గత టపాలలో చెప్పినట్లు సినిమాల ద్వారా నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం మధ్య సంభాషణ నడుస్తుంది. నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకీ నెం.5 వర్గానికీ మధ్య మరింత స్పష్టమైన భాష నడుస్తుంది. రామోజీరావు మాతో కూడా, సినిమాల ద్వారా ప్రత్యేకంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటాడు.

కొన్నిటి గురించి గత రెండు టపాలలో వివరించాను. అలాంటి సినిమా భాష చాలానే ఉన్నా.... మరి రెండు సినిమాలతో ఈ అంశం ముగిస్తాను. వాటిలో ఒకటి అరుంధతి, మరొకటి మున్నా.

అరుంధతి సినిమా:
కథ విషయానికి వస్తే - గద్వాల మహా సంస్థానపు రాజుకి ఇద్దరు కూతుళ్ళు భార్గవి, అరుంధతి. పెద్దామె మెతక, చిన్నామె సమర్ధురాలు. రాజు గారి చెల్లెలు అత్తిల్లు వదిలి ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. రాజు గారికి మాయ మాటలు చెప్పి, జాతకాలంటూ నమ్మించి భార్గవిని తన కొడుకు పశుపతికిచ్చి పెళ్ళి చేయిస్తుంది. వీడు పరమ నీచుడు. మకార మక్కువ గలవాడు. ఊళ్ళో కనపడ్డ పిల్లనల్లా ఎత్తుకుపోతున్నా , ప్రజలు ఏడుస్తూ ఊర్కుంటారు. రాజుగారు కూతురి కోసం సహిస్తూంటాడు.

ఇలాంటి ఈ సంస్థానంలో అందరూ హాయిగా ఉండేవారని పనిమనిషి చంద్రమ్మ[ముసలి బొమ్మాళి] చెబుతుంది. ఓ రోజు పశుపతి బాగా తాగి ఊగుతూ వచ్చి, అరుంధతికి నాట్యం నేర్పడానికి దూరప్రాంతం నుండి వచ్చిన అంధ నాట్యాచారిణిని బలాత్కరించి చంపేస్తాడు. నిస్సహాయంగా భార్గవి ఉరిపోసుకు చచ్చిపోతుంది. అప్పటి వరకూ ఆమె కోసం సహించిన వారు కావటంతో ప్రజలూ, రాజు అందరూ ఆగ్రహిస్తారు. రౌద్రంతో అరుంధతి పశుపతినీ, వాడి తల్లినీ శిక్షిస్తుంది. పశుపతిని గుర్రానికి కట్టి ఈడ్చి పారేయిస్తుంది.

వాడు ఆఘోరాల చేత రక్షింపబడి క్షుద్రవిద్యలు నేర్చుకుని తిరిగి వస్తాడు. వాణ్ణి చంపడానికి గోళ్ళుపెంచిన సాధువులు అనేక రూల్సు అండ్ రెగ్యులేషన్స్ చెబుతారు. వాటన్నిటి ప్రకారం అరుంధతి[సీనియర్] పశుపతిని నట్టింట సజీవంగా సమాధి చేస్తుంది. రాజ భవంతి ఖాళీ చేసి కొత్తది కట్టించుకుంటారు. సమాధిలోంచి కూడా పశుపతి ఆత్మ, సంస్థాన ప్రజల్ని ఈతి బాధలతో, అంటురోగాలతో, కరువు కాటకాలతో బాధిస్తాడు. జేజెమ్మ అవతారమైన అరుంధతి[సీనియర్] కి దైవ సహాయం లభించదు. ఎన్నో తీర్ధాలూ, క్షేత్రాలూ తిరిగి చివరికి సాధువుల సలహా మేరకు ఆత్మత్యాగం చేస్తుంది.

అత్యంత దారుణమైన చావుని,... మరుజన్మకు కూడా తనకి ప్రతీకారం గుర్తుండేంత దారుణమైన చావుని వరిస్తుంది. తలపైన టెంకాయలు కొట్టించుకుని రుధిర ధారలు స్రవిస్తుండగా మరణిస్తుంది. ఆమె ఎముకలతో ఒక బాకు, ఆమె మంగళ సూత్రాల వంటి నగల బంగారంతో పిడినీ తయారు చేసి, అఘోరాని చంపే నియమ నిష్ఠల ప్రకారం ఆ సాధువులు ఆయుధాన్ని దాచి పెడతారు. మూడు జన్మల తర్వాత అదే వంశంలో పుడతాననీ, అలా పుట్టిన ఆడపిల్లకీ తన పేరు పెట్టమనీ చనిపోయిన జేజెమ్మ , ఇదంతా వ్రాసి తన బొమ్మగా చిత్రిస్తుంది.

మూడు తరాల తర్వాత పుట్టిన చిన్న అరుంధతి పెళ్ళితో ప్రారంభమైన సినిమా కథలో, ఇదంతా ప్లాష్ బ్యాక్ గా చెప్పబడుతుంది. గద్వాలకు వచ్చిన అరుంధతి [జూనియర్] పైన ప్రతీకారం తీర్చుకునేందుకు పశుపతి ఆత్మ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో పశుపతి తల్లి ఆత్మ వాడికి సాయపడుతుంది. పెద్ద అరుంధతి పెద్దకుమారుడి ఆత్మ దాన్ని నిరోధించలేక నిస్సహాయమౌతుంది.

ఇక్కడి నుండి కొని విచిత్రాలు జరిగాక, చిన్న అరుంధతి అన్వర్ అనే మంత్రాల సాయిబు సాయం తీసుకుని, పశుపతి ఆత్మని నాశనం చేస్తుంది.

స్థూలంగా ఇదీ కథ.

ప్రత్యేకాంశాలు:
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పబడింది దుష్టాత్మలకీ, పుణ్యాత్మాల కంటే ఎక్కువ శక్తి ఉండటం! పశుపతి ఆత్మని నాశనం చేసే లోపల, చిన్న అరుంధతి భయ విహ్వలయై కెవ్వుకెవ్వున అరుస్తుంటుంది. పెద్ద అరుంధతి [జేజెమ్మ] పశుపతిని చీల్చి చెండాడితే, చిన్న అరుంధతి, జేజెమ్మ తనని పూనిన సమయంలో మాత్రమే "నువ్వు నన్నేం చేయలేవురా?" అని హుంకరిస్తుంది గానీ, మిగిలిన సమయాల్లో భూత వైద్యుడు అన్వర్ సాయం కోసం అరుస్తూ, పరుగెడుతూ, కాబోయే భర్త రాహుల్ ను కాపాడుకునేందుకు అన్వర్ గదిలోని విభూతి[?]ని బకెట్లు లోంచి దోసిళ్ళతో తీసి గడపలో పోస్తూ, భయోత్పాతంలో ఉంటుంది.

తాను జేజెమ్మను కాననీ, తనకంత శక్తి లేదనీ ఆక్రోశిస్తుంది. చివరికి అన్వర్, పనిమనిషి చంద్రమ్మ ధైర్యం చెప్పగా, పశుపతిపై దాడికి కత్తిపడుతుంది.

ఇక పశుపతి అఘోరా ఆత్మకే కాదు, వారి తల్లి దెయ్యానికున్నంత శక్తి కూడా, పెద్ద అరుంధతి ఆత్మకు లేనట్లే ఉంటుంది. ఆమె మరుజన్మలోని చిన్న అరుంధతి యొక్క భయం దీన్నే చెబుతుంది. అఘోరా చేతిలో మరణించిన రాజు గారి ఆత్మకి గానీ, వాడి ఆకృత్యాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భార్గవి ఆత్మకి గానీ, ఎవరికీ శక్తి ఉండదు. బ్రతికున్నప్పుడే కాదు, చచ్చిపోయాక కూడా దుష్టులకే శక్తి ఎక్కువన్నది చెప్పడమే ఆ సినిమాలో దర్శక కథకుల ప్రధాన ఉద్దేశంలా ఉంటుంది.

చిట్టచివరికి చంద్రమ్మ కూడా అఘోరా చేతిలో చచ్చిపోయాక, చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా, నానా కష్టాల అనంతరం, చిన్న అరుంధతి అన్వర్ విసిరిన పెద్ద జేజెమ్మ అస్థికల ఆయుధాన్ని తన రక్తంతో తడిపి అఘోరాని సంహరించటం ఇందులో విశేషం. చిన్న అరుంధతి మిగతా కుటుంబసభ్యుల పాత్ర నామామాత్రమే గాక, ఏ సహాయం చేయరు.

ఇందులో ప్రత్యేక పాత్ర అన్వర్ ది. ’మన భగవద్గీత’ అనే ఈ ముస్లిం మంత్రవైద్యుడు.... భగవంతుడు అనే భావాన్ని చూపించలేమని చెప్పడానికి లైవ్ డెమోగా, నొప్పి అనే భావాన్ని చూపించమంటాడు. అది చక్కని తర్కమే! అయితే దేవుణ్ణి నమ్మితే దెయ్యాన్నీ నమ్మాల్సిందేనంటాడు. ఇది కుతర్కం! దేవుడికి సమాంతర శక్తిగా దెయ్యాన్ని హిందూయేతర మతాలు నమ్ముతాయి కానీ, హిందూ మతం దాన్ని ప్రతిపాదించదు. గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం ఏవి మంచిలక్షణాలో దైవీ స్వభావాలో, ఏవి చెడ్డలక్షణాలో రాక్షస స్వభావాలో చెబుతుంది. గీత త్రిగుణాత్మకంగా మానవ మనస్తత్వాన్ని వివరిస్తుంది. అంతేతప్ప దయ్యాన్ని ప్రతిపాదించదు.

దైత్యాదైత్యులు కశ్యప ప్రజాపతి దితి, అదితి బిడ్డలే! సవతి బిడ్డలైన వారిలో ఆయాలక్షణాలుండటమే విషయం. వైకుంఠ ద్వార పాలకులు అతి కౄర రాక్షస జన్మలెత్తడాన్ని భాగవతం ప్రతిపాదిస్తుంది. అదీ చేసిన ’కర్మ’ [సనక సనందాది మునులను అవమానించిన కర్మ] ఫలితాన్ని అనుభవించటమే. అంతే తప్ప దేవుడి కంటే బలమైన దెయ్యాలుండటం కాదు.

అలాంటి చోట, పశుపతి అఘోరా శక్తిని నాశనం చేయటానికి పెద్ద జేజెమ్మ ప్రాణాలర్పించి అస్థికలతో ఆయుధం చేయిస్తే, దాన్నీ తన రక్తంతో అభిషేకించి గానీ చిన్న జేజెమ్మ , పశుపతిని నాశనం చేయలేదనటం... ఎంతగా విలన్ ని బలవంతుడిని చేయటమో!

ఇక అన్వర్, చిన్న జేజెమ్మని ఓ సారి భవంతిలో కాపాడేస్తాడు. ఆపైన ఆయుధాన్ని తెచ్చి అందిస్తాడు. అతణ్ణి తన జట్టులో చిన్న జేజెమ్మ చేర్చుకోవటంతో ఇదంతా సాధ్యపడుతుంది. అన్వర్, చంద్రమ్మ, చిన్న జేజెమ్మ కలిసి, పెద్ద జేజెమ్మ బొమ్మలోని వివరాలు చదువుతుండగా అది తగలబడిపోతుంది.

"బ్రతకాలన్న ఆశ నీకు కలిగించాలి. బ్రతికేందుకు అవకాశం ఉందని నీకు తెలియాలి. అందుకోసం నువ్వు పరుగులెత్తి చావాలి. అందుకే ఇక్కడి దాకా చదవనిచ్చాను" అంటూ పశుపతి ఆత్మ కర్కశంగా నవ్వుతుంది. మొత్తంగా బ్రతకాలంటే భయం వేయాలన్నది అక్కడ విషయం. [ఇదే విషయం మున్నా సినిమాలో మున్నా ఖాఖాకీ, జల్సా సినిమాలో సంజయ్ సాహుకి విలన్ ముకేష్ ఋషి చెబుతారు. ఇదే జల్సాలో తరువాత హీరో కూడా అదే విషయం విలన్ కి చెబుతాడు, ప్రాక్టికల్ గా చేసి చూపుతాడు.]


ఈ సినిమాకి అనువర్తన ఆసక్తికరమైనది. అది బాగా అర్ధం కావాలంటే అనువర్తన కంటే ముందుగా ’అరుంధతి’ సినిమా కథకి వెనక నున్న కథనీ, ఆ నేపధ్య పరిస్థితులనీ వివరించాల్సి ఉంది.

అరుంధతి కథ వెనకనున్న కథ:
అరుంధతి సినిమా 2009 సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, కొద్దిరోజులు వాయిదాపడి, కథలో చిత్రీకరణలో కొన్ని మార్పుచేర్పులు చేయబడి విడుదలయ్యింది. మేము 2008 నవంబరులో ’అమ్మఒడి’ బ్లాగు ప్రారంభించి మీడియా మాయాజాలాన్ని వివరిస్తూ.... క్రమంగా డిసెంబరు తొలివారంలో నకిలీ కణికుడి గురించి పరిచయ టపాలు వ్రాసాము. కణిక నీతి గురించీ, విభజించి పాలించే కూటనీతి గురించీ అప్పుడే వివరించాము. డిసెంబరు 20 - 22 లలో మా ఆంగ్ల బ్లాగు Coups On World ప్రచురించాము. నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ స్ట్రాటజీలని, వివిధ రంగాలపై వాళ్ళ కుట్రలనీ, మా కేసునీ, సాక్ష్యాధార పత్రాలతో సహా అందులో ఉంచాము.

అప్పటి వరకూ రాజకీయ రంగంపై మా అవగాహన గురించిగానీ, సోనియా బృందం గురించి మా అభిప్రాయం గానీ, మొత్తంగా మా అవగాహన ఎంత అన్న విషయం.... ఏవీ రామోజీరావుకి తెలియదు.అవి నమ్మకంగా తెలుసుకునేందుకు మా కుటుంబమిత్రుడు ఖాసీంని ప్రయోగించాడు.

ఈ సినిమాలో [అఘోరా] పశుపతి రామోజీరావుకి ప్రతీక అయితే, సీనియర్ అరుంధతి [జేజెమ్మ] పీవీజీకి ప్రతీక! ఇక చిన్న జేజెమ్మ అంటే జూనియర్ అరుంధతికి మేమే ప్రతీకలమన్న మాట.

1992 నుండి తాను పదవి దిగిపోయే వరకూ - ఖచ్చితంగా చెప్పాలంటే 1995 లో మేము ఫ్యాక్టరీ ఖాళీ చేసే వరకూ పీవీజీ మాకు గూఢచర్యం గురించి ప్రాధమిక అవగాహన కల్గించాడన్నది రామోజీరావుకి రూఢిగా తెలుసు. అది తెలుసుకునేందుకే మా తమ్ముళ్ళని నారా లోకేష్ స్నేహం పైకారణంగా చంద్రబాబునాయుడు చేరదీసాడు. నా డైరీ సేకరించి మరికొంత తెలుసుకున్నారు.

1995 నుండి 2005 వరకూ మేము ఏవీ ఆలోచించలేదు, పట్టించుకోలేదు. కనీసం టీవీ, పత్రికల ద్వారా వార్తలు కూడా పట్టించుకుని చూసేవాళ్ళం కాదు. అయితే దాని గురించి రామోజీరావు కి స్పష్టత లేదు. మొత్తంగా పీవీజీ, నెం.5 వర్గం మాకు ఏదో అవగాహన కలిగించారని, అది నిరంతరం నడిచిందనీ, నడుస్తోందనీ వాళ్ళ అనుమానం. అందుకే మమ్మల్ని వేధించి మరీ శోధించారు.

ఈ స్థితిలో.... రామోజీరావు, నెం.5 వర్గపు మాస్క్ వేసుకుని ’అరుంధతి’ ద్వారా మాకు స్ఫురింప చేయదలచింది ఏమిటంటే - పీవీజీ తాను పదవిలో ఉండగా అఘోరా పశుపతి వంటి రామోజీరావుని గూఢచర్యపరంగా సజీవ సమాధి చేసినంతపని చేసాడు. అంటే పూర్తిగా నిర్వీర్యం చేసాడు. అయితే చెడ్డవాడికి శక్తి ఎక్కువ గనుక, రామోజీరావు మళ్ళీ గూఢచర్య బలం పుంజుకుని ప్రజలని బాధలు పెడుతున్నాడు. దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అప్పట్లో పీవీజీ మీకు అవగాహన కలిగించిన విషయాల వంటివి జేజెమ్మ అస్థికలతో చేసిన ఆయుధానికి ప్రతీక. ఇంకా అలాంటి రహస్యాలు ఆయన నిగూఢంగా ఉంచాడు.

ఈ అన్వర్ లాంటి వాడే మా కుటుంబ మిత్రుడు ఖాసీం. కాబట్టి అతణ్ణి మా జట్టులో కలుపుకుని, మాకు తెలిసిన విషయాలన్నీ అతడితో పంచుకుని, అతడి సాయం తీసుకుంటే గాని మేము ఈ బాధల నుండి రక్షింపబడలేము - ఇదీ మాకు చెప్పదలుచుకున్నది.

ఇక్కడో విశేషం ఏమిటంటే - 2007 లో శ్రీశైలం నుండి నంద్యాల చేరాక, దాదాపు అరునెలలు పాటు ఖాసీంని, అతడి కుటుంబాన్ని పరిశీలించుకున్నాకే 2007 డిసెంబరు ఆఖరి రోజుల్లో వాళ్లతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నాము. దాంతో 2008లో తరచుగా ఈనాడు వసుంధర, మాకు స్నేహాలను పోగొట్టుకోవద్దనీ, పూర్వ స్నేహితులని పునరుద్దరించు కొమ్మనీ చెబుతుండేది. ఆ వివరాల గురించి గతటపాలలో వ్రాసాను. మేము అదేదీ పట్టించుకోకుండా మా పని మేము చేసుకుపోతుండే వాళ్ళం.

అరుంధతి సినిమా 2009 సంక్రాంతికి విడుదల కానుండగా, 2008 డిసెంబరులో మేము coups on world ని విడుదల చేసాము. ఈ సినిమాని చేయాల్సినంతగా మీడియా హోరెత్తించ లేదు. Coups On World లో మేం కనబరిచిన గూఢచర్య, రాజకీయ అవగాహనకి ఖాసీంని నమ్మమని చెప్పటం... తమకి కూడా తెలివితక్కువగా, నాసిగా అన్పించటంతో మీడియా హోరు తగ్గింది. నందులు వచ్చాయిలెండి.

’ఇంత వరకూ ఏ మేలూ చేయలేదు గనుకా, రామోజీరావు మీది కేసుని చేపట్టలేదు గనకా.... సోనియానీ, మన్మోహన్ సింగ్ నీ, వై.యస్.నీ నమ్మకపోతే నమ్మక పోయావు, కనీసం ఖాసీం నన్నా నమ్మండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చిన వాడు. మీ జట్టుకు చెందిన వాడు కాకపోతే మీకు ఎందుకు ఆశ్రయం ఇచ్చి సాయం చేస్తాడు? కాబట్టి ఇతణ్ణి నమ్మండి. నమ్మి అన్ని విషయాలు అతడితో పంచుకొని చర్చించండి. అప్పుడు అతడు మీకు మరింతగా సాయం చేయగలుగుతాడు. మీకు మరింత అవగాహన కలగాలంటే మీకున్న అవగాహనని అతడితో పంచుకోవాలి మరి’ - ఇదీ చెప్పబడింది!

2006 నవంబరులో ఖాసీం భార్యకు శ్రీశైలం ప్రాజెక్ట్ [సున్నిపెంట] నుండి నంద్యాలకు బదిలీ అయ్యింది. అదీ సందిగ్ధా అసందిగ్ధాల నడుమ సంవత్సరం పాటు నలిగి చివరికి బదిలీ ఖరారయ్యింది. అప్పట్లో ఓ రోజు మేం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆరోజు ఈనాడు హాయ్ బుజ్జీలో పర్యావరణ సమతుల్యత గురించో, పులుల గురించో గాని ఒక వ్యాసం వచ్చింది. పులి బొమ్మ రంగుల్లో ముద్రించిన ఆ వ్యాసపు శీర్షిక ’నేనుంటే మీకే లాభం!’ అని.

దాన్నే ఖాసీం ఎత్తి చూపిస్తూ, "చూడమ్మాయ్! ’నేనుంటే మీకే లాభం అట’. ఈ వ్యాసం చాలా బాగా వ్రాసారు కదూ!" అన్నాడు. మేమూ అలాగే అనుకున్నాము. ’ఆ ఊరిలో మాకు సహాయం చేసేవాళ్ళల్లో ఒకరు బదిలీ అవుతున్నారే ’ అన్న ఆలోచన తప్ప మరేది లేదు. మాకు జరుగుతున్నది మంచా చెడా అన్న ఆలోచన తప్ప, ఇంకేం ఆలోచించలేదు. తరువాత ఆరునెలలకు మేమే శ్రీశైలం నుండి నంద్యాలకు వచ్చాము.

అప్పటికి రామోజీరావు మాతో మాట్లాడతాడని గానీ, అందులోనూ నెం.5 వర్గపు ముసుగు వేసుకుని మాట్లాడతాడని గానీ, మాకు స్పృహ లేదు. ఖాసీంతో స్నేహం తెగతెంపులు చేసుకున్నాకే దాని మీద మరింత అవగాహన వచ్చింది. అందునా అతడి స్నేహాన్ని పునరుద్దించుకోవాలని, ఈనాడు రామోజీరావు విన్యాసాలు చేయటం చూశాక మరింతగా తెలిసి వచ్చింది.

ఆ తర్వాతే ’ఆరునెలలు పరిశీలన’ని మరింతగా విశ్లేషించుకున్నాము. 2007 లో నంద్యాలకు చేరాక, వెంటనే ఏ వృత్తి చేపట్టాలా అన్నది తేల్చుకోలేకపోయాము. ఓ ప్రక్క - ’మరో వృత్తి వెదుక్కున్నా, ఉద్యోగం చూసుకున్నా, మహా అయితే మరో రెండు మూడేళ్ళు! మళ్ళీ ఊడగొట్టడం ఖాయం. ఇలా ఎన్నాళ్ళని, ఎన్ని ఊళ్ళని మారతాం? తాడో పేడో తేల్చుకోవాల్సిందే’ అనే ఆలోచనా చేసాము. ఇవేవీ మేము ఎవరితోనూ చర్చించలేదు. ఖాసీంతో కూడా! వాళ్ళతో సహా ఎవరెంతగా ప్రత్యక్ష, పరోక్ష వత్తిడి చేసినా!

అలాంటి సమయంలో ఖాసీం, అతడి కుటుంబంతో సహా " గోవా వెళ్ధాం" లేదా అక్కడికి వెళ్థాం. ఇక్కడికి వెళ్థాం అనేవాడు. ఏతావాతా మా దగ్గరున్న డబ్బునిల్వలు కరిగించే ప్రయత్నం చేసేవాళ్ళు అతడూ, అతడి భార్య! ఓ ప్రక్క ’అవసరమైతే ఓ నెల ముందే చెప్పండి, డబ్బు సర్ధుతాం’ అనేవాళ్ళు. మరో ప్రక్క మమ్మల్నే చేబదులు అడిగేవాళ్ళు. చాలాసార్లు..... జాలీగా గడపటం అన్నప్పుడల్లా "ఉండండి భయ్యా! మళ్ళీ బండి పట్టాల మీదికి ఎక్కించాలి. స్కూలు పోయింది కదా? మళ్ళీ ఏదైనా ఆదాయ వనరు వెతుక్కునే వరకూ No Trips" అన్నా , ఆ క్షణం ఊర్కునే వాళ్ళు. మళ్ళీ ’గోవా వెళ్థాం’ అంటూ మొదలు పెట్టేవాళ్ళు.

ఎంత పొదుపుగా ఉన్నా, మరో ఆదాయ మార్గం లేనప్పుడు డబ్బునిల్వలు కరిగి పోవటం ఎంత సేపు? అటువంటి పరిస్థితులలో 2008 మధ్య కల్లా మళ్ళీ మేం సూర్యాపేట నాటి భయోత్పాత స్థితికి తరమ బడటం ఖాయం.

అప్పుడు "చూశావా? ఇదంతా రామోజీరావు బలం! అతడి గూఢచర్యం బలమైనది. పీవీజీ పోరాడి పోరాడి ఓడిపోయి మరణించాడు. అయితే అప్పుడేదో మీకు అవగాహన కలిగించాడు కదా! అలాగే మరికొన్ని విషయాలు నిగూఢంగా ఉంచాడు. మీరు ఖాసింని [వీలు కుదిరితే ఖాసీం స్థానంలో వై.యస్.నీ, ఇంకా వీలు కుదిరితే సోనియాని ఉంచాలన్నది రామోజీరావు ప్రధానలక్ష్యం!] జట్టులో కలుపుకుని పనిచేస్తే, అతడికి అన్ని విషయాలు చెబితే.... ఇదంతా పరిష్కరించ వచ్చు- మాకు ఈ ఊదర పెట్టటమే ఆరుంధతి చిత్రంతో మా పరంగా ఆశించిన ప్రయోజనం.

అయితే 2008 మార్చిలోనే మేం ఏదో వ్రాస్తున్నామన్న విషయం రామోజీరావుకి నిర్ధారణ అయ్యింది. దాంతో ఖాసీంతో స్నేహాన్ని పునరుద్దించాలనే వేగం పెరిగిపోయింది. అది మాకు మరింత స్పష్టత నిచ్చింది. మరో రకంగా చెప్పాలంటే - రామోజీరావు వ్రాతలు, మా చుట్టు ప్రక్కల జరిగే అతడి పరోక్ష ప్రమేయపు చర్యల తోనే మాకు చాలా విషయాలు అవగాహనకి వచ్చాయి.

ఇక.... అప్పుడప్పుడూ హాస్యం కోసం ఇలాంటి హారర్ చిత్రం చూస్తుంటాము. ఏమైనా, ఈ సినిమాలో దర్శకత్వ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల కంటే మెచ్చదగినది డబ్బింగ్ కళాకారుల ప్రతిభ. ’వదల బొమ్మాళీ నిన్నొదల’ అంటూ పశుపతికీ, "నువ్వు నన్నేం చెయ్యలేవురా!" అంటూ అరుంధతికీ డబ్బింగ్ చెప్పిన వారిది మాత్రం చెప్పుకోదగిన నైపుణ్యం.

ఇక ఈ ’వదల బొమ్మాళీ నిన్నొదల’ ఎంతగా హిట్టయిపోయిందో అంతగా అందరూ ఉపయోగించేయడం జరిగింది. మేమూ ఈ డైలాగుతో బోలెడు జోకులు పేల్చుకు నవ్వుకుంటుంటాము.

ఇక మున్నా సినిమా:

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

ఈదేశాన్ని అన్వర్ సాయబు, కేతిగాళ్ళే కాపాడాలి. సందేహం లేదు.

మీరు ఒక విషయం గమనించారో లేదో ఈ సినిమాని నిర్మించిన శ్యాం ప్రసాద రెడ్డి ETv లో వచ్చే ఢీ -1,2,3 లకి సమర్పకుడు.ఈ కార్యక్రమాలను సమర్పించే సమయంలోనే అరుంధతి సినిమా విదుదలవడం జరిగింది .ఇంకో విషయం ఏంటంటే అరుంధతి ప్రదర్శించే ధియేటర్ లలో ఢీ-1,2 తాలూకు ట్రైలర్లను ఆ సినిమాతో పాటు ప్రదర్శించేవారు

మొదటి అజ్ఞాత గారు : నెనర్లండి :)

రెండవ అజ్ఞాత గారు: ఈ శ్యాంప్రసాద్ రెడ్డి చలన చిత్రాభివృద్ది సంస్థకు మాజీ ఛైర్మన్, మల్లెమాలగా ప్రసిద్దుడూ అయిన యం.ఎస్. రెడ్డి కుమారుడండి. ఏ వ్యాపారం చేయాలో రామోజీరావుతో కారులో ప్రయాణిస్తూ, అతడి నుండి కౌన్సిలింగ్ పొంది, తరువాత సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చినవాడు. ఇక చెప్పేదేముంది? ఈ టీవీ ’ఢీ’గురించి మాకు తెలియదు. వివరాలిచ్చినందుకు నెనర్లండి!

మొదట్లో అసలేమాత్రం అర్థం అనిపించదు... లోతుకు వెళ్తున్నకొద్దీ సాంద్రత పెరుగుతుంది... చాలా అర్థవంతమైన విశ్లేషణ ..

amma odi gaaru,
ramoji rao mimmalni enduku vedhistaadu?meeru edho maanasika samasyotho baadha padutunnaru..konchem doctor nu consult avvandi..

amma..mee rachanaa shaili chaala baagundi..ee raamoji gol aapi meeru edanna kadhalu kaani,vishleshanalu kaani raaste tappaka meeku manchi peru pratishtalu vasthaayi..idi chadivi nenu edo raamoji rao friend anukovaddu..naaku asalu raamoji rao ante padadhu..

i can't control my laugh after seeing above two comments :) :) :) ....

haha... I think the above commented 2 anonymous persons are one. one was written at 2:44PM and another at 2:48PM.

Amma Odi gaaru, can you confirm this with their IP addresses..

అయిదో అజ్ఞాత గారు : నెనర్లండి!:)

కృష్ణగారు : మీ పరిశీలన సునిశిత దృష్టితో ఉందండి. తొలిరోజుల్లో మేమూ ఇలాగే ప్రారంభించాము. ఇదే అందరికీ అలవడాలని మా ఆకాంక్ష. ఇక ఐపీ అడ్రసు ఎలా తెలుసుకోవాలో మాకు తెలియదండి. ఎలా తెలుసుకోవాలో మీరు వివరిస్తే ప్రయత్నిస్తాను. నెనర్లు!

http://www.statcounter.com/

Register with this site and it will immediately direct you to add a counter to your site. After finishing addition of this gadget we can login to the same site and view our statistics... like this

http://photos1.blogger.com/photoInclude/blogger/5611/753/1600/statcounter.1.jpg


After login .. on left side in "Statistics" panel we can view the Recent visitor activity.. and location(Visitor map)..etc.

Hope this helps.. a small stone..

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu