నమస్తే! 'అమ్మ ఒడి' బ్లాగ్ లోనికి స్వాగతం.
నేనూ కూడలి లో చేరాను, ఓ బ్లాగరి నయ్యాను.
అమ్మ ఒళ్ళో చిన్ని బిడ్డగా మనం తిన్న
ఆవకాయ బద్దలు, వెన్న ముద్దలూ
చందమామని చూస్థు అమ్మ ఒళ్ళో విన్న
పేదరాసి పెద్దమ్మ కధలు
మళ్లీ ఓసారి గుర్తు తెచ్చుకుందామని
ఈ బ్లాగ్ వ్రాస్తున్నాను.
జీవితంలో ద్వంద్వాలు, పరిమితులు
కధలతో కలగలిపి కబుర్లాడదామని వ్రాస్తున్నాను.
నా ఈ బ్లాగ్ మిమ్మల్ని వినోదింప చేయగలదనీ,
మీ విజ్ఞాన వివేచనల నిధుల్ని మరింత పరిపుష్టం చేయగలదని
ఆశిస్తూ వ్రాస్తున్నాను.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
7 comments:
బ్లాగ్లోకానికి స్వాగతం . హాయిగా రాసుకుంటూ సాగిపోండి. ఎటువంటి సహాయమైనా బ్లాగు గుంపు మీకు తోడుగా ఉంటుంది..
మీరిచ్చిన స్వాగతానికి బోలెడు సంతోషం వేసిందండి జ్యోతి గారు!
అహా! ఇక్కడ మనవాళ్ళు చాలా మందే ఉన్నారు, మరేం భయం లేదు అన్పించింది.
కృతజ్ఞతలు.
అలాగే వివెన్ గారికి, నల్లమోతు శ్రీధర్ గారికి కూడా కృతజ్ఞతలు.
శుభం భూయాత్! మరి వదలండి చిన్ననాటి కబుర్లు.
మీరు బ్లాగు లోకంలో చేరినందుకు అభినందనలు. మంచి పోస్టులతో అలరించండి.
కృతజ్ఞతలు
నేను వెనుక నుంచి ముందుకి వస్తున్నాను , మీరేంటీ కబుర్లు ఆడుదామంటున్నారు , దేశం గురించి అంత సీరీయస్ గా రాస్తూ .... మళ్లీ కన్ఫ్యూషన్ - శ్రీకాంత్
శ్రీకాంత్ రెడ్ది గారు,
ముందే సీరియస్ విషయాలు వ్రాస్తానంటే ఎలా కుదురుతుందండి. అన్నప్రాసన నాడే ఆవకాయ ఎవరు పెట్టరు కదండి!
Post a Comment