ముంబైదాడులు జరిగి నిన్నటికి నిండు నూర్రోజులు.

ఈ వందరోజుల్లో జరిగిన విశేషాలు ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే……..

1]. విజయవంతంగా పాక్ బుకాయింపు, ప్రపంచదేశాలన్నీ పాక్ ని చేస్తున్న బుజ్జగింపూ నిరాటకంగా నడిచిపోతునే ఉన్నాయి.

2]. ఎట్టకేలకు పాకిస్తాన్ ’కసబ్’ పాకీస్తానీయుడే అని ఒప్పుకుంది – ఇది తమ గొప్ప దౌత్య విజయమని ప్రణబ్ ముఖర్జీ భుజాలెత్తుకొని మరీ ప్రకటించాడు, కుర్చీవ్యక్తి కిమ్మనదు.

3]. దాడి పాక్ భూభాగం నుండే జరిగింది. కాని దానికి పధకరచన మాత్రం యూరప్ నుండి, బంగ్లాదేశ్ నుండి జరిగింది అని పాక్ చెప్తూంది. కసబ్ స్వయంగా తాము మత్స్యకారుల బోటుల్లో కరాచీ నుండి వచ్చామని చెప్పగా, బంగ్లాదేశ్ ‘తమ భూభాగం నుండి ఉగ్రవాదులు భారత్ కి వెళ్ళి దాడి చేసినట్లు’ చెప్పుకున్నది. [విషయాన్ని ప్రక్కదారి పట్టించటానికా?]

4]. పాక్ తాము వేరు, ముస్లిం ఉగ్రవాదుల[అల్ ఖైదా] సంస్థలు వేరు, అంటూ ఎంచక్కా దాడి తమది కాదు అని తప్పించుకుంటోంది. ముస్లిం ఉగ్రవాదుల మీద దాడిని మేము ఒప్పుకోం, ఆల్ ఖైదా మీద మేమే దాడి చేస్తాం అంటోంది. మరోప్రక్క వాళ్ళతో శాంతికోసం రాజీ అంటు షరియత్ చట్టం వొప్పుకుంది. అమెరికా కూడా పాక్ సైన్యంకి సహాయ ప్యాకేజ్ ఇచ్చింది.

5]. మేదు మిక్కిలి తమ భూభాగం మీద జరుగుతున్న ఉగ్రవాద చర్యలు భారత్ పనే, లంక క్రికెట్ జట్టుపై దాడి వెనుక భారత హస్తం ఉందంటూ పాక్ మంత్రి మహాశయుడొకరు ఉద్ఘాటించాడు.


ఇకపోతే, ఇంకా ఇంత వరకూ తేలని విషయాలు:

6].. ముంబైదాడులు జరిగిన ముఖ్యప్రదేశం ’తాజ్’ హోటల్. అందులో ఉగ్రవాదులు కంట్రోలు రూం ఏర్పరుచుకోగలిగేటంత, భారీగా ఆయుధాలు సమీకరించుకోగలిగేంత, ఎంతో అలవోకగా గదులమధ్య, వరండాలలోనూ తిరగగలిగేటట్లు హోటల్ అంతర్భాగపు బ్లూప్రింట్ల వీడియో చిత్రాలు సంపాదించుకోగలిగేంత సహాయసహాకారాలు ఎవరిచ్చారు?

7]. ఇక్కడ ఉగ్రవాదులు ఎలా స్థావరాలు ఏర్పాటుచేసుకొని, మొత్తం ప్లాన్ చేసుకొని, దాడి చేసినట్లు? మొదలైన వివరాలు ఏవీ బహిర్గతం కాలేదు.

8]. ముంబైదాడులు నిర్వహించిన ముష్కరుల మీదకి, దాడిని తిప్పికొట్టిందుకు వచ్చిన [జవాన్లని] కమెండోలని విమానాశ్రయంలోనే మూడునాలుగు గంటలపాటు వేచి ఉండేలా చేసి, టెర్రరిస్టులకి సహకరించిన దేశంలోపలి కుట్రదారులెవరు?

9]. ఒకరికి ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, సమర్ధులుగా పేరొందిన వారూ, మూకుమ్మడిగా ఒకే వాహనంలో వెళ్ళి అంత పెద్ద నగరంలో ఓ మూలన మాటేసిన ముష్కరుల చేతికి చిక్కేటట్లు నడిపిందెవరు?

లొసుగులన్నిటినీ తొక్కిపడుతుందెవరు?

మన సందేహాలకి జవాబిచ్చేదెవరు?

ఇక తాజ్ యాజమాన్యం, టాటాల గురించి…………

ఇప్పటి రతన్ టాటానే కాదు, ఇతడి పూర్వీకులు ఝంషెడ్ టాటా జే.ఆర్.డి. టాటా, నావల్ టాటా[ఇతణ్ణి అనాధాశ్రమం నుండి దత్తత తెచ్చుకున్నారు.] ల వరకూ అందరినీ భారతీయులు ఎంతో ఆదరించారు. 1992 కు ముందైతే మీడియాలో ఓ ప్రచారం ఉండేది. నిద్రలేస్తే ప్రతి భారతీయుడు రోజుకి 10 పైసలు టాటాలకి చెల్లిస్తారని. అన్నిరంగాల్లో టాటాలే దాదాపు మోనోపలిగా ఉండేవారు. ఉంటే టాటాలు లేదా బిర్లాలు [హిందూస్తాన్ లీవర్స్ వారు] అంతగా ఆదరించిన భారతదేశంలో, ఇక్కడి వనరుల్ని ఉపయోగించుకుంటూ, ఇక్కడే ధనార్జన చేస్తున్న ఈ టాటాకి భారతీయ జవాన్ల మీద నమ్మకం లేదట. కావాలంటే క్రింద కధనం చూడండి.ఎందుకని నమ్మకం లేదో? ఇన్నాళ్ళు భారతీయులు రక్షించకుండానే ఈ పార్సీ వ్యాపారి ఆస్తులన్నీ కాపాడ బడ్డాయి కాబోలు. సగటు భారతీయులు ఎంత అమాయకులూ, అనుబంధాలు పట్ల ప్రీతిపరులూ అంటే, రతన్ టాటాని పార్సీ వాడంటే నొచ్చుకునేటంత. కానీ ఈ వ్యాపారులు మాత్రం తమ పార్సీ మూలాలని 150 ఏళ్ళయినా మరిచి పోని వారు. భారతీయతని సంతరించుకోలేని వారు. ఖచ్చితంగా చెప్పలంటే కుట్రదారులకి మద్దతుదారులు.

ఈరోజు సామాన్యుడి కోసం నానో కారు ఇవ్వబోతున్నాడు రతన్ టాటా అనుకుంటామే గానీ – అసలీ టాటాలని బ్రిటిషు వారు ఎలా పైకి రానిచ్చారనీ ఆలోచించం. స్వాతంత్రానికి పూర్వమే దేశంలో ఉక్కుపరిశ్రమలు నెలకొల్పగలిగిన జంషెడ్ టాటా గురించి పాఠాలుగా చదువుకుంటామే గానీ, స్వాతంత్రానంతరం అన్ని స్వదేశీ కంపెనీలు, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థలో భాగంగా ప్రభుత్వ పెట్టుబడులున్న సంస్థలూ కూడా లాభాల్లో నడవలేనప్పుడు సైతం, టాటాలు లాభాల బాటలోనే ఎలా నడిచారని సందేహించం.[ మొన్నీమధ్యన భారీ ఎత్తున పెద్ద ఉక్కుపరిశ్రమ కొని, ఇప్పుడు ఆర్దిక మాంద్యం వచ్చి నష్టపోతున్నాడు.]

ప్రభుత్వ భాగస్వామ్య కంపెనీలకీ, భారతీయ కంపెనీలకి దొరకని సమర్ధులంతా టాటాలకి, బిర్లాలకి మాత్రమే దొరికే వారేమో! తర్వాతే వచ్చారు రంగంలోకి బజాజ్ లూ, అంబానీలు.

భారత ఆర్ధిక రంగం మీద కుట్రగురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ముంబై దాడుల వెనుకనున్న మతలబుల గురించే ఆలోచిద్దాం. దాడులు జరిగిన తాజ్ హోటల్ మరమ్మత్తులు పూర్తి చేసుకొని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టిందని సంబరంగా చెప్పిన మీడియా[తాజ్, ఓబెరాయ్ హోటళ్ళకి ఇన్సూరెన్స్ లు వచ్చాయిలెండి], ముంబైదాడుల ముష్కరులకి తాజ్ హోటల్ లో యధేచ్చగా మారణకాండ జరిపేందుకు సహకారం, ఎలా, ఎక్కడ నుండి వచ్చిందో చెప్పదేం? అన్వేషించదేం? జీవన సమరం తప్పని ముంబైవాసులు మళ్ళీ రోడ్ల మీదికొచ్చి దైనందిన జీవితం ప్రారంభించారు. అది ధైర్యానికి చిహ్నమే. అనివార్యం కూడాను. భయపడి ఇంట్లో కూర్చోలేం, కుర్చోం. ముంబైవాసులే కాదు, భారత ప్రజానీకం అంతా తమ దైనందిన జీవితాన్ని, వృత్తి జీవితాన్ని కొనసాగించక తప్పదు. కానీ నిజాలు వెలికి తీయడమే వృత్తిగా స్వీకరించిన మీడియా కూడా ముంబైదాడుల్ని మరచిపోవడం, ప్రజల్ని మాయ చేయటం కాదా? ప్రభుత్వమూ కిమ్మనదు, మీడియా కిమ్మనదు. టాటాలైతే ఎదురు భారతీయ జవాన్లనే నిందిస్తున్నారు. మొత్తానికి ఎలాగైతేనేం యు.పి.ఏ. ప్రభుత్వం, పాకిస్తాన్ విషయంలో కాలయాపన చేసి ఎలక్షన్ల్ దాకా నెట్టుకొచ్చింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

చాలా విషయాలు చాలా చక్కగా చెబుతున్నారండి మీరు.. చదివన ప్రతి సారి చిన్న నిట్టూర్పు విడవకుండా ఉండలేను

ముంబై దాడుల విషయంలో మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ముంబై టెర్రర్ ని కాపిటలైజ్ చేసుకోవడంలో వాళ్ళు చూపిన శ్రద్ధ , ప్రభుత్వాన్ని దోషుల్ని పట్టుకోవడానికి ఒత్తిడి చెయ్యడంలో చూపించి ఉంటే ఈ పాటికి ముంబై మీద దాడి చేసినందుకు పాక్ పశ్చాత్తాప పడేలా చేయగలిగేవాళ్ళు. అయినా మీడియాకేం సంబంధం ఉందిలెండి. మీరు చెప్పిన టాటా లాంటి వాళ్ళే వీళ్ళు కూడా. కాకపోతే వీళ్ళలో కొంతమంది ఇక్కడే పుట్టి , ఇక్కడే పెరిగిన వాళ్ళు అంతే తేడా

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu