నిన్నటి టపాలు:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 76[వేధింఫుల వెనుక అంతరార్ధం]
ఎన్నికలలో, ఎన్ని లీలలో……[4] మీడియా వ్యూహాత్మక మౌనంప్రతిపక్షనేతల అంతర్గత సర్దుబాటుఈ అదివారపు సెలవు రోజున నా బ్లాగు చుట్టాలందరి కోసం అమ్మఒడి అందిస్తున్న చిన్నికానుక.

అనగా అనగా…..

ఓ గ్రామానికి దాపుల నున్న అడవిలో సదానందుడనీ గురువు, ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు. ఆయన గురుకులం క్రమశిక్షణకి పెట్టింది పేరు. ఆయన యుద్దవిద్యలు కూడా బాగా నేర్పుతాడని ప్రసిద్ది. ఓరోజు కిరీటి అనే యువకుడు సదానందుడి ఆశ్రమానికి వెదుక్కుంటూ వచ్చాడు. సదానందుణ్ణి కలుసుకుని నమస్కరించి “అయ్యా! నాకు కత్తి సాము నేర్చుకోవాలని ఆశ. తమ శిష్యుడిగా స్వీకరించండి” అని ప్రార్ధించాడు. సదానందుడు ఆ యువకుడి జన్మస్థలం గురించి, తల్లిదండ్రులగురించి, పూర్వవిద్యల గురించి అడిగాడు. కిరీటి అన్నిటికీ వినయంగా జవాబిచ్చాడు. సదానందుడు ఏమాటా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు.

కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. సరే ‘కాదు పొమ్మనలేదు కదా!’ అనుకుని ఆశ్రమంలో ఇతర విద్యార్ధులతో కలిసిపోయాడు. గురుకుల ఆశ్రమంలోని ఇతర విద్యార్ధుల లాగే రోజూ ఉదయాన్నే లేవటం, ఆశ్రమవిధులు నిర్వహించటం చేస్తున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తేవటం, వంటశాలలో పనిచేయటం, ఏటి నుండి నీరు తేవటం, గురుకులంలోని తోటలోగల కూరగాయల మొక్కలకీ, పూలమొక్కలకీ, పళ్ళవృక్షాలకీ నీళ్ళుపోయటం….. ఇలా అన్ని పనులూ చేస్తున్నాడు. అయితే సదానందుడు కిరీటి కన్పిస్తే చాలు ఈడ్చి తంతుండేవాడు. కిరీటి మొక్కలకు నీళ్ళు పోస్తుంటే ఫెడేలున వీపు మీద గుద్దేవాడు. ప్రాంగణం ఊడుస్తుంటే డొక్కలో గుద్దేవాడు. ఏపని చేస్తున్నా, ఎటో ఒకవైపు నుండి సదానందుడు కిరీటిని తన్నటం మానలేదు.

కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. దుఃఖం వచ్చింది. అవమానంగా అన్పించింది. ‘ఒకవేళ గురువుగారికి తనంటే ఇష్టం లేదా? తమ ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేకపోతే తనని పిలిచి సూటిగానే అదేవిషయం చెబుతాడుగానీ ఇలా ఎందుకు తనని కొడతాడు?’ అనిపించింది. ఒకోసారి, గురుకులం నుండి వెళ్ళిపోదామా అన్పించేది. కానీ కత్తి యుద్ధం నేర్చుకోవాలన్నా సంకల్పం కొద్దీ గురుకులంలోనే ఉండిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. గురువు గారు మాత్రం కిరీటి కన్పిస్తే చాలు దెబ్బతీయకుండా ఉండేవాడు కాదు. కిరీటి ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీపు పగలటం ఖాయం. దాంతో అనివార్యమై, కిరీటి అప్రమత్తంగా ఉండటం నేర్చుకున్నాడు. ఏపని చేస్తున్నా, చురుగ్గా అన్నిదిక్కులూ జాగ్రత్తగా పరిశీలించేవాడు. ఏమాత్రం అలికిడి అయినా మెరుపులా కదిలేవాడు. దాంతో సదానందుడు కిరీటిని తన్నలేకపోవటం తరుచుగా జరగసాగింది. ఇలా మరికొన్నిరోజులు గడిచాయి.

ఓరోజు సదానందుడు కిరీటిని పిలిచి “నాయనా! అదిగో ఆ కత్తి అందుకో. ఈ రోజు నుండీ నీకు కత్తిసాము నేర్పుతాను” అన్నాడు ప్రసన్నంగా.

కిరీటి ఆనందానికి అవధుల్లేవు. మరుక్షణం కత్తి అందుకుని అభ్యాసానికి దిగాడు. తొలిపాఠం అయ్యాక కిరీటి గురువుగారికి నమస్కరించి “అయ్యా! నేను వచ్చి, నన్ను శిష్యుడిగా అంగీకరించమని అడిగిన రోజు, మీరు ఔననలేదు. కాదనలేదు. కాదనలేదు కాబట్టి నేను గురుకులంలో ఉండిపోయాను. కానీ ప్రతిరోజూ మీరు నేను కనబడతే చాలు చితకబాదారు. ఆ బాధ పడలేక వెళ్ళిపోదామని కూడా అన్పించింది. ఈ రోజు నేను అడగకుండానే పిలిచి విద్యాబోధన ప్రారంభించారు. కారణం సెలవిస్తారా?" అని అడిగాడు.

సదానందుడు చిరునవ్వునవ్వి “నాయనా! కత్తి యుద్దానికి అప్రమత్తతా, చురుకుదనమూ పునాది వంటిది. నీవు వచ్చిన రోజు నుండీ నీకు అది నేర్పటం మొదలుపెట్టాను. నువ్వు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా నాచేతి దెబ్బలు తిన్నావు. క్రమంగా నీ చురుకుదనం, జాగ్రత్త పెరిగాయి. ఇప్పుడు లాంఛనంగా విద్యాబోధన ప్రారంభించాను. ఏవిద్యకైనా ముందు దానికి తగిన దృక్పధాన్ని, ఆలోచనా సరళిని విద్యార్థికి నేర్పాలి. తర్వాత అసలు విద్య వారు అతి సులభంగా నేర్చుకోగలుగుతారు. విద్యా బోధనలో అసలు కిటుకు ఇదే” అన్నాడు.

కిరీటి సంతోషంగా గురువుగారికి పాదాభివందనం చేసి, ఇతర విధుల్లోకి వెళ్ళాడు. అనతికాలంలోనే సదానందుడి దగ్గర కత్తియుద్ధంలోని మెళకువలు నేర్చుకుని, నైపుణ్యంగల కత్తి యుద్ద వీరుడిగా కిరీటి పేరు తెచ్చుకున్నాడు.

ఇదీ కథ!

ఈ కథ మనకి, ఏది నేర్చుకోవాలన్నా, ఏ సాధన చెయ్యాలన్నా, వాటికంటే ముందు దృక్పధం [attitude] ముఖ్యమని చెబుతుంది. ఒకవ్యక్తి జీవితాన్ని నిర్మించేది, ప్రభావపరిచేది దృక్పధమే. ఒక జాతిని నిర్మించేది, ప్రభావపరిచేది కూడా దృక్పధమే. ఒకప్పుడు భారతీయుల్లో ఉన్న ఈ దృక్పధమే వారిని ప్రపంచంలోకెల్లా భాగ్యవంతుల్నీ, సౌశీల్యవంతుల్నీ చేసింది. ప్రపంచం నలుమూలల నుండి క్రీస్తు పూర్వమే నలందా విశ్వవిద్యాలయానికి 10 వేలకంటే ఎక్కువ విద్యార్ధులుండేవాళ్ళు. ఎందుకంటే భారతీయులు అలనాటి దృక్పధం భారతదేశాన్ని ప్రపంచంలోనే తలమానికం చేసింది.

ఒకప్పుడు, ఆ దృక్పధాన్ని భారతీయులకు, పురాణాలు, ఇతిహాసాలు, వాటిని ప్రచారించే కళారూపాలు, మతవిశ్వాసాలు, జీవన సరళి, బోధించేవి. ఇప్పుడు వాటిస్థానాన్ని మీడియా [పత్రికలు, టివీలు], సినిమాలు ఆక్రమించాయి. అదే ఈ దుస్థితికి కారణం.

ఏది ఏమైనా – దృక్పధం మారనిది, ఇప్పుడున్న ఏ స్వామ్యాలు [ప్రజస్వామ్యం గాకపోతే XYZ స్వామ్యం], ఏ ఇజాలు, ఏ పద్దతులూ, ఏ చట్టాలూ ప్రజల్లో, వారి జీవితాల్లో, ఏమార్పునీ తేలేవు.

ఇది కాలం నిరూపించిన సత్యం.

నిరూపిస్తున్న సత్యం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

avunu nijamidi,dhanyavaadamulu

Good one

మంచి విశ్లేషణ! :)

@durgeswara గారు,
@కన్నగాడు గారు,
చాలా రోజులకు వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

@సూర్యుడు గారు,
వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

"ఏవిద్యకైనా ముందు దానికి తగిన దృక్పధాన్ని, ఆలోచనా సరళిని విద్యార్థికి నేర్పాలి. తర్వాత అసలు విద్య వారు అతి సులభంగా నేర్చుకోగలుగుతారు."
నిజంగా నిజం. ఈ దృక్పధాన్ని సాధ్యమైనంతగా మీడియా నాశనం చేసింది ఇక మిగిలింది మనమే నాశనం చేసుకుంటాం ఎందుకంటే రేపు మళ్ళీ చరిత్రలో తర్వాతి తరాలకు మీడియా చెప్పాలి కదా మీ గొప్పని మీరే నాశనం చేసుకున్నారని అందుకని ఆ కొసరు పని మేక తోలు గాళ్ళకి అప్పగిస్తారు. వాళ్ళంటే మనమే అన్నమాట

మనోహర్ చెనికల gaaru,
అవునండి. నిజం చెప్పారు! మీడియా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తుంది.

రేణు కుమార్ said... November 13, 2009 at 3:15 PM  

ఆమ్మ గారు గురు సమానులు అయినా ఆది లక్ష్మి గారికి ముందుగా పాదభివందనాలు.
మాకు ఎన్నొ విషయాలు పరిశోదించి చెప్థున్న మీరు మాకు గురు సమానులె? కాదు... మీరు నాకు గురువే...!

నేను మీ బ్లాగుకి కొత్తగా వచ్చాను, గత కొన్ని రొజులుగా మీ టపాలని ఛదువుథున్నాను... ఇంకా ఎంతొ మిగిలె వుంది.
నాకు యీ అంతర్జాలంపై చాలా అవగాహన వున్న్దదని అందరికన్టె నాకు ఛాల తెలుసని అనుకునె వాడిని, అయితె అంత తెలిసినా మీ బ్లాగ్ ఎలా మిస్అయ్యనొ అర్ధమ్ కాలెదు, ఇన్ని మంచి విషయాలు నాకు తెలియకుండా యింతకాలం వుండిపొయాయి. మీ బ్లాగ్ లొ మీరు తెలియఛెసిన విషయాల గురింఛి నాలుగు మాటలలొ ఛెప్పటం అంటె??? అసలు నాలుగు మాటల వ్యాఖ్యలు సరిపొతాయా.?

అయినా మీరు అన్నట్టూగా ఉరికే ఛదివి కుర్ఛుంటె ఎలా
ఇంకా ఏంతొ ఛెప్పాలి కాని ఎలా...

రేణూ కుమార్ గారు,

’అమ్మా’ అన్నారు, బాగుంది. పాదాభివందనాలు అన్నారు, బాలేదు! వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu