ఎన్టీఆర్ ’సువర్ణముఖి’, ఎన్టీఆర్ కి, ఆతడి జీవిత చరమాంకంలో ‘లక్ష్మీపార్వతితో వివాహం’ అన్న బహుమతిని ఇచ్చింది. ఇది ప్రజానీకానికి బహిర్గతం అయ్యింది 1993, సెప్టెంబరులో కావచ్చు గాక! కానీ దీనికి అంకురార్పణ 1992 జూన్ తర్వాతే జరిగింది. ఈ పెళ్ళి అనే రసవత్తర అంకానికి స్ర్కిప్టు రచయితా, దర్శకుడూ, పురోహితుడూ అన్నీ రామోజీరావే! అయితే రామోజీరావుకి, ఎన్టీఆర్ కి అతడి 71 ఏళ్ళ వయస్సులో మరో పెళ్ళి చేయవలసిన అవసరం ఎందుకొచ్చింది? రామారావుకి సైతం ఆ వయస్సులో ’పెళ్ళి’ అవసరం ఎందుకొచ్చింది? రెండో ప్రశ్నకి జవాబు మొదటి ప్రశ్నకు పైకారణం[over leaf reason] వంటిది మాత్రమే.
అప్పట్లో రామారావు ఎందుకు లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకున్నాడు? అన్న సందేహంకు సమాధానంగా బయటికొచ్చిన కథనం ఇది – 1989 లో అధికారం కోల్పోయాక క్రమంగా రామారావు ఇంట్లో నిరాదరణకి గురయ్యాడట. పార్టీకి అతడే ఆధారం. అతడి కుటుంబసభ్యులకి, కూతళ్ళకీ, అల్లుళ్ళకీ, కొడుకులూ, కోడళ్ళకీ అతడే ఆస్తి దాత, సర్వదాత. మరి ఎలా, ఎందుకు నిరాదరించారో వారికే తెలియాలి. అందునా ఇప్పుడు తమ తండ్రి లేదా మామని ఇంద్రుడూ, చంద్రుడూ అంటూ తెగపొగిడేసే హరికృష్ణ, బాలకృష్ణ వంటి అతడి పుత్రులూ, పురందేశ్వరి వంటి కూతుళ్ళూ, దగ్గుబాటి, నారా చంద్రబాబునాయుడి వంటి అల్లుళ్ళకి ఆ మతలబు బాగా తెలిసి ఉండాలి. ఏదైతేనేం -1987 నుండి భర్త వీరగంధం సుబ్బారావు సహితంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర వ్రాస్తానంటూ ఎన్టీఆర్ వెంటబడి అనుమతి సాధించుకున్న లక్ష్మీపార్వతి అనబడే ఈ హరికథా కళాకారిణి, [ఈవిడ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగా కూడా పనిచేసిందట] 1992 నుండి 1993సెప్టెంబరులోపల కుటుంబ సభ్యుల నిరాదరణతో కృంగిపోయి, అనారోగ్యంతో బాధపడుతూ, నిరాశా నిస్పృహల వలయంలో చిక్కుకున్న ఎన్టీఆర్ కి, సేదతీర్చే స్నేహపు చెలిమ, సేవలందించిన ఆత్మీయ చెలియా అయ్యిందట. దెబ్బతో, లక్ష్మీపార్వతి తొలిభర్తకు విడాకులిచ్చేసింది. ఎన్టీఆర్ వీరలెవెల్లో కొడుకులూ, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళకూ హోల్ సెల్ గా తన ప్రతీకారపు దెబ్బచూపిస్తూ, ద్వితీయ వివాహం బాంబుపేల్చాడట. అందునా అతడి ఆస్థిపాస్థులన్నీ స్వార్జితాలయ్యె. ఆ తర్వాత లక్ష్మీపార్వతి వదినగా, అన్నగారి సామ్రాజ్యాన్ని ఏలేయటం, అది సహించలేక చంద్రబాబు తిరుగుబాటు లేవదీసి ఎం.ఎల్.ఏ.లని సామ్రాట్ హోటల్ లో దాచేయటం – అన్నీ తెలుగు ప్రేక్షక ప్రజలకి బాగానే గుర్తుండే అంశాలు, అంకాలు. ఈ పైకారణానికి[over leaf reason] లోపల ఉన్న గూఢచర్యపు అసలు కారణాలు ఏమిటంటే –
భారతదేశం పైనా, ప్రపంచంపైనా, అప్పటికే శతాబ్ధాలుగా పరుచుకున్న, పటిష్టమైన గూఢచార నెట్ వర్కుతో, నకిలీ కణికుడి నేతృత్వంలోని నెం.10 వర్గం, తమ ఉనికి, అస్తిత్వం తెలియకుండా, రహస్యంగా చరిస్తూ, నమ్మించి ద్రోహం చెయ్యటమే ’గొప్ప’గూఢచర్యం అన్నది. ‘మిత్రుల్లా ఉంటూ సమాచారాన్ని సేకరించి తమకి అనుకూలంగా ఉపయోగించుకోవటం, తమ లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తుల్ని, జాతుల్ని, దేశాల్ని నాశనం చేయటమే గూఢచర్యం’ అన్నది వాళ్ళ భాష్యం. అయితే పీవీజీ, గూఢచర్యానికి అసలు నిర్వచనాన్ని నకిలీకణికుడి చేత చదివింపించారు. నిక్కచ్చిగా చెప్పాలంటే నకిలీ కణికుడి వ్యవస్థ చేత బట్టీ వేయించాడు.
అప్పటి వరకూ నకిలీ కణికుడి దృష్టిలో నమ్మించి మోసం చెయ్యటం, రహస్యంగా కుట్రలు పన్నడం, మిత్రుడి ముఖం పెట్టుకుని, అదను చూసుకుని ఎదుటి వ్యక్తి పీక కొయ్యటం [కుట్రపన్నటం పీక కొయ్యటం వంటిదే] గొప్ప వీరత్వమా? అది గొప్ప సామర్ధ్యమా? చెప్పితన్నటం, ప్రకటించి యుద్ధం చెయ్యటం ‘క్షాత్రధర్మం’. అది భారతీయతత్త్వం. భారతీయులు [ఇతిహాసాల దగ్గర నుండి చారిత్రాకాల వరకూ] గూఢచర్యాన్ని ఆత్మ రక్షణకు, మాతృదేశ రక్షణకు, సమాజంలో ధర్మపరిరక్షణకు, చెడుని గుర్తించి శిక్షేంచేందుకు ఉపయోగించటమే ధర్మమనే నమ్మకం గలవారు. వెన్నుపోటు పొడవటం, యుద్ధంలో పారిపోవటం కంటే నీచమని విశ్వసిస్తారు. భారతీయుల దృక్పధం ఇప్పుడెంతగా కలుషితం అయ్యిందనుకున్నా, మూలాల్లోని భావజాలం ఇదే. వెయ్యేళ్ళ క్రితం, ఈ గడ్డమీదకి ఆఫ్ఘాన్ తురక ముష్కరులు, ఆపైన యూరపు సముద్రపు దొంగలు రాకముందు, భారతీయుల రక్తంలోని ఈ దృక్పధం, భావజాలం మరింత బలంగా ప్రస్ఫుటంగా ఉండేది.
అయితే బహుభాషా పండితుడు, ఇతిహాసాలని, సనాతన ధర్మాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవాడూ అయిన పీవీజీ, శతృవు ఎవరో తెలియకపోయినా అలుపెరగకుండా పోరాడిన యోధుడు! ఆధునిక భారతీయ స్వాతంత్ర సమరవీరులకు నిజమైన వారసుడు.
అందుచేత, పీవీజీ, ఆయన నేతృత్వంలోని భారతీయ నిఘా సంస్థలకి, ఎప్పుడైతే తామింత వరకూ వెతుకుతున్న శతృవు ఉనికి స్పష్టపడగానే, నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ గూఢచార వలయపు ఆస్తిత్వం దృగ్గోచరమై, దృష్టాంతపూరితంగా నిరూపితంకాగానే, నెం.5 వర్గాన్ని సమీకరించి, సమాయత్తం చేసుకున్నారు. అదే సమయంలో, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి, రామోజీరావుకీ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఈ మొత్తం గూఢచర్యాన్ని వ్యక్తులతో సహా, సాక్ష్యాలతో సహా నిరూపించటమే లక్ష్యం! వారిని రెడ్ హాండెడ్ గా నిలబెట్టటం పైనే గురి. అందుచేత ’దొరికిపోయావ్’ అన్న హెచ్చరిక చాలా నిక్కచ్చిగా ఇచ్చారు. “నీ వేలితో నీ కంటినే పొడిపిస్తాం. అదీ చెప్పి మరీ పోరు సాగిస్తాం. నీలాగా రహస్యంగా కుట్రలు పన్నటం కాదు. ఇక ఈ క్షణం నుండీ యుద్ధం, అదీ గూఢచర్య యుద్ధం ప్రారంభమే. ఇన్నాళ్ళూ మాకు నువ్వెవ్వరో తెలియదు. ఇక నీ స్ట్రాటజీ ఏమిటో తెలిసే అవకాశమే లేదు. అయినా ఆత్మరక్షణ చేస్కున్నాం. ఎదురు పోరాడి నిలబడ్డాం. ఇక ఇప్పుడు నీవంతు! నీలాగా రహస్యంగా మేమెవ్వరో తెలియకుండా కూడా మేం గూఢచర్యం చేయం. అందుకే ఇదిగో నీ ఉనికి మాకు తెలిసిపోయింది అని చెబుతున్నాం. ఇక కాస్కో! ఇన్నాళ్ళు, నీవు అల్లుకున్న నెట్ వర్కు , గూఢచర్య వలయాన్ని తుత్తునియలు చేస్తాం. నీ సామ్రాజ్యాన్ని నీచేతే కుప్పకూల్పిస్తాం. నీ ఏజంట్లని, నీ పావుల్ని నువ్వే చావగొట్టేలా చేస్తాం. ప్రతీ క్షణం ’కన్నా?, కాలా? దేన్ని వదులుకుంటావు?’ అనే స్థితే ఇకనీకు! మాదేశాన్ని, మంచినీ, మతాన్ని, మానవత్వాన్ని, ధర్మాన్ని ఎలా రక్షించుకుంటామో, నిన్నూ, నీ వాళ్ళని ఎలా శిక్షిస్తామో చుద్దువు గాని” అన్నదే ఆ హెచ్చరిక. [పీవీజీ పరిభాషలో ఆయుధాలతో గాక, మెదళ్ళతో యుద్ధం చెయ్యటమంటే ఇదే!]
దీనికి పైమాటగానే, ఆనాడు పీవీజీ ’చట్టం తన పని తను చేసుకుపోతుంది’ అన్నారు. దాన్నే మనం ఇప్పుడు బోలెడు సినిమాల్లో కమేడియన్లు సైతం వాడటం విని నవ్వుకుంటున్నాం. అయితే గడియారపు లోలకం మీద జైలుకీ ఇంటికీ తిరిగిన లాలూ దగ్గరనుండి [‘నామీద చెయ్యివేస్తే బీహార్ లో రక్తం ఏరులై పారుతుంది’ అని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించిన తదనంతరమే, అతడు జైలుకీ, ఇంటికీ పింగ్ పాంగ్ బాల్ లా తిరిగాడు, దాణాకేసు నిమిత్తమై! రబ్రీదేవి అయితే కంటికి మంటికీ ధారపాతంగా, బాహుటంగా ఏడ్చింది. అంత భయం ఎందుకు కలిగినట్లు?] కబ్ తక్ సమోసా మే ఆలూ, తబ్ తక్ బీహార్ మే లాలూ అనే లాలూప్రసాద్ యాదవ్ మీద, పైన చెప్పిన ‘గడియారపు లోలకం మీద కూర్చొని జైలుకీ, ఇంటికీ తిరుగుతున్నట్లు’ కార్టూన్ ప్రచురించుకున్న రామోజీరావు దాకా, అద్వానీల నుండి నకిలీ కణికుడి అంతర్జాతీయ ఏజంట్ల దాకా’ అందరికీ మాత్రం పీవీజీ ఆనాడు తెగేసి ప్రకటించిన ’చట్టం తనపని తను చేసుకుపోతుంది’ అన్న డైలాగ్ అంటే గుండెదడే! ఎందుకంటే తను బ్రతికి ఉన్నా, లేకపోయినా వ్యవస్థ[చట్టం] పనిచేస్తూంది అన్ని చెప్పటమే ఆయన ఉద్దేశం.
’కన్నా? కాలా? దేన్ని వదులుకుంటావు?’ అన్న స్ట్రాటజీ వివరించేటందుకు ఓ పోలిక చెబుతాను. మనం చదరంగం ఆడేటప్పుడు వేసే ఎత్తు పై ఎత్తుల్లో, ఒకవేళ ప్రత్యర్ధి వేసిన ఎత్తుగడ ఫలితంగా గుర్రం, శకటాల్లో దేన్నో ఒకదాన్ని వదులుకోవలసి వస్తే ఏంచేస్తాం? గుర్రాన్ని అట్టిపెట్టుకుని శకటం వదిలేసుకుంటాం. తదుపరి గుర్రం, మంత్రి – ఈ పావుల్లో దేన్నో ఒకదాన్ని వదులుకోవాలంటే ఈసారి గుర్రాన్ని వదిలేసి మంత్రివైపు మొగ్గుతాం. అలాంటిదే ఈ స్ట్రాటజీ. ఒక ఏజంట్ అవుట్ అయ్యాడంటే, మరొకడ్ని కాపాడుకునేందుకు లేదా మరో స్ట్రాటజీని కాపాడుకునేందుకు, ఈ ఏజంట్ ని అతడి ఏజన్సీ వదిలేసుకుందన్న మాట. అంటే బలిచ్చేసుకుందన్నమాట. అటువంటిది రామోజీరావుని సి.ఐ.ఏ.గానీ, మరో దేశపు ఏజన్సీ గాని వదులుకోవటం లేదంటే, అతడు ఏజన్సీలకి అతి ముఖ్యమైన ’కన్ను’ అయి ఉండాలి. ఏజన్సీలు కూడా బహిర్గతమై బలవుతున్నాయి గానీ రామోజీరావుని మాత్రం వదులుకోవటం లేదు. అంటే అసలు ఏజన్సీలే కాలు వంటివైతే రామోజీరావే కన్నులాంటి వాడు కాబోలు, నకిలీ కణిక వ్యవస్థకి! అంతేకాదు. ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. అది ఏమిటంటే – చదరంగం భారతీయుల ప్రాచీన క్రీడ. అందులో గూఢచర్యం వంటి ఎత్తు పైఎత్తులే కాదు, మేధోవికాసం, Theory of Probability పేర గణికశాస్త్రంలో బోధించే subject కంటే కూడా నిశితమైన probabilities ని practical గా నేర్పించే క్రీడ. చురుకుదనాన్ని, తార్కికతని, కార్యకారణ సంబంధ విశ్లేషణనీ విశేషంగా నేర్పే ఆట అది. అయితే, అది క్రమంగా భారతీయుల చేయి జారి, రష్యా అగ్రగామియైన స్థితి 1992 వరకూ ఉంది. 1992 తర్వాతే, మనం విశ్వనాధన్ ఆనంద్ ల గురించీ, హంపీ, హారికల గురించీ, హరికృష్ణల గురించీ వింటున్నాం.
సరిగ్గా చదరంగంలో చెప్పిన గుర్రం Vs శకటం, మంత్రి Vs గుర్రం వంటి ప్రక్రియే – ‘కన్నా?, కాలా?’ అన్న స్ట్రాటజీ! కన్నో, కాలో ఏదో ఒకటి బలిగా ఇచ్చుకుని ప్రాణాలు కాపాడుకోవలసిన స్థితి వస్తే, ఏమనిషి అయినా ఎక్కువగా కాలే వదులుకుంటాడు. [లేదా అతడికి కాలే అవసరం అన్పిస్తే కన్ను వదులుకుంటాడు.] అంటే A,B అనే ఏజంట్లలలో ‘A’ ని కన్ను అనుకుని,[అంటే ఎక్కువ ఉపయుక్తకరం అనుకుని], ‘B’ ని కాలుగా పరిగణించి [అంటే తక్కువ ఉపయోగం అని] సదరు ఏజన్సీ వదులుకున్నదనుకొండి. అప్పటికి ఆ ఏజన్సీకి ‘B’ అనే ఏజంటు నష్టం. [ఏజన్సీకి ఒక ఏజంటుని వదులుకోవటం అంటే కష్టమే. శిక్షణ ఇచ్చి, పనిలో ఢక్కా మొక్కిలు తిని Assignments నిర్వహించటంలో యదార్ధ అనుభవం పొంది ఉన్న ఏ ఏజంటుని వదులుకోవటానికీ ఏజన్సీ తొందరగా ఇష్టపడదు. ఎందుకంటే ఏజంట్లే ఆస్థులు ఏజన్సీలకి. ఏజంట్లు ఉంటేనే కదా ఏ స్ట్రాటజీ అయినా నిర్వహించగలిగేది, ఆస్థులు సమకూర్చుకోగలిగేది?] అయితే, తదుపరి కాలంలో ‘A’కి పోటిగా మరో ’C’ అనే ఏజంటుని తెస్తుంది ప్రత్యర్ధి ఏజన్సీ. అంటే మళ్ళీ ‘A’ యొక్క ఏజన్సీ ‘A’ మరియు ’C’లలో ’C’ కనుక కన్ను వంటి వాడైతే ఈ సారి ‘A’కి నూకలు చెల్లినట్లే. దెబ్బతో ‘A’ కెరియర్ మటాష్ అయిపోతుంది. అంటే A,C లలో వారి ఏజన్సీ ఈసారి ‘A’ని వదిలేసుకుని ’C’ని కాపాడుకుంటుందన్న మాట.
అయితే ఈ ఒరవడిలో, క్రమంగా, సదరు ఏజన్సీ యొక్క పావులన్నీ[ఏజంట్లందరూ] A to Z ఛస్తాయన్న మాట. ఈ క్రమంలో ఏజన్సీ బలహీనమూ అవుతుంది, బహిర్గతమూ అవుతుంది. ఎందుకంటే ప్రత్యర్ధి ఏజన్సీ [అంటే నెం.5 అనుకోవచ్చు] A మరియు B లకి ఎసరుపెట్టటం అంటే భౌతికంగా కాదు, Expose పరంగానే అవుతుంది. అలాగే A, B ల ఏజన్సీ[అంటే నెం.10 అనుకోవచ్చు] A,B ని వదులుకోవటం అంటే అదీ భౌతికంగా కాదు, కెరియర్ పరంగానే. ఇక B fade out అయిపోతాడన్న మాట. సదరు ఏజన్సీకి ఇక ఎందుకూ పనికి రాకుండాపోతాడు. అది గూఢచారికి మరణం వంటిదే!
ఈ స్ట్రాటజీలో భాగంగానే – నకిలీ కణికునికీ, రామోజీరావు కీ, మారిన గూఢచర్య రంగంలో, ఎన్టీఆర్ ‘కాలు’ లాగా, చంద్రబాబునాయుడు ‘కన్ను’ లాగా కనబడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి స్థితిగతులు వేరు. ఇప్పటి స్థితి గతులు వేరు. చంద్రబాబుతో పోలిస్తే, ఎన్టీఆర్ గూఢచర్యం విషయంలో అంతగా సమర్ధుడు కాదు. బాహాటంగా దేశ ద్రోహానికి తలపడేంత దుర్మార్గం, గుండె దిటవూ కూడా ఎన్టీఆర్ కు లేవు. సినిమా రంగంలో గాడ్ ఫాదర్ లు ఉండటం సహజ ప్రక్రియ అయిపోయింది గనుక, అది అతడికి జీర్ణమైపోయింది. రాజకీయాల్లో కుతంత్రమూ జీర్ణమయ్యాయి. ‘ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచెయ్యగల ఇమేజ్ ఉన్నది’ అన్న పైకారణం[overleaf reason] తనకి వైట్ హౌస్ నుండి ఆహ్వానం తెచ్చిపెట్టింది అనుకున్నాడు. అంతేగాని అందులోని గూఢచర్యపు లోతు, సాంద్రత అంతగా తెలిసిన వాడు కాదు. పరిస్థితి లోతుగా తెలిసి, దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్పడటం అంటే – అతడికి అంత సామర్ధ్యము లేదు. నటనావృత్తిలోనే ముసలివాడవ్వటం చేత అంత జవసత్వాలూ లేవు. నటుడిగా తనకున్న ఇమేజ్ పట్ల స్వాతిశయంతో, చాలాసార్లే, ఇతడు నకిలీ కణికుడి చేతిలో, రామోజీ రావు చేతిలో, చావుదెబ్బలు తిన్నాడు. ఓసారి ’బాలయ్యే నా వారసుడు’ అంటూనూ, ఆ వెంటనే నాలుక కరుచుకుంటూనూ, చాలాసార్లు ’సరి దిద్దబడ్డాడు’, అదీ గాక నటుడూ, కళాకారుడూ అయినందున, ఎంత బండవాడైనా, చంద్రబాబు వంటి గుండెలు తీసిన బంటుతో పోలిస్తే సున్నిత హృదయుడే. పైగా మొండివాడు. మొండివాడు తన వాదనని పదేపదే విన్పించ ప్రయత్నిస్తాడు గానీ, ఎదుటి వారి వాదనని విన్పించుకునే ప్రయత్నం చెయ్యడు.
అందుచేత 1992 లో మారిన గూఢచార నేపధ్యంలో, పీవీజీ, నెం.5 ఇచ్చిన అల్టిమేటంతో నకిలీ కణికుడికి ‘ఎన్టీఆర్ ని తెరమీద ఉంచి తెరవెనుక చిన్నలుడి మంత్రాంగం’ చాలని స్థితి ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ ని అడ్డుతొలిగించుకోవటం అప్పటికి అవసరం అయ్యింది. ఇక స్ట్రాటజీ రచింపబడింది, అమలు జరపబడింది. అదే లక్ష్మీపార్వతిగా రూపం దిద్దుకుంది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
1 comments:
చాలా బాగా చెప్పారు
Post a Comment