ఓ చిన్న ఉదాహరణతో నా వివరణ ప్రారంభిస్తాను. ఒక చిన్న పల్లెటూరిలోనో, ఓ మోస్తరు పట్నంలోనో ఉన్న బ్యాంకుకి వెళ్ళి, ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి ఋణం[loan] అడిగామనుకొండి. ఆ బ్యాంకు మేనేజరుకు కొద్దిమొత్తం మాత్రమే ఋణంగా ఇచ్చే అధికారం ఉంటుంది. మేనేజర్ లిమిట్ గా దాన్ని పిలుస్తారు. ఆ బ్యాంకు లావాదేవీల మీదా, డిపాజిట్ల మీదా అది ఆధారపడి ఉంటుంది. బ్యాంకు వ్యాపార స్థాయి చిన్నదైతే ఆ మేనేజరుకు పదో పాతికో వేల పరిమితి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఋణం కావాలంటే, అదే బ్యాంకు జిల్లా కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఋణపరిమితి పెరిగితే రీజీనల్ కార్యాలయాని, ఆ పైన ప్రధాన కార్యాలయానికీ వెళ్ళాలి.

ఏ బ్యాంకు కైనా, అది ఉన్న వూరునీ, ఊరిలోని జనాభాని బట్టే దాని వ్యాపార స్థాయి ఉంటుంది. ఎక్కువమంది ఉంటే గదా ఎక్కువ లావాదేవీలు జరిగేది, పెద్ద మొత్తంలో డిపాజిట్లు వచ్చేది? అలాంటి చోట, విశాలమైన రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే, ఆయా రాష్టాల బ్యాంకులూ, రాష్ట్ర ఆర్ధిక సంస్థలూ[state finance corporations], రాష్ట్ర పారిశామ్రిక బ్యాంకులూ, సహకార బ్యాంకులూ మొదలైన ఆర్ధిక సంస్థల వ్యాపార స్థాయి పడిపోతుంది. దాంతో ఋణాలివ్వగల స్థాయీ పడిపోతుంది. దాంతో స్థానిక ప్రజలు, వ్యాపారావకాశాలు, పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేయగల అవకాశాలు కోల్పోతారు.

అప్పుడు విదేశీ సంస్థలు చాలా మామూలుగా పాలకులని కొనుక్కుని, దేశంలోపలికీ, రాష్ట్రాల లోతుల్లోకీ వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పధకాలు చేపట్టాలన్నా, ఏ ప్రాజెక్ట్ లు ఏర్పాటు చేయాలన్నా, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పన్నువసూళ్ళు ఎంత మేరకు ఉన్నాయో, దాన్ని బట్టి మాత్రమే ఋణాలు ఇస్తాయి. అలాంటి పరిస్థితులలో పెద్ద పెద్ద ప్రాజెక్టులని చిన్నరాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేవు. కేంద్రప్రభుత్వం[ఏ పార్టీ అయినా ఒకటే] ఉన్న పరిశ్రమలనే అమ్ముకుంటున్నది. అలాంటి చోట రాష్ట్రాలకు చేయూత ఇవ్వటం అన్నది కలలో మాట.

ఈ విధంగా, ఆర్ధికంగా బలహీన పడిన భారత్ ని ఆర్ధికంగా, భౌతికంగా గెలవటానికి చైనా దాకా అక్కర్లేదు, ప్రక్కనున్న బాంగ్లాదేశ్ కూడా ఆపనిని సునాయాసంగా చెయ్యగలదు. ఇప్పటికే, ఈ దేశాన్ని, వీలయినంతగా [34 నుండి 40 దాకా]ముక్కలు కొడితే, ఇక స్థానిక ప్రజలు [అంటే భారతీయులు] శాశ్వత వినియోగ దారులై పడుంటారు తప్ప ఎప్పటికీ ఉత్పత్తిదారులు కాలేరు. అప్పుడు చైనా వంటి దేశాలకి, శ్రామిక వనరూ మార్కెట్టూ కూడా ఇండియానే అవుతుంది. ఎటూ విదేశీ ఏజంట్లే దేశాన్ని పాలిస్తున్నారు గనక, స్విస్ బ్యాంకు ఖాతాల్లో లక్షల కోట్ల డాలర్లు జమ చేస్తే సరిపోతుంది.

ఇది ప్రజలు గుర్తించకుండా ఉండేందుకు xyz జీవోలూ, నిరాహార దీక్షలూ, తీర్మానాలూ, మద్దతులూ వెల్లువెత్తుతాయి. శతాబ్ధాలుగా ’నాలుగెద్దులూ సింహం’ కథని విన్నా, మాటికీ దగా పడటంలో దేశవ్యాప్తంగా భారతీయులు సదాసంసిద్దులు.

నిజానికి చిన్న రాష్ట్రాలయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. అయితే ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులూ పెద్ద రాష్ట్రానికి చెందిన వాళ్ళా, చిన్న రాష్ట్రానికి చెందిన వాళ్ళా అన్నది అనవసరం. భద్రత ఖర్చు మాత్రం యధాతధం. హోదాల మొయింటెనెన్సూ తగ్గదు. పైపెచ్చు చిన్న రాష్ట్రాలు తీవ్రవాదుల్ని బలంగా ఎదుర్కోలేవు గనక, ఈ భద్రతల ఖర్చు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక శాఖల సంఖ్యా తగ్గదు. పెద్ద రాష్ట్రానికైనా, చిన్న రాష్ట్రానికైనా విద్యాశాఖ, హోంశాఖ, ఆర్ధిక శాఖ అన్నీ ఉంటాయి. దాంతో మంత్రుల సంఖ్యా తగ్గదు. కార్యాలయాల సంఖ్యా పెరగక తప్పదు. వందకేసుల కోసం మొయింటెన్ చేసినా, పదివేల కేసుల కోసం మొయింటెన్ చేసినా, ఫైళ్ళ మాత్రం మొయింటెన్ చేయాల్సిందే! అధికారులనీ, ఉద్యోగులనీ కూడా పోషించాల్సిందే! కార్యాలయాల భవనాలనీ సమకూర్చుకోవలిసిందే!

పట్టించుకునేంత అవసరం లేనట్లు కన్పిస్తుంది గానీ... స్టేషనరీ నుండి, రవాణా, మిస్సీలినియన్స్ ఖర్చుల దాకా, అద్దె, విద్యుత్ ఖర్చుల దాకా అన్నీ తడిసి మోపెడవుతాయి. ఎందుకంటే, గదిలో ఒక్కరున్నా, పదిమంది ఉన్నా లైట్లూ ఫ్యాన్లూ, ఏసీల ఖర్చుల్లో పెద్ద వ్యత్యాసం ఉండదు కదా! అందుకే గదా, విద్యార్ధులు గది తీసుకుని చదువుకునే చోట ముగ్గురు నలుగురు కలిసి ఉండేది? ఖర్చులు పంచుకుంటే తక్కువలో వెళ్ళిపోతుందని. ఇది రాష్ట్రాలైనా వర్తిస్తుంది. ఈ విధంగా చూసినా, జాతిమొత్తం మీద ’ఆదాయం తగ్గేటట్లు చేయటం, ఖర్చులు పెరిగేటట్లు చేయటం’ అన్న నకిలీ కణిక నీతే ప్రయోగింపబడుతోంది. తద్వారా, ఆర్ధికంగా బలహీనం చేయటమే అంతిమలక్ష్యంగా కనబడుతోంది.

అంతేకాదు, చిన్నరాష్ట్రాలుగా దేశాన్ని ముక్కలు కొడితే, బ్రిటీషు వాళ్ళు మనదేశాన్ని చేజిక్కుంచుకున్న రోజుల్లో దేశం ఎంత బలహీనంగా ఉండిందో అంత బలహీన స్థితికి తీసుకురావచ్చు. అప్పటి పాలె గాళ్ళకీ, ఇప్పటి రాష్ట్రముఖ్యమంత్రులూ, మంత్రులకీ, పెద్దగా తేడాలేదు కదా! అదే మధుకోడాలు, శిబూసోరెన్ లూ నిరూపిస్తున్నారు. అంతేకాదు, గమనించి చూడండి. ఆనాడు వీరపాండ్య కట్టబొమ్మన మీద కుట్రలు చేసి, తెల్లవాడితో చేతులు కలిపిన ఎట్టప్పల వంటివాళ్ళు, తెల్లవాడి[ప్రెంచి]విదేశీ మద్యానికీ, పార్టీలకీ కక్కుర్తి పడి, బొబ్బిలి వీరుల స్వాతంత్రేచ్ఛా పోరాటాన్ని ఓటమి పాలు చేయటానికి, ఫ్రెంచి వాడికి బొబ్బిలి కోట గుట్టుమట్లు చెప్పిన భారతీయత లేని గజపతి రాజులూ, అదే కక్కుర్తితో ఝాన్సీలక్ష్మీబాయికి మిత్రద్రోహం చేసిన సింధియాలూ, భాజపాలోనైనా, కాంగ్రెస్ లోనైనా రాణించటం! ఇది చూసినా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల నెట్ వర్కు ఎంత కాలంగా, ఎంత పకడ్బందీగా నడుస్తుందో అర్ధమౌతుంది. ఆయా ద్రోహులకి ఎంత మీడియా ఇమేజి ఇవ్వబడిందో, ఇప్పుడు కేసీఆర్ కీ అంతే ఇమేజి ఇవ్వటం, స్పష్టంగానే కనబడుతోంది.

మరో ఉదాహరణ గమనించండి. చెన్నైలో బయలుదేరిన ఓ లారీ, రాయలసీమ రాష్ట్రంలో ప్రవేశించినందుకు శిస్తు కట్టి ప్రయాణించి, తెలంగాణా రాష్టంలో ప్రవేశించినందుకు శిస్తు కట్టి ప్రయాణించి, చివరికి హైదరాబాదు రాష్ట్రంలోనికి శిస్తు కట్టి చేరిందనుకొండి. వెరసి ఆ లారీలో వచ్చిన సరుకు అసలు విలువకి ఎన్నిరెట్లు శిస్తు వచ్చి కలుస్తుంది? ఆ భారమంతా ఎవరు మోస్తారు? పోనీ, మూడో నాలుగు రాష్ట్రాల్లో కట్టబడిన శిస్తులన్నా ప్రజలకి ఉపయోగపడతాయా అంటే, ఎంత చిన్న రాష్ట్రాలయినా వాటికీ, మంత్రులూ, ముఖ్యమంత్రులూ ఉంటారయ్యె! వాళ్ల బుగ్గకార్లకీ, నక్సల్స్ నుంచో టెర్రరిస్టుల నుంచో వాళ్ల విలువైన ప్రాణాలు కాపాడేందుకు అయ్యే భద్రతకీ, అంగరక్షకులకీ, హారతి కర్పూరంలా కరిగి పోతుందయ్యె! ఇంకా రాజకీయ పునరావాసం పొందే గవర్నర్ల ముద్దూ ముచ్చట్లు తీర్చాలి మరి! ఇవన్నీ పోనూ సామాన్యుడి కేం మిగులు తుంది బూడిద?

అప్పుడు మళ్ళీ ’చిన్న రాష్ట్రం అయ్యేసరికి కేంద్రం చిన్న చూపు చూస్తోంది. కాబట్టి ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షించటానికి ఎకరా భూమి అర్ధణాకి సెజ్ ల కిద్దాం’ అంటారు. ఏ సామాన్యుడు నోరెత్తగలడు? ఎనిమిది కోట్లమంది ఉండి నిలదీయలేని వాళ్ళు, రాష్ట్రానికి రెండుకోట్లు చొప్పున నాలుగు వేరు కుంపట్లు పెట్టుకున్నాక నిలదీయగలరా?

నిలదీయగలిగి ఉంటే సారా పాకెట్లకీ, కల్లు ముంతలకీ, బిర్యాని పాకెట్లకి లొంగి పోకుండా ఇప్పటికే నిలదీయాల్సింది! జనాల ఓట్లతో నిమిత్తం లేకుండా నవీన్ చావ్లాల వంటి ఐ.ఏ.ఎస్.లతో EVMలతో టాంపర్ చేసుకున్నందుకూ నిలదీయాల్సింది! కర్నూలు వరదల్లో నకిలీ లబ్ధిదారులు చేరినందుకు నిలదీయాల్సింది! దశాబ్ధాల తరబడి గుక్కెడు మంచినీళ్ళ సరైనవి దొరక్క చెలమల్లోవి తాగీ, బోరుల్లోవి తాగీ రోగాల పాలవుతున్నప్పుడు నిలదీయాల్సింది! ప్రభుత్వాలని, అధికారులనీ, మంత్రులని నిలదీయలేరు గానీ, రోడ్డుమీద పోయే తనలాంటి మరో సామాన్యుణ్ణి తన్నటం, వాహనాల్ని లాక్కుని తగలెయ్యటం మాత్రం చేయగలగటం.... నిజంగా పీతలున్న సీసాలకి మూతలక్కర్లేని తనమే!

ఈ రోజు రాష్ట్రం విడిపోవాలనో, కలిసుండలనో లేచినంత ఉధృత ఉద్యమంలో వందో వంతు లేచినా, ఇప్పటికి ఫ్లోరిన్ లాంటి వంద సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదా?

పల్లం ఉన్న చోటికి నీరు చేరుతుంది. నీరున్న చోటికి కప్పలూ చేరతాయి. అలాగే ఉపాధి అవకాశాలు, ఆదాయవనరులూ ఉన్న చోటికి ప్రజలు కుప్ప్తతెప్పలుగా వస్తారు. ఆ విధంగా రాష్ట్రరాజధాని హైదరాబాద్ జనాలతో నిండిపోయింది. నిజానికి ఈ పరిస్థితి ఒక్క హైదరాబాదుకే కాదు, ఏ రాష్ట్ర రాజధాని కైనా ఉంటుంది. అలాగే రాజకీయ ఉపాధి, ఆదాయవనరులూ ఉన్నచోటికి రాజకీయనాయకులయినా కుప్పతెప్పలుగా వస్తారు. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణాకే కాదు, ఏ ప్రత్యేక రాష్ట్రనినాదం వెనకయినా ఉన్నదే.

ఇప్పుడు, రాష్ట్రం విడిపోవాలి లేదూ కలుసుండాలి అని కొట్టుకుంటున్న వాళ్ళు అసలు కొట్టుకుంటోంది దేని కోసం? "హైదరాబాదులేని తెలంగాణాని ఊహించలేం" అంటారు తెలంగాణా వాళ్ళు. "హైదరాబాదు లేని ఆంధ్రాని ఊహించలేం" అంటారు కోస్తా, రాయలసీమల వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి చెందిన హైదరాబాదు లో కేవలం తెలంగాణా వాళ్ళ కష్టమే లేదు. కోస్తా,రాయలసీమల ప్రజలూ పెట్టుబడులు పెట్టారు. అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. టాంకుబండు మీద విగ్రహాలు పెట్టి అభివృద్ధి చేసినప్పుడో, నెక్లెసు రోడ్డులూ, ఫ్లై ఓవర్లూ కట్టినప్పుడో, ఈ ఈ జిల్లాల పన్నుల నుండి ఇంతింత నిష్పత్తిలో వేసి కట్టాలంటూ ఎవరూ లెక్కలేయలేదు. ప్రపంచ బ్యాంకు లాంటి వాటి నుండి అప్పులు తీసుకు అభివృద్ది చేసేటప్పుడు, చెల్లింపులకీ ఫలానా ఫలానా జిల్లాల సొమ్మే వెచ్చించరు.

అంతేకాదు, ఇప్పటికి హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించిన ఈ 58 ఏళ్ళుగా, తెలంగాణా జిల్లాలు, సీమ జిల్లాలు, కోస్తా జిల్లాలు అనీ తేడా లేకుండా, అఖిలాంధ్ర ప్రజలంతా ఓ అనుబంధాన్ని పెంచుకున్నారు. ’ఇదేనండి ఇదేనండి భాగ్యనగరమూ, మూడుకోట్ల ఆంధ్రులకి ముఖ్యపట్టణం’ అన్న ఘంటసాల పాట, మూడుకోట్లు తొమ్మిదికోట్లు కావస్తున్నా ప్రతి తెలుగువాడూ పాడుకుంటాడు. ’రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాదు! రిక్షావాలా జిందాబాదు!’ అనే చలం నటనని ప్రతి తెలుగు వాడు హైదరాబాదు తో అనుబంధాన్ని కలుపుకుని ఆస్వాదిస్తాడు. అలాంటిది ఒక్కసారిగా దాన్తో అనుబంధం తెంచుకో అంటే ఏ జిల్లా వారూ ఒప్పకోరు.

ఇప్పటికిప్పుడు ’హైదరాబాదు తెలంగాణాకి ఇవ్వం’ అనండి. సమైక్యాంధ్ర రాజకీయ నాయకులంతా సైలెంటయి పోతారు. తెలంగాణా వాళ్ళు ఘోల్లుమంటారు. ఏ రాష్ట్ర రాజధాని విషయంలోనైనా ఇదే జరిగింది. పంజాబ్, హర్యానాలకి ఛండీగడ్ రాజధాని కావటంలోని ఫ్లాష్ బ్యాక్ ఇదే! ఉమ్మడి మదరాసు నుండి, 1953 లో రాష్ట్రం విడిపోయేటప్పుడు టగ్ ఆఫ్ వార్ నడిచింది ఇందుకే! చివరికి ’కర్నూలు రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు’ అంటూ ఆంధ్రరాష్టం ఏర్పడింది.

అప్పటి నుండీ కర్నూలే రాజధానిగా ఉండి ఉంటే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు ఉన్న స్థాయిలో, కర్నూలు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు ఉండి ఉండేవి. అప్పుడు హైదరాబాదు ఉన్నట్లు అన్ని జిల్లాల ప్రజలు కర్నూలు లో ఉండి ఉండేవారు. దాంతో కర్నూలు కోసం కొట్టుకుని ఉండేవాళ్ళు. తెలంగాణా బదులు, రాయలసీమ వేర్పాటు వాదులూ, కోస్తా, తెలంగాణా వాళ్ళు సమైక్యవాదులూ అయి ఉండేవాళ్ళు. [ కానీ ఇది జరిగి ఉండేది కాదులెండి. ఎందుకంటే, ఏ విధంగా చూసినా హైదరాబాదు కర్నూలు కాదు. అక్కడ నిజాం నవాబూ లేడు, నకిలీ కణికుడి పంచప్రాణాలూ లేవు మరి! అందుకే, వ్యూహాత్మకంగా రాజధాని కర్నూలు నుండి హైదరాబాదుకి మారిపోయింది.] అలాగే గుంటూరులో హైకోర్టు, ఇప్పటి దాకా కొనసాగి ఉంటే ఆ కథ వేరుగా ఉండేది.

ఇప్పుడు కోర్టు భవనాల్లో.... వేర్పాటు వాదులూ, సమైక్య వాదులూ అంటూ కొట్టుకుంటున్న న్యాయవాదులు, నిజంగా నేల కోసం, రాష్ట్రం కోసం కొట్టుకుంటున్నారా? రాష్టం విడిపోతే, హైదరాబాదు తెలంగాణా కు పోతే - తెలంగాణా న్యాయవాదులకు ఇన్ స్టంట్ గా కోర్టు భవనాలతో సహా అన్నీ మౌలిక వసతులూ ఉంటాయి. కేసులకీ, క్లయింట్లకీ, రూపాయలకీ ఢోకా ఉండదు. అందునా ఇప్పుడు క్రయవిక్రయ లావాదేవీలు, ఆ క్రమంలో ఘర్షణలూ ఉంటాయి గనక, సివిల్ క్రిమినల్ కేసులకీ కొదవుండదు.

అదే... కోస్తా, రాయలసీమల న్యాయ వాదులకైతే... కోర్టు భవనాల వంటి మౌలిక వసతుల దగ్గరి నుండీ అన్నీ సమకూర్చుకోవలిసిందే. అసలుకే ఉన్న కోర్టు జాప్యాలకు తోడు ఇక ఈ జాప్యమూ తోడైతే.... ప్రజలు ఇప్పటికే అలవాటు పడిన ప్రైవేటు పంచాయితీలకి మరింతగా అలవాటు పడిపోతారు. ఇక తమ కెరీర్ ముగిసినట్లే! ఇది చాలదా చాలినంత కొట్టుకోవడానికి?

ఇందుకోసం గాక, నిజంగానే పుట్టినగడ్డ తెలంగాణా జిల్లాల కోసమో లేక కోస్తా, రాయలసీమ కోసమో కొట్టుకునేటట్లయితే అంతకంటే విశాలంగా కన్నులు తెరిచి, తలపైకి చాచి దేశం గురించి ఆలోచించే వాళ్ళు. కట్టలోంచి పుల్లల విడిపోతే, తుంచడం తేలికన్న, ’విభజించి పాలించే ’ నకిలీ కణికుల ఏజంట్లని తుంచి పారేసే వాళ్ళు. అప్పుడు ప్రక్కవాడితో కాదు, పార్టీల అధిష్టానాలతో ఘర్ష్ణణ పడి ఉండేవాళ్ళు.

ఇది న్యాయ వాదులకే కాదు, ఉద్యోగ వ్యాపార రాజకీయ వాదులకి కూడా వర్తిస్తుంది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనలో మనం కొట్టుకోవటం కాదు, అందర్నీ కలిపి కొడుతున్న వాళ్ళనీ, కొల్లగొడుతున్నవాళ్ళనీ చూడలేకపోవటం కంటే గుడ్డితనం, మూర్ఖత్వం మరొకటి లేదు గనక!

ఒక్కసారి తార్కికంగా ఆలోచిస్తే.... స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళకు పైగా అయ్యింది. ఇప్పటికీ... ’పేదవాడు మరింత పేదవాడవ్వటం ధనికుడు మరింత ధనికుడవ్వటం’ అన్న పాతబడ్డ డైలాగు [అది నిజమే అయినా] ప్రక్కన బెట్టినా... కొన్ని ప్రాంతాలు ఇంకా అలాగే ఏ అభివృద్ధినీ నోచుకోకుండా ఎందుకు ఉండిపోయాయి? అది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాకావచ్చు, పశ్చిమ బెంగాల్ లో గూర్ఖాలాండ్ కావచ్చు, మహారాష్ట్రలో విదర్భా కావచ్చు.

ఇక్కడ ఓ ఉదాహరణ చూడండి. ఒక ఇంట్లో... తల్లిదండ్రులు, ఓ అయిదుగురు పిల్లలూ ఉన్నారనుకోండి. పిల్లల్లో మధ్యవాడు కాస్త తెంపరి వాడో, తెలివైన వాడో లేక బలమైన వాడో ఉన్నాడనుకోండి. వాడు తన కంటే బక్కగా నున్న వాళ్ళని కొట్టో, దగా చేసో, వాళ్ళ తిండి లాక్కుని తినకుండా తల్లిదండ్రులు కట్టడి చేస్తారు. పిల్లలందర్నీ కలిసిమెలిసి ఉండాలని చెబుతారు. అన్న లేదా అక్కలు, తమ్ముళ్ళు చెల్లిళ్ళని ప్రేమగా చూడాలని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవంగా చూడాలని చెబుతారు. తిండి దగ్గరి నుండీ అన్నిటినీ పంచుకోవాలని నేర్పుతారు.

తద్వారా, పిల్లలు సక్రమంగా పెరిగేటట్లు, ప్రేమాభిమానాలు, గౌరవాదరాలు కలిగి ఉండేటట్లు చూస్తారు. కాబట్టి మొత్తంగా కుటుంబం, ఆర్ధికంగానూ, సాంఘీకంగానూ పైకి వస్తుంది. ఇంట్లో అయితే తల్లిదండ్రులు, ఇలా పిల్లలు... బలమైన వాళ్ళు బలహీనులూ, పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు, ఐక్యమత్యంగా ఉండేటట్లు, ఆనందంగా ఉండేటట్లు, అంతిమంగా అందరూ సుఖసంతోషాలతో ఉండేటట్లు బాధ్యత వహిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మాటకు కట్టుబడతారు. ఇంట్లో ఇది తల్లిదండ్రుల బాధ్యత అయితే... దేశంలో, రాష్ట్రాల్లో ఇది ప్రభుత్వాల బాధ్యత అవుతుంది. బడిలో అయితే ఇదే బాధ్యతని గురువు నిర్వహిస్తాడు.

చివరికి రోడ్డు మీద, ఓ ఒక్కవాణ్ణి బలమైన వాడు కొడుతుంటే, దారిన పోయే పెద్దలు మందలించేవాళ్ళు. ఒక్కణ్ణి పదిమంది కలిసి కొడుతున్నా ఇలాగే నడిచేది. దారిన పోయే వాళ్ళే అయినా, ’పెద్దవాళ్ళు చెప్పారు ’ అని ఘర్షణ పడుతున్న వాళ్ళు కూడా సంకోచించి ఆగేవాళ్ళు. అదే ఇప్పుడయితే, ఆ పదిమంది ఒక్కణ్ణి వదిలేసి, సుద్దులు చెప్పిన దారిన పోయే పెద్దమనిషిని కొడతారేమో! ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో చూసిన ప్రభావం, ఆ పదిమందీ పెద్దమనిషిని కొట్టేందుకు తెగబడేలా చేస్తోంది. అదే సినిమాల ప్రభావం, దారినపోయే వాళ్ళని కూడా, రోడ్డుపైన ’ఒక్కణ్ణి పదిమంది కొట్టటం ’ అనే అన్యాయన్నే కాదు, మరే అన్యాయాన్నైనా చూసి, తలతిప్పుకుని పోయేలా చేస్తోంది. ’సినిమాలే గదా! ఏదో వినోదం కోసం ఏదేదో చూపిస్తారు. సినిమాని సినిమాగా తీసుకోవాలి. అలాగే వార్తాపత్రికల్లో మీడియాల్లో వచ్చే విషయాలు కూడా! ఫలానా ఫలానా సిద్దాంతం ప్రకారం అంతేనట’ అనుకుంటునో... లేదా ’మనకెందుకులే’ అనుకుంటునో పట్టించుకొని అలక్ష్యం, ఇంత అనర్ధాలని తెస్తుందన్న ఆలోచనే ఎవరికీ రానంతగా, ఇదంతా నడిచిపోయింది.

నిజానికి ఈ సినిమాలు, మీడియా ప్రచారం ఉన్న స్థానంలో, ఇతిహాసాలు పురాణగాధలు ఉన్నప్పుడు ప్రజల దృక్పధం ఇలా కొట్టుకునే విధంగా ఉండేది కాదు. ఏ పరిస్థితికైనా ప్రజా దృక్పధమే ప్రాతిపదిక అన్న విషయం గమనార్హం. శ్రీరాముడు, భరతుడు ఆస్తుల కోసమూ, రాజ్యం కోసమూ కొట్టుకోలేదు. అందుకే రాముడు భారతీయులకి దేవుడయ్యాడు. శ్రీరాముడితో పాటు, అన్నను సేవించిన లక్ష్మణుడి మూర్తి కూడా, ఆలయాల్లో పూజలందుకుంటుంది. భారతంలో ధర్మరాజూ, భీమార్జున నకుల సహదేవులు కూడా, ఆస్తుల కోసమో, రాజ్యాల కోసమో కొట్టుకోలేదు. త్రేతాయుగం నుండి ద్వాపర యుగం వచ్చేసరికి, అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవులు రాజ్యం కోసం కొట్టుకున్నారు. కాబట్టే, భారతంలో గీతాచార్యుడు శ్రీకృష్ణుడు భగవంతుడయ్యాడు గానీ, పాండవులో కౌరవులో కాదు. దుర్యోధనుడికి గుడికట్టబడటం, దాన్ని గురించిన ప్రచారం, నకిలీ కణికుల గూఢచర్యంలో భాగమే!

ఇంతగా... ఇతిహాసాల నుండి, పెద్దల ఆచరణ నుండి సంక్రమించిన వారసత్వంతో ఏర్పడిన దృక్పధంతో ఉండిన భారతీయులని, చివరికి - ’అన్నా అక్క్ల’లని పేరుతో పిలిచే చెల్లీ తమ్ముళ్ళని మందలించకపోగా, అదో మురిపెం అన్నట్లు చూసే స్థాయికి తల్లిదండ్రులను దిగజార్చారు. చివరికి - నిద్రలేవగానే తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కారాలు పెట్టేంత లేకపోయినా...కనీసం పండగ రోజుల్లోనో, పుట్టిన రోజునాడో, దేవుడి పూజానంతరం తల్లిదండ్రుల చేతికి అక్షితలు ఇచ్చి పాదాభివందనం చేసే స్థితి నుండి, వినమ్రంగా మాతాశ్రీ, పితాశ్రీ అని పిలవక పోయినా ’అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు కాబట్టి వినాలి’ అనుకునే స్థితి నుండి, తండ్రిని ’ఒరే డాడీ’ లేదా ’చూడు విశ్వేశ్వర్రావ్’ అనటం ఫ్యాషన్ అయ్యేస్థితికి దిగజార్చారు. [ఇలాంటి పుత్రరత్నాల్నీ, పిల్లలు పేరుతో పిలిస్తే మేం అడ్వాన్స్ డ్ పేరేట్స్ అనుకునే తండ్రుల్ని, సినిమాలో కాదండి, నిజంగానే చూశాను.]

ఇంతగా ప్రజా దృక్పధాన్ని నాశనం చేశారు గనకనే, మనలో మనకి తగవులు పెట్టి తమ దోపిడి నిరాటంకంగా సాగేలా చూసుకుంటున్న వారిని తన్ని తగలెయ్యటం మాని, తోటివారినీ, ఆర్టీసీ బస్సుల్ని, BSNLకేబుళ్ళ వంటి స్వంత ఆస్తుల్ని, తన్ని తగలేసుకుంటున్నాము.

ఇక ఈ ప్రజా దృక్పధాన్ని నాశనంలో... తెలంగాణా వాళ్ళు, యావద్భారత జాతి తో పోల్చుకుంటే రెట్టింపు పీడితులూ, బాధితులూ! నకిలీ కణికుల జన్మ స్థానమైన, హైదరాబాదు నిజాం రాజ్యపౌరులైన తెలంగాణా ప్రజలు, శతాబ్ధాలుగా దారుణ అణచి వేతకు గురయ్యారు. వాళ్ళని అలా దుంపనాశనం చేసిన నిజాంలని వదిలేసి , నిజాంలని పొగుడుతున్న తాగుబోతు కేసీఆర్ ల వంటి నాయకులని సమర్ధిస్తూ, తమ వెనకబాటు తనానికి తోటి వారెవ్వరో కారణమని విలపించటం సరైన దృక్పధం లేకపోవటాన్నే సూచిస్తుంది.

ఎలాగంటే...
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

you are writing very well. the above piece is superlative. you are a prolific writer. But I did not understand this ' Nakili Kanikudu" and the Ramojirao connection.

well explained ...
Samikya andhra

good post i agree with you

మీరు వ్రాస్తున్నవి అక్షర సత్యాలు మేడం. సమస్య యొక్క మూలానికి వెళ్లి ఎవరు చూడటం లేదు :(

madam, you are writing from a business prospective..even though it is a bigger market what happend in Telangana...oka sari HYD nundi telangana districts velli choodadandi madam..how telangana people are deprived of their rights/control over resources in Telangana...

my reply to above post....if it is agreed that the states should be created on basis of development deprivation...we may end up creating 5-6 states in andhra....

kvrn గారు,

నకిలీ కణికుడు, రామోజీరావు ప్రమేయం గట్రా తెలియాలంటే; నా బ్లాగులోని ’అన్ని టపాలు ఒకేసారి చూడలంటే’ అనే లేబుల్ లో చూడండి. ఎందుకంటే అది ఒక్క టపాలో చెప్పలేని సుదీర్ఘమైన విషయం. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

~~~~
కృష్ణ గారు, అజ్ఞాత గారు, వీరుభోట్ల వెంకట గణేష్ గారు,

వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

~~~~
అజ్ఞాత గారు,

ఈ టపాల మాలిక పూర్తయ్యేవరకూ ఓపిక పట్టండి. నెనర్లు!

Once again you came with great article madam.. First part frustrated me bit.. but later parts you are spot on. I dont thing only Telangana people only responsible for seperate state. Every region has their one share of this sin.

అండాడానికీ బ్రహ్మాండానికీ ఎంత సారూప్యం ఉందో కదా అనిపించిందండీ ఈ టపా చదివాక. కాకపోతే ఇక్కడ అండాండం కుటుంబం, బ్రహ్మాండం దేశం. కుటుంబస్థాయిలోనే తగాదాలూ కలహాలూ బయలుదేరుతున్న తరుణంలో, దేశంలో కూడా అది ప్రతిబింబించడం ఆశ్చర్యకరం కాదు. కుటుంబవిలువలు కోల్పోయిన తర్వాత సామాజికవిలువలు కోల్పోవడం పెద్ద కష్టం కాదు. ఆలోచింపజేశారండీ. నెనర్లు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/

* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu