1992 జూన్ 5వ తేదిన నేను దాఖలు చేసిన రహస్యఫిర్యాదులో, రామోజీరావు చేస్తోన్న కుట్రల గురించి తార్కిక నిరూపణే తప్ప, మరేవిధమైన సాక్ష్యాధార పత్రాలు గాని, వీడియోలు, ఫోటోలు గానీ లేవు. అలాంటివాటిని ఓ సామాన్యుడెవరూ సేకరించలేరు కూడా! అదే ఉటంకిస్తూ మరీ వ్రాసాను. అయితే అదృష్టం కొద్దీ, అది మరెవ్వరి చేతిలో పడకుండా నేరుగా చేరింది. అది నేరుగా పీవీజీ కి చేరిందని ఎలా చెప్పగలనంటే, తర్వాత నా ఫ్యాక్టరీకి వచ్చిన ఐ.బి. అధికారులూ, ప్రధాని కార్యాలయంలోని ఖండేకర్ అనే OSD ఆ విషయమై నిర్ధారించారు గనుక.[దీన్ని గురించిన పూర్తి వివరాలు నా గత టపాలలో వ్రాసి ఉన్నాను.] అప్పటికి నాకు కన్పించిన కారణాలు అవే. అదే ఇప్పడయితే చాలా సంఘటనలు, సంఘటనాత్మకంగా చెప్పగలను. మున్ముందు టపాలలో అవి మీకు వివరంగా చెప్పగలను.
ఆ విధంగా రామోజీరావు గురించిన ఫిర్యాదు పీవీజీకి చేరడంతో, ’తాము ఇప్పటి వరకూ వెదుకుతున్న కీలక ఏజంటు రామోజీరావే ఎందుకు కాకూడదు?’ అన్నదృష్టితో పీవీజీ మొత్తం విషయాల్ని పరిశీలిస్తే…. ఒక్క క్షణం, ఒక్క ఆలోచన! తమ దృష్టినంతా ఇతర విషయాల పైకి, ఇతర ఏజంట్ల పైకి మళ్ళిస్తూ, తాను కేవలం ఓ మూలన ఒదిగిన స్థానిక పత్రికాధిపతి రూపంలో, చాపక్రింద నీరులా పనిచేస్తున్న కీలక ఏజంటు! అతణ్ణి నిశ్శబ్దంగా పరిశీలిస్తూ పోతే, పరమ అద్భుతంగా దర్శన మిచ్చిన ప్రపంచవ్యాప్త గూఢచార వలయం. ఒక పట్టాన నమ్మగలిగిన విషయం కాదది. ‘ప్రపంచాన్నంతా శాసిస్తోంది అమెరికా, దాని గూఢచార వ్యవస్థ సి.ఐ.ఏ.’ అన్న ముసుగు పైపైనే. లోలోతుల్లో పరిశీలిస్తే పట్టు, గ్రిప్ అంతా పాకిస్తాన్, ఐ.ఎస్.ఐ. లదే. ఇప్పడంటే, ఈ 17 ఏళ్ళుగా, ఏపార్టీ అధికారంలో ఉన్నా, అమెరికా శ్వేతసౌధం, అమెరికా అధ్యక్షుడూ పాకిస్తాన్ కి బాగా మప్పబెడతారనీ, ఇస్లామాబాద్ ని నెత్తికెత్తుకుని లాలిస్తారనీ బహిరంగపడింది గానీ… 1992 కు పూర్వం, పాకిస్తాన్ కి అంత సీన్ ఉందంటే ఎవరూ నమ్మగలిగే ప్రసక్తి కాదు. ఏవిధంగా అయితే ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి జాతీయ పత్రికల అధిపతులు, సంపాదకులతో పోలిస్తే, ఈనాడు వంటి ఓ స్థానిక ప్రాంతీయ భాషా పత్రిక అధిపతీ, సంపాదకీయుడూ అందరికంటే పెద్ద ఏజంట్ అంటే నమ్మశక్యం కాదో, అదే విధంగా, ప్రపంచవ్యాప్తంగా అమెరికా సి.ఐ.ఏ. తో, మాజీ USSR కేజీబీ తో పోలిస్తే, పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ.కి అందరికంటే ఎక్కువ గ్రిప్ ఉందనీ, దానికి హవా నడుస్తుందనీ అంటే నమ్మశక్యం కాదు. అలాగే, ఇప్పుడైతే, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం గారాబం నడవటం అన్నది చాలా నిశ్శబ్ధంగా జరిగిపోతుందనీ, ఏకంగా దేశాలకి దేశాలే ముస్లిం దేశాలుగా మారిపోతున్నాయనీ, చాలా దేశాల్లో ముస్లింలూ, ముస్లిం మూలాలున్న వారూ కీలక స్థానాల్లోకి ఎదుగుతున్నారనీ, ముడి చమురు ధరల్లో తాత్కాలిక ఒడిదుడుకులు కనబడినా, పెట్రో డిమాండ్, ‘నిలకడగా’ ముస్లిం దేశాలని బలోపేతం చేస్తోందనీ బహిరంగపడింది గానీ, అప్పట్లో ఎవరికీ ఆ గమనింపుగానీ, సందేహంగానీ రాకుండా నకిలీ కణిక వ్యవస్థ జాగ్రత్త పడింది.
అందునా పీవీజీకి హైదరాబాదు నిజాం నిరంకుశత్వమూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణాకు స్వేచ్ఛ రాకపోవటం, ఆ నేపధ్యంలో జరిగిన నాటకీయ, రాజకీయ పరిణామాలన్నీ తెలుసు. తెలుగు వాడిగా, ఈనాడు ప్రభావం ప్రజలమీద ఎంతో తెలుసు. ‘అప్పటివరకూ ఎవరో తెలియని కీలకవ్యక్తి ఇతడే అయితే?’... అన్న పరిశీలన, సంపూర్తిగా, అప్పటివరకూ ఉన్న గూఢచార స్థితుగతులన్నిటిని మార్చివేసింది.
అప్పటికి మన దేశానికి స్వంతంగా సమాచార ఉపగ్రహాలని ప్రయోగించుకోగల పూర్తి సామర్ధ్యాలు లేవు. రాజీవ్ గాంధీ హయాంలో శ్రీహరి కోట నుండి రాకేట్ ప్రయోగింపబడే కార్యక్రమానికి, ప్రధానిగా రాజీవ్ గాంధీ హాజరయ్యాడు. ఆనాటి ప్రయోగం విఫలమయ్యింది. ప్రధానిగా రాజీవ్ గాంధీ హాజరయినందున, శాస్త్రవేత్తల్లో ఆ హడావుడీ, అలజడి రేపిందనీ, అనవసరపు హంగూ ఆర్భాటాల వల్లే ప్రయోగం విఫలమయ్యిందనీ ‘ఈనాడు’ అప్పట్లో రోజుల తరబడి వ్రాసింది. సంపాదకీయాలతో సహా! అదే ‘ఈనాడు’ “ఇలా హంగూ ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు?" అంటూ, రాజీవ్ గాంధీ, తాను ఎంపీగా ఉండగా రాష్ట్రపర్యటనకు వచ్చినప్పుడు, హడావుడీ చేస్తున్న నాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యనీ, ఇతరుల్ని చికాకుతో ప్రశ్నిస్తున్న ఫోటోలు, వివిధ శీర్షికలతో వార్తలూ, సంచలనాత్మకంగా ప్రచురించి, దాన్ని ఆంధ్రుల ఆత్మాభిమానానికి పునాదిగా ప్రోది చేసి, తదుపరి పరిణామ క్రమంలో ఎన్.టి.ఆర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదమే ఊపిరిగా చేసింది. సదరు సినిమా నటుడు ఎన్.టి.అర్. కీ, తెలుగుదేశం పార్టీని, ఆంధ్రుల ఆత్మగౌరవం ఎంతగా పట్టిందో ’నా చెప్పలు నిలబెట్టినా గెలుస్తాయ’న్న ఎన్.టి.ఆర్. వ్యాఖ్యాలూ, ఒక్క కలంపోటుతో మొత్తం రాష్ట్రమంత్రి వర్గాన్ని ఇంటికి పంపించటం వంటి చర్యలూ, చెప్పకనే చెప్పాయి. వీటి గురించి ఇంతకు క్రితం టపాలలో వివరించాను.
దానాదీనా, విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హాజరయ్యినందున హడావుడీ చేసేది స్థానికనాయకులూ, చేయించేది నకిలీ కణిక-7, అతడి ఏజంట్లే! మళ్ళీ దాన్ని విమర్శించేదివాళ్ళ అనుచర మీడియానే. వెరసి, ఆనాటి రాకెట్ ప్రయోగం విఫలమయ్యిందన్న విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అదొక్కటే కాదు. చాలా ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమవ్వటం అప్పటికి మనకి అలవాటే. మన స్వంత ఉపగ్రహాలూ తక్కువ. అధవా మనకు స్వంత ఉపగ్రహాలు ఉన్నా, ప్రయోగింపచేసిందీ ఫ్రెంచిగయానా నుండో, మరొక చోటినుండో!
భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ, 1992 తర్వాత, ఇప్పుడు, ఒకే రాకెట్ ప్రయోగంలో 10 ఉపగ్రహాలని ఆయా కక్ష్యలలో ప్రవేశపెట్టగలుగుతోంది గానీ, అప్పట్లో మన ప్రతిభ అడవిగాచిన వెన్నెల మాదిరి ఉండేది. అంచేత మనదేశం ఉపగ్రహాలను, కొన్ని ఉపగ్రహాల సేవలను, ఇతర దేశాల నుండి అద్దె చెల్లించి పొందుతుండేది. అందులోంచి ’సందట్లో సడేమియా’ సామెత మాదిరి, నకిలీ కణిక వ్యవస్థ, తమ గూఢచార కార్యకలాపాలను నడుపుకునేందుకు వీలుగా, ఉపగ్రహ సేవలలో మరికొన్ని రహస్య సేవలని పొందుతుండేది. అటువంటి విజ్ఞానం, సాంకేతికతల ఉనికి గురించి, సమాచారం గానీ, అవగాహన గాని లేనప్పుడు, ఎవ్వరం దాని గురించి ఏవిధమైన సందేహమూ కలిగి ఉండం కదా! ఒకసారి అనుమానం కలిగి సదరు వ్యక్తి[రామోజీరావు]మీద నిరంతర నిఘా ఏర్పాటు చేసుకున్నప్పుడు, అతడి తీరుతెన్నులు, కార్యకలాపాలు పీవీజీకి, ఐ.బి.కీ, ’రా’కీ క్రమంగా, స్పష్టంగా అవగాహనయ్యాయి. భారతదేశ శ్రేయస్సు కోసం అప్పటివరకూ ఎవరైతే పోరాడుతున్నారో, ఏ సంస్థలైతే పోరాడుతున్నాయో, అదేవిధంగా పోరాడుతున్న కేంద్రప్రభుత్వాలకి [తొలితరం నుండి, శాస్త్రీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ… పీవీజీ వరకూ] ఎవరైతే సహాయసహాకారాలు అందిస్తున్నారో, ఆయా వ్యక్తులూ, ఆయా సంస్థలూ, ఈ పనిని అత్యంత జాగ్రత్తగా, నెమ్మదిగా, నిలకడగా చేశారు.
అప్పటికే స్టాక్ మార్కెట్ కుంభకోణం దగ్గర నుండి, మండల్, మందిర్ గట్రాగట్రాల పరంపరలో అయోధ్యలోని మందిర్ కూల్చివేత పైకారణంగా [Over leaf reason], భారతదేశాన్ని కుప్పకూల్చి, ముక్కచెక్కలు చెయ్యాలన్న పధకం, రచనా స్థాయి దాటి ఆచరణ స్థాయిలో ఉంది. రామోజీరావు రహస్య, గూఢచార కార్యకలాపాలని అనుసరిస్తూ పోయిన పీవీజీకి, భారతనిఘా సంస్థలకి, నకిలీ కణికుల గూఢచార వలయం, వ్యవస్థ, శతాబ్దాల తరబడి వారి చరిత్ర, దేశ, ప్రపంచ చరిత్రల్ని అది లిఖిస్తూన్న తీరూ స్పష్టపడింది. అందుకు ఎన్నో నిరూపణలు కన్పించాయి. కాబట్టే, పీవీజీ, తన ‘అయోధ్య’ రచనలో ’బాబ్రి మసీదు’ వ్యవహారంలో, గెలిస్తే అది సమిష్టి విజయంగా, ఓడితే అది నా ఒక్కడి బాధ్యతగా నా తలకు చుట్టడానికి నా సహచరులంతా ఎప్పుడో సిద్దపడి ఉన్నారు’ అని స్పష్టంగా వ్రాసారు. [దీన్ని విజయవంతంగా నిర్వహించారని చెప్పవచ్చు. 17 ఏళ్ళుగా బాబ్రీ మసీదు కూల్చబడటం పీవీజీ నెత్తికే చుట్టబడింది. కూల్చిన భాజపా, ఆర్.ఎస్.ఎస్.గట్రాలెవరికి ఏ బాధ్యతా లేదు. కళ్యాణ్ సింగ్ కీ నిమిత్తం లేదు. ఆనాడు ఆ జిల్లా ఎస్.పి., నేడు కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అయిన, మధుకర్ గుప్తాకి అంతకంటే నిమిత్తం లేదు. ఇదంతా ఎంత జయప్రదంగా నిర్వహింపబడిందంటే రెండు,మూడేళ్ళ క్రితం రాహుల్ గాంధీ “మా కుటుంబంలోని వారు అధికారంలో ఉండి ఉంటే, బాబ్రీ మసీదు కూలిఉండేది కాదు” అన్న ప్రకటన సాక్షిగా, బాబ్రీ కూలడానికి నైతికబాధ్యత వహిస్తూ AICC అధ్యక్షురాలిగా సోనియాగాంధీ చెప్పిన క్షమాపణల సాక్షిగా!] అంతేకాదు, ఇప్పుడు ఒకటై పోయిన మూలాయం సింగ్, కళ్యాణ్ సింగ్ లు అప్పుడు ఎంత నాటకీయంగా తమ తమ పాత్రల్ని రక్తి కట్టించారో కూడా పీవీజీ గ్రంధస్తం చేశారు. మూలాయం సింగ్ ముస్లింల ప్రత్యక్ష ప్రతినిధి స్థాయిలో, కళ్యాణ్ సింగ్ హిందువుల పరోక్ష ప్రతినిధి స్థాయిలో, ఎంత పాత్రోచితంగా ప్రవర్తించారో నాటి పత్రికల్లో వార్తలు చదివిన వారికి బాగా గుర్తుండి ఉంటుంది. సదరు కళ్యాణ్ సింగ్ నాటి భాజపా పార్టీ తరుపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రప్రభుత్వంతోనూ, చివరికి కోర్టులోనూ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలతో సహా, ఎంత నిర్భీతిగా ’రెడ్ టేపిజమ్’ ఆట ఆడుకున్నారో కూడా మీరు ’అయోధ్య’ లో చదవవచ్చు. నాటి పత్రికల్లో వచ్చిన వార్తలు గుర్తుండి ఉంటే, వాటితో సరిపోల్చి మరీ విశ్లేషించవచ్చు. ’ఎటూ మసీదు కూలాక, దేశం ముక్కచెక్కలూ అయ్యాక, ఎవరికెవరు బాధ్యులు’ అన్న నిర్భతినే కళ్యాణ్ సింగ్ చూపెట్టింది. గంటలూ, క్షణాలతో సహా, అప్పటి అడ్మినిస్ట్రేషన్ లేఖల్ని సైతం, పీవీజీ తన ‘అయోధ్య’ రచనలో పొందుపరిచారు. చివరికి కోర్టులో న్యాయాధిపతుల్ని ’రా’అధికారులు ’సంప్రదించాక’ హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. కేంద్రప్రభుత్వం కొంచెం ఊపిరి తీసుకోగలిగింది. అదే సమయంలో కోర్టులూ, న్యాయాధిపతులూ కూడా, ఎప్పుడో నకిలీ కణికుల చేతిలో కీలు బొమ్మలయ్యారన్న విషయాన్ని పీవీజీ, భారత నిఘాసంస్థలూ మరోసారి నిర్ధారించుకున్నాయి. నాటి జిల్లా ఎస్.పి.గా మధుకర్ గుప్తా, ఐ.పి.ఎస్. తన పాత్రతాను పోషించాడు. వలయం తమకి తెలిసినందున, అంటే, ‘ఒక ఏజంటుతో సంబంధమున్న ఇతర ఏజంట్లూ, ఎవరి నుండి ఎవరికి ఏవిధంగా సమాచార మార్పిడి జరుగుతోంది అన్న విషయాలు’ తెలిసినందునా, వాటికి నిర్ధారించుకునేందుకు పీవీజీ, భారత నిఘాసంస్థలూ మరికొన్ని ప్రయోగాలు చేసాయి. అప్పటికే తిరిగి చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్నతాధికారుల రూపంలో గానీ, సహచర మంత్రుల రూపంలోగానీ, అధిక సంఖ్యలో నకిలీ కణికుడి ఏజంట్లే ఉన్నారు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
good one
భారతంలోని కణికనీతిని గూర్చి నా బ్లాగులో పోస్టుచేసాను.వీలైతే ఒకసారి వీక్షించి తప్పొప్పులేమైనా వుంటే తెలియజేయగలరు.
http://sreemadaandhramahaabharatam.blogspot.com/
Post a Comment