్రభుత్వం చెసిన వ్యవహారం అంతా చూశారు.. వాళ్ళు సెలైన్ ఎక్కించినా నేను ఇంకా దీక్ష లోనే ఉన్న అని చెప్పుకోవాల్సింది అంటారా... ఏం విశ్లేషణ మీది.... ఇన్నాళ్ళూ మీ రాతలు చదివి ఏమైనా తప్పు చేశానా... ?? ఇలాంటి వ్యక్తి డబ్బుల కోసం పని చేస్తాడు అని ఎలా అనగలం.. మీరు చూశారా... మీ విశ్లేషణ వ్రాయండి... ఈ పరిణామాలు ..జరిగాక ఎందుకు నోరు మూసుకున్నాడు అని అడగండి... నేను కూడా..అప్పుడు డబ్బులు తీస్కొనే నోరు మూసుకున్నాడు అని అనుకుంటా....

Well Written article.

కేసీఅర్ మాత్రమే తెలంగాణకు ఏకైక నాయకుడు కాదు. తెలంగాణకు బాపూజి అంత నాయకుడు అసలు కాదు.
తెలంగాణ సాధనకు ప్రజలే నాయకత్వం వహించారు. ప్రజలే నాయకులు. నాయకత్వం ఇప్పుడు ఏదొ కొద్ది మంది నాయకుల చేతిలో లేదు.
కేసీఅ తాగుబోతు. అనుమానం లేదు. అది వ్యక్తిగతం.' అతనిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేని వాళ్లు అతిగా ప్రచారం చేస్తున్నారు.
అలా అంటె, తాగుడు తెలంగాణలొ సర్వసధారనమైన విషయం. ప్రతి వేడుకకు తాగుడు దాదాపు ఒక తంతు. అందులొ దాపరికం లేదు.
తాగుడు అలవాటు లేకుండా, ఇంకా ఎలాంటి దురలవాటు లేకుండా ఉన్న పెద్ద మనుషులు తాగుడు వ్యపారం, వ్యభిచార వ్యాపారం ప్రోత్సహించే వాళ్లు చాలా మంది ఉన్నారు.
తాగుడు అసలు విషయమే కాదు.
విడిపోతాము(వదిలి పెట్టండి) అంటె, కలిసి ఉందాం అనడంలో అర్ధం ఏమిటి?
తెలంగాణ వాదులు సామన్యుడిని బాగుచేస్తారా? అని అంటున్నారు. ఆ సంగతి వదిలేయండి
కలిసి ఉంటె ఆంధ్రా నాయకులు ఈ సామన్యులను బాగు చేస్తారా? చెప్పండి.
ఆంధ్రా వాళ్లు తెలంగాణా కంటె ఒక జనరేషన్ ముందు ఉన్నారు. వారితొ పోటి పడలేరు.
50 మంది ఆంధ్రా విధ్యార్ధుల మద్య 4 ఏండ్లు చదువుకున్నాను. ఆంధ్రా తోటి ఉద్యోగులు, పై అధికారుల మద్య గత 17 ఏండ్లనుండి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. వారు చెడ్డ వారు అని చెప్పడం లేదు. వాళ్లతో వేగడం కష్టం.
ఇక ఆంధ్రా నాయకులు, వ్యాపారులు గురించి ఇంక చెప్పనవసరం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ లెవల్ ప్లే గ్రౌండ్ కాదు.
విడి పోవడం చాలా అవసరం,

రామకృష్ణ గారు, సమతలం గారు, అజ్ఞాత గారు,

ఈ టపాల మాలిక పూర్తయ్యే వరకూ ఓపిక పట్టండి. పూర్తి వివరాలు వ్రాస్తాను. తరువాత చర్చించవచ్చు. నెనర్లు!
~~~
అజ్ఞాత గారు,

నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu