’నకిలీ కణిక వ్యవస్థ గురించిన ప్రతిపాదనలు’ అనబడే నా ఈ టపాల పరంపర ప్రారంభించినపుడు, ఈ ప్రతిపాదనలకు నిదర్శనాలు[practical verification] చూపిస్తానని వ్రాసాను. శాస్త్రీయంగా కూడా, ముందుగా ప్రతిపాదించిన సిద్దాంతాలను Facts కు లేదా circumstantial కు అనువర్తించి, ఆ సిద్దాంతం సరైనదో కాదో తేల్చుకుంటారు కదా! అదే పద్దతిని ఈ విషయంలో అనుసరిస్తున్నాను. ’ఇకపోతే ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి?’ అన్న మీ సందేహాన్ని, ఈ టపాల మాలిక చివరిలో తీరుస్తాను. ఇప్పుడు… ఒకో స్ట్రాటజీ, ఒకో దేశం, ఒకో వ్యక్తి, లేదా ఏజంట్ ఏవిధంగా బహిర్గతం[expose] అయ్యారో, అందులో ఉన్న తాత్విక తంత్రమూ[Philosophical strategy] , గూఢచార తంత్రమూ కూడా, మీకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ ఎవరికైనా ఓ సందేహం కలగవచ్చు. ’అసలెందుకు ఇలా ఏజంట్లనీ, వాళ్ళ స్ట్రాటజీని బహిర్గతం చేయటం? ఎవరు ఈ కుట్రలు చేస్తున్నారో, వాళ్ళ ఉనికి తెలిసినప్పుడు వారిని చట్టపరంగా శిక్షించవచ్చు గదా?’ అనిపించవచ్చు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఏజంటు, వారి కార్యకలాపాలు, వారి స్ట్రాటజీలని expose చెయ్యకుండా శిక్షించటం అంటే, దానికీ, ఎమర్జన్సీకి తేడా ఉండదు. అప్పుడు బలం నకిలీ కణిక వ్యవస్థదే అవుతుంది. అంతేకాక ఎలా నిరూపించాలి? ఏ సాక్ష్యాధార పత్రాలు, వీడియో టేపులు చూపాలి? ఇవి ఏవి చూపినా, ‘ప్రభుత్వం తల్చుకున్నప్పుడు ఎలాంటి సాక్ష్యాలయిన సృష్టించగలదని’ ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది. సాక్ష్యాత్తు ఏజంట్ల చేతనే చెప్పించినా కూడా, ’ప్రభుత్వం వాళ్ళని బెదిరించి, ఒప్పించింది’ అంటారే గానీ, అది నిజమని నమ్మే అవకాశం చాలా చాలా తక్కువ. పరిస్థితి తనకు అనుకూలం అవ్వగానే ఏజంట్ కూడా ప్రభుత్వం తనని బెదిరించి ఒప్పించింది అంటాడు. అంతేగాక ప్రతికలు చేసే విషప్రచారాన్నే ప్రజలు నిజమని నమ్ముతారు. ఇది గతంలో నిరూపించబడిన సత్యం. 1992 లో పీవీజీ నేతృత్వం వహిస్తున్న భారతదేశపు కేంద్ర ప్రభుత్వం, నకిలీ కణిక వ్యవస్థ కంటే బలమైనది కాదు. అది మైనారిటీ ప్రభుత్వం అయినందున కాదు. మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థ శతాబ్ధాల క్రితం నుండి పనిచేస్తున్న, ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠమైన గూఢచార వలయం గనుక, నెట్ వర్కు గనుక! ఈ వ్యవస్థతో పోలిస్తే, అసలు ఏ దేశపు ప్రభుత్వం కూడా బలమైనది కాదు. పైకి పనికిమాలినదిగా చెప్పబడే ఐరాస కూడా, ఆయా దేశపు ప్రభుత్వాల కంటే బలమైనదే. అటువంటప్పుడు నకిలీ కణిక వ్యవస్థని శిక్షించగల, తుత్తునియలు చేయగల శక్తి ఎవరికుంటుంది? అది ఓ దేశపు ప్రధాని అయినా సరే! అంతేగాక ఈ దేశం ఒక్క ప్రధానమంత్రి దేనా? ఆ ప్రధాని పీవీజీ అయినా సరే, ఇందిరాగాంధీ అయినా సరే, లాల్ బహుదూర్ శాస్త్రి అయినా సరే! ఈ దేశం ఒక్క ప్రధాన మంత్రి దేనా? లేదా ఐ.బి., ’రా’ వంటి నిఘాసంస్థలదేనా? ‘దేశమంటే మట్టికాదనీ, దేశమంటే మనుషులనీ’ గుఱజాడ చెప్పనే చెప్పాడు కదా! మరి ప్రజలకి ఈ దేశం పట్ల ఏ బాధ్యతా లేదా? ఉంది! నిక్కచ్చిగా ఉంది. అయితే ప్రజలకి జరుగుతున్న కుట్రతెలిస్తే కదా, తమ బాధ్యత ఏమిటో, తమకు మూడుతున్న ప్రమాదం ఏమిటో, దాని నుండి తమకు రక్షణ ఏమిటో తెలియడానికి? 17 ఏళ్ళ క్రితం అంటే 1992 లో సోనియాగాంధీ గురించి, ఆమె చేస్తున్న గూఢచర్య కార్యకలాపాల గురించి, చెబితే ఎవరైనా నమ్మగలరా? గడపదాటని ఇల్లాలి గురించి, ఆమె సి.ఐ.ఏ. ఏజంటని చెబితే, ఎవరైనా నమ్మగలరా? అదే ఇప్పుడైతే...? రాజకీయాల పేరిట ఆమె చేస్తున్న గూఢచర్య కార్యకలాపాలు, ఆ నెపాన చేస్తున్న మత మార్పిడి మద్దతలు.... గుడ్డి భక్తులకి కూడా, రెప్పలు తెరచి మరీ చూపిస్తున్నట్లుగా, ఆమె చేతలూ, మాటలూ, ఆమె చేతిలోని కీలుబొమ్మలైన ప్రధాని, [మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ వంటి] ఇతర మంత్రులపై ఆమె నియంత్రణా, స్పష్టంగా కన్పిస్తున్నాయి కదా?
అందుకన్నమాట ఇలా నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ స్ట్రాటజీని, దేశాలని, సంస్థలనీ, పార్టీలని, ఏజంట్లనీ కూడా expose చేయటం! Top to Bottom అన్నట్లు, పైనుండి క్రింది దాకా, స్ట్రాటజీ దగ్గరి నుండి వ్యక్తిగత ఏజంట్ల దాకా, ప్రతి అంశాన్ని, దృష్టాంత సహితంగా బహిర్గతం అయితేనే, సామాన్యుడికి అర్ధం అవుతుంది, అవగాహన కలుగుతుంది. ముందు కుట్ర అర్ధం అయితే గదా పరిష్కారించుకోగలిగేది, తమని తాము రక్షించుకోగలిగేది? అందుకే మోసం ఎలా జరుగుతుందో అర్ధం అయితేనే గదా మోసపోకుండా ఉండగలిగేది అని వ్రాసాను, నాబ్లాగు తొలి టపాలలో!
ఇంతకు క్రితం టపాలలో స్ట్రాటజీ గురించి, దేశాలపై నకిలీ కణిక వ్యవస్థ పనితీరు గురించి వ్రాసాను. అందుచేత ఇప్పుడు ఏజంట్ల expose తో ప్రారంభించి, పార్టీలు, సంస్థల expose తో కొనసాగి, దేశాల గురించీ, స్ట్రాటజీ గురించి పునః సమీక్ష చేద్దాం. ముందుగా ఇంటి నుండి అంటే మనరాష్ట్రం నుండి ప్రారంభిద్దాం.
ముందుగా నకిలీ కణికుడికి ప్రియమైన ఏజంటు అయినప్పటికీ, 1995లో అప్రియమైన ఏజంటుగా మారిపోయిన ఎన్.టి.రామారావు గురించి వ్రాస్తాను. ఈతడు అందగాడు. అద్భుతమైన నటుడు. నటుడిగా క్రమశిక్షణ గలవాడు. అధికంగా శ్రమించగలిగిన వాడు. అంతమాత్రం చేత సౌశీల్యవంతుడనలేం. మంచినాయకడనీ అనలేం. నటుడు కాబట్టి వాచకత్వం, వాగ్పటిమ ఉన్నాయి. అభినయానికి అనుగుణంగా, హెచ్చుతగ్గులు స్వరంలో పలికిస్తూ బహుపద సమాసాలతో, ఉపన్యాస కళతో ప్రజలని ఆకట్టుకున్నంత మాత్రానా మంచినాయకుడైపోడు. ఇతడు సినిమాల్లో ఉండగా కూడా, తనకు తెలియకుండా కొంతకాలం[తొలిరోజుల్లో], తెలిసి మరికొంతకాలం, సినిమారంగపు గాడ్ ఫాదర్ లకు అంటే నకిలీ కణికునికీ తొత్తుగా పనిచేశాడు. మరికొంతకాలం ఈ వెండితెర వేలుపు తానే ఓ గాడ్ ఫాదర్ గానూ [అంటే నకిలీ కణికుడికి మరింత ప్రియమైన, ముఖ్యుడైన, ఏజంటు అయ్యాడని అర్ధం] పనిచేసాడు. అతడి ఆశీర్వాదం ఉంటే సినిమారంగంలో ఎవరైనా నిలదొక్కుకోగల, రాణించగల స్థితికి చేరుకున్నాడు. చివరికి తగినంత అందచందాలు, అభినయనివేశమూ, కళా చాతుర్యమూ లేకపోయినా కూడా, కొందరు నటీ నటులని కెమెరామెన్, మేకప్ మెన్, ఇతర సాంకేతిక సిబ్బంది, సాంకేతికతల సహాయంతో, నకిలీ కణిక వ్యవస్థా, ప్రత్యక్షంగా ఎన్.టి.ఆర్. వంటి వారూ పైకి తెచ్చారు. ఆ విధంగా, మొత్తం సినిమారంగపు నాణ్యతని శాసించారు.
ఓ ఉదాహరణ చెబుతాను. నలుపుతెలుపు సినిమా రోజుల్లోనే ’పరమానందయ్య శిష్యుల కథ’ అనే సినిమా వచ్చింది. దానికి ముందు, శోభన్ బాబు హీరోగా నటించిన ‘వీరాభిమన్యు’ సినిమా వచ్చి ఘనవిజయం సాధించింది. అందులో అందంగానూ, నటనపరంగా ఫర్వాలేదనిపించుకుంటూనే శోభన్ బాబు కొంత రాణించాడు. తర్వాత కెరియర్ బాగుంటుందని ఊహించాడు. అయితే అతడి ఊహ నిజం కాలేదని, అతడే చెప్పుకున్నట్లుగా అతడి మరణానంతరం వచ్చిన వ్యాసాలలో చదివాను. వీరాభిమన్యు సినిమా తర్వాత, అతడి ఆశలు నిరాశలవ్వటంతో పదిహేనువందల పారితోషికం కోసం మెడలో పాముల్ని వేసుకుని పరమశివుడి వేషం వేసాడట. ఆ రోజుల్లో పదిహేనువందలు ఎక్కువమొత్తమే కావచ్చు గానీ, సినిమా నటుల పారితోషికం విషయంలో అది తక్కువ మొత్తమే. ఇంతాచేసి, పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో ఎన్.టి.ఆర్. ధరించిన పాత్ర అంత సంక్లిష్టమైనదీ కాదు, అతడు తప్ప శోభన్ బాబువంటి చిన్న నటులు చెయ్యలేనంతటదీ కాదు. అందునా ఆ పాత్రని నటించటంలో ఎన్.టి.ఆర్.లో ఓ విధమైన నిర్లక్ష్యం [అలవోక అని అతడి అభిమానులు అంటారు. నటుడిగా ఎన్.టి.ఆర్. నటనని నేనూ వీరాభిమానంతో ఆస్వాదించి ఆనందిస్తాను. అయితే లోపాన్ని లోపంగా గుర్తించనిది గుడ్డితనమే కాని అభిమానం అనిపించుకోదు] ద్యోతకమౌతుంది. ఎందుకంటే, అప్పటికే, నకిలీ కణికుడు, లేదా అతడి ఏజంట్లు అయిన, అప్పటి సినిమారంగ గాడ్ ఫాదర్ లు, మెల్లిగా రంగంలో తలెత్తి, బయటకు కనబడటం ప్రారంభమయ్యింది. పరోక్షంగా ఉన్న ఆ గ్రిప్, ఎన్టీఆర్ కి ప్రత్యక్షంగానే దన్ను ఇచ్చింది. దాని తాలుకూ భరోసానే పాత్రలకు న్యాయం చేయటంలో నిర్లక్ష్యంగా ఎన్టీఆర్ లో కనబడింది. ఈ స్థితి ఈ ఒక్క సినిమాలోనే కాదు. ఆ ఎరాలో వచ్చిన అంటే ఆ దశాబ్ధం, ఆ తర్వాతి దశాబ్దంలో వచ్చిన సినిమాలలో స్పష్టంగా కన్పిస్తుంది. అయితే పత్రికలు మాత్రం ఎన్టీఆర్ నటనని ‘ఆహా! ఓహో!’ అనీ, అద్భుతమనీ ప్రచార హోరెత్తించాయి. అదే చిత్రంలో కొత్తగా పరిచయం చేయబడ్డ కథానాయిక కె.ఆర్. విజయ. గొప్ప అందగత్తెగా నాటి మీడియా స్టాంపు వేసి ప్రచారించిన ఆనాటి స్టార్. ఆవిడ ధరించిన పాత్ర ఓ సన్నివేశంలో నర్తించవలసి ఉంది. అదీ ఎల్.విజయలక్ష్మి తో పోటీ పడి నర్తించాలి. సదరు కథానాయిక కె.ఆర్. విజయకు నాట్యం రాదు. ఇక కెమెరామెన్, నాట్యదర్శకుల తిప్పలు తెరమీదే చూడాలి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సంగీతదర్శకుడు, గీతరచయితా కలిసి, గాయని సుశీల చేత ’హుఁ హుఁ’ అంటూ హూంకరింపులు కూడా పెట్టించారు. కథాపరంగా నాయిక నాట్యంలో అందెవేసిన చెయ్యి అయి ఉండాలి. అటువంటప్పుడు మరో కథానాయికే దొరకకపోయిందా? కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించగల నటీమణులూ, ముద్దు సన్నివేశాల్లో చొంగకారుస్తూ మరీ సజీవంగా[కెమిస్త్రీ పండించటం కాబోలు] నటించగల నటీమణులకు, కొంచెం పూర్వకాలంలోని ఇటువంటి సినిమాలలో, కథ డిమాండ్ చేస్తే నాట్యం చేయగల నాయికలే దొరకలేదా? బాపూ రమణలు తమ ’రంగుల రాట్నం’ అన్న పుస్తకంలో ఇలాంటి విశేషాలనే[ఇది కాదులెండి] చెబుతూ ’సత్తు బేడలు కూడా చెల్లుతాయని’ తాము ఊహించలేకపోయాం అంటారు. అలా సత్తు బేడల్ని నకిలీ కణిక వ్యవస్థ బ్రహ్మాండంగా చెల్లించింది. పోటీ నివ్వగల నటీనటుల్ని రంగం నుండి ఇంటికి పంపించేసి, కెమెరా, మేకప్ ఇతర సాంకేతికతో ఎన్నో సత్తుబేడల్ని చెల్లించింది. ఇక్కడా నారదనీతికి విపర్యయం, కణిక నీతే అమలుపరచబడింది. ఇక రుద్దగా రుద్దగా, మీడియా ప్రచారించగా ప్రచారించగా, కెమెరామెన్ ఆయా నటీనటుల్ని అందంగా చూపగా చూపగా, మరో పోలికేది లేక కూడా, సదరు ఆముదం చెట్టువంటి నటీనటులు మహా వృక్షాల్లాగా కనబడేవారు. ఇది ఒక్క కె.ఆర్.విజయ వంటి నటి విషయంలోనే కాదు, షావుకారు జానకి, కృష్ణకుమారి, దేవిక, వాణిశ్రీ వంటిఎందరో నాయికల విషయంలో అమలుచేయబడిన స్ట్రాటజీ. తద్వారా ప్రతిష్ఠితం చేసుకుని, ప్రకటించుకున్న నకిలీ కణికుడి గ్రిప్. వరకట్నం సినిమాలో సావిత్రి Vs. కృష్ణ కుమారి పాత్రల విషయంలో, కృష్ణకుమారి పోషించిన నాయిక పాత్రకు వదిన పాత్రలో సావిత్రి చేత నటింప చేయవలసిన అవసరం ఏదీ లేదు. అప్పటికే సావిత్రి తమకు ఉపయోగపడదన్న విషయం స్పష్టపడటంతో, నకిలీ కణికవ్యవస్థ, ఆమెని డీగ్రెడ్ చేసేందుకు, ఆ చిత్రంలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించి మరీ, అనివార్యమై సావిత్రి ఆ పాత్రని చెయ్యవలసిన పరిస్థితి కల్పించారట. ఇదీ… తర్వాతి కాలంలో ప్రచారంలోకి వచ్చిన ఉదంతం.
చాలా చిత్రాల్లో సదరు కృష్ణకుమారిని గ్లామరస్ గా చూపించటం, అందుకు వీలయ్యే కథలతో చిత్రాలు తయారు కావటం కూడా జరిగింది. అలాగే షావుకారు జానకి విషయం కూడా! ఈవిడ కోసం పాత్రలు సృష్టింపబడటం కూడా జరిగింది. ఎన్టీఆర్ నిర్మించిన పాండురంగ మహత్యంలో, నాయిక అంజలీ దేవి, భర్తతో గొడవపడి పుట్టింటికి చేరిన సందర్భంలో తండ్రి ఆమెని మందలిస్తాడు. కథలో అవసరం లేకపోయినా, ఆమెకో విధవ అక్కగారి పాత్ర అందులో ఉంటుంది. ఆ పాత్ర నాయికకు సంసారం గురించి నీతులు చెబుతుంది. అద్భుతమైన ఆ సినిమా మొత్తంలో అత్యంత కృతకంగా ఉండేది ఈ సన్నివేశమే. అదే విధంగా దేవికనీ ఆనాటి ప్రేక్షకల నెత్తిన రుద్దారు. [ఇప్పుడు అలాంటి నటీనటులు కొల్లలుగా మన నెత్తిన రుద్దబడుతూనే ఉన్నారులెండి] ఆ తదుపరి వాణిశ్రీ. ఆమె షూటింగ్ స్పాట్ కు తన కుర్చీ తాను తెచ్చుకునేదట. ఇక ఇలాంటి చిలువలూ పలవలతో కూడిన ఆసక్తికరమైన కథనాలతో ఆయా నటీనటులకు ఎంతగా క్రేజ్ సృష్టించారో నకిలీ కణికులకీ తెలుసు, సగటు ప్రేక్షకులకీ తెలుసు. కాకపోతే ప్రత్యేకమైన పరిశీలనే ఉండదు.
ఈవిధంగా నకిలీ కణికుల ఆశీస్సుల పొందగలిగిన నటీనటులు తదనంతరం మరింత ప్రమోట్ అయి తమ ఆశీస్సులతో మరికొందరిని పైకి తేగలరన్న మాట. 1990 లో గనుక చిరంజీవి తను హీరోగా చేసే సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో సుధ [నేటి తల్లిపాత్రల ధారణి] ని ప్రమోట్ చేసినట్లుగా నన్నమాట. అలా అలా ఎంతో బలంగా వేళ్ళూనుకున్న వటవృక్షంలాంటి ఎన్టీఆర్, సినిమా రంగంలో ఎంతగా చలాయించుకున్నాడో ఎవరూ నోరు విప్పరు.
ఇతడు శ్రీకృష్ణుడుగా నటించిన శ్రీకృష్ణార్జున యుద్దంలో సత్యభామ పాత్ర ఎస్. వరలక్ష్మి పోషించింది. ఈమె అక్కినేని నాగేశ్వర రావుకు కూడా సీనియర్ నటి. స్వయంగా గాయని. కథాపరంగా, పాత్రపరంగా ఆ సినిమాలో ఈమె శ్రీకృష్ణుని పాత్రధరించిన ఎన్టీఆర్ ని కాలితో తన్నింది. తదనంతర కాలంలో ఎన్టీఆర్ నిర్మించిన శ్రీకృష్ణపాండవీయం అనే చిత్రంలో ఎస్.వరలక్ష్మి కుంతీదేవి పాత్ర నటించింది. ఆ స్థితికి ఆ పాతతరం నటి డ్రైవ్ చేయబడిందనీ, ’ఎంతలో ఎంతమార్పు’, ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా వేసిన ఎస్.వరలక్ష్మి ఇంతలో ముసలావిడ అయిపోయి మేనత్త వేషం వేసింది. ఎన్టీఆర్ మాత్రం అలాగే ఉన్నాడు’ అన్న ప్రేక్షకుల వ్యాఖ్యలు వెల్లువెత్తాయనీ చెప్పుకున్నారు. ఇవే వ్యాఖ్యల్ని నేను దానవీర శూరకర్ణ చిత్రంలోనూ విన్నాను. [పాత్రపరంగా కాలితో తంతే మాత్రం, ఆవిడ్ని డిగ్రేడ్ చేస్తారా? అనవచ్చు. ఇక్కడ మీకు ఒకవిషయం చెప్పాలి. షూటింగ్ స్పాట్ లో ఒకప్పుడు పాత్రపరంగా హీరోయిన్ తో రాష్ గా ప్రవర్తించిన పాత్రధారులు, రేప్ సీన్ లో నటించిన పాత్రధారులు, షూటింగ్ షాట్ అయిపోయిన ప్రతీసారి హీరోయిన్ [ప్రముఖనటి అయితేనే సుమా] కి క్షమాపణలు చెప్పుకుంటారు. ఎందుకంటే – ఆలా క్షమాపణలతో హీరోయిన్ కి ఆహం సంతృప్తి కలిగించటం ద్వారా ’తమ కెరీర్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటారు’ అని అనుకునేవారు. ఆ రంగంలో అహాల స్థాయి ఎంత ఉంటుందో తెలియటానికి ఇదో ఉదాహరణ.]
క్రమంగా ఈ స్టాంపు కూడా ఈ నటుడు ఎన్టీఆర్ మీద, ఇతడి సహానటుడు ఎ.ఎన్.ఆర్. మీద పడ్డాయి. వీళ్ళ కళ్ళెదురుగా ఎందరో[లేత]హీరోయిన్లు వస్తుంటారు. పోతుంటారు. ఈవృద్దనటులు మాత్రం అప్పటికి 50/55 ఏళ్ళు దాటినా ఇంకా కుర్రహీరోయిన్లతో డాన్సులు, ప్రేమ సన్నివేశాలూ నటిస్తూ ఉండేవారు. చివరికి ఏదో సినిమాలో ఎన్టీఆర్ పొట్టినిక్కరు వేసుకుని ’అమ్మా! నేను పదో తరగతి పాసయ్యాను’ అనే డైలాగ్ ఉందట.[నిజమో కాదో గానీ] జోక్ గా చెప్పకునేవారు. ఓ రకంగా చెప్పాలంటే తమ స్ట్రాటజీని మరింత పకడ్బందీగా అమలు చేసుకునేందుకు నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే ఉపాయం[ట్రిక్] ఇది. తామే దాని మీద బోలెడు వ్యంగ్యాస్త్రాలూ, జోకులూ వేసి, ఎందరెంత హేళన చేసినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయానే నైరాశ్యపు విమర్శ కొందరి చేత, ఎందరెన్ని అన్నా ఆయా నటులకి నిర్మాతలూ, ప్రజలూ బ్రహ్మరధం పడుతూనే ఉన్నారనే పరోక్ష/ప్రత్యక్ష పొగడ్తలు మరికొందరి చేతా, ప్రచారింపచేస్తూ, చేతల్లో మాత్రం తమ స్ట్రాటజీని కొనసాగిస్తూనే ఉంటాడు నకిలీ కణికుడు. ఇలాంటి చాలా తంత్రాలతో 1981 వరకు ఎన్టీఆర్ కు సినిమా రంగంలో తిరుగులేని పట్టు నడిపించబడింది. ఇందుకు ప్రతిగా, ఎన్టీఆర్, నకిలీ కణికుడికి, భారతీయ ఇతిహాసాలని ముఖ్యంగా భారతాన్ని, సినిమాల ద్వారా భ్రష్ఠపు ప్రచారాన్ని కలిగించడానికి, ప్రక్షిప్తాలను చొప్పించి వక్రీకరించడానికి ఎనలేనంతగా ఉపయోగపడ్డాడు.
శ్రీకృష్ణపాండవీయం సినిమాలో శకుని గురించిన ప్రక్షిప్తపు కథ అటువంటిదే. దుర్యోధనుడు శకునిని అతడి తండ్రీ సోదరులతో సహా[అంటే తాతా మేనమామలని అన్నమాట] భూగృహంలో చెరలో వేయించి వందమందికి రోజుకు వందమెతుకులు పెట్టాడనీ, మిగిలిన వారంతా ఆకలిచావులు చావగా, పగతీర్చుకునేందుకు శకుని ప్రాణాలతో మిగిలాడనీ చెబుతుంది ఆ కథ! దాంతో కౌరవుల పక్షాన్నే ఉంటూ కౌరవులకు కీడు మూడించాడట శకుని! మరి ఇలాంటి శకుని ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనాదుల్ని గెలిపించడానికి పుత్రపౌత్ర సహితంగా పోరాడి మరీ చచ్చిపోయాడో? అలాగే దానవీరశూరకర్ణలో ద్రౌపదీ దేవి చేత ’కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలని ఉందన్న’ కాంక్షని చెప్పించటం. ఆ పాత్రని నటించిన శారద అభినయం సైతం [దర్శకుడు చెబితేనే గదా నటి అభినయాన్ని చూపేది?] అదే కాముకత్వాన్ని చూపిస్తుంది. శ్రీకృష్ణుని బహుభార్యల్లో ఒకరైన సత్యభామా దేవికి, అయిదుగురు భర్తలకి ఇల్లాలై కూడా, అందరి ఆదరాభిమానాల్ని గౌరవాన్ని పొందుతూ, అరణ్యవాసంలో గుట్టుగా సంసారం నడుపుకొస్తున్న ద్రౌపదీ దేవి, భర్తప్రేమని, గౌరవాన్ని పొందటం ఎలాగో, సంసారాన్ని దిద్దుకోవటం ఎలాగో, స్త్రీగా, ఇల్లాలిగా ప్రవర్తనా సరళి ఎలా ఉండాలో ఎంతో సౌమ్యంగా చెబుతుంది. ధర్మరాజుతో అతిశాంతం పనికి రాదనీ, క్రోధం ఉండాలనీ వాదిస్తుంది.[తదుపరి సంవాదంలో ధర్మరాజు శాంతగుణం ప్రాసస్త్యాన్ని వివరిస్తాడు. వెరసి ఈ ఇద్దరి సంవాదంలో క్రోధం, శాంతం ఎప్పుడు, ఎంతవరకూ ఉండాలో, వాటి వాటి పరిమితులేమిటో వ్యాసమహర్షి మనకి వివరిస్తాడు. నేర్చుకోవాలన్న తపన గలవాళ్ళకు, జీవితకాలం నేర్చుకోగల పాఠాలని నేర్పగలదు భారతం.] అటువంటి సౌశీల్యవతి ద్రౌపదీ దేవిని ఆ విధంగా చూపగలిగిన వాడు, దుర్యోధనుణ్ణి కథానాయకుడిగా మలచగలిగిన వాడు, ఎన్టీఆర్ మాత్రమే. నిజానికి – భారతంలో శ్రీకృష్ణుడు, యుద్ధానికి ముందు, కర్ణునికి అతడి జన్మరహస్యాన్ని వివరించి ’పాండవపక్షం వహించమని చెబుతూ, అలా చేస్తే ద్రౌపదీ దేవి ఆరవ భర్తగా కర్ణుణ్ణి వరిస్తుందని చెబుతాడు. అంతేగాని ద్రౌపదీ దేవికి ఆ కాంక్ష ఉందనటం ఆ పాత్రని అశ్లీలంగా, అగౌరవ పాత్రంగా మలచటమే. ఇందులోనే కాదు ‘శ్రీమదిర్వాట పర్వం’ సినిమాలో ద్రౌపదీ దేవి కీచకుణ్ణి నర్తనశాలకు రమ్మనే సన్నివేశంలో ఏకంగా గెంతుతూ డాన్సే చేస్తుంది.
ఈవిధంగా, రామాయణ విషవృక్షంతో రంగనాయకమ్మ నెగిటివ్ ముఖమే పెట్టుకుని విషం చిమ్మితే, ఎన్టీఆర్ తన సినిమాల స్ర్కీప్టులతో [నాస్తికులతో వ్రాయించుకున్న స్ర్కిప్టులూ ఉన్నాయి] పాజిటివ్ ముఖం పెట్టుకుని మరీ, అంతకు రెట్టింపు విషమే చిమ్మాడు. సినిమా అత్యంత శక్తి గల మాధ్యమం అయినందునా, అందులో ఎన్టీఆర్ కి తన సుదీర్ఘ కెరీయర్, అందచందాలు, నటనా చాతుర్యాలకు తోడు నకిలీ కణికుడిచ్చిన ఇమేజి ఉన్నందునా, ప్రజా దృక్పధాన్ని మరింత ప్రభావ పరచగలిగే విధంగా మలచబడ్డాడు. ఆ విధంగా తనకి ఉపయోగపడినందునే, నకిలీ కణికుడు ఎన్టీఆర్ కి సినిమా కెరియర్ తర్వాత రాజకీయ కెరియర్ కూడా ఇచ్చాడు. అతడి సంతతికీ బాగానే ’సీన్’ ఇచ్చాడు.
ఈ విధంగా నకిలీ కణికుడు ఇచ్చిన సీన్ తో ఎన్టీఆర్ లో కూడా ‘తాను ఎవర్ గ్రీన్ హీరో, అదృష్టజాతకుడు, యుగపురుషుడు, తన కళ్ళ ముందే ఎందరో హీరోయిన్లు పారేనదిలోని నీళ్ళల్లా వస్తుంటారు, పోతుంటారు’ అన్న భావన ఏర్పడింది. తానే ‘సూపర్ మ్యాన్’ చిత్రంలో పాటలో అభినయించినట్లుగా “అన్ని పూలకీ ఒక్కతుమ్మెదే జవాబు చెబుతుంది” అన్న భావన బలపడింది. అందునా వృద్ధాప్యం పెరిగే కొద్దీ ఆ భావం మరింత పెరిగిందేమో, ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు తనతో నటించే కుర్రహీరోయిన్ల అందాల్ని, పాత్రోచితంగా ఆనందించటం గాక ఆయా పాత్రలో జీవించేసి మరీ నటించేవాడు. ఆయా సన్నివేశాల్లో కుర్రహీరోయిన్ల పిరుదల మీద దరువులు వేస్తూ[యమగోలలో జయప్రద, వేటగాడు, కొండవీటి సింహాం గట్రాలలో శ్రీదేవి] స్టెప్పులు వేసినప్పుడు ఆ నటుడి కళ్ళల్లో నటన పరిమితుల్ని దాటిన ’యావ’ ఉండటం ఇప్పుడు ఆ సి.డి.లు వేసుకుని చూసినా సుస్పష్టంగానే కన్పిస్తుంది. ఈ విషయమై చాలామంది హీరోయిన్లు లోలోపల సణుక్కునో, గొణుక్కునో, ఆపైన నోరుమూసుకుని సర్ధుకుపోయార్ట కెరియర్ కోసం. కాగా జయప్రద ఆ విషయమై గొడవపెట్టిందనీ , అతడి ప్రక్కన నటించనన్నదనీ అప్పట్లో చెప్పుకున్నారు. అందునా జయప్రదని నటుడు ఎన్టీఆర్ ఓ పాటలో నటిస్తూ తెరమీద కర్చిఫ్ ని నలిపినట్లు నలిపి పారేసాడని అప్పట్లో అనటం విన్నాను.
ఇంతగా లేటు వయస్సులో ఘాటుప్రేమనీ, నటన సాకుతో తనకు మనవరాళ్ళ వయస్సు హీరోయిన్లని పిరుదుల మీద కొడుతూ[అదే మాస్ అన్న ముద్రవేసుకుని] తీర్చుకున్న మనోవికారాన్ని ప్రజలు గుర్తించకపోయి ఉండొచ్చు. మీడియా గుర్తింపనివ్వకపోయి ఉండొచ్చు. ఏకొందరైనా గుర్తించినా, మీడియా పెట్టే ప్రచారహోరుతో అదీ సమసిపోయింది. అయితే ఈ మనోవికారమే అతడి ‘సువర్ణముఖి’ అతడికి, లక్ష్మీపార్వతిని ద్వితీయ కళత్రంగా కానుక ఇవ్వడానికి కారణమైంది. ఇంతక్రితం రాముడు, కృష్ణుడు పాత్రలను తల్చుకుంటే ఎన్టీఆర్ గుర్తుకువచ్చేవాడు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ తో పాటు లక్ష్మీపార్వతితో వివాహం, అతడి జీవిత చివరిదశలో కుటుంబకలహాలు, అల్లుడి వెన్నుపోటు, రాజకీయ జీవిత వైఫల్యం గుర్తుకువస్తాయి. ఒక్క ’లక్ష్మీపార్వతి’ అనేపాత్రతోనే ఇది సాధ్యమయ్యింది. అది ఇక్కడి స్ట్రాటజీ!
ఆ స్ట్రాటజీ వెనుక ఉన్నది నకిలీ కణికవ్యవస్థ, రామోజీరావే! ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని వెనుక ఉన్న గూఢచర్య తంత్రం చాలా ఆసక్తికరమైనది. నకిలీ కణికుడు ఎన్టీఆర్ పట్ల పన్నిన వ్యూహం, అతడికి అప్పటికి సరైనదిగా కన్పించి ఉండవచ్చు. కాలం గడిచాక చూస్తే అది ఎవరిని ఎంతగా expose చేసిందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
***********
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
7 comments:
emitonandi.. meeru innallu cheppinavi bagane vunnayi kani .. ippudu ramarao garini gurinchi kuda ila antu vunte..badhaga vundi..ayankau teliayakunda emina porapatu chesademo kani ,desani dochukune dongalato matram ennatiki chetulu kalaparu.meere alochinchandi..
తెలియకుండా ఏమైనా పొరపాటు అంటే మీ ఉద్దేశ్యంలో ఏమిటొ నాకు అర్ధం కావడం లేదు. తనతో బాలనటిగా నటించిన శ్రీదేవి అతనితో ఎన్ని సినిమాల్లో హీరోయిన్‍గా(చాల రొమాంటిక్ సీన్లలో కూడా) నటించిందో మనందరికీ తెలుసు. ఏంత ఇమేజ్ సృష్టించబడకపోతే "నా చెప్పులు నిలబెట్టినా గెలుస్తాయి" అని అనగలడు. సగం, తెలుగు వారిని అడుక్కుతినే వారిగా మార్చడానికి ఆద్యుడు రామారావే అని నా నమ్మకం. ఇక రాముడు,కృష్ణుడు అని మనం పిలుచుకునే ఆ రామారావు నటనా వైదుష్యం నిజానికి ఇతిహాసాల్లో నీతిని పాతిపెట్టడానికే పనికొచ్చింది.కాదంటారా, ఒక దుర్యోధనుడు, ఒక రావణుడు ఈ కారక్టర్ లని ప్రజల్లో ధీరోధాత్తులుగా నిలబెట్టడానికి రామారవు చేసిన ప్రయత్నం ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఒక్క దానవీర శూర కర్ణ సినిమాలోనే ఆయన పైత్యం అంతా, కర్ణుడి పాత్ర ప్రవేశించే సన్నివేశంలో చూపిస్తాడు. విన్నవాళ్ళకి భారతంలో ఏ పాత్ర పుట్టుక ధర్మబద్దమైనదీ కాదనీ, అంతా సంకరమేనని ఎంతో గంభీరంగా చెప్తే విని ఏం చెప్పాడ్రా అని చంకలు గుద్దుకొంటాం. అంతే కానీ ఆ సన్నివేశం చూసిన పిల్లవాడికి భారతంలో ఏ పాత్ర పట్ల అయినా గౌరవం ఉంటుందా, ఇది మనం అలోచించం. ఇంకొకటి, ఆదిలక్ష్మి గారు చెప్పిన "ద్రౌపది కర్ణుడు ఆరో భర్తగా కావాలి " అనే సన్నివేశం. ఎంత కృతకమది.
ఐతేనేమి ఇప్పుడు కూడా మనం చరిత్రలో రాముడు,కృష్ణుడు అంటే రామారావే అని ఒప్పుకుందాం. అలాగే కళ్ళుమూసుకుని బతికేద్దాం.
అలాగే సోనియా కూడా తెలియక ఏదో పొరపాటు చేసిఉండవచ్చు కానీ నిజంగా ఆమెకి దేశం పట్ల , కాంగ్రెస్స్ పట్ల ఎంతో నిబద్ధత ఉందని అనుకుని ఊరుకుందాం.
your new template was good.
manohar garu.. nenu ramarao garini desadrohula jabitha lo cherchadam gurunchi matrame badha kaligindi annanu andi. cinemalu,vati gurinchi nenu matladaledu..Rama rao garu vuddesya purvakam ga ante.. intha stratagical ga migilina vallu (ee blog lo ippatidaka Adi Lakshmi garu cheppina perlu)chesinattu cheyyarani na vuddesyam.May be Ramoji rao ki pavu ga vupayogapddaremo kani ..desaniki/mathaniki ayana droham cheyyaleru/cheyyaru ani naku anipinchindi. anthe..
అజ్ఞాత గారు,
మీ బాధ, భావనా నాకు అర్ధమయ్యాయండి. ఎందుకంటే – ఎన్టీఆర్ తాలూకూ కుట్ర కోణాన్ని పరిశీలించేటప్పుడు నాకూ ఇదే బాధ కలిగింది గనుక! అప్పటివరకూ మీడియా ప్రచారించగా, సినిమాలు చూసీ చూసీ, నటుడిగా ఎన్టీఆర్ పై పెంచుకున్న అభిమాన మోహం ఓప్రక్కా, నిజం ఓప్రక్కా లాగుతుండగా నాకూ మీలాగే బాధ అన్పించింది. కాని అన్నిటికంటే ‘సత్యం’ అన్నది ఉతృష్టమైనది గనుక అది దాటేసాను. ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న సినిమా సి.డి.లలో ఎన్టీఆర్ వే ఎక్కువ. ఇప్పటికీ ఎన్టీఆర్ రూపవిశేషాలనీ, నటనా కౌశలాన్ని నేనెంతగానో ఆస్వాదించి ఆనందిస్తుంటాను.
మల్లీశ్వరిలో అతడు ’ఔనా నిజమేనా’ అంటూ ఓ విధమైన ఉన్మాదాన్ని అభినయించినా, మాయాబజార్ లో శ్రీకృష్ణుడిగా చిలిపితనం జల్లులూ కురిపించినా, జగదేకవీరుని కథలోని రాకుమారసోయగం అన్నా, పుండరీకుడిగా పాండురంగమహాత్యంలో భక్త్యావేశాన్ని అపురూపంగా చూపినా, డామిట్ కథ అడ్డం తిరిగింది అంటూ పెదవి మీద పుట్టుమచ్చతో గిరిశంగా కన్పించినా, అతడి నటన అనితరసాధ్యమైనదే. కానీ అతడి అందచందాల కంటే, నటన, కళానైపుణ్యాల కంటే గుణశీలాలు ప్రధానమైనవి కదా! ఎందుకంటే సత్యం తిరుగులేనిది గనుక. అందుకేనేమో భర్తృహరి ’నెత్తిమీద మణి ఉన్నప్పటికీ, పాము విషజీవి గనుక దాన్ని దరిచేరనివ్వకూడ’దంటాడు. వ్యక్తి ఎంత అందమైన వాడైనా, ఎంత తెలివైనా వాడైనా, ఎంతటి కళాచాతుర్యం ఉన్నవాడైనా, అన్నిటి కంటే సద్బుద్ధి కలవాడా కాదా, గుణశీలాలున్న వాడా కాదా అన్నదే ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి అందమైన వాడవ్వటం చేత, టాలెంట్ ఉన్నవాడవ్వటం చేత, అతడి తప్పుల్ని పరిగణించకూడదంటే – మరొకడు తనకు డబ్బు ఉంది గనుక, లేక తన తండ్రికి పలుకుబడి ఉన్నచేతా, లేక తాను చక్కగా పాడగలిగినందు చేతా, తానే తప్పులు చేసినా ఫర్వాలేదంటాడు. ఒప్పుకుంటామా? అదే ఇప్పుడు రాజకీయనాయకులు తమకి పదవి ఉందిగనుక తామేం చేసినా తప్పులేదంటున్నారు. ఉద్యోగులు అధికారం ఉంది గనుక తామేం చేసినా తప్పులేదంటున్నారు. కాబట్టి – బుద్ధి, గుణశీలాలు అన్నిటి కంటే గొప్పవి అంటారు. అది సత్యం. సత్యం అందం కంటే, నటనా కౌశలం కంటే గొప్పది కదా? కాబట్టి ఎన్టీఆర్ విషయంలో నేనేమీ పొరపాటు పడలేదని చెప్పగలను. దృష్టాంతాలు పరిశీలిస్తే ఆ విషయం మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.
Correct me If I am wrong.
pratipadana (telugu word) = Proposal
Ooha = Assumption
--kumar
NTR gurinchi maatladagalige jnanamu,arhatha manaku vunnayani anukovatam moorkhathvame kaani marokati kaadu. Ye roju kooda NTR pravarthanalo kaani, aalochanallo kaani, kaaryacharanalo kaani sangha vyathireka leda desa vyathireka prayatnalu kanipinchaledu.NTR samajamlo theesuku vachchina pragathiseela chaithanyaanni choodaleka pothunnamante daaniki kaaranam mana hrasva drusti thappa marokati kaadu. NTR tharvatha telugu samajam lo kula doola yekkuva avataniki kaaranam raajakeeya prathyardhula sankuchitha karyakalapaale ane vishayamlo yevarikaina bhaavana vuntundani anukonu. NTR ni yedurkovataniki kondaru raajakeeya dhustulu chesina prayatnala valla konni vishayalu asandhigdham ga kanipinchavachchu. NTR bharatheeya samskruthini, sampradayalanu yela anusarinchado andariki thelusu. Yentha bhakthi parudo kooda andariki thelusu. Puranaalanu yenadu kinchaparichindi ledu. Kontha samayavada bhavalatho lopaalani yethichoopinantha mathrana NTR vaatiki vyathireki ani theermaninchatam ajnaname thappa marokati kaadu.Heroine gaa sreedevini kaaka bhanumathini, varalaxmini pettukunte baaguntundani meeru anukunte vaallatho cinemalu theeyataniki yevaraina prayatninchi vunte baagundedi. Thana cinemmaallo thappa yeppudu yekkada nirmanamlo NTR kalugachesukoladane vishayam meeru gurthunchukoni vunte ea vidhamga aalochinche vaaru kaadu. NTR kanna raastram desam goppavi ane vishayam lo yevariki yelanti anumaaanalu levu. Desam kosam NTR bali ayyevade kaani thana kosam desaniki droham chesevaadu kaadu. Ea vishayam lo meeku yemaina sandehalunte ardhavathamaina paddathaina charchaku avakasam ivvandi. 16 yella sridevitho NTR natinchataaniki kaaranam NTR ni 20 yella kurravadiga maatrame janaalu choodatam valla jarigindi. NTR 60 yella vyakthiga janaalaki kanipinchaledu. NTR ye vayasu paathravesthe aa vayasu vaadiga kanipinche vaadu. Vetagadu, Justice Choudary, Major Chandra kaanth cinemaalanu choosthe meeku ardham avuthundi.
Anil
Post a Comment