భారతీయుల భావ సంపద గొప్పది. వేల సంవత్సరాల నుండి భారతీయుల దృష్టిలో ధనం, సంపద, ఉపాధి అన్నవి కొన్ని పరిమితులకు లోబడి ఉన్న విషయాలు. ఆత్మోన్నతి అన్నభావన భారతీయుల దృష్టిలో అవధులు లేనట్టిది. ఆత్మ, పరమాత్మ స్థాయికి చేరాలని, మనిషి మహాత్ముడు కావాలని, నిరంతర అన్వేషణ జరిపిన జాతి ఇది.

కాబట్టే ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం సామ్రాజ్యాన్ని వదులుకున్న హరిశ్చంద్రుడు, కాటి కాపరికి తనను తాను విక్రయించుకున్న హరిశ్చంద్రుడు తరతరాలుగా భారతీయులకు ఆదర్శమూర్తి, స్ఫూర్తి ప్రదాత. ఇది భారతదేశ ఆధునిక చరిత్ర సైతం ఆవిష్కరించిన సత్యం. అలాగే తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టటం కోసం రాజ్యాన్ని, భోగభాగ్యాలని విడిచిపెట్టి అరణ్య వాసం ఆచరించిన శ్రీరాముడు భారతీయులకి దైవస్వరూపుడు.

అంతగా విలువలు కలిగినవి భారతీయుల మూలాలు. ఇవి కులాలకి, మతాలకి అతీతంగా ఈ కర్మభూమికి ఉన్న లక్షణం, ఈ భూమి మీద ఊపిరి పోసుకున్న రక్తానికి ఉన్న లక్షణం. ఈనాటికీ, ఎంతగా విషప్రచారం ఎల్లెడలా నిండిపోయినా, అన్ని దిక్కుల నుండీ భౌతిక వాదం హోరెత్తిస్తున్నా, భావవాదపు నీడను వదలిరాలేని తత్త్వం భారతీయులది. ఎంతగా మార్పు చెందిందని భావించినా, లోలోతుల్లో, ఇప్పటికీ, ఇంకా కొన ఊపిరి తోనైనా సరే సజీవంగానే ఉన్న నైజం ఇది.

కాబట్టే ’ఇచట బుట్టిన చిగురు కొమ్మైనా చేవఁ’ అన్నాడు విశ్వనాధ సత్యనారాయణ. ఎందరెన్ని విధాలా నరికి పోగులుపెట్టినా, తిరిగి చిగురించగల మహా వటవృక్షం భారతీయుల ఆలోచనా సరళి. ఎంతగా అబద్దాలతో, అసత్య ప్రచారాలతో నమ్మించినా, సత్యపు సెగ తగిలిన తర్వాత, సూర్యుడి కిరణాల తాకిడికి కరిగి మాయమయ్యే మంచుతెరల్లా, భారతీయుల్ని కప్పిన కృత్రిమ భావజాలపు ప్రచార హోరు నాశనమై తీరుతుంది. కాబట్టే అప్పటికి దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటీషు వ్యవస్థ, ఆ ముసుగు మాటున ఉన్న నకిలీ కణిక వ్యవస్థ, ‘ఆత్మన్యూనతా ప్రచారం, పాశ్చాత్యుల భౌతిక రసాయనిక శాస్త్ర సాంకేతిక విజయాలతో కూడిన ఆధిపత్యపు ప్రచారాల’తో భారతీయుల్ని హోరెత్తించినా, తిలక్ మహాశయుడి వంటి అతివాదులూ, మహత్మాగాంధీ వంటి మితవాదులూ కూడా, భగవద్గీత చేత బట్టి సత్యదర్శనం చేయించగానే, నిరాయుధులుగానే సత్యాహింసలతో స్వాతంత్రం సంపాదించుకున్నారు.

పోల్చి చూస్తే భారతీయుల ఆలోచనా సరళి, భావవాద మూలాలు ఊడలు దిగిన మర్రివృక్షం లాంటివి. ఒక ఊడ నరికితే, భారతీయులు మరో ఊడని ఊతగా పట్టుకుంటారు. అంతేగాని తమ స్వభావ సిద్దమైన భావాలని, విలువలని వదిలేసి దమ్మిడీల వెనుక తీసే పరుగులో ఆసాంతం పడిపోరు. కాబట్టే, ఇప్పటికీ, భారతీయేతరులతో పోలిస్తే, భారతీయుల పదార్ధవాదపు దృష్టి, దమ్మిడీల పరుగు తక్కువే. కాబట్టే భారతదేశంలో ‘ఇన్ని విడాకుల కేసులు పెరిగాయి, అన్ని వివాహాలు విచ్చిన్నం అయ్యాయి’ అంటూ మీడియా హోరెత్తిస్తున్నా, ఎంతమంది ’నీనాగుప్తా’లు పెళ్ళికాకుండా గర్భం దాల్చడాన్ని ఓ సెలబ్రిటి సింబల్ గా మార్చేసి, ’నాబిడ్డకు తండ్రెవరో అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ ఆమె భారతీయ సంప్రదాయాల పట్ల ధిక్కారం చూపిందంటూ, అప్పటి మీడియా అరచిగోల పెట్టినా, [1992 తర్వాత సదరు సినిమా, టీవీ నటి నీనాగుప్తా తన కుమార్తె తండ్రి క్రికెట్ ఆటగాడు వీవియన్ రిచర్డ్స్ అంటూ, తన ప్రణయోదంతాలన్నిటినీ పత్రికాముఖంగా, కుమార్తె అభిప్రాయాలతో సహా ప్రకటించిందిలెండి] అదే కారణాన్ని చూపెడుతూ ‘భారతీయుల్లో వివాహ వ్యవస్థ కూలిపోతున్నదా’ అంటూ సీరియల్ గా, సీరియస్ గా చర్చలూ, సమీక్షలూ గట్రాలతో సంచలనాలు సృష్టించప్రయత్నించినా, ఇప్పటికీ బిపాసా బసు, జాన్ అబ్రహంల్లాంటి జంటలతోనూ, స్వలింగ సంపర్కుల వివాహ వార్తలతోనూ అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నా…. ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పటికీ భారతీయుల కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థా ఇంకా స్థిరంగానే నిలిచి ఉన్నాయంటే – భారతీయుల్లో ‘దమ్మిడీల కంటే, ప్రేమానుబంధాలు విలువైనవి’ అన్న విలువలే కారణం.

అంతేకాదు, జన్మతః, స్వభావరీత్యా భారతీయులు శాంతిప్రియులు. సహన శీలురు. కర్మభూమిలో జన్మించినందున, శ్రమించే తత్వమే వారసత్వంగా తెచ్చుకున్నవారు. ఈ విషయంలో విదేశీయులు భారతీయుల ముందు తీసికట్టని నేను అనటం లేదు. అయితే భారతీయులు ఎవరికీ ఎందులోనూ తీసిపోరని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. కష్టపడి పనిచేయటం తెలిసిన భారతీయులకి గల ఓర్పూ,సహనాలు, ఎంతగా ప్రభావపరచినా ఇంకా ఎంతో కొంతగానైనా విలువలు మిగిలే ఉన్న ఆలోచనా సరళి, నకిలీ కణికులకి భారతదేశం ఎప్పటికీ కొరకరాని కొయ్య అవ్వటానికి కారణాలయ్యాయి.[ఇప్పుడు భారతీయులల్లోని పొదుపరితనం, కష్టించి పనిచేసే గుణం కారణంగానే ఆస్ట్రేలియన్లు అసూయ చెంది భారతీయ విద్యార్ధులపైదాడులు చేస్తున్నారని ఓ వాదన విన్పిస్తోంది.]

ఈ నేపధ్యంలో మీరో విషయం గమనించవచ్చు. ఒక అసత్యాన్ని మీడియా ఎంతగా పదేపదే అదేప్రచారంతో హోరెత్తించినా, అప్పటికి ఆ అసత్యాన్ని అసత్యం అని నిరూపించడానికి తార్కాణాలు లేకపోయినా, అసలు ఆ అసత్యమే పరమసత్యం అనటానికి మరెన్ని సాక్ష్యాలు కన్పించినా, సదరు అసత్య ప్రచారం పట్ల భారతీయుల ప్రతిస్పందన కొంతమేరకే ఉంటుంది. అంతేకాదు…. అప్పటికి తార్కిక కారణాలు కనపడకపోయినా సరే, ’సత్యం’ పట్ల భారతీయులు అసంకల్పితంగానే అయినా ఆకర్షింపబడతారు. ఇది కూడా భారతీయుల రక్తంలోనూ, మూలాల్లోనూ తరతరాలుగా నిక్షిప్తమై ఉన్న లక్షణమే. కాబట్టే దశాబ్ధాల తరబడి సంఘ పరివార్, ఆర్.ఎస్.ఎస్., భాజపా గట్రాలు శతవిధాల హిందువులలో హిందూఉగ్రవాదం రేకెత్తించాలని ప్రయత్నించినా ఫలించలేదు. [దీనిమీద వివరమైన టపా మరోసారి.]

ఇదే అసలు ప్రమాద హేతువు నకిలీ కణికులకి! ఆ విషయమై వాళ్ళకి స్పష్టమైన అవగాహనే ఉంది. ఇదే లక్షణాలని, మూలాలని మరింత ధృఢంగా పుణికి పుచ్చుకున్న పీవీ నరసింహారావు, జీవితంలో ఢక్కామొక్కీలు తిన్న రీత్యా, ఒడిదుడుకులు ఎదుర్కున్నరీత్యా, భగవద్గీత చెప్పే స్థితప్రజ్ఞత సాధన చేసిన రాజకీయవేత్త; దార్శనికుడు.

వీటన్నిటిరీత్యా పీవీనరసింహారావు, తనకి తెలియకుండానే తను, నకిలీ కణికులకి గల ప్రధాన శతృవులలో ఒకడయ్యాడు. అప్పటికి నకిలీ కణికులకి ఇందిరాగాంధీ ప్రప్రధమ శతృవు. ఇంతకు ముందు టపాలలో వివరించిన స్ట్రాటజీల ప్రకారం నకిలీ కణిక-6, నకిలీ కణిక-7, ఇందిరాగాంధీని జయప్రదంగా ఒంటరిని చెయ్యగలిగారు. అయితే నిజం నిలకడమీద తెలుస్తుందన్న సామెత చందంగానే, పీవీనరసింహారావు లోని నిజాయితీ, నిబద్దత, దేశభక్తీ ఇందిరాగాంధీ, పీవీనరసింహారావుని నమ్మగలిగేలా చేశాయి. ఆయన, నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఆంతరంగిక బృందంలోని సభ్యుడైనాడు. వాళ్ళ లక్ష్యం వాళ్ళకి తెలుసు. భారతదేశం మీద కుట్రజరుగుతోందన్న విషయం వారికి నిర్ద్వంద్వంగా తెలుసు. నిఘాసంస్థల నిర్ధారణలతో సహా తెలుసు. అయితే సి.ఐ.ఏ., కె.జి.బి….. ఇలా ఎవరిని పరిశీలించినా, ఏ సంస్థని పరిశీలించినా పూర్తి ఆధారాలు దొరకవు. దొరికినా నిరూపించలేం. ఎందుకంటే బలం వైరివర్గానిదే! దేశం లోపల ఎవరు కీలక వ్యక్తో, ఎవరు ప్రధాన ఏజంటో తెలియదు. ది హిందూ, ఎన్.రామ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాధ్ గోయంకాల దగ్గర నుండి ఎందరో అనుమానితులు. ఎవరిని అనుమానించినా, ముందు అవుననడానికి ఎన్నో కారణాలు కన్పిస్తాయి. అధారాలూ కన్పిస్తాయి. మరి కొంతదూరం కొనసాగేసరికి ఔననడానికి ఎన్ని కారణాలు కన్పిస్తాయో, అందుకు విరుద్దంగా, కాదనడానికి అంతకు రెట్టింపు కారణాలు కన్పిస్తాయి. ఒక స్థానిక పత్రికాధిపతి రూపంలో, లేదా ఓ చిన్నపచ్చళ్ళ వ్యాపారి రూపంలో, లేదా ఓ చిన్న చిట్ ఫండ్ చిల్లరవ్యాపారి రూపంలో ప్రధాన ఏజంట్ సి.ఐ.ఏ. లేదా చైనా లేదా XYZ దేశపు గూఢచార సంస్థకి ఉంటాడన్న విషయం స్పురించలేదు.[ ఈమధ్యే రామోజీరావు చైనా ఏజంటని అతడి సోదరుడి కుమారుడు చెరుకూరి చంద్రమౌళి ఒక పుస్తకం వ్రాసి మరీ ఉటంకించాడట!] అధవా అనుమానించినా, అది పూర్తి రూపం పొందదు. అదీగాక సాక్షాత్తూ ఇందిరాగాంధీ ఇంటనే, కోడలి రూపంలో సోనియాగాంధీని ట్రాన్స్ ప్లాంట్ చేసిన నకిలీ కణిక-7, రామోజీరావులకి ఆ తర్వాతి పరిణామక్రమంలో గూఢచర్యంలో కలిగిన పట్టు, దేశం మీద చేయగలిగిన కుట్ర, ఎంతగా వేగం పెరిగాయో, గతటపాలలో వివరంగా వ్రాసాను.

అట్లయ్యి, ‘రామోజీరావే తాము ఇన్నేళ్ళగా వెదుకుతున్న అసలు ఏజంటు’ అన్న కోణం వైపు దృష్టి సారించగానే [నాదెండ్ల భాస్కర రావు Vs ఎన్.టి.ఆర్. ల ఉదంతం, రామోజీ, రామ్ లాల్ ల నాటకీయత నేపధ్యంలో జరిగిన పరిణామం ఇది] ఇందిరాగాంధీ హత్యగావింపబడింది. ఆవిడ హయంలో విదేశాంగ శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించిన రాజకీయ ధురీణుడు పీవీ నరసింహారావు. పరిశీలిన, వివేచన, విశ్లేషణలు నిజమైన రాజకీయవేత్తకు సహజ లక్షణాలు. బాగా దగ్గర నుండి పరిశీలించటం రీత్యా, స్వానుభవంరీత్యా, పీవీనరసింహారావు కి కుట్ర గురించి ఎక్కువ అవగాహన ఉంది. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ హయాంలో కొన్నాళ్ళు క్రియశీలకపాత్ర, ఆఫీసు కార్యకలాపాలు, నిర్వర్తించిన సోనియాగాంధీ వ్యవహార సరళి ఈయనకి తెలుసు. అపార అనుభవం కలిగిన తనకు, అప్పుడే కొత్తగా సృష్టించబడిన మానవవనరుల శాఖ కట్టబెట్టిన నాడూ, విదేశాంగ శాఖనీ, మానవవనరుల అభివృద్ధి శాఖనీ సమంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడాయన. అయితే అనుశృత పరిశీలన మాత్రం ఆయన సొత్తు. తదుపరి రాజీవ్ గాంధీ హత్య వరకూ జరిగిన అన్ని సంఘటనలకూ ఆయన ప్రత్యక్ష పరిశీలకుడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మీరు వ్రాసే టపాలలో లాగే, అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచే జరగాలి. "సర్వే జనాస్సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః..." ఇదే భారతీయ ఔన్నత్యం.

నేడు భారతీయులు మరి పాశ్చాత్య సంస్కృతీ వైపు అనేక మంది వేలం వెర్రి తో ఎందుకు ఆకర్షితులవుతున్నారు?

ఆది లక్ష్మి గారు చెప్తున్నది అదే,

ఆకర్షితులవుతున్నారు, అంటే అలా అయ్యేలా నిరంతరంగా అదే మాటని పదే పదే మన ఎదరకి తీసుకొస్తుంది మన మీడియా. మిగిలిన భారతదేశం అంతా పాశ్చాత్య దేశాలవైపు చూస్తుంది నువ్వొక్కడివే రామాయణ, భారతాలు చదువుతున్నావు అంతు ఊదరగొడతారు.దానితో నేనొక్కడినే తేదాగా ఉన్నాను అనే ఫీలింగ్ ని విజయవంతంగా మన అంతశ్చేతనలో నింపేస్తారు.
మరిన్ని వివరాలకు "మీడియా మాయాజాలం" లేబుల్లో పోష్ట్ లు చూడండి మీకే అర్ధమవుతుంది

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu