ఇక LTTE కి కరుణానిధి సహకారం మాట ఎలా ఉన్నా, కరుణానిధి హిందూ వ్యతిరేకత మాత్రం బహిరంగంగా అందరికీ నిరూపితమైనదే. ఇటీవల రామసేతు విషయంలో ఇతడు “రాముడు తాగుబోతు. అసలు శ్రీరాముడంటూ ఎవరూ లేరు. అది కవూలూహించిన కల్పిత పాత్ర. అలాంటి చోట రామనిర్మిత సేతువు అన్న ప్రశ్నే లేదు. దక్షిణాన ఉన్న హిందూ మహా సముద్రంలోనిది ప్రకృతి సహజమైనదే తప్ప రామసేతు కాదు” అంటూ తెగేసి ప్రకటించాడు.

అతడి ప్రకటనే ఎంత ద్వంద్వ పూరితంగా ఉందో చూడండి. ఓ ప్రక్క రాముడంటూ చరిత్రలోనో పురాతన కాలంలోనో ఎవరూ జన్మించలేదని అంటున్నాడు. మరో ప్రక్క రాముడు తాగుబోతు అంటున్నాడు. పుట్టనేవ్యక్తి, కవుల కల్పిత పాత్ర అయిన వాడు తాగుబోతు ఎలా అయినట్లు? అతడన్నట్లు ఒకవేళ రాముడు లేడనే అనుకుందాం, ఆ పేరుతో ఓ ఆదర్శ మూర్తి ఎప్పటికీ జన్మించలేదనే అనుకుందాం, అయినా ’రాముడు’ అన్న విషయం కోట్లాది ప్రజల నమ్మకానికి సంబంధించినది కదా! అలాంటిది కోట్లాది హిందువుల నమ్మకాలని, మనోభావాలని కించపరుస్తూ కరుణానిధి లాంటి రాజకీయ నాయకుడు అలా ప్రకటించటం ఎంత వరకూ సబబు? అదే ముస్లింలకో, క్రైస్తవులకో సంబంధించిన నమ్మకాలపై అలా వ్యాఖ్యనించగలరా ఎవరైనా? కరుణానిధి కాదు, మరెవ్వరికీ చచ్చినా అంత ధైర్యం, తెగింపు ఉండదు. మరి హిందువులు అంత తేరగా లేదా తేలిగ్గా ఉన్నారా? మతప్రాదిపదికన, ‘ఓట్లకోసం’ అనుకున్నా ముస్లింల ఓట్ల కన్నా హిందువుల ఓట్లు ఎక్కువే గదా? తమకు అనుకూలంగా ఉన్న హిందువుల ఓట్లను ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? అంటే ఈ విధంగా నాలుక వాడటానికి కారణం నిశ్చయంగా మతం కాదు. ఓట్లూ కాదు.

కేవలం హిందువుల్ని రెచ్చగొట్టాటానికి, ఆవిధంగా పదునైన ఆయుధాన్ని భాజపాకి సమకూర్చిపెట్టడానికి, ’రామ’ సెంటిమెంటుతో గతంలోలాగా భాజపా కి ఓట్ల వర్షం కురిపించడానికి, మరోసారి అయోధ్య రామమందిరపు రోజుల్లోకి మతఘర్షణలు సృష్టించడానికే కరుణానిధి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఆవిధంగా తన గాడ్ ఫాదర్ లయిన కుట్రదారులు [అంటే సి.ఐ.ఏ.,ఐ.ఎస్.ఐ.,బ్రిటిషు, అనువంశిక నకిలీ కణికుడు] ఇచ్చిన తన ‘అసైన్ మెంట్’ ని నిర్వహించాడు. ఎంతగా తమిళనాట రాముణ్ణి కొలిచే వైష్ణవుల కంటే శివుణ్ణి కొలిచే శైవులే ఎక్కువుగా ఉన్నా కూడా, ఒక రాజకీయ నాయకుడిగా, హిందువులను వారి భావాలను నమ్మకాలను కించపరచకూడదన్న కనీస బాధ్యత లేదా ఇతడికి? కావాలని మత ఘర్షణలూ, కులఘర్షణలూ, వర్గకక్షలూ ఎగదోసే వీళ్ళకి కుట్రలే తప్ప బాధ్యతలు గుర్తుండవని ఇలా నిరూపితమౌతుంటుంది.

DMK నేత కరుణానిధికి అధికారికంగా, అనధికారికంగా ముగ్గురో నలుగురో భార్యలున్నారు. అలాంటి వ్యక్తికి శ్రీరాముడి పాత్రలోని పరిణతి, దైవత్వం అర్ధంకాకపోవటం సహజం. కనుకనే రాముడు తాగుబోతు అనేంతగా తెగించాడు. అంతేగాక ఈనాడు రాజకీయ నాయకులకి [కరుణానిధితో సహా] మద్యపానం దగ్గరనుండి బహు ‘వివాహేతరసంబంధాల’ వరకూ అన్నీ మామూలే. మునుపటి తరంలో బాపూజీలని, తిలక్ మహాశయులని చూసిన భారతదేశానికి ఈ తరంలో ఇలాంటి నాయకులుండటం విధివిచిత్రమో, కుట్ర ఫలితమో! నిజంగా కరుణానిధికి ఒక విషయమై భారతీయులందరూ కృతఙ్ఞతలు చెప్పాలి. రాముణ్ణి గురించి వ్యాఖ్యానించిన అదేనాలుకతో మహత్మాగాంధీని తాగుబోతనో, తిరుగుబోతనో అననందుకు.

నా ప్రధాన లక్ష్యం కుట్రగురించి వివరించమైనందున, సమకాలీన అంశాల్ని సందర్భానుసారం వివరించవలసి వస్తున్నందున, కథా క్రమంలా వివరించడం కుదరదు. నా బ్లాగు చుట్టాలు ఈ విషయం అర్ధం చేసుకుంటారని ఆశిస్తాను. అందుచేత మరోసారి ఫలానా సమయం దగ్గరికి లేదా ఫలానా విషయం దగ్గరికి తిరిగి వద్దాం అనవలసి వస్తుంది.

మళ్ళీ 1991 కి తిరిగి వద్దాం. సరేనా? 1991 సార్వత్రిక ఎన్నికల రెండుదశల పోలింగ్ మధ్య రాజీవ్ గాంధీ హత్య చోటు చేసుకుంది. దాంతో రెండవ దశ పోలింగ్ దాదాపు నెలరోజులకు వాయిదా పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్ లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాలేదు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది. హంగ్ ఏర్పడిందన్న మాట. బిజేపి సీట్ల సంఖ్య 86 నుండి 120 కి పెరిగింది.

ఈ దశలో ఇందిరాగాంధీ కుటుంబ వారసురాలిగా కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని ఏలవలసిందిగా సోనియాగాంధీని ఆ పార్టీలోని సీనియర్లూ[పి.వి.నరసింహారావుతో సహా], జూనియర్లు కోరారు. ఎవరు కోరినా అలాంటి చర్య మాత్రం సమర్ధనీయం కాదు. ఈ విషయమై తర్వాత చర్చిద్దాం.

అయితే ఆ ప్రపోజల్ ని సోనియా గాంధీ తోసిపుచ్చింది. పుట్టెడు దుఃఖాన్ని పాత్రోచితంగా భరిస్తోన్న సోనియా గాంధీ ఆ తర్వాత సంవత్సరం పాటు సంతాపాన్ని పాటించింది. 1991 లో ఈమె కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని, ప్రధాన మంత్రి పదవి[?]ని తిరస్కరించిన నేపధ్యాన్ని పురస్కరించుకొని సోనియా భక్తాగ్రేసరులంతా ఆమె త్యాగాన్ని వేనోళ్ళ వీలయినన్ని సార్లు పొగుడుతుంటారు. అసలు విదేశీ వ్యక్తి భారత ప్రధాని కాగల అవకాశం 1991 లో లేదు. 1999 లో ఎన్.డి.ఏ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వెసులుబాటు కల్పించబడింది. అయితే ఈ విషయమై వివాదం కోర్టులో తేలవలసి ఉందని విన్నాను. ఇంతకీ భారతీయుల, ముఖ్యంగా హిందువుల ఆత్మఘోషని ప్రతిధ్వనిస్తున్న పార్టీగా తమని తాము అభివర్ణించుకునే బి.జే.పి., సోనియా విదేశీయతని, కాంగ్రెస్ నీ వ్యతిరేకించే ఎన్.డి.ఏ., అలాంటి అమెండ్ మెంట్ ని చప్పుడు చెయ్యకుండా ఎందుకు తెచ్చిపెట్టారో, ఎవరు తెప్పించి ఉంటారో మీకిప్పటికే అర్ధమై ఉంటుంది. ఇది చెప్పడం లేదా ఎన్.డి.ఏ. వెనుక, యు.పి.ఏ. వెనుక ఉన్నది ఒక వ్యవస్థేనని, ఒక కుట్రేనని?

ఇక సోనియా గాంధీ త్యాగశీలత గురించి – ఈమె ‘తాను ప్రధాని కాగల అవకాశాన్ని రెండుసార్లు కాదు, మూడుసార్లు త్యాగం చేసిందీ’ అంటూ నేటి కాంగ్రెసోళ్ళు నానా గోల చేస్తుంటారు. నిజానికి ఈమె యు.పి.ఏ. ప్రభుత్వానికి కుర్చీవ్యక్తి.[అలాంటి రాజ్యాంగేతర పదవి ఈమె కోసమే పుట్టిందెమో!] భారత ఆర్ధికరంగమ్మీద కుట్రలో కాస్త పెద్ద వాటానే కలిగి ఉన్న మన్మోహన్ సింగు ఈమె చేతిలోని బొమ్మ. గమనించి చూడండి, ఈదేశానికి వచ్చే విదేశీ అధ్యక్షులూ, ప్రధానులూ, రాజులూ, సుల్తానులూ కూడా రాష్ట్రపతి, ప్రధానులలోపాటు విధిగా సోనియాగాంధీని కలిసి వెళ్తుంటారు. భూటాన్ రాజు పట్టాభిషేకం దగ్గర్నుండీ, బీజింగ్ 2008 ఒలెంపిక్స్ వరకూ ఈమె అధికారికంగా పర్యటించి వస్తుంటుంది? ఇక ఏవిధంగా ఈమె అధికారాన్ని త్యాగం చేసినట్లు? ప్రభుత్వంలో, పార్టీలో అధికారాన్ని అనుభవిస్తూనే ఉంది కదా! మరి ఇక ఈమె చేసిన త్యాగం ఏమిటి?

కానీ ఒక్క విషయంలో ఈమె త్యాగాన్ని మనందరం నిర్ధ్వంద్వంగా ఒప్పుకోవాలి. అమెరికా దేశపు 42 వ అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెన్నడీ, అతడి భార్య జాక్వెలిన్ కెన్నడీలు అప్పట్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనీ, ‘ఎడబాయనీ జంట’ అనీ, ‘చూడముచ్చటైన జంట’ అనీ, ఆదర్శ దంపతులనీ పేరుగాంచారు. ప్రజల్లో వారిపట్ల ఎంతమోజు ఉండేదంటే కెన్నడీ క్రాపుని మగవాళ్ళు, జాక్వెలిన్ తలకట్టుని ఆడవాళ్ళు అనుకరించేటంత. అయితే కెన్నడీ హత్యకు గురైన తర్వాత, స్వల్ప కాలంలోనే జాక్వెలిన్ కెన్నడీ పునఃవివాహం చేసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించిందట. ప్రజల్లో వారి జంటపట్ల ఆరాధనని జాక్వెలిన్ అలా వమ్ముచేసినప్పుడు అది సహజమే కదా! [అందుకేనేమో వాల్మీకి మహర్షి “రఘకులేశేడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు, నాదు జపము తపమూ, నాకావ్యమ్ము వృధాయగునమ్మా సందేహించకు మమ్మ రఘరాము ప్రేమను సీతమ్మ” అంటాడు.]

కెన్నడీ దంపతులకి సంబంధించిన ఈ విశేషాలన్నీ – 1992 లో సీనియర్ బుష్, బిల్ క్లింటన్ ల ఎన్నికల సమయంలో, అనూహ్యంగా రాస్ పెరాట్ రంగంలోకి దూసుకొచ్చి, అప్పటివరకూ మెరుగ్గా కనబడిన బుష్ విజయావకాశాలు మరుగున పడి, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షులైన సందర్భంలో, క్లింటన్ కి స్ఫూర్తి దాత అయిన కెన్నడీ గురించి మరోసారి మీడియాలో వచ్చాయి.

1991 లో రాజీవ్ గాంధీ హత్యానంతరం, ఈ ఇటలీ వనిత సోనియా గాంధీ కూడా, తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇటలీ వెళ్ళిపోయి, పునర్వివాహం చేసుకొని భారతీయ సంస్కృతినీ, వివాహపు కట్టుబాట్లనీ, అంతర్జాతీయ వేదికల మీద సంచలన వార్తా చర్చ చేయనందుకు ఈమె త్యాగాన్ని మనం ఒప్పుకొని తీరాలి. అసలికే పాశ్చాత్యులు 40ల్లోనే యవ్వనం ప్రారంభమైయిందనీ, అసలు జీవితం అప్పడే మొదలైందనీ భావిస్తారయ్యె!

ఇక మరో వైపు పరిశీలిస్తే – భారత దేశపు రాజకీయ నాయకురాలు కావటానికి ఈమె కున్న అర్హత ఏమిటి?

ఈమె భారతీయురాలు కాదు. కనీసం భారతీయత అనుభూతించదు. కేవలం నేత చీర కట్టినంత మాత్రనా సరిపోతుందా? మీడియా కథనాల ప్రకారం, సోనియాగాంధీ వివాహానంతరం చాలా సంవత్సరాల వరకూ భారతీయ పౌరసత్వం సైతం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్షురాలు అవ్వడం కోసం ప్రాధమిక సభ్యత్వం తీసుకొంది. భారతీయ ఇతిహాసాలు తెలియవు, చరిత్ర తెలియదు. స్వాతంత్రసమరం అంతకంటే తెలియదు. ఈమె కున్న ఏకైన అర్హత నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కుమారుణ్ణి వలచి వలపించికొని వివాహం చేసుకోవడం ఒక్కటే!

1980 లో మరిది సంజయ్ గాంధీ మరణానంతరం, రాజకీయ ప్రవేశం చెయ్యాలని నిర్ణయించుకున్న భర్తతో ఆడపులిలా దెబ్బలాడానని స్వయంగా సోనియాగాంధీనే చెప్పుకుంది. ఎందుకు వ్యతిరేకించినట్లు? వ్యక్తిగత ప్రశాంత జీవితం పోతుందని అనేటట్లయితే అది స్వార్ధమే కదా! మరి త్యాగశీలి ఎలా అయ్యింది? అలాగ్గాక ప్రాణగండమని భయపడిందనుకుందాం. అప్పటికి సంజయ్ గాంధీ మరణం ప్రమాదకారణంగాననే అందరూ అనుకుంటున్నారు. అప్పటికి 63 ఏళ్ళ వయస్సులో ఉన్న ఇందిరాగాంధీ మరో నాలుగేళ్ళల్లో హత్యకు గురవుతుందని ఎవరు అనుకోలేదు. ఆవిడ ధృఢంగా మరో 20 ఏళ్ళు బ్రతక గలదనే అనుకున్నారు. మరి ఏమీ లేని చోట సోనియా గాంధీ ఏ’ప్రాణ భయాన్ని’ చూడగలిగినట్లు?

ఇలాంటినేపధ్యమున్న ఈ ఇటలీ మహిళ, భారతదేశానికి కోడలినంటు వచ్చి ఎంత తేలిగ్గా అత్యున్నత పీఠానికి దగ్గరగా వచ్చింది? ఎంత తేలికైన మార్గం? చదువక్కర లేదు.[ సోనియాగాంధీ ఇటలీలో స్కూల్ ఫైనల్ దాటలేదు. లండన్ కి ఇంగ్లీషు భాషా కోర్సు చెయ్యటానికి వచ్చి రాజీవ్ గాంధీకి పరిచయమయ్యింది.] రాజకీయానుభవం అక్కర్లేదు. జాతీయత లేదు. కనీసం దేశ చరిత్ర, సంస్కృతుల పట్ల అవగాహన లేదు. మరి ఎలా ఈమె ప్రభుత్వ కుర్చీ వ్యక్తి కాగలిగింది? ఇంకా అర్జున్ సింగ్, శివరాజ్ పాటిల్, వై.ఎస్. లాంటి కరుడుగట్టిన రాజకీయవాదులు ఈమెని కొవ్వొత్తితో పోలుస్తారు. త్యాగానికి కొత్త నిర్వచనం కాబోలు. కేవలం ప్రధాని ఇంటిలోనికి కోడలినంటూ అడుగుపెడితే చాలా? ఒక్కో అడ్డంకీ తొలిగిపోయి ప్రధాని కావచ్చు. పాపం కొందరు 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి కనీసం కేంద్రమంత్రికూడా కాలేకపోయారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

5 comments:

well said

1. 1991 లో రాజీవ్ గాంధీ హత్యానంతరం, ఈ ఇటలీ వనిత సోనియా గాంధీ కూడా, తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇటలీ వెళ్ళిపోయి, పునర్వివాహం చేసుకొని భారతీయ సంస్కృతినీ, వివాహపు కట్టుబాట్లనీ, అంతర్జాతీయ వేదికల మీద సంచలన వార్తా చర్చ చేయనందుకు ఈమె త్యాగాన్ని మనం ఒప్పుకొని తీరాలి.

2. ఇంకా అర్జున్ సింగ్, శివరాజ్ పాటిల్, వై.ఎస్. లాంటి కరుడుగట్టిన రాజకీయవాదులు ఈమెని కొవ్వొత్తితో పోలుస్తారు.

I would like to comment on the above two points.

Point one: Not marrying again is a personal choice. Do you think that she did not marry, so she can serve Indian people? I don't think so. If that is the case people never marry in their lives are also great? But we don't consider them great.

Point two: I agree with this point 100%. Those people are anti-national and anti-Hindu and most corrupt.

pseudosecular గారు,
I just put a satire on Sonia Gandhi’s sacrifice. I didn’t mean that a young woman or man get remarry is wrong, if they lose their life partner at their early life. I won’t oppose widow [either male or female] re-marriage.

Sorry, I oppose female remarriage at the risk of being called an orthodox bigot. It is not a question of equal rights etc. It has something to do with the male psychology which can not be changed. Mere fancy of its possibility dilutes men's dedication to thier family while they are well alive. We should not forget that the entire family system is still dependent on man's faith in his woman. It's highly dangerous to take liberties with his sensibilities towards his women. That's how the system suffered irreparable damage in the West, because they dared to experiment with it. They lost mutual goodwll and part ways at their convenience. Their future separation is a foregone conclusion right when they meet for the first time. They are mentally reconciled to that possibility well in advance. This kind of freedom makes psychological wrecks of entire nations.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు,

పునర్వివాహం అన్నది కొన్ని పరిమితులున్న అంశమండీ. 71 ఏళ్ళ వయస్సులో తనని సంతానం నిర్లక్ష్యం చేసిందంటూ పురుషుడు పునర్వివాహం చేసుకోవటాన్ని నేను హర్షించను. అదేవిధంగా 16 ఏళ్ళ అమ్మాయి, పెళ్ళయిన మూణ్ణెల్లకే ఏ ప్రమాదవశాత్తో భర్తని కోల్పోతే, పిల్లలూ లేని ఆ బాలిక బ్రతుకంతా అలా ఒంటరిగా ఉండిపోవాలనడాన్ని సమర్ధించను. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురు ఓ కుటుంబం ఉండేది. తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందంటూ 20 ఏళ్ళ కుర్రాడికిచ్చి పెళ్ళి చేసారు. తొలిపండక్కి వచ్చిన అల్లుణ్ణి మామగారు బజారుకు తీసుకెళ్ళి, కొత్తల్లుడు కదా అని చెరుకురసం ఇప్పించాట్ట. అందులో కలిపిన ఐస్ మార్చురీలో వాడినదట. గంటలో ఆ పిల్లవాడు స్పృహ తప్పిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా సాయంత్రంలోగా మరణించాడు. ఆ పిల్లా, ఆమె తల్లితండ్రులు గుండే బాదుకు ఏడుస్తుంటే మా వీధిలో అందరూ కంట తడిపెట్టారు. అది మా ఊళ్ళో, అప్పట్లో సంచలనం సృష్టించి, తర్వాత చెరకురసం స్టాళ్ళ దగ్గర పోలీసులు, మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఆ అమ్మాయికి మరో రెండేళ్ళకి పెళ్ళి చేసారని విన్నప్పుడు నాకు సంతోషంగా అన్పించింది. ఇప్పటికీ గురజాడ వారి ముత్యాల సరాల్లోని పూర్ణమ్మకథ చదివినా, కన్యాశుల్కం లోని పూర్ణమ్మకథని ఘంటసాల వారి గొంతులో విన్నా నాకు దుఃఖం ఆగదు. ’మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడోకరూండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ’అన్నాడు శ్రీశ్రీ. జీవిత ప్రారంభంలోనే సహచరి/ సహచరుణ్ణి పోగోట్టుకున్నవారు [సంతానహీనులైతనే, సంతానం ఉంటే పునర్వివాహం మరికొన్ని సమస్యలు సృష్టిస్తుంది.] పునర్వివాహం చేసుకోవటం అన్నది ఆయా పరిమితుల్ని బట్టి ఆమోదించదగ్గ విషయమే అని నేను అనుకుంటానండి. ’సర్ధుకుపోవటం చేతకాలేదు కాబట్టి విడాకులు తీసుకుంటాం. మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటాం. నీపిల్లలు, నాపిల్లలు, మన పిల్లలతో కలిసి ఉంటాం, కొట్టుకుంటాం. పైకి నటిస్తుంటాం’ అనే శోభాడే లాంటివారి అధునిక పునర్వివాహాలను నేనూ సమర్ధించను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu