అదేవిధంగా దేశంలో ఆనాటికి ఉన్న సమస్యలు మందిర్, మండల్, తీవ్రవాదం, షేర్లకుంభకోణం అన్నిటికీ పైకి చెప్పబడిన ఆయా కారణాలే నిజమని నమ్మాను. అంతకంటే సామాన్యులకి తెలిసేది ఏముంటుంది?

అయితే ఈ 17 ఏళ్ళుగా [ 1992 నుండి 2009 వరకూ] నేనీ కుట్ర గురించి చాలా తెలుసుకున్నాను. ఇంత వివరంగా, దృష్టాంతసహితంగా అంటే circumstantial గా కుట్రని మేం అర్ధంచేసుకునేందుకు ఓ వ్యక్తి మాకు సహాయం చేశాడు. అతడే ప్రఖ్యాత ఆంగ్లకవి రుడియర్డ్ కిప్లింగ్. ఆయన వ్రాసిన ఆంగ్ల పద్యం

“I have six friends
They taught me everything what I know
They are what, why, where,
When, who and how.”

నేనూ, నా కుటుంబము రామోజీరావు చేత, అతడి ఏజంట్ల చేత వేధింపబడుతున్నప్పుడు, వాళ్ళ చేతిలో వెతలు పడుతున్నప్పుడు రామోజీరావు వ్రాతల్నీ, చేతల్ని గమనిస్తూ, దాదాపు అన్ని సంఘటనల్ని పరిశీలిస్తూ, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర పేపర్ల వార్తల్ని పరిశీలిస్తూ, నేనెక్కువగా కుట్రగురించి నేర్చుకున్నాను. యు.పి.ఏ. ప్రభుత్వం నాపట్ల చూపిన వ్యూహాత్మక మౌనం, వ్యూహాత్మక స్పందనులు గమనించినప్పుడు నాకు మరింతగా కుట్ర mode, magnitude అర్ధమయ్యాయి. [ఏప్రభుత్వమైన వేధింపు అన్నది కామన్ విషయం]. కుట్రదారుల మద్దతుదారులెవరో, వారి పనితీరు ఏమిటో కూడా అర్ధమయ్యింది. దాని తాలూకూ, ప్రభుత్వంలో నేను నడిపిన Administrational communication అంతా, అన్ని వివరాలతో Coups on World లో Documentary Evidence పేరిట ఉంచాను. అయితే ఇటీవల ఓ బ్లాగు మిత్రుడి నుండి నేనో మెయిల్ అందుకున్నాను. అందులో అతడు “అవన్నీ మీరు వ్రాసుకున్న ఫిర్యాదులే కదా? అవి ఎలా సాక్ష్యం అవుతాయి? నాకు అర్ధం కాలేదు. వివరించండి” అన్నాడు.

వాస్తవానికి అది Administration పరంగా ఒక కేసుని/అంశాన్ని నిరూపించే పద్ధతి. ఫిర్యాదులు, లేఖలు, వాటి పూర్వాపర సంఘటనలు, వాటిపై నడిచిన correspondence తో సహా నిర్మించిన నివేదిక ఇది. దాన్ని అర్ధం చేసుకోవటం ప్రభుత్వఫైళ్ళ గురించీ, Administration గురించి తెలిసిన వారికి సులభమే. అయితే ప్రభుత్వపనితీరుతో పరిచయం లేనివారికి ఈ నిరూపణ పద్దతి అర్ధం కావటం కొంచెం కష్టం. దీనికోసమై ఒక ప్రత్యేక టపా వ్రాస్తాను.

నిజానికి రామోజీరావు గానీ, అతడి అనుచరులూ మద్దతుదారులూ గానీ నన్నెందుకు వేధించారో, వేధిస్తున్నారో నాకు స్పష్టంగా తెలియదు. నేను అతడి మీద ఫిర్యాదు చేసాను అన్న కోపమే కారణమైతే ఈ వేధింపుకంటే నా పీక పిసకటం చాలా సులభం. తక్కువఖర్చు, తక్కువ సమయంలో ఒక్కదెబ్బతో గొడవ వదిలిపోతుంది. అదీగాక వారి పనులు వారికి నిరాటంకంగా నడిచిపోతూనే ఉన్నాయి. అటువంటప్పుడు, ఆనాటి ప్రధానికి నేను అతడి మీద ఫిర్యాదు చేసినంత మాత్రన రామోజీరావుకి వచ్చిన నష్టం కష్టం ఏమీటో నాకు తెలియదు. అయినా ఎందుకు వేధిస్తున్నాడో అతడికి తెలియాలి. నేను చాలా స్పష్టంగా 13April, 2006 తేదీన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి వ్రాసిన ఫిర్యాదులో ’చంద్రబాబు నాయుడు ఎందుకు నన్ను వేధించాడో నాకు తెలియదు, దానిని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారో మీకే తెలియాలి. నా జీవితం తెరచిన పుస్తకం వంటిది, వేధించి, శోధించి తెలుసుకోవలసిన గండికోట రహస్యాలేమీ లేవ’ని స్పష్టంగా వ్రాసాను. పూర్వాపరాలు తర్వాతి టపాలలో వివరిస్తాను. వెంటనే కావాలంటే Fire Pot చూడగలరు.

సరే! ఇక్కడికి ఈవిషయం ప్రక్కన బెట్టి మళ్ళీ 1992 దగ్గరకి వద్దాం. ఆ రోజుల్లో మండుతున్న మరో సమస్య మండల్ నివేదిక. 1989 లో వీ.పి.సింగ్ ప్రధానిగా ఉండగా, కులప్రాతిపదికగా, పుట్టుక ప్రాతిపదికగా విద్యాసంస్థల్లో ప్రవేశాలకీ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించడం, ఆవిధంగా సామాజిక న్యాయం చేయటం గురించి అధ్యయనం చేయటానికి మండల్ కమిటీ నియమించబడింది. నిజానికి సామాజిక న్యాయం అన్నది కేవలం ఒక పైకారణం [over leaf reason] మాత్రమే. దాని వెనుక ఉన్న కుట్రదారుల నిజమైన సంకల్పం, రిజర్వేషన్ల వంకతో ప్రజల మధ్య విభేదాలు, సంఘర్షణలు సృష్టించటం. OC, BC 1,2,3,…., SC,ST వంటి కుల, వర్గాల పేరుతో వీలయినన్ని అలజడులు రేపటం. ఇది నిజానికి కొత్తప్యాకింగ్ లో ఉన్న పాత సరుకు వంటిది. బ్రిటిష్ హయంనాటి నుండీ కుట్రదారులు అమలు చేస్తున్న కణికనీతి, ‘Divide and Rule Policy’ కి కొత్తపేరు రిజర్వేషన్లు. దీనిమీద మరింత రగడ పెంచడానికి రిజర్వేషన్లని కీర్తిశేషులైన నాయకులు గాంధీజీ, వంటివారికి అంటగడతారు. ఆ స్ట్రాటజీని సవివరంగా తదుపరి చర్చిస్తాను. ఈ రిజర్వేషన్ల పేరు చెప్పి రాజకీయ పార్టీలు, నాయకులు బాగా లబ్ధిపొందుతారు. ఓట్లు వేయించుకొని పబ్బం గడుపుకుంటారు. చివరికి ప్రజలకి ఈ పార్టీల మీద, నాయకుల మీద విసుగుపుట్టి ’ఎవడొచ్చినా ఒకటే. మాటలు చెబుతారే గానీ ఏమీ చెయ్యరు’ అన్న స్థితిలో ఉన్నప్పుడు కొన్ని కొత్తపార్టీలూ, కొత్త వ్యక్తులు పుట్టుకొస్తారు. కొత్త సీసాలో పాతసారాలాగా సరికొత్తగా మళ్ళీ ఈ కుల రిజర్వేషన్లు, సామాజికన్యాయం అనే పల్లవి ఎత్తుకుంటారు. ఎటూ దేశంలో రాష్ట్రంలో ఎక్కువమిక్కిలి కులాలు వర్గాలు ఉన్నాయి. మరోసారి ఆశలు, అలజడులు, అభద్రతా నిస్పృహ, నిరాశలేపవచ్చు, రిజర్వేషన్ల పరిధిలోకి వస్తామనుకునే వర్గాల ప్రజల్లో ఆశలు రేగితే, తమ అవకాశాలు మరింత సన్నగిల్లుతాయనుకునే వర్గాల ప్రజల్లో నిరాశ, నిస్పృహ రేగుతాయి. ఫలితంగా ప్రజలందరిలో అలజడీ, అందోళనా, అభద్రతా పెరిగిపోతాయి. మళ్ళీ రాజకీయపు ఆట వేగమందుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న తతంగం అదే.

1992 వరకూ మాల మహానాడు పేరుచెప్పుకొని వెలిగిపోయి, 1992 లో ఉపఎన్నికల బరిలోదిగి ప్రాభవం కోల్పోయి తెరమరుగైన, ఇటీవలే ప్రజారాజ్యం పార్టీలో చేరిన కత్తి పద్మారావు వంటి నాయకుల దగ్గర నుండీ, నిన్నటి వరకూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడన్న పేరుగాంచి, ఇటీవలే మహాకూటమిలో చేరిన మాదిగ దండోర నాయకుడు మంద కృష్ణ మాదిగ వంటి నాయకులు వరకూ ఈ కుల నాయకులంతా, ఆయా కులాల వారిని వాడుకొని తాము కెరీర్ పెంచుకున్నవాళ్ళే, పెంచుకుంటున్న వాళ్ళే!

ఇక వీ.పి.సింగ్ హయాంలో నియమించబడిన మండల్ కమీషన్ తన నివేదికని 1992 లో పీ.వి.నరసింహారావు ప్రభుత్వానికి సమర్పించింది. ఎలా జరిగిందో తెలియదుగానీ ఆ నివేదికలోని అంశాలు ప్రభుత్వపరిగణనలోకి తీసుకునేముందే పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అంతే! కార్చిచ్చు రేగింది. [అగ్గిపుల్ల గీచింది వీ.పి.సింగ్ అయితే నివేదిక లీక్ ద్వారా పత్రికల వాయువు తోడయినట్లు జరిగితే సెగ భరించింది పీ.వి. ప్రభుత్వం అయ్యింది.] విద్యార్ధుల్లో అలజడి, ఉద్యమం ప్రారంభమయ్యాయి. అభివృద్ది చెందిన, అగ్రకులాల విద్యార్దులు రిజర్వేషన్లని వ్యతిరేకిస్తూ, వెనుకబడిన కులాల విద్యార్ధులు రిజర్వేషన్లని సమర్ధిస్తూ రోడ్లెక్కారు. తరగతులు బహిష్కరించారు. రోడ్డెక్కిన విద్యార్ధుల్లో కొందరు కిరోసిన్, పెట్రోలు వంటివి వంటిమీద పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నారు. 1992 తర్వాత రోజుల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో చూపినట్లుగా, కొందరు కిరాయి వ్యక్తులు విద్యార్ధుల గుంపులో కలిసిపోయి, అమాయకంగా మెతకగాకనబడిన Genuine విద్యార్ధుల్ని ఎంచుకొని, వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మాహుతిగా చిత్రించినట్లు కొన్ని సంఘటనలు జరిగాయట. అలాంటి స్ట్రాటజీల గురించి 1992 తర్వాత సినిమాల్లో, నవలల్లో ఉటంకించబడింది. అప్పటికైతే విద్యార్ధులు భావోద్రేకంతో ఆత్మాహుతికి పాల్పడటం అన్న ప్రక్రియ సమాజంలో తీవ్ర అలజడిని రేపింది. కొన్ని నిజమైన సంఘటనలు కూడా జరిగాయి.

అంతలో ఇద్దరు రాజకీయ నాయకులు శరద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ [వీరిని మండల్ సోదరులని పిలిచేవారు.] రాజకీయతెర మీదకి దూసుకొచ్చారు. ఈ రిజర్వేషన్ ఆగ్రహాజ్వాలలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడి ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేయటం మొదలుపెట్టారు. దీనితో అభివృద్ధి చెందిన, అగ్రకులాలవారు గట్టిగా BJPనీ, RSS నీ సమర్ధించటం మొదలు పెట్టారు. వెనుకబడిన కులాలలో క్రిస్టియన్స్, ఇతర మతస్థులూ ఎక్కువుగా ఉండటం, అభివృద్ధి చెందిన అగ్రకులాలలో హిందువులు ఎక్కువుగా ఉండటం ఈ సంఘటనల వెనుక నేపధ్యాలుగా మారాయి. దాదాపు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ అభద్రతా భావం పెరిగింది. ఘర్షణాత్మక ధోరణి పెరిగిపోయింది. భారతదేశం మండే కొలిమిని తలపింపజేసింది. ఆ మంటల తాలుకూ సెగలూ పొగలూ ఇప్పటికీ సమాజంలో రాజుకుంటూనే ఉండటం నేటికీ చూస్తునే ఉన్నాం. 2008 లో రాజస్తాన్ లో చెలరేగిన గుజ్జర్ల హింస దీనికి తాజా ఉదాహరణ.

ఈ రిజర్వేషన్లు లేదా సామాజిక న్యాయం అన్న అంశం గురించి చర్చించేముందు ఓ పోలిక చూద్దాం. ఉదాహరణకి కొంతమంది కలిసి ఓ పరుగు పందెంలో పాల్గొంటున్నారనుకుందాం. వారిలో కొందరు బలంగా ఉన్నారు. వేగంగా పరుగెత్తి గెలుస్తున్నారు. ఫలితాలను ఆనందిస్తున్నారు. ఫలాలను ఆరగిస్తున్నారు. మరికొందరు బలహీనంగా ఉన్నారు. వేగంగా పరుగెత్తలేకపోతున్నారు. గెలవలేకపోతున్నారు. ఫలితాలను, ఫలాలను పొందలేకున్నారు. దాంతో బలవంతులూ, బలహీనుల మధ్య తేడా నానాటికీ పెరుగుతుంది. పరిస్థితి దయనీయంగా ఉంది. అయితే ఈ స్థితిని సరిచేయటం కోసం మనమేం చేయాలి? బలహీనంగా ఉన్నవారికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అవగాహన కలిగించాలి. వారి ఆరోగ్యం మెరుగయ్యోలా చూడాలి. అన్నివిధాలా వాళ్ళు బలంగా తయారయ్యేలా చూడాలి. కానీ ప్రభుత్వ రిజర్వేషన్ల పద్దతి ఎలా ఉంది? బలంగా ఉండి, వేగంగా పరుగెడుతున్న వారి కాళ్ళు నరకడం లాగా ఉంది. దాంతో ఎవరూ వేగంగా పరిగెట్టలేరు. ఎవరూ గమ్యాన్ని చేరలేరు. సరిగ్గా ఇక్కడే కుట్రదారులు [సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిష్, అనువంశిక నకిలీ కణికుడు] వారి మద్దతుదారులైన రాజకీయనాయకులూ, కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులూ, న్యాయమూర్తులూ తమ పాత్రలు తాము నిర్వహిస్తున్నారు.

కానట్లయితే మండల్ కమీషన్ లేదా అలాంటి కమీషన్లు, వాటికి నాయకత్వం వహించే మాజీ న్యాయమూర్తుల వంటివారు ఎలా ఆలోచించాలి? అగ్రకులాలుగా పరిగణస్తున్న కులాల్లో మాత్రం పేదవాళ్ళు, ఆర్ధికంగా వెనుకబడిన వారు, బలహీనులు లేరా? BC,SC,ST లుగా గుర్తింపబడుతున్న వెనుకబడిన కులాల వారిలో మాత్రం డబ్బున్న, పరపతి ఉన్న కుటుంబాలు లేవా? అసలప్పటికే BC,SC,ST లలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన కుటుంబాలలోని తర్వాతి తరాల వారే ఎక్కువుగా రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతున్నారు. ఆయా వెనుకబడిన కులాల్లోనూ ఆర్ధికంగా వెనుకబడి నిరక్షరాస్యులుగా ఉన్నవారు అలాగే తరాలుగా ఉండిపోతున్నారు. మరి ఈ రిజర్వేషన్లు ఏవిధంగా వారిని ఉద్దరిస్తున్నట్లు? ఇప్పుటివరకూ ఏం ఉద్దరించినట్లు? అలాగే అగ్రకులాలుగా కాగితాల మీద సర్టిఫై చెయ్యబడిన కులాల్లో నిరుద్యోగులూ, దారిద్ర్యంతో బాధలు పడుతున్నవారూ ఉన్నారు. వారు బలహీనులు కారా? ఇక ఈ రిజర్వేషన్లు ఇలాగే అమలు చేసుకుంటూ వెళితే కొన్నాళ్ళ తర్వాత ఇప్పటి వెనుకబడిన కులాల వారు బలమైన వారిగా, ఇప్పటి అభివృద్ధి చెందిన కులాల వారు బలహీనులుగా మారుతారు. అప్పుడు మళ్ళీ ఈ రిజర్వేషన్ల పద్దతిని తిప్పి అమలు చేయాల్సి వస్తుంది. ఇదీ ఎలా ఉందంటే పిల్లలు ఇద్దరులో ఒకరు చాక్లెట్ తింటున్నాడనుకో రెండోవాడు ఏడిస్తే తల్లి వచ్చి మొదటివాడిని తన్ని వాడిదగ్గరి చాక్లెట్ లాక్కొని రెండో వాడికి ఇచ్చినట్లు ఉంది. అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మొదటివాడు ఏడుస్తాడు.అంతే. సామాజిక న్యాయం పేరిట ఈ సమస్య నిరంతరం రాజకీయనాయకులకు బంగారు గుడ్డిపెట్టే బాతు వంటిది.. అంతేగాని దానికి సమ న్యాయం జరగదు.

అంతేగాక, ఈవిధంగా రిజర్వేషన్ల పేరుతో అభివృద్ధి చెందిన, బలహీన వర్గాలలోని ప్రజల నైపుణ్యాలనీ, సామర్ధ్యాలనీ, తెలివి తేటల్ని ఉపయోగించకోకుండా, పట్టించుకోకుండా కేవలం ఆయా వర్గాల్లో కులాల్లో పుట్టటమే ప్రామాణీకంగా తీసుకుంటే దేశానికి ఏగతి పట్టాలి? ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో నైపుణ్యం, సామర్ధ్యం గల వ్యక్తికి, పుట్టుక కారణంగా ప్రవేశం నిరాకరించటం ఎంత వరకూ న్యాయం? అలాగే ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో, నైపుణ్యం, సామర్ధ్యం లేని వ్యక్తి, పుట్టుక కారణంగా ప్రవేశం పొందగలిగితే, దేశానికి సమాజానికి నష్టం కాదా?

నిజానికి ఇది మహాభారతంలో చెప్పబడిన విదురనీతి, నారద నీతి వంటివాటికి సరిగ్గా విపర్యయమైనది. నారదనీతి స్పష్టంగా చెప్పేవాటిలో ఒక అంశం ఏమిటంటే – పాలకుడు తన యంత్రాంగంలో నైపుణ్యం లేనివాణ్ణి, అసమర్ధుణ్ణి, అర్హత లేని వారిని ఉన్నతస్థానాల్లో నియమించకూడదు. అలాగే నైపుణ్యం, సామర్ధ్యం, అర్హత గల వారిని క్రిందిస్థానాల్లో ఉంచకూడదు. వారి వారి అర్హతలకి తగిన స్థానాల్లో వారిని నియోగించాలి. అలాగ్గాని పక్షంలో ఉన్నతస్థానంలో నియమించబడిన అర్హత లేని వ్యక్తి అహంకారి అవుతాడు. తన అహంకారంతోనూ, అసమర్ధతతోనూ, ప్రభుత్వ యంత్రాంగపు పనితీరు భగ్నపరుస్తాడు. ఉన్నతస్థానంలో ఉన్న అసమర్ధ వ్యక్తి తన అహంకారం, అసూయ, అభద్రతలతో తన క్రింది సిబ్బందిని వేధిస్తాడు. ఈవిధమైన మనోవైకల్యానికి తావిచ్చినట్లవుతుంది. అదేవిధంగా క్రింది స్థానాల్లో నియోగింపబడ్డ నైపుణ్యంగల, సమర్ధులైన వ్యక్తులూ కొన్ని మనోవైకల్యాలకు గురవుతారు. ఇలాంటివారు నిరాశకు, నిస్పృహకు [frustration and desperation] గురవుతారు. వీరు తమ పైవారికి, తోటి వారికి సమస్యలు సృష్టిస్తారు.

ఈవిధంగా మొత్తం సమాజంలోనే నెగిటివ్ భావాజాలం, ఈర్ష్యాద్వేషాలు వ్యాప్తి చెందుతాయి. అశాంతి రేగుతుంది. అందుకే నాయకులు అలా చేయకూడదని నారద నీతి చెబుతుంది. ప్రస్తుత ప్రభుత్వాలు పనితీరు సరిగ్గా దానికి విపర్యయంగా ఉంటుంది.

కొందరు దీనికి బాపూజీని బాధ్యుణ్ణి చేస్తూ బూతులు తిట్టటం విన్నాను. నిజానికి బాపూజీ గానీ, ఆ తరం నాటి నిబద్దత గల దేశభక్తులు గానీ, ఈనాటికీ ఉండి ఉంటే నిశ్చయంగా ఈనాటి రిజర్వేషన్లని వ్యతిరేకించి ఉండేవాళ్ళు. అప్పటికాలానికి, అదీ కొన్ని పరిమితులకి లోబడి అలాంటి పద్దతులు కొన్నిటికి వాళ్ళు ఆమోదించి ఉండొచ్చుగాక. కానీ మారుతున్న స్థితి గతుల్నీ, కార్యకారణ సంబంధాల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు తమ కార్యచరణని ఎప్పటికప్పుడు మార్చుకునేవాళ్ళు. అంతిమంగా ప్రజలందరికీ, పేదలందరికీ న్యాయం జరగాలి, మేలు జరగాలి అన్న నిజాయితీతో వాళ్ళు పనితీరు ఉండేది గాని, ఆ పేరుతో దోపిడి చేయాలను కొనేవారు కాదు. కావాలంటే ఈనాటి సంఘటనలని పరిశీలించి చూడండి. రిజర్వేషన్ కోటాలో నైనా లంచం పెట్టకుండా ఉద్యోగం గానీ, విద్యాలయంలో సీటుగాని ఎందరికి వస్తుంది? ఆ లంచపు సొమ్ము క్రింది నుండి పైనున్న మంత్రులూ, ముఖ్యమంత్రులూ, కుర్చీవ్యక్తుల దాకా ప్రయాణిస్తున్నదే గదా!

నిజానికి ప్రభుత్వం కులాలకు, మతాలకు అతీతంగా పేదల, నిరక్షరాస్యుల, అన్ని రకాలుగా వెనుకబడిన ప్రజల గురించి శ్రద్దతీసుకోవాలి. కులాలు, మతాలకు అతీతంగా పేద వారందరూ ఉచితంగా, నాణ్యమైన విద్య, వైద్యం, పొందగలగాలి. [మా చిన్న తనంలో ప్రభుత్వ పాఠశాలలో, వైద్యశాలల్లో ఉచితంగా అందుకున్న మంచి విద్య, వైద్యాల్ని మంటగలిపి, ఇప్పుడు పేదలకు కార్పోరేట్ విద్య, పేదలకు కార్పోరేట్ వైద్యం, [ఆరోగ్యశ్రీ] పేరుతో జనంసొమ్ము అప్పనంగా కార్పోరేట్ సంస్థలకు మప్పబెడుతున్నారు] పేదవిద్యార్ధులందరికీ ఉపకార వేతనాలు ఇవ్వాలి. అందుకు వారి కృషీ తెలివితేటలను ప్రామాణికంగా తీసుకోవాలి గానీ వారి పుట్టుక అంటే కులాన్ని లేదా మతాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒకవ్యక్తి సబ్జెక్టులో తన ఙ్ఞానం, సమర్ధతా, మార్కుల కారణం గాకుండా, అతడి కులం కారణంగా డాక్టరు అయ్యాడనుకొండి. అతడి అసమర్దతా, అసంపూర్ణ ఙ్ఞానం, సబ్జెక్టు మీద అనవగాహన కారణంగా అతడి చేతిలో పేషంట్లు చచ్చిపోతే ఆ చావుకి బాధ్యులెవరు? అలాగే ఒకవ్యక్తి సబ్జెక్టులో ఙ్ఞానం, సమర్ధతా, మార్కులు కాకుండా, కులపు రిజర్వేషన్ కారణంగా ఇంజనీర్ అయ్యాడనుకొండి. అతడి అసమర్ధతా, అయోగ్యత కారణంగా అతడు కట్టిన ఓ ప్రాజెక్ట్ కూలిపోతే ఎవరు ఆ నష్టానికి బాధ్యులు?

కొందరు ఇలా వాదిస్తుంటారు – “శతాబ్ధాలుగా కొందరు అగ్ర[?]కులాల వారు మరికొన్ని నిమ్న[?] కులాల వారిని అణగ ద్రొక్కారు. వాళ్ళని చదువుకి దూరం చేసారు. కాబట్టే ఈనిమ్న కులాల వారు వెనుకబడినపోయారు. అందుచేత జెనిటిక్ గా వారి ఙ్ఞానం, అవగాహన, అగ్రకులాల వారితో పోటీ పడగలిగే విధంగా లేదు. కాబట్టి నిమ్న కులాల వారికి, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు తప్పనిసరి”. నిజానికి ఇది కుట్రదారులు వ్యాప్తిలోనికి తెచ్చిన వాదన. మళ్ళీ వాళ్ళే శతాబ్దాల క్రితం అగ్రవర్ణాలుగా పిలవబడిన బ్రాహ్మణాది కులాల వారు నేర్చిన, నేర్పిన వేదవిద్య, సంస్కృత వాఙ్ఞ్మయం పనికి మాలినదిగానూ, పురాణేతిహాసాలు అభివృద్ధి నిరోధకాలుగానూ నిందిస్తారు. అలాంటప్పుడు, అలాంటి పనికిమాలిన విద్యకీ, ఏదైతే బ్రాహ్మాణాది అగ్రకులాల వారు నిమ్నజాతుల వారికి దూరం చేసారో అలాంటి, అభివృద్ధి నిరోధక విద్యకీ, దూరమై, నిమ్న కులాల వారు పోగొట్టుకున్నది మాత్రం ఏముందని? అలాంటప్పుడు వారు జెనిటిక్ గా సరైన attitude తో లేరనీ, learning abilities తక్కువనీ, కాబట్టి రిజర్వేషన్లు ఉండాలని వాదించటం ఎంత వరకూ సబబు?

ఈ అసంబద్దతని పక్కన పెడితే, వారి వాదనకి సమాధానం ఇదీ – ఒకవేళ వెనుకబడిన కులాల వారు జెనిటిక్ గా ఙ్ఞానంతోనూ, సామర్ధ్యంతోనూ ఓపెన్ కేటగిరీ వారితో పోటీపడలేనట్లయితే, దానికివ్వవలసింది రిజర్వేషన్ల పేరిట ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు కాదు. ఎందుకంటే ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు ఙ్ఞానాన్ని, సామర్ధ్యాన్ని ఇవ్వవు కదా? వారికివ్వాల్సింది ఉచిత విద్య, వారి[Attitude] ఆలోచనా పరిధిని మార్చే విశ్లేషణాత్మక చర్చలూ, వ్యక్తిత్వవికాసమూ. ప్రభుత్వం, మేధావులు, స్వచ్ఛందసంస్థలూ అందరూ కలిసి వారి అవగాహన పెరిగేటట్లు వారిని ప్రభావితుల్ని చేయాలి. వారు తమని తాము అభివృద్ధి చేసుకోవాలని, తమ జీవితాన్ని మార్చుకోవాలని, అందరితో పోటీపడి ఆత్మగౌరవంతోనూ, పౌరుషంతోనూ పందెం గెలిచి ఫలాలు పొందే వరకూ శ్రమించేవిధంగా వారిని స్ఫూర్తివంతం చెయ్యాలి, చైతన్య వంతం చెయ్యాలి. అంతేగానీ మాటల్లో ఆత్మగౌరవం వల్లించేటట్లూ, మనోభావాలంటూ, కులం పేరుతో తిట్టారని కేసు పెడతాము జాగ్రత్త అంటూ బ్లాక్ మెయిల్ చేసే అతి తెలివి చూపించేటట్లు వారిన్ని లీడ్ చెయ్యకూడదు. మానసికంగానూ, శారీరకంగానూ, సాంఘికంగానూ, వారు తమని తాము ఉద్దరించుకోగలిగేలా, ఉన్నతస్థితికి మారాలనే విజిగిష కలిగి ఉండేలా వారిని చైతన్యవంతుల్ని చెయ్యాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం వారి పేరిట ఖర్చు పెట్టే కోట్లాది రూపాయులు – వారి కులనాయకుల, ఆపైన గల రాజకీయనాయకుల జేబుల నింపి, నల్ల ధనంగా మారకుండా సరైన ఫలితాలిస్తుంది. అప్పుడు వారిజీవితాలు కూడా నిజమైన బాగుని చూస్తాయి. అప్పుడు మాత్రమే ఆయా బలహీన వర్గాలకు చెందిన అట్టడుగు ప్రజలు [already reservations ఉపయోగించుకోవటం చేతనైన వారు ఇప్పటికే ధనిక వర్గాలుగా పరిణమించి ఉన్నారు] . తమకోసం, తమ సంక్షేమం కోసం ఉద్దేశింపబడిన ప్రభుత్వపధకాల సొమ్ముని ప్రభుత్వ అధికారులతో పంచుకొని దుర్వినియోగం చేసుకోరు. ప్రభుత్వాధికారులూ, రాజకీయనాయకులూ చేసే మోసంలో పావులై, తమ వాటాగా చిన్న మొత్తాలు పుచ్చుకొని, శాశ్వతమైన అర్ధవంతమైన ప్రయోజనాన్ని వదిలేసుకోరు.

అంతేగాక – పైన చెప్పినట్లు ‘వేల సంవత్సరాలుగా అణచి వేతకు గురయ్యారు కాబట్టి, వెనుకబడిన కులాల వారిలోఙ్ఞానం, అవగాహన, సమర్ధత OC వారితో పోటీపడగలిగే స్థాయిలో లేదు’ అనడం నిజంగా ఆయా కులాల వారిని అవమానించడం వంటిదే. అది వారి ఆత్మగౌరవానికి భంగకరం కాదా? మరో వైపు చూసేటట్లయితే 1200 ఏళ్ళుగా ఇతరదేశాల నుండి వచ్చిన ముస్లింలూ హిందువుల మీద పెత్తనం చెయ్యటానికీ, అణచివేయాటానికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 400 ఏళ్ళుగా విదేశాల నుండి వచ్చిన క్రిస్టియన్లు అదే ప్రయత్నం చేస్తున్నారు. మరి భారతీయులు, హిందువులూ తమ ఙ్ఞానం, సమర్ధత, అవగాహన జెనిటిక్ గా అణచి వేయబడ్డది అంటున్నారా? అందుకు రిజర్వేషన్లు కావాలి అంటున్నారా? ఐ.టి.విప్లవమో, మరో అవకాశమో వస్తే తమ కృషీ, శ్రమా, తెలివితేటలు పెట్టుబడి పెట్టి అవకాశాన్ని అందుకుంటునే ఉన్నారుకదా! అదేపని అందరూ చేయాలి గదా! అది వదిలేసి వెనుకబడిన వర్గాలు BC, SC, ST లంటూ, బలహీన వర్గాలు [ముస్లింలు] అంటూ రిజర్వేషన్ల స్ట్రాటజీ ఎందుకు? ఖచ్చితంగా ఇది ‘Divide and Rule policy’ కి మరోరూపం మాత్రమే.

ఇక చతుర్వర్ణ వ్యవస్థని గీత సమర్ధించిందంటూ మరో అసత్యవాదన ఉంది. దాని గురించి ఆంగ్లంలో Coups On World లోని Application of Geetha…… లో చర్చించాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

5 comments:

చాతుర్వర్ణ వ్యవస్ధ గీతలో చెప్పింది వేరు,ఇప్పుడు ప్రచారంలో ఉన్నది వేరు. నిజాలను తెలుసుకోవాలంటే చదవాలి. కానీ మనం చదవం, ఏ తాపీ ధర్మారావో,రంగనాయకమ్మో చెప్పింది మాత్రం హృదయంలో పచ్చపొడిపించేసుకుంటాం. ఇక అంతే దాంట్లో ఇలా చెప్పారంట, అలా చెప్పారంట అని ప్రచారం.... మనం మన గ్రంధాలు చదవడం నామోషీ అనుకునేంతగా ప్రభావితం చెయ్యబడ్డాం.
కనీసం కళారూపాలు కూడా దరిచేరకుండా బతుకుతున్నాం.

రిజర్వేషన్ల విషయంలో నేనేమి ఆలోచిస్తానో సరిగ్గా అవే సంగతులు మీరు రాసారు. రిజర్వేషన్ల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయినవారి జాబితాలో చాలా మంది ఉన్నారు. నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. రిజర్వేషన్ల వల్ల బాగుపడిన వారినీ చూసాను. కానీ స్వశక్తిని నమ్ముకోకుండా ఇలా అడ్డదారిలో పైకి వద్దామనుకునేవారికి నేనెప్పుడూ వ్యతిరేకం...
చెడ్డ పని వల్ల నలుగిరికి మేలు జరిగి ఉండవచ్చుగాక. కానీ చెడు మాత్రం చెడే... దాని వల్ల ఈ నలుగురు స్వశక్తిని నమ్ముకోక అడ్డదారులు, విజయానికి దొంగదారులు అన్వేషిస్తారు , మొత్తానికి ఇది సమాజ పతనానికి దారి తీస్తుంది.

రిజర్వేషన్ల ముఖ్యోద్దేశం కులాల మద్య అంతరం తగ్గించడం. కానీ ఇవేమి చేస్తున్నాయి? కులాల మద్య అంతరాన్ని కుమ్ములాటలను పెంచి, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ( సామర్ధ్యం లేని వాడు పెద్ద పదవులు పొందడం వగైరా)

మీరు ఒక విషయం గమనించాలి. ఈ రిజర్వేషన్ల వెనక వున్న మహా కుట్రను చూడండి.
సమాజం లో ఎక్కువ సంఖ్యలో వున్న వారు ఆలోచించడం మొదలు పెడితే దోచుకునేవాడికి మనుగడ వుండదు. అందుకని వారి ఆలోచనలని ఆపాలంటే తెలివిని కట్టడి చేయాలి . నువ్వు ఇంతే చదువు నీకు యేది కావాలన్న దొరుకుతుంది అన్నపుడు ఆలొచన సాగదు. కావల్సింది అదే.
ఇది సానుకూలం చేసి పబ్బం గడుపుంటే సరి.
అమాయకులు ఇది మేలు అనుకుని అణగారి మెదడుని తెలివిని అమ్ముకుని ఆనందిస్తున్నారు.

u can use my posts on caste system.
i proved with examples that today's degraded caste system is not what is prescribed in vedas.
i gave a historical analysis with most neutral sources.
http://vaidikadharmam.blogspot.com/2009/02/blog-post_13.html
http://vaidikadharmam.blogspot.com/2009/02/blog-post_11.html

"సమాజం లో ఎక్కువ సంఖ్యలో వున్న వారు ఆలోచించడం మొదలు పెడితే దోచుకునేవాడికి మనుగడ వుండదు."

సమాజం మనుగడ ఎంతమంది ఆలోచిస్తారని కాదు, ఎలాంటి ఆలోచనలు చేస్తారన్నదాని మీద ఆధారపడి ఉంటుంది.

మంది ని గురించి మాట్లాడే ది డెమాక్రసి. డెమాక్రసి సైంటిఫిక్ కాదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu